dasoju shravan kumar
-
అసలు మీకు గవర్నర్‌గా అర్హత ఉందా?: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి ప్రభుత్వానికి షాకిచ్చారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. దీంతో గవర్నర్ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ .. ఇద్దరు సమర్ధవంతులైన వ్యక్తులను ఎమ్మెల్సీ లుగా నామినేట్ చేసి పంపాం. వారిద్దరూ మంచి పేరున్న నేతలు కాబట్టే ప్రభుత్వం సిఫారసు చేసింది. గవర్నర్ నుంచి పాజిటివ్‌గా రిప్లై వస్తుందని భావించాం. కానీ ఆమె తీరు అస్సలు బాగాలేదు. మేము సిఫారసు చేసిన అభ్యర్థులకు అర్హత లేదంటున్నారు. అసలు మీకు గవర్నర్‌గా అర్హత ఉందా అని ప్రశ్నిస్తూనే ఆమె ఈ పదవికి అన్ ఫిట్ అన్నారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉంది ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. ఆమె ఒక గవర్నర్ లా కాకుండా మోడీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల హడావిడి మొదలైన తర్వత వీరి హడావుడి మరీ ఎక్కువైంది. మేము అధికారంలోకి వచ్చి తొమ్మిదినర ఏళ్లయింది. ఇప్పటికీ కొంత మందికి పాత అలవాటు పోవటం లేదు. తెలంగాణ పై నిరంతరం విషం చిమ్ముతునే ఉన్నారు. అక్టోబర్ 1న మోదీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. తెలంగాణ ఏర్పాటుపై మోదీ ఎందుకు నిత్యం విషం చిమ్ముతున్నారు? సందర్భం లేకుండా ప్రతి సారి పగబట్టినట్లు మాట్లాడున్నారు.. అంత అవసరమేముంది? పార్లమెంట్ సాక్షిగా మోదీ అనేక సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా అజ్ఞానంతో మాట్లాడారు. ఆయన మాటలు జ్ఞానం లేదు సరికదా అంతా అజ్ఞానమే కనిపిస్తుందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సెషన్ 'అమృత కాలం'లో కొత్త పార్లమెంట్ లో తెలంగాణ ప్రజలపై విషం చిమ్మారు. 2014, 2018లో బీజేపీ పార్టీ ఎలాగైతే పుట్టగతులు లేకుండా పోయిందో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించింది. దీనిపై కూడా మోదీ తన అక్కసును వెళ్లగక్కారు. అసలు ఉత్సవాలు జరగలేదంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న మోదీ వెనకబడిన జిల్లాకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. జూలై 14,2014 లో కృష్ణా నది వాటా తేల్చాలని అడిగితే ఇప్పటికీ దిక్కులేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదు.. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించామని కోరాము. పాలమూరు ఇప్పుడు పచ్చబడుతుంటే బీజేపీకి ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ పక్షపాత ధోరణిలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా పని చేస్తోందన్నారు. అసలు మీది జాతీయ పార్టీయేనా? కాదా? ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. ఇది కూడా చదవండి: గవర్నర్ తీరు బాధాకరం: కవిత -
టీఆర్ఎస్ లో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్
-
‘ఈటలపై తోడేళ్ల దాడి... తప్పించుకోవడానికే ఢిల్లీకి’
సాక్షి, హైదరాబాద్: తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తన ఆధిపత్యం నిరూపించుకోవడానికి ఈటలతోపాటు ఆయన భార్య జమున, కొడుకు, కోడలుపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 50 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగాలకు అర్హత సాధించిన స్టాఫ్ నర్సులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3,311 మంది స్టాఫ్ నర్సు ఉద్యోగాల్లో 2,418ని భర్తీచేసి మిగతా 893 మంది అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. దీన్ని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి పట్టించుకోవాలని కోరారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని, ఉద్యోగాలురాక 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని శ్రవణ్ ఆరోపించారు. చదవండి: ఈటల.. ఒంటరిగానే..!..పావులు కదుపుతోన్న టీఆర్ఎస్ ! -
నేను సోనియమ్మను మోసం చేయను: మాజీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నగరా మోగడంతో రాజకీయ పార్టలో హాడావుడి మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచేందుకు ప్రముఖ పార్టీ నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటే ఆయా పార్టీ అభ్యర్థులు మాత్రం తమ పార్టీలోనే ఉండాలా లేక ఇతర పార్టీలో చేరాలా అనే అయోయంలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ భరిలో దిగే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సాక్షితో సమావేశమ్యారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ... తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పార్టీలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే కానీ అవన్ని సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కమిటీ వేసే ముందు తనను సంప్రదించలేదని కొంత అసంతృప్తితో ఉన్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని, ఒక సీటు గెలిచిన బీజేపీ, హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ను ప్రజలు నమ్మరన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, సోనియాగాంధీని మోసం చేసి వెళ్లను అన్నారు. (చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలు; కాంగ్రెస్ తొలి జాబితా ఇదే) అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్ మాట్లాడుతూ.. గ్రేటర్లో వేలాది మంది ప్రజలు మీసేవ కేంద్రాల వద్ద వేచి చూస్తున్న దయనీయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పదివేల కోసం తిండి, తిప్పలు మాని రాత్రి, పగలు తేడా లేకుండా లైన్ల్లో నిలబడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల ప్రజలు చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో డబ్బులు వేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ పని చేయడం లేదని, ఓట్ల కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ.. పేదలను బలిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఏం చేస్తున్నారు.. ప్రజల వివరాలు సేకరించి డబ్బులు వేయవచ్చు కదా అని ధ్వజమెత్తారు. ప్రతీ బాధితుడిని ఆదుకోవాలని సూచించినా.. అధికార పార్టీ వినకుండా ఎన్నికల రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఎంత వరద నష్టం జరిగిందనే దానిపై సమగ్ర సమాచారం గుర్తించారా అని, ఈ విషయంలో గవర్నర్ ఉత్సవ విగ్రహంగా మారిపోయారని విమర్శించారు. వరద అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని, వరద సహాయం తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని దాసోజు వ్యాఖ్యానించారు. (చదవండి: తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు) అదే విధంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ‘అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నందున ఎవరికి టైం ఇవ్వకుండా ఎన్నికలు పెట్టేశారు. తమ పార్టీ నాయకులు బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ చెప్పకుండా వెళ్లిపోయారు. ఆయన పార్టీ మారడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏంలేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ ప్రచారం చేస్తోంది, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే.. కాంగ్రెస్ ఉండాలి. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగా పోరాడుతుంది. పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రేపు 9 గంటలకు శేరిలింగంపల్లిలో సమావేశం నిర్వహిస్తున్నాం. శేరిలింగంపల్లిలో పది డివిజన్లలో కాంగ్రెస్ గెలుపుకు రేపటి మీటింగ్ ఉపయోగపడుతుంది. బీజేపీ అంత గట్టిగా ఉంటే.. మా పార్టీ నేతల వెంట ఎందుకు పడుతున్నారు. బీజేపీకి సరుకు లేక.. మా పార్టీ నేతల వెంటపడుతోంది. హైదరాబాద్ వరదలు వస్తే.. ఒక్క రూపాయి సహాయం చేయలేదు. 2009 కంటే మెరుగైన ఫలితాలు ఈ సారి సాధిస్తాం’ అని కొండా ధీమా వ్యక్తం చేశారు. -
ఎన్నికలపై స్టే కోరుతూ వ్యాజ్యం.. హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషన్లో శ్రవణ్ పేర్కొన్నారు. రాజకీయంగా వెనకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. అయితే విచారణ సందర్భంగా సంబంధిత వ్యాజ్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ వాదనను తీవ్రంగా తప్పపట్టింది. పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ఘాటుగా ప్రశ్నించింది. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే చివరి క్షణంలో సుప్రీంకోర్టు తీర్పు గుర్తొచ్చిందా అంటూ వ్యాఖ్యానించింది. రాజకీయ దురుద్దేశంతో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని మండిపడింది. చివరికి పిటిషన్‌పై విచారణ చేస్తాం కానీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీచేసింది. హైకోర్టు తీర్పుపై అభ్యంతరం.. సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ పరిహారంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. పెళ్లికాని మేజర్ యువతకు విడిగా పరిహారం చెల్లించాలన్న తీర్పుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వాదించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వాదనను ప్రాజెక్ట్ నిర్వాసితుల తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. వాదనలను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్వాసితులను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
'విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు'
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వనగరంగా గ్రేటర్ హైదరాబాద్ ని తీర్చిదిద్దితే .. గత ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కష్టపడి విశ్వనగరంను కాస్త విషాదనగరంగా మార్చేసిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.గురువారం గాంధీభవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ' గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ ఎక్కడ చూసిన బురదే కనిపిస్తుందన్నారు. ఇళ్లన్నీ నీటిలో మునిగాయి. ఓపెన్ నాలాల్లో నీళ్ళతో పాటు ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, భాద్యత రాహిత్యం వల్ల, అవసరమైన నిధులు ఖర్చు చేయకుండా, కిలో మీటర్ల కొద్ది ఓపెన్ నాళాలు వున్నా, కనీసం వాటికి మూసివేయాలన్న, పెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న సోయి లేకుండా, ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు చేసి జీహెచ్ఎంసీని అప్పులు మయం చేశారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ని గాలికి వదిలేశారు. వర్షాలు ప్రతి ఏటా పడాతాయి. గతంలో కూడా పెద్ద పెద్ద వర్షాలు, వరదలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంత సిద్దంగా వున్నాయన్నది ముఖ్యం. కోస్తా ప్రాంతాల్లో చూసుకుంటే హెచ్చరికలు జారీ అయిన వెంటనే ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమౌతారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తారు. అవసరమైన చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తారు. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను వాళ్ళ కర్మకే వదిలేసి చేతులు దులుకునే పరిస్థితి కనిపించడం అత్యంత బాధాకరం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గులేదు. భారీ వర్షాల వల్ల చనిపోయిన వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వంద మంది వర్షానికి మరణించినట్లు తమకు నిర్దిష్టమైన సమాచారం వుంది. కానీ ప్రభుత్వం చనిపోయిన వారి లెక్కలు కూడా సరిగ్గా చెప్పడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలివి లేదు. తెలంగాణ వచ్చినాక మంచి అర్బన్ డెవలప్మెంట్ పాలసీ వుండాలని కలలు కన్నాం. కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాం. రింగ్ రోడ్ అవతల కూడా అభివృద్ధి ఉండాలనే విజన్ తో నిర్మించిన కట్టడం అది. అలా జరిగితే హైదరబాద్ పై లోడ్ తగ్గుతుంది. ఇక్కడ ట్రాపిక్, డ్రైనేజీ కంట్రోల్ వుంటుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వానికి తెలివి మోకాళ్ళలో వుంది. పరిమితులకు దాటి అనుమతులు ఇచ్చి మొత్తం నగరంలోనే పెద్దపెద్ద భవనాలు రోడ్లపైనే నిర్మించే పరిస్థితి. అందమైన హైదరాబాద్ ని. గార్డెన్ సిటీ లాంటి హైదరాబద్ ని ఒక గార్బేజ్ సిటీగా మార్చేసిన చరిత్ర కేసీఆర్‌దే' అంటూ దుయ్యబట్టారు. -
కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : సచివాలయ ఆవరణలో నల్ల పోచమ్మ ఆలయం, మసీదులు కూల్చివేతలకు బాధ్యులైన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రావన్ దాసోజు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను, మత పరమైన విశ్వాసాలను గాయపరుస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చట్ట విరుద్ధంగా, రాజ్యంగానికి వ్యతిరేకంగా నియంతత్వ పోకడలతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అత్యంత ప్రాచీనమైన ప్రార్థనా స్థలాలను మూడో కంటికి తెలియకుండా చట్ట వ్యతిరేకంగా దుర్మార్గంగా కూల్చివేశారని విమర్శించారు. వీటిలో ఓమసీదు 1889 వ సంవత్సరంలో ఆనాటి నిజాం రాజు నిర్మించిన తెలంగాణ వారసత్వ సంపద అని, అంతేకాకుండా సీ బ్లాక్ పక్కనే ఉన్న మసీదు ఇఫ్తార్ - ఏ - ముతామాది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రార్థనా మందిరమని గుర్తుచేశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ పాల్గొన్నారు. -
ఆ పేపర్‌పై ఎందుకు కేసు పెట్టలేదు: దాసోజు
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో దాసోజు శ్రవణ్ విలేకరులతో మాట్లాడారు. ‘ఏమై పోతున్నారు’ అనే శీర్షికతో ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చింది.. 548 మంది బాలికలు అదృశ్యమయ్యారని ఆ వార్త సారాంశమని పేర్కొన్నారు. ఇలా అదృశ్యమై ఎముకలుగా మారిన పరిస్థితుల్లో హాజీపూర్ బాలికల అస్థికలు దొరికాయని గుర్తు చేశారు. బాలికల అదృశ్యం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వెంకట్ గురజాల, మరి కొందరు కాంగ్రెస్ సోషల్ మీడియా ఉద్యోగులను ప్రభుత్వం అకారణంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. వార్త ప్రచురించిన ఈనాడు పేపర్‌పై ఎందుకు కేసు పెట్టలేదని దాసోజు సూటిగా ప్రశ్నించారు. మాకు తెలంగాణా పోలీసులపైన అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నాయని అన్నారు. స్వయంగా డీజీపీ కూడా 545 మంది బాలికలు అదృశ్యమయ్యారు.. ఇంకా 318 మంది ట్రేస్ అవుట్ కాలేదు అని ట్విటర్లో ట్వీట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. డీజీపీతో పాటుగా వీరందరిపై కేసు నమోదు చేయకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అడిగారు. అనవసరంగా వారి భవిష్యత్తును కేసులు పెట్టి నాశనం చేయవద్దని కోరారు. ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ.. ఈ రోజు కేవలం ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధుల రక్షణ కోసం మాత్రమే పనిచేసేలా తయారైందని విమర్శించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాత్రి వేళల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు...వారికి సరైన భద్రత కల్పించాలని కోరారు. ప్రజల కోసం పోలీసు వ్యవస్థ పనిచేయాలని కోరుతున్నట్లు చెప్పారు. -
‘కేసీఆర్‌వి పగటి కలలు’
ఢిల్లీ: ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ ఏదో పగటి కలలు కంటున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాసోజు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న కమ్యునిస్టులకు మద్ధతు ఇవ్వరు కానీ.. జాతీయ స్థాయిలో ఉన్న కమ్యునిస్టులతో పొత్తులకు సిద్ధం అంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి కేసీఆర్ మద్ధతుదారుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సారు..కారు..ఆరు దగ్గరనే టీఆర్ఎస్ పార్టీ ఉండి పోతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేస్తున్న పర్యటనలు రాజకీయా యాత్రల్లా లేవని.. తీర్ధ యాత్రల్లాగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకులు, కేసీఆర్‌తో వెళ్లలేమని తెగేసి చెబుతున్నారని అన్నారు. 29 శాతం రిజర్వేషన్లు బీసీలకే దక్కాలి ‘ నల్సార్ లా యూనివర్సిటీలో తెలంగాణ స్థానిక రిజర్వేషన్లు, 371(డీ) రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదు. 85 శాతం రిజర్వేషన్లు స్థానికులకే దక్కాలి. తెలంగాణ రాష్ట్ర చట్టం ప్రకారం 29 శాతం రిజర్వేషన్లు బీసీలకే దక్కాలి. కానీ చట్టం అమలు కాకపోవడంతో తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహా విశ్వవిద్యాలయంలో చట్టం అమలు చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు?. తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నల్సార్‌కి ఛాన్సలర్‌గా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నా కూడా చట్టం అమలు కావడం లేద’ని లేఖ ద్వారా దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బీజేపీవి శిఖండి రాజకీయాలు: దాసోజు
ఢిల్లీ: బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని గడ్చిరౌలీలో నక్సలైట్ దాడిని బీజేపీ ఆపలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పౌరసత్వంపై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని, ఉద్యోగాల కల్పనలో రైతులకు మద్ధతు ధర కల్పించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులు పెద్దఎత్తున దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారని, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయేలా చేశారని దుయ్యబట్టారు. ఈ అంశాలను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 2004, 2009లో రాహుల్ గాంధీ ఎంపీగా పనిచేశారు.. కానీ మరోసారి బీజేపీ పౌరసత్వం వివాదం లేపడం విడ్డూరంగా ఉందన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మతిభ్రమించి రాహుల్ గాంధీకి నోటీసులు పంపారని వ్యాక్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీని కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిపేస్తుందని అన్నారు. -
‘ఆ మంత్రి అబద్ధాల కోరు’
ఢిల్లీ: తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జగమెరిగిన అబద్దాల కోరు అని రుజువైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 796 మంది విద్యార్థుల మొమోలతో మాత్రమే తప్పులు ఉన్నాయని మంత్రి చెబుతున్నారు.. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మాత్రం 6415 మంది విద్యార్థుల మార్కుల షీట్లు సరి చేశానని చెబుతోంది... ఈ రెండింటిలో ఏది నిజమో ప్రభుత్వమే చెప్పాలని సూటిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే త్రిసభ్య కమిటీ రిపోర్టును బయటపెట్టాలన్నారు. ముగ్గురు సభ్యులు సంతకాలు పెట్టిన నివేదికను దాచిపెట్టి దొంగ నివేదికను బయటపెట్టారని ఆరోపించారు. 110 పేజీల నివేదికను త్రిసభ్య కమిటీ రూపొందిస్తే కేవలం పది పేజీల నివేదికను మాత్రమే బయటపెట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎవరిని రక్షించడానికి త్రిసభ్యు కమిటీ నివేదికను దాచిపెడుతున్నారని విమర్శించారు. గ్లోబరెనా సంస్థతో ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటివరకు ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని వెల్లడించారు. లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ఎందుకు నిర్లక్ష్యం వహించారని తూర్పారబట్టారు. ఒప్పందం లేకపోవడం వల్లే సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతోందన్నారు. విద్యార్థుల చావుకు కారణమైన ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఆన్లైన్ వెబ్సైట్, ఐవీఆర్‌లను వెంటనే ప్రారంభించాలని కోరారు. గ్లోబరెనా అనే దొంగ సంస్థకే తాళం చెవి ఇస్తున్నారని ముందుగానే మీడియా హెచ్చరించింది. అయినా ప్రభుత్వం దీన్ని కాపాడే ప్రయత్నం చేసిందని విమర్శించారు. గ్లోబరెనా మంచి కంపెనీ అని 2018లోనే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
టీఆర్ఎస్ అభ్యర్థుల్లో భూకబ్జాకోరులు, వ్యాపారులు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది భూకబ్జాకోరులు, వందల కోట్ల వ్యాపారులు ఉన్నారని, ఉద్యమకారులను పక్కనపెట్టిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో డబ్బులే ప్రాతిపదికగా టికెట్లు ఇచ్చి రాష్ట్ర ఓటర్లను అవమానపర్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఉద్యమ ద్రోహి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చారని, ఉద్యమకారులు వివేక్ ను పక్కనపెట్టి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వెంకట్‌కు టికెట్ కేటాయించారని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రావణ్ మాట్లాడుతూ, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆర్థిక నేరగాడని, ఆయనపై అత్యాచారం కేసు ఉందని చెప్పారు. రూ.100 కోట్ల కోళ్ల వ్యాపారం చేసే రంజిత్‌రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇచ్చారని, యతిమ్ఖానా భూములు కబ్జా చేసిన నర్సింహారెడ్డికి నల్లగొం డ ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. నర్సింహారెడ్డి వందల కోట్ల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నారనే సమాచారం తమకుందని, ఆయన ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపెట్టారని ఆరోపించారు. నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌కి లేఖ రాసినా స్పందించలేదని చెప్పారు. టీఆర్ఎస్కు ఇప్పటికే 15 మంది ఎంపీలున్నా విభజన హామీల్లో ఒక్కటీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రచారాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోం దని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కేసీఆర్ సభ వెలవెలబోవడంతో, నిస్పృహతో తమ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని పోలీ సులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. మీటింగ్‌లకు అనుమతులు ఇవ్వడం లేదని, తమ వెంట తిరిగే యువకులను అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పా రు. పోలీసులు మఫ్టీలో ఉండి తమ పార్టీ కార్యకర్తలను వెంబడిస్తున్నారని, పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని కానీ పార్టీల కోసం కాదని కొండా విమర్శించారు. -
ఓటాన్ బడ్జెట్ బదులు ఓట్ల బడ్జెట్: దాసోజు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టింది ఓటాన్ బడ్జెట్ కాదని, ఓట్ల వేట కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. శనివారం ఢిల్లీలో, గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బడా పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ప్రతీ రైతుపై రూ.47వేల అప్పు ఉంటే, ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు వారికి ఎలా సరిపోతాయో చెప్పాలన్నారు. ఎంఎస్పీ ధరలు పెంచాలని స్వామినాథన్ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కి తూతూ మంత్రంగా మద్దతు ధర ప్రకటించడం వల్ల దేశ వ్యాప్తంగా రైతులు సుమారు 2.5 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. రైతు అనుబంధ రంగాల్లో జీఎస్టీ ప్రభావంతో రైతాంగం కుదేలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీల అసమర్థత వల్లే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి అమలు కావాల్సిన హామీలను సాధించడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. -
మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం ఉల్లంఘనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి తప్పనిసరిగా మంత్రివర్గ విస్తరణ జరగాలని, రాజ్యాంగ పరిరక్షుడిగా కనీసం 12 మంది మంత్రులు నియమితులయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు మంగళవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వంలో సీఎంతో కలిపి 15 శాతం మంది కన్నా మంత్రులు ఎక్కువ ఉండరాదని, 12 శాతం కన్నా తక్కువ ఉండొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1ఏ) చెబుతోందని, ఆర్టికల్ 163(1) ప్రకారం ముఖ్యమంత్రిసహా మంత్రులంతా గవర్నర్ విధులకు సహాయంగా ఉండడంతోపాటు సలహాలివ్వాలని స్పష్టంగా ఉందని, అయినా సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని బే«ఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో మొత్తంం 33 శాఖలు, 298 ఆర్గనైజేషన్లు ఉన్నాయని, అయినా సీఎంకు తోడు కేవలం ఒక్కమంత్రి మాత్రమే ప్రమాణం చేశారని, ఆయనకు కూడా నాలుగు శాఖలే కేటాయించారని తెలిపారు. 33 శాఖల్లోంచి సమాచారం తెప్పించుకోవడం, సమీక్షలు జరపడం కేవలం ముఖ్యమంత్రి, హోంమంత్రి వల్ల కాదని తెలిపారు. 2014 తర్వాత ఐదేళ్లపాటు సుస్థిరపాలన కొనసాగుతుందని భావించి ప్రజలు నమ్మకంతో ఓట్లేసి టీఆర్ఎస్కు పట్టం కడితే అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 9 నెలల పాలన కుంటుపడిందని, ఇప్పుడు పంచాయతీ, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు, అనంతరం మున్సిపల్ ఎన్నికలు.. ఇలా ఏడాదంతా ఎన్నికల కోడ్ అమల్లో ఉండే పరిస్థితుల్లో కనీసస్థాయిలో మంత్రులు లేకుండా పాలన ఎలా జరుగుతుందని ఆ లేఖలో ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా వెంటనే స్పందించి రాష్ట్రంలో కనీసం 12 మంది మంత్రుల నియామకం జరిగేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో గవర్నర్‌ను కోరారు. గవర్నర్ వత్తాసు పలుకుతున్నారు... ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే రాష్ట్ర గవర్నర్ వాటికి వత్తాసు పలుకుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ అధికార ప్రతినిధులు చరణ్‌కౌశిక్ యాదవ్, నిజాముద్దీన్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనభలో గవర్నర్ ప్రసంగం ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేదని, ప్రభుత్వం ఏది చెబితే అదే వేదంగా నడుచుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు చేయడం, వారికి కొమ్ముకాయడం గవర్నర్ వ్యవస్థను దిగజారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను విడవకుండా 1,000 సర్పంచ్ స్థానాలను గెలిపించిన నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఆర్థిక, అంగబలాలతో ప్రభుత్వం బెదిరించినా పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ అర్థమవుతుందన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ నిజమేనని నిపుణులు తేల్చిన నేపథ్యంలో వచ్చే ఎన్నికను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏఐసీసీ అధికార ప్రతినిధిగా దాసోజు శ్రవణ్
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధికార ప్రతినిధిగా తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ సోమవారం ఒక ప్రకటన వెలువరించింది. శ్రవణ్ సహా 10 మందిని ఏఐసీసీ అధికార ప్రతినిధులుగా నియమించింది. రాజ్యసభ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా శ్రవణ్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా, ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రధాన కార్యదర్శిగాతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రవణ్, అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చకున్నారు. ప్రజారాజ్యం పార్టీ, టీఆర్ఎస్ల్లో క్రియాశీలకంగా పనిచేసిన శ్రవణ్ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తెచ్చారు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్‌లో తప్పులున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ ఎలా తగ్గించారో చెప్పాలంటూ 2018 జూన్‌లో సీఎం కు లేఖ రాశామని, స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని స్పష్టం చేశారు. పిటిషన్లో ఎక్కడా కూడా ఎన్నికలు ఆపమని కోరలేదని, ఎన్నికలు ఆపాలని కుట్ర చేసింది టీఆర్ఎస్సే అని దుయ్యబట్టారు. ఆదివారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పిటిషన్ వేసి ఎన్నికలు ఆపిందని సీఎం పేర్కొనడం పచ్చి అబద్ధమన్నారు. తాను ఎన్నికలు ఆపమని కోరి నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను ఇడియట్స్ అంటూ కేసీఆర్ చేసిన వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండించా రు. సీఎం తన స్థాయిని తగ్గించుకుని అహంకారంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కోర్టు తీర్పు ఇచ్చినా కుల గణన చేయకుండా మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి పిటిషన్ వేస్తే 50 శాతం రిజర్వేషన్ ఇవ్వొద్దని కోర్టు చెప్పిందని శ్రవణ్ అన్నారు. అతన్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ కేటగిరి చేసి రిజర్వేషన్ అమలు చేయాలని టీఆర్ఎస్ కోర్టులో పిటిషన్ వేయలేదా అని ప్రశ్నించారు. అది తప్పు కానప్పుడు తాము కోరితే తప్పు ఎలా అవుతుందన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడుతున్న కేసీఆర్‌కు బీసీగణన చేయడం పెద్ద సమస్య కాదని, చేయాలన్న చిత్తశుద్ధి లేదన్నారు. కర్ణాటకలో మాదిరిగా బీసీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. -
‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమం ప్రారంభిస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై గాంధీభవన్‌లో సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 22 లక్షలు ఓట్లు నిర్ధాక్షణంగా తొలగించిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండగా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రధాన అధికారి(ఈసీ) రజత్ కుమార్, ఇతర అధికారులు టీఆర్ఎస్ పార్టీకి పేరోల్ క్రింద ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వచ్చే పార్టమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అని వెల్లడించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతామని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కుమ్మకైయి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లోకి రానివ్వకుండా అధికార పార్టీకి సహకరించారని ఆయన ఆరోపించారు. నర్సాపూర్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8.8 శాతం ఉన్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 70 శాతం దాటిందని, ఆపై తెల్లారా 90 శాతంగా ఈసీ ప్రకటించని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చిప్‌లు, ట్యాంపరింగ్ సమాచారం సేకరించి సరియైన సమయంలో వాటి గురించి బయట పెడుతామన్నారు. బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తామని, ఈ విషయం పై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోరాడుతామని దాసోజ్ చెప్పారు. ఇది మిషన్ మాండేటరీ తప్ప పీపుల్స్ మాండేటరీ కాదన్నారు. రాష్ట్రంలో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రజలు, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారానకి రాకుండా అడ్డుకున్నా వాళ్లే వేలాది ఓట్ల మోజారిటీతో గెలిస్తే ఇక ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదని దాసోజ్ చెప్పారు. -
ఆంధ్రా పోలీసులను వద్దంటారా?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు ఆంధ్రా పోలీసులను వద్దనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల విధులకు ఆంధ్రాపోలీసులను అనుమతించడం లేదని తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్నికల కమిషన్ కేసీఆర్ ఆదేశాలను అమలు చేస్తుందా లేక భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. ఓట్లకోసం కాళ్లు పట్టుకుంటున్నారు కేసీఆర్ ఆంధ్రా, తెలంగాణ అంటూ విభజన రాజకీయాలు మాట్లాడుతుండగా, ఆయన కుమారుడు కేటీఆర్ వారి ఓట్ల కోసం కాళ్లు పట్టుకుంటున్నాడని శ్రవణ్ ఎద్దేవా చేశారు. కొంగరకలాన్ సభలో ఆంధ్రా రాక్షసులు, అమరావతికి అమ్ముడు పోదామా అంటూ విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు ఎలా మరిచిపోతారన్నారు. ధన, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఉండటం ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమని చెప్పారు. తార్నాక లిటిల్ ఇంగ్లండ్‌లో ఉన్న ఆంగ్లేయుల వారసులు, మల్కాజిగిరిలో ఉన్న తమిళులు, మళయాళీలు, కన్నడిగులు, బేగంబజార్‌లో రాజస్తానీలు, గుజరాతీలు ఇలా భిన్న రాష్ట్రాలనుంచి వచ్చిన వారున్నారని గుర్తు చేశారు. -
‘భృతి’ పేరుతో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా నిరోద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. వేలం పాట పాడినట్లు మరో రూ.16 పెంచి రూ.3,016 ఇస్తామంటూ కేసీఆర్ నిరుద్యోగులను అవమానపరిచారన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వంద రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించడంతో కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైందని, అందుకే కొత్త పల్లవి అందుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులున్నారని, వారంతా ఈ విషయమై కేసీఆర్‌ను నిలదీయాలని కోరారు. అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు. అవినీతికే అప్పులు.. కేవలం కమీషన్లు, అవినీతి చేసేందుకే కేసీఆర్ రూ.70 వేల కోట్ల అప్పులు చేశారని దాసోజు ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు దమ్ముంటే శాఖల వారీగా సృష్టించిన సంపద ఎంత, పెట్టిన ఖర్చు ఎంత, అప్పులు ఎంత అన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ ప్రకటించిన కేసీఆర్ ఇంతకుముందే ఒకే దఫాలో ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ప్రగతిభవన్‌ను ఖాళీ చేసి.. ఫాంహౌస్‌లో వ్యవసాయం చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికల్లో ఓటేయకుంటే తరిమివేస్తామన్న ధోరణిలో మాట్లాడుతున్నారని దాసోజు ఆరోపించారు. -
గులాబీ గులాములుగా చేసుకున్నారు: దాసోజు
సాక్షి, హైదరాబాద్: పోలీసులను గులాబీ పార్టీకి గులాములుగా మార్చుకుని పని చేయించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని, తప్పుడు కేసులతో కాంగ్రెస్ నేతలను బెదిరించలేరని, తెలంగాణ ప్రజలు తమవైపే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలపై నమోదవుతున్న కేసులపై ఆ పార్టీ నేతలు శుక్రవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, మొన్న జగ్గారెడ్డిపై దొంగ కేసు పెట్టారని, ఆ మరుసటి రోజే మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డిపై ఆయుధ చట్టం కేసు.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంపై ఎస్సీ, ఎస్టీ కేసుతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. పోలీస్ శాఖలోని కొంత మంది కింది స్థాయి అధికారులపై తమకు అనుమానం ఉందని, డీజీపీపై పూర్తి నమ్మకం ఉందని అందుకే వినతిపత్రం సమర్పించామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల జాబితా రూపొందించామని, అధికారంలోకి రాగానే వారిపై విచారణ జరిపిస్తామన్నారు. తనపై నమోదైన కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని డీజీపీకి కూన శ్రీశైలం వివరించారు. -
అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ కితాబా?
సాక్షి, హైదరాబాద్: బాధ్యత గల ప్రతిపక్షంగా విద్యాశాఖలో వెలుగు చూసిన అవి నీతిని తాము వెలుగులోకి తెస్తే, తప్పును సరిదిద్దుకోకుండా దొంగలకు సద్ది మోసే విధంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. టీచర్ల బదిలీలపట్ల ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తి గురించి తెలుసుకోకుండా అంతా సంతో షంగా ఉన్నారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కితాబివ్వడం తగదని వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, నష్టపోయిన వారందరికీ న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆచార్యకు కూడా లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. విద్యా శాఖలో అవినీతి జరగకపోతే వెబ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత సర్దుబాటు పేరుతో ఓడీలు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చేరకపోతే అక్కడ విద్యార్థులు లేరన్న నెపంతో లెక్చరర్లను ఓడీల పేరిట బదిలీలు చేస్తున్నారని, విద్యార్థుల సంఖ్య, రెగ్యులర్ లెక్చరర్ల సంఖ్య, ఓడిపై ఏ కళాశాల నుండి ఏ కళాశాలకు పంపారన్న వివరాలను బయటపెట్టాలని కోరారు. అంతర్ జిల్లా బదిలీలు నిర్వహిం చి భార్యాభర్తలకు ఊరట కలిగిస్తామని 2016 మే 21న సీఎం ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని, రెండేళ్ల క్రితం ఇచ్చి న జీవోపై మళ్లీ సీఎం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. -
‘మోదీ తరహాలోనే కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు గరిష్టంగా ధరలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014లో యూపీఏ సర్కార్ అధికారంలో ఉండగా అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరిగాయని తెలిసినా.. పెట్రో ధరలు అదుపు చేయడంలేదని బీజేపీ నిరసనలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రో ధరలు తగ్గించడం లేదని మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై మోదీ తరహాలోనే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ పెట్రో ఉత్పత్తులపై విపరీతమైన పన్నులు వేస్తోందని ఆరోపించారు. పెట్రోల్‌పై 35.2శాతం, డీజిల్‌పై 25శాతం రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోందని పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో టాక్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరలు తగ్గించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేయాలని సూచించారు. గోవా, మిజోరాం, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలలో కంటే తెలంగాణలోనే పెట్రో ఉత్పత్తులపై అధిక పన్ను వేస్తున్నారని ఆరోపించారు. పెట్రో ఉత్పత్తుల పెంపుపై మోదీకి వ్యతిరేకంగా ఎలా అయితే నిరసన చేస్తున్నామో రాష్ట్రంలో కూడా అలాంటి నిరసనలే చేయాలని శ్రావణ్ పిలుపునిచ్చారు. -
రైతుబంధు కాదు.. రాబందు: దాసోజు
సాక్షి, హైదరాబాద్: రైతాంగాన్ని నాలుగేళ్లుగా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు పేరిట హడావుడి చేస్తుండటం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం కేసీఆర్ రైతుబంధు కాదని, రైతు రాబందు అని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎకరానికి రూ.4 వేలు కాదని, రూ.40 వేలు ఇచ్చినా రైతుల ఉసురు కేసీఆర్‌కు తగలక మానదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాక 35 లక్షల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయన్నారు. 4,500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించని సీఎం ఇప్పుడు రైతుబంధు అంటూ వారిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కోటి 24 లక్షల ఎకరాల సాగు భూమిని 45 లక్షల మంది రైతులు సాగు చేస్తుంటే.. కొత్తగా కోటి 39 లక్షల ఎకరాల్లో 58 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారని, వారందరికీ చెక్కులు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, కొత్తగా 13 లక్షల మంది రైతులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. వీరికి చెక్కుల రూపంలో వెళుతున్న రూ.600 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘కుట్ర అని సెర్చ్ చేస్తే కేటీఆర్ ఫొటో వస్తోంది’
హైదరాబాద్ : రాజకీయ కుట్రలలో వయసుకు మించి మీరు(కేటీఆర్) ఆరి తేరారని, అందుకేనేమో ‘కుట్ర’ అని గూగుల్ ఇమేజెస్‌లో సెర్చ్ చేస్తే, మీ ఫోటోలు కుట్ర అనే పదానికి పర్యాయపదంగా ఉన్నట్లుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి దాసోజు శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధాని పదవిని వద్దనుకుంటే.. మీరేమో ఇంటిల్లిపాదీ పదవులు అనుభవిస్తున్నారని కేసీఆర్ కుటుంబాన్నిఉద్దేశించి లేఖలో వ్యాఖ్యానించారు. మీ కుటుంబానికి రాహుల్ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. మోదీ తెలంగాణ బిల్లుపై విచ్చలవిడిగా మాట్లాడుతుంటే విమర్శించాల్సింది పోయి మెప్పుకోలు కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని ప్రధాని మోదీ తూలనాడుతుంటే టీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్లో మోదీ మాట్లాడగానే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. ఎయిమ్స్, పోలవరం ముంపు, రైల్వే జోన్ ఇలా వేటికి బడ్జెట్ లో నిధులు ఇవ్వకున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. మోదీతో ఉన్న లోపాయికరి ఒప్పందం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కేటీఆర్ తాకట్టు పెట్టారని ఘాటుగా విమర్శించారు. మోదీతో లోపాయికారి ఒప్పందంపై గన్ పార్క్ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. -
కువైట్‌లో రాష్ట్రవాసుల కష్టాలు తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కువైట్‌లో తెలంగాణవాసులు 50వేల మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారని, ఆ దేశ అంబాసిడర్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్ చెప్పారు. సొంత దేశానికి వచ్చేందుకు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని భారత్‌కు రప్పించాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కువైట్‌కు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించాలని, ప్రభుత్వ ఖర్చులతోనే బాధితులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. కువైట్ నుంచి వచ్చినవారికి ప్రభుత్వం ఉపాధి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి తమ మేనిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్ పర్యటనలన్నీ జల్సాలకు, బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఎన్నారై పాలసీ రూపొందించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్ బాధితుల సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని, రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గల్ఫ్ బాధితులకు సాయం అందించేందుకు టీపీసీసీ నుంచి ఓ బృందం గల్ఫ్ వెళ్లనుందని, వారి బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.