
గుండె ఆగినంత పనైంది!
కళ్ల ముందే క్రూర జంతువు కంట పడితే ఎవరికైనా గుండె ఆగినంత పనౌతుంది. ఎక్కడి నుంచో అమాంతంగా వన్య మృగం మన ముందు ఉరికితే పైన ప్రాణాలు పైనే పోతాయి. ఊహించడానికే భయంగా ఉన్న ఇలాంటి అనుభవమే రష్యాలో ఇద్దరు మోటార్ సైక్లిస్టులకు ఎదురైంది. ఎలుగుబంటి దాడి నుంచి వీరిద్దరూ తృటిలో తప్పించుకున్నారు. ఇర్ కట్క్స్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలుకూ ఫొటోలు బయటకు వచ్చాయి.
ఇద్దరు మోటార్ సైక్లిస్టులు ఒక దారిలో వెళుతుండగా అమాంతంగా ఒక ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దాన్ని చూసి ఇద్దరు బైకర్లలో ఒకరు వెంటనే ఆగిపోయారు. మరోవ్యక్తి ఆగేలోగా బైకు ముందు నుంచి ఎలుగుబంటి పరిగెత్తుకుంటా వెళ్లిపోయింది. ఎలుగుబంటి తమపై ఎక్కడ దాడి చేస్తోందనని భయపడి అప్పటివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మోటార్ సైక్లిస్టులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
రష్యాలో ఎలుగుబంటి దాడులు సర్వసాధారణంగా మారాయి. ఆహార లభ్యత తగ్గిపోవడంతో ఎలుగుబంట్లు తరచుగా అటవీ సమీప ప్రాంతాలోకి చొచ్చుకు వస్తున్నాయి. జనంపై దాడులు చేస్తున్నాయి. లచిగొర్క్సీ ప్రాంతంలో గత ఆగస్టులో ఎలుగు బంటి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జవాసాల్లోకి చొచ్చుకు వస్తున్న వన్య మృగాలను వేటాడి చంపుతుండడంతో వాటి సంఖ్య తగ్గుతోంది. ఇర్ కట్క్స్ ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో 1968 నుంచి 270 ఎలుగుబంట్లను చంపినట్టు రికార్డులు చెబుతున్నాయి.