జౌన్‌పూర్: భారత్-పాక్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రెండు దేశాలలోని కొందరు యువతీ యువకుల మధ్య పెళ్లి సంబంధాలు కుదురుతున్న వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. తాగా యూపీలోని జౌన్‌పూర్‌లో ఇటువంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
జౌన్‌పూర్‌కు చెందిన బీజేపీ నేత, కౌన్సిలర్ తెహసీన్ షాహిద్ ఇటీవల పాక్‌లోని లాహోర్‌లో ఉంటున్న తమ బంధువుల అమ్మాయి అందాలిప్ జహ్రాతో తన కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్ వివాహాన్ని నిశ్చయించారు. అయితే అనుకోని పరిస్థితుల్లో వారి వివాహం ఆన్‌లైన్‌లో తెహసీన్ షాహిద్ నిర్వహించాల్సి వచ్చింది. మౌల్వీ వారిద్దరి వివాహాన్ని ఆన్‌లైన్‌లో జరిపించారు. వివాహానికి వరుడి బంధువులు జౌన్‌పూర్‌కు తరలిరాగా, లాహోర్‌లో వధువు బంధువులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇరువర్గాలను వీడియో కాల్‌లో అనుసంధానం చేస్తూ, మౌల్వీ వారి వివాహాన్ని జరిపించారు. వధువుకు వీసా లభించాక ఆమె అత్తవారింటికి రానుంది.
కాగా అందాలిప్ జహ్రాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఈ పెళ్లికోసం వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అది మంజూరు కాలేదు. దీనికి తోడు వధువు తల్లి రాణా యాస్మిన్ జైదీ అనారోగ్యంతో బాధపడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నేత తహసీన్ షాహిద్ వీడియో కాల్ సాయంతో కుమారునికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి వధువు తరపు వారు కూడా సమ్మతి తెలిపారు.
ఇరువర్గాల బంధువుల సమక్షంలో ఆన్‌లైన్‌లో వరుడు మహ్మద్ అబ్బాస్ హైదర్, వధువు అందాలిప్ జహ్రాల వివాహం ఘనంగా జరిగింది. వివాహ వేదికపై ఇరువర్గాల వారు భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. వివాహం అనంతరం వరుడు మహ్మద్ అబ్బాస్ హైదర్.. వధువుకు వీసా మంజూరు చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ వివాహాన్ని షియా మత గురువు మౌలానా మహఫూజూ హసన్ ఖాన్ నిర్వహించారు.
ఇది కూడా చదవండి: పట్టపగలు శాస్త్రవేత్త ఇంట్లో రూ. రెండు కోట్లు దోపిడీ
Comments
Please login to add a commentAdd a comment