నీలి వెన్నెల జాబిలీ నిన్ను చూసి మురిసి... | Billie Eilish Blue makeup trend takes over Instagram | Sakshi
Sakshi News home page

నీలి వెన్నెల జాబిలీ నిన్ను చూసి మురిసి...

Published Sun, Jun 30 2024 3:58 AM | Last Updated on Sun, Jun 30 2024 12:13 PM

Billie Eilish Blue makeup trend takes over Instagram

వైరల్‌ 

‘బ్లూ మేకప్‌’ అనేది ఇప్పుడు వైరల్‌ బ్యూటీ ట్రెండ్‌. అమెరికన్‌ సింగర్‌–సాంగ్‌ రైటర్‌ బిల్లీ ఎలీష్‌  పాట ‘బ్లూ’ నుంచి ఈ మేకప్‌ ట్రెండ్‌ మొదలైంది. 2016లో ‘ఓషన్‌ ఐస్‌’ ఆల్బమ్‌  విడుదల అయిన తరువాత ‘బ్లూ’ పాట రాసింది ఎలీష్‌. లేటెస్ట్‌గా ఆ పాటను మరింత కొత్తదనంతో రీక్రియేట్‌ చేస్తే సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంది. ఆ పాటకు వచ్చిన పాపులారిటీ ‘బ్లూ బ్యూటీ ట్రెండ్‌’కు నాంది  పలికింది.

ఈ ట్రెండ్‌లో భాగంగా ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, సెలబ్రిటీలు రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా కంటెంట్‌ క్రియేటర్, డాన్సర్‌ ఆనమ్‌ దర్బార్‌ స్విమ్మింగ్‌పూల్‌ వీడియో చేసింది. బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్‌ మృణాల్‌ పాంచాల్‌ ‘వాటర్‌’ ఎలిమెంట్‌తో వీడియో చేసింది. ఈ వీడియోలో మృణాల్‌ నీలిరంగు సీతాకోకచిలకలా కనిపిస్తుంది. మొత్తానికైతే ‘బ్లూ మేకప్‌ ట్రెండ్‌’ మన దేశంలోనూ సందడి చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement