సరదాగా రోడ్‌ట్రిప్‌ను ఇష్టపడేవారు అన్ని వనరులను అందుబాటులో ఉంచుకొని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. తినడానికి కావాల్సిన సరుకులు, పడుకోవడానికి కావాల్సిన వస్తువులను తమ వెంట తీసుకెళ్తూ ఎక్కడ పడితే అక్కడ బస చేస్తుంటారు. కానీ తమ ఆలోచనలతో రోడ్‌ట్రిప్ జర్నీని కూడా ఒక మధురానుభూతిగా మలుచుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి కోవకే చెందిన వ్యక్తే నాథనిల్ వైస్. (చదవండి : వైరల్: కేసీఆర్ మాటలు నమ్మి నష్టపోయా)
స్వతహాగా నాథనిల్ రోడ్ ట్రిప్పులను బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. 2018 నుంచి నాథనిల్ వైస్ తన ఎస్‌యూవీ కారులోనే రోడ్ ట్రిప్‌ను ప్రారంభించాడు. అయితే అతను తన కారును మలిచిన విధానం, డిజైనింగ్ చూస్తే మతి పోవాల్సిందే. ఎస్‌యూవీ కారును ఒక లగ్జరీ హోటల్ గదిలాగా మార్చేశాడు. నాథనిల్ వైస్ కారులో ఉన్న సకల సౌకర్యాలను ఒక వీడియో రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కారు వెనుక భాగంలో ఉన్న డోరు ఓపెన్ చేయగానే బెడ్ కనబడడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కారులో ఉన్న ఒక్కో వస్తువును రివీల్ చేస్తుంటాడు. దానిలో భాగంగానే స్టవ్, కిచెన్ ఐటమ్స్, చిన్న ఫ్రిడ్జ్, బట్టలు, సోలార్ ప్యానెళ్లు ఇలా ఒక్కటి చూపిస్తుంటే మీ మతి పోవడం ఖాయం. ఒక కారును ఇలా కూడా వాడొచ్చా అన్న రీతిలో నాథనిల్ డిజైన్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. (చదవండి : నీ ఆఫర్ తగలెయ్య, మీరు మారరా!)
అక్టోబర్ 23న పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ వీడియోకు 30వేల వ్యూస్, 4300 లైక్స్ సంపాధించింది. ' మీరు నిజమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్.. ఇది కదరా ఎంజాయ్‌మెంట్ అంటే.. మీ అడ్వెంచర్ ట్రిప్ బాగుంది.. మీ ఐడియా ఇంకా బాగుంది ' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment