ఈ చిత్రంలో కనిపిస్తున్నది నరసాపురలోని వంక. ఈ వంకలో పూడికతీత పనులకు నీరు–చెట్టు కింద రూ.23లక్షలు ఖర్చు చేశారు.
సాక్షి, గుంతకల్లు: వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం కింద విడుదలైన నిధులతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకున్నారు. పనులు నాసిరకంగా చేయడం, చేసిన పనులనే మళ్లీ చేసినట్లు చూపి కోట్లాది రూపాయాలు కాజేశారు. పథకం ముఖ్య ఉద్దేశం చెరువుల్లో పూడిక తీసి భూగర్భ జలాలను వృద్ధి చేయడం. మొక్కలు పెంపకం, కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత, ముళ్లకంపలు తొలగింపు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చెక్‌డ్యాంలు, నీటి సంరక్షణ పనులను చేపట్టారు. అప్పుట్లో పనులు చేపట్టాడానికి టెండర్లు ప్రకటిస్తే..ఇతరులు పోటీకి వస్తారని చంద్రబాబునాయుడు ప్రభుత్వం భావించింది.
నామినేషన్ పద్ధతిపై టీడీపీ నేతలు, కార్యకర్తలకు అప్పగించింది. రూ.10లక్షల లోపు పనిని నామినేషన్ పద్ధతిపై ఇవ్వవచ్చు. దీంతో రూ.కోట్ల పనిని కూడా భాగాలుగా విభజించి..చేశారు. ఈ పనులన్నింటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు కట్టబెట్టారు. నీరు–చెట్టు నిధుల రూపేణ టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల ప్రజాధనం భోంచేసారని ప్రజలు ఆరోపిస్తున్నా రు. గుంతకల్లు నియోజకవర్గంలో 2015 నుంచి గత ఏడాది వరకు 254 పనులకుగాను దాదాపు 14 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పనుల్లో కనిపించని నాణ్యత..
నాలుగేళ్ల వ్యవధిలో దాదాపు రూ.14 కోట్ల పైచిలుకు వ్యయంతో గుంతకల్లు మండలంలో నీరు–చెట్టు పథకం కింద పనులు చేపట్టారు. పనుల నిర్వహణలో ఎక్కడ నాణ్యత లేకపోగా జేసీబీల సహా యంతో తూతూ మంత్రంగా పూడిక తీత పనులు చేపట్టి నిధులు కొట్టగొట్టారు. పనుల నాణ్యత లేని కారణంగా బిల్లులు చేయడానికి నిరాకరించిన సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు పలు మార్లు మైనర్ ఇరిగేషన్ జేఈని బెది రించడం, స్వయాన గుంతకల్లు జడ్పీటీసీ మాతృనాయక్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆశాఖ అధి కారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జెడ్‌పీటీసీని స్వయంగా ఇంటికి పిలిచి . ఎ మ్మెల్యే జితేంద్రగౌడ్ మందలించిన ఆయనలో మార్పు రాకపోగా అదేపనిగా మైనర్ ఇరిగేషన్‌జేఈని వేధింపులకు గురిచేశాడు. నీరు–చెట్టు పనులు పూర్తిగా ఆయాగ్రామాల జన్మభూమి కమిటీ సభ్యులే చేసుకోవాలని అధిష్టానం ఆజ్ఞాపించినా కేవలం కొంతమంది నాయకులు నీరు–చెట్టు పనులతో నిధులను కొల్లగొట్టారు.
అధికారపార్టీ ప్రజాప్రతినిధులదే హవా
ఎంపీపీ రాయల రామయ్య , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బండారు ఆనంద్, జడ్పీటీసీ మా తృనాయక్‌లది ప్రధాన భూమిక కాగా, చెరువుల్లో జరిగిన పనులను మాత్రం తప్పనిసరి పరిస్థితిల్లో ఆయకట్టు ప్రెసిడెంట్‌లకు అప్పజెప్పారు. దీంతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నాయకులు, కార్యకర్తల మధ్య బేధాభిప్రాయాలు పెరిగిపోయాయి. ఇవేవి పట్టించుకోని ఎంపీపీ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, జెడ్పీటీసీలు తమదైన శైలిలో పనులను చేజిక్కించుకొని సొమ్ము చేసుకుంటున్నారు.
అధికారుల తీరుపైనా విమర్శలే
నీరు–చెట్టు పథకం నిధులు స్వాహాపై అధికారుల్లో స్పందన లేకపోవడం విమర్శలకు తా విç Ü్తుంది. ముఖ్యంగా ఆ శాఖలోని అధికారలకు బదిలీల భయం పట్టుకొని ఏ చిన్నతరం చెప్పినా ఇక్కడి నుంచిళ్లిపొండి అని నేతల నుంచి ఒత్తిడి రావడంతో మిన్నకుండిపోయేవారు. మరికొందుకు అధికారలు మాత్రం నాదేం పోయింది..నీ ఇష్టం వచ్చినట్లు పని చేసుకో..మా ఇవాల్సింది మాత్రం ఇచ్చేయే..అని కాంట్రాక్టర్లు ఇచ్చే ముడపులు తీసుకొని ఈ పథకానికి తూట్లు పోడిచారు.
2015 నుంచి ఇప్పటివరకు నీరు–చెట్టు పథకం కింద మంజూరైన పనులు, విడుదలైన నిధులు
మండలం | చేసిన పనులు | ఖర్చు చేసిన నిధులు |
గుంతకల్లు | 4 | 5.17 కోట్లు |
గుత్తి | 5 | 4.52 కోట్లు |
పామిడి | 5 | 5.02 కోట్లు |
మొత్తం | 54 | 14.71 కోట్లు |
ఈ చిత్రంలో కనిపిస్తున్నది గుత్తి చెరువు. ఈ చెరువులో 2015–16లో నీరు–చెట్టు కింద కంపచెట్లు పనులు చేపట్టారు. టీడీపీకి చెందిన నారాయణరెడ్డి నాలుగు దఫాలుగా రూ.20 లక్షలు వ్యయం చేసి ఈ పని పూర్తి చేశారు. పనులు నాసిరకంగా చేయడంతో ముళ్లపొదలు పెరిగి చేపలు పట్టడం ఇబ్బందికరంగా మారింది. లక్షలు ఖర్చుచేశారు కానీ పనులు సరిగా చేయలేదని ప్రజలు వాపోతున్నారు.
గుత్తి చెరువుకు ఒరిగిందేమీ లేదు
లక్షలాది రూపాయలు వెచ్చించి గుత్తి చెరువు కట్టపై పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు చేశారు. అయితే 1087 ఎకరాలు ఉన్న గుత్తి చెరువులో కొంత మేర జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులు చేస్తే ఎవరికి ప్రయోజనం. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తల కు నీరు–చెట్టు పథకం ఆదాయ మార్గంగా మారింది. ఈ పనుల నుంచి ఏ ఒక్క రైతుకు, చెరువు బాగుపడలేదు.
– నాగిరెడ్డి, ఆయకట్టు రైతు, గుత్తి
నిధుల దుర్వినియోగం
టీడీపీ నాయకులు నీరు చెట్టు పనులను దక్కించుకొని నిధులు దుర్వినియోగం చేశా రు. పులగుట్టపల్లి ప్రాంతంలోని వంకలో తూతూ మంత్రంగా పూడికతీత పనులు చేశా రు.ఆ పనుల్లో నాణ్యత లేకపోవడంతో యదా స్థితికి చేరుకున్నాయి. లక్షలాది రూపాయలు దండుకొని పథకానికి తూట్లు పొడిచారు.
– పి.జయరామిరెడ్డి, నెలగొండ
నిధులు మింగేశారు
పామిడి మండలంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నీరు–చెట్టు పథకం కింద కోట్ల రూపాయలను అధికారపార్టీ ప్రజాప్రతినిధులు మింగేశారు. మండలంలో గొలుసు కట్టు, పులుసులు కాలువల పూడికతీత, వాటికి గట్లు ఏర్పాటు, కొండల్లోనూ, రోడ్డు కిరువైపులా చెట్ల పెంపకం పనులకు మండలానికి రూ.5 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో కేవలం పామిడి జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనుంపల్లి నుంచి కట్టకింద పల్లి వరకూ మొక్కలు నాటారు. వంకరాజుకాల్వ కొండపై ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ మొక్కలను నాటించారు. నాటిన మొక్కలు కనిపించలేదుగాని రూ. కోట్లు వారి జేబుల్లో చేరాయి.
–తంబళ్ళపల్లి వెంకట్రామిరెడ్డి, పామిడి
Comments
Please login to add a commentAdd a comment