ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు.. | Tamannaah Bhatia Has Expensive Diamond And Cars Life Style | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: తమన్నా వద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వజ్రం..

Published Wed, Jul 6 2022 7:21 PM | Last Updated on Wed, Jul 6 2022 8:13 PM

Tamannaah Bhatia Has Expensive Diamond And Cars Life Style - Sakshi

Tamannaah Bhatia Has Expensive Diamond: 'హ్యపీ డేస్' సినిమాతో తెలుగు తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ సినిమాలో తన అందం, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 ఏళ్ల అవుతున్నా ఈ ముంబై భామ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'ఎఫ్‌-3' మూవీతో సూపర్‌ హిట్ కొట్టింది. త్వరలో 'గుర్తుందా శీతకాలం'తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవి సరసన 'భోళా శంకర్' చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 50కిపైగా చిత్రాల్లో నటించిన తమన్నా పర్సనల్‌ లైఫ్‌ను కూడా లగ్జరీతో ఎంజాయ్‌ చేస్తోంది. 

సుమారు రూ. 150 కోట్లకుపైగా ఆస్తిని కూడగట్టిన ఈ మిల్కీ బ్యూటీ వద్ద ఖరీదైన కార్లు, ఇళ్లు, ఆభరణాలు వంటి తదితర విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అయితే తమన్నా వద్ద ఉన్న ఒక వస్తువు గురించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలేనే 5వ అతిపెద్ద వజ్రం తమన్నా దగ్గర ఉండటం. సుమారు రూ. 2 కోట్ల విలువైన ఈ వజ్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్‌ అవుతోంది. 



చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ?

ఇదిలా ఉంటే తమన్నా ఆస్తుల విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మకు ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ. 16.60 కోట్ల అపార్ట్‌మెంట్‌ ఉందట. దీని విస్తీర్ణం 80, 778 చదరపు అడుగులు ఉంటుందని టాక్. రూ. 1.02 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జి ఎల్‌, రూ. 75.59 లక్షల ఖరీదుగల ల్యాండ్‌ రోవర్ రేంజ్ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్స్‌, రూ. 43.50 లక్షల బీఎండబ్ల్యూ 320 ఐ, , రూ. 29.96 లక్షల మిత్సుబిషి పేజర్‌ స్పోర్ట్స్‌ కార్లు ఉన్నాయని సమాచారం.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement