Vangala Eswaraiah
-
ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచ డంతో పాటు మౌలిక సదుపా యాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన మీదట, రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఈశ్వరయ్యను కమిషన్ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఈ కమిషన్‌కు సీఈవోగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్.జగన్మోహన్రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఉన్నత విద్యా రంగంలో ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టారు. దీనికి అనుగుణంగానే ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కమిషన్ పరిధిలోకి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు వస్తాయి. ప్రవేశాలు, ఫీజులు, బోధన, పరీక్షలు, పరిశోధన, సిబ్బంది అర్హతలు, నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలన్నిటినీ ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారులు ఉంటాయి. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలకు ఆదేశాలిస్తుంది. అలాగే గుర్తింపు రద్దునకు సైతం ఆదేశాలు జారీ చేస్తుంది. పరిస్థితిని బట్టి జరిమానాలు కూడా విధిస్తుంది. -
ఐక్యతతోనే రాజ్యాధికారం : వంగాల ఈశ్వరయ్య
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య హన్మకొండ, న్యూస్‌లైన్: బీసీలు ఐక్యతతో ముందుకెళ్తేనే రాజ్యాధికారం సాధించుకోవచ్చని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన బీసీల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. మొత్తం జనాభాలో బీసీల జనాభా ఎంత ఉందో ఇప్పటివరకు జనాభా గణను ప్రభుత్వాలు చేపట్టక పోవటం శోచనీయమన్నారు. విద్య, ఉద్యోగాల్లోనే కాదు.. పదోన్నతులలో, చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 50శాతం అవకాశం కల్పించాలని డిమాండ్ గతంలో రాగా.. అందులోనూ ఉన్నతవర్గాలే వస్తారని భావించి సామాజిక వర్గాలవారీగా బీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చిందని తెలిపారు. అయితే, వివిధ రాజకీయ పార్టీలు విభేదించడంతో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది ఇప్పటివరకు నోచుకోలేదన్నారు. ఈ సదస్సుకు సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ అధ్యక్షుడు తిరుణహరిశేషు అధ్యక్షత వహించారు -
అంబవేద్కర్ అంబేద్కర్ అయ్యాడు
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అంత గొప్పవాడు అయ్యేందుకు ఆయన గురువు చేసిన చిన్న మార్పే కారణం. అంబవేద్కర్గా ఉన్న ఆయన ఇంటి పేరును అంబేద్కర్గా మార్చారు. ఎందుకంటే అంబవేద్కర్ అనే ఇంటి పేరు ఆయన కులాన్ని వెంటనే గుర్తించేలా చేస్తుంది. ఆ ఇంటి పేరే ఉంటే ఆయన పట్ల వివక్ష చూపి ఆయనను అడ్డుకునే ప్రమాదాన్ని అంబేద్కర్ గురువు ముందుగానే పసిగట్టారు. అప్పట్నుంచీ ఇప్పటిదాకా నిమ్నజాతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది’’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ అన్నారు. అభివృద్ధి చెందే అవకాశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఉండాలని, అయితే స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడుస్తున్నా అసమానతలు, అవినీతి కారణంగా అన్ని వర్గాలు అభివృద్ధి చెందడం లేదని, ఇందుకు కులం, పేదరికం అడ్డంకిగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వంగాల ఈశ్వరయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... అల్పులమనే భావన నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు విముక్తులు కావాలని పిలుపునిచ్చారు. పల్లకీలు, జెండాలు మోసే కార్యకర్తల మనస్తత్వం నుంచి బయటపడి దేశాన్ని పాలించాలనే భావనకు వచ్చినప్పుడే బీసీల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ దిశగా కృషి జరగాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... బీసీలంతా ఐకమత్యంతో కృషి చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలన్నారు. పేదరికం కారణంగా బడుగు, బలహీన వర్గాల పట్ల సాంఘిక అసమానతలు కొనసాగుతున్నాయని వాటిని అధిగమించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య.. మాట్లాడుతూ బీసీల్లో ఎన్నో కులాలున్న కారణంగా ఐకమత్యం లోపించిందని, ఈ అనైక్యతను అగ్రవర్ణాలు వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో నియమించిన కమిషన్ల సిఫారసులను అమలు చేయలేదని బీజేపీ జాతీయ నాయకుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీసీ నాయకుడు పాలూరు రామకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్, జస్టిస్ సి.వి.రాములు, అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుందర్‌కుమార్, వివిధ బీసీ సంఘాల నేతలు శ్యాంసుందర్‌గౌడ్, దేవర కరుణాకర్, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, అరుణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒత్తిళ్లకూ లొంగకుండా పనిచేస్తా: జస్టిస్ ఈశ్వరయ్య జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య మాట్లాడుతూ... బీసీల సమస్యలను పరిష్కరించేందుకు తన శాయశక్తులా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తానని చెప్పారు. బీసీ కమిషన్లకు చట్టబద్ధత కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని, బీసీల సంక్షేమానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కుల వ్యవస్థపై ఆధారపడిన దేశ రాజకీయాల్లో బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని అన్నారు. 2011 జనాభా లెక్కల్లో భాగంగా సేకరించిన కులాల వారీ జనాభా వివరాలను వెల్లడించాలంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించాలని సూచించారు. సమావేశంలో భాగంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన కాపులను బీసీల్లో చేర్చేందుకు అంగీకరించవద్దని జస్టిస్ ఈశ్వరయ్యను కోరారు. -
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గురువారం ఢిల్లీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఈశ్వరయ్య రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తిం చారు. నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, నెమిలి కాల్వలో 1951, మార్చి 10న జన్మించిన ఈశ్వరయ్యు అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయుశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1999లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2000 సంవత్సరంలో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యూరు. తరువాత రెండుసార్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. క్రియాశీల రాజకీయాల్లో ఈశ్వరయ్య కుటుంబం జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఆయున హైకోర్టు న్యాయమూర్తి కాకముందు ఆయన భార్య వంగాల శ్యామలాదేవి నల్లగొండ జిల్లా వలిగొండ నుంచి టీ డీపీ తరఫున జెడ్పీటీసీగా ఎన్నికై, దాదాపు ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగారు. అంతకుముందు, తెలుగుదేశం పార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు పలువురు ఇప్పటికీ నల్లగొండ జిల్లా టీ డీపీలో పలు పదవుల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈశ్వరయ్య అల్లుడు 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. జస్టిస్ ఈశ్వరయ్య తండ్రి వంగాల అంజయ్యగౌడ్. ఆయనకు నలుగురు కుమారులు. బాలనర్సయ్య గౌడ్, స్వామిగౌడ్, ఈశ్వరయ్యగౌడ్, వాసుగౌడ్. బాలనర్సయ్య గౌడ్ టీడీపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. మరో సోదరుడు స్వామిగౌడ్ గ్రామంలోనే వ్యవసాయం, ఇతర పనులు చూసుకునేవారు. జస్టిస్ ఈశ్వరయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు రామచంద్రగౌడ్ హైకోర్టులో న్యాయవాది. ఈశ్వరయ్యు చివరి సోదరుడు వాసుగౌడ్ నెమలికాల్వ నుంచి టీడీపీ తరఫున ఎంపీటీసీగా గెలిచారు. ఇటీవల పదవీకాలం ముగిసేదాకా అదే పదవిలో ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య పెద్దనాన్న కుమారుడి పేరు కూడా వంగాల స్వామిగౌడ్. ఆయున టీడీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా ఉన్నారు. ఆయున 2004 ఎన్నికల్లో మిర్యాలగూడనుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.