ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా. 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండిలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా తన కెరీర్‌లో ఎదురైన పలు సంఘటలను గుర్తు చేసుకుంది. 90వ దశకంలో బాలీవుడ్‌లో మహిళా నటులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించింది. ఒక ఫోటోగ్రాఫర్‌తో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది.
మనీషా మాట్లాడుతూ.. 'నా కెరీర్‌లో ప్రారంభంలో నన్ను చాలామంది ఫోటోషూట్‌లు అడిగేవారు. ఒకసారి నేను అమ్మతో కలిసి ఫోటోషూట్‌కు వెళ్లాను. అక్కడే ప్రముఖ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. అతను నువ్వే తర్వాతి సూపర్‌స్టార్ అని నాతో అన్నాడు. ఆ తర్వాత అతను నా దగ్గరకు రెండు పీసుల బికినీ తెచ్చి ధరించమని అడిగాడు. అప్పుడు నేను బీచ్‌కి వెళ్లినప్పుడు, ఈత కొట్టేటప్పుడు మాత్రమే ఇది వేసుకుంటాను. కానీ ఇలాంటి వాటితో సినిమాల్లోకి రావాలనుకోవడం నాకు ఇష్టం లేదు. దీంతో బికినీ ధరించను అని చెప్పా. పూర్తి దుస్తులతోనే ఫోటోలు తీయమని సూచించా. ఆ తర్వాత అతను నాకు ఓ డైలాగ్ చెప్పాడు. నేను పెద్దస్టార్ అయ్యాక తానే నా ఫోటోలు తీసేందుకు వచ్చాడు' అని వెల్లడించారు.
కాగా.. మనీషా మొదట నేపాలీ చిత్రం ఫెరి భేతౌలాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ధన్వన్ , 1942: ఎ లవ్ స్టోరీ, బాంబే , అగ్ని సాక్షి , గుప్త, ది హిడెన్ ట్రూత్, దిల్ సే లాంటి చిత్రాలలో నటించింది. అయితే కొన్నేళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్న మనీషా లస్ట్ స్టోరీస్ (2018)తో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది విడుదలైన షెహజాదా (2023) చిత్రంలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment