గచ్చిబౌలి: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కుమారుడు దాడి చేశాడనే ఆరోపణలతో రాయదుర్గం ఠాణాలో కేసు నమోదైంది. డీఐ నర్సింగరావు కథనం ప్రకా రం... గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జరి గిన వివాహానికి హాజరై.. రాత్రి 8 గంటలకు తిరిగి వెళ్లారు. ఆ సమయంలో రాయదుర్గం విస్పర్ వ్యాలీ జంక్షన్‌లో ట్రాఫిక్‌ను ఆపారు. అక్కడికి ఎస్టీమ్ కారులో వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ కుమారుడు మృణాల్ తాను ముందుకు వెళ్లాలని విధుల్లో ఉన్న మాదాపూర్ ట్రాఫిక్ ఠాణాకు చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్(పీ.సీ.నెం.2679)తో వాగ్వాదానికి దిగాడు.
నిబంధనల మేరకు సీఎం వెళ్లే రూట్‌లో ఐదు నిమిషాల పాటు ట్రాఫిక్‌ను అనుమతించరని కాని స్టేబుల్ స్పష్టం చేశాడు. అయినా వినిపించుకోకుండా నేను యూ టర్న్ తీసుకుంటానని మృణాల్ అన్నాడు. యూటర్న్ కూడా దగ్గర్లో లేదని, ముందుకు వెళ్లొద్దని కానిస్టేబుల్ చెప్పడంతో ఇద్దరి మధ్య గలాట జరిగింది. ఈ క్రమంలో మృణాల్ తన చొక్కా కాలర్ పట్టుకొని దాడి చేశాడని కానిస్టేబుల్ విజయ్‌కుమార్ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశా డు. దీంతో విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా కానిస్టేబుల్‌పై దాడి చేశాడని పో లీసులు ఐపీసీ 533 సెక్షన్ కింద మృణాల్‌పై కేసు నమోదు చేశారు.
ఈ విషయం తెలిసి గురువారం రాత్రి రాయదుర్గం పీఎస్‌కు వచ్చి న శ్రవణ్ కుమార్ తన కొడుకుపై కానిస్టేబుల్ దాడి చేశాడని ఆరోపించారు. ఘటన జరిగిన సమయంలో కారులో మృణాల్‌తో పాటు అతని సోదరుడు రాజీవ్, సోదరి ఉన్నారు. రూ.500 లంచం ఇస్తేనే ముందుకు వదులుతానని కానిస్టేబుల్ అన్నాడని, తాము డబ్బు ఇవ్వక పోవడంతో దాడి చేశాడని మృణాల్, రాజీవ్‌లు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సీఐ తెలిపారు.