
మృణాల్ ఠాకూర్ కెరీర్ సీతారామం సినిమాకి ముందు, ఆ తర్వాత అన్నట్లు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం క్లాసిక్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లుగా చేసిన దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్‌లకు ఈ సినిమా మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్‌కు అన్ని భాషల్లోనూ సూపర్‌క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
ఈ సినిమా విజయంతో ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ డ్యూటీ తాజాగా ఓ వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె ఏమందంటే.. 'నిజానికి నేను సినిమాల్లోకి రావడం మా పేరెంట్స్‌కి అసలు ఇష్టం లేదు.మాది మరాఠీ ఫ్యామిలీ. వాళ్లకు ఇండస్ట్రీ గురించి అస్సలు తెలియదు. దీంతో ఏం జరుగుతుందో అని చాలా భయపడ్డారు.
సీరియల్స్‌లో నటిస్తూ అక్కడ గుర్తింపుతో నేను సినిమాల్లోకి వచ్చాను. నేను ఎంచుకున్న పాత్రలు, సినిమాలు నాకు మంచి పేరును తీసుకొస్తున్నాయి. ఇప్పుడు నా ఎదుగుదలను చూసి నా తల్లిదండ్రులు గర్విస్తున్నారు. ఇంతకంటే సంతోషం ఏముంది' అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment