mrunal
-
ఎల్లో డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ ఫోజులు చూశారా..? (ఫోటోలు)
-
నీలి వెన్నెల జాబిలీ నిన్ను చూసి మురిసి...
‘బ్లూ మేకప్’ అనేది ఇప్పుడు వైరల్ బ్యూటీ ట్రెండ్. అమెరికన్ సింగర్–సాంగ్ రైటర్ బిల్లీ ఎలీష్ పాట ‘బ్లూ’ నుంచి ఈ మేకప్ ట్రెండ్ మొదలైంది. 2016లో ‘ఓషన్ ఐస్’ ఆల్బమ్ విడుదల అయిన తరువాత ‘బ్లూ’ పాట రాసింది ఎలీష్. లేటెస్ట్గా ఆ పాటను మరింత కొత్తదనంతో రీక్రియేట్ చేస్తే సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంది. ఆ పాటకు వచ్చిన పాపులారిటీ ‘బ్లూ బ్యూటీ ట్రెండ్’కు నాంది పలికింది.ఈ ట్రెండ్‌లో భాగంగా ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా కంటెంట్ క్రియేటర్, డాన్సర్ ఆనమ్ దర్బార్ స్విమ్మింగ్‌పూల్ వీడియో చేసింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్ మృణాల్ పాంచాల్ ‘వాటర్’ ఎలిమెంట్‌తో వీడియో చేసింది. ఈ వీడియోలో మృణాల్ నీలిరంగు సీతాకోకచిలకలా కనిపిస్తుంది. మొత్తానికైతే ‘బ్లూ మేకప్ ట్రెండ్’ మన దేశంలోనూ సందడి చేస్తోంది. -
మా పేరెంట్స్‌కి ఇష్టం లేదు.. అయినా ఇండస్ట్రీకి వచ్చా: మృణాల్
మృణాల్ ఠాకూర్ కెరీర్ సీతారామం సినిమాకి ముందు, ఆ తర్వాత అన్నట్లు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం క్లాసిక్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లుగా చేసిన దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్లకు ఈ సినిమా మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్‌కు అన్ని భాషల్లోనూ సూపర్క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ డ్యూటీ తాజాగా ఓ వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె ఏమందంటే.. 'నిజానికి నేను సినిమాల్లోకి రావడం మా పేరెంట్స్‌కి అసలు ఇష్టం లేదు.మాది మరాఠీ ఫ్యామిలీ. వాళ్లకు ఇండస్ట్రీ గురించి అస్సలు తెలియదు. దీంతో ఏం జరుగుతుందో అని చాలా భయపడ్డారు. సీరియల్స్‌లో నటిస్తూ అక్కడ గుర్తింపుతో నేను సినిమాల్లోకి వచ్చాను. నేను ఎంచుకున్న పాత్రలు, సినిమాలు నాకు మంచి పేరును తీసుకొస్తున్నాయి. ఇప్పుడు నా ఎదుగుదలను చూసి నా తల్లిదండ్రులు గర్విస్తున్నారు. ఇంతకంటే సంతోషం ఏముంది' అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. -
వేశ్య గృహంలో రెండు వారాలు గడిపిన సీతా రామం హీరోయిన్
-
నలుగురి నేరగాళ్ల కథ
‘‘రెగ్యులర్ సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్ వైపు చూడటం లేదు. తెలుగు ప్రేక్షకుల్లో చాలా మార్పొచ్చింది. కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ‘ఐతే 2.0’ మంచి సినిమా అవుతుంది’’ అని డైరెక్టర్ నందినీరెడ్డి అన్నారు. ఇంద్రనీల్ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి ముఖ్య తారలుగా రాజ్ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐతే 2.0’. ఫర్మ్ 9 పతాకంపై కె.విజయరామరాజు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, నందినీరెడ్డి విడుదల చేశారు. రాజ్ మాదిరాజు మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగంతో ఉన్న నలుగురు యువకులు ఆకలి, ఆశకి లొంగక ఆక్రోశానికి బలై క్రిమినల్స్‌గా ఎలా మారారు? అన్నదే కథ. నేటి టెక్నాలజీ, సోషల్ మీడియా, హ్యాకింగ్ వంటి అంశాలను కీలకంగా చూపించాం’’ అన్నారు. ‘‘త్వరలో ట్రైలర్‌ను, పాటల్ని విడుదల చేస్తాం. మార్చి 16న తెలుగు, హిందీలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు విజయరామరాజు, హేమంత్. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్ అభిమన్యు, సంగీతం: అరుణ్ చిలువేరు. -
దాసోజు శ్రావణ్ కొడుకుపై 'దాడి' కేసు
గచ్చిబౌలి: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కుమారుడు దాడి చేశాడనే ఆరోపణలతో రాయదుర్గం ఠాణాలో కేసు నమోదైంది. డీఐ నర్సింగరావు కథనం ప్రకా రం... గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జరి గిన వివాహానికి హాజరై.. రాత్రి 8 గంటలకు తిరిగి వెళ్లారు. ఆ సమయంలో రాయదుర్గం విస్పర్ వ్యాలీ జంక్షన్లో ట్రాఫిక్‌ను ఆపారు. అక్కడికి ఎస్టీమ్ కారులో వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ కుమారుడు మృణాల్ తాను ముందుకు వెళ్లాలని విధుల్లో ఉన్న మాదాపూర్ ట్రాఫిక్ ఠాణాకు చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్(పీ.సీ.నెం.2679)తో వాగ్వాదానికి దిగాడు. నిబంధనల మేరకు సీఎం వెళ్లే రూట్లో ఐదు నిమిషాల పాటు ట్రాఫిక్‌ను అనుమతించరని కాని స్టేబుల్ స్పష్టం చేశాడు. అయినా వినిపించుకోకుండా నేను యూ టర్న్ తీసుకుంటానని మృణాల్ అన్నాడు. యూటర్న్ కూడా దగ్గర్లో లేదని, ముందుకు వెళ్లొద్దని కానిస్టేబుల్ చెప్పడంతో ఇద్దరి మధ్య గలాట జరిగింది. ఈ క్రమంలో మృణాల్ తన చొక్కా కాలర్ పట్టుకొని దాడి చేశాడని కానిస్టేబుల్ విజయ్‌కుమార్ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశా డు. దీంతో విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా కానిస్టేబుల్‌పై దాడి చేశాడని పో లీసులు ఐపీసీ 533 సెక్షన్ కింద మృణాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి గురువారం రాత్రి రాయదుర్గం పీఎస్‌కు వచ్చి న శ్రవణ్ కుమార్ తన కొడుకుపై కానిస్టేబుల్ దాడి చేశాడని ఆరోపించారు. ఘటన జరిగిన సమయంలో కారులో మృణాల్తో పాటు అతని సోదరుడు రాజీవ్, సోదరి ఉన్నారు. రూ.500 లంచం ఇస్తేనే ముందుకు వదులుతానని కానిస్టేబుల్ అన్నాడని, తాము డబ్బు ఇవ్వక పోవడంతో దాడి చేశాడని మృణాల్, రాజీవ్‌లు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సీఐ తెలిపారు.