
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ టూల్స్ డెవలపర్ బ్లూ సఫైర్... అడ్వాన్స్‌డ్ థ్రెట్ రిసర్చ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అలాగే మూడు రకాల సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకింగ్, బీమా, ఫైనాన్స్ కంపెనీలు లక్ష్యంగా వీటిని అభివృద్ధి చేసింది. సైబర్ ముప్పును గుర్తించి, విశ్లేషించి మిల్లీ సెకనులోనే ఈ సాఫ్ట్‌వేర్ స్పందిస్తుందని కంపెనీ ఫౌండర్ కిరణ్ వంగవీటి ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.
సైబర్ సెక్యూరిటీ కోసం కంపెనీలు చేస్తున్న వ్యయం తమ ఉత్పాదనతో 30 శాతం దాకా తగ్గుతుందన్నారు. బ్లూ సఫైర్‌లో ప్రస్తుతం 40 మంది పనిచేస్తున్నారు. కంపెనీకి అవసరమైన మానవ వనరుల కోసం శిక్షణ కేంద్రాన్ని సైతం ప్రారంభిస్తోంది. రెండు మూడేళ్లలో సిబ్బంది సంఖ్యను 500కు పెంచుకుంటామని సేల్స్ డైరెక్టర్ వేణు తోటకూర చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment