సదాశివనగర్ : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదు రు చూస్తూ కూర్చోలేదు లింగంపల్లి వాసులు. చేయి చేయి కలిపి.. కలిసి కట్టుగా పనులు చేసుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా నడుంబిగించిన వా ళ్లు మొదట చేయి చేయి కలిపారు. వారంతా కలిసి ఓ సంఘంగా మారారు. గ్రామంలో 301 కుటుంబాలు ఉన్నాయి.
అందులో 114 కుటుం బాలు ‘శ్రీ గోపాల మిత్ర గ్రామ రైతు సం ఘం’లో రూ.250 చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సంఘాన్ని 2010లో ప్రారంభిం చారు. మొదటగా 20 మంది సంఘ సభ్యులుం డగా, ప్రస్తుతం 114 కుటుంబాలు చేరాయి.
రిలయన్స్ సహకారం..
లింగపల్లి గ్రామస్తులు చేపడుతున్న అభివృద్ధి పనులకు రిలయన్స్ సంస్థ సహకారం అందించింది. వెనుకబడిన గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఆ సంస్థ గోపాలమిత్ర గ్రామ రైతు సంఘానికి సహకారం అందిస్తోంది. వారి కష్టానికి రిలయన్స్, పంచాయతీ సహకారం తోడు కావడంతో అభివృద్ధి వేగవంతమవుతోంది.
సేంద్రియ ఎరువులతో సాగు
గ్రామంలోని 114 కుటుంబాల ఇళ్ల వద్ద సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండిస్తున్నారు. ప్రతీరోజు ఒక్కోరకం కూరగాయలు వాడుకుంటున్నారు. గ్రామంలో బయోగ్యాస్‌ను వినియోగించుకుంటున్నారు. పంటలకు ఎరువుగా వర్మికంపోస్టు తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు. తాగునీటికి ఊటబావి తవ్వారు. మినీవాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, పంట పొలాలకు వెళ్లేందుకు దారులు, చెట్లు నాటడం.. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
గ్రామానికి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో తరచు ప్రమాదాలు జరిగేవి. దీంతో గ్రామస్తులు సంఘం ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపుల మట్టి వేయడంతో ప్రమాదాలు తప్పాయి. ఇలా తమకు తాము అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న లింగంపల్లి గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అభివృద్ధిలో ఆదర్శం ‘లింగంపల్లి’
Published Fri, Oct 3 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement