సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది భూకబ్జాకోరులు, వందల కోట్ల వ్యాపారులు ఉన్నారని, ఉద్యమకారులను పక్కనపెట్టిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో డబ్బులే ప్రాతిపదికగా టికెట్లు ఇచ్చి రాష్ట్ర ఓటర్లను అవమానపర్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఉద్యమ ద్రోహి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చారని, ఉద్యమకారులు వివేక్ ను పక్కనపెట్టి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వెంకట్‌కు టికెట్ కేటాయించారని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రావణ్ మాట్లాడుతూ, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆర్థిక నేరగాడని, ఆయనపై అత్యాచారం కేసు ఉందని చెప్పారు.
రూ.100 కోట్ల కోళ్ల వ్యాపారం చేసే రంజిత్‌రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇచ్చారని, యతిమ్‌ఖానా భూములు కబ్జా చేసిన నర్సింహారెడ్డికి నల్లగొం డ ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. నర్సింహారెడ్డి వందల కోట్ల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నారనే సమాచారం తమకుందని, ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు చూపెట్టారని ఆరోపించారు. నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌కి లేఖ రాసినా స్పందించలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే 15 మంది ఎంపీలున్నా విభజన హామీల్లో ఒక్కటీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.
ప్రచారాన్ని అడ్డుకోవాలని
చూస్తున్నారు: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోం దని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కేసీఆర్ సభ వెలవెలబోవడంతో, నిస్పృహతో తమ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని పోలీ సులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. మీటింగ్‌లకు అనుమతులు ఇవ్వడం లేదని, తమ వెంట తిరిగే యువకులను అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పా రు. పోలీసులు మఫ్టీలో ఉండి తమ పార్టీ కార్యకర్తలను వెంబడిస్తున్నారని, పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని కానీ పార్టీల కోసం కాదని కొండా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment