నీలివజ్రం కొత్త రికార్డు! | Rare blue diamond sets new record at Sotheby's auction | Sakshi
Sakshi News home page

నీలివజ్రం కొత్త రికార్డు!

Published Wed, Apr 6 2016 1:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

నీలివజ్రం కొత్త రికార్డు!

నీలివజ్రం కొత్త రికార్డు!

హాంకాంగ్:  వేలం పాటలో ఓ నీలి వజ్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ వజ్రం సోథెబేస్ట్ మార్కెట్లో 205 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి జ్యువెలరీ మార్కెట్లో ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రికార్డును సాధించింది. అలాగే మరో పెయింటింగ్ కూడా వందలకోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది.

డీబీర్స్ మిలీనియమ్ జ్యువెల్ 4 లో 10.10 క్యారెట్ల గోళాకార ఫాన్సీ వివిద్ బ్లూ డైమండ్... ఆసియాలో మరే ఇతర ఆభరణాల వేలంలోనూ తెచ్చి పెట్టని అత్యధిక డబ్బును తెచ్చిపెట్టిందని ఆక్షన్ హౌస్ వెల్లడించింది. ఆ అరుదైన నీలి వజ్రాన్ని ఓ బిడ్డర్ ఫోన్ ద్వారా వేలంలో కొనుగోలు చేసినట్లు దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు చైనీస్ కళాకారుడు ఝాన్ డాక్వియన్ సృష్టించిన 'పీచ్ బ్లౌజమ్ స్పింగ్'  కళాత్మక పెయింటింగ్ .. అసలు ధర 8.3 మిలియన్ డాలర్లు ఉండగా... అంచనాలను అధిగమించి సుమారు 230 కోట్ల రూపాయలకు  అమ్ముడుపోయింది. ఆ కళారూపం కేవలం 50 నిమిషాల్లో 100 కంటే ఎక్కువ బిడ్లను పొంది.. షాంఘై లాంగ్ మ్యూజియంకు అత్యంత  అధిక ధర పలికింది. ఝాన్ వేసిన ఈ పెయింటింగ్ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement