‘మిషన్ కాకతీయ’తో రైతులకు మేలు
తాగునీటి నివారణకు రూ.15కోట్లు మంజూరు
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపటిన మిషన్ కాకతీయతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దాపూర్‌లో మిషన్ కాకతీయ రెండో విడత పనులను కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ కోసంఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. 60ఏళ్ల నుంచి రైతులకు సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి సాగునీరందించేందుకే మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారని తెలిపారు. దీనివల్ల భవిష్యత్‌లో నీటిఇబ్బందులు ఉండవని అన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.15వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు, వాటర్‌ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు.
రెండేళ్లలో ఇంటింటికీ నీళ్లు
మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రభుత్వం ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేసి తాగునీరందించనుందని అన్నారు. ఈ పనులు జిల్లాలో కొన్నిచోట్ల పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి ఇంటికి న ల్లా, 9గంటల విద్యుత్ అందించకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని అన్న సీఎం కేసీఆర్ మాటలు నిజం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజశేఖర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బాలాజీసింగ్, డీఈఈ శంకర్‌బాబు, నారాయణరెడ్డి, మక్సుబ్, ఉపసర్పంచ్ రాజు, తహసీల్దార్ సైదులుగౌడు, ఎస్‌ఐ జానకిరాంరెడ్డి, వీఆర్‌ఓ ముత్తమ్మ, ఆయా పార్టీల నాయకులు గోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి, పెద్దయ్యయాదవ్, వెంకట్‌నాయక్, హమీద్,శ్రీనివాస్‌యాదవ్, శేఖర్ , టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి శాలువాతో సన్మానించారు. పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.