నేడు(ఆగస్టు 30) ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. రోజులా కాకుండా ఇవాళ చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇవ్వబోతున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం జరగనుంది. నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించనున్నాడు. కాగా బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్‌లో కాకుండా నారింజ రంగులో దర్శనమివ్వనున్నాడు.
అయితే ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్‌గా పిలుస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. సాధారణంగా ఏడాదిలో రెండు లేదామూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతూవుంటాయి.
స్పేస్.కామ్ ప్రకారం.. ఈ సూపర్ బ్లూ మూన్ బుధవారం రాత్రి 7.10 గంటలకు కనిపించనుంది. నాసా తెలిపిన దాని మేరకు రెండు గంటల తర్వాత ఇది అత్యంత ప్రకాశవంతంగా పెద్దదిగా కనిపించనుంది. గురువారం ఉదయం 6.46 గంటలకు అస్తమించనుంది. అయితే బయట వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో ఈ మూన్ అందంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలోని ప్రజలు తెల్లవారుజామున దీనిని చూడటం మంచిదని అంటున్నారు.
చదవండి: ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం
బ్లూ మూన్ అంటే..?
బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్‌లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్‌లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడబోయే బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు.
అరుదుగా బ్లూ మూన్
బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది.. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్‌లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment