online marriage
-
పాక్ అమ్మాయి- భారత్ అబ్బాయి.. ఆన్లైన్లో పెళ్లి చేయించిన బీజేపీ నేత
జౌన్పూర్: భారత్-పాక్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రెండు దేశాలలోని కొందరు యువతీ యువకుల మధ్య పెళ్లి సంబంధాలు కుదురుతున్న వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. తాగా యూపీలోని జౌన్‌పూర్‌లో ఇటువంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.జౌన్‌పూర్‌కు చెందిన బీజేపీ నేత, కౌన్సిలర్ తెహసీన్ షాహిద్ ఇటీవల పాక్‌లోని లాహోర్‌లో ఉంటున్న తమ బంధువుల అమ్మాయి అందాలిప్ జహ్రాతో తన కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్ వివాహాన్ని నిశ్చయించారు. అయితే అనుకోని పరిస్థితుల్లో వారి వివాహం ఆన్లైన్లో తెహసీన్ షాహిద్ నిర్వహించాల్సి వచ్చింది. మౌల్వీ వారిద్దరి వివాహాన్ని ఆన్లైన్లో జరిపించారు. వివాహానికి వరుడి బంధువులు జౌన్‌పూర్‌కు తరలిరాగా, లాహోర్‌లో వధువు బంధువులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇరువర్గాలను వీడియో కాల్లో అనుసంధానం చేస్తూ, మౌల్వీ వారి వివాహాన్ని జరిపించారు. వధువుకు వీసా లభించాక ఆమె అత్తవారింటికి రానుంది.కాగా అందాలిప్ జహ్రాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఈ పెళ్లికోసం వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అది మంజూరు కాలేదు. దీనికి తోడు వధువు తల్లి రాణా యాస్మిన్ జైదీ అనారోగ్యంతో బాధపడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నేత తహసీన్ షాహిద్ వీడియో కాల్ సాయంతో కుమారునికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి వధువు తరపు వారు కూడా సమ్మతి తెలిపారు.ఇరువర్గాల బంధువుల సమక్షంలో ఆన్లైన్లో వరుడు మహ్మద్ అబ్బాస్ హైదర్, వధువు అందాలిప్ జహ్రాల వివాహం ఘనంగా జరిగింది. వివాహ వేదికపై ఇరువర్గాల వారు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. వివాహం అనంతరం వరుడు మహ్మద్ అబ్బాస్ హైదర్.. వధువుకు వీసా మంజూరు చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ వివాహాన్ని షియా మత గురువు మౌలానా మహఫూజూ హసన్ ఖాన్ నిర్వహించారు. ఇది కూడా చదవండి: పట్టపగలు శాస్త్రవేత్త ఇంట్లో రూ. రెండు కోట్లు దోపిడీ -
పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ
జోధ్‌పూర్: భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం మరింత బలపడింది. ఇప్పటికే సీమా హైదర్-సచిన్ మీనా, అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోగా తాజాగా అమీనా-అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటై ఈ లిస్టులో చేరిపోయారు. అయితే వీరు సాహసాలకు తెరతీయకుండా పెద్దలను ఒప్పించి ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అమీనాకు భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు వర్చువల్‌గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమని పాకిస్థాన్‌లో ఉన్న తమ బంధువులు ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు చెప్పారు అర్బాజ్ ఖాన్. వాస్తవానికి వివాహం భారత్‌లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయామని. అయినప్పటికీ తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ తెలిపాడు. భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేనందునే ఈ విధంగా ఆన్లైన్లో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని అమీనాకు వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ వివాహం చేసుకుంటానని చెప్పారు అర్బాజ్. నిఖా మాత్రమే కాదు వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలను దగ్గరుండి జరిపించారు కుటుంబ సభ్యులు. అర్బాజ్ చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నది ఒకప్పటి మాట. ఈ జంటల కథలను చూస్తే సంబంధాలు మెరుగవుతున్నట్టే కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ -
మేట్రిమొనీలో మోసం
జయపురం: ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక మోసాలు రోజురోజుకూ కొనసాగుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే స్థానిక పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై బాధిత యువతి జయపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం వెలుగు చూసింది. పట్టణంలోని లింగరాజ్నగర్కు చెందిన రాథానాథ్ రథొ కుమారుడు హరిహర రథొ తాను నాల్కో ఢిల్లీ డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌నని మేట్రిమొనీలో పరిచయం చేసుకున్నాడు. ఢిల్లీలోని నోయిడాలో నివసిస్తున్నట్లు చిరునామా ఇచ్చాడు. దీనిని విశ్వసించిన స్థానిక పారాబెడ లోని శ్రీరామనగర్‌కు రాజారాంసింగ్ పెద్ద కుమార్తె, ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారి రీతూ సింగ్ సంబంధం కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి 9న జయపురంలోని కల్యాణ మండపంలో బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే 3 నెలలైనా భర్త ఉద్యోగం విషయం, ఉంటున్న ప్రాంతంపై సంతృప్తికరమైన వివరాలు తెలియలేదు. ఈనెల 12 రాత్రి ఢిల్లీలో ఉన్న భర్తకు ఫోన్ చేసి, ఇంటి లొకేషన్ పంపించాలని కోరగా అతని నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో మేట్రిమోనీలో ఇచ్చిన వివరాలు నిజం కాదని గ్రహించిన వధువు కుటుంబ సభ్యులు గ్రహించారు. మరోవైపు అత్తమామలు, ఆడబడుచులు పదేపదే డబ్బు తీసుకు రావాలని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ మేరకు పట్టణ పోలీసు స్టేషన్లో రీతూ సింగ్ ఫిర్యాదు చేయగా, పోలీసులు హరిహర కుటుంబ సభ్యులను పిలిపించి, వివరాలు సేకరించారు. అయితే నిందితుడి ఫోన్ స్విచాఫ్ అని రావడంతో దర్యాప్తు చేపడుతున్నట్లు పట్టణ పోలీసు అధికారి సంభిత్ బెహర వెల్లడించారు. -
వినుకొండలో ఆన్లైన్ వివాహం
-
ఆన్లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి కట్టాడు
తిరువంతపురం: ఒకప్పుడు పెళ్లంటే అటేడుతరాలు, ఇటేడుతరాలు గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా వారం రోజులపాటు చేసేవారు. ఆ తర్వాత అది ఒక్కరోజుకు తగ్గినా ఖర్చు మాత్రం పెరుగుతూ వచ్చింది. బంధు బలగం సరేసరి. అయితే కరోనా వైరస్ పుణ్యమాని ఇప్పుడు పెళ్లంటే వధూవరులు కూడా పక్కన ఉండాల్సిన పని లేకుండా పోయింది. ఎవరెక్కడ ఉన్నా వారి చేతిలో ఫోన్ ఉంటే పెళ్లి చిటికెలో పని అయిపోయింది. తాజాగా ఓ జంట ఆదివారం నాడు ఫోన్లోనే పెళ్లి కానిచ్చేసింది. ఇందుకోసం కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీజిత్.. అలప్పుజాలో వధువు అంజనా బంధువు ఇంటికి వెళ్లాడు. (కలెక్టరేట్లో పెళ్లి.. వరుడి 2నెలల జీతం..) అక్కడ వధువు తండ్రి ఉండగా, పెళ్లికూతురు, ఆమె తల్లి, సోదరుడు లక్నోలో ఉన్నారు. అనుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వధూవరులిద్దరూ పెళ్లి బట్టలు ధరించి ఫోన్లో లైవ్‌లోకి వచ్చారు. వెంటనే తాళిబొట్టు చేతపట్టుకుని వరుడు ఫోన్‌కు వెనకవైపున కట్టాడు. అటు వధువు తల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. ఈ తతంగం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత రిసెప్షన్‌తో పాటు వివాహ రిజిస్ట్రేషన్ జరుపుతామని కొత్త పెళ్లికొడుకు శ్రీజిత్ వెల్లడించాడు. -
ఆన్లైన్ ప్రేమపెళ్లి మోసాలు
బొమ్మనహళ్లి: ఆన్లైన్ వివాహ సంబంధాలు యువతీ యువకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నాయి. బెంగళూరు మహా నగరంలో ఇటీవల ఇలాంటి నయ వంచన బారిన పడిన వారు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ, పరువు పోతుందనే భయంతో గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోతున్నారు. ఇటీవల ఓ టెకీ రూ.60 లక్షలు పోగొట్టుకున్నాడంటే, ఈ పెళ్లి మోసం ఎంత తారస్థాయికి చేరిందో ఊహించు కోవచ్చు. ఆన్లైన్లో ఓ మోడల్ ఫొటోను చూసి, ఆమె తనను పెళ్లి చేసుకుంటుందనే నమ్మకంతో ఆ మొత్తాన్ని సమర్పించుకున్నాడు. ఇలా మోసపోయిన వారు పోలీసులకు మౌఖికంగా తప్ప, రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం లేదు. అలా చేస్తే...సమాజంలో నగుబాట్ల పాలవుతామని, ప్రస్తుత గ్యాసిప్ లోకంలో భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటామనే భయం వారిని పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయించడం లేదు. గత ఏడాది 20 మంది మాత్రమే ఇలాంటి నయవంచన కేసుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయగలిగారు. ఈ ఏడాది ఆరు నెలల్లోనే ఆ సంఖ్య దాటిపోయింది. వాస్తవానికి ఈ మోసం బారిన పడిన వారితో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువని సైబర్ క్రైమ్ పోలీసులే అంగీకరిస్తున్నారు. ఎక్కడినుంచైనా మోసం చేయవచ్చు:... ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ మోసాలకు పాల్పడవచ్చు. మోసగాళ్లు భారతీయ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ ఉంటారు. తద్వారా నగదు బదిలీకి ఎలాంటి అవాంతరాలుండవు. బాధితులను సంప్రదించడానికి లెక్కలేనన్ని సిమ్ కార్డులు వినియోగిస్తారు. ముఠాలోని మహిళ బాధితులతో తరచూ మాట్లాడడం ద్వారా వారిలో నమ్మకం కలిగేలా చూస్తుంది. నివారణోపాయాలు:.... ఫేస్బుక్లో అపరిచిత వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులను తిరస్కరించాలి. ఏకాంత దృశ్యాలతో కూడిన ఫొటోలను ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఆన్లైన్లో సంప్రదించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు బదిలీ చేయకూడదు. బాధితులంతా యువతీ యువకులే బాధిత యువతీ యువకులు 19 నుంచి 35 ఏళ్ల వారే. ఈ మోసాలకు మూల స్థానాలు ఆఫ్రికా దేశాలు. వారంతా సాంకేతిక కోవిదులే కాకుం డా, ఎవరినైనా కబుర్లతో మెల్లగా బుట్టలో పడేసే వాక్చాతుర్యం కలిగిన వారు కూడా. ఈ మొత్తం వ్యవహారంలో ఏ సందర్భంలోనూ వారు బాధితులకు ముఖాముఖి తారసపడరు. అసలీ వ్యవహారమంతా చాలా సరళంగా సాగిపోతుందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వారు చెబు తున్న ప్రకారం...ఈ మోసాలకు పాల్పడే వారంతా ముఠాలుగా ఉంటా రు. సాధారణంగా ఒక్కో గ్యాంగులో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉం టారు. ఢిల్లీ, బిహార్, ఈశాన్య రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతీ యువకులతో ఆఫ్రికన్లు ముందుగానే ఒడంబడికలు కూడా చేసుకుని ఉంటారు. ఫేస్బుక్ లేదా వివాహ వేదికల సైట్లలో బాధితులను ఎంచుకుంటారు. బాధితుల్లో ఆర్థికంగా బాగా ఉన్న వారిని ఎంచుకుని చాటింగ్ మొదలెడతారు. వీరిలో కూడా బాగా భావోద్వేగానికి లోనయ్యే వారిని చూసుకుని, డబ్బులు గుంజు కోవడం ప్రారంభిస్తారు. ఈ డబ్బులు లాక్కోవడంలో నమ్మదగిన కట్టు కథలు చెబుతారు. తీరా డబ్బులు తమ ఖాతాల్లోకి పడ్డాక, ఆ గ్యాంగు పత్తా లేకుండా పోతుంది. అప్పటికి కానీ బాధితునికి జ్ఞానోదయం కాదు. అప్పటికే బ్యాంకు ఖాతాలు కనీస నగదు నిల్వలతో వెక్కిరిస్తూ ఉంటాయి. మోసపోయిన వెంటనే బాధితులు తమను సంప్రదిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బాగా కాలయాపన చేసి తమ వద్దకు రావడం వల్ల మోసగాళ్లను పట్టుకోలేమని తెలిపారు. బాధితుల్లో చాలా మంది అవతలి వ్యక్తుల సంభాషణలను నిజమేనని భావించి, ప్రేమ అనే ఊహా లోకాల్లో విహరిస్తూ ఉంటారని చెప్పారు. వారెంత గుడ్డిగా మోస పోతారంటే...చాటింగ్ సాగిస్తున్న అవతలి వ్యక్తులు, ఫొటోల్లో తాము చూస్తున్న వారు వేర్వేరనే వాస్తవాన్ని ఏ సందర్భంలోనూ గుర్తించలేరని వివరించారు. ఈ మోసాలు ఎలా ఉంటాయంటే... సైబర్ పోలీసులు చెబుతున్న ప్రకారం.. ఒక పురుషుడు, స్త్రీ పేరు చెప్పుకుంటూ అవతలి పురుషునితో చాటింగ్ ప్రారంభిస్తాడు. ఓ ఫేస్బుక్ యూజర్ ప్రొఫైల్ పిక్చర్‌ను ఉయోగించి బాధితుని వలలో వేసుకుంటాడు. సంభాషణలు చాలా శృంగారభరితంగా సాగుతాయి. ఇదే సమయంలో మార్ఫింగ్ ఫొటోలతో బాధితుని నమ్మించి, అతని ఏకాంత దృశ్యాల చిత్రాలను తీసుకుంటాడు. ఇక అంతే...డబ్బులు గుంజుకోవడం ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు, మరో మహిళతో వివాహ వేదిక సైట్లో సంప్రదిస్తాడు. చాటింగ్ కూడా మొదలవుతుంది. తాను విదేశాల్లో ఉంటానని, కళ్లు చెదిరే సంపాదన అని నమ్మబలుకుతాడు. ఎట్టకేలకు అతనితో వివాహానికి మహిళ సమ్మతిస్తుంది. ముహూర్తం తేదీ కూడా ఖరారవుతుంది. పెళ్లికి కొద్ది రోజుల ముందు అతను ఆమెను ఫోనులో సంప్రదిస్తాడు. కస్టమ్స్‌లో దొరికిపోయానని, బయట పడడానికి కొన్ని లక్షలు అవసరమవుతాయని చెబుతాడు. కాబోయే వధువు వెంటనే తన బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేస్తుంది. డేటింగ్ సైట్లలో సంప్రదింపులు సాగించే జంట తక్కువ సమయంలోనే చాలా దగ్గరైపోతారు. విదేశాల నుంచి తానో కానుక పంపానని, అయితే అది కస్టమ్స్ అధికారుల వద్ద చిక్కుకుందని అతను ఆమెకు ఫోన్ ద్వారా తెలియజేస్తాడు. విమానాశ్రయంలో తమ మనిషి ఉంటాడని, అతనికి డబ్బు చెల్లిస్తే కానుకను విడిపించుకుని ఇస్తాడని నమ్మబలుకుతాడు. విమానాశ్రయంలో ముఠాకు చెందిన వ్యక్తి ఉంటాడు. అతను బాధిత మహిళ వద్ద డబ్బు తీసుకుని, తర్వాత కనబడడు. -
పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా?
-
పెళ్లికొడుకు లేకపోతే.. పెళ్లి ఆగాలా?
కేరళలో చాలా విచిత్రమైన పెళ్లి ఒకటి జరిగింది. కొల్లాం జిల్లాలోని వెలియం ప్రాంతానికి చెందిన హ్యారిస్ అనే యువకుడు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తాడు. అతడి పెళ్లికి ముహూర్తం అయితే కుదిరింది గానీ, ఆ సమయానికి సెలవులు మాత్రం లభించలేదు. దాంతో.. ఆన్లైన్లోనే అతగాడు పెళ్లి చేసేసుకున్నాడు! పెళ్లికూతురు శ్యామలకు పెళ్లికొడుకు హ్యారిస్ అక్క తాళి కట్టగా, ఈ తతంగం అంతటినీ అతడు ఓ వెబ్‌క్యామ్ ద్వారా లైవ్‌లో చూశాడు. ఈ పెళ్లి అళప్పుళ జిల్లాలోని తామరకులం నగరంలో జరిగింది. చాలా ముందుగానే ముహర్తం పెట్టుకున్నా కూడా.. పెళ్లి రోజు హ్యారిస్‌కు సెలవు మాత్రం దొరకలేదు. అయితే, చాలామంది ఇలా పెళ్లి చేసుకుంటామని చెప్పి చివరి నిమిషంలో ఏదో ఒక వంకతో తప్పించుకోవడం ఇంతకుముందు కేరళలో చాలా సందర్భాల్లో జరిగింది. దాంతో అతడు ఎందుకు రాలేదని కూడా పెద్ద చర్చగా మారింది. కానీ.. పెళ్లికొడుకు రానంత మాత్రాన పెళ్లి జరగకుండా పోదని అతడి తరఫు బంధువులు చెప్పారు. హారిస్ సోదరి నజిత అతడి తరఫున పెళ్లికూతురు మెడలో తాళికట్టింది. ఎటూ ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారు కాబట్టి అసలు మొగుడికి బదులు ఈ అర్ధమొగుడు కట్టినా పర్వాలేదని శ్యామల సరేనంది. దీన్నంతటినీ హ్యారిస్ సౌదీ అరేబియా నుంచి లైవ్‌లో చూశాడు. రియాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో అతడు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తాడు. శ్యామల మక్కాలో ఒక ప్రభుత్వాస్పత్రిలో నర్సు. వీళ్లిద్దరూ దగ్గర లేకుండానే మొత్తానికి పెళ్లి మాత్రం అయిపోయింది.