సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. విండోస్‌ సాయంతో | Israeli Developer Candiru Spyware Attack Used Microsoft Windows | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌లో కలకలం, విండోస్‌ సాయంతో సైబర్‌ దాడులు

Published Sun, Jul 18 2021 3:20 PM | Last Updated on Tue, Jul 20 2021 8:07 AM

Israeli Developer Candiru Spyware Attack Used Microsoft Windows - Sakshi

ప్రపంచ దేశాలకు చెందిన రహస్యాల్ని దొంగిలించేందుకు రోజుకో స్పై వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌ తమ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ సాయంతో రెండు స్పై వైరస్‌లు (డెవిల్స్ టంగ్ అని పిలిచే ) దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. 10 దేశాలకు చెందిన 100 మంది యాక్టివిస్ట్‌లు, జర్నలిస్ట్‌లు, ప్రభుత్వంపై అసమ్మతివాదులపై సైతం ఈ స్పైవేర్‌ దాడి జరిగిందని సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టోరంటో సిటిజన్‌ ల్యాబ్‌ తెలిపింది. 

ఇజ్రాయిల్‌ కు చెందిన 'కాండిరు' అనే సంస్థ తయారు చేసిన ఈ స‍్పైవేర్‌ టార్గెట్‌ను రీచ్‌ అయ్యేందుకు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్‌, హంగేరీ, ఇండోనేషియాతో పాటు ఇతర దేశాల్లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ల సాయంతో ఇన్‌ స్టాల్‌ చేశారని, ఇన్‌ స్టాల్‌ చేసిన అనంతరం దాడులకు సిద్ధపడినట్లు మైక్రోసాఫ్ట్‌ డిజిటల్‌ సెక్యూరిటీ యూనిట​ విభాగానికి చెందిన జనరల్‌ మేనేజర్‌ క్రిస్టిన్‌ గుడ్‌విన్‌ తెలిపారు. సిటిజెన్ ల్యాబ్‌ పరిశోధకులు స్పైవేర్‌ దాడుల గురించి చెప్పడంతో మైక్రోసాఫ్ట్ అప్రమత్తమైంది.  ఈ దాడుల గురించి 'కాండిరు' పేరు ప్రస్తావించకుండా ఇజ్రాయిల్‌ కు చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ స్పై వైరస్‌తో దాడిచేసిందని ప్రస్తావించింది.  

సిటిజెన్ ల్యాబ్ ప్రకారం..ప్రపంచ దేశాల్ని టెక్నాలజీ పరంగా భయబ్రాంతులకు గురిచేసేందుకు కాండిరు ఈ స్పైవేర్లు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 16 మిలియన్ యూరోల ($ 18.9 మిలియన్లు) కు కాండిరు తన క్లయింట్లకు ఒకే సారి 10టార్గెట్లను ట్రాక్‌ చేసేందుకు ఇచ్చినట్లు, అదనంగా 1.5 మిలియన్ యూరో (8 1.8 మిలియన్) చెల్లిస్తే మరో 15 టార్గెట్లను ట్రాక్‌ చేసేందుకు వీలుపడుతున్నట్లు తేలింది. ఇక కాండిరుకు యూరప్, రష్యా, మిడిల్ ఈస్ట్, ఆసియా, లాటిన్ అమెరికాలో క్లయింట్లు ఉన్నారని ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ తెలిపింది.  ఇజ్రాయిల్‌కు చెందిన స్థానిక మీడియా సంస్థలు కాండియా ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఖతార్‌ దేశాలతో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు వెల్లడించింది. 

కాండిరు తన క్లయింట్లకు 'అంగీకరించిన భూభాగాలలో' మాత్రమే పనిచేయడానికి పరిమితం చేసుకుంది. అయితే యు.ఎస్, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇరాన్ వెలుపల కార్యకలాపాలను పరిమితం చేసే ఒప్పందాలపై సంతకం చేసినట్లు, మైక్రోసాఫ్ట్ ఇటీవలే ఇరాన్‌ స్పైవేర్‌ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement