అమానుషం: అందరు చూస్తుండగా.. రోడ్డుపై యువతిని బైక్‌తో ఈడ్చుకెళ్లి.. | New Delhi: Bikers Theft Woman Phone And Drag Her On Road Video Goes Viral | Sakshi
Sakshi News home page

అమానుషం: అందరు చూస్తుండగా.. రోడ్డుపై యువతిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..

Published Fri, Dec 17 2021 8:00 PM | Last Updated on Fri, Dec 17 2021 8:24 PM

New Delhi: Bikers Theft Woman Phone And Drag Her On Road Video Goes Viral - Sakshi

న్యూఢిల్లీ: బైకుపై వచ్చిన కొందరు దుండగులు మహిళ చేతిలోని ఫోన్‌ని లాకెళ్లడంతో పాటు ఆమెను బైకుతో కొంత దూరం ఈడ్చుకెళ్లారు. ఈ అమానవీయ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో చోటు చేసుకుంది. అసలేం  జరిగిందంటే.. రోడ్డుపై ఓ మహిళ చేతిలో ఫోన్‌ పట్టుకుని నిల్చుని ఉంది. ఇదంతా గమనించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా ఆమె వైపు బైకు నడుపుకుంటూ మహిళ చేతిలోని ఫోన్‌ని లాక్కొన్నారు.

దీన్ని ప్రతిఘటించిన ఆమె వెంటనే బైకుపై ఉన్న ఓ వ్యక్తి చొక్కాను గట్టిగా పట్టుకుంది. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ దొంగలు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళను రోడ్డుపై 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఆగంతకులు పారిపోగా , ఘటనా స్థలంలో ఉన్న కొందరు ఆమెను రక్షించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

చదవండి: లీనా నాయర్‌ సీఈవో ఘనత.. తన శైలిలో మహీంద్రా స్పందన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement