రాజమండ్రి : ముంబైలోని బాబా అణుపరిశోధన కేంద్రం తరహాలో విశాఖపట్నంలో మరో రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు బార్క్ వైజాగ్ రీజినల్ డెరైక్టర్, శాస్త్రవేత్త పి. లాహిరి తెలిపారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న కెమిస్త్రీ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
ఫేజ్-1గా న్యూక్లియర్ లేబొరేటరీ నిర్మాణం జరుగుతుందన్నారు. దీనికి మూడేళ్లు పడుతుందన్నారు. ఫేజ్-2లో ఐసోటోప్స్‌పై ప్రయోగాలు, వాటి నిర్వహణ ఉంటుందన్నారు. బార్క్‌కు అనుసంధానంగా విశాఖ కేంద్రంగా ఐసోటోప్స్, క్యాన్సర్ చికిత్సపై ఆస్పత్రి పనిచేస్తుందన్నారు.
విశాఖలో అణు పరిశోధన కేంద్రం
Published Sun, Nov 30 2014 6:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement