ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గురువారం ఢిల్లీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఈశ్వరయ్య రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తిం చారు. నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, నెమిలి కాల్వలో 1951, మార్చి 10న జన్మించిన ఈశ్వరయ్యు అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయుశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1999లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2000 సంవత్సరంలో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యూరు. తరువాత రెండుసార్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
క్రియాశీల రాజకీయాల్లో ఈశ్వరయ్య కుటుంబం
జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఆయున హైకోర్టు న్యాయమూర్తి కాకముందు ఆయన భార్య వంగాల శ్యామలాదేవి నల్లగొండ జిల్లా వలిగొండ నుంచి టీ డీపీ తరఫున జెడ్‌పీటీసీగా ఎన్నికై, దాదాపు ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగారు. అంతకుముందు, తెలుగుదేశం పార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు పలువురు ఇప్పటికీ నల్లగొండ జిల్లా టీ డీపీలో పలు పదవుల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈశ్వరయ్య అల్లుడు 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. జస్టిస్ ఈశ్వరయ్య తండ్రి వంగాల అంజయ్యగౌడ్. ఆయనకు నలుగురు కుమారులు.
బాలనర్సయ్య గౌడ్, స్వామిగౌడ్, ఈశ్వరయ్యగౌడ్, వాసుగౌడ్. బాలనర్సయ్య గౌడ్ టీడీపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. మరో సోదరుడు స్వామిగౌడ్ గ్రామంలోనే వ్యవసాయం, ఇతర పనులు చూసుకునేవారు. జస్టిస్ ఈశ్వరయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు రామచంద్రగౌడ్ హైకోర్టులో న్యాయవాది. ఈశ్వరయ్యు చివరి సోదరుడు వాసుగౌడ్ నెమలికాల్వ నుంచి టీడీపీ తరఫున ఎంపీటీసీగా గెలిచారు. ఇటీవల పదవీకాలం ముగిసేదాకా అదే పదవిలో ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య పెద్దనాన్న కుమారుడి పేరు కూడా వంగాల స్వామిగౌడ్. ఆయున టీడీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా ఉన్నారు. ఆయున 2004 ఎన్నికల్లో మిర్యాలగూడనుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
Published Fri, Sep 20 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement