మనీశ్​ మల్హోత్రాతో రిలయన్స్​ భారీ డీల్​ | Reliance co buys 40 percent in Manish Malhotra brand | Sakshi
Sakshi News home page

బయటి కంపెనీతో మనీశ్​ మొదటి ఒప్పందం! 40 శాతం వాటా రిలయన్స్​కి..​

Published Sat, Oct 16 2021 10:42 AM | Last Updated on Sat, Oct 16 2021 11:51 AM

Reliance co buys 40 percent in Manish Malhotra brand - Sakshi

Reliance Buys Manish Malhotra Stakes: వస్త్ర ప్రపంచంలో తన బ్రాండ్​తో దూసుకుపోతున్న ముఖేష్​ అంబానీకి చెందిన రిలయన్స్​ బ్రాండ్స్​ లిమిటెడ్​.. భారీ ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ప్రముఖ డిజైనర్​ లేబుల్​ ‘మనీశ్​ మల్హోత్రా’లో 40 శాతం వాటా చేజిక్కించుకోబోతోంది. 
 

పదహారేళ్లుగా దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు విస్తరించుకున్న మనీశ్​ మల్హోత్రా బ్రాండ్​లో రిలయన్స్​ ‌‌మెజార్టీ వాటా కొనుగోలు చేయనుంది. మనీశ్​ మల్హోత్రా బయటి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.  ఈ మేరకు మనీశ్​తో ఒప్పందాన్ని గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్​ రిటైల్​ వెంచర్స్​ లిమిటెడ్​ డైరెక్టర్​ ఇషా అంబానీ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇక ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్​ లాంటి ప్రముఖ నగరాల్లో స్టోర్​లను నడిపిస్తున్న మనీశ్​ మల్హోత్రా.. దేశంలోనే మొదటి వర్చువల్​ స్టోర్​ తెరిచిన ఫీట్​ సైతం సాధించారు. ‘భారత సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా దుస్తుల్ని రూపొందించడం ఈ లేబుల్​ ప్రత్యేకత. రియలన్స్​తో ఒప్పందం ద్వారా దేశ, విదేశాలకు సేవలను విస్తరిస్తామ’ని ఈ సందర్భంగా మనీశ్​ మల్హోత్రా(54) తెలిపారు.

చదవండి: 14 ఏళ్లుగా ఆ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement