ఉత్తర కొరియా దేశం కరువుతో అల్లాడుతోంది. ఆహార కొరతతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్లాడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన లగ్జరీ జీవితాన్ని వదులుకోవడం లేదు. ఉత్తర కొరియా నియంత విందులు, విలాసాలకు కోట్లలో డబ్బులు వెచ్చిస్తున్నాడు. దేశ పరిస్థితిని పట్టించుకోకుండా ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆస్వాదిస్తున్నాడు.
రూ. 5 లక్షల విలువ చేసే మద్యం
ఈ మేరకు అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు డైలీ స్టార్ పత్రికకు వెల్లడించారు. కిమ్ అత్యంత ఖరీధైన మద్యాన్ని తాగుతాడని ఆయన తెలిపారు. దాదాపు 7 వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 లక్షలకు పైగా) విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని సేవిస్తాడని పేర్కొన్నారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ప్రతి ఏడాది 30 మలియన్ డాలర్లు (రూ.247 కోట్లు) ఖర్చుపెడతారని వెల్లడించారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్ అడ్మిన్‌స్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిర్గతం చేసినట్లు తెలిపారు.
బంగారపు రేకుతో చుట్టిన సిగరెట్లు
కేవలం మద్యం మాత్రమే కాకుండా అత్యంత నాణ్యత, అరుదుగా దొరికే ప్రత్యేక ఆహారాన్ని కిమ్ తీసుకుంటారు. ఇటలీలోని పర్మా ప్రాంతంలో లభించే పర్మా హామ్(పోర్క్‌తో తయారు చేసేది), స్విస్ చీజ్‌ను దిగుమతి చేసుకుంటారు. ఆయన తాగే ఖరీదైన సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు.
చదవండి: ఉత్తర కొరియా కిమ్ జోంగ్‌కు ఇన్సోమ్నియా డిజార్డర్!.. 140 కేజీల బరువు!!
పిజ్జాల కోసం ఇటలీ నుంచి చెఫ్
కిమ్‌కు జంక్ ఫుడ్ అన్న అమిత ఇష్టం. 1997లో కిమ్ కేవలు పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుండి ఖరీదైన చెఫ్‌ను రప్పించుకున్నాడు. తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి సంవత్సరం 9.6 లక్షల డాలర్లను(రూ.7 కోట్ల 96 లక్షలు) వెచ్చిస్తున్నారు. కిమ్, అతని తండ్రి కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం కోబ్ స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్‌తో భోజనం చేసేవారు. ఈ విషయాన్ని కిమ్ వద్ద గతంలో చెఫ్‌గా చేసిన ఒకరు పేర్కొన్నారు.
స్నేక్ వైన్
యూకే మెట్రో రిపోర్ట్ ప్రకారం.. 2014లో కిమ్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడట. అయితే ఉత్తర కొరియా నియంత విపరీతమైన మద్యపానం, ధూమపానం చేస్తున్నాడని, అతని బరువు 300 పౌండ్లు (136 కిలోలు) మించిపోయిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన ఫుడ్ డైట్ విషయం వెలుగులోకి వచ్చింది.
నార్త్ కొరియా నియంత యూఎస్‌ఏ నుంచి మార్ల్‌బోరో సిగరెట్‌లతో సహా, నిద్రలేమికి చికిత్సకు ఉపయోగించే జోల్‌పిడెమ్ వంటి మందులను కూడా దిగుమతి చేసుకుంటున్నారని సదరు నివేదిక పేర్కొంది.
మరోవైపు ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. అదే విధంగా పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది.
చదవండి: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment