1980ల్లో స్టార్‌ హీరోయిన్‌.. మద్యానికి బానిసై కెరీర్‌ నాశనం! | Manisha Koirala Shares Adorable Pic In With Her parents Goes Viral | Sakshi
Sakshi News home page

సినిమాల్లో సక్సెస్.. నిజ జీవితంలో ఓడిపోయిన స్టార్ హీరోయిన్‌!

Published Sat, Sep 2 2023 8:15 PM | Last Updated on Sat, Sep 2 2023 8:56 PM

Manisha Koirala Shares Adorable Pic In With Her parents Goes Viral - Sakshi

మనీషా కొయిరాలా ఈ పేరు తెలుగువారికి సైతం పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే నెల్లూరి నెరజాణ' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.  మనీషా కొయిరాలా ఒకప్పుడు తిరుగులేని అందం, అభినయం ఆమె సొంతం. బాలీవుడ్ సినీ ప్రపంచంలో మనీషాకు సరితూగే నటి అప్పట్లో మరొకరు లేరనే చెప్పాలి. బాంబే, ఇండియన్ వంటి చిత్రాలతో తమిళంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న భామ మనీషా కొయిరాలా.

మనీషా నేపాల్‌లోని కొయిరాలా సంపన్న కుటుంబంలోనే జన్మించింది.నేపాల్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ప్రధాని మనవరాలు మనీషా. అక్కడ రాజకీయ పరిస్థితులు దిగజారడంతో మనీషా తల్లిదండ్రులు వారణాసిలో స్థిరపడ్డారు. అయితే పదో తరగతి తర్వాత నేపాల్‌కు తిరిగి వచ్చిన మనీషా కొయిరాలా ఓని అనే నేపాలీ చిత్రం ద్వారా నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మోడలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. అలా హిందీ సినిమాల్లో అవకాశం వచ్చింది. 

(ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!)

పెళ్లయిన రెండేళ్లకే విడాకులు

సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఆమెకు పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది. నేపాల్‌కి చెందిన సమ్రాట్‌ దహల్‌తో 2010లో వివాహం జరగగా.. పెళ్లైన ఆరు నెలలకే వీరిమధ్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నాను. కానీ ఆర్నెళ్లకే మాకు గొడవలు ప్రారంభమయ్యాయి.తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడంటూ గతంలో ఓ ఇంటర్వూలో వెల్లడించింది. అయితే తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్యాక్‌ టూ ఖాఠ్మండు అంటూ తల్లిదండ్రులతో విమానంలో వెళ్తున్న ఫోటోలు పంచుకుంది. ఇది చూసిన ఆమె అభిమానులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలా మారిపోయారేంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు.  

మద్యానికి బానిసై..

సినిమాల్లోకి వచ్చాక మానసిక ఒత్తిడికి గురై మద్యానికి బానిసగా మారింది మనీషా. దీనికి తోడు ఆమె పెళ్లి, విడాకులతో మరింత డిప్రెషన్‌కు గురైంది. ఆ తర్వాత తాగడం మొదలుపెట్టిన మనీషా కొయిరాలా ప్రవర్తన అంతా మారిపోయింది. పార్టీలు, మద్యపానం తన జీవితంలో భాగమైపోయాయని మనీషా కొయిరాలా స్వయంగా తానే చెప్పుకొచ్చింది. 

క్యాన్సర్‌తో పోరాటం

మనీషా కొయిరాలా అంటే స్టార్‌ హీరోయిన్‌ అని మాత్రమే తెలుసు. కానీ ఆమె కలర్‌ఫుల్ కెరీర్ పక్కనపెడితే.. క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచింది. విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే మనీషా గర్భాశయ క్యాన్సర్‌ చివరి దశలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆమె జీవితం ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ క్యాన్సర్‌ను జయించి పోరాట యోధురాలిగా నిలిచింది. ఈ పోరాటం కొత్త జీవితాన్ని ఇచ్చిందని మనీషా కొయిరాలా తన ఆత్మకథ హీల్డ్ పుస్తకంలో ప్రస్తావించింది. ఆ తర్వాతే మనీషాకు జీవనశైలి, అలవాట్లే క్యాన్సర్‌కు కారణమని తెలిసింది. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement