బెంగళూరు: సాఫ్ట్‌వేర్ సేవలకు దేశంలోనే నంబర్ వన్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) గ్లోబల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ 5వ సెంటర్‌ను కెనడాలో ప్రారంభించింది. టీసీఎస్ పేస్ పోర్ట్ టొరంటో పేరుతో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఆధునిక టెక్నాలజీలను పొందేందుకు కంపెనీలకు వీలుంటుంది.
టీసీఎస్ రీసెర్చ్ ల్యాబ్స్, స్టార్టప్‌లు, వీసీలు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌తోపాటు టొరంటో యూనివర్శిటీవరకూ కొత్తతరహా ఆలోచనలకు ఈ కేంద్రం అవకాశాలు కల్పించనున్నట్లు టీసీఎస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అనంత్ కృష్ణన్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 4,000 రీసెర్చర్లు, ఇన్నోవేటర్లు, 2,300 స్టార్టప్‌లు, 30 ఇన్నోవేషన్ ల్యాబ్స్, 67 అకడమిక్ భాగస్వాములకు ప్రధాన కేంద్రంగా సేవలందించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment