అమెరికా పోలీసుల కోతుల వేట | More than 40 monkeys escape research lab in South Carolina | Sakshi
Sakshi News home page

అమెరికా పోలీసుల కోతుల వేట

Published Sat, Nov 9 2024 6:19 AM | Last Updated on Sat, Nov 9 2024 6:19 AM

More than 40 monkeys escape research lab in South Carolina

పోలీసులేంటి? కోతులను వెదకడమేంటని? ఆశ్చర్యపోకండి. అవి మామూలు కోతులు కాదు. పరిశోధన కేంద్రం నుంచి తప్పించుకున్నవి. సౌత్‌ కరోలినాలోని ఎమసీ పట్టణంలో ఓ రీసెర్చ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఆల్ఫా జెనెసిస్‌ ఉంది. ఇక్కడ వైద్య పరీక్షలు, పరిశోధనల కోసం కోతులను పెంచుతుంటారు. ప్రస్తుతం సంస్థలో 50 కోతులున్నాయి. అయితే బుధవారం దేశమంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. కోతులు మాత్రం తప్పించుకున్నాయి.

 బయటి ఎన్‌క్లోజర్‌ తలుపులు తెరిచి ఉండటంతో 43 కోతులు బయటికి పారిపోయాయని అధికారులు వెల్లడించారు. తప్పించుకున్నాయని, ప్రజలంతా తమ ఇళ్ల తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయాలని, ఎక్కడైనా కోతులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. తప్పించుకున్నవి 3.2 కిలోల బరువున్న ఆడ కోతులని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయితే వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. కోతులు ఫెసిలిటీలో ఆపిల్స్‌ వంటి ఆహారాన్ని తిని పెరిగాయని, అడవిలో ఆకులు, అలములు తప్ప ఏమీ దొరకవు కాబట్టి అవి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆల్ఫా జెనెసిస్‌ సీఈఓ గ్రెగ్‌ వెస్టర్‌గార్డ్‌ చెబుతున్నారు. ఈ కేంద్రం నుంచి కోతులు తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో 19 కోతులు తప్పించుకుని ఆరు గంటల తర్వాత తిరిగొచ్చాయి. రెండేళ్ల కిందట 26 కోతులు తప్పించుకున్నాయి. 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement