luxurious life
-
Kim Jong Un: ఓ వైపు ఆహార సంక్షోభం.. కిమ్ విందు, విలాసాలకు కోట్లు!
ఉత్తర కొరియా దేశం కరువుతో అల్లాడుతోంది. ఆహార కొరతతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్లాడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన లగ్జరీ జీవితాన్ని వదులుకోవడం లేదు. ఉత్తర కొరియా నియంత విందులు, విలాసాలకు కోట్లలో డబ్బులు వెచ్చిస్తున్నాడు. దేశ పరిస్థితిని పట్టించుకోకుండా ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆస్వాదిస్తున్నాడు. రూ. 5 లక్షల విలువ చేసే మద్యం ఈ మేరకు అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు డైలీ స్టార్ పత్రికకు వెల్లడించారు. కిమ్ అత్యంత ఖరీధైన మద్యాన్ని తాగుతాడని ఆయన తెలిపారు. దాదాపు 7 వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 లక్షలకు పైగా) విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని సేవిస్తాడని పేర్కొన్నారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ప్రతి ఏడాది 30 మలియన్ డాలర్లు (రూ.247 కోట్లు) ఖర్చుపెడతారని వెల్లడించారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్ అడ్మిన్‌స్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిర్గతం చేసినట్లు తెలిపారు. బంగారపు రేకుతో చుట్టిన సిగరెట్లు కేవలం మద్యం మాత్రమే కాకుండా అత్యంత నాణ్యత, అరుదుగా దొరికే ప్రత్యేక ఆహారాన్ని కిమ్ తీసుకుంటారు. ఇటలీలోని పర్మా ప్రాంతంలో లభించే పర్మా హామ్(పోర్క్‌తో తయారు చేసేది), స్విస్ చీజ్‌ను దిగుమతి చేసుకుంటారు. ఆయన తాగే ఖరీదైన సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు. చదవండి: ఉత్తర కొరియా కిమ్ జోంగ్కు ఇన్సోమ్నియా డిజార్డర్!.. 140 కేజీల బరువు!! పిజ్జాల కోసం ఇటలీ నుంచి చెఫ్ కిమ్‌కు జంక్ ఫుడ్ అన్న అమిత ఇష్టం. 1997లో కిమ్ కేవలు పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుండి ఖరీదైన చెఫ్‌ను రప్పించుకున్నాడు. తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి సంవత్సరం 9.6 లక్షల డాలర్లను(రూ.7 కోట్ల 96 లక్షలు) వెచ్చిస్తున్నారు. కిమ్, అతని తండ్రి కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం కోబ్ స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్‌తో భోజనం చేసేవారు. ఈ విషయాన్ని కిమ్ వద్ద గతంలో చెఫ్‌గా చేసిన ఒకరు పేర్కొన్నారు. స్నేక్ వైన్ యూకే మెట్రో రిపోర్ట్ ప్రకారం.. 2014లో కిమ్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడట. అయితే ఉత్తర కొరియా నియంత విపరీతమైన మద్యపానం, ధూమపానం చేస్తున్నాడని, అతని బరువు 300 పౌండ్లు (136 కిలోలు) మించిపోయిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన ఫుడ్ డైట్ విషయం వెలుగులోకి వచ్చింది. నార్త్ కొరియా నియంత యూఎస్ఏ నుంచి మార్ల్బోరో సిగరెట్లతో సహా, నిద్రలేమికి చికిత్సకు ఉపయోగించే జోల్పిడెమ్ వంటి మందులను కూడా దిగుమతి చేసుకుంటున్నారని సదరు నివేదిక పేర్కొంది. మరోవైపు ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. అదే విధంగా పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. చదవండి: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..! -
జైల్లో సుకేష్ చంద్రశేఖర్ లగ్జరీ లైఫ్
-
కిమ్‌కి అంత భయమా?.. ట్రంప్‌ని మించి పోయాడు!
వాషింగ్టన్: ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీరు గురించి, ఆయన పాలనా విధానాల గురించి, చివరాఖరికి ఆరోగ్యం గురించి కూడా ప్రపంచం బోలెడంత చర్చించుకుంటోంది. కానీ, ఎందుకనో వ్యక్తిగత విషయాలు మాత్రం పెద్దగా వెలుగులోకి రావు. అంతలా రహస్య జీవనం కొనసాగిస్తోంది ఆయన కుటుంబం. అయితే.. తాజాగా ఆయన తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కిమ్ జోంగ్ ఉన్ తన కూతురితో గత వారం జరిగిన ఓ క్షిపణి పరీక్షకు హాజరు కావడం.. ఆమె చేతి పట్టుకుని కలియదిరగడం.. టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. అయితే.. ఆమె వివరాలపై ఇప్పుడు న్యూయార్క్ పోస్ట్ కథనం స్పష్టత ఇచ్చే యత్నం చేసింది. ► కిమ్ జోంగ్ కూతురి పేరు జు ఏ. వయసు తొమ్మిదేళ్లు. కాంగ్వాన్ ప్రావిన్స్‌లోని వోన్సన్ దగ్గర ఓ విలాసవంతమైన విల్లాలో ఆమె ఉంటోంది. ఆ విల్లా.. ప్రపంచంలో అత్యంత లగ్జరీ రిసార్ట్‌లలో ఒకటిగా పేరున్న మార్-ఎ-లాగో(డొనాల్డ్ ట్రంప్ ఓనర్) తరహాలోనే ఉంటుందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ► ఉత్తర కొరియాలో అత్యంత ధనిక కుటుంబం కిమ్ జోంగ్ ఉన్దే. ఆ దేశవ్యాప్తంగా కిమ్ కుటుంబానికి పదిహేను మాన్షన్స్ ఉన్నాయని తెలుస్తోంది. దేశం ఆర్థికంగా చితికిపోయినప్పటికీ.. తన విలాసాల విషయంలో కిమ్ కాంప్రమైజ్ కాడు. ఆహారం దగ్గరి నుంచి ప్రతీ దాంట్లోనూ దర్పం ప్రదర్శిస్తుంటాడు. ► అంతేకాదు.. ఆయా భవనాల్లో భారీ స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు, ఫుట్‌బాల్ మైదానాలు, వాటర్‌స్లైడ్స్, స్పోర్ట్స్ స్టేడియం.. ఇలా ఎన్నో హంగులు ఉన్నాయని పేర్కొంది. ఇవిగాక.. ► తన కుటుంబం గురించి ఎలాంటి సమాచారం మీడియాకు చిక్కడానికి వీల్లేదనే ఆంక్షలు కఠినంగా అమలు చేసేవాడు. గతంలో తన కుటుంబం వివరాలను దక్షిణ కొరియాకు సమర్పించిన ఇద్దరు అధికారులను.. నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపినట్లు ఒక ప్రచారం ఉంది. ► బహుశా.. ప్రపంచంలో ఎవరికీ లేనంత గోప్యత కిమ్ జోంగ్ ఉన్, ఆయన కుటుంబ విషయంలోనే ఉండొచ్చని న్యూయార్క్ పోస్ట్ అభిప్రాయపడింది. ► ఆ కుటుంబ ప్రయాణాలు.. రహస్యంగా జరుగుతాయి. దాదాపుగా అండర్‌గ్రౌండ్ నెట్వర్క్ ద్వారానే జరుగుతుందని, ఈ సొరంగాల గుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైల్వే నెట్వర్క్ మార్గాల్లో కిమ్ సైతం ప్రయాణిస్తుంటారని తెలిపింది. తద్వారా శత్రు సైన్యాల దాడుల నుంచి తప్పించుకోవడంతో పాటు విదేశీ నిఘా సంస్థల రాడార్లకు చిక్కకుండా జాగ్రత్త పడతారని తెలిపింది. ► కిమ్ దేశంలో కెల్లా తానే ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఇందుకోసం సుప్రీం అనే హోదాను అడ్డుపెట్టుకుని.. ప్రజల్ని, ముఖ్యంగా యువతను నియంత్రిస్తూ ముందుకు వెళ్తున్నారు. ► పాశ్చాత్య సంస్కృతి తన దేశంలో మనుగడలో ఉండకూడదనేది కిమ్ ఉద్దేశం. అందుకే అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై నిషేధం విధించారు. కాదని ఉల్లంఘిస్తే.. బానిస శిక్షలు అమలు అవుతుంటాయి. పొరుగున ఉండే దక్షిణ కొరియా కల్చర్ కనీసం.. మచ్చుకు కూడా కనిపించదు!. ► కిమ్ తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి పెద్దగా ప్రదర్శించింది లేదు. ఆయన భార్య రి సోల్ జూ కూడా చాలా అరుదుగా మీడియా కంటపడుతుంటారు. మరోవైపు కిమ్ వారసత్వం బాధ్యతలు పుచ్చుకునేది ఎవరనే చర్చ.. అప్పుడప్పుడు కొరియన్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. సోదరి మాత్రం అధికారికంగానే కీలక పదవిలో ఉంటూ.. నిత్యం మీడియాలో కనిపిస్తూ.. అమెరికా, దక్షిణ కొరియా వ్యతిరేక ప్రకటనలూ జారీ చేస్తుంటుంది. -
తీహార్ జైల్లో 5 స్టార్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్
-
ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు..
Tamannaah Bhatia Has Expensive Diamond: 'హ్యపీ డేస్' సినిమాతో తెలుగు తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ సినిమాలో తన అందం, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 ఏళ్ల అవుతున్నా ఈ ముంబై భామ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'ఎఫ్-3' మూవీతో సూపర్ హిట్ కొట్టింది. త్వరలో 'గుర్తుందా శీతకాలం'తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవి సరసన 'భోళా శంకర్' చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 50కిపైగా చిత్రాల్లో నటించిన తమన్నా పర్సనల్ లైఫ్‌ను కూడా లగ్జరీతో ఎంజాయ్ చేస్తోంది. సుమారు రూ. 150 కోట్లకుపైగా ఆస్తిని కూడగట్టిన ఈ మిల్కీ బ్యూటీ వద్ద ఖరీదైన కార్లు, ఇళ్లు, ఆభరణాలు వంటి తదితర విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అయితే తమన్నా వద్ద ఉన్న ఒక వస్తువు గురించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలేనే 5వ అతిపెద్ద వజ్రం తమన్నా దగ్గర ఉండటం. సుమారు రూ. 2 కోట్ల విలువైన ఈ వజ్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? ఇదిలా ఉంటే తమన్నా ఆస్తుల విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మకు ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ. 16.60 కోట్ల అపార్ట్మెంట్ ఉందట. దీని విస్తీర్ణం 80, 778 చదరపు అడుగులు ఉంటుందని టాక్. రూ. 1.02 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జి ఎల్, రూ. 75.59 లక్షల ఖరీదుగల ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ. 43.50 లక్షల బీఎండబ్ల్యూ 320 ఐ, , రూ. 29.96 లక్షల మిత్సుబిషి పేజర్ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని సమాచారం. -
రెండో పెళ్లి.. భార్య విలాసాలు తీర్చలేక..
యశవంతపుర (కర్ణాటక): భార్య విలాసాలు తీర్చలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు బసవేశ్వర పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బాషా(31) ఉస్నా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భిణి. పట్టుచీరెలు, నగలు కొనివ్వాలని పదే పదే కోరేది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగేది. మానసిక ఒత్తిడితో బాషా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (బుద్ది తెలుసుకొని ఉన్న ఉద్యోగం పీకేశారు.. మళ్లీ నగ్నఫొటోలు, వీడియోలు..) -
ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి..
సాక్షి, హైదరాబాద్: అతను ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడిన అతడికి వైద్యం చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టాడు.. రాత్రి వేళల్లో ల్యాప్‌టాప్‌తో బస్సుల్లో ప్రయాణించే వారినే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని పనామా క్రాస్‌రోడ్‌లో ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని ఎల్బీనగర్ సీసీఎస్ ఏసీపీ క్రైమ్ ఆర్.శేఖర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 16 ల్యాప్‌టాప్‌లు, 5 సెల్ఫోన్లు, 2 పవర్ బ్యాంక్, ఒక వాచ్ స్వాధీనం చేసుకున్నారు. ► భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన గుడికాడి నవీన్ కుమార్(41) ఖమ్మం జిల్లా పాల్వంచలోని లక్ష్మిదేవునిపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్‌గా స్థిరపడ్డాడు. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఇతను డబ్బు కోసం చోరీలు చేస్తుంటాడు. రాత్రి సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటాడు. ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో బస్‌లలో ప్రయాణించడాన్ని గమనిస్తుంటాడు. వారితో పాటు తోటి ప్రయాణికుడిగా బస్ ఎక్కుతాడు. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలకు బస్ చేరుకుంటుందనగా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను లాక్కొని రన్నింగ్ బస్ నుంచి సెకనులో దిగేసి పారిపోతాడు. లేదంటే దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లోని బ్యాచ్లర్స్ రూమ్స్‌లలోకి చొరబడి ల్యాప్‌టాప్స్‌ను దొంగిలిస్తుంటాడు. ► చోరీలో భాగంగా గత నెల 8వ తేదీన ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి నర్సరావుపేట నుంచి నిజాంపేట వెళ్లేందుకు హైదరాబాద్ బస్ ఎక్కారు. వాళ్లు పనిచేసే కంపెనీ ఇచ్చిన హెచ్‌పీ, డెల్ ల్యాప్‌టాప్‌లను తీసుకొని బస్‌లో కూర్చున్నారు. వాళ్ల మొబైల్ ఫోన్లను కూడా అదే బ్యాగ్‌లో పెట్టేసి పడుకున్నారు. ఇది గమనించిన నిందితుడు నవీన్ కుమార్ అదే బస్‌లో ఎక్కాడు. రిజర్వేషన్ చేసుకుంటే వివరాలు తెలిసిపోతాయని.. టికెట్‌కు సరిపోయే డబ్బులు చెల్లించి వారి పక్కనే కూర్చున్నాడు. బస్ ఆటోనగర్‌కు సమీపిస్తున్న సమయంలో నిందితుడు ల్యాప్‌టాప్ బ్యాగ్‌లతో దిగి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసుకునేసరికి ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు కనిపించకపోయేసరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► గతంలో నవీన్ కుమార్ మీద వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్‌పేట, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో 5 కేసులు నమోదయ్యాయి. చదవండి: అటవీ ప్రాంతంలో పేకాట.. -
ఒక కారును ఇలా కూడా వాడొచ్చా!
సరదాగా రోడ్ట్రిప్ను ఇష్టపడేవారు అన్ని వనరులను అందుబాటులో ఉంచుకొని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. తినడానికి కావాల్సిన సరుకులు, పడుకోవడానికి కావాల్సిన వస్తువులను తమ వెంట తీసుకెళ్తూ ఎక్కడ పడితే అక్కడ బస చేస్తుంటారు. కానీ తమ ఆలోచనలతో రోడ్‌ట్రిప్ జర్నీని కూడా ఒక మధురానుభూతిగా మలుచుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి కోవకే చెందిన వ్యక్తే నాథనిల్ వైస్. (చదవండి : వైరల్: కేసీఆర్ మాటలు నమ్మి నష్టపోయా) స్వతహాగా నాథనిల్ రోడ్ ట్రిప్పులను బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. 2018 నుంచి నాథనిల్ వైస్ తన ఎస్యూవీ కారులోనే రోడ్ ట్రిప్‌ను ప్రారంభించాడు. అయితే అతను తన కారును మలిచిన విధానం, డిజైనింగ్ చూస్తే మతి పోవాల్సిందే. ఎస్యూవీ కారును ఒక లగ్జరీ హోటల్ గదిలాగా మార్చేశాడు. నాథనిల్ వైస్ కారులో ఉన్న సకల సౌకర్యాలను ఒక వీడియో రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కారు వెనుక భాగంలో ఉన్న డోరు ఓపెన్ చేయగానే బెడ్ కనబడడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కారులో ఉన్న ఒక్కో వస్తువును రివీల్ చేస్తుంటాడు. దానిలో భాగంగానే స్టవ్, కిచెన్ ఐటమ్స్, చిన్న ఫ్రిడ్జ్, బట్టలు, సోలార్ ప్యానెళ్లు ఇలా ఒక్కటి చూపిస్తుంటే మీ మతి పోవడం ఖాయం. ఒక కారును ఇలా కూడా వాడొచ్చా అన్న రీతిలో నాథనిల్ డిజైన్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. (చదవండి : నీ ఆఫర్ తగలెయ్య, మీరు మారరా!) అక్టోబర్ 23న పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ వీడియోకు 30వేల వ్యూస్, 4300 లైక్స్ సంపాధించింది. ' మీరు నిజమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్.. ఇది కదరా ఎంజాయ్మెంట్ అంటే.. మీ అడ్వెంచర్ ట్రిప్ బాగుంది.. మీ ఐడియా ఇంకా బాగుంది ' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram Made a house tour on TikTok, figured I may as well share it here too. I have received a lot of questions about my roadlife setup on IG, so here you go 🙂 The fridge is from @dometic - thanks y’all 🙏 Seriously a game changer A post shared by nathaniel wise (@nathanielwise) on Oct 23, 2020 at 9:19am PDT -
టాయిలెట్ కూడా గోల్డే!
ముంబై : దేశీయ బ్యాంకులకు ఎన్నికోట్లు ఎగ్గొడితే ఏమిటి.. లగ్జరీ లైఫ్ అంటే అతనిదే అని చెప్పుకోవచ్చు. ఫార్ములా వన్, క్రికెట్, ఫుట్‌బాల్ టీమ్ వంటి అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లలో అతను చేసే హడావుడి అంతాఇంతా కాదు. ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువులుగా చెప్పుకునే మహాత్మాగాంధీ గ్లాసెస్, టిప్పు సుల్తాన్ కత్తిలను తన వశం చేసుకున్నాడు. అతనెవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. అతనే దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. అతని లగ్జరీ లైఫ్ ఇంతే అనుకున్నారా? వింటే మీరే షాకైపోతారట. లండన్‌లో మాల్యాకు ఓ లగ్జరీ ఇల్లు ఉండిందని తెలిసింది. ఆ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌ను మాల్యా కలిగి ఉన్నారని రిపోర్టులు వెలువడుతున్నాయి. ఓ వైపు మాల్యా వ్యాపారాలు కుదేలు అవుతున్నా.. మరోవైపు భారతీయ అథారిటీలు అతన్ని ఎలాగైనా భారత్‌కు తీసుకొచ్చి జైలులో పెట్టాలని ప్రయత్నిస్తున్నా.. తాను మాత్రం లండన్ ఇంటిలో లగ్జరీ లైఫ్‌తో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ వస్తువులున్నట్టు రిపోర్టు తెలిపింది. రచయిత జేమ్స్ క్రాబ్ట్రీకి ఒకసారి విజయ్‌మాల్యా ఇంటిని సందర్శించే అవకాశం వచ్చినప్పుడు, మాల్యా ఇంట్లో ఉన్న గోల్డెన్ టాయిలెట్‌ను చూశారని తాజా రిపోర్టు పేర్కొంది. జేమ్స్, లీ కౌన్ యూ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్. ఈ విషయాన్ని జేమ్స్ ఈ వారంలో ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో కూడా చెప్పారని రిపోర్టు వెల్లడించింది. లండన్‌లోని రీజెంట్స్ పార్క్‌లో ఉన్న మాల్యా భవంతిని తాను సందర్శించానని, ఆ భవంతిని, దానిలో ఉన్న లగ్జరీ వస్తువులను చూసిన తర్వాత తాను ఒక్కసారిగా ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టు జేమ్స్ చెప్పారు. అక్కడే గోల్డెన్ రిమ్‌తో ఉన్న గోల్డెన్ టాయిలెట్ కనిపించిందని పేర్కొన్నారు. అయితే ఆ భవంతిలో గోల్డెన్ టాయిలెట్ ఉన్నప్పటికీ, గోల్డెన్ టాయిలెట్ పేపర్ లేదన్నారు. ఇలా విజయ్ మాల్యా గోల్డెన్ టాయిలెట్ విషయం బయటకి వచ్చింది. -
ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తున్న బాబు
-
నమ్మకద్రోహి..
పనిచేసే ఇంటికే కన్నం విలాసవంతమైన జీవితానికి అలవాటు విడతల వారీగా చోరీ చేస్తూ దొరికిన డ్రైవర్ రూ.1.37 కోట్ల సొత్తు చోరీ రూ.1.25 కోట్ల సొత్తు రివకరీ నిందితుడితోపాటు సహకరించిన వారు కూడా అరెస్టు సికింద్రాబాద్: ఓ వ్యక్తి డ్రైవర్‌గా ఏడేళ్లు ఒకే ఇంట్లో పనిచేస్తున్నాడు... యజమాని వద్ద నమ్మకాన్ని పెంచుకున్నాడు. అనుమానం రాకుండా ఆ ఇంట్లో విడతల వారీగా చోరీకి పాల్పడుతూ వచ్చాడు. గత రెండు నెలలుగా తన ఇంట్లో నగదు, బంగారం కన్పించకుండా పోతున్న విషయాన్ని యజమాని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా డ్రైవరే దొంగ అని తేలింది. సుమారు రూ.1.37 కోట్ల విలువ చేసే సొత్తు చోరీకి గురైనట్టు తేల్చారు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రూ.1.25 కోట్ల విలువ చేసే నగదు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ జీ.సుధీర్‌బాబు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడ్‌బంద్‌లోగల అనంత ఎన్క్లేవ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో సంపన్న వర్గానికి చెందిన అజయ్ హరినాథ్ నివాసం ఉంటున్నాడు. అతని వద్ద అదే ప్రాంతంలోని మడ్‌ఫోర్ట్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన మహ్మద్ తహసీన్ (27) ఏడేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. యజమాని వద్ద నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ దశలో విలాసవంతమైన జీవితం గడపాలనుకున్న తహసీన్‌కు తన యజమాని ఇంట్లో చోరీ చేయాలన్న కోరిక కలిగింది. విడతల వారీగా బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, అందినంత నగదును దొంగిలించడం ప్రారంభించాడు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం మాయమైన విషయాన్ని గ్రహించిన ఇంటి యజమాని అజయ్ హరినాథ్ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌పై అనుమానాలు... డ్రైవర్ తహసీన్ జీవనశైలిలో మార్పు రావడంతో ఇదే విషయాన్ని బాధిత యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. డ్రైవర్ నివాసం ఉంటున్నది కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధి కావడంతో బోయిన్పల్లి, కార్ఖానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. తహసీన్ గురించి ఆరా తీశారు. ఇటీవలే నాలుగు ఇన్నోవాలు కొనుగోలు చేసి ట్రావెల్స్ ప్రారంభించడం, రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడం, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు తదితర వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. పోలీసుల విచారణలో తానే విడతల వారీగా యజమాని ఇంట్లో చోరీకి పాల్పడినట్టు తహసీన్ అంగీకరించాడు. స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు... నిందితుడు తహసీన్ నుంచి రూ.12.70 లక్షల నగదు, ఇటీవలే కొనుగోలు చేసిన నాలుగు ఇన్నోవాలు, రెండు ద్విచక్ర వాహనాలు, 2,300 గ్రాముల బంగారం బిస్కెట్లు, 15 తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, మూడు ఖరీదైన సెల్ఫోన్లు, ఖరీదైన రిస్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు తహసిన్ దొంగిలించిన బంగారాన్ని తన సోదరుడు మహ్మద్ మోసిన్ (23)కు అందించేవాడు. ఆభరణాలను విక్రయించేందుకు అదే ప్రాంతానికి చెందిన వీరి మిత్రుడు హేక్ మహ్మద్ అస్లాముల్లా (23)ను సహాయాన్ని తీసుకున్నారు. మోండా మార్కెట్ ప్రాంతంలోని నేమీచంద్‌జైన్, అక్షయ్‌చంద్‌జైన్ అనే వ్యాపారులకు విక్రయించారు. తహసీన్‌కు అదే ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఖదీర్ (25) సహకరించినట్టు పోలీసులు తేల్చారు. ఈ మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాచ్‌మన్ ఖదీర్ పరారీలో ఉండగా మిగతా ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు మిస్టరీని ఛేదించి పెద్దమొత్తంలో రికవరీ చేసిన కార్ఖానా డీఐ వై.నాగేశ్వర్రావు, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్లు సుధీర్, లక్ష్మణ్‌రావు బృందాన్ని డీసీపీ సుధీర్‌బాబు, అదనపు డీసీపీ వై.గిరి, ఏసీపీ గణేష్‌రెడ్డి అభినందించారు. -
టెక్కీ... చోరీ
బెంగళూరు, న్యూస్‌లైన్ : స్నేహితుల ఇళ్లో చోరీలకు పాల్పడిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను హెణ్ణూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితురాలిని గోవిందశెట్టిపాళ్యలో నివాసముంటున్న ఎలిజబెత్(22)గా గుర్తించినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. నిందితురాలి వివరాలను గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బెంగళూరులోని యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న ఎలిజబెత్, నాలుగు నెలలుగా పలుమార్లు హెణ్ణూరులోని తన స్నేహితురాలు పూజాశర్మ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో పూజాశర్మ కుటుంబసభ్యుల కళ్లు కప్పి బంగారు నగలు, విలువైన వస్తువులను తన వ్యానిటీ బ్యాగ్‌లో వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయేది. పదేపదే ఇంటిలో నగలు చోరీ అవుతుండడంతో పూజాశర్మ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఇంటిలో పనిచేస్తున్న వారిని ప్రశ్నించి వారి ప్రమేయం లేదని తెలుసుకున్నారు. అనంతరం నాలుగు నెలలుగా పూజాశర్మ ఇంటికి వచ్చివెళ్లిన వారిపై నిఘా పెంచారు. ఆ సమయంలో ఎలిజబెత్ వైఖరిపై అనుమానం కలిగింది. ఆమె గురించి వాకాబు చేశారు. ఎలిజబెత్ తండ్రికి తాహతుకు మించి అప్పులు ఉన్నాయని, అయితే ఎలిజబెత్ మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతోందని గుర్తించారు. అనుమానితురాలిగా అదుపులో తీసుకుని పోలీసులు తమదైన శైలీలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కేసును చాకచక్యంగా పరిశోధించిన హెణ్ణూరు పోలీసులు సీపీ అభినందించి రివార్డు ప్రకటించారు.