Research Center
-
హైదరాబాద్ కు ఆమ్జెన్ రీసెర్చ్ సెంటర్..
-
‘ఫ్యూచర్ స్టేట్’గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, నినాదం ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రానికి ‘ఫ్యూచర్ స్టేట్’ అనే నినాదాన్ని ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. న్యూయార్క్‌కు ‘అవుటాఫ్ మెనీ..వన్’, టెక్సాస్‌కు ‘లోన్ స్టార్ స్టేట్’, కాలిఫోరి్నయా కు ‘యురేకా’ అనే ట్యాగ్‌లైన్ ఉందని.. అదే రీతి లో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ఇకపై ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు.అమెరికా పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కాలిఫోరి్నయాలో ‘ఏఐ యూనికార్న్’ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యింది. భారతీయ కాన్సుల్ జనరల్ నిర్వహించిన ‘ఏఐ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం’లో వారినుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కంపెనీల ప్రతినిధులు తెలంగాణను సందర్శించి భవిష్యత్తును ఆవిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ యూనికార్న్ వ్యవస్థాపకులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలు పరిశీలించాలని కోరారు. హైదరాబాద్‌లో ‘ఆమ్జెన్’ రీసెర్చ్ సెంటర్ అమెరికాలో అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ‘ఆమ్జెన్’ తెలంగాణలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా నూతన ‘రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం’ను ప్రారంభించనుంది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఏర్పాటవుతున్న ఈ సెంటర్ ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. శాన్ఫ్రాన్సిస్కోలోని ‘ఆమ్జెన్’ ఆర్ అండ్ డీ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, సంస్థ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ ఛటోపాధ్యాయ భేటీ అయ్యారు. ఆమ్జెన్ కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడంపై రేవంత్, శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రూపాయి భవిష్యత్తుకు పెట్టుబడి: సీఎం ప్రతి రూపాయి భవిష్యత్తుకు పెట్టుబడి: సీఎం తెలంగాణలో పెట్టుబడుల ద్వారా హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ఐటీ సేవల కంపెనీలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ‘ఐటీ సర్వ్ అలయెన్స్’ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం పాల్గొన్నారు. ‘చారిత్రక నగరం హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటవుతోంది. ఇక్కడ పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయి మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది..’ అని రేవంత్ చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు సహకరించండి: శ్రీధర్‌బాబు ఏఐ, టెక్నాలజీ సెంటర్‌గా, ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన భవిష్యత్తు నగరంగా హైదరాబాద్ మారుతోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చడంలో అందరూ కలిసి రావాలన్నారు. కాగా ఈ ఏడాది చివరలో వేగాస్‌లో జరిగే ‘ఐటీ సర్వ్ అలయెన్స్’ వార్షికోత్సవానికి రావాల్సిందిగా సీఎం రేవంత్‌ను అలయెన్స్ ప్రతినిధులు ఆహా్వనించారు. అడోబ్ సిస్టమ్స్ సీఈఓతో భేటీ అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్‌తో రేవంత్, శ్రీధర్‌బాబుల బృందం భేటీ అయింది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ‘హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో పాలు పంచుకునేందుకు అంగీకరించారు. రూ.3,350 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్ హైదరాబాద్‌లో అత్యాధునిక ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్‌ను రూ.3,357 కోట్ల (400 మిలియన్ యూఎస్ డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ ప్రకటించింది. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో భేటీ అనంతరం ఆరమ్ ఈక్విటీ ఈ ప్రకటన చేసింది. గత ఏడాది 50 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడతామని ప్రకటించిన కంపెనీ.. తాజాగా 100 మెగావాట్ల ఆధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను 400 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడి హైదరాబాద్‌లో అనేక ఉద్యోగాల కల్పనకు దోహద పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. భారత్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు తమ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆరమ్ సీఈవో వెంకట్ బుస్సా ప్రకటించారు. ఈ –సేవ, ఈ– విద్య, ఈ– చెల్లింపులు వంటి సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు. -
AP: లాభాల తీపి పెంచేలా
సాక్షి, అమరావతి : పంచదారతో పోలిస్తే బెల్లంలో పోషక విలువలు ఎక్కువ. ఔషధ గుణాలకూ కొదవ లేదు. జీర్ణశక్తిని పెంచడం.. రక్తహీనతను తగ్గించడం వంటి సుగుణాలెన్నో బెల్లానికి ఉన్నాయి. అయినా పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి లేదు. ఈ నేపథ్యంలోనే బెల్లంతో విలువ ఆధారిత ఇతర ఉత్పత్తుల్ని తయారు చేయడంపై అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం చెరకు రైతులకు, బెల్లం తయారీదారులకు శిక్షణ ఇస్తోంది. తద్వారా వారి ఆదాయాలను.. మరోవైపు బెల్లం వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. బెల్లం పొడి.. మంచి రాబడి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర లవణాలు, ప్రోటీన్ల వల్ల త్వరగా బూజు పట్టడం, నీరు కారటం వంటి కారణాల వల్ల బెల్లం నాణ్యత చెడిపోతుంది. దీనిని నివారించేందుకు అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం బెల్లాన్ని పొడి రూపంలో మార్చే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ పొడి గోధుమ వర్ణంలో పంచదార రేణువుల్లా ఉంటుంది. దీనికి అమెరికా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్ ఎక్కువ. చెరకు రసాన్ని స్థిరీకరించిన మోతాదులో స్ప్రే డ్రైయింగ్ ద్వారా పొడి రూపంలో మార్చుకోవచ్చు. చాక్లెట్లు.. కేకుల తయారీ ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించిన వెన్నలో కోకో, బెల్లం పొడి కలిపిన మిశ్రమానికి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు అద్ది చాక్లెట్ అచ్చులలో వేయడం ద్వారా చాక్లెట్లు తయారవుతాయి. ఇదే తరహాలో చోడి పిండి, బెల్లం పొడి కలిపి కూడా చాక్లెట్లను తయారు చేసుకోవచ్చు. బెల్లం కేకు తయారీ కోసం కరిగించిన వెన్నలో బెల్లం పొడి, గోధుమ పిండిలో బేకింగ్ పౌడర్లను కలిపి తయారు చేసుకున్న మిశ్రమానికి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కాస్త జారుగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఆ తరువాత మైక్రో ఓవెన్లో 100–190 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాల పాటుచేసి.. 5 నిమిషాలపాటు చల్లారిస్తే రుచికరమైన కేక్ తయారవుతుంది. ఓట్స్ కుకీస్.. న్యూట్రీ బార్స్ వెన్న, బెల్లం పొడి కలిపిన మిశ్రమంలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, నానబెట్టిన ఓట్స్, యాలకుల పొడివేసి కలిపిన మిశ్రమాన్ని పాలు లేదా నీళ్లు వేసి చపాతి ముద్దలా చేసి డీప్ ఫ్రిజ్‌లో 10 నిమిషాలు పెట్టాలి. ఆ తర్వాత చపాతి కర్రతో ఒత్తుకుని కావాల్సిన ఆకారాల్లో బిస్కెట్లుగా కోసి ట్రేలో అమర్చి మైక్రో ఓవెన్లో 120 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 20 నిమిషాల పాటు బేకింగ్ చేస్తే రుచికరమైన బెల్లం ఓట్స్ కుకీస్ తయారవుతాయి. న్యూట్రీ బార్స్ తయారీ విషయానికి వస్తే.. బెల్లం లేత పాకం వచ్చిన తర్వాత తొలుత కొర్రలు, సామలు, జొన్నల మిశ్రమాన్ని ఆ తర్వాత వేరుశనగ పప్పు, బెల్లం, యాలకుల పొడిని వేసి బాగా కలిపి ట్రేలో వేసి సమానమైన ముక్కలు చేసి చల్లారనివ్వాలి. ఇలా తయారైన న్యూట్రీ బార్లను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి గాలి చొరబడని ప్రదేశంలో భద్రపర్చుకోవాలి. బెల్లం పానకం చెరకు రసాన్ని శుద్ధి చేసి మరగబెట్టిన తరువాత చిక్కటి పానకం తయారవుతుంది. దీనిని దోశ, ఇడ్లీలు, గారెలు, రొట్టెలతో చట్నీ లేదా తేనె మాదిరిగా కలిపి తింటారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీనిని చపాతీలు, పూరీల్లో కూడా వాడుతుంటారు. పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన జాగరీ ప్లాంట్ ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి బెల్లం పానకం లేదా బెల్లం, బెల్లం పొడిని తయారు చేస్తారు. బెల్లం కాఫీ ప్రీమిక్స్.. జెల్లీస్.. సోంపు బెల్లం పొడిని పాలు, యాలకుల పొడితో కలిపి ప్రీమిక్స్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని 7.5 గ్రాముల మోతాదులో 100 గ్రాముల వేడి నీళ్లలో కలిపితే రుచికరమైన కాఫీ తయారవుతుంది. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5 నిమిషాలు మరిగించిన చెరకు రసానికి తగిన మోతాదులో జెలటీన్ అడార్ జెల్‌ని కలిపి చల్లారిన తర్వాత మౌల్డ్‌లో వేసుకుని శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే బెల్లం జెల్లీ రెడీ అవుతుంది. అల్లం లేదా ఉసిరిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని డ్రయ్యర్లో ఆరబెట్టి బెల్లం కోటింగ్ మెషిన్లో 30–70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద తగినంత నీరు కలిపిన బెల్లం పొడి ద్రావణాన్ని కొద్దికొద్దిగా వేస్తే బెల్లం కోటింగ్‌తో రుచికరమైన అల్లం, ఉసిరి ముక్కలు తయారవుతాయి. అదేరీతిలో సోంపును కూడా తయారు చేసుకోవచ్చు. పాస్తా.. నూడిల్స్ బెల్లంతో నూడిల్స్ లేదా పాస్తా తయారు చేసుకోవచ్చు. పుడ్ ఎక్స్‌ట్రూడర్ అనే మెషిన్లో గంటకు 25–35 కేజీల వరకు పాస్తా పదార్థాలను వివిధ ఆకారాల్లో తయారు చేయవచ్చు. బెల్లం పొడి, గోధుమ పిండి, మొక్కజొన్న రవ్వ, మైదా, రాగి పిండి మిశ్రమాన్ని పాస్తా మెషిన్లో ట్యాంక్‌లో వేస్తారు. తగినంత నీళ్లు పోసి 5–10 నిమిషాల పాటు మిక్సింగ్ చేసి మరో 45 నిమిషాల తర్వాత నచ్చిన ఆకారంలో ఉండే ట్రేలలో వేస్తే పాస్తాలు తయారవుతాయి. వాటిని డ్రయ్యర్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 5 గంటలపాటు ఆరబెడితే చాలు. శిక్షణ ఇస్తున్నాం బెల్లంతో ఇతర ఉత్పత్తుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. విదేశాలకు ఎగుమతి చేసే విధంగా బెల్లం దిమ్మలు, పాకం, పొడి రూపంలో తయారయ్యేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక బెల్లం తయారీ ప్లాంట్ రూపొందించాం – డాక్టర్ పీవీకే జగన్నాథరావు, సీనియర్ శాస్త్రవేత్త, అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా కేంద్రం -
మేఘం నుంచి భూమి వరకు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మరింత కచ్చితత్వంతో వర్షపాతాన్ని అంచనా వేసేందుకు వీలుగా వర్షపు చినుకు (నీటి బిందువుల)ల పరిణామక్రమంపై పరిశోధనలకు హైదరాబాద్ ఐఐటీ శ్రీకారం చుట్టింది. మేఘం నుంచి భూమికి చేరే వరకు వివిధ ఎత్తుల్లో వర్షపు చినుకు ఆకారం, మారుతున్న తీరునుబట్టి వర్షపాతం అంచనాకు ఐఐటీలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం రెయిన్‌డ్రాప్ రీసెర్చ్ ఫెసిలిటీ (ఆర్ఆర్ఎఫ్)ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం మెషీన్ లెర్నింగ్ ఆధారిత డిజిటల్ ఇన్లైన్ హోలోగ్రఫీ పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఈ కేంద్రాన్ని నీతి ఆయో సభ్యుడు ప్రొఫెసర్ వీకే సారస్వత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు చినుకులు ఏర్పడటం వెనకున్న ప్రక్రియలను అర్థం చేసుకోవడంతోపాటు పర్యావరణం, వాతావరణ మార్పులపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అలాగే వర్షాలు కురవడంలో తేమ, ఉష్ణోగ్రతల పాత్ర, మబ్బుల నిర్మాణం, ఒక ప్రాంతంలో కురవబోయే వర్షం పరిమాణం వంటి అంశాలను తెలుసుకొనేందుకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీహెచ్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్ కీర్తి సాహు, మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మణ దొర చంద్రాల, పరిశోధన విభాగం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కరోనా పుట్టుకకు అగ్రరాజ్యమే కారణం...వెలుగులోకి షాకింగ్ నిజాలు
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ అంతా డ్రాగన్ దేశాన్ని ఆడిపోసుకున్నారు. కానీ అసలు కారణం అగ్రరాజ్యం అని యూఎస్‌కి చెందిన ఒక పరిశోధకుడు తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. చైనాలోని ప్రుభుత్వ నిధులతో నిర్వహిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధన కేంద్రం నుంచే కరోనా వైరస్ లీకైందని పేర్కొంది కూడా ఈ శాస్త్రవేత్తే. ఈ మేరకు యూఎస్ పరిశోధకుడు ఆండ్రూ హఫ్ తాను రాసిన 'దిట్రూత్ అబౌట్ వ్యూహాన్' అనే పుస్తకంలో ఈ విషయాల గురించి వెల్లడించాడు. చైనాలో రిసెర్చ్ సెంటర్లోని కరోనా వైరస్ పరిశోధనలకు యూఎస్ ప్రభుత్వమే నిధులందిస్తోందని చెప్పారు. ఐతే చైనా ల్యాబ్‌లో పరిశోధనలకు తగినంత భద్రత లేకపోవడంతోనే ఈ వైరస్ లీక్ అయినట్లు తెలిపారు. ఇది మానవ నిర్మిత వైరస్ అని తేల్చి చెప్పారు. ఈ పరిశోధనలు అత్యంత రిస్క్‌తో కూడినవని, వీటికి సరైన భద్రత తోపాటు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే నియంత్రించ గలిగేలా ల్యాబ్‌లో తగినంత కట్టుదిట్టమైన చర్యలు లేవన్నారు. అంతేగాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) అనేది అమెరికా ప్రభుత్వం ప్రాథమిక ఏజెన్సీ. ఈ ఎన్ఐహెచ్ అంటువ్యాధులపై అధ్యయనం చేసే లాభప్రేక్ష లేని ఎకోహెల్త్ అలియన్స్ అనే సంస్థకు గబ్బిలాలతో వివిధ కరోనా వైరస్‌లపై అధ్యయనం చేసేందుకు దశాబ్దాలకుపైగా నిధులు సమకూర్చిందని చెప్పారు. పైగా ఈ సంస్థ వ్యూహాన్ ల్యాబ్‌తో టైఅప్ అయ్యి ఈ కరోనా వైరస్‌పై మరింతగా పరిశోధనలు చేసిందని, ఫలితంగానే ఈ వైరస్ లీక్ అయ్యిందని చెప్పారు. శాస్త్రవేత్త హాఫ్ 2014 నుంచి 2016 వరకు ఈ ఎకోహెల్త్ అలియన్స్ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎకోహెల్త్ సంస్థ ఈ కరోనా వైరస్‌ను సృష్టించే పరిశోధన పద్ధతులను మరింతగా అభివృద్ధి చేయడంలో వ్యూహాన్ ల్యాబ్‌కు సాయం చేసినట్లు తెలిపారు. ఇది జన్యు పరంగా సృష్టించిన వైరస్ అని చైనాకు ముందు నుంచే తెలుసునని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రమాదకరమైన బయోటెక్నాలజీ చైనాకు అందించింది యూఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పరిశోధనలకు నిలయంగా మారింది. ఐతే వ్యూహాన్ పరిశోధన సంస్థకు వనరుల కొరత ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయిని పెంచుకునేలా అధికస్థాయిలో శాస్త్రీయ పరిశోధనలు జరగాలంటూ చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ విపరీతమైన ఒత్తిడిని తీసుకొచ్చినట్లు శాస్త్రవేత్త హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..) -
అవకాశాల గని! టాటా 'గ్లోబల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్'!
బెంగళూరు: సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే నంబర్ వన్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) గ్లోబల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ 5వ సెంటర్‌ను కెనడాలో ప్రారంభించింది. టీసీఎస్ పేస్ పోర్ట్ టొరంటో పేరుతో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఆధునిక టెక్నాలజీలను పొందేందుకు కంపెనీలకు వీలుంటుంది. టీసీఎస్ రీసెర్చ్ ల్యాబ్స్, స్టార్టప్‌లు, వీసీలు, ఎంటర్ప్రెన్యూర్స్తోపాటు టొరంటో యూనివర్శిటీవరకూ కొత్తతరహా ఆలోచనలకు ఈ కేంద్రం అవకాశాలు కల్పించనున్నట్లు టీసీఎస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అనంత్ కృష్ణన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4,000 రీసెర్చర్లు, ఇన్నోవేటర్లు, 2,300 స్టార్టప్‌లు, 30 ఇన్నోవేషన్ ల్యాబ్స్, 67 అకడమిక్ భాగస్వాములకు ప్రధాన కేంద్రంగా సేవలందించనున్నట్లు వివరించారు. -
ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా క్యాంపస్‌లో అత్యాధునిక సమీకృత పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడోబ్ ముందుకొచ్చిందని ఉస్మానియా యూని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఉస్మానియా పూర్వవిద్యార్థి శంతను నారాయణ్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఈ వివరాలను శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్ ద్వారా పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో శంతను నారాయణ్‌తో భేటీ అయినట్టు తెలిపారు. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో విద్యార్థులు, పరిశోధకులకు ఉప యోగపడేలా ప్రతిపాదనలు రూపొందించాలని అడోబ్ సీఈవో కోరినట్టు తెలిపారు. శాన్‌ఫ్రాన్సి స్కోలో పలువురు పూర్వ విద్యార్థులను కలసి ఓయూ నిధుల సమీకరణపై చర్చించినట్టు చెప్పా రు. ఎంఐటీ, హార్వర్డ్ సహా ఇతర అమెరికన్ వర్సిటీలు ఆర్థిక సమీకరణ కోసం ఉపయోగించే ఎండోమెంట్లను అధ్యయనం చేయాలని, ఉస్మాని యాకు సైతం ఓ క్రమబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని శంతను నారాయణ్ ప్రతి పాదించినట్టు రవీందర్ చెప్పారు. ఓయూ మరో పూర్వవిద్యార్థి, ప్రఖ్యాత అప్లైడ్ మెటీరియల్ శాస్త్ర వేత్త, అప్లైడ్ వెంచర్స్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఓంకారం నలమాసతో కూడా చర్చించి నట్టు తెలిపారు. 21–పాయింట్స్ అజెండా, క్లస్టర్ సిస్టమ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్లకు వీసీ అవార్డును ప్రవేశపెట్టడం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, సంక్రమిత త్రీడీ తయారీ కేంద్రం ఏర్పాటు సహా వివిధ సంస్కర ణల గురించి వివరించినట్టు చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పన్నెండు మంది పూర్వ విద్యార్థులు, వివిధ కంపెనీల సీఈవోలతో భేటీ అయినట్టు చెప్పారు. ఓయూకు సహకరించేందుకు వారు సమ్మతిం చినట్టు తెలిపారు. -
శాస్త్రవేత్త హరికాంత్‌కు పురస్కారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలోని మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త పోరిక హరికాంత్ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఉద్యాన పంటలపై చేసిన పరిశోధనలకు ఆయన ఫెలో ఆఫ్ కాన్ఫడరేషన్ ఆఫ్ హార్టీకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీహెచ్ఏఐ)–2022 పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ హెచ్.పి.సింగ్ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ములుగు జిల్లా అన్నపల్లి గ్రామానికి చెందిన హరికాంత్ ప్రస్తుతం సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈయన ఇజ్రాయిల్ మీషావ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా. ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ దేశాల్లో ఉద్యాన పంటలపై పరిశోధనలు చేశారు. 2018లో ఆయన యువ శాస్త్రవేత్త పురస్కారాన్ని ప్రొఫెసర్ స్వామినాథన్ నుంచి అందుకున్నారు. కేవలం ఆస్ట్రేలియా వంటి దేశాలకే పరిమితమైన రెడ్‌గ్లోబ్ అనే ద్రాక్ష రకాన్ని భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసినందుకు హరికాంత్‌కు గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. -
రోబోటిక్ పోటీ.. ట్రిపుల్ఐటీ మేటి
గచ్చిబౌలి (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోని రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ రెండు ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది. ఇందులోని ‘సెరెబ్రస్’ టీమ్ ద్వితీయ స్థానం పొందగా, ‘లూమోస్’ తృతీయ స్థానం గెలుపొందింది. బెంగళూరులోని ఐఐఎస్సీలోని ఏఐ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్కులో ‘ఓపెన్ క్లౌడ్ టేబుల్ ఆర్గనైజేషన్ చాలెంజ్’ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 133 టీమ్‌లు పాల్గొన్నాయి. పోటీ ఇలా... కోవిడ్–19 వైరస్ వ్యాప్తితో పారిశుధ్య కార్మికులకు ఎదురయ్యే సవాళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ పోటీలను నిర్వహించారు. వాష్‌రూమ్‌లో శుభ్రం చేసే పనుల కోసం రోబోను సృష్టించాలి. ఈ రోబో ద్వారా ఫ్లోర్‌పై ఉండే టిçష్యూపేపర్, చిన్న పేపర్ కప్పులు వంటి చెత్తను తొలగించడం, వాష్‌బేసిన్‌ను శానిటైజింగ్ లిక్విడ్‌తో శుభ్రపరచడం వంటి టాస్క్‌లు ఉన్నాయి. ఈ టాస్క్‌లను ఎంత సమయంలో పూర్తిచేస్తారు, సోప్ డిస్పెన్సర్, ఇతర వస్తువులు పడిపోకుండా శుభ్రం చేయడంలో రోబో ప్రదర్శించిన నైపుణ్యం, వినియోగించిన హార్డ్‌వేర్ తదితరాల ఆధారంగా బృందాలకు స్కోర్ ఇచ్చారు. 2021 మార్చిలో అధికారికంగా ప్రారంభమైన ఈ పోటీలో దేశవ్యాప్తంగా 29 డిజైన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిలో నుంచి 4 బృందాలు గ్రాండ్ ఫినాలే కోసం ఎంపికయ్యాయి. ఇక్కడ ఒక్కో జట్టుకు రోబో రూపకల్పన కోసం రూ.4 లక్షల బడ్జెట్ ఇచ్చారు. సూరజ్ నేతృత్వంలో సెరెబ్రస్ సెరెబ్రస్కు పీహెచ్డీ స్కాలర్, డ్రోన్ స్టార్టప్ ఆర్కా ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు సూరజ్ బోనగిరి నేతృత్వం వహించారు. ఇందులో వేదాంత్ ముందేదా, కరణ్ మిరాఖోర్, రాహుల్ కశ్యప్, శ్రీహర్ష పరుహురి, కర్నిక్ రామ్ ఉన్నారు. ‘ప్రతి బృందం అద్భుతమైన, ప్రత్యేకమైన డిజైన్లను రూపొందించింది. మా డిజైన్ రెండు అంశాల్లో ప్రత్యేకంగా నిలిచింది. రోబో పరిసరాలను గ్రహించడానికి, స్వయంప్రతిపత్తితో నావిగేట్ చేయడానికి లిడార్స్, రాడార్స్, కెమెరాలు, సెన్సర్లను ఉపయోగించాం. కెమెరా ఆధారిత సాంకేతికత ద్వారా మా రోబో అన్ని పనులను పూర్తి చేసింది’ అని సూరజ్ చెప్పారు. ఈ విజయం ఎంతో గర్వకారణమని రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ అధినేత ప్రొఫెసర్ మాధవ కృష్ణ చెప్పారు. రెండో స్థానంలో నిలిచిన ఈ టీమ్ రూ.2.5 లక్షల నగదు పురస్కారాన్ని గెలుచుకుంది. లూమోస్ టీమ్ ఇలా.. ఈ పోటీలో ఆదిత్య అగర్వాల్, బిపాషాసేన్, విశాల్‌రెడ్డి మందడి, శంకర నారాయణన్‌తో కూడిన లూమోస్ జట్టు మూడవ స్థానంలో నిలిచి రూ.77వేలు గెలుచుకుంది. టీసీఎస్ రీసెర్చ్ ఇండియా సహకారంతో ప్రొఫెసర్ కృష్ణ మార్గనిర్దేశనంతో పోటీపడింది. ‘రోబోటిక్ పరిశోధనలో రోబో గ్రాస్పింగ్, మానిప్యులేషన్ ముఖ్యం. కేవలం వస్తువులను తీయడం, పట్టుకోవడంతోపాటు విసరడం, నొక్కడం, స్లైడింగ్ చేయడం, పేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక పనులు చేయడానికి మనుషుల చేతుల మాదిరి నైపుణ్యం కలిగిన చేతులను రూపొందించడానికి అన్వేషణ కొనసాగుతోంది. ఇందులో మాదైన శైలిలో ప్రదర్శన చేసి మేము విజయం సాధించాం’ అని టీమ్ సభ్యులు చెప్పారు. -
లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ
గచ్చిబౌలి: భారత్‌లోనే కాకుండా యావత్ ఆసియా ఖండంలోనే లైఫ్ సైన్సెస్ రంగానికి కీలక హబ్‌గా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పెట్టుబడులు, సంస్థల విస్తరణకు ఈ ప్రాంతం గమ్యస్థానంగా మారిందని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నాలెడ్జి సిటీలో మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ «థర్మో ఫిషర్ ఆర్ అండ్ డీ కేంద్రం కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూనీటి వనరులపై పరిశోధన చేస్తోందని చెప్పారు. గత నెల తాను చేపట్టిన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్‌లో థర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలిసినట్లు కేటీఆర్ వివరించారు. నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్, ఇక్రిశాట్, సీఎస్ఐఆర్ వంటి ఎన్నో ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కూడా హైదరాబాద్ మంచి ప్రదేశమని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో నైపుణ్యంగల వర్క్‌ఫోర్స్ అందుబాటులో ఉండటంతోపాటు ప్రభుత్వ సానుకూల విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలికవసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, థర్మోఫిషర్ సైంటిఫిక్ ఏసియా పసిఫిక్ అండ్ జపాన్ అధ్యక్షుడు టోని అసియారిటో, థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఇండియా సౌత్ ఏసియా ఎండీ అమిత్ మిశ్రా, థర్మో ఫిషర్ ఆపరేషన్స్ లేబొరేటరీ ఎక్విప్మెంట్ ఉపాధ్యక్షుడు మైఖేల్ మెగుయర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!
Scientists Discover Ants Can Identify Cancerous Cells: ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస్త్రవేత్తల బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగో తెలుసా!. వివరాల్లోకెళ్తే..చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలవని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ఫార్మికా ఫుస్కా అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. నిజానికి అవి తమ వాసన సాయంతోనే ఆహారాన్ని సంపాదించుకునే చీమలు మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్‌ని నయం చేసే పద్ధతులను అన్వేషించే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని చ్పెపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని అన్నారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటికి మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని తెలిపారు. పైగా కుక్కుల కంటే చాలా త్వరతిగతిన క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకోంటాయని అన్నారు. (చదవండి: చెర్నోబిల్‌లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్) -
రూ.100 కోట్లతో ఎన్సీడీసీ ఏర్పాటు
తాడేపల్లి రూరల్: దేశం మొత్తం మీద ఏదైనా ఆరోగ్యపరమైన విపత్తులు సంభవించినపుడు వాటి గురించి రీసెర్చ్ చేయడం కోసం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ సెంటర్ (ఎన్సీడీసీ)ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కొలనుకొండ నుంచి ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లే దారిలో రెండెకరాల స్థలాన్ని ఇందుకోసం గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కేటాయించారు. సర్వే నం. 372/10 రెండెకరాల భూమిని ఎన్సీడీసీ సంస్థకు అప్పగించాలని స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. 5వ తేదీన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ సంస్థకు ఈ స్థలాన్ని అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, రూ.100 కోట్ల వ్యయంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతోమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రెండెకరాల స్థలం కేటాయించాం.. ఎన్సీడీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు స్థలం కావాలని ప్రతిపాదనలు పంపింది. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ çఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు వెళ్లే రహదారిలోని జాతీయ రహదారి వెంబడి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. త్వరలోనే ఎన్సీడీసీకి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేస్తాం. – తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి -
NLR 3238: జింక్ పుష్కలం.. ఇతర సప్లిమెంట్లతో పనిలేదు!
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి కలవరపెడుతున్న తరుణంలో ఎవరి నోట విన్నా సి–విటమిన్, జింక్‌తో కూడిన మల్టీవిటమిన్లు వంటి పేర్లు వినపడుతున్నాయి. కరోనా నివారణ కోర్సులో జింక్ బిళ్లల వాడకం భాగమైంది. రోగనిరోధక శక్తిని పెంచే కారకాల్లో జింక్ ఒకటి కావడమే ఇందుకు కారణం. అయితే.. బిళ్లలు, టానిక్‌ల రూపంలో కంటే మనం తినే ఆహారంలోనే జింక్‌ను భాగంగా చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. జింక్ కోసం కొన్ని రకాల బియ్యాల్ని వారు సిఫార్సు చేస్తున్నారు. అటువంటి వాటిలో ఒకటి.. ఎన్‌ఎల్‌ఆర్ 3238. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందించిన ఈ వంగడంలో జింక్ ఎక్కువగా ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్‌ఎల్‌ఆర్ 3238లో సుమారు 22.5 శాతం జింక్ ఉన్నట్టు శాస్త్రవేత్తల అంచనా. మిగతా వరి రకాల్లో జింక్ గరిష్టంగా 16 శాతం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిపై జింక్ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని, అందుకు ఎన్‌ఎల్‌ఆర్ 3238 పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలోనే జింక్ ఉంటే ఇక సప్లిమెంట్లతో పనే ఉండదంటున్నారు. ఈ వంగడం సమర్థంగా పనిచేయడంతోపాటు బ్యాక్టీరియా, వైరస్ వంటివి సోకకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచడంలో ఉపకరిస్తుందని వివరిస్తున్నారు. ఇదీ ఎన్‌ఎల్‌ఆర్ చరిత్ర.. ఎంటీయూ 1010, బీపీటీ 5204 సంకరంతో ఈ ఎన్‌ఎల్‌ఆర్ 3238ను సృష్టించినట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ టి.గోపీకృష్ణ వివరించారు. ఈ వంగడం అభివృద్ధి వెనుక అనేకమంది వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఉంది. స్వల్పకాలంలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాల సృష్టిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. అనేక ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనల అనంతరం ఐదేళ్ల తర్వాత ఈ వంగడం బయటకు వచ్చింది. ఎకరానికి 35 – 40 బస్తాల దిగుబడి తెగుళ్లను తట్టుకోవడం, అధిక దిగుబడి ఎన్‌ఎల్‌ఆర్ 3238 ప్రత్యేకత. ఎకరానికి 35 – 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. దిగుబడిలో బీపీటీ రకాలతో ఎన్‌ఎల్‌ఆర్ 3238 పోటీ పడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల సమయంలోనే గుర్తించారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాచుర్యం కలిగి దేశవ్యాప్తంగా పేరుగాంచిన బీపీటీ 5204తో సమానంగా ఈ వంగడం దిగుబడి ఇస్తుంది. పైగా దీన్ని అన్ని కాలాల్లో పండించవచ్చు. బీపీటీ 5204, ఎంటీయూ 1010లతో సమానంగా దిగుబడి ఉంది. ఒక్క నెల్లూరులోనే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ వంగడాన్ని పరీక్షించి చూశారు. విస్తృత పరిశోధనలు చేసి పర్యావరణ అనుకూల వంగడంగా పరిగణించాకే మార్కెట్‌కు విడుదల చేశారు. ఎన్‌ఎల్‌ఆర్ 3238లో ఒక్క జింకే కాకుండా అన్నం కూడా బాగా ఆటి వస్తుంది.. వదుగ్గా ఉండి తినేందుకు బాగుంటుంది. విత్తనాల కోసం నెల్లూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వారిని సంప్రదించవచ్చు. చదవండి: World Organ Donation Day: మొట్టమొదట అవయవాన్ని దానం చేసింది ఎవరో తెలుసా? -
టెస్లా : ఇండియాలో భారీ పెట్టుబడులు
సాక్షి, బెంగళూరు: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా దేశంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. కర్నాటకలో టెస్లా తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తరువాత, టెస్లా రెండవ రీసెర్చ్ సెంటర్ ను బెంగళూరులో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఈ నెల ప్రారంభంలో అధికారులతో ప్రాథమిక చర్చలు చేపట్టిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ నెల చివర్లో మరో సమావేశం జరగనుందని దీనిలో ప్రభుత్వ అధికారులు టెస్లాకు ఒక ప్రతిపాదనను సమర్పించే అవకాశం ఉంది. లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలోను భారతదేశంలో లభ్యం కానున్నాయని టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ జూలైలో సంకేతాలందించారు. చైనా తరువాత ఆసియాలో ఒక గిగా ఫ్యాక్టరీ, కారు, బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అయితే దీనికి ముందు గిగా బెర్లిన్, అమెరికాలో రెండవ గిగా ఫ్యాక్టరీని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనవరిలో చైనాలో గిగా ఫ్యాక్టరీని ప్రారంభించింది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో చైనాలో 50 వేల వాహనాలను విక్రయించింది. దీంతో బెంగళూరులో కొత్త సెంటరు ఏర్పాటుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా కాలుష్య ఉద్గారాలు, కొత్త నిబంధనల ప్రకారం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరగనుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్‌వాహనాల మార్కెట్‌ను విస్తరించాలని ఆటో పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి ఈ మార్కెట్ రూ .50 వేల కోట్లను తాకే అవకాశం ఉందని అంచనా. మహీంద్రా ఎలక్ట్రిక్, డైమ్లెర్, బాష్ సహా గ్లోబల్, లోకల్ ఈవీ కంపెనీలకు బెంగళూరు హాట్ స్పాట్ గా ఉంది. ఓలా ఎలక్ట్రిక్, సన్ మొబిలిటీ ఈథర్కూడా కర్ణాటకకు చెందినవే కావడం గమనార్హం. అలాగే దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అమలును ప్రకటించిన మొదటి రాష్ట్రం కూడా ఇదే కావడం విశేషం. -
ఉస్మానియాలో కృత్రిమ మేధ!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. అనేక కొత్త ఆవిష్కరణలకు కారణమవుతున్న ఈ కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించిన పరిశోధనలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మారుతోంది. ఓయూ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో మరో 15 రోజుల్లో ఈ పరిశోధనలు అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్ పోలీసు, రవాణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారంగాలకు ఏఐ మరింతగా చొచ్చుకుపోనుంది. సమాజానికి ఎంతో అవసరమైన ఈ పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్)ఉస్మానియా యూనివర్సిటీకి మంజూరైంది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు కేంద్రం రూ.107 కోట్లు కేటాయించింది. ఇటీవల ఓయూకు మంజూరైన రూ.17 కోట్ల నుంచి రూ.కోటి వెచ్చించి ఓయూ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరో 15 రోజుల్లో ఈ ల్యాబ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో విశ్వవిద్యాలయం వేదికగా కృత్రిమ మేధస్సుపై అనేక పరిశోధనలు జరగనున్నాయి. మానవ మేధస్సును అర్థం చేసుకుంటుంది మానవ మేధస్సును అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కంప్యూటర్ వ్యవస్థ పని చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి చాలా అంశాలు ఉంటాయి. ఏఐ సాయంతో అల్జీమర్స్ లాంటి జబ్బుల్ని కూడా నయం చేయొచ్చని పరిశోధనల్లో తేలింది. రోబోటిక్స్‌లోఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకం. ప్రొఫెసర్ రామచంద్రం, మాజీ వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏఐతో కొన్ని ఉపయోగాలు ►గతంలో పదవీ విరమణ చేసిన వారు నెలవారీ పెన్షన్ తీసుకోవాలంటే ఆయా విభాగాల అధికారులు ఇచ్చిన గుర్తింపు సర్టిఫికెట్ సమర్పించాల్సి వచ్చేది. ఇది పదవీ విరమణ చేసిన వారికి ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ సంయుక్తంగా పెన్షనర్ల కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ టూల్‌ను రూపొందించింది. ఫొటో తీసి సంబంధిత యాప్‌కు పంపితే చాలు రెండు మూడు నిమిషాల్లోనే పనైపోతుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే సాధ్యమైంది. ►పంటకు పట్టిన తెగుళ్లు, పురుగులను నివారించేందుకు రైతు తన చేలో నిలబడి.. స్మార్ట్‌ఫోన్‌లో పంటకు పట్టిన చీడను ఫొటో తీసి ఓ నంబర్‌కు పంపితే చాలు నివారణ చర్యలు సూచిస్తుంది. ►ఒక వాహనం మరో వాహనానికి చేరువలోకి వెళ్లినప్పుడు ఈ ఏఐ ద్వారా వాహనదారులను అలర్ట్ చేస్తుంది. ►ఏ జబ్బుకు, ఏ వయసు రోగికి, శరీర బరువు ఆధారంగా ఎంత మోతాదు మందు ఇవ్వాలో ఆ మేరకు నిర్దేశించి మందులు సూచిస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కచ్చితత్వాన్ని చూపిస్తుంది. ఏ సీజన్లో ఏ వ్యాధులు వస్తాయి.. ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వ యంత్రాంగాలకు ముందే చేరవేస్తుంది. ►1956లో అమెరికా పరిశోధకుడు జాన్ మెక్‌కార్తీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పదాన్ని సృష్టించారు. యంత్రాలు మనుషుల్లా పని చెయ్యడం, మాట్లాడగ లగడం, ఆలోచించగలగడమే దీని లక్ష్యం. ఇప్పుడిప్పుడే ఈ కల సాకారం అవుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఏఐపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. స్మార్ట్ మొబైళ్ల రాకతో, సామాన్యులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి దగ్గరయ్యారు. -
బ్లూసఫైర్ థ్రెట్ రిసర్చ్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ టూల్స్ డెవలపర్ బ్లూ సఫైర్... అడ్వాన్స్డ్ థ్రెట్ రిసర్చ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అలాగే మూడు రకాల సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకింగ్, బీమా, ఫైనాన్స్ కంపెనీలు లక్ష్యంగా వీటిని అభివృద్ధి చేసింది. సైబర్ ముప్పును గుర్తించి, విశ్లేషించి మిల్లీ సెకనులోనే ఈ సాఫ్ట్వేర్ స్పందిస్తుందని కంపెనీ ఫౌండర్ కిరణ్ వంగవీటి ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. సైబర్ సెక్యూరిటీ కోసం కంపెనీలు చేస్తున్న వ్యయం తమ ఉత్పాదనతో 30 శాతం దాకా తగ్గుతుందన్నారు. బ్లూ సఫైర్‌లో ప్రస్తుతం 40 మంది పనిచేస్తున్నారు. కంపెనీకి అవసరమైన మానవ వనరుల కోసం శిక్షణ కేంద్రాన్ని సైతం ప్రారంభిస్తోంది. రెండు మూడేళ్లలో సిబ్బంది సంఖ్యను 500కు పెంచుకుంటామని సేల్స్ డైరెక్టర్ వేణు తోటకూర చెప్పారు. -
తెలంగాణకే తలమానికం
- అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌కు నేడు మండెపల్లి వద్ద శంకుస్థాపన - హాజరవుతున్న మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.25 కోట్ల వ్యయంతో నెలకొల్పుతున్న డ్రైవింగ్ స్కూల్‌కు రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్, పరిశోధన కేంద్రానికి అనుమతులు మంజూరు చేయగా... మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చొరవతో రాష్ట్ర సర్కారు పనులను వేగవంతం చేస్తోంది. -సిరిసిల్ల సిరిసిల్ల : సిరిసిల్ల మండలం మండెపల్లి శివారులో 25 ఎకరాల స్థలాన్ని అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ కోసం రెవెన్యూ అధికారులు గతేడాది కేటాయించారు. స్థలానికి సంబంధించిన ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్‌ను హద్దులతో సహా రెవెన్యూ అధికారులు ఇటీవలే అందించారు. ఇందులో డ్రైవింగ్ ట్రాక్, టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్ శిక్షణ పొందేవారికి హాస్టల్ వసతి, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలకు రూ.25 కోట్లను ప్రభుత్వం కేటారుుంచింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా పది నెలల కిందట స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. దక్షిణ భారతదేశంలో రెండోది.. దక్షిణ భారతదేశంలో మొదటి అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ తమిళనాడు రాష్ట్రం లో ఉండగా, రెండోది సిరిసిల్లలో నెలకొల్పుతుండటం విశేషం. ప్రముఖ వాహనాల తయూరీ సంస్థ అశోక్ లేలాండ్ సహకారంతో డ్రైవింగ్ స్కూల్, పరిశోధన కేంద్రా న్ని ఏర్పాటు చేస్తుండటం తెలంగాణకే తలమానికంగా నిలువనుంది. డ్రైవింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలపై పరిశోధనలు చేసే అవకాశం ఉంది. ప్రపంచంలోనే బెస్ట్ డ్రైవింగ్ విధానాలను అధ్యయనం చేయడంతోపాటు ఇక్కడ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వ డం జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే సిరిసిల్ల ఎంవీఐ శ్రీనివాస్‌తోపాటు రాష్ట్రం లోని పలువురు ఎంవీఐలు ఏడాది కిందట మలేషియాలో జరిగిన అంతర్జాతీయ డ్రైవింగ్ సదస్సుకు వెళ్లి వచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు.. సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుతో జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇక్కడ డ్రైవింగ్‌లో మెరుగైన శిక్షణ అందిస్తారు. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు హెవీ వెహికిల్స్ నడిపేవారికి నైపుణ్యమైన శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థల్లో పని చేసే డ్రైవర్లకు సిరిసిల్లలోనే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులకు సైతం అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుంది. ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు సైతం మరింత శిక్షణ కోసం పనిష్మెంట్లో భాగంగా డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నేడు ముగ్గురు మంత్రుల పర్యటన సిరిసిల్ల రూరల్ : రాష్ట్ర పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, రవాణాశాఖ మంత్రి మ హేందర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవా రం సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిరిసిల్ల మండలం మండెపల్లి వద్ద రూ.25 కోట్ల తో నెలకొల్పుతున్న అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, పరిశోధన కేంద్రం, ఐటీఐ కళాశాల భవనం, రగుడు వద్ద రూ.30 కోట్లతో సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డు నిర్మాణాలకు వారు భూమిపూజ చేయనున్నారు. అనంతరం మండెపల్లి శివారులోని మోడల్ స్కూల్ సమీపంలో పదివేల మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, ఎంపీపీ దడిగెల కమలభాయి, జెడ్పీటీసీ పూర్మాణి మంజుల, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ సుమలత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు వొజ్జల అగ్గిరాములు, పార్టీ జిల్లా నాయకులు దడిగెల శ్రావణ్రావ్, పూర్మాణి లింగారెడ్డి, మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ పర్యవేక్షించారు. బహిరంగసభకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే సిరిసిల్ల మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త తరలించేందుకు 250 సైకిళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముగ్గురు మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
హైదరాబాద్ లో లావా మొబైల్స్ పరిశోధన కేంద్రం..
♦ తిరుపతి ప్లాంటు 2018కల్లా రెడీ ♦ లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయంలో ఉన్న లావా ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్అండ్డీ) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. చర్చలు పురోగతిలో ఉన్నాయని, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రె గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రతిపాదిత కేంద్రంలో 200 మందిని నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే కంపెనీకి బెంగళూరులో 400 మందితో కూడిన ఆర్అండ్డీ సెంటర్ ఉంది. వచ్చే మూడేళ్లలో పరిశోధన, అభివృద్ధిపై రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. ఇక 4జీ విషయానికి వస్తే ప్రస్తుతం నాలుగు మోడళ్లు ప్రవేశపెట్టామన్నారు. వచ్చే త్రైమాసికంలో మరో మూడు మోడళ్లు రానున్నాయని వివరించారు. విక్రయాల పరంగా 70 శాతం వాటా ఫీచర్ ఫోన్లదేనని ఆయన చెప్పారు. నెలకు 50 లక్షల యూనిట్లు.. లావా ఇంటర్నేషనల్‌కు నోయిడాలో మొబైల్స్ తయారీ ప్లాంటు ఉంది. దీని సామర్థ్యం నెలకు 25 లక్షల యూనిట్లు. నోయిడాలో మరో ప్లాంటును కంపెనీ నెలకొల్పుతోంది. అలాగే తిరుపతి వద్ద 20 ఎకరాల్లో రూ.500 కోట్లతో ప్లాంటు రాబోతోంది. ఈ రెండు ప్లాంట్లలో 2018లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సందీప్ తెలిపారు. మూడేళ్లలో కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం నెలకు 50 లక్షల యూనిట్లకు చేరుతుందని చెప్పారు. దేశీయంగా లావా నెలకు 20 లక్షల మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. 10.5 శాతం మార్కెట్ వాటాతో భారత్‌లో నాల్గవ స్థానంలో ఉంది. ఇండియన్ బ్రాండ్స్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. -
విశాఖలో అణు పరిశోధన కేంద్రం
రాజమండ్రి : ముంబైలోని బాబా అణుపరిశోధన కేంద్రం తరహాలో విశాఖపట్నంలో మరో రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు బార్క్ వైజాగ్ రీజినల్ డెరైక్టర్, శాస్త్రవేత్త పి. లాహిరి తెలిపారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న కెమిస్త్రీ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఫేజ్-1గా న్యూక్లియర్ లేబొరేటరీ నిర్మాణం జరుగుతుందన్నారు. దీనికి మూడేళ్లు పడుతుందన్నారు. ఫేజ్-2లో ఐసోటోప్స్‌పై ప్రయోగాలు, వాటి నిర్వహణ ఉంటుందన్నారు. బార్క్‌కు అనుసంధానంగా విశాఖ కేంద్రంగా ఐసోటోప్స్, క్యాన్సర్ చికిత్సపై ఆస్పత్రి పనిచేస్తుందన్నారు. -
పరిశోధన సరే... ప్రోత్సాహం ఏదీ..?
గిరిజన రైతుల దరి చేరని పరిశోధన కేంద్రం ఫలితాలు చింతపల్లిలో కూరగాయల శిక్షణ కేంద్రం లేక నష్టాలు విదేశీ కూరగాయలు పండేందుకు మన్యం అనుకూలం సదుపాయాలు లేక అక్కరకురాని పరిజ్ఞానం కొయ్యూరు, న్యూస్‌లైన్ : చింతపల్లి ఉద్యానవన పరిశోధన కేంద్రంలో విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఎనిమిది రకాల కూరగాయలను ప్రయోగాత్మకంగా వేసి చూశారు. పంట బాగా వచ్చింది. రాష్ట్రీయ కృషీ విజ్ఞాన్ యోజన(ఆర్వీవై)లో వాటిని ప్రయోగాత్మకంగా వేశారు. రాత్రి సమయంలో పది డిగ్రీలకు తక్కువగా ఉండే వాతావరణంలో ఆ పంటలు పండుతాయని శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారణ అయింది. అయితే ఈ ఫలితాలు గిరిజనులకు చేరాలంటే...గిరిజనులు ఈ కూరగాయలను సాగు చేయాలంటే.... శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలకు అనుగుణంగా కూరగాయల శిక్షణ కేంద్రాన్ని (వీటీసీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ పరిశోధన కేంద్రంలో పండించిన కూరగాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వాటిపై రైతులకు అవగాహన కలగాలంటే వీటీసీ ఉండాలి. కానీ ఆ దిశలో ఇంతవరకూ ప్రయత్నాలు జరగలేదు. ఈ కేంద్రం ద్వారా గిరిజన రైతులను అనేక విధాల ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవకాశాలున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ప్రయోగాల ప్రయోజనాలు గిరిజనులకు అక్కరకు రావడం లేదు. కనీసం పండించిన పంటను కొన్నాళ్లు దాచుకునేందుకు అవసరమైన శీతలగిడ్డంగులు(కోల్డ్ స్టోరేజీ) సౌకర్యం కూడా లేకపోవడంతో గిరిజన రైతులకు లాభాలు రావాల్సిన చోట నష్టాలు వస్తున్నాయి. చింతపల్లిలో మార్కెట్ కమిటీ ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. దాని ఆధీనంలో వీటీసీ ఉంటే వందలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చేందుకు వీలు కలుగుతుందని, కనీసం ఐటీడీఏ చింతపల్లిలో వీటీసిని ఏర్పాటు చేసినా బాగుంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఏమేం పండించవచ్చు? చింతపల్లి పరిశోధన కేంద్రంలో బ్రకోలి, రెడ్ క్యాబేజీ, చైనీస్ క్యాబేజీ, లటస్, ప్రచోరి రకం కూరగాయలు పండించారు. వీటిలో బ్రకోలిలో క్యాన్సర్‌ను నివారించే యాంటి ఆక్సిటెండ్లున్నాయి. దీని ధర ఇతర ప్రాంతాల్లో కిలో రూ.150 వరకు పలుకుతుంది. ప్రధానంగా మెట్రో నగరాల్లో వాటికి మంచి డిమాండ్ ఉంది. అయితే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇంత విలువైన కూరగాయలు పండించినా గిరిజనులు లాభపడేది అనుమానమే. ప్రోత్సహిస్తే మన్యం మరో కొడెకైనాలే! విదేశాల్లో గిరాకీ ఉన్న కూరగాయలను పండించే ప్రాంతం దక్షిణ భారతదేశంలో ఒక్క కొడెకైనాల్ మాత్రమే. అక్కడ శీతల గిడ్డంగులు ఉండడంతో రైతులు తాము ఒక్కసారి పండించిన కూరగాయలను దఫ దఫాలుగా అమ్ముకుంటున్నారు. మన్యంలో కూరగాయల సాగుకు వాతావరణం అనుకూలించినా... శీతల గిడ్డంగులు లేక నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఇతర మార్కెట్లతో అనుసంధానమై తమ పంటలను మంచి ధరలకు అమ్ముకునే అవకాశం లేకుండా పోతోంది. దీంతో దళారుల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ‘న్యూస్‌లైన్’ చింతపల్లి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి జగన్‌ను సంప్రదించగా గిరిజన రైతులు కోల్డ్ స్టోరేజీ కావాలని కోరితే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. స్టోరేజీ ఉంటే ధరలు పెరిగినప్పుడు వాటిని అమ్ముకునే అవకాశం రైతులకు ఉంటుందన్నారు. -
దీని దుంప తెగ...ఎన్ని పోషకాలో!
డుంబ్రిగుడ, న్యూస్‌లైన్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చిలకడ (ఎర్ర)దుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దుంపల్లో బీటా కెరిటన్ అనే విటమిన్ అధికంగా ఉండడం వల్ల దృష్టి లోపం నుంచి గట్టెక్కవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ చెందిన కొంత మంది చిలకడ దుంపల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు స్థానిక వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏడాది క్రితం సొవ్వా, దేముడువలస, లోగేలి గ్రామాల్లో పర్యటించి ప్రయోగాత్మకంగా ఈ దుంపల సాగును ప్రోత్సహించారు. ఏజెన్సీలోని చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందక, వ్యాధి నిరోధక శక్తి తగ్గి మత్యువాత పడుతున్నారు. చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కూడా సరైన పౌష్టికాహారం అందడం లేదు. ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నట్టు పలు స్వచ్ఛంద సంస్థలు సర్వేల ద్వారా గుర్తించాయి. పౌష్టికాహార లోపాన్ని నివారించడంలో చిలకడ దుంపలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నందున శాస్త్రవేత్తలు వీటి సాగును ప్రోత్సహిస్తున్నారు. చిన్నారులను ఆకర్షించేలా క్యారట్ రంగులో ఆరెంజ్, స్వీట్ ప్లేవర్లలో ఈ దుంపలు లభిస్తున్నాయి. దీని సాగు లాభదాయకంగా ఉండడంతో గిరిజనులు సాగువిస్తీర్ణం గణనీయంగా పెంచుతున్నారు. గత ఏడాది 30 ఎకరాల్లో పండించిన పంట ఈ ఏడాదిలో 70 ఎకరాలకు విస్తరించారు. 50 కిలోల చిలకడ దుంపల బస్తా రూ.1100 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు దుంపలను కొనుగులో చేసి విశాఖ, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులకు ఆర్థిక ఆసరా... జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న చిలకడ దుంపలు గిరిజన రైతులకు ఆర్థిక ఆసరా అందిస్తోంది. ఈ దుంపల సాగుకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉండడంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాల వ్యవధిలో పంట చేతికి వ స్తుండడంతో ఈ దుంపల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. పంట పక్వానికి రావడంతో తవ్వి వెలికి తీసి, శుభ్రం చేసి మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. గిటుబాటు ధర లభిస్తుండడంతో హర్షం వ్యక్తంచేస్తున్నారు.