చలికాలం కాస్త 'చుక్కేస్తే' వెచ్చగా ఉంటుందని భావించిందో ఏమో ఓ బుజ్జి ఎలుగుబంటి పిల్ల. ఏకంగా ఓ ఇంటి కిచెన్ నుంచి వైన్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. అక్కడ ఆ ఇంటి ఆసామి కనపడటంతో.. పక్కనే ఉన్న కిటికీలోంచి దూకి పారిపోదామని ప్రయత్నించింది. కానీ కిటికీలో ఇరుక్కుపోయింది.
బయట పడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయితే ఈ బుల్లి ఎలుగొడ్డును కిటికీలో నుంచి తప్పించేందుకు ఎవరూ సాహసించలేదు. చివరకు ఎలాగోలా తంటాలు పడి.. ఎలుగు కిటికీలోంచి దూకి అడవిలోకి పారిపోయింది.
అచ్చం టెలివిజన్ షో 'విన్ని ది ఫూ' లో ఎలుగు పిల్ల ఎపిసోడ్లాగా సాగిన.. ఈ వీడియోని ఇంటి యజమాని తన సెల్ ఫోన్లో బంధించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తాజాగా ఈ వీడియో రష్యన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్గా మారింది.
అయితే.. ఎలుగు అవస్థ చూసి తాము సాయం చేద్దామనుకున్నామని.. కానీ.చిన్ని ఎలుగు పిల్ల కూడా చాలా ప్రమాదకరమని.. ఇంటి యజమాని ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. తూర్పు రష్యా అటవీ అధికారులు కూడా 'ఇంటి యజమాని ఎలుగు దగ్గరికి పోకుండా మంచి పని చేశాడు. ఎలుగులు ఎప్పుడూ ప్రమాదకరమైనవే అంటూ' ట్విట్ చేశారు.
'చుక్క' కోసం వచ్చి ఇరుక్కుపోయింది
Published Mon, Oct 19 2015 10:05 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM
Advertisement
Advertisement