వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సింహాలతోనే..! | Bikers Chasing Lions In Gujarat | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 9 2017 11:24 AM | Last Updated on Thu, Nov 9 2017 12:55 PM

Bikers Chasing Lions In Gujarat - Sakshi

అహ్మదాబాద్‌: సింహాలను చూస్తేనే చాలామంది దడుసుకొని ఆమడ దూరం పారిపోతారు. కానీ కొందరు యువకులు మాత్రం సింహాలను చూసి వెర్రిగా ప్రవర్తించారు. సింహాలను బైకుల మీద వెంటాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియో కలకలం రేపుతోంది.

గుజరాత్‌లోని ప్రముఖ గిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బైకర్లు సింహాలను వెంటాడుతూ ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. మీదమీదకు వస్తున్న బైకర్ల నుంచి తప్పించుకునేందుకు ఓ సింహం, ఓ ఆడసింహం అడవిలోకి పారిపోయాయి. అమ్రేలి జిల్లాలోని అడవిలో చిత్రీకరించినట్టు భావిస్తున్న 34 సెకన్ల వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఈ వీడియోను హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో గుజరాత్‌ అటవీశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. బైకర్ల వివరాలు తెలుసుకొని.. వీడియో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీడియోలో ఒక బైక్‌ నంబర్‌ కనిపించడంతో ఈ వివరాల ఆధారంగా విచారణ చేపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement