బాలీవుడ్ నటి, మనీషా కొయిరాలా బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లోనే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించింది. నేపాల్‌లోని ఖాఠ్మండులో జన్మించిన మనీషా కొయిరాలా.. 1991లో సుభాష్ ఘై చిత్రం సౌదాగర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకుముందే 1989లో ఫేరి భతౌలా అనే నేపాలీ చిత్రంలో నటించింది.
(ఇది చదవండి: 7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్)
అప్పటి నుంచి ఆమె కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఆమె నటించిన బొంబాయి చిత్రంలో అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో నాగార్జున సరసన క్రిమినల్, అర్జున్‌తో ఒకే ఒక్కడు, నగరం, భారతీయుడు, బూచి, లేడీ టైగర్, నోటుకు పోటు లాంటి చిత్రాల్లో కనిపించింది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన షెహాజాదాలో హీరోకు తల్లిపాత్రలో నటించింది.
అయితే మనీషా కొయిరాల ఎంత త్వరగా గొప్ప పేరు తెచ్చుకుందో.. ఆమె కెరీర్ కూడా అంతే వేగంగా పతనమైంది. ఆ తర్వాత అప్పట్లో ఆమె నేపాల్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పట్లో ఆమె మద్యానికి కూడా బానిసైంది. గతంలో మనీషా మద్యం సేవించిన ఓ వీడియో నెట్టింట్లో కనిపించింది. ఆ వీడియోలో మద్యం మత్తులో ఉన్న మనీషా కొయిరాలాను మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండగా వద్దని వేడుకుంది. మద్యానికి బానిస కావడం పట్ల మనీషా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మద్యపానం వల్ల జీవితంలో కష్టాలు పడ్డానని తెలిపింది.
మనీషా కొయిరాలా మాట్లాడుతూ.. 'మద్యం నా జీవితంలోకి వచ్చాక పరిస్థితి అంతా తలకిందులైంది. నా జీవితం ఇంతలా మారతుందనినేను గ్రహించలేదు. అప్పుడు చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. మనం మద్యం తాగడం ప్రారంభిస్తే దానివల్ల సమస్యలు పరిష్కారం కావు. జీవితంలో అది మన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మద్యం తాగుతారు. మా నాన్న కొన్నిసార్లు తాగేవారు. కానీ మన పరిస్థితులను అర్థం చేసుకుని మెలగాలి. అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది.' అని అన్నారు. కాగా.. 2010లో మనీషా తన తోటి నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లాడింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు.
(ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్)
Comments
Please login to add a commentAdd a comment