
సియోల్: రోజంతా మద్యం తాగడం వంటి అనారోగ్యకర ఆహార అలవాట్ల కారణంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే 39వ బర్త్‌డే జరుపుకున్న కిమ్‌కు.. వయస్సు మీదపడుతుందనే బెంగ ఎక్కువైనట్లుగా ఉందని దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో ఉంటున్న ఉత్తర కొరియా విద్యావేత్త డాక్టర్ చొయ్ జిన్‌వూక్ అంటున్నారు.
ఒంటరితనంతో బాధపడుతున్న కిమ్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అతిగా తాగి ఏడుస్తూ కాలం గడుపుతున్నారని చెబుతున్నారు. అనారోగ్య వివరాలు ఎక్కడ బయటకు పొక్కుతాయో అనే భయంతో కిమ్ పర్యటనల సమయంలో సొంత టాయిలెట్‌ను కూడా తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. తాగుడు తగ్గించి, రోజూ సమయం వ్యాయామం చేయాలని భార్య, వైద్యులు సలహాలిచ్చినా పట్టించుకోవడం లేదని మిర్రర్ పత్రిక కథనం పేర్కొంది.