జోధ్‌పూర్: భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం మరింత బలపడింది. ఇప్పటికే సీమా హైదర్-సచిన్ మీనా, అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోగా తాజాగా అమీనా-అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటై ఈ లిస్టులో చేరిపోయారు. అయితే వీరు సాహసాలకు తెరతీయకుండా పెద్దలను ఒప్పించి ఆన్‌లైన్‌లో వివాహం చేసుకున్నారు.
పాకిస్థాన్‌కు చెందిన అమీనాకు భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు వర్చువల్‌గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమని పాకిస్థాన్‌లో ఉన్న తమ బంధువులు ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు చెప్పారు అర్బాజ్ ఖాన్. వాస్తవానికి వివాహం భారత్‌లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయామని. అయినప్పటికీ తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ తెలిపాడు.
భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేనందునే ఈ విధంగా ఆన్‌లైన్‌లో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని అమీనాకు వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ వివాహం చేసుకుంటానని చెప్పారు అర్బాజ్. నిఖా మాత్రమే కాదు వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలను దగ్గరుండి జరిపించారు కుటుంబ సభ్యులు. అర్బాజ్ చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నది ఒకప్పటి మాట. ఈ జంటల కథలను చూస్తే సంబంధాలు మెరుగవుతున్నట్టే కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment