neeru chettu programme
-
SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు
జిల్లాలో టీడీపీ హయాంలో నీరు–చెట్టు పథకాన్ని తమ్ముళ్లు జేబులు నింపుకునే పథకంగా మార్చుకున్నారు. ఆ పనుల్లో నాణ్యత లేకపోవడంతో అప్పట్లోనే రూపురేఖలు లేకుండా పోయాయి. ఆ పనులపై జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో చాలా వాటికి అధికారులు బిల్లులు నిలిపివేశారు. గత ప్రభుత్వ చివరి కాలంలో చేసిన పనులకు అప్పటి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడు ఆయా బిల్లులు చెల్లించాలంటూ తెలుగు తమ్ముళ్లు హైకోర్టును ఆశ్రయించడంతో జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయా పనులకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. సాక్షి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ పాలనలో నీరు–చెట్టు పథకం కింద రూ.వందల కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఒక్కటీ ప్రయోజనకరంగా లేకుండా పోయాయి. తెలుగు తమ్ముళ్లకు దోచి పెట్టడానికే ఈ పథకాన్ని అప్పటి ప్రభుత్వం అమలు చేసిందనేది జగద్వితం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కోవూరు మాజీ ఎమ్మెల్యేలు, మిగతా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అందిన కాడికి జేబులు నింపుకున్నారనే ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. టీడీపీ ఐదేళ్ల కాలంలో జిల్లాకు 13,780 నీరు–చెట్టు పనులు మంజారయ్యాయి. ఆయా పనులకు రూ.711 కోట్లు నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ద్వితీయ శ్రేణి నేతలకు నీరు–చెట్టు పనులను పందేరం చేసి వాటాలు పంచుకున్నారు. ఎన్నికల చివరి ఏడాదిలో కూడా దాదాపు రూ.200 కోట్ల మేర పనులు హడావుడిగా తూతూ మంత్రంగా చేపట్టి నిధులు ఆరగించేందుకు పథకం వేసి విఫలమయ్యారు. అప్పట్లో టీడీపీ నేతలు, జలవనరుల శాఖ అధికారులు సైతం నీరు–చెట్టు అవినీతిలో భాగస్వామ్యులై నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. దాదాపు రూ.300 కోట్ల వరకు దోపిడీ జరిగిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో బిల్లులు నిలిచిపోయాయి. నీరు–చెట్టు పథకం అంతా పచ్చ నేతల ఫలహారంగానే మారినట్లుగా గతంలో విజిలెన్స్ పరిశీలనలో నిగ్గు తేలింది. అవి‘నీటి’ చెక్‌డ్యామ్‌లు గత ప్రభుత్వ హయాంలో 751 చెక్‌డ్యాంలను నిర్మించారు. ఇందులో కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోనే 80 శాతానికి పైగా చెక్‌డ్యాంల నిర్మాణాలు జరిగాయి. ఒక్క ఉదయగిరి నియోజకవర్గలోనే 400 చెక్ డ్యాంలు నిర్మించి రూ.40 కోట్లు పైగా బిల్లులు డ్రా చేసుకున్నారు. ఇందులో రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవసరం లేని ప్రాంతాల్లో కూడా చెక్‌డ్యాంలు నిర్మించి ప్రజాధనం వృథా చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఉదయగిరి నియోజకవర్గంలో నాగపూర్ టెక్నాలజీ పేరుతో అప్పటి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు స్వయంగా కాంట్రాక్ట్ దక్కించుకుని, కార్యకర్తలకు సబ్ కాంట్రాక్ట్‌గా అప్పగించారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని బొల్లినేని, ఆయన అనుచరులు ఫైబర్ చెక్‌డ్యాముల ముసుగులో భారీ దోపిడీ చేసిన వైనం విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. నియోజకవర్గంలో 24 ప్యాకేజీలుగా 210 ఫైబర్ చెక్ డ్యామ్‌లకు దాదాపు రూ.72 కోట్లు నిధులు మంజూరు చేయించి తన అస్మదీయులుకు కమీషన్ల రూపంలో పందేరం చేశారు. ఆయా టెండర్లను తన సూట్‌కేసు కంపెనీలైన సిగ్మా, శ్రీనివాస కంపెనీల పేరుతో టెండర్లు వేయించి పనులు దక్కించుకున్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణాల్లో నాణ్యత లేకుండా మమ అనిపించి నిధులు ఆరగించినట్లు గత తనిఖీల్లో తేల్చారు. నీరు–చెట్టు పనులు అన్ని కూడా పూడికతీత, కుంటలు తీయడం, ఊట కంటలు, చెక్‌డ్యామ్‌లు అయా పనుల్లో చాలా వరకు అక్రమాలు జరిగాయి. కొన్ని చోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకొని తెలుగు నేతలు స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయి. హైకోర్టును ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు జిల్లాలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సంబంధిత జలవనరుల శాఖ అధికారులు సైతం చివరి దశలో బిల్లుల చెల్లింపును పెండింగ్ పెట్టారు. దాదాపు 3,308 పనులకు సంబంధించి ఎంబుక్స్ నమోదు చేయలేదు. ఆయా పనులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఆధారాలు కూడా లేకపోవడంతో అధికారులు మిన్నకుండిపోయారు. అయితే 501 పనులకు సంబంధించి బిల్లులు ఇప్పించాలని వర్క్ ఆర్డర్ దక్కించుకున్న టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 206 పనులను ఇంజినీరింగ్ బృందాలు తనిఖీలు చేశాయి. మిగిలిన 295 పనులను తనిఖీలు చేయాల్సి ఉంది. సీతారామపురం మండలంలో నిర్మించిన నాసిరకం చెక్‌డ్యామ్ (ఫైల్) తనిఖీలకు 43 బృందాలు జిల్లాలో నీరు–చెట్టు పనులను పరిశీలించి నివేదికలు అందించాలని 43 ప్రత్యేక బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ బిల్లులు చెల్లింపునకు సంబంధించి కొందరు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిపై పలు ఇంజినీరింగ్ శాఖల అధికారులతో బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ చక్రధర్‌బాబు ఆదేశాలిచ్చారు. ఉదయగిరి ప్రాంతంలో నాసిరకంగా నిర్మించిన చెక్‌డ్యామ్ (ఫైల్ ) ఫైబర్ చెక్డ్యామ్లోనూ అంతే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అప్పటి ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నయా టెక్నాలజీ పేరుతో ఫైబర్ చెక్‌డ్యాంలకు నిధులు మంజూరు చేయించుకున్నారు. మహారాష్ట్ర టెక్నాలజీ అంటూ గొప్పగా ప్రచారం చేసుకొని నీటి సామర్థ్యాన్ని తట్టుకునే ఇనుప గేట్లకు బదులుగా ఫైబర్ గేట్లు వినియోగించారు. అయితే ఈ ఫైబర్ గేట్లు ఏడాది తిరగక ముందే చిన్నపాటి వర్షాలకు కొట్టుకుపోయాయి. నియోజకవర్గంలో రూ.68 కోట్లతో 201 ఫైబర్ చెక్‌డ్యాంలు నిర్మించి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ నియోజకవర్గంలోనే సుమారు 30 మందికి పైగా నేతలు లబ్ధిపొందారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వీటి నిర్మాణాలపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించి పనుల్లో డొల్లతనంపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ పనులు చేసిన వారంతా అధికార పార్టీ వారు కావడం.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ నివేదికలు బుట్ట దాఖలయ్యాయి. ‘నిరు’పయోగం ►ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని ఎర్ర‡వాగుపై రూ.90 లక్షలతో నిర్మించిన చెక్‌డ్యాంలో ఫైబర్ గేట్లలో నాణ్యత లోపించడంతో నీరంతా లీకేజీతో బయటకు వెళ్లిపోయింది. రూ.లక్షలు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. ►2016–17లో వరికుంటపాడు మండలం నారసింహాపురంలో రూ.60 లక్షలతో నిర్మించిన ఫైబర్ చెక్‌డ్యాం కొద్దిపాటి వర్షానికే గేట్లు కొట్టుకుపోయింది. దీంతో ఈ పనుల కోసం కేటాయించిన నిధులున్నీ దుర్వినియోగం అయినట్లయింది. ►వింజమూరు మండలం రాగిపాడు పంచాయతీ పరిధిలో అవసరం లేకపోయినా రూ.40 లక్షలు వెచ్చించి ఓ చిన్న కాలువకు ఫైబర్ చెక్‌డ్యాం నిర్మించారు. పనులు చేసిన కొద్ది రోజులకే నాణ్యత లోపించి ప్రధాన కట్టడం నెర్రెలు బారి నాణ్యతా లోపం స్పష్టంగా కనిపించింది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన 80 శాతం చెక్, ఫైబర్ డ్యామ్‌లు కేవలం ఐదారేళ్లల్లోనే కనుమరుగు అయ్యాయి. త్వరితగతిన తనిఖీలు పూర్తి చేస్తాం జిల్లాలో గతంలో జరిగిన నీరు– చెట్టు పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆయా పనులకు సంబంధించి వాస్తవ పరిస్థితిపై పూర్తిస్థాయిలో త్వరితగతిన తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులతో 43 బృందాలను ఏర్పాటు చేశాం. 3,308 పనులకు సంబంధించి పనులను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పనులు పరిశీలన పూర్తి చేశారు. పనుల నిగ్గు తేల్చి హైకోర్టుకు నివేదిస్తాం. కోర్టు ఆదేశాలు మేరకు చర్యలు చేపడతాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, కలెక్టర్ -
టీడీపీ బడాయి.. బిల్లుల కోసం లడాయి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పథకం పనులు చేసేందుకు జన్మభూమి కమిటీల సభ్యులు, నీటిసంఘం అధ్యక్ష, కార్యదర్శులు, టీడీపీ సర్పంచ్‌లు కాంట్రాక్టర్లుగా, కాంట్రాక్టర్లకు బినామీలుగా అవతామరమెత్తారు. పెద్దల అండదండలతో ప్రజాధనాన్ని కైంకర్యం చేశారు. పథకం లక్ష్యాన్ని పక్కనపెట్టేశారు. ఫలితం.. చెరువులు బాగుపడలేదు. చెక్‌డ్యామ్‌లు చెదిరిపోతున్నాయి. కాలువలు పూడుకుపోయాయి. చెరువుగట్లు పటిష్టం కావడం మాటెలా ఉన్నా ఉన్న గట్లే పాడైపోయాయి. దీనికి బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన పనులే ఓ నిదర్శనం. ►బొబ్బిలి మండలంలోని ఓ పంచాయతీ పరిధి లోని చెరువు పనులను బీజేపీ నాయకుడి సోదరుడికి అప్పగించారు. మరో పంచాయతీ పరిధిలో రూ.50 లక్షల పనులను 10 శాతం కమీషన్‌కు అమ్మేసి పట్టణంలోని ఓ టీడీపీ నాయకుడి అక్రమ నిర్మాణాలకు గ్రావెల్ తరలించారు. బొబ్బిలి పట్టణంలో మల్లమ్మపేటకు చెందిన ఓ టీడీపీ నాయకుడు రామన్నదొరవలస వద్ద 30 ట్రాక్టర్లతో గ్రావెల్ తవ్వేసి గ్రోత్‌సెంటర్‌కు అమ్మేశాడు. అప్పటి ఓ టీడీపీ కౌన్సిలర్ మేనల్లుడు నేరుగా అధికారుల పేరుచెప్పి నీరు–చెట్టు పనులు చేయకపోయినా ఆ పేరుతో చెరువులో గ్రా వెల్ తవ్వేçస్తూ అక్రమార్జన చేశాడు. సీతయ్యపేటలో నీరు–చెట్టు కింద రూ.9 లక్షల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను అప్పటి గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణారంగారావు స్వయంగా ప్రారంభించారు. ఆ చెక్‌డ్యామ్ ఎంత నాణ్యతలోపాలతో నిర్మించారో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. గతంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పిరిడి సీతారామసాగరం, అలజంగి దాలెందర చెరువు పనులను మళ్లీ నీరు– చెట్టుకింద చేసి నిధులు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.3 కోట్లు హాంఫట్... 2014–15 సంవత్సరంలో మంజూరైన ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రామభద్రపురం మండలంలో దాదాపు రూ.6 కోట్లతో చెక్‌డ్యాంలు, మదుములు, చప్టాలు ఇలా 102 నిర్మాణ పనులు చేశారు. వాటిలో సుమారుగా రూ.3 కోట్లకు పైబడి అక్రమాలు జరి గినట్లు సోషల్ ఆడిట్లో వెలుగుచూసింది. రెండు నెలల పాటు పరిశీలించిన విజిలెన్స్ అధికారులు ఆ అక్రమాలను నిర్ధారించారు. రావివలస పంచాయతీ మినహా దాదాపు అన్నిచోట్లా అక్రమాలు చోటుచేసుకున్నాయి. తెర్లాంలో నాణ్యత డొల్ల... తెర్లాం మండలంలో నీరు–చెట్టు పనుల ఫలితంగా చెరువు గట్లు దెబ్బతిన్నాయి. నందిగాం చౌదరిచెరువులో పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. పనులు జరగకముందు రెండు నాటు బళ్లు గట్టుపై నుంచి వెళ్లిపోయేవి. తీరా పనిచేసిన తరువాత ఒక్క నాటుబండి కూడా వెళ్లడం కష్టంగా ఉందని రైతులు అంటున్నారు. చెరువులోనుంచి తీసిన మట్టిని సైతం అమ్మేశారంటే దోపిడీని ఊహించవచ్చు. తెర్లాం మండలంలో పలు పనులను అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి బంధువులకు అప్పగించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో నందిగాం, కుసుమూరు, తెర్లాం గ్రామా ల్లోని చౌదరి చెరువు, గురివినాయుడు చెరువు, గుర్రమ్మ చెరువుల అభివృద్ధికి రూ.35 లక్షల చొప్పున అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. పనులు అంతంతమాత్రంగానే చేసి బిల్లులు పూర్తిస్థాయిలో చేసుకోవడం గమనార్హం. చదవండి: రైలు డ్రైవర్‌కు గుండెపోటు.. తప్పిన పెను ప్రమాదం -
నీరు–చెట్టు పనుల్లో భారీ అక్రమాలు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో నీరు–చెట్టు పథకం కింద జరిగిన పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. పనులు చేయకుండానే చేసినట్లు, 50 శాతం పనులు చేసి 100 శాతం పనులు చేసినట్లు కాంట్రాక్టర్లు తప్పుడు లెక్కలు చూపారని వివరించింది. నీరు–చెట్టు కింద జరిగిన పనులన్నింటిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించామని తెలిపింది. ► విజిలెన్స్ విచారణ నేపథ్యంలోనే చెల్లింపులన్నింటినీ నిలిపేశామంది. విజిలెన్స్ విచారణ జరుగుతున్నందున పిటిషన్లపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. ► ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఉత్తర్వులు జారీ చేశారు. నీరు–చెట్టు కింద పనులను పూర్తి చేసినప్పటికీ తమకు చెల్లించాల్సిన మొత్తాలను ప్రభుత్వం ఆపేసిందంటూ కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాదరావు, శ్రీధర్, మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ► ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ రజనీ మంగళవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కాంట్రాక్టర్లతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని తెలిపారు. విజిలెన్స్ విచారణలో అన్నీ తేలతాయన్నారు. -
నీరు చెట్టు.. టీడీపీ నాయకులపై కేసులు
బొబ్బిలి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన నీరు–చెట్టు పనుల అక్రమాలపై మళ్లీ కదలిక మొదలైంది. ఏసీబీ అధికారులు ఇప్పుడు అక్రమాలను వెలికి తీసేపనిలో పడ్డారు. అప్పట్లో టీడీపీ నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పనులు చేయకుండా బిల్లులు చేయించుకోవడం... నాసి రకం పనులతో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడంపై అప్పట్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. డీఈఈ, ఏఈలను సస్పెండ్ చేయడం కొంత మొత్తాన్ని రికవరీకి ఆదేశించడం తెల్సిందే. మరింత లోతుగా వెళ్లేందుకు ఏసీబీ అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.5.6 కోట్లకు పైగా ఉపాధి హామీ ద్వారా చేపట్టిన నీరు చెట్టు పనుల్లో అవినీతి చోటు చేసుకున్నట్టు తేలింది. ఇందులో దాదాపు సగానికి పైగా అంటే రూ.3.4 కోట్ల విలు వయిన పనులు ఒక్క రామభద్రపురం మండలంలోనే జరిగినట్టు అప్పట్లో పలు శాఖల అధికారుల విచారణలో తేలింది. ఇప్పుడు తాజాగా ఏసీబీ అధికారులు వీటి వివరాలను సేకరిస్తున్నారు. పలుశాఖలకు సంబంధించి విడుదలైన నిధులు, చేసిన బిల్లులపై ఆరా తీస్తున్నారు. రామభద్రపురం మండలాధికారులకు లేఖలు రామభద్రపురం మండలంలో అభివృద్ధి పనుల ముసుగు లో టీడీపీ నాయకులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అధికారు ల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. దీనిపై విజిలెన్స్ అధికారులు పలుమార్లు విచారణ చేపట్టారు. అక్రమాల గుట్టు తేల్చారు. అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి కోట్లలో బిల్లులు కాజేసినట్టు ఆధారాలు సంపాదించి కేసులు నమో దు చేశారు. ఈ అక్రమాలపై సివిల్ పోలీసులు కూడా కేసు లు నమోదు చేసి అప్పటి అధికార పార్టీ నాయకులను పో లీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. రామభద్రపురంలో 2015–16 ఏప్రిల్ వరకు ఉపాధిహామీ, జలవనరుల శాఖ ఆద్వర్యంలో జరిగిన ఉపాధిపనుల్లో టీడీపీ నాయ కులు పనులు చేయకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లు లు చేసుకోవడం.. నాసిరకంగా పనులు చేయడం.. తక్కువ పనిచేసి ఎక్కువగా నమోదుచేçయడం.. తూతూ మంత్రంగా చక్కబెట్టేసి సొమ్ము చేసుకోవడంపై పెద్ద ఎత్తున దుమారం రేగినా వారు లెక్క చేయలేదు. 2017 నవంబర్‌లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డీఈఈ ఆర్.ఆర్.విద్యాసాగర్, ఏఈఈలు శామ్యూల్, రవికాంత్‌తో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. 2015–16లో రూ.5.7కోట్లతో చేపట్టిన 102 ఉపాధిపనులు సక్రమంగా లేవని, కొన్ని పనులు జరగకుండా బిల్లులు చెల్లించినట్లు గుర్తించి నివేదికలు విజిలెన్స్ ఎస్పీ హరికృష్ణకు అందజేశారు. వాటి ఆధారంగా ఆయన 2018 ఏప్రిల్‌లో మండలంలోని మామిడివలస, కోటశిర్లాం, కొండకెంగువ, ఎస్ సీతారాంపురం, ఇట్లామామిడిపల్లిలో అకస్మికంగా పర్యటించి కొన్ని పనుల నాణ్యతను పరిశీలించారు. మొత్తం 102 పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, చెక్‌డ్యాంలు, మదుములు, చప్టాలకు టెక్నికల్ మంజూరు లేకుండా పనులు జరిపినట్లు, నాసిరకంగా నిర్మించడంతో పాటు ఉపయోగంలేని పనులు చేసినట్లు గుర్తించారు. మొత్తం నిధుల్లో సుమారు రూ.4 కోట్ల వరకు అవకతవకలు జరిగి నిధులు స్వాహా అయినట్లు నిర్థారించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అప్పగించినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఉపాధిహామీ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి ఎంబుక్, చెక్ మెజర్‌మెంట్లలో మామిడివలస, నాయుడువలస, కోటశిర్లాం, తారాపురం గ్రామ సర్పంచ్‌లు తమ సంతకం ఫోర్జరీ చేశారని అప్పటి ఇరిగేషన్ ఈఈ జి.వి.రమణ ఫోలీసులకు పిర్యాదు చేసినా నామమాత్రంగా విచారణ జరిపినా చర్యలు తీసుకోలేదు. నాటి అక్రమాలపై ఏసీబీ ఆరా... రామభద్రపురంతో పాటు పలు మండలాల్లో 2015–16లో చేపట్టిన ఉపాధిహామీ పనులకు సంబంధించి ఎంబుక్‌లు, ఎఫ్‌టీవోలు, వర్క్ కమిట్మెంట్ లెటర్స్ తదితర వివరాలు పంపించాలని విజయనగరం ఏసీబీ డీఎస్పీ కార్యాలయం నుంచి ఎంపీడీఓకు లేఖ అందజేశారు. ఈ విషయాన్ని రామభద్రపురం ఎంపీడీఓ బి.ఉషారాణి ధ్రువీకరించారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఏసీబీ అధికారులు కోరిన సమా చారం సిద్ధం చేయమని చెప్పినట్టు అప్పటి ఈఈ జి.వి.రమణ తెలిపారు. తన సంతకాన్ని అప్పట్లో సర్పంచ్‌లే ఫోర్జరీ చేసినట్టు పోలీసులకు తానే ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో కమిన్స్‌మెంట్ లెటర్లు, ఎం బుక్‌లు, పే ఆర్డర్ కాపీలు, ఎఫ్టీఓలు(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు), బ్యాంక్ లావాదేవీల కాపీల వంటి పలు వివరాలు ఏసీబీ అధికారులు కోరారు. -
నీరు– చెట్టు.. కనిపిస్తే ఒట్టు
అభివృద్ధి ముసుగులో అధికారంలో ఉన్న ఐదేళ్లూ టీడీపీ భారీ దోపిడీకి తెర తీసింది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు వివిధ పథకాల పేరుతో రూ.కోట్లు దోచిపెట్టింది. అధికార అంతం వరకు అవినీతి వేట సాగించింది. ప్రధానంగా జిల్లాలో నీరు–చెట్టు పేరుతో వందల కోట్ల అవినీతికి పాల్పడింది. ఈ పనుల్లో అక్రమాలపై పెద్ద ఎత్తున దుమారం రేగినా లెక్క చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల నాణ్యతపై జిల్లాలో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్రమాలను నిగ్గు తేలి్చంది. ఇప్పటికే నీరు–చెట్టు పనుల నాణ్యతా ప్రమాణాలపై నివేదిక ప్రభుత్వానికి పంపిన విజిలెన్స్ తాజాగా ఉపా«ధి హామీ పథకం పనుల నాణ్యతను తనిఖీ చేసింది. నాణ్యత పరిశీలనకు కోర్ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా ఉపాధి పనుల అవినీతిపై కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. సాక్షి, నెల్లూరు: టీడీపీ హయాంలో జిల్లాలో నీరు– చెట్టు, ఉపాధి హామీ పథకాలు ఆ పార్టీ నేతలకు ఆదాయ వనరులుగా మారాయి. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నీరు–చెట్టు పనులను టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ద్వితీయ కేడర్ నేతలకు పందేరం చేసి వాటాలు పంచుకున్నారు. 2015–16 ఏడాది నుంచి ప్రారంభమైన నీరు– చెట్టు పథకం కింద జిల్లాలో 2017–18 వరకు 13,780 పనులకు రూ.711 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇక చివరి ఏడాది 2018–19లో ఎన్నికల సమీపించడంతో అనామతుగా దాదాపు రూ.200 కోట్ల మేర పనులు హడావుడిగా చేపట్టి నిధులు ఆరగించేందుకు విఫలయత్న చేశారు. ►టీడీపీ నేతలు, జలవనరులశాఖ అధికారులు సైతం నీరు–చెట్టు అవినీతిలో భాగస్వామ్యులై నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. ►సుమారు రూ.911 కోట్ల మేర నీరు–చెట్టు పథకం కింద పనులు చేపడితే ఎక్కడా పక్కా అభివృద్ధి పనులు చేసిన దాఖాలాలు లేవు. ►చేసిన పనులు తిరిగి చూస్తే కనిపించని తాత్కాలికమైన నీటిలో కొట్టుకుపోయే మట్టి పనులు చేసి రూ.కోట్లు దిగమింగారు. ►తొలి మూడేళ్లలోనే సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు పక్కదారి పట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ►ఇరిగేషన్, తెలుగుగంగ శాఖల్లో జరిగిన పనులతో పాటు, నెల్లూరు సెంట్రల్ ఇరిగేషన్ విభాగంలో జరిగిన పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్ తనిఖీల్లో నిగ్గు తేలినట్లు సమాచారం. ►ఇక చివరిలో పనులు హడావుడిగా చేసి బిల్లులు చేసుకునే ప్రయత్నం జరిగినా.. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో బిల్లులు నిలిచిపోయాయి. ►జిల్లాలో నీరు–చెట్టు పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఫైబర్ చెక్ డ్యామ్‌ల్లో అవినీతి ధార ఉదయగిరి నియోజకవర్గంలో మహారాష్ట్ర నాగపూర్ టెక్నాలజీ పేరుతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆయన అనుచరులు ఫైబర్ చెక్‌డ్యామ్ నిర్మాణంలో భారీ దోపిడీ చేసిన వైనం విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ►గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని బొల్లినేని భారీ దోపిడీకి పథకం వేసి మొత్తం 24 ప్యాకేజీల కింద 210 పైబర్ చెక్ డ్యామ్‌లను మంజూరు చేయించారు. ►ఆయా చెక్ డ్యామ్‌లకు దాదాపు రూ.72 కోట్లు నిధులు మంజూరు చేయించి తన అస్మదీయులకు కమీషన్ల రూపంలో పందేరం చేశారు. ►ఆయా టెండర్లను తన సూట్‌కేసు కంపెనీలైన సిగ్మా, శ్రీనివాస కంపెనీల పేరుతో టెండర్లు వేయించి పనులు కేటాయించారు. ►చెక్‌డ్యామ్ నిర్మాణాల్లో ఎక్కడా నాణ్యతకు చోటివ్వలేదు. ఫైబర్ చెక్‌డ్యామ్‌ల నాణ్యతపై పరిశీలన చేసిన విజిలెన్స్ అధికారులు కొంత మెటీరియల్‌ను కోర్ ల్యాబ్ పంపించారు. ►ఫెబర్ చెక్‌డ్యామ్‌ల్లో నాణ్యత లేదని తేలింది. ఉపాధి పనుల్లోనూ మేత జిల్లాలో మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప«థకం నిధులతో వివిధ శాఖల విభాగాలతో చేపట్టిన అభివృద్ధి పనులపై కూడా విజినెన్స్ ఎన్ఫోర్స్మెంట్ క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ►అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఉపాధి నిధులను దారి మళ్లించి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. ►ప్రత్యేకంగా 1 అక్టోబరు 2018 నుంచి 31 మే 2019 వరకు 9 నెలల కాలంలో జరిగిన దా దాపు రూ.100 కోట్లు విలువైన 823 పనుల నాణ్యతపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. ►తనిఖీల్లో సేకరించిన నమూనాల్లో నాణ్యత ఎంత అనే నిగ్గు తేల్చే పనిలో భాగంగా కొన్ని శాంపిల్స్‌ను కోర్ ల్యాబ్‌కు పంపారు. ►జిల్లాలో ఎక్కువగా వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్లాల్లో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ►సీసీరోడ్లు, కల్వర్టులు, చెక్‌డ్యామ్‌లు, ఫారంఫాండ్స్, మరుగుదొడ్లు, నాడెప్‌లు, శ్మశానాల అభివృద్ధి, మొక్కలు పెంపకం, చెత్తతో సంపద సృష్టి, వర్మీకంపోస్ట్ తొట్టెలు, తాత్కాలిక రోడ్ల నిర్మాణం ఇలా పలు శాఖల పనులన్నింటి పై శోధన చేసి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. నమూనాలు ల్యాబ్‌కు పంపాం జిల్లాలో నీరు–చెట్టు పనులపై ఇప్పటికే పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. చాలా చోట్ల మెజార్టీ పనుల్లో భారీగానే అక్రమాలు జరిగాయి. ఇంతని స్పష్టంగా చెప్పలేం. ఇక ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల నమూనాలను స్వీకరించి ల్యాబ్‌కు పంపాం. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నాం. – వెంకటనాథ్‌రెడ్డి, ఓఎస్డీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ -
నీరు–చెట్టు.. అక్రమాల కనికట్టు
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చూస్తే చాలు. అలాగే టీడీపీ హయాంలో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో కొన్నింటిని పరిశీలిస్తే చాలు అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన నీరుచెట్టు పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేలి్చంది. తమకొచ్చిన ఫిర్యాదుల మేరకు శాంపిల్‌గా కొన్నింటిపై విచారణ చేపట్టగా తీగలాగితే డొంక కదిలినట్టు పెద్ద ఎత్తున అవినీతి బయటపడింది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అధికారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 427.24 కోట్లతో 5696 పనులు చేపట్టగా ఇందులో సగానికి పైగా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. నీరు చెట్టు పనులు ఎంత నాసిరకంగా జరిగాయో ప్రజలందరికీ తెలిసిందే. ఎవరెంత గోల పెట్టినా నాడు పట్టించుకోలేదు. ఇప్పుడా పాపాలు విజిలెన్స్ విచారణలో వెలుగు చూశాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో నీరు చెట్టు పనులు పచ్చనేతలకు కల్పతరువుగా మారాయి. వారికి నచ్చినంత అంచనాలు రూపొందించుకుని, వాటికి నిధు లు మంజూరు చేయించుకుని, నామినేషన్ పద్ధతిలో పనులు కొట్టేసి వందల కోట్లు దిగమింగారు. గ్రామ స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రి వరకు యథేచ్ఛగా నీరు చెట్టు నిధులను దోచేశారు. దోచిన సొమ్ముతో బహుళ అంతస్థుల భవనాలు, ఎకరాల కొద్దీ భూములు, కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సంపాదించారు. చెరువులో మట్టి తవ్వకాలకు క్యూబిక్ మీటర్‌కు రూ.29 చొప్పన చెల్లించాల్సిన బిల్లులకు క్యూబిక్ మీటర్‌కు రూ.82.80 చెల్లించారు. తవ్విన మట్టిని అమ్ముకుని కోట్లాది రూపాయలు మింగేశారు. ఆ విక్రయించిన మట్టిని నీరు చెట్టు పనుల కింద తవ్వినట్టు బిల్లులు చేసుకున్నారు. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్ డ్యామ్‌లు, స్లూయిజ్‌లు... ఇలా రకరకాల కాంక్రీటు పనుల రూపంలో కూడా పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. నాసిరకం పనులు చేపట్టడంతో చేసిన పనులు కొన్నాళ్లకే వర్షాలకు కొట్టుకుపోయాయి. గతంలో చేసిన పనులకు మెరుగులు దిద్ది మరికొన్నిచోట్ల పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. నాసిరకం నిర్మాణ సామగ్రితో మరికొన్నిచోట్ల పనులు చేసి పెద్ద ఎత్తున నిధులు డ్రా చేశారు. కొన్నిచోట్ల పనులు చేయకుండానే చేసినట్టు చూపించారు. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక టీడీపీ హయాంలో జరిగిన నీరు చెట్టు అక్రమాలపై పక్కా ఆధారాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక తయారు చేశారు. ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందో ఉదాహరణతో సహా చూపించారు. అంకెలతో సహా అవినీతి లెక్క తేల్చారు. వీటిన్నింటిపైనా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. విశేషమేమిటంటే ఒకపక్క విజిలెన్స్ విచారణలో నీరు చెట్టు పనుల్లో అవినీతి జరిగిందని తేలగా అదే సమయంలో ఆ పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడైతే గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇస్తావా? లేదా? అన్నట్టుగా బెదిరింపులకు సైతం దిగినట్టు సమాచారం. టెక్కలి మండలం తిర్లంగి సమీపంలోని కొత్త చెరువు జిల్లాలో జరిగిన నీరు చెట్టు అక్రమాలివి... •ఉన్న చెరువు గట్లను బలపడేటట్టు చేయకుండా దానికి బదులు చెరువు గర్భం ఆవల గల ప్రాంతంలో గట్లను వేశారు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్ మీటర్‌కు రూ.29కు గాను రూ.82.80 చెల్లించారు. ఈ విధంగా 25 పనులకు రూ.59.08 లక్షలు అధికంగా ఖర్చు చేశారు. •చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా ఉన్న దాని కంటే అ«ధికంగా నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచారు. ఈ లెక్కన రూ.12.52 లక్షలు స్వాహా చేశారు. •తవ్విన మట్టి శ్మశానం, ఇళ్లు వంటి అవసరాలకు కాకుండా ప్రైవేటు రోడ్లకు వేసుకున్నారు. ఈ తరహాలో చూపించిన 8 పనుల ద్వారా రూ.53.21 లక్షలు అక్రమంగా కొట్టేశారు. •చెరువు మధ్యలో రోడ్డు వేసి ఒక పని కింద రూ.2.14 లక్షలు మింగేశారు. •వర్షాకాలంలో పాడయ్యే తారురోడ్డు బండకి మట్టిని వేశారు. దీనికింద రూ.7.11 లక్షలు తినేశారు. •ఒక పనికి ఒక అంచనా రూపొందించి, దానికి అదనంగా నిర్మాణం పేరుతో రూ.లక్షా 60 వేలు నొక్కేశారు. యంత్రాలతో చేసే పనిని మనుషులతో చేసినట్టు చూపించి 14 పనులకు గాను రూ.7.61 లక్షలు వెనకేసుకున్నారు. •పనుల్లో డిజైన్లు డ్రాయింగ్ లేకుండా పనిచేసి రూ.76.23 లక్షలు తినేశారు. •నాలుగు పనులకు తక్కువ పనిచేసి ఎక్కువ నమోదు చేసి రూ.లక్షా 15 వేలు స్వాహా చేశారు. సర్పలెస్ వియ్యర్కు చెందిన 2 పనులకు కొలతలు తక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.2.62 లక్షలు దుర్వినియోగం చేశారు. •మట్టిగట్టు వేయడానికి 5 మీటర్ల దగ్గర్లో మట్టిని తవ్వేసి రూ.3.53 లక్షలు దిగమింగారు. •పనుల టెండర్ల వరకు వెళ్లకుండా టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేందుకు ఒక పనిని ముక్కలు ముక్కలుగా విడదీశారు. •తవ్విని మట్టిని ప్రధాన గట్టుపై వేయకుండా ఇతర అవసరాలకు వినియోగించి నిధులు మింగేశారు. •రూ.5 లక్షల విలువ లోపు గల పనులను మాత్రమే నామినేషన్ ద్వారా చేపట్టాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలో రూ.50 లక్షల వరకు నామినేషన్ పనులను కట్టబెట్టి నిధులు స్వాహా చేశారు. •నిబంధనల ప్రకారం 50 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50 ఎకరాల కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు చేసి నిధులు దుర్వినియోగపరిచారు. •గడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎటువంటి డిజైన్ లేకుండా చెక్ డ్యామ్‌లను నిర్మించారు. •నీరు చెట్టు కార్యక్రమంలో రక్షణ గోడలు నిర్మించరాదు. కానీ అందుకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవునా రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. -
నీరు–చెట్టు పేరుతో దోపిడీ
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ‘నీరు–చెట్టు’అవినీతికి మారుపేరుగా నిలిచింది. ఈ పథకం కింద ఉదయగిరి చెరువు పూడికతీత పనుల పేరుతో రూ.లక్షలు మింగేశారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలలముందు అభివృద్ధి పేరుతో పట్టణ ముఖద్వారం వద్ద ఉన్న చెరువు పూడికతీత పనులు తూతూమంత్రంగా చేసి అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ప్రజాధనాన్ని దోచుకున్నారు. సాక్షి, ఉదయగిరి: గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న బొల్లినేని వెంకటరామారావు ట్యాంక్‌బండ్ రూపురేఖలే మార్చేస్తానని పలుమార్లు ఉదయగిరి పట్టణంలో జరిగిన సమావేశాల్లో గొప్పలు చెప్పారు. ఐదేళ్లపాటు చెరువు అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పట్టణానికి వచ్చిన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అభ్యర్థన మేరకు అధ్వానంగా ఉన్న ట్యాంక్‌బండ్ అభివృద్ధి కోసం నిధులు మంజూరుచేశారు. ఆ నిధులతో పనులు చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి వైఎస్సార్సీపీలో కొనసాగటం, అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసే అవకాశం మేకపాటికి దక్కలేదు. మళ్లీ వచ్చిన ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ట్యాంక్‌బండ్ అభివృద్ధిని ఉదయగిరి ముఖద్వారపు రూపురేఖలు మారుస్తానని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కనీసం గతంలో ఆగిపోయిన ముఖద్వారం పనులు కూడా పూర్తిచేయలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టణ ప్రజలను మభ్యపెట్టే నిమిత్తం, స్థానిక నేతలకు ఆదాయం సమకూర్చే నిమిత్తం ఉదయగిరి చెరువు పూడికతీత కోసమని రూ.34 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. తూతూమంత్రంగా పనులుచేసి అందులో రూ.18 లక్షలకు రికార్డు చేశారు. కేవలం రెండు మూడు లక్షలకంటే ఎక్కువ పనులు జరగలేదని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. అయినా అధికారులు లెక్కచేయకుండానే అధిక మొత్తంలో ఎంబుక్‌లు రికార్డు చేశారని ఆరోపణలున్నాయి. తదనంతరం ప్రభుత్వం మారటంతో మరింత నిధులు దోపిడీకి అడ్డుకట్ట పడింది. ఈ పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అవినీతిని వెలికితీస్తాం ఉదయగిరి ఆనకట్ట పూడికతీత పనుల పేరుతో అవినీతి జరిగింది. తూతూమంత్రంగా పనులు చేసి రూ.లక్షలు దిగమింగారు. అందరి కళ్లెదుటే ఈ దోపిడీ జరిగింది. కొంతమంది స్థానిక నేతలు ప్రజాధనం దోచేశారు. ఈ పనుల్లో జరిగిన అవినీతిపై ప్రతిపక్షంగా తాము అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ ఎమ్మెల్యేగా ఈ పనులపై పూర్తిస్థాయి విచారణ చేయించి అందులో భాగస్వామ్యం ఉన్న కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకుంటాం. – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
నీరు–చెట్టు.. గుట్టురట్టు!
సకల జీవరాశుల మనుగడకు నీరు–చెట్టు అత్యవసరం. అయితే వీటి పేరుచెప్పి గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలను అక్రమార్కులు బొక్కేశారు. నీరు–చెట్టు పథకాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. టీడీపీ ప్రజాప్రతినిధులే ఈ అవకతవకల్లో కీలకంగా వ్యవహరించడంతో అధికారులూ ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. అవినీతి, అక్రమాలు కళ్లముందు జరిగిపోతున్నా.. అడ్డుకోలేక పోయారు. సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం నీరు–చెట్టు పథకంలో అవినీతి బాగోతాన్ని బయట పెట్టేందుకు, నిధులను మేసిన నేతల గుట్టురట్టు చేసేందుకు అధికార యంత్రాంగం కదులుతోంది. ప్రగల్భాలు పలికి.. రూ.కోట్లు బొక్కి.. నీరు–చెట్టు పథకం ద్వారా భవిష్యత్తులో సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు వాస్తవానికి ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టడానికి వాడుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నీరు–చెట్టు పథకంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. చెరువుల్లో పూడిక తీయడం ద్వారా గట్లను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన పనుల్లో రూ.వందల కోట్లు అక్రమార్కులు వెనకేసుకున్నారు. గ్రామస్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేల స్థాయి నాయకుల వరకూ ఈ అక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి నిధులు కాజేస్తూనే.. మరోవైపు చెరువుల్లో తవ్విన మట్టినీ అక్రమార్కులు అమ్ముకుని రూ.కోట్లు సంపాదించారు. ఈ పథకం ద్వారా చెరువులో తవ్విన మట్టిని సామాజిక అవసరాలకు వినియోగించాలని ఆదేశాలు ఉన్నా.. వాటిని బేఖాతరు చేశారు. చెరువు తవ్వకాలు, రిటెయినింగ్ వాల్ నిర్మాణాలు ఇలా రకరకాల పనుల్లో నిధులు స్వాహా చేశారు. పనులను నాసిరకంగా.. తూతూమంత్రంగా మమ అనిపించారు. కొన్నిచోట్ల నామినేషన్ పద్ధతిలో టీడీపీ నేతలే పనులను దక్కించుకుని నిధులు కాజేశారు. చెరువు తవ్వకాల పనుల్లో క్యూబిక్ మీటర్ మట్టి తీతకు ప్రభుత్వం రూ.29 చెల్లించింది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే మొత్తం తోపాటు అదనంగా మట్టి విక్రయాలు చేసి వచ్చిన సొమ్మునూ అక్రమార్కులు మింగేశారు. అక్రమాలపై ప్రత్యేక దృష్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. నీరు–చెట్టు పథకం అవకతవకలపై విచారణకు ఉపక్రమించింది. పథకంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రారంభం కాని పనులను రద్దు చేసింది. మొదలైన విచారణ జిల్లావ్యాప్తంగా నీరు–చెట్టు పథకం పేరుతో ఎన్ని చెరువుల పనులు చేపట్టారు? ఎన్ని కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి? ఎన్ని కోట్ల మేర పనులు నిర్వహించారు? అనే అంశాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెరువులను గుర్తించే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. 20 రోజులుగా విజిలెన్స్ అధికారులు పనులను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 70 శాతం పనులను పరిశీలించి జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ఓ అంచనాకు వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి అక్రమార్కులు బొక్కినదంతా కక్కించేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. పథకం నిర్వహణ ఇలా.. ఈ పథకాన్ని 2015 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. 2014–15లో జిల్లాలో ఏ పనీ చేపట్టలేదు. తర్వాత నాలుగేళ్లలో రూ.263.94 కోట్లతో పనులు చేశారు. ఈ ఖర్చులో సుమారు 70 శా తం దుర్వినియోగమైందని అంచనా. -
అవి‘నీటి’ ఆనవాలు!
సాక్షి, శ్రీకాకుళం: నీరు చెట్టు సాక్షిగా జరిగిన అక్రమాలు బట్టబయలవుతున్నాయి. ఉపాధిని ధ్వంసం చేసి యంత్రాలను ప్రవేశపెట్టి దోచుకున్న విధానాన్ని అధికారులు తేటతెల్లం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జల సంరక్షణైతే జరగలేదు గానీ వందల కోట్ల రూపాయల నిధులు మాత్రం మింగేశారు. ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందన్న ధోరణిలో తెలుగు తమ్ముళ్లు బరితెగించి స్వాహా చేసేశారు. అధికారులు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో జీ హుజూర్ అనేశారు. ఇప్పుడీ అక్రమాలపై శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. 80 శాతం మేర విచారణ ఇప్పటికే పూర్తయింది. అక్రమాలు జరిగినట్టు దాదాపు తేలింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. నిధులు మింగేసిన వారిని బాధ్యులుగా చేస్తూ, వారి నుంచి తిన్నదంతా కక్కించేందుకు సిఫార్సు చేయనున్నారు. ఇదో పెద్ద కుంభకోణం గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు యథేచ్ఛగా నీరు చెట్టు నిధులను దోచేశారు. ఇంజనీరింగ్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలుగా తినేశారు. చెరువుల్లో మట్టి తవ్వకాల పేరుతో క్యూబిక్ మీటర్‌కు రూ.29 చొప్పున ప్రభుత్వం నుంచి నిధులు డ్రా చేసుకోగా, మరోవైపు తవ్విన మట్టిన అమ్ముకుని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. నీరు–చెట్టు పథకం కింద చెరువుల్లో తవ్విన మట్టిని సామాజిక అవసరాలకు వినియోగించాలన్న ఆదేశాలను తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేశారు. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్‌లు,..ఇలా రకరకాల కాంక్రీటు పనుల రూపంలో కూడా పెద్ద ఎత్తున నిధుల స్వాహాకు పాల్పడ్డారు. నాసిరకం పనులు చేపట్టి కొన్ని చోట్ల, గతంలో చేసిన పనులకు మెరుగులు దిద్ది మరికొన్ని చోట్ల, నాసిరకం నిర్మాణ సామగ్రితో ఇంకొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల అయితే అసంపూర్తిగా పనులు చేసి పూర్తి స్థాయిలో బిల్లులు చేసుకోగా, పలు గ్రామాల్లో పనులు చేయకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. మన జిల్లాలోనే కాదు పొరుగునున్న విజయనగరంలో కూడా అదే జరిగింది. కొలతల్లో తేడాలైతే చెప్పనక్కర్లేదు. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే రూ. 5లక్షలకు మించిన పనులను టెండర్ల ద్వారా ఖరారు చేయాల్సి ఉండగా నిబంధనలకు తిలోదకాలిచ్చి ఏకపక్షంగా పనులు కొట్టేశారు. చెప్పాలంటే నీరుచెట్టు నిధులను నామినేటేడ్ పద్దతిలో మింగేశారు. చెలరేగిపోయిన జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు చేసిన అరాచకం ఇంతా ఇంతా కాదు. నీరు చెట్టు కింద చేపట్టే పనులన్నీ వారే దక్కించుకున్నారు. గ్రామాల వారీగా నిధులు పంచేసుకున్నారు. టీడీపీ సర్పంచ్‌లున్నచోట జన్మభూమి కమిటీలు కుమ్మక్కై పనులు చేపట్టగా, టీడీపీ సర్పంచ్‌లు లేని చోట జన్మభూమి కమిటీలు, ఇతర నాయకులు ఏకపక్షంగా పనులు చేసి నిధులు కైంకర్యం చేశారు. టీడీపీ నేతల ధనదాహాన్ని అడ్డుకునేలా ఎక్కడైతే వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు ఉన్నారో అక్కడ నిధులు మంజూరు చేయకపోవడం విశేషం. చకచకా విచారణ.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నీరుచెట్టు పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాదయాత్రలో దారి పొడవునా వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచా రణకు ఆదేశించారు. అందులో భాగంగా శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు జిల్లాలో సమగ్ర విచారణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో రికార్డుల ప్రకారం చేసినట్టుగా చూపిస్తున్న రూ. 427.24కోట్ల విలువైన 5696 పనులపైనా, విజయనగరం జిల్లాలో రూ. 177.52కోట్లు విలువైన 4312 పనులపై వి చారణ చేస్తున్నారు. ఇప్పటికే 80శాతం విచారణ జరిగిపోయింది. అందులో దాదాపు అక్రమాలు వెలుగు చూశాయి. విచారణలో వెలుగు చూసిన అక్రమాలివి ► నిబంధనలకు విరుద్ధంగా మట్టి పనిచేశారు. మదుము అడుగు భాగం కంటే బాగా దిగువన మట్టి పనులు చేసి అడ్డగోలుగా నిధులు డ్రా చేసేశారు. ► ఉన్న చెరువు గట్లను బలపడేటట్లు చేయకుండా దానికి బదులు చెరువు గర్భం ఆవల గల ప్రాంతంలో గట్లను వేశారు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్ మీటర్‌కు రూ. 29కు గాను రూ. 82.80చెల్లించారు. అంటే క్యూబిక్ మీటర్‌కి రూ. 53.80 చొప్పున అధికంగా చెల్లించారు. ► చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా, ఉన్న దాని కంటే అధికంగా న మోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వి నియోగం చేశారు. ► పనులు టెండర్ల వరకు వెళ్లకుండా టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేందుకు ఒక పనిని ముక్కలు ముక్కలుగా విడదీశారు. ► తవ్విన మట్టిని ప్రధాన గట్టుపై వేయకుండా ఇతర అవసరాలకు వినియోగించి నిధులు మిం గేశారు. ► నిబంధనల ప్రకారం రూ. 5లక్షల విలువ లోపు గల పనులను మాత్రమే నామినేటేడ్ ద్వా రా చేపట్టాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలో రూ. 50లక్షలు వరకు నామినేషన్ ద్వారా పనులను కట్టబెట్టి నిధులు స్వాహా చేసేశారు. ► నిబంధనల ప్రకారం 50ఎకరాలు ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50ఎకరాలు కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు నిధులు దుర్వినియోగం చేశారు. ► గడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఎలాంటి డిజైన్ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. ► నీరు చెట్టు కార్యక్రమంలో రక్షణ గోడలు నిర్మించరాదు. కానీ అందుకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవునా రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. ► నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టాలి. ► 10 హెచ్ నిబంధనలకు విరుద్ధంగా మట్టి పని చేపట్టి కాంట్రాక్టర్ లబ్ధిపొందారు. గార మండలం నారాయణపురం చానల్లో నీటిలోనే పూడిక తీత పనులు(ఫైల్) -
‘నీరు– చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభం
సాక్షి, అమరావతి: నీరు– చెట్టు కార్యక్రమం పేరుతో గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. నీరు– చెట్టు పేరుతో టీడీపీ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా ఒకే రకమైన పనులను మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువులు, వాగుల్లో కూలీలతో చేపట్టిన పూడికతీత పనులను నీరు– చెట్టు కార్యక్రమాల్లో కూడా చేసినట్టు చూపి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల శాసనసభ సమావేశాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు నీరు– చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు నీరు– చెట్టు కార్యక్రమంతో సంబంధం ఉండి వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నీరు – చెట్టు కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన అన్ని పనుల వివరాలు కావాలంటూ విజిలెన్స్ అధికారులు ఆయా జిల్లాల్లోని డ్వామా పీడీలకు లేఖలు రాశారు. కాగా, ఉపాధి హామీ పథకం నిర్వహణకు గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.19,816 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్న అధికారులు 2015–19 మధ్య కాలంలో ఉపాధి హామీ పథకంలో 37.44 లక్షల పనులు పూర్తయినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 20 లక్షల వరకు పనులు పురోగతిలో ఉన్నాయని అంటున్నారు. వీటిలో 80 శాతం వరకు నీరు– చెట్టు కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన పనులకే ఖర్చు చేసినట్టు టీడీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు. దీంతోపాటు జలవనరుల శాఖ, అటవీ శాఖల ద్వారా కూడా వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేసినట్టు బిల్లులు పెట్టుకుని స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు మొదట అన్ని శాఖల్లో ‘నీరు–చెట్టు’లో భాగంగా మంజూరు చేసిన పనుల వివరాలను తెప్పిస్తారు. ఒకే పని రెండు, మూడు శాఖల ద్వారా మంజూరైందో, లేదో పోల్చి చూస్తారు. తర్వాత జరిగిన పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
రూ.కోట్లు కొట్టుకుపోయాయి
వానొస్తే కొట్టుకుపోయే పనులు. కనిపించని చేసిన పనుల ఆనవాళ్లు. నాసిరకంగా చెక్‌డ్యాంలు. కాలువలు, చెరువుల్లో పూడిక తీత పనుల్లో అంతు లేని అవినీతి. గత ప్రభుత్వ పాలకుల అవినీతి దాహానికి రూ.కోట్లు కాలువల్లో కొట్టుకుపోయాయి. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు నీరు–చెట్టు పనుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పనుల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సాక్షి, వెంకటగిరి: టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నీరు–చెట్టు పనులు అవినీతికి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచాయి. నీరు–చెట్లు కింద కైవల్యా, గొడ్డెరు, చెరువుల్లో పూడికతీత, చెక్‌డ్యాం పనులు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. టెండర్ల ద్వారా నిబంధనల మేరకు నిర్వహించాల్సిన పనులను విభజించి నామినేషన్ పద్ధతిలో కొన్ని, తనకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు టెండర్ల పేరుతో కట్టబెట్టారు. అయితే ఆయా పనుల్లో జరిగిన పనికంటే.. అవినీతే ఎక్కువనే ఆరోపణలు వెల్లువెత్తినా పర్యవేక్షణ చేపట్టాల్సిన సంబంధిత అధికారులూ పట్టించుకోలేదు. ఆ పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారో.. అవినీతి సొమ్ముకు కక్కుర్తి పడ్డారో తెలియదు కానీ ఆయా పనుల దారి దాపులకు కూడా వెళ్లిన పాపాన పోలేదు. ఆ నాటి పాలకులు చేసిన పనులకు ప్రస్తుతం ఆనవాళ్లు కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అధికారంలోకి వచ్చిన రెండో ఏట నుంచి తెలుగు తమ్ముళ్లు దోపిడీకి తెరతీశారు. రైతులకు ఉపయోగపడే జలవనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ అధ్వర్యంలో సుమారు రూ.100 కోట్లతో నీరు– చెట్టు పథకం కింద వివిధ పనులు చేపట్టారు. ఆ నిధులతో నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, కలువాయి, సైదాపుం మండలాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం, తూములు నిర్మాణం, సప్లయీ చానల్స్ (వరవ కాలువలు) పూడిక తీత వంటి పనులు చేపట్టారు. అయితే ఆ పనులన్నీ నాసిరకంగా జరిగినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అవసరం లేని చోట కూడా చెక్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా భారీగా ప్రభుత్వ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లినట్లు విమర్శలు వచ్చాయి. కొంత మంది కాంట్రాక్టర్లు వెలుగొండ కొండల నుంచి వచ్చే సప్లయి చానల్స్‌ను తూతూ మంత్రంగా పనులు చేసి అక్రమాలకు పాల్పడినటుŠల్ స్థానికులు ఆరోపించారు. డక్కిలి మండలంలో అయితే ఉపాధి హామీ పథకంలో చేసిన చెరువు పనులే చూపించి, ఆ పనులను నీరు– చెట్టు కింద చేసినట్లు చూపించి వచ్చిన నిధులు మెక్కేశారనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. నీరు–చెట్టు పథకం పనుల్లో ఎక్కువగా మాజీ ఎమ్మెల్యే సొంతూరు అయిన పాతనాలపాడు, మాజీ ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం మాటుమడుగు, జెడ్పీటీసీ సభ్యుడు ఊరైన దేవునివెల్లంపల్లి, ఎమ్మెల్యేకు అనుచరులుగా ఉన్న డక్కిలి, దేవులపల్లిలో నిధులు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు ద్వారా తెలుస్తుంది. ఈ ఒక్కొక్క గ్రామంలో సుమారు రూ.కోటికి పైగా నీరు–చెట్టు నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అవసరం లేకపోయినా నిధులను తమ జేబులోకి నింపుకునేందుకు అడ్డదారిలో అప్పట్లో టీడీపీ నేతలు పనులు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. కైవల్యా పనుల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు కైవల్యా, గొడ్డేరు పూడికతీత పనులు రూ. లక్షల్లో పూర్తి చేయగలిగే పనులను రూ.కోట్లల్లో అంచనాలను సిద్ధం చేసి పనులు చేపట్టారు. నీరు– చెట్టు పనుల్లో ఎలా అడ్డంగా> దోచుకు తిన్నారో కైవల్యా పనులను పరిశీలిస్తే అర్థమవుతోంది. వానొస్తే కొట్టుకుపోయే పనులు ఎలా చేసినా ఏమీ కాదన్న ధీమాతో ప్రజాధనాన్ని అడ్డదారిలో లూటీ చేసేందుకు అప్పట్లో కైవల్యానది పూడికతీత పనులను ఎంపిక చేసుకున్నారు. నీరు–చెట్టు కింద 2017–18 సంవత్సరానికి వెంకటగిరి మండలంలోని పూలరంగడిపల్లి నుంచి బంగారుపేట వరకు కైవల్యానదిలో 4.7 కి.మీ. మేర పూడికతీత పనులకు అంచనాలు సిద్ధం చేశారు. మరో వైపు ఉన్న గొడ్డేరు వాగుకు సుమారు 2.4 కి.మీ.కు అంచనాలు రూపొందించారు. ఈ అంచనాల దశలోనే వెంకటగిరికి చెందిన టీడీపీ నేత జోక్యం చేసుకోవడంతో రూ.5.20 కోట్లతో పనులు సిద్ధం చేశారు. ఎస్ఈ స్థాయిలో టెండర్లు జరిగేందుకు అవకాశం ఉన్న ఈ పనులను 12 ప్యాకేజీలుగా విభజించారు. రూ.50 లక్షల లోపు పనులను విభజించేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. టెండర్ల దశలోనే కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి అన్నీ పనులను 9 శాతం లెస్తో ఐదు మంది కాంట్రాక్టర్లు చేజిక్కించుకున్నారు. రూ.కోట్ల రూపాయిల పనులను షార్ట్ టెండర్ల పేరుతో పిలవడం, హడావడిగా పనులు ఖరారు చేశారు. ఇరిగేషన్ శాఖలో గతంలో ఎప్పుడూ ఇలాంటి అక్రమాలు జరగలేదన్న వాదన వినిపించింది. గొడ్డేరు, కైవల్యానది నదుల్లో 7.2 కి.మీ. పూడికతీతను సుమారు రూ.4 లక్షల క్యూబిక్ మీటర్లు తరలించాలని అంచనాలు వేశారు. టీడీపీ నేత షాడో కాంట్రాక్టర్‌గా వ్యవహరించడంతో 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించాలని అంచనాల్లో ఉన్నా.. పని పూర్తయ్యేటప్పటికి 30 వేల నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల మేర పూడిక మట్టిని మాత్రమే తరలించారని విమర్శలు ఉన్నాయి. అంచనాల్లో చూపిన విధంగా 4 లక్షల క్యూబిక్ మీటర్లు పూడిక మట్టి ఎక్కడా లేకపోవడం గమనార్హం. విచారణ జరిగితే పూడిక తీసిన మట్టి ఎక్కడ చూపుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నదులకు ఇరువైపులా పూడికతీత మట్టిని కట్టలుగా పోయకూడదన్న నిబంధన ఉన్నా, కట్టలు వేసి అక్కడి నుంచి లోతు ఎక్కువగా పూడిక తీసినట్లు రికార్డుల్లో నమోదు చేయించి బిల్లులు పొందేందుకు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ప్రకటనతో అక్రమార్కుల గుండెల్లో గుబులు అవినీతి నిర్మూలనకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా నీరు– చెట్టు పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను రంగంలోకి దింపింది. దీనికి కొనసాగింపుగా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నీరు– చెట్టు పనుల్లో అవినీతి అంశంపై చర్చ సందర్భంగా పంచాయతీరాజ్‌శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు మెక్కిన నిధులు కక్కిస్తామని చేసిన ప్రకటన అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో గుబులు మొదలైంది రెండు మూడు రోజుల్లో వెంకటగిరి నియోజకవర్గంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని విశ్వసనీయ సమాచారం. -
‘దాణా కుంభకోణం కంటే పెద్ద స్కాం’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’పథకంలో అంతులేని అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టు పనులపై దృష్టి పెట్టింది. ఆ పథకంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను రంగంలోకి దింపింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మాజీ సీఎం చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. ‘చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్ దాణా స్కాం కంటే పెద్దది. 22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పంచి పెట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చిన బాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయట పడుతుంది’ అని పేర్కొన్నారు. (చదవండి : నేతా.. కక్కిస్తా మేత!) బంధుప్రీతిలో బాబును మించినోళ్లు లేరు..! చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదనే విషయం మరోసారి రుజువైందని విజయసాయి రెడ్డి అన్నారు. కాపులు, బలహీనవర్గాలను ఆయన ఎప్పుడూ విశ్వసించరనేది మరోసారి అర్థమైందన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ (పీఏసీ) పదవిని చాలా మంది ఆశించినా చివరకు పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేసి బాబు బంధుప్రీతి చాటుకున్నారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. -
నేతా.. కక్కిస్తా మేత!
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు–చెట్టు పథకం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొందరు టీడీపీ నేతలు ఈ పథకాన్ని తమ జేబు సంస్థగా మార్చేశారు. చేసిన చోటే చేస్తూ.. తవ్విన చోటే తవ్వుతూ పథకాన్ని నీరుగార్చేశారు. లక్ష్యం ఎలా ఉన్నా ఇష్టారాజ్యం గా నిధులు భోంచేశారు. ప్రజాధనానికి తూట్లు పొడిచారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. మెక్కిన నిధులు కక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో చర్చించారు. దోచుకున్న నిధులను ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తామని స్పష్టం చేయడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కొందరు టీడీపీ నేతలు వణికిపోతున్నారు. సాక్షి, తిరుపతి: అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో 2015 నుంచి 2018 వరకు జరిగిన నీరు–చెట్టు పనులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను రంగంలోకి దింపింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవినీతిపరుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎవరి నుంచి ఎంత మొత్తం నిధులు రికవరీ చేస్తారోనని భయపడిపోతున్నారు. నిగ్గుతేల్చుతాం అసెంబ్లీలో గురువారం ప్రధానంగా నీరు–చెట్టు అవినీతి అంశంపైనే చర్చ సాగింది. టీడీపీ నేతలు మెక్కిన నిధులు కక్కిస్తామని పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులను విచారణకు ఆదేశిస్తామన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా నేతల నుంచి నిధులు రికవరీ చేస్తామని చెప్పారు. గుండెల్లో రైళ్లు నీరు–చెట్టు పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై సమగ్ర నివేదికకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అవినీతిపరులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి నుంచి నిధులు రికవరీ చేస్తారోనని భయపడిపోతున్నారు. చేసిన పనులే చేయడం.. వచ్చిన నిధులు మెక్కడం నీరు–చెట్టు పథకం ద్వారా 2015 నుంచి 2018 వరకు రూ.748 కోట్ల అంచనాలతో 7,937 పనులు చేపట్టారు. అందులో 5,490 పనులు పూర్తి చేశారు. 2,447 పనులు వివిధ దశల్లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. నీరు–చెట్టు కింద చేపట్టే పనులకు ఎలాంటి టెండర్లు లేవు. నామినేషన్ పద్ధతిన టీడీపీ బినామీ నేతలు దక్కిం చుకున్నారు. టెండర్లు పిలవాల్సిన ఒక్కో పనిని రెండు, మూడుగా విభజించి తమ అనుచరులకు కట్టబెట్టారు. పనులు దక్కించుకున్న నేతలు పనులు చేయకనే బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద గతంలో చేపట్టిన చెరువు పనులనే చూపెట్టి బిల్లులు చేసుకున్నవి కోకొల్లలు. అవసరం లేని ప్రదేశాల్లో కూడా చెక్‌డ్యామ్‌లు, సప్లైచానళ్లు నిర్మించారు. ఆ నిర్మాణాలు నాసిరకంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. మామూళ్లకు ఆశపడిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ నీరు–చెట్టు పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. చేపట్టిన పనుల్లో అధికశాతం చేసిన పనులనే చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అగ్రిమెంట్ల నుంచే అవినీతి ఆరంభం నీరు–చెట్టు పనుల్లో అగ్రిమెంట్ల నుంచే అవినీతికి ఆజ్యం పోశారు. టీడీపీ నేతల ఒత్తిడి ఓ వైపు, కమీషన్ల కోసం కొందరు అధికారుల అత్యాశ వెరసి అవినీతి అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. పనుల కేటాయింపు విషయంలో జిల్లా స్థాయి అధికారి ఒకరు ఒకే రోజు సుమారు రూ.200 కోట్ల పనులకు సంబంధించి అగ్రిమెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంతకాల నుంచి ప్రారంభమైన అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్మేస్తాయి. అవినీతిలో హైలెట్ ప్రధానంగా శ్రీరంగరాజపురం మండలంలో జరిగిన అక్రమాలు జిల్లాలోనే హైలెట్‌గా నిలిచాయి. మండలంలో మొత్తం 312 పనులను గుర్తించారు. అందులో చెక్‌డ్యాంలు, చెరువు పూడికతీత పనులు చేపట్టేందుకు రూ.32 కోట్లు కేటాయించారు. పద్మాపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రుద్రప్పనాయుడు రూ.2.12 కోట్లతో ఐదు చెక్‌డ్యాం పనులు చేపట్టారు. ఈ చెక్ డ్యాంలు కేవలం 30 మీటర్లకు ఒకటి చొప్పున నిర్మించారు. నిబంధనల ప్రకారం అయితే ఒక్కో చెక్ డ్యాంక్కు కనీసం 500 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఆ నిబంధన తుంగలో తొక్కారు. ఆ పనుల్లోనూ నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఒండ్రు మట్టితో కలిసిన ఇసుక, కాలం చెల్లిన సిమెంటుతో చెక్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. అదేవిధంగా పీలేరు నియోజకవర్గ పరిధిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ నేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరులు వాటర్షెడ్ల పేరుతో భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారు. పనులే చేపట్టకుండా కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. చెరువు మరమ్మత్తులు, చెక్‌డ్యాంల పేరుతో రూ.13.5 కోట్లు స్వాహా చేశారు. వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం చెరువు కలుజు పనులు కూడా నాసిరకంగా చేపట్టారు. పాతగోడకు పైపైన మెరుగులు అద్ది కొత్తగా కలుజు నిర్మించినట్లు రికార్డులు సృష్టించారు. అదేవిధంగా ఏర్పేడు మండలంలోని పల్లం, పంగూరు, జంగాలపల్లి, వికృతమాల, గోవిందవరం తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేపట్టిన పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. రూ.లక్ష పనికి రూ.5 లక్షల వరకు బిల్లులు పెట్టుకున్నారు. శ్రీకాళహస్తి పరిధిలోని ఎంపేడు, ఇలగనూరు, ముచ్చివోలు, కమ్మకండ్రిగ పరిధి లో జరిగిన పనులు నాసిరకంగా ఉన్నా యి. కుప్పం నియోజకవర్గ పరిధిలో మొత్తం 574 చెరువులు ఉంటే.. 2016లో ఓ సారి చెరువుల సంరక్షణ పథకం కింద, మరో సారి జాతీయ ఉపాధిహామీ పథకం కింద, చివరి సారిగా నీరు–చెట్టు పథకంలో మొత్తం 555 చెరువు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించారు. భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లి పరిధిలోని రామసముద్రం మండలంలో చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు రికార్డులు తయారుచేసి సుమారు రూ.10 కోట్ల వరకు కొల్ల్లగొట్టారు. నగరి పరిధిలో 15 చెరువుల కింద 40 చెక్‌డ్యాంలు నిర్మించారు. అందులో 20కిపైగా నాసిరకంగా నిర్మించి నిధులు స్వాహా చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మూడేళ్లలో 808 పనులకు రూ.54.28 కోట్ల నిధులను మంజూరు చేసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం పనులు చెయ్యకనే నిధులు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులు, కాలువల మరమ్మతు లు, పూడికతీత, చెక్‌డ్యాం నిర్మాణాల పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. -
‘నీరు – చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్ విచారణ
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో ‘నీరు – చెట్టు’ పథకం పేరుతో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో దర్యాప్తు జరిపించి దోషులపై రెవెన్యూ రికవరీ(ఆర్.ఆర్.) చట్టాన్ని ప్రయోగిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. టీడీపీ పాలనలో నీరు–చెట్టు, ఉపాధి హామీ పథకాల్లో భారీ అవకతవకలు జరిగాయని, పనులు చేయకుండానే బిల్లులు కాజేశారని వైఎస్సార్సీపీ సభ్యులు మేరుగ నాగార్జున, కాటసాని రాంభూపాల్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. ‘ఉపాధి హామీ, నీరు – చెట్టు నిధులను చంద్రబాబు సర్కారు పక్కదోవ పట్టించింది. రూ. 22,472 కోట్లకుపైగా విలువైన పనులను చేసినట్లు చూపించి జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారు. డ్వామాను తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మార్చారు. నీరు – చెట్టు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఉపాధి హామీ కింద చేసిన పనులనే నీరు – చెట్టు కింద కూడా చూపించి బిల్లులు పొందారు. వేసిన కట్టకే మట్టి వేసినట్లు, తవ్విని గుంతనే తవ్వినట్లు రెండుసార్లు బిల్లులు కాజేశారు. పనులు చేయకుండా తప్పుడు రికార్డులు సృష్టించారు’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్‌తో దర్యాప్తు జరిపిస్తామని, హౌస్ కమిటీ అవసరం లేదని చెప్పారు. తన సొంత జిల్లా చిత్తూరులో నీరు–చెట్టులో అవినీతిని స్వయంగా చూశానని వెల్లడించారు. రూ.10 బుష్ కట్టర్ రూ.100కు కొన్నట్లుంది.. గ్రామ పంచాయతీల్లో పొడి, తడి చెత్తలను సేకరించడానికి వినియోగించే ప్లాస్టిక్ బకెట్ల (బిన్ల) కొనుగోలులో చోటు చేసుకున్న భారీ అవినీతిపై విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సభ్యుడు సాయిప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 20 – 30కి లభించే చెత్త డబ్బాలను రూ. 55 – 60 చొప్పున కొనుగోలు చేసి సగం డబ్బులు తినేశారని చెప్పారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం ఇస్తూ.. ‘గత ప్రభుత్వ హయాంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటుకు ప్లాస్టిక్ చెత్త డబ్బాలను కొనుగోలు చేశారు. అవి రూ. 25 లోపే దొరుకుతాయని అందరికీ తెలుసు. గ్రామ పంచాయతీల కోసం కొనుగోలు చేసిన వాటిల్లో కూడా నాణ్యత లేదు. ఇందులో భారీ దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. మేమూ వ్యవసాయం చేశాం. ఈ విషయం మాజీ సీఎం చంద్రబాబుకు కూడా తెలుసు. రూ.10కి దొరికే బుష్ కట్టర్ రూ.వందకు కొన్నట్లుగా ఉంది. స్ప్రేయర్లు కూడా భారీ రేటుకు కొనుగోలు చేశారు. మొత్తం రూ. 67 కోట్లకుపైగా ఖర్చు చేశారు (ఈ సందర్భంగా ప్లాస్టిక్ బిన్లను ఎక్కడెక్కడ ఎంత ధరకు కొన్నారో గణాంకాలను పెద్దిరెడ్డి వివరించారు). ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్‌తో విచారణ జరిపిస్తాం’ అని మంత్రి తెలిపారు. తమ శాఖలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఇలాంటి అక్రమాలు భారీగా బయటకు వచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ‘నీరు-చెట్టు’ పథకంలో భారీ దోపిడీ జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. నీరు-చెట్టు నిధులను టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని మండిపడ్డారు. మరో సభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నీరు-చెట్టులో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యేవరకు బిల్లులు మంజూరు చేయొద్దని సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. నీరు-చెట్టు నిధులు పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఈ పథకం కింద రూ. 22వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు ఈ నిధులను దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. నీరు-చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. నీరు-చెట్టు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని, ఈ పథకంలో అవినీతికి పాల్పడిన వారి నుంచి సొమ్ము తిరిగి రాబడతామని ఆయన వెల్లడించారు. -
నీరు–చెట్టు పేరుతో కనికట్టు
నీరు–చెట్టు పేరుతో కనికట్టు చూపించే అక్రమార్కులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నీరు–చెట్టు పనులు నిలిపివేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. సర్కారు నిర్ణయంతో అక్రమార్కుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతలు, వీరికి సహకరించిన కొందరు అధికారుల్లో గుబులు మొదలైంది. సాక్షి, తిరుపతి/చిత్తూరు అగ్రికల్చర్: నీరు చెట్టు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. పనులు చెయ్యకున్నా... చేసినట్లు బిల్లులు చేసుకుని ప్రజాధనాన్ని దోపిడీ చేసే అవకాశం ఇక ఉండదు. అవసరం లేనిచోట తూతూ మంత్రంగా పనులు చేసి రూ.కోట్లు స్వాహా చేయడానికి వీలు కాదు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులే మళ్లీ చేసినట్లు చూపించి నిధులు కొల్లగొట్టాలని చూసే అక్రమార్కులకు రాష్ట్రప్రభుత్వం చెక్‌పెట్టింది. నీరు–చెట్టు పథకం కింద చేపట్టే పనులన్నింటినీ ఆపెయ్యమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అక్రమార్కులు షాక్‌కు గురయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. చెరువుల అభివృద్ధి పేరుతో టీడీపీ నాయకులు అందినకాడికి దోచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కొందరు అధికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై సర్కారు నిధులు స్వాహా చేశారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో టీడీపీ నేతల అవినీతి అక్రమాలకు అడ్డుకట్టపడనుంది. రూ. కోట్ల ప్రజాధనం అభివృద్ధి పనులకు ఉపయోగించుకునే అవకాశం దొరికిందని పలువురు సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో టీడీపీ ప్రభుత్వం నీరు–చెట్టు పథకం ద్వారా రూ. 748 కోట్ల అంచనాలతో 7,937 పనులు చేపట్టింది. అందులో 5,490 పనులు పూర్తిచేయగా, 2,447 పనులు వివిధ దశల్లో జరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి . చేపట్టిన పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. ఈ పనుల్లో రూ. 10 లక్షలు దాటితే టెండర్ల ప్రక్రియలో పనులు చేపట్టాలి. రూ. 10 లక్షల కన్నా తక్కువగా ఉన్నా ఎలాంటి టెండరింగ్ లేకుండానే నామినేషన్ కింద పనులు చేసుకునే అవకాశం గత టీడీపీ ప్రభుత్వం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న టీడీపీ నేతలు టెండర్లు పిలవాల్సిన ఉన్నా పిలిచే అవకాశాన్ని ఇవ్వలేదు. టెండర్లు పిలవాల్సిన ఒక్కో పనిని రెండు, మూడుగా విభజించి బినామీ పేర్లతో నామినేషన్ కింద పనులు దక్కించుకున్నారు. పనులు దక్కించుకున్న అక్రమార్కులు పనులు చేపట్టకుండానే బిల్లులు చేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఉపా«ధి హామీ పథకం కింద గతంలో చేపట్టిన చెరువు పనులనే చూపెట్టి బిల్లులు చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. అవసరం లేని ప్రదేశాల్లో కూడా చెక్‌డ్యామ్‌లు, సఫ్లై ౖఛానల్స్ లాంటి పనులు నామమాత్రంగా చేపట్టి ప్రజాధనం లూటీచేశారు. మామూళ్లకు ఆశపడి కొందరు అధికారులు కూడా అక్రమార్కులకు అండగా నిలిచారు. దీంతో ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు సొంత గ్రామ పరిధిలోనే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగుర్రప్పగారిపల్లిలో నిర్మించిన చెక్‌డ్యామ్ నీరుచెట్లు అక్రమాలకు ప్రత్యక్ష నిదర్శనం .కనీసం సిమెంట్ పూత పని కూడా చేయకుండానే రూ.9 లక్షలు దండుకున్నారు. అదే ఊరికి సమీపంలోనే రూ.35 లక్షలతో నాలుగు చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. ఒక్కదానికి మాత్రమే నాణ్యతా పరీక్షలు జరిపి అదే సర్టిఫికెట్తో అన్నిటికీ బిల్లులు డ్రా చేసుకున్నారు. ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లిలో బాయమ్మ చెరువు వంక, ఎద్దుల గుట్ట నుంచి బాయమ్మ చెరువుకు కలిసే వంకపై పక్కపక్కనే చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నారు. నాణ్యత లేకుండా నాసిరకంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణాలను స్థానికులు సైతం అడ్డుకున్నారు. ఒక్కొక్కటీ రూ.9.25 లక్షలతో చెక్‌డ్యామ్‌పై చెక్‌డ్యామ్ కట్టారు. ఇలా చంద్రగిరి నియోజక వర్గ పరిధిలో మూడేళ్లలో 808 పనులకు రూ.54.28 కోట్లను మంజూరు చేసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం పనులు చెయ్యకనే నిధులు డ్రా చేసుకుని జేబులు నింపుకున్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 2016 నుంచి రెండేళ్ల కాలంలో ఒక్కో చెరువును రెండు, మూడు పర్యాయాలు మరమ్మతులు చేసినట్లు బిల్లులు మంజూరుచేసుకున్నారు. పీలేరు పరిధిలో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరులు చెరువు మరమ్మతులు, చెక్‌డ్యాంల పేరుతో రూ.13.5 కోట్లు స్వాహా చేశారు. ఎన్నికల ముందు జిల్లా స్థాయి అధికారి సహకారంతో టీడీపీ నేతలు ఒకే రోజు రూ.200 కోట్ల పనులకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అయితే పనులేవీ చేపట్టకపోయినా... 25శాతం పనులు చేసినట్లు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో బిల్లులు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీరంగరాజపురం మండల పరిధిలో 312 పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు నీరు– చెట్టు పేరుతో రూ.కోట్లు స్వాహా చేశారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం అవినీతి లేని పాలన కోసం నడుం బిగించింది. నీరు–చెట్టు పనులను నిలిపివేయాలని గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువుల ఆయకట్టు కింద జరిగే పనుల్లో అవసరమైన చోట్ల పనులను మాత్రం చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు జలవనరులశాఖ అధికారులు ప్రస్తుతం జరుగుతున్న దాదాపు 2 వేల పనులను నిలుపుదల చేయనున్నట్లు సమచారం. నిలుపుదల చేస్తున్న పనుల జాబితాలను అధికారులు సేకరిస్తున్నారు. దీంతో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు, టీడీపీ నేతల్లో గుబులు పుట్టుకుంది. -
వదల బొమ్మాళీ..!
సాక్షి, ఒంగోలు : జిల్లాలో టీడీపీ నేతలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయల నిధులు మెక్కారు. పాత గుంతలు చూపించి బిల్లులు దండుకున్నారు. చెరువుల్లో పూడిక తీత పేరుతో మట్టి అమ్ముకున్నారు. కాలువలు, చెరువుల ఆధునికీకరణ పేరుతో పాత పనులు చూపించి కొన్నిచోట్ల నిధులు స్వాహా చేయగా, మరికొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. అయిదేళ్ల పాలనలో నీరు–చెట్టులో అవినీతికి అంతు లేకుండా పోయింది. అక్రమాలకు అధికారుల సహకారమూ ఉంది. ఆది నుంచి నీరు –చెట్టు లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉన్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. జిల్లాలో రూ. 80 కోట్ల పైనే బకాయిలు జిల్లాలో నీరు–చెట్టుకు సంబంధించి ఇంకా రూ. 80 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చూపిస్తున్నారు. ఒంగోలు డివిజన్లో రూ. 50 కోట్లు, మార్కపురం డివిజన్లో రూ. 16 కోట్లుతో పాటు కందుకూరు, అద్దంకి ప్రాంతాల్లోని బిల్లులతో కలిపితే మొత్తం సుమారు రూ. 80 కోట్లున్నాయి. వైఎస్ జగన్ సర్కార్‌లో ఈ బిల్లులు చెల్లించాలన్నది అధికారుల ఉద్దేశ్యం. అయితే ఎటువంటి పనులు జరగకుండానే టీడీపీ నేతలు అక్రమంగా బిల్లులు చేయించుకున్నారన్నది వైఎస్సార్ సీపీ నేతల ఆరోపణ. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరిపించాలన్నది జగన్ సర్కార్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే ముందు బిల్లులు నిలిపి వేసి విచారణ అనంతరం తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని, అందుకు కారణమైన ఎవరినీ వదిలేది లేదని ఆ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఇప్పటికే గట్టిగా చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ సర్కార్ వదిలి పెట్టదని స్పష్టమవుతోంది. అక్రమాలిలా... నీరు–చెట్టులో అధికార పార్టీ నేతలు 50 శాతం పనులను మనుషులతో కాకుండా మిషన్లతో పూర్తి చేశారు. చెరువుల్లో మట్టిని ఒక్కో ట్రాక్టర్ రూ. 300 నుంచి రూ. 800 వరకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అదే గుంతలు చూపించి పూడికతీత పేరుతో నీరు–చెట్టులో బిల్లులు తీసుకున్నారు. చెక్‌డ్యామ్‌లు నాసిరకంగా నిర్మించి పెద్ద ఎత్తున దండుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లోని అవినీతికి అంతే లేదు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో అక్రమాలకు కొదువలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆర్థిక లబ్ధి కోసమే ఈ పథకం పెట్టినట్లయింది. అధికారులు అందినకాడికి కమీషన్లు పుచ్చుకొని నేతలు, కార్యకర్తలతో కలిసి వాటాలు తీసుకొన్న సంఘటనలు కోకొల్లలు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకు వచ్చే అర్జీల్లో అధిక శాతం వినతులు నీరు–చెట్టు అక్రమాలపైనే ఉండటం గమనార్హం. కొన్ని ఉదాహరణలు : ఒంగోలు శివారులోని కొప్పోలు, చెరువుకొమ్ముపాలెం, పెళ్లూరు చెరువుల నుంచి రోజూ వందల కొద్ది ట్రాక్టర్లు పెట్టి ట్రిప్పు మన్ను రూ. 250 నుంచి రూ. 500 వరకూ విక్రయించారు. అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ల వద్ద సైతం ట్రిప్పుకు రూ. 50 చొప్పున కమీషన్లు పుచ్చుకున్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని అక్కన్నవారి చెరువు, బుర్రవానికుంట, వలేటివారిపాలెం చెరువు, వరగమ్మ వాగు, ముదిగొండ వాగు, చిన్నచెరువులతో పాటు పలు చెరువులు, వాగుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యాలవాడ, గడికోట, తిమ్మాపురం, సంజీవరాయునిపేట, దంతెరపల్లి, రాచర్ల ప్రాంతాల్లో నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి చెరువు మట్టిని రోడ్డుకు తోలుకొని నీరు–చెట్టు పనుల్లో బిల్లులు తెచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. పుల్లలచెరువు మండలంలోని కాటివీరన్నచెరువు, చేపలమడుగు, పెద్దచెరువు, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు చెరువులతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అద్దంకి–నార్కెట్‌పల్లి దారిలో నీరు–చెట్టులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు అప్పుడే శిథిలావస్థకు చేరుకున్నాయి. జె.పంగులూరు మండలం చినమల్లవరం, అరికట్లవారిపాలెం ప్రాంతంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు కొదువ లేదు. దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం దొర్నపువాగు పరివాహక ప్రాంతం, తోటవెంగన్నపాలెం, రాజానగరం, కొర్రపాటివారిపాలెం, వీరన్నవాగుతో పాటు పలు ప్రాంతాల్లో నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు వెల్లువెత్తాయి. కోమలకుంటచెరువు, ఎర్రచెరువు, తానంచింతం, అబ్బాయిపాలెం, చందలూరు చెరువు పనుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కందుకూరు నియోజకవర్గంలోని మోపాడు చెరువు, గుడ్లూరు నాయుడుపాలెం చెరువులతో పాటు నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. కనిగిరి పరిధిలోని దోమలేరు, గోకులం, జిల్లెళ్ళపాడులతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు కొదువ లేదు. కొండపి పరిధిలోని టంగుటూరు మండలం కొణిజేడు, కొండేపి చెరువుతో పాటు నియోజకవర్గంలో పలు చెరువులు, వాగుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం చెరువుతో పాటు కొనకనమిట్ల అంబచెరువు, పొదిలి ప్రాంతంలోని అన్నవరం, మల్లవరం, యేలూరు, కొచ్చెర్లకోటతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు జరిగాయి. పర్చూరు పరిధిలోని దేవరపల్లి సూరాయకుంట, నూతలపాడులోని బూరాయికుంట, దగ్గుబాడు, నాయుడువారిపాలెం గ్రామాలతో పాటు జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. సంతనూతలపాడు పరిధిలోని మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి ఎండోమెంట్ చెరువులో పెద్ద ఎత్తున మట్టిని తరలించి అక్రమాలకు పాల్పడ్డారు. దొడ్డవరప్పాడు, ముదిగొండ వాగు, జతివారికుంట, పాపాయి చెరువులతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్లు పనుల మంజూరు ఇలా... 2015–16 ఏడాదికిగాను నీరు–చెట్టు కింద జిల్లావ్యాప్తంగా 2,111 పనులు మంజూరు చేశారు. ఇందు కోసం రూ. 124.59 కోట్లు నిధులు కేటాయిం చారు. రూ. 87.24 కోట్లతో 1681 పనులను పూర్తి చేసినట్లు అధికారిక గణాం కాలు చెప్తున్నాయి. 2016–17కు గాను జిల్లావ్యాప్తంగా 3,241 పనులను మంజూరు చేయగా రూ. 201.16 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 1510 పనులు పూర్తి చేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీని కోసం రూ. 124.22 కోట్లు ఖర్చు చేశారు. అధికారులు మాత్రం 420 లక్షల క్యూ బిక్ మీటర్ల పూడికను తొలగించినట్లు లెక్కలు చూపించడం గమనార్హం. 2017–18కుగాను జిల్లావ్యాప్తంగా 3,513 పనులను మంజూరు చేశారు. దీని కోసం రూ. 278.83 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 1282 పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం రూ. 143.98 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా గత నాలుగేళ్లలో జిల్లావ్యాప్తంగా నీరు–చెట్టులో రూ. 840 కోట్లతో దాదాపు వెయ్యి పనులు మంజూరు చేయగా రూ. 450 కోట్లు వెచ్చించి 5 వేల పనులు పూర్తి చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. -
నీరు–చెట్టు బిల్లుల చెల్లింపునకు సర్కార్ నో!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీరు–చెట్టు పథకం కింద రూ.1,216.84 కోట్ల బిల్లుల బకాయిలను చెల్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేయని పనులను చేసినట్లు చూపడం.. గతంలో చేసిన పనులను తాజాగా చేసినట్లు చూపడం ద్వారా టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వేలాది కోట్ల రూపాయలను నీరు–చెట్టు పథకం కింద దోచుకున్నారు. 2015–16 నుంచి మే 29, 2019 దాకా ఈ పథకానికి రూ.18,060.70 కోట్లను టీడీపీ సర్కార్ ఖర్చు చేసింది. చేసిన పనులకంటూ రూ.16,843.86 కోట్ల బిల్లులను చెల్లించింది. ఇంకా రూ.1,216.84 కోట్లు బకాయిపడింది. నీరు–చెట్టు పథకంలో అక్రమాల గుట్టు విప్పేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బకాయిపడ్డ బిల్లులను చెల్లించవద్దని ఈ నెల 6న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. వాటిని అమలు చేస్తూ బకాయి బిల్లులు చెల్లించకూడదని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్న నీటివనరుల పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ పేరుతో 2015–16లో టీడీపీ ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని ప్రారంభించింది. ఉపాధి హామీ, జలవనరులు, అటవీ శాఖల ద్వారా నిధులను సమీకరించి.. చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టల మరమ్మతులు, తూముల మార్పిడి, చెరువులకు నీటిని సరఫరా చేసే సప్లయ్ ఛానల్స్ (వాగులు, వంకలు)లో పూడిక తీత, చెక్ డ్యామ్‌ల పునరుద్ధరణ, కొత్త చెక్ డ్యామ్‌ల నిర్మాణం, కాంటూరు కందకాలు, పంట కుంటల తవ్వకం పనులను ‘నీరు–చెట్టు’ కింద చేపట్టారు. టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో అప్పగించి.. నీరు–చెట్టు పథకం కింద రూ.పది లక్షల అంచనా వ్యయం లోపు ఉండే పనులను.. ‘జన్మభూమి కమిటీ’ల ముసుగులో టీడీపీ నేతలకు నామినేషన్ పద్ధతిలో టీడీపీ సర్కార్ అప్పగించింది. గతంలో చేసిన పనులనే తాజాగా చేసినట్లు చూపడం.. ఉపాధి హామీ కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో తూతూమంత్రంగా చేయడం.. పనులు చేయకుండానే చేసినట్లు చూపడం ద్వారా వేలాది కోట్ల రూపాయలను కాజేశారు. నీరు–చెట్టు కింద మే 28, 2019 వరకూ రూ.16,843.86 కోట్ల బిల్లులు చెల్లించగా.. ఇందులో కనీసం రూ.15 వేల కోట్లకుపైగా టీడీపీ నేతలే దోచుకున్నారని అంచనా. నిబంధనలను పట్టించుకోకుండా.. నిబంధనల ప్రకారం.. నీరు–చెట్టు పథకం కింద చెరువులు, వంకలు, వాగుల్లో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాలకు తరలించాలి. 2015–16 నుంచి మే, 29, 2019 వరకూ చెరువులు, వాగులు, వంకల్లో 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. కానీ.. ఏ ఒక్క రైతుకూ ఒక్క క్యూబిక్ మీటర్ మట్టిని ఉచితంగా సరఫరా చేసిన దాఖలాలు లేవు. అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు క్యూబిక్ మీటర్ మట్టిని సగటున రూ.500 చొప్పున విక్రయించుకోవడం ద్వారా రూ.45,955 కోట్లు దోచుకున్నారు. మట్టి నుంచి దోచుకున్న సొమ్ములో సింహభాగం అప్పటి సీఎం చంద్రబాబుకు కమీషన్ల రూపంలో టీడీపీ ఎమ్మెల్యేలు ముట్టజెప్పారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. తగ్గిన ఆయకట్టు.. పెరగని భూగర్భ జలాలు నీరు–చెట్టు పథకం కింద చెరువులు, కుంటల్లో 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లుగానూ.. 96,439 చెక్ డ్యామ్‌లను నిర్మించినట్లుగానూ.. 8,46,673 పంట కుంటలు తవ్వినట్లుగానూ, 8,23,775 జలసంరక్షణ పనులు చేసినట్లుగా టీడీపీ సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో చెరువులు, కుంటల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నీరు–చెట్టు కింద చిన్న నీటి వనరులను పరిరక్షించి ఉంటే పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లంది ఉండాలి. కానీ.. 2018–19 నాటికి ఆయకట్టు 9.30 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. పథకంలో చేపట్టిన పనుల వల్ల కనీసం భూగర్భ జలాలు పెరిగాయా అంటే అదీ లేదు. 2014, మార్చి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 9.21 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం అది 13.46 మీటర్లకు తగ్గడం గమనార్హం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే నీరు–చెట్టు కింద భారీ ఎత్తున అవినీతి జరిగిట్లు స్పష్టమవుతోంది. నీరు–చెట్టు పథకం కింద టీడీపీ సర్కార్ వ్యయం చేసిన రూ.18,060.70 కోట్లను పోలవరం ప్రాజెక్టుపై వెచ్చించి ఉంటే.. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదని రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదని అధికార వర్గాలే చెబుతుండటం గమనార్హం. -
నీరు–చెట్టు.. ఓ కనికట్టు
గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నీరు–చెట్టు పథకాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చెరువులు, కాలువల్లో పూడికతీత, చెరువుకట్టల అభివృద్ధి, ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంల నిర్మాణం..ఇలా అనేక పనులు జిల్లావ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల, గ్రామస్థాయి నేతలు చేజిక్కించుకున్నారు. కొన్నిచోట్ల చేసిన పనులకే మళ్లీ బిల్లులు పెట్టి నిధులు కాజేశారు. ఉపాధిహామీ పథకంలో కూలీలు చేసిన పనులను పూడికతీత కింద చూపించి నిధులు కొల్లగొట్టారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక పాలన కోసం అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో చోటుచేసుకున్న అవినీతిపై దృష్టిపెడుతున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసిన అధికారులు కూడా బెంబేలెత్తుతున్నారు. నెల్లూరు ,ఉదయగిరి: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పారదర్శక పాలన కోసం శ్రీకారం చుట్టారు. ఇరిగేషన్ శాఖలో ప్రారంభంకాని పనులను 25 శాతం పనులు జరిగిన వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నీరు–చెట్టుకు సంబంధించి 3,402 పనుల్లో కొన్ని పూర్తిగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మరో వెయ్యి పనుల మేరకు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతవరకు రూ.263.68 కోట్లు ఖర్చుచేశారు. మరికొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. లోపించిన నాణ్యత జిల్లాలో చెరువు పూడికతీత, కాలువ పూడికతీత పనుల్లో రూ.కోట్ల అవినీతి చోటు చేసుకుంది. యంత్రాల ద్వారా తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు చేయించుకుని నిధులు స్వాహా చేశారు. కొన్ని చెరువుల్లో గతంలో ఎప్పుడో తీసిన గుంతలను కొత్తగా పూడికతీసిన పనులుగా చూపించి నిధులు కాజేశారు. కొండాపురం మండలం కొమ్మి చెరువు, వింజమూరు పాతూరు, ఊటచెరువు, దుత్తలూరు మండలం నందిపాడు చెరువు, వరికుంటపాడు ఊటచెరువు, భాస్కరాపురం చెరువు, కలిగిరి చెరువు, సీతారామపురం ట్యాంకు, గణేశ్వరపురం ట్యాంక్.. ఇలా అనేక చెరువుల్లో పాత పనులకే బిల్లులు చేసి నిధులు కాజేశారు. కొన్ని గ్రామాల్లో వాగులు, వంకల్లో అవసరం లేకపోయినా పూడికతీత తీసి భారీ ఎత్తున నిధులు దిగమింగారు. జిల్లాలో మొత్తమ్మీద పూడికతీత పనుల్లోనే రూ.100 కోట్లు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. కానీ వాస్తవంగా అంతకు ఐదురెట్లు పైగానే అవినీతి చోటుచేసుకుంది. ఫైబర్ చెక్‌డ్యాంల పేరుతో దోపిడీ ఉదయగిరి నియోజకవర్గంలో ఫైబర్ చెక్‌డ్యాంల నిర్మాణాల్లో రూ.కోట్ల అవినీతి జరిగింది. గత ప్రభుత్వలో ఎమ్మెల్యేగా ఉన్న బొల్లినేని రామారావు తన బినామీ కంపెనీలద్వారా పనులు దక్కించుకుని అనుచరులకు పనులు పందేరం చేసి వారి వద్దనుంచి కమీషన్ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారు. మొదట విడతలో 101 పనులు మంజూరుకాగా, దీనికోసం రూ.23.5 కోట్లు ఖర్చుచేశారు. రెండో దశలో 72 పనులకు మరో రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు అధిక అంచనాలు వేయించి తూతూమంత్రంగా పనులు చేయించి నిధులు దిగమింగారు. నీరు–చెట్టు కింద రూ.10 లక్షల లోపు విలువగల చెక్‌డ్యాంలు 265 వరకు నిర్మించారు. వీటికోసం రూ.25 కోట్లు పైగా ఖర్చుచేశారు. కొన్నిచోట్ల గతంలో ఉన్న చెక్‌డ్యాంలకు తుదిమెరుగులు దిద్ది బిల్లులు చేసుకుని నిధులు కాజేశారు. ఈ పనులు తనిఖీచేసిన క్వాలిటీ కంట్రోల్ విజిలెన్స్ అధికారులు నాణ్యత చూసి ముక్కున వేలేసుకున్నారు. అధికార పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు ఈ రెండు విభాగాలు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయాయి. వరికుంటపాడు, కొండాపురం, సీతారామపురం, దుత్తలూరు, కలిగిరి మండలాల్లో చెక్‌డ్యాం పనుల్లో డొల్లతనం పనులు చేసిన మూడునెలలకే బయటపడింది. ఇక ఫైబర్ చెక్‌డ్యాం పనుల్లోనే నియోజకవర్గంలో రూ.20 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకోగా జనరల్ చెక్‌డ్యాం పనుల్లో రూ.50 కోట్లు, పూడికతీత పనుల్లో మరో రూ.30 కోట్లు పైగా అవినీతి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమార్కులపై విచారణకు రంగం సిద్ధం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికారులు ఈ పనులకు సంబంధించిన పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు పూర్తిస్థాయిలో వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముంది. డొల్లతనంగా చేసిన పనులకు సంబంధించి బిల్లులు నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలందాయి. ఇంతవరకు ప్రారంభం కాని పనులు, 25 శాతం జరిగిన పనులకు సంబంధించి రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైనచోట కొత్త పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో అటు నిజాయితీ అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆనందం వ్యక్తమౌతోంది. పనులు రద్దుచేయనున్నారు ఇంతవరకు ప్రారంభం కాని పనులను రద్దుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే వివరాలను అధికారులు విడుదల చేశారు. 25 శాతం పనులు జరిగిన వాటిని కూడా రద్దుచేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు జరుగుతాయి.– శ్రీనివాసరావు,ఇరిగేషన్ డీఈ, వింజమూరు -
నీరు–చెట్టు.. అక్రమార్కుల పని పట్టు
గత ఐదేళ్లలో టీడీపీ నేతలు నీరు–చెట్టు పథకాన్ని కల్పవృక్షంలా మార్చుకున్నారు. చెరువులు, కాలువల పూడిక తీత, చెరువు కట్ట, చెరువుల అనుసంధానం, ఇంకుడు కుంటలు, చెక్‌డ్యాం పనులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పనులన్నీ ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల, గ్రామస్థాయి నాయకులు చేజిక్కించుకున్నారు. చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేపట్టినట్టు రికార్డులు సృష్టించారు. రూ.వేల కోట్ల ప్రజాధనం మింగేశారు. ఉపాధిహామీ పథకం కింద తీసిన గుంతల్లోనే కొత్తగా పూడిక తీత పనులు చేపట్టినట్లు చూపి బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదర్శక పాలనవైపు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అవినీతిపై దృష్టిసారిస్తున్నారు. సాక్షి, తిరుపతి/చిత్తూరు అగ్రికల్చర్: ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు. నీరు–చెట్టులో చోటుచేసుకున్న అక్రమాలను కొనసాగనీయకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకం ద్వారా రూ. 748 కోట్ల అంచనాతో 7,937 పనులు చేపట్టారు. అందులో 5,490 పనులు పూర్తి చేయగా, 2,447 పనులు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చూపుతున్నాయి. అయితే 329 పనులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. అవసరమైన చోట నీరు–చెట్టు పనులు చేపట్టాల్సి ఉంటే.. టీడీపీ నేతలు, కార్యకర్తలు అవసరం లేనిచోట్ల పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చెయ్యించుకున్నారు. చేపట్టిన పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. వాటర్ షెడ్ పథకం కింద జిల్లాలో ఏ నియోజకవర్గానికి మంజూరు కానన్ని నిధులు ఒక్క పీలేరుకు మాత్రం విడుదలయ్యాయి. పీలేరు పరిధిలో తలుపుల, రేగళ్లు పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.13.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ముఖ్య అనుచరులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్ అమర్నాథ్రెడ్డి, రాజశేఖరరెడ్డి ఏకమై నిధులను స్వాహాచేశారని తెలిసింది. మరోవైపు నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున నిధులు స్వాహా అయ్యాయని గత ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ అధికారులు సైతం ప్రభుత్వ పెద్దలకు నివేదికలు పంపారు. ఆ పనులను అధికారులుచూసీ చూడనట్లు ఉండాలని టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు అందడంతో నివేదికలకు విలువలేకుండా పోయింది. ఆరంభం నుంచే అవినీతి నీరు–చెట్టు పనుల్లో అగ్రిమెంట్ల నుంచే అవినీతికి ఆజ్యం పోశారు. పనుల కేటాయింపు విషయంలో జిల్లా స్థాయి అధికారి ఒకరు ఒకేరోజు సుమారు రూ.200 కోట్ల పనులకు సంబంధించి అగ్రిమెంట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీరంగరాజపురం మండలంలో జరిగిన అక్రమాలు జిల్లాలోనే మొదటిస్థానంలో నిలిచాయి. మండలంలో మొత్తం 312 పనులను గుర్తించారు. అందులో చెక్‌డ్యాంలు, చెరువు పూడిక తీత పనులు చేపట్టేందుకు రూ.32 కోట్లు కేటాయించారు. పద్మాపురంలో అధికారపార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రూ.2.12 కోట్లతో 5 చెక్‌డ్యాం పనులు చేపట్టారు. అయితే ఈ చెక్ డ్యాంలు కేవలం 30 మీటర్లకు ఒకటి చొప్పున నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకా రం అయితే ఒక్కో చెక్ డ్యాంకు కనీసం 500 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కారు. ఆ పనుల్లోనూ నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఒండ్రుమట్టితో కలిసిన ఇసుక, కాలం చెల్లిన సిమెంటుతో చెక్ డ్యాం నిర్మాణ పనులు చేపడుతున్నారు. వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం చెరువు కలుజు పనులు కూడా నాసిరకంగా చేపట్టారు. పాతగోడపై పనులు చేసి కొత్తగా కలుజు నిర్మించినట్లు రికార్డులు సృష్టించారు. ఏర్పేడు మండలం పల్లం, పంగూరు, జంగాలపల్లి, వికృతమాల, గోవిందవరం ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేపట్టిన పనుల్లో భారీ ఎత్తున నిధులు స్వాహా అయ్యాయి. రూ.లక్ష పనికి రూ.5లక్షలకు బిల్లులుపెట్టి నిధులు కాజేశారు. శ్రీకాళహస్తి పరిధిలోని ఎంపేడు, ఇలగనూరు, ముచ్చివోలు, కమ్మకండ్రిగ పరిధిలో జరిగిన పనులు నాసిరకంగా చేపట్టారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. చెరువు పనుల్లోనూ ఇష్టారాజ్యం జిల్లాలో పెద్ద ఎత్తున చెరువు పూడిక తీత పనులు, మరమ్మతు పనులు, చెరువుల అనుసంధానం పనులు చేపట్టారు. అందులో శ్రీరంగరాజురం మండలంలో జెడ్పీటీసీ సభ్యుడు రుద్రప్పనాయుడు గంగినేని చెరువు, ఆరిమాకుల చెరువు, పద్మాపురం చెరువు పనులు చేపట్టారు. ఇవన్నీ రాత్రికి రాత్రే పనులు చేపడుతున్నారు. చెరువుల్లో పైపైన గడ్డి మొక్కలను తొలగించి పనులు పూర్తిచేసినట్లు రికార్డులు తయారు చేస్తున్నారని, స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. పాలసముద్రం మండలంలో టీడీపీ నేత చేపట్టిన చెరువు పూడిక తీత పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువులో మట్టిని తీసి తన రిసార్ట్ చుట్టూ చదును చేసుకున్నారు. ఈ చెరువు పనుల్లో సుమారు రూ.2 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెళ్లాయి. వరదయ్యపాలెం మండలం కడూరు చెరువు పనులు నామమాత్రంగా చేసి నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పనులు సరిగా చేయలేదని స్థానిక రైతులు పనులను అడ్డుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. పూతలపట్టులో నాలుగు చెరువు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు నెల్లూరు జిల్లాకు చెందినవారు టెండర్ ద్వారా దక్కించుకున్నట్లు సమాచారం. పనులు ప్రారంభించిన సమయంలో స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో నాలుగు చెరువు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులను కూడా అమ్ముకున్న ఘనులు నీరు చెట్టు పనులు పార్టీ కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉన్నా పడమటి ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు కమిషన్లకు కక్కుర్తి పడి కడప జిల్లాలోని మరో టీడీపీ నాయకుడికి అప్పగించారు. అతని నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు పుచ్చుకున్నారు. కుప్పం నియోజక వర్గ పరిధిలో మొత్తం 574 చెరువులు ఉంటే... 2016లో ఓ సారి చెరువుల సంరక్షణ పథకం కింద, మరోసారి జాతీయ ఉపాధిహామీ పథకం కింద, చివరిసారిగా నీరు–చెట్టు పథకంలో మొత్తం 555 చెరువు పనులు చేసినట్లు భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లి పరిధిలోని రామసముద్రం మండలంలో టీడీపీ నాయకులు చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు రికార్డులు తయారుచేసి సుమారు రూ.10 కోట్లు కాజేశారు. నగరి పరిధిలో 15 చెరువుల కింద 40 చెక్‌డ్యాంలు నిర్మించారు. అందులో 20కిపైగా చెక్‌డ్యాంలు నాసిరకంగా నిర్మించినట్లు తెలుస్తోంది. పుత్తూరు పరిధిలోని నందికోన చెరువు పనులు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోలేదు. వీరప్పరెడ్డిపాలెం, నిండ్రమండలంలోని పాదిరిచెరువు, నగరిలోని అడవికొత్తూరు చెరువు పనులు చేపట్టాల్సిన అవసరం లేకపోయినా తూతూ మంత్రంగా పనులు చేసి నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా టీడీపీ నేతలు చేపట్టిన చెరువు పూడిక తీత, చెక్‌డ్యాంల నిర్మాణ పనుల్లో నిధులు కొల్లగొట్టినట్లు విజిలెన్స్ అధికారులు నిగ్గుతేల్చడం గమనార్హం. పారదర్శక పాలనవైపు అడుగులు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక పాలనవైపు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం నీరు చెట్టు కింద చేపట్టిన పనుల్లో అభివృద్ధి కంటే.. అవినీతి అక్రమాలకే పెద్దపీట వేసినట్లు గుర్తించారు. అవినీతి అక్రమాలకు కళ్లెం వేసేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గతంలో పనులు మంజూరై ఇంతవరకు ప్రారంభానికి నోచుకోని వాటిని, కనీసం 25 శాతం కూడా పనులు పూర్తి కాకుండా నామమాత్రంగా చేపట్టిన పనులను సీఎం వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారు. వాటి స్థానంలోనే అవసరమైన చోట కొత్తగా పనులకు శ్రీకారం చుట్టే విధంగా చర్యలు చేపడుతుండడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ఇటు ప్రజలు, అటు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నగారా మోగాక... సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో టీడీపీ నేతల హడావుడి అధికమైంది. ప్రజా సొమ్మును నిట్టనిలువునా దోచుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకమునుపే నీరు చెట్టు కింద రూ.వందల కోట్ల విలువ చేసే పనులకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ పనులన్నింటినీ టీడీపీ నేతలు, కార్యకర్తలే దక్కించుకున్నారు. హడావుడిగా కాంట్రాక్టర్లు పనులు నామమాత్రంగా ప్రారంభించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.93 కోట్ల విలువ చేసే 348 పనులు నామమాత్రంగా కూడా పనులు చేపట్టకనే వదిలేశారు. కేవలం నిధులు స్వాహా చేసేందుకే ఇలాంటి ప్రక్రియలు చేపట్టారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. -
లక్షల కోట్లలో పచ్చనేతల అవినీతి
సాక్షి, అమరావతి : ఎవరైనా అసాధారణంగా ప్రవర్తిస్తుంటే ‘వీడు మామూలోడు కాదు’ అని అంటుంటాం. దీనిని కొంచెం అటుఇటు మార్చి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలకు వర్తింపజేస్తే వీరు అచ్చంగా ‘మామూళోల్లే’ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఐదేళ్లుగా సీఎం చంద్రబాబు ఆయన బృందం ఆ స్థాయిలో కమీషన్లు (మామూళ్లు) మింగేసింది మరి. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పచ్చ దండు రాష్ట్రంలో అవినీతి సునామీ సృష్టించింది. రూ.6 లక్షల కోట్లు కొల్లగొట్టి కొత్త ‘చరిత్ర’ లిఖించింది. నవ్యాంధ్రను అభివృద్ధి బాటలో నడుపుతానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతిలో నంబరవన్ స్థానంలో నిలిపారు. పేరొందిన వ్యక్తులు, ఎన్నో సంస్థలు దీనిని ప్రస్తావించాయి. బాబు బృందం చలవతో ఐదేళ్లలో అవినీతి ఆక్టోపస్‌లా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ఆక్రమించింది. ముడుపులివ్వనిదే ఏ పనీ జరగని పరిస్థితి కల్పించారు. గాలి తప్ప అన్ని సహజ వనరులనూ దోచుకున్నారు. ఇసుక నుంచి ఇరిగేషన్ వరకు, బొగ్గు కొనుగోళ్ల నుంచి సోలార్ టెండర్ల వరకు, రాజధాని భూముల నుంచి గుడి భూముల వరకు అన్నింటా ముడుపులు, లంచాలు, ఆమ్యామ్యాలు, వాటాలే. దొడ్డి దోవలో మంత్రి పీఠమెక్కిన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ స్వయంగా వీటిని పర్యవేక్షిస్తూ వచ్చారు. ఏపీకి ‘సన్ రైజ్’ రాష్ట్రమని పేరుపెట్టిన చంద్రబాబు దానిని చివరకు ‘సన్’ షైన్ రాష్ట్రంగా మార్చేశారు. రాజధాని పేరుతో రూ.1.66 లక్షల కోట్లు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామంటూ అమరావతి పేరుతో అంతర్జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరతీశారు. రాజధాని నిర్ణయంతోనే రూ.లక్ష కోట్లు లాగేసిన చంద్రబాబు బృందం... స్విస్ చాలెంజ్ పేరుతో మరో రూ.66 వేల కోట్లు హాంఫట్ చేసింది. అధికార రహస్యాలను కాపాడతాననే ప్రమాణాన్ని తుంగలో తొక్కి రాజధాని భూముల్లో చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ముఖ్య అనుచరులకు ముందుగానే రాజధాని ప్రాంతాన్ని తెలియజేశారు. ఇదే అదనుగా అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బినామీలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు రైతులను మోసం చేసి తక్కువ ధరకే భూములు కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత 2014 డిసెంబర్ 28న రాజధానిని ప్రకటించారు. రైతులంతా నష్టపోగా చంద్రబాబు కుమారుడు లోకేశ్, ఎంపీలు సుజనా చౌదరి, మురళీమోహన్, మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే కొమ్మాలపాటి, పయ్యావుల తదితర బడా బాబుల బ్యాచ్ వేల కోట్లు లాభ పడింది. అనంతరం స్విస్ చాలెంజ్‌ను తెరపైకి తెచ్చి తనకు నచ్చిన సింగపూర్ సంస్థలకు చంద్రబాబు వేల ఎకరాలు కేటాయించారు. పూలింగ్ పేరుతో రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్న భూములను నచ్చిన సంస్థలకు ఇష్టం వచ్చిన రేట్లకు కమీషన్లు తీసుకుని కేటాయించారు. కాజేసిన భూముల విలువ రూ.1.75 లక్షల కోట్లు రాజధానిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా దొరికిన చోటల్లా టీడీపీ నేతలు భూములు కాజేశారు. వాటి విలువ రూ.1.75 లక్షల కోట్లకు పై మాటే. విశాఖ జిల్లాలోనే రూ.లక్ష కోట్ల విలువైన లక్ష ఎకరాల భూములను మింగేశారు. ఈ అన్యాయాన్ని అడ్డుకుని ఆదుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతలతో చేతులు కలిపారు. ఇందుకోసం సీఎం, అధికారులు, పోలీసులు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా మాఫియాలా మారారు. అవకాశం ఉన్నచోట రికార్డుల తారుమారు, సాధ్యం కాకపోతే కబ్జా, అదీ లేదంటే ల్యాండ్ పూలింగ్ పేరుతో భయపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 62,736 ఎకరాలను పచ్చ నేతలు కాజేశారు. వీటి విలువ రూ.58,933 కోట్లపైనే. జిల్లాల్లోని శ్మశాన స్థలాలు, చివరకు దేవుడి భూములనూ చెరబట్టారు. చెరువులను సైతం మింగేసి, దళితుల అసైన్డ్ భూములపై పడ్డారు. ఇవికాక రూ.978 కోట్ల సదావర్తి సత్రం, అయినవారికి అప్పనంగా అప్పగించిన, బినామీలు, గీతం వంటి బంధువులకు దోచిపెట్టిన రూ.వందల కోట్ల భూముల విలువ కలిపితే రూ.17 వేల కోట్లు దాటుతుంది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లంకకు అతి సమీపంలో కృష్ణా నది మధ్య సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తుమ్మల పాలెం, గుంటుపల్లి మధ్య కృష్ణానదిలో కిలోమీటరు మేర కంచె ఏర్పాటు చేశారు. సాగు నీటిలో రూ.1.01 లక్షల కోట్లు రాష్ట్రాన్ని సుభిక్షం చేయాల్సిన సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు కమీషన్ల కోసం అక్షయ పాత్రలుగా మార్చుకున్నారు. పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా ప్రత్యేక జీవోలు తెచ్చారు. ఈపీసీ నిబంధనలను తుంగలో తొక్కి, కాంట్రాక్టర్లకు అదనంగా ఇవ్వాల్సిన పని లేకపోయినా కమీషన్లు మాట్లాడుకుని నచ్చినవాళ్లకు రేట్లు పెంచేసి డబ్బులిచ్చారు. నాలుగున్నరేళ్లలో కమీషన్ల కోసం చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల మినహా మిగతా సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ గతంలోనే ప్రారంభమయ్యాయి. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టుల పనులు రూ.17,368 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతాయని చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పారు. నాలుగున్నరేళ్లలో రూ.62,132 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకపోవడం గమనార్హం. కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకుని అంచనా వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచేశారు. ఐదేళ్లలో 25 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.39,935.34 కోట్ల నుంచి రూ.96,785.72కోట్లకు పెంచారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.65,345.45 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నీరు– చెట్టు కింద రూ.11,797.15 కోట్లు, అటవీ శాఖ ద్వారా ఖర్చు చేసిన రూ.185.07 కోట్లు పోగా, మిగతా రూ.53,453.23 కోట్లను ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించారు. జీవో 22, జీవో 63ల ప్రభావం వల్ల చెల్లించిన బిల్లులే రూ.40 వేల కోట్ల పైగా ఉంటాయని అంచనా. ఇందులో రూ.25 వేల కోట్లను మామూళ్ల రూపంలో చంద్రబాబు వసూలు చేశారని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును కాగ్ తూర్పారబట్టింది. ఇసుక నుంచి రూ.12,500 కోట్లు పిండేశారు రాష్ట్రంలోని 459 అధికారిక, అనధికారిక ఇసుక రేవులను టీడీపీ నాయకులు దోపిడీ కేంద్రాలుగా మార్చుకున్నారు. ఇసుక ఉచితం పేరుతో రూ.12,500 కోట్లను టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాజేశారు. ఇందులో సింహభాగం వాటాను మామూళ్ల రూపంలో సీఎం చంద్రబాబుకు ముట్టజెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తాము జారీ చేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతో జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) రూ.వంద కోట్ల జరిమానా విధించింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లపాటు ఎడాపెడా ఇసుక వ్యాపారం సాగించడం ద్వారా రూ.2,480 కోట్లు దోచుకున్న అధికార టీడీపీ నాయకులు మలి రెండేళ్లలో ఉచిత ఇసుక విధానంతో పూర్తిగా రేవులను సొంత జాగీర్లుగా మార్చుకున్నారు. నచ్చిన రేటుకు అమ్ముకోవడం ద్వారా ఏకంగా రూ.5,470 కోట్లు కొట్టేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో చినబాబు లోకేశ్ కనుసన్నల్లో తమ్ముళ్లు సాగిస్తున్న ఇసుక దోపిడీ ఓ మాఫియాలా సాగింది. రూ.35 వేల కోట్లఅగ్రిగోల్డ్ కుంభకోణం ఖాతాదారుల కష్టార్జితాన్ని స్వాహా చేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం విలువ రూ.35 వేల కోట్లు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కోర్టులు జోక్యం చేసుకునే వరకు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అరెస్టులూ చేయలేదు. హైకోర్టు మందలించడంతో గత్యంతరం లేక 2016 ఫిబ్రవరిలో కంపెనీ చైర్మన్, ఎండీలను అరెస్టు చేసింది. ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణతోనే, అగ్రిగోల్డ్ యాజమాన్యం తన ముఖ్యమైన ఆస్తులను విక్రయించగలిగింది. లక్షలాది డిపాజిటర్లను, ఏజెంట్లను నట్టేట ముంచింది. చిన్నచిన్న నేరాలకే అరెస్టులు చేస్తున్న ప్రభుత్వం ఇంత పెద్ద కుంభకోణంలో అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని రక్షించే యత్నం చేస్తోంది. నీరు–చెట్టులో రూ.62,246 కోట్లు చిన్న నీటివనరుల పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ పేరుతో 2015–16లో ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని ప్రారంభించింది. 2015–16 నుంచి రూ.16,291.35 కోట్లను దీనికింద ఖర్చు చేశారు. ఈ పనులన్నీ టీడీపీ నేతలకే ఇచ్చారు. వారు మాత్రం పైసా పనిచేయకుండా 2015–16కు ముందు చేసిన పనులనే తాజాగా చూపి బిల్లులు చేసుకున్నారు. చెరువుల్లో పూడిక తీయగా వచ్చిన 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని క్యూబిక్ మీటర్ సగటున రూ.500 చొప్పున విక్రయించి రూ.45,955 కోట్లు దోచుకున్నారు. నీరు–చెట్టు కింద రూ.16,291.35 కోట్లు ఖర్చు చేసినా, ఆయకట్టు 12.36 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం. 2014 మార్చి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 9.21 మీటర్లు ఉండగా ఇప్పుడు 12.19 మీటర్లకు పడిపోవడం గమనార్హం. నామినేషన్‌పై రూ.12 వేల కోట్లు ధారపోత ప్రకృతి వైపరీత్యాల సమయంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పనులను మాత్రమే నామినేషన్‌పై కాంట్రాక్టర్లకు అప్పగించాలి. ఇదీ రూ.లక్షలోపువి అయితే ఈఈ, రూ.5 లక్షల్లోపువి అయితే ఎస్ఈ స్థాయి అధికారి ఇవ్వాలి. ఈ నిబంధనను ప్రభుత్వం తుంగలో తొక్కింది. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులను నామినేషన్‌పై కట్టబెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పోలవరం నుంచి నీరు–ప్రగతి వరకు నామినేషన్‌దే డామినేషన్. పరిపాలన అనుమతి లేకుండానే రూ.వేలాది కోట్ల పనులకు బిల్లులు చెల్లించేందుకు ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తే కేబినెట్ తీర్మానంతో ఆమోదించుకున్నారు. ఒక్క ఇరిగేషన్ విభాగంలోనే మూడేళ్లలో రూ.9,125 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెట్టి రూ.వెయ్యి కోట్లపైగా కొట్టేశారు. మిగిలిన విభాగాల్లోనూ ఇదే తరహాలో రూ.3 వేల కోట్ల మేర పనులు కట్టబెట్టి కమీషన్లు మింగేశారు. రూ. 8,300 కోట్ల మేర మద్యం కిక్కు మద్యాన్ని గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు అమ్ముకునేందుకు, బెల్టు షాపులు నిర్వహించుకునేలా సిండికేట్లు ప్రతి నెల 13 జిల్లాల నుంచి రూ.కోట్లు ముడుపులు అందిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో ఈ ముడుపుల మొత్తం రూ.8,391.6 కోట్లుగా తేలింది. ఒక్కో మద్యం షాపు నుంచి ఎమ్మార్పీ ఉల్లంఘనలకు రూ.లక్షన్నర, బెల్టు షాపులకు రూ.లక్షన్నర వంతున (అంటే ఒక్కో షాపునకు రూ.3 లక్షలు) వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు నెలనెలా దోచి పెడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 4,380 షాపులకు నెలకు రూ.131.40 కోట్లు ముడుపులు అందుతున్నాయి. ఇలా రూ.7,095.6 కోట్ల మేర దండుకున్నారు. 800 బార్లలో విడి విక్రయాలు, బ్రాండ్ మిక్సింగ్ తదితరాలకు నెలకు రూ.3 లక్షల వంతున రూ.24 కోట్లు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లలో రూ.1,296 కోట్లను సర్కారు పెద్దలు దిగమింగారు. -
ఉప్పులేటి వాడ..అవినీతి చీడ
సాక్షి, కృష్ణా : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అన్న చందంగా సాగిపోయింది ఆ ఎమ్మెల్యే తీరు. అడ్డూ అదుపులేని అవినీతి పర్వం.. ఇసుక, బుసక, మట్టి తవ్వకాల నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకూ అన్నింటా దోచుకో, దాచుకో.. పామర్రు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నైతిక విలువలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీ పంచన చేరి అందుకున్న తాయిలాలు ఒక ఎత్తయితే.. ఆమె కనుసన్నల్లో అక్రమార్జనకు ద్వారాలు తెరుచుకున్న వైనం మరొక ఎత్తు... కనీసం నమ్మి ఓట్లేసిన దళితులను సైతం పట్టించుకోకుండా.. సొంత లాభమే అజెండాగా పాలన సాగిస్తున్న పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అవినీతి అంకంపై ‘సాక్షి’ ఫోకస్. చినబాబుకు వాటాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వస్థలం నిమ్మకూరులో అడుగడుగునా అవినీతి దర్శనమిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ప్రభుత్వం వివిధ పనుల కోసం రూ.15 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో సుమారు రూ.7 కోట్లు అభివృద్ధి పనుల ముసుగులో తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకెళ్లినట్లు తెలుస్తోంది. మండల అధ్యక్షుడు కనుసన్నల్లోనే ఈ అవినీతి జరిగినట్లు కొందరు పేర్కొంటున్నారు. ఇందులో చినబాబుకు మూడో వంతు వాటా వెళ్లినట్లు తెలుస్తోంది. చెరువు తవ్వకంలో రూ.కోటి స్వాహా.. నిమ్మకూరు గ్రామంలోకి ప్రవేశించేటప్పుడు చెరువు దర్శనమిస్తుంది. ఈ చెరువును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్ది చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని చెప్పారు. అయితే నీరు–చెట్టు కింద నిబంధనలకు విరుద్ధంగా సుమారు 25,000 ట్రక్కుల మట్టిని తవ్వి, ఒక్కొక్క ట్రక్కు రూ.400 చొప్పున మండలాధ్యక్షుడు యథేచ్ఛగా విక్రయించుకున్నారు. దీని ద్వారా సుమారు రూ.కోటి సంపాదించారు. తన స్వస్థలంతో పాటు పక్కనే ఉన్న పోరంబోకు స్థలం సుమారు 10 సెంట్లు ఆక్రమించుకుని చెరువు మట్టితో నింపి ప్లాట్లుగా విభజించి విక్రయించుకుని మరో రూ.10 లక్షలు వెనకేసుకున్నారు. చెరువు తవ్వినందుకు మరో రూ.8 లక్షలు ప్రభుత్వం నుంచి తవ్వకం కింద తీసుకున్నారు. ఉన్న రోడ్లపైనే సిమెంట్ రోడ్లు వేసి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నిమ్మకూరులో సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పుడు ఆ రోడ్లపైనే సిమెంట్ పూత పూశారు. రోడ్లకు ఇరువైపులా ఒక అడుగు మేర సిమెంట్ రోడ్లు వేసి మొత్తం రోడ్లు వేసినట్లుగా చూపి సుమారు రూ.కోటిన్నర వరకు టీడీపీ నేతలు దండుకున్నారు. హాస్పిటల్ లేదు.. అనుబంధ రోడ్లు వచ్చాయి.. నిమ్మకూరు దాని చుట్టు పక్కల గ్రామాలకు కలిపి రూ.4.5 కోట్లతో 30 పడకల హాస్పటల్‌ను రెండేళ్ల కిందట అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌కు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడికి మధ్య బేరాలు కుదరక శంకుస్థాపన దశలోనే ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయింది. అయితే ఈ ఆస్పత్రికి అనుబంధంగా నిమ్మకూరు–మత్రిపాలెం, నిభానుపూడి, వడ్రపూడి తదితర ప్రాంతాలను కలుపుతూ రూ.6 కోట్లతో రోడ్లు వేశారు. ఇందులో సుమారు రూ.2 కోట్ల వరకు చేతులు మారాయి. రూ.5 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరగ్గా ఇందులోనూ రూ.2 కోట్లు తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి వెళ్లాయి. అవినీతి గురించి అధికారులకు తెలిసినా సాక్షాత్తూ చిన్నబాబుతో మండల నాయకులు టచ్‌లో ఉండటంతో మౌనంగా ఉన్నారు. నిమ్మకూరు పార్టీ నాయకులే పనులు మంజూరు చేయించుకుని, వారే చేసుకుని, వారే బిల్లులు పెట్టుకున్నారని, అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారని స్థానికులు చెబుతున్నారు. కల్పన ‘కారు’ కక్కుర్తి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆశతో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంది. పేదలకు అందాల్సిన పథకాలను వదిలిపెట్టలేదు. కేంద్రం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా సబ్సిడీపై మంజూరు చేసిన ఇన్నోవా వాహనాన్ని తన బినామీ పేరుతో తీసుకొని దర్జాగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు పాతర.. ఎమ్మెల్యే అనుచరుడు, మువ్వా గ్రామానికి చెందిన వ్యక్తి ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా దాదాపు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16 టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపి ఎల్లో ప్లేట్ ఉంచాలి. కానీ ఆ కారు నంబరు వైట్ బోర్డు కింద కేటాయించారు. ఈ తతంగం వెనుక ఎమ్మెల్యే ఉండటంతో రవాణా శాఖ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరుతో50 శాతం నిధులు బొక్కేశారు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు పామర్రు నియోజకవర్గంలో టీడీపీ నేతల దోపిడీ పర్వం కొనసాగింది. ఇసుక, మట్టి, మద్యం తదితరాల్లో రూ.కోట్లు దండుకున్నారు. 2015–16లో నీరు–చెట్టు పథకం కింద నియోజకవర్గంలో 15 చెరువులను రూ.3 కోట్లు వెచ్చించి తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఈ పనుల్లో 50 శాతం నిధులు నొక్కేశారు. చెరువుల నుంచి తవ్విన మట్టిన సైతం రైతులకు ఉచితంగా ఇవ్వకుండా ట్రాక్టరుకు రూ.500 చొప్పున వసూలు చేశారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు ఇసుక క్వారీ అధికార పార్టీ నేతలకు కాసులవర్షం కురిపించింది. ఇసుక కోసం వచ్చే వాహనదారుల నుంచి బాట పనుల పేరుతో సుమారు ఏడాది పాటు ఆ పార్టీ నేతలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో ట్రాక్టర్ డ్రైవర్ వద్ద రూ.100 చొప్పున, రోజుకి 500 నుంచి 600 వాహనాల వద్ద డబ్బును వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షల చొప్పున నాలుగున్నరేళ్లు రూ.5.20 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. ఇసుక అమ్మకాలకు మరో ధర నిర్ణయించి రూ.కోట్లు దండుకున్నారు. సుమారు రూ.1.20 కోట్ల సొమ్ము అధికార పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేత, దిగువ శ్రేణి నాయకులు కలిసి స్వాహా చేశారు. రొయ్యూరులోని కృష్ణా నదీ గర్భంలోని పట్టా భూముల్లో జరిగిన ఇసుక తవ్వకాల్లో కూడా అధికార పార్టీ నేతల మధ్య రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వం నుంచి అందాల్సిన కార్పొరేషన్ రుణాలు, పింఛన్లు, పక్కా గృహాలు, ఆదరణ వంటి పథకాల అమలులో తమకు అనుకూలమైన వారికే దక్కేలా తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పారు. ఈ రుణాలు ఇప్పించే పేరిట కూడా తమ్ముళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. చాలా మండలాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పిన వారికే ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ పేదల నుంచి వసూళ్లు చేశారు. ఈ మొత్తం రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది. -
అవినీతి..అక్రమాల్లో ‘రాజా’ ది గ్రేట్
సాక్షి, తెనాలి : ఆంధ్రాప్యారిస్ తారల తళుకులతో, కళాకారుల కౌసల్యంలో వాసికెక్కిన పట్టణం.. ఐదేళ్లుగా ఆలపాటి అంతులేని అవినీతిలో మకిలీ అయ్యింది. అభివృద్ధి మాటున అడ్డగోలు దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొల్లిపర మండలంలోని రీచ్‌లతో తవ్విన ఇసుక.. పేదలకు చేరకుండా అడ్డదారుల్లో తరలింది. ఉచితమనే మాట అనుచితమై.. అది రాజావారి ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితైంది. ఎమ్మెల్యే అండదండలతో టీడీపీ నేతలు సాగించిన కబ్జాకాండకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇదేమని ప్రశ్నించిన గొంతులను అక్రమ కేసులు నొక్కేశాయి. సహజ వనరులు ఎమ్మెల్యే ఆలపాటి రాజా అక్రమాల దెబ్బకు గుల్లయ్యాయి. కాసుల రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. నిలదీయాల్సిన అధికారులకు బెదిరింపులు, మామూళ్లు నజరానాగా మారి.. ఆలపాటి అంతులేని అవినీతికి ఎర్రతివాచీ పరిచాయి. అధికార అండతో అక్రమ నిర్మాణాలు గుంటూరు నగరంలోని విద్యానగర్‌లో ఎన్నారై ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ ఆలపాటి రాజాకు చెందింది కావడంతో రోడ్డుపైకి అక్రమంగా రెండు షాపులను నిర్మించేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. నిరుపేదలు చిన్న రేకుల షెడ్డు నిర్మిస్తేనే పెద్ద తప్పు చేసినట్లు హడావుడి చేసి తొలగించే టౌన్ ప్లానింగ్ అధికారులు.. దీనిపై చెయ్యి వేసేందుకు కూడా సాహసించలేకపోయారు. నగరం నడిబొడ్డున అరండల్‌పేట 12వ లైను ఎదురుగా ఉన్న గ్రాండ్ నాగార్జున హోటల్ సెల్లార్లో బార్‌ను నడుపుతున్నప్పటికీ అధికారులు ఎవరూ అడ్డుచెప్పని పరిస్థితి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ పెరిగిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సెల్లార్లో పార్క్ చేయాల్సిన వాహనాలను రోడ్డుపైనే పెడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం సదరు హోటల్ ఆలపాటి రాజాకు చెందింది కావడమే. పంట పొలాల దురాక్రమణ తెనాలి రూరల్ మండలం కఠెవరంలో తినీతినకా ఆస్తులు కూడబెట్టిన ఒకరు పాతికేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. అతడి ఏకైక కుమారుడు సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ కుటుంబానికి వారసులు ఎవరూ లేరు. కఠెవరం పరిధిలో 14 ఎకరాల పంట భూములపై హక్కుల కోసం కొందరు కోర్టును ఆశ్రయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దృష్టి ఆ భూములపై పడింది. కోర్టులో వాజ్యం నడుపుతున్న వారికి తలా కొంత ముట్టజెప్పి, తన పార్టీకి చెందిన బినామీల పేరిట రిజిస్టర్ చేయించారు. వీరిలో విశాఖకు చెందిన బినామీ కూడా ఉన్నారు. ఆ విధంగా రూ.2 కోట్లలోపు ఖర్చుతో రూ.70 కోట్ల విలువైన పంట పొలాలను సొంతం చేసుకున్నారు. నీరు–చెట్టు పథకం కింద తెనాలి రూరల్ మండలం మల్లెపాడులో 11 ఎకరాల చెరువు ఆక్రమణలకుపోగా ప్రస్తుతం ఏడెకరాల్లో ఉంది. రెండేళ్లకోసారి చేపల వేలం ద్వారా పంచాయతీకి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల ఆదాయం సమకూరేది. వేలం లేకుండా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర కనుసన్నల్లో తెలుగుదేశం నేత, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రావి రామ్మోహన్ నేతృత్వంలో ఇక్కడ మట్టి తవ్వకాలు సాగించారు. మూడు నాలుగు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి అమ్ముకున్నారు. ఇలా మట్టి తవ్వకాల్లో అ«ధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర కోటి రూపాయలకుపైగా గడించారు. రెండేళ్లలో కొల్లిపర మండలం కొల్లిపర, పిడపర్రు, వల్లభాపురం, అన్నవరం, తూములూరు, దావులూరు, పిడపర్తిపాలెం, శిరిపురం, కుంచవరం, చక్రాయపాలెం, అత్తోట, అత్తోట యాదవపాలెం గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. కేవలం కొల్లిపర మండలంలోనే ఎమ్మెల్యే ఆయన బినామీలు రూ.2.50 కోట్లను ఆర్జించారు. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువుల తవ్వకాల్లో అధికార పార్టీ నేతల్లో కలహాల కుంపటి రగిలిన సందర్భాలు లేకపోలేదు. తెనాలి మండలం కంచర్లపాలెంలో 5 ఎకరాల ఊరచెరువులో ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులు మట్టి తవ్వారు. 5600 ట్రక్కుల మట్టిని తీసి ఒక్కో ట్రక్కు రూ.600 చొప్పున అమ్మేశారు. పూడికతీతతో రూ.35 లక్షల ఆదాయం సమకూరగా, రూ.6 లక్షలతో చెరువు చుట్టూ కంచె వేయించారు. మిగిలిన సొమ్ము తమ జేబుల్లో వేసుకున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద నీరు–చెట్టు పథకం కింద ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమంగా తవ్వుకున్న మట్టి విలువ రూ.6 కోట్లపైమాటే! అమాయకుల్ని బలి తీసుకున్న ఇసుక ట్రాక్టర్లు.. ఎడతెరిపిలేని ఇసుక ట్రాక్టర్ల పరుగులో పొలం నుంచి ఇంటికి వస్తున్న మున్నంగికి చెందిన వంగా శేషిరెడ్డిని ఓ ఇసుక ట్రాక్టరు బలి తీసుకుంది. గత ఏప్రిల్ 23న ఈ దుర్ఘటన జరగ్గా.. అంతకు రెండు నెలల ముందు ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో అదే గ్రామస్తురాలైన కనపాల విశ్రాంతమ్మ విగతజీవురాలైంది. దీనిపై గ్రామస్తులు తిరుగుబాటు చేసి వల్లభాపురం రేవులో ఉచిత ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయించారు. ఇదే రేవులో ఇసుక తవ్వకాలను ప్రశ్నించారనే ఆగ్రహంతో టీడీపీ నేతల అనుచరులు వల్లభాపురానికి చెందిన అవుతు చంద్రశేఖరరెడ్డిపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర రెడ్డి బొటనవేలు తెగిపోయింది. ముందు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తెలుగుదేశం నేతల జోక్యంతో సాధారణ దాడి కేసుగా మార్చారు. ఎగ్జిబిషన్లకు అనుమతులు.. సుప్రీం కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సొసైటీ, కళాశాల యాజమాన్యం వివాదాస్పద స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి అనుమతించింది. స్థలం తమ చేతిలో ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పుకోవడానికి, ఆ మేరకు ఆధారాలు సంపాదించుకోవడానికి వీలుగా అధికార బలంతో ఎగ్జిబిషన్, శుభకార్యాల నిర్వహణకు స్థలాన్ని ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ. 15 కోట్లకుపైనే పలుకుతోంది. భారీ ఇసుక దోపిడీ... 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే ఆలపాటి కనుసన్నల్లో కృష్ణానది భూముల్లో మేట పేరుతో అవినీతి వేట సాగింది. గోరంత భూమికి అనుమతులు తీసుకొని, కొండంత మేర ఆక్రమించటం, ఆ పరిధిలో ఇసుకను తవ్వేసుకొని రూ. కోట్ల రూపాయలను పిండుకోవడం ఈ నాలుగున్నరేళ్లలో పరిపాటిగా మారింది. కొల్లిపర మండం అన్నవరం పరిధిలో కేవలం 1.70 ఎకరాల్లో ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు పొందారు. కానీ 30 ఎకరాలకుపైగానే తవ్వేసి రూ. 20 కోట్లు ఎమ్మెల్యే దండుకున్నారన్నది బహిరంగ రహస్యం. పాత బొమ్మువానిపాలెం ఉచిత ఇసుక రేవు గుంటూరుకు చెందిన తెలుగుదేశం నేత నల్లమోతు శ్రీను కనుసన్నల్లో నడిచింది. అనుమతులకు మించి ఇక్కడ కూడా 21 ఎకరాల్లో ఇసుక తవ్వుకుని రూ. 10 కోట్లు సంపాదించారు. 2016లో డ్వాక్రా మహిళల పేరిట రూ.3 కోట్ల విలువైన ఇసుకను ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన బినామీలు తవ్వి అమ్ముకున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద నాలుగున్నరేళ్లలో కృష్ణానదిలో ఇసుక తవ్వి ఎమ్మెల్యే రూ. 200 కోట్లు గడించారు. -
పొన్నూరులో ధూళిపాళ్ల దందా
సాక్షి, పొన్నూరు : ధూళిపాళ్ల నరేంద్రను పొన్నూరు ప్రజలు ఐదుసార్లు ఆశీర్వదించారు.. అయినా నియోజకవర్గంపై ఆయనకు కొంచెమైనా ఆపేక్ష ఉండదు.. అభివృద్ధి ఆనవాళ్లు కనిపించకపోయినా అవినీతి ఆగడాలకు కొదవలేదు. సంగం డెయిరీని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు అడ్డూ అదుపూ లేదు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసుల దందాకు అడ్టుకట్ట లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా నీరు–చెట్టు పేరుతో సాగించిన దోపిడీకి అంతే లేదు. ఎమ్మెల్యే అండతో, అధికార అహంకారంతో టీడీపీ నేతల అక్రమార్జనకు ఆనకట్ట లేదు. ప్రతి పనిలో కమీషన్లకు తెగబడిన ఎమ్మెల్యే తీరుపై ప్రశ్నించని గొంతు లేదు. ఐదేళ్ల పాలనలో కోట్ల రూపాయల దండుకున్న ఎమ్మెల్యే అవినీతిపై భగ్గుమనని ఊరూవాడా లేదు. 3.89 ఎకరాలు.. రూ.5కోట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోల్కత్తా – చెన్నై జాతీయ రహదారి సమీపంలోని పెదకాకాని మండలం నంబూరులోని సర్వే నంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని కబ్జా చేశారు. తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మారినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640 లలో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొదటగా పుల్లయ్య కుమారుడు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్‌కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీ) రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్లు పుట్టించారు. ఆ తరువాత ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవరపుల్లయ్య విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బీ6, బీ7, బీ8 సబ్ డివిజన్లుగా విభజించి దేవరపుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ ధర సుమారు రూ. 5 కోట్ల వరకు పలుకుతుంది. దీనికి తోడు పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారు. 10 ఎకరాలు 1994లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. పది ఎకరాల సంగం డెయిరీ భూమిని ఎమ్మెల్యే ట్రస్ట్‌కు అక్రమంగా తరలించారు. చట్ట ప్రకారం డెయిరీ ఆస్తులను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత అక్కడ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టు ఆసుపత్రి నిర్మించారు. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని 2016లో 9 మంది పాడి రైతులు జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో పాల ఉత్పత్తిదారుల కోసం ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఆస్పత్రి సేవలను వినియోగిస్తామని యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ, ఆసుపత్రికి ఎమ్మెల్యే నరేంద్ర సతీమణి జ్యోతిర్మయిని ఎండీగా వ్యవహరించడం గమనార్హం. చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి గ్రామంలో 25 ఎకరాల పెద్ద చెరువును ఎమ్మెల్యే క్వారీగా మార్చే యత్నాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు రావి వెంకట రమణ అడ్డుకున్నారు. వైఎస్ జగన్‌ను ఆ ప్రాంతానికి తీసుకురావడంతో తవ్వకాలు నిలిపేశారు. తాడేపల్లి రూరల్ కొలనుకొండలో అటవీ శాఖ భూమిలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకున్న వ్యక్తిని సురేంద్ర బెదిరించి క్వారీ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న వారిని కూడా భయపెట్టారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ రూ.కోట్ల దోచేశారు. చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాల ద్వారా రూ.10 కోట్లు దండుకున్నారు. పొన్నూరు మండలంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకున్నారు. చింతలపూడి పరిధిలోపాడి రైతులు తమ సంఘం నిధులతో 30 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. అందులో నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరు మీద కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండపానికి ఎంపీ ల్యాడ్స్ కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. కానీ ఆ కల్యాణ మండపం ప్రభుత్వ ఆధీనంలో లేదు. కానీ, నరేంద్రకుమార్ తల్లి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి సుమారు 150 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కో కార్యక్రమానికి రూ. 70 వేలు నుంచి రూ. లక్ష వరకు అద్దె వసూలు చేస్తారు. వెనిగండ్లలోని ప్రభుత్వ భూమిలో ప్రజలలు విరాళాలతో నిర్మించుకున్న కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే మూయించారు. -
ఎచ్చెర్లలో.. ‘కళా’విహీనం
సాక్షి, శ్రీకాకుళం: స్థానికుడు కాకపోయినా అభివృద్ధి చేస్తారని ఆశించారు. అందరికీ అందుబాటులో ఉంటారని ఓట్లేసి గెలిపించారు. గెలిచాక ప్రజలకు అందనంత దూరంగా ఉన్నారు. పేదలు, సామాన్యులను చెంతకు చేరనీయరు. వారి సమస్యలు వినడానికే చిరాకు పడిపోతుంటారు. తనకు బదులు ఇద్దరు పీఏల (ఒకరు పీఏ, మరొకరు ఓఎస్డీ)ను నియమించుకున్నారు. వారిద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యారు. ఈ ఐదేళ్లూ నియోజకవర్గంలో వారిద్దరే చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మంత్రి కళా వెంకట్రావు ఎచ్చెర్ల ఎన్నికల బరిలోకి దిగారు. గత ఐదేళ్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజక వర్గ ప్రజలు ‘నీ సేవలు చాలు..’ అంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..! కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వారు కాదు. ఆయన సొంత నియోజకవర్గం రాజాం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో వచ్చి వాలారు. అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై 4,741 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. స్థానికేతరుడైనా కళా వెంకటరావును నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలకు ఆయన ఎమ్మెల్యేగా కాకుండా అప్పుడప్పుడూ వచ్చే అతిథి అయ్యారు. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం మానేశారు. అక్కడి వారు తమ సమస్యను చెప్పుకోవాలంటే 80 కిలోమీటర్ల దూరంలోని రాజాంలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసుకు వెళ్లాలి. వయసు మీరిన వారికి అంత దూరం వెళ్లడం ఎంతో కష్టమయ్యేది. ఇక తప్పనిసరి అయిన వారు వెళ్లినా ఎమ్మెల్యే దర్శన భాగ్యం గగనమయ్యేది. వచ్చిన వారిలో పేరున్న వారో, స్థితిమంతులో అయితేనే కలిసేందుకు అనుమతిస్తారన్న పేరు మూటగట్టుకున్నారు. దీంతో ఈ నాలుగేళ్లలో ఆ స్థాయి ఉన్న వారే రాజాం వెళ్లేవారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఎచ్చెర్లకు వచ్చినప్పుడూ సామాన్యుల గోడు వినే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏ కష్టమొచ్చినా కళా వెంకటరావు పరామర్శకు కూడా రారని, ధనికుల ఇంట్లో పెళ్లి, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు మాత్రమే హాజరవుతారన్న పేరుంది. పర్సంటేజీలు, కమీషన్లు.. మరోపక్క ఆయన ఒక పీఏ (వెంకటనాయుడు)ను, మరో ఓఎస్డీ (కిమిడి కృష్ణంనాయుడు)ను ఏరికోరి నియమించుకున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్)లో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన కృష్ణంనాయుడుకు ఓఎస్డీ నియామకమే నిబంధనలకు విరుద్ధమంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. మంత్రి తన పనుల్లో బిజీగా ఉంటే వీరిద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే పనుల్లోను, ఉద్యోగుల బదిలీల్లోనూ పర్సంటేజీలు వసూలు చేయడం వీరి విధిగా చెబుతుంటారు. వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో రూ.లక్షల్లో వసూలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ డీలర్‌షిప్‌లను తప్పుడు ఫిర్యాదులతో రద్దు చేయించి, టీడీపీ వారికి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంకా ప్రభుత్వ భూములకు పట్టాలు చేయించుకోవడంలోనూ వీరిది అందెవేసిన చేయిగా చెబుతారు. ‘విష్ణుమూర్తి’ మాయ..! వీరిద్దరు చాలదన్నట్టు..మంత్రి మేనల్లుడు విష్ణుమూర్తి కూడా తోడయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో చేపట్టిన నీరు–చెట్టు పథకం పనుల్లో చాలావరకు బినామీ పేర్లతో ఆయనే చేశారు. ఒక్కో చెరువు పనులకు రూ.15–30 లక్షల వరకు మంజూరవుతాయి. తూతూమంత్రంగా పనులు చేసి పూర్తయినట్టు చూపించి బిల్లులు చేయించుకుంటారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా బిల్లులు నిలుపుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా మంత్రి కళా వెంకట్రావు నియోజవర్గ ప్రజలకు దూరంగా ఉంటే.. ఆయన పీఏలు, మేనల్లుడు అవినీతికి దగ్గరగా ఉంటున్నారు. వీటన్నిటినీ ఐదేళ్లూ ఎంతో సహనంతో భరిస్తూ వచ్చిన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో కళాకు ఓటుతో బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలై ఈ సారి బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ను గెలిపించాలన్న తపన ఆ నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తోంది. -
నీరు చెట్టు... కోట్లు కొల్లగొట్టు!
ఎన్నికల్లో విజయం సాధించాలంటే నోట్లే ప్రధానమని భావించారు. దానికోసం ఆదినుంచీ పునాదివేసుకుంటూ వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటునుంచీ ఏదోరకంగా డబ్డు కూడగట్టడమే పనిగా పెట్టుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందుకోసమే వినియోగించారు. నీరు–చెట్టు వారి ఆశలకు అనుగుణంగా మారింది. కోట్లు కొల్ల గొట్టేందుకు ఓ బృహత్తర అవకాశంగా కనిపించింది. అనుకున్నదే తడవుగా ఇక నాశిరకం పనులు చేసి చేతులు దులుపుకోవడం ఒక ఎత్తయితే... కొన్ని చోట్ల పనులు చేయకుండానే బిల్లులు కొట్టేశారు. దీనిపై ఏర్పాటైన సామాజిక తనిఖీ బృందాలను సైతం మేనేజ్ చేశారు. అనుకున్నట్టుగా నిధులు దోచుకున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: నీరు–చెట్టు పేరుజెప్పి జిల్లాలో కోట్ల రూపాయలను టీడీపీ ప్రజాప్రతినిధులు కాజేశారు. పనులు జరగకుండానే జరిగినట్టు బిల్లులు చేసుకున్నారు. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పనులు సృష్టించి నిధులు స్వాహా చేశారు. నాణ్యతనేది మచ్చుకైనా కనిపించకుండా చేసిన ఈ పనుల్లో చాలా వరకూ సగంలోనే నిలిపేశారు. చెరువుల్లో తవ్విన మట్టిని లోడుకింత అని రేటు కట్టి ప్రైవేటు అవసరాలకు అమ్ముకున్నారు. తమ బినామీలనే కాంట్రాక్టర్లుగా పెట్టి అందిన కాడికి దోచేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రాష్ట్రమంత్రి ఇలాకాలో... బొబ్బిలి నియోజకవర్గంలో నీరు చెట్టు పథకంలో సుమారు 104 చెరువులకు పైగా యంత్రాలతో తవ్వేసి ఒప్పందాలు చేసేసుకున్నారు. ఈ వ్యవహారంలో సుమా రు రూ. 40 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తె లు స్తోంది. పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీ పురం మండలంలో రూ.3కోట్లు సీతానగరం మండలంలో రూ.4.2కోట్లు, బలిజిపేట మండలంలో రూ.3.5 కోట్లతో చేపట్టిన పనులను తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జన్మభూమి కమిటీ సభ్యులే చేసుకున్నారు. కొన్ని చోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్లలో నిధులు స్వాహా... నెల్లిమర్ల నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులు అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపించింది. మండలంలో 2015–16లో రూ.20లక్షలు, 2017–18లో రూ1.2కోట్లతో పనులు చేపట్టగా సతివాడ, దన్నానపేట, వల్లూరు గ్రామాల్లో స్థానిక టీడీపీ నాయకులతో కుమ్మక్కై కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేశారని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో తీసిన మట్టిని లోడు రూ.400 నుంచి రూ.600లకు ఇటుకబట్టీల నిర్వాహుకులకు అమ్ముకున్నారు. 2018–19 సంవత్సరానికి రూ.70లక్షల విలువైన పనులను మంజూరు చేశారు. గతేడాది మల్యాడ గ్రామానికి సమీపంలో రూ.25లక్షలతో నిర్మించిన చెక్‌డ్యామ్ పనులు నాసిరకంగా చేపట్టడంతో లీకులకు గురైంది. పూసపాటిరేగ మండలంలో చెరువులో తీసిన మట్టి నూతనగృహాల నిర్మాణాలతో పాటు వివిధ పనులకు వాడుకున్నారు. రెల్లివలస పంచా యతీ రామధేనువు చెరువులో పనులను అధికారపార్టీ నాయకులు చేసి మట్టిని ఇటుక బట్టీలు, రహదారులకు అమ్ముకున్నారు. రియల్‌ఎస్టేట్‌కు అనుకూలంగా... గజపతినగరం మండలంలోని లోగిశ రామసాగరం, బంగారమ్మపేట అప్పలగరం, పురిటిపెంట సుబ్బసాగరం కొత్తబగ్గాం సీతాఫలం, మధుపాడు తదితర చెరువుల్లో కోట్లాది రూపాయలతో చేపట్టిన పనుల్లో చెరువులోతు పెంచి గట్లను ఎత్తు చేయాల్సి ఉండగా టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ భూములకు ఒక్కో ట్రాక్టర్ రూ.200ల నుంచి రూ.300లకు అమ్మకొని లక్షలాది రూ పాయలు జేబులో వేసుకొన్నా రు. బొండపల్లి మండలం లోని కనిమొరక గంపవాని చెరువులోని మట్టితో స్థానిక టీడీపీ నాయకుడు తన పొలానికి రోడ్డు వేయించున్నారు. దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి వెంకన్న చెరువు, వింధ్యవాసి నర్సరాజు సాగరం, మరడాం బుచ్చన్న చెరువు, కోమటిపల్లి బారికివాని చెరువు, పెదమానాపురం మద్దలవాని చెరువుల్లో ఎమ్మెల్యే అనుచరులు కాంట్రాక్టర్లుగా వ్యవహరించి నిబంధనలకు నీళ్లొదిలి కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. మెంటాడలో మరీ దారుణం సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలో 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో 106 పనులు మంజూరు చేయగా అందులో 25 చెరువు పనులు పూర్తి చేశారు. 30 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 51 పనులు పూర్తి చేయాల్సిఉంది. కానీ బిల్లులు మాత్రం కాజేశారని తెలుస్తోంది. 2017–18 లో పెదచామలాపల్లి ఎరకయ్య చెరువులో రూ.8 లక్షలతో మంజూరు చేయగా, కనీసం రూ.8 వేలు విలువైన పనులూ చేయలేదు. మక్కువ మండలంలో 125 చెరువులకు రూ.7.50కోట్లు మంజూరు కాగా శంబర గ్రామంలోని మిందివానిబంద, సవకబంద, ఏకలోడుబంద వద్ద జరిపిన చెరువు పనుల్లో నాణ్యత కొరవడంటంతో రక్షణగోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. శంబర గ్రామ సమీపంలో మిందివానిచెరువు పనులకు రూ. 5లక్షలు ఖర్చుచేసినట్టు చూపి బిల్లులు తీసుకున్నారు. పెద్దచెరువులో నిధులు బుడుంగ్... విజయనగరం పట్టణంలో కీలకమైన పెద్దచెరువు అభివృద్ధి కోసం నీరుచెట్టు పథకంలో చేపట్టిన పనుల్లో అక్రమంగా దోచేసుకున్నారు. మట్టి పనుల నిమిత్తం రూ.80లక్షలు, మదుముల కోసం రూ.80లక్షలు మంజూరు చేశారు. 2017–18లో మంజూరు చేసిన పనుల్లో మట్టి పనులు సగం వరకు జరగ్గా సిమెంట్ పనులు 25శాతం జరిగాయి. నిబంధనల ప్రకారం ఏదైనా చెరువుకు రూ.10లక్షలకు మించి పనులు చేపడితే టెండర్ల రూపంలో కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలి. కానీ ఇక్కడ ఏకంగా రూ.1.60లక్షల పనులు జరిగినా నామినేషన్ పద్ధతిపై పనులు కేటాయించారు. చీపురుపల్లి మండలంలో 2015 నుంచి 2018 వరకు 101 రకాల పనులకు సంబంధించి రూ.667.93 లక్షలు మంజూరు చేయగా 51 పనులు మాత్రమే జరిగాయని, ఇందుకు సంబందించి రూ.204.31లక్షలు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మండలంలోని కర్లాం పంచాయతీలో కొత్తచెరువు, మోదుగులచెరువు, పోలమ్మచెరువుల్లో పనులు జరిపారు. చేసిన చెరువుల్లోనే పనులు చేయటం, ఉపాధిహామీ పనులు జరిగిన చెరువులనే ఎంచుకుని కొత్తగా పనులు చేసినట్టు చూపి బిల్లులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు శృంగవరపుకోట మండలంలోని పోతనాపల్లి గ్రామంలో పందిరివాని చెరువులో వేలకొద్దీ క్యూబిక్‌మీటర్ల మట్టిని తవ్వించి ఇటుక బట్టీలు, లేఅవుట్లు, ఇళ్ల స్థలాలకు యథేచ్ఛగా అమ్ముకున్నారు. చెరువులో కళింగలపై సిమెంట్ పూతపూసి, మమ అనిపించారు. పోతనాపల్లి గ్రామంలో మద్దిగెడ్డపై చెక్‌డ్యామ్ పనులు నేటికీ పూర్తిస్థాయిలో జరగలేదు. వేపాడ మండలం కొండగంగుబూడిలో అడ్డుకొండనుంచి ఇసుకగెడ్డ పారే కాలువవద్ద వైఎస్ హయాంలో నిర్మించిన చెక్‌డామ్‌కు ప్లాస్టింగ్చేసి బిల్లులు స్వాహా చేశారు. జామి మండలం శాసనాపల్లి – సోమయాజులపాలెం మధ్య ఉన్న గెడ్డపై అవసరం లేకున్నా రూ.7లక్షలతో చెక్‌డ్యాం అరకొరగా నిర్మించి బిల్లు మింగేశారు. కురుపాం నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో నీరు చెట్టు పేరుతో సుమారు రూ.8.17 కోట్లను టీడీపీ నేతలు, కార్యకర్తలకే ధారపోశారు. అవసరం లేని చోట్ల తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. -
కోట్లు కొల్లగొట్టారు
నెల్లూరు రూరల్: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో నీరు – చెట్టు పథకం కింద పనులను మంజూరు చేశారు. అయితే ఈ పనులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. çకొన్ని చోట్ల పనులను చేయకుండానే ఇరిగేషన్ శాఖ అధికారులను మభ్యపెట్టి పనులు పూర్తయినట్లు బిల్లులు చేసుకొని స్వాహా చేసిన ఉదంతాలు కోకొల్లలు. మరికొన్ని చోట్ల నామమాత్రంగా, నాసిరకంగా నిర్మాణ పనులను పూర్తి చేశారు. దీంతో నిర్దేశిత ప్రమాణాల మేరకు నాణ్యత కొరవడింది. నీరు – చెట్టు పథకంలో పనుల విషయంలో రూ.తొమ్మిది కోట్ల వరకు దుర్వినియోగమయ్యాయి. పనులు ఇలా.. నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రాంతాల్లో మూడేళ్ల కాలంలో 330 పనులు నీరు – చెట్టు పథకం కింద మంజూరయ్యాయి. ఈ పనులకు రూ.19.25 కోట్లను కేటాయించారు. మండలంలోని చెరువులకు నీటిని మళ్లించేందుకు 15 చెక్‌డ్యామ్‌ల వరకు నిర్మించారు. చెరువు కట్టల బలోపేతానికి గానూ కట్టలపై లైనింగ్ పనులు, చెరువు కట్టల స్థాయిని పెంచేందుకు ఎర్త్‌వర్క్‌లు 50 వరకు చేశారు. చెరువుల్లో నీటిని అధికంగా నిల్వ ఉంచేందుకు మట్టిని తవ్వే పనులు కూడా జరిగాయి. లేఅవుట్లకు మట్టి తరలింపు చెరువుల నుంచి తవ్విన మట్టిని అధికార పార్టీ నేతలు తమ స్వలాభానికి యథేచ్ఛగా సమీపంలోని లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు కట్టల బలోపేతానికి చేపట్టిన పనులు తూతూమంత్రంగానే జరిగాయి. దీంతో చెరువుకట్టలు గతంలో ఉన్న మాదిరిగానే యథాస్థితికి చేరుకుంటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల రైతులకు చేకూరిన ప్రయోజనం శూన్యం. నీటిపారుదల కాలువలపై బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం, వరద గేట్ల ఏర్పాటు పనుల్లో నాణ్యత పూర్తిగా కొరవడింది. నీటిపారుదల కాలువల్లో పూడికతీత పనులను అధ్వానంగా చేపట్టారు. కాకుపల్లి, కలివెలపాళెం, పెనుబర్తి, మాదరాజుగూడూరు, తదితర ప్రాంతాల్లో నీరు – చెట్టు పథకం పేరిట అధికార పార్టీ నేతలు దోపిడీ పర్వానికి తెరలేపారు. అంచనా వ్యయం పెంపు ఆయా ప్రాంతాల్లో వ్యవసాయాధారిత చెరువులు, కాలువల్లో రైతులకు అవసరమైన పనులు, మరమ్మతులను చేపట్టేందుకు సాగునీటి సంఘాల ద్వారా నివేదికలు ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలతో అందడం పరిపాటి. అయితే రూ.పది లక్షల్లోపు ఉన్న పనులను నామినేటెడ్ పద్ధతిన ఇష్టానుసారంగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టారు. రూ.10 లక్షలకుపైగా అంచనా కలిగిన పనులను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించారు. చిన్నపాటి మరమ్మతు పనులకు సైతం అంచనా వ్యయాన్ని విపరీతంగా పెంచి కట్టబెట్టారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతల మాటకే ఇరిగేషన్ శాఖ అధికారులు తలొగ్గారు. నీరు – చెట్టు పథకం పనులు అధ్వానంగా జరిగాయి నీరు – చెట్టు పథకం పనులు అధ్వానంగా జరిగాయి. అవసరం లేని చోట కూడా పనులను చేపట్టి నిధుల దోపిడీకి పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు చేపట్టిన ఈ పనులతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. – పార్లపల్లి వీరరాఘవరెడ్డి, రైతు, కలివెలపాళెం, నెల్లూరు రూరల్ నిధుల దోపిడీకి పాల్పడ్డారు నీరు – చెట్టు పథకం అధికార పార్టీ నేతలకు వరంలా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. పనులు పూర్తిగా నాసిరకంగా జరిగాయి. బాగున్న చోటే పనులు చేపట్టి బిల్లులు పొందారు. – బండి శ్రీకాంత్‌రెడ్డి, రైతు, పొట్టేపాళెం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం: నెల్లూరు రూరల్ మంజూరైన పనులు - 330 కేటాయించిన నిధులు - రూ.19.25 కోట్లు స్వాహా అయిన మొత్తం - రూ.9 కోట్లు -
దోపిడి రాజ్యం.. దొంగ ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చెరువులను ఆధునీకరించి, వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతోనే నీరు–చెట్టు పనులను మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు ఊదరగొడుతున్నా.. లక్ష్యం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే అన్నది సుస్పష్టం. నీరు–చెట్టు పథకంలో దాదాపు 12 రకాల కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. చెక్‌డ్యామ్‌లు, చిన్న నీటికుంటలు, వాల్కట్టలు నిర్మించడం, చెరువుల్లో పూడిక తీసిన మట్టిని వ్యవసాయ భూములకు వినియోగించడం, చెరువులకు మరమ్మతులు చేయడం, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం, నీటివనరులు లభ్యత ఉన్న చోట చెరువులకు ఎత్తిపోతల ద్వారా నీరు అందించడం, చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం, నీటిపారుదల కాలువలకు మరమ్మతులు చేసి సామర్థ్యాన్ని పెంచడం, క్షీణించిన అడవుల్లో చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడడం, ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టి ఆయకట్టును స్థీరికరించడం, మెట్ట ప్రాంతాల్లో కొత్త ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని సరఫరా చేయడంతోపాటు అన్ని ప్రాంతాల్లో మొక్కలు పెంచి హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం నీరు–చెట్టు పథకం ముఖ్య ఉద్దేశం. కానీ క్షేత్ర స్థాయిలో చేస్తున్న పనులు పథకంలో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా ఉన్నాయి. 2015–16లో చేపట్టిన పనుల్లో 90 శాతానికిపైగా పాత గుంతలను చూపించి టీడీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు. అధికారులు మాత్రం 385 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తొలగించినట్లు లెక్కలు చూపడం గమనార్హం. 2016–17లో చేపట్టిన పనుల్లోనూ ఉపాధి హామీ గోతులను నీరు–చెట్టు కింద చేసినట్టు చూపారు. అధికారులు మాత్రం 420 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించినట్లు లెక్కలు చెబుతున్నారు. 2017–18లో చేపట్టిన పనుల్లో ఉపాధి హామీ గోతులు, హేచరీలకు మట్టి తరలించగా ఏర్పడిన గోతులను చూపి బిల్లులు మంజూరు చేయించుకున్నారు. మొత్తం మీద గడిచిన మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా నీరు–చెట్టు పథకంలో 604.58 కోట్లతో 8,865 పనులు మంజూరు చేయగా రూ.355.44 కోట్లు వెచ్చించి 4,473 పనులు పూర్తి చేసినట్లు అధికారులు లెక్కలేశారు! అంతులేని అవినీతి జిల్లాలో జరుగుతున్న నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. 30 శాతం కమీషన్లు తీసుకుని ఇరిగేషన్ అధికారులు ఇబ్బడిముబ్బడిగా పనులు మంజూరు చేయగా పాత గుంతలను చూపించి టీడీపీ నేతలు, కార్యకర్తలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. నీరు–చెట్టులో అధికార పార్టీ నేతలు 80 నుంచి 90 శాతం పనులను మనుషులతో కాకుండా యంత్రాలతో పూర్తి చేశారు. చెరువులు, కాలువల్లో పాత గుంతలు చూపి బిల్లులు చేసుకున్నారు. చెరువుల్లో మట్టిని ఒక్కో ట్రిప్పు రూ.300 నుంచి రూ.800 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అదే గుంతలు చూపించి పూడికతీత పేరుతో నీరు–చెట్టులో బిల్లులు తీసుకున్నారు. చెక్‌డ్యామ్‌లు నాసిరకంగా నిర్మించి పెద్ద ఎత్తున నిధులు కాజేశారు. జిల్లాలో చీరాల మినహా మిగిలిన 11 నియోజకవర్గాల్లో అవినీతికి అంతే లేదు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురంతోపాటు కందుకూరు, దర్శి ప్రాంతాల్లో అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడం కోసమే నీరు–చెట్టు పథకం పెట్టినట్టుందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధికారులు అందినకాడికి కమీషన్లు పుచ్చుకుని నేతలు, కార్యకర్తలతో కలిసి వాటాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి సోమవారం జిల్లాలో గ్రీవెన్స్ డేకు వచ్చే అర్జీల్లో అధిక శాతం వినతులు.. నీరు–చెట్టు అక్రమాలపైనే కావడం గమనార్హం. ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వస్తున్నా.. ఉన్నతాధికారులతోపాటు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కూడా స్పందించిన దాఖలాలు లేవు. పేదల పొట్టగొడుతున్నారు పూసపాడు గ్రామంలోని బాపిరెడ్డి కుంట విస్తీర్ణం 18.24 సెంట్లు. దీని ఆధారంగా 22 కుటుంబాల వారు గత 70 ఏళ్ల నుంచి భూమి సాగు చేసుకుంటున్నారు. మా తాతల కాలం నుంచి ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాం. గతంలో ఐదు ఎకరాలను కుంట తవ్వుకోవడానికి ఇచ్చాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఎకరా కూడా నీరు–చెట్టు పేరుతో తవ్వుకోవాలని చూశారు. మాబోటి పేదోళ్ల పొట్టకొట్టేందుకు సిద్ధపడ్డారు. మట్టి అమ్ముకుని స్థానిక టీడీపీ నాయకులు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సంపాదించుకున్నారు. – ఇస్తర్ల భూషణం, పూసపాడు(పర్చూరు) పనులెక్కడ చేశారు? నీరు చెట్టు కింద మంజూరైన మట్టి పనులు ఎక్కడ చేశారు. వాగుల్లో మట్టి పనులు తూతూమంత్రంగా చేసి బిల్లులు పొందారు. చెరువుల్లో అయితే గతంలో పని చేసిన చోటునే మరోసారి పని చేసినట్టు చూపి టీడీపీ నాయకులు డబ్బు దండుకున్నారు. కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి కనీసం ప్రజాప్రతినధులకు కూడా తెలియకుండానే పనులు చేశారు. – మాలకొండయ్య, మార్కాపురం ఎంపీపీ ఇష్టారీతిగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కందుకూరు రూరల్: కందుకూరు మండలంలో ఉపయోగం లేని చోట చెక్‌డ్యామ్‌లు నిర్మించి అప్పనంగా బిల్లులు మెక్కేశారు. అనంతసాగరం గ్రామంలో నీరు–ప్రగతి కింద రూ.24 లక్షలతో మూడు చెక్ డ్యామ్‌లు మంజూరు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మూడు చెక్‌డ్యామ్‌లకు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఒకటి పడమటి వాగుపై, మరో రెండు జింకల వాగుపై నిర్మించారు. పడమటి వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ పగుళ్లిచ్చింది. చెక్ డ్యామ్ నిర్మిస్తే నీరు నిల్వ ఉండేలా వాగులో పూడిక తీయాలి. ఇక్కడ మరో కాలువ ఉన్నా దానికి కలపకుండా ఒక వాగుపైనే చెక్‌డ్యామ్ నిర్మించారు. ఇందులో చుక్క నీరు నిల్వ ఉండే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. అదే విధంగా జింకల వాగుపై నిర్మించిన రెండు చెక్‌డ్యామ్‌లు దగ్గర దగ్గరగా నిర్మించారు. ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో పగుళ్లిచ్చాయి. వాగుకు నీరు వచ్చినప్పుడు చెక్ డ్యామ్‌లో నీరు నిల్వ ఉండేలా పని చేయకుండా టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా నిర్మించి బిల్లులు తీసుకున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ పనులు సక్రమంగా చేయించకుండా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. పచ్చచొక్కాల పర్యవేక్షణలోనే పనులు పరిటాలవారిపాలెం(సంతమాగులూరు): మండలంలోని పరిటాలవారిపాలెంలో నీరు–చెట్టు పథకంలో భాగంగా చెరువు కట్ట అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు తమ ఇష్టానుసారం చేస్తున్నారు. కట్ట నిర్మాణానికి నాసిరకం మట్టిని వినియోగిస్తున్నా ఎన్ఎస్పీ అధికారులు పట్టించుకోవడం లేదు. పనులు చేస్తున్న సమయంలో పర్యవేక్షించడం లేదు. చెరువు కట్ట అభివృద్ధికి ప్రభుత్వం రూ.9 లక్షలు కేటాయించింది. గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు చావా గోవిందయ్య పేరు మీద వర్క్ ఆర్డర్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడ పని చేయిస్తున్నది మాత్రం కరణం వర్గం నుంచి గొట్టిపాటి వర్గం వైపు వెళ్లిన పరిటాల వెంకయ్య, ఎంపీటీసీ భర్త పేరయ్య. కనీస ప్రమాణాలు పాటించకుండా, నాసిరకమైన మట్టిని వాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామానికి చెందిన కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పని విలువ రూ.9 లక్షలు కాగా రూ.4 లక్షలతో పూర్తి చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి. చేసిన పనికే మళ్లీ బిల్లులు తర్లుపాడు: ఈ ఫోటోలో ఉన్నది తర్లుపాడు మండలం గొల్లపల్లె గ్రామ పరిధిలోని ఎర్రవాగు. వాటర్‌షెడ్ పనుల్లో భాగంగా ఈ వాగులో 2015–16లో దాదాపు 9 లక్షల రూపాయలతో నీటి కుంటలు ఏర్పాటు చేశారు. కాగా మళ్లీ అదే వాగులో, అదే ప్రాంతంలో 2016–17కు గాను నీరు–చెట్టు పథకంలో భాగంగా 6 లక్షల రూపాయలతో పనులు కేటాయించారు. ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న మండల టీడీపీ అధ్యక్షుడు వేశపోగు జాన్.. కాలువలో పైపై మెరుగులు దిద్ది బిల్లులు పొందాడు. ఒక్క వర్షానికే కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్ గిద్దలూరు: రాచర్ల మండలంలోని జే.పి.చెరువు గ్రామం బస్టాండ్ సమీపంలో నిర్మించిన చెక్‌డ్యామ్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. ఈ చెక్‌డ్యామ్ పనులను టీడీపీ నాయకుడు ఎస్.పాండురంగారెడ్డి చేయించాడు. ప్రభుత్వం రూ.9.95 లక్షలు కేటాయించగా అందులో మూడో వంతు కూడా వినియోగించకుండా నాసిరకంగా పనులు చేపట్టారు. చెక్‌డ్యామ్ నిర్మించిన తర్వాత కురిసిన మొదటి వర్షానికే మట్టికట్టలు కొట్టుకుపోయాయి. దీంతో వర్షం నీరంతా వాగులో గుండా బయటకు వెళ్లిపోతోంది. వర్షం నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచేందుకు మంజూరు చేసిన పనులను అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిగా చేసి జేబులు నింపుకున్నారే తప్పా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనేందుకు ఈ చెక్‌డ్యామ్ నిదర్శనం. అంబచెరువులో నిధులు స్వాహా.. కొనకనమిట్ల: నీరు–చెట్టు పథకంలో భాగంగా కొనకనమిట్ల అంబచెరువుతోపాటు చెరువులో మట్టి తీసి జెడ్పీ పాఠశాల ఆవరణ చదును చేసేందుకు రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను కొనకనమిట్లకు చెందిన టీడీపీ నాయకులు కొండలు, కె.వెంకట కోటయ్య, శ్రీనివాసరెడ్డి చేపట్టారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చెరువు అభివృద్ధి జరగలేదని, నీరు–చెట్టు పనులు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా చేశారని గ్రామస్తులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. నాలుగు కాలాలపాటు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో అక్రమాల తీరు ఇదీ.. అ ఒంగోలు శివారులోని కొప్పోలు, చెరువుకొమ్ముపాలెం, పెళ్లూరు చెరువుల నుంచి రోజు వందల కొద్ది ట్రాక్టర్లు పెట్టి ట్రిప్పు మన్ను ’250 నుండి ’500 విక్రయించారు. అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ల వద్ద సైతం ట్రిప్పుకు 50 చొప్పున కమీషన్లు పుచ్చుకున్నారు. ఒంగోలు నగర వాసులు ఈ మట్టితో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్లు పూడ్చుకోవడం, స్థలం ఎత్తు పెంచుకునేందుకు ఉపయోగించుకుంటుండటంతో డిమాండ్ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకొని టీడీపీ నేతలు కాసులు దండుకుంటున్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని అక్కన్నవారి చెరువు, బుర్రవానికుంట, వలేటివారిపాలెం చెరువు, వరగమ్మ వాగు, ముదిగొండ వాగు, చిన్నచెరువులతోపాటు పలు చెరువులు, వాగుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అ గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యాలవాడ, గడికోట, తిమ్మాపురం, సంజీవరాయునిపేట, దంతెరపల్లి, రాచర్ల ప్రాంతాల్లో నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. అ యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి చెరువు మట్టిని రోడ్డు కోసం తోలుకుని నీరు–చెట్టు పనుల్లో బిల్లులు తెచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. పుల్లలచెరువు మండలంలోని కాటివీరన్న చెరువు, చేపలమడుగు, పెద్దచెరువు, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు చెరువుతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అ అద్దంకి–నార్కెట్‌పల్లి దారిలో నీరు–చెట్టులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు అప్పుడే శిథిలావస్థకు చేరుకున్నాయి. జె.పంగులూరు మండలం చినమల్లవరం, అరికట్లవారిపాలెం ప్రాంతంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు కొదవలేదు. అ దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం దోర్నపువాగు పరివాహక ప్రాంతం, తోటవెంగన్నపాలెం, రాజానగరం, కొర్రపాటివారిపాలెం, వీరన్నవాగుతోపాటు పలు ప్రాంతాల్లో నీరు అ చెట్టు పనుల్లో టీడీపీ సానుభూతిపరులు అవినీతికి ద్వారాలు తెరిచారు. నియోజకవర్గంలోని కోమలకుంటచెరువు, ఎర్రచెరువు, తానంచింతం, అబ్బాయిపాలెం, చందలూరు చెరువు పనుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అ కందుకూరు నియోజకవర్గంలోని మోపాడు చెరువు, గుడ్లూరు నాయుడుపాలెం చెరువులతోపాటు నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. అ కనిగిరి పరిధిలోని దోమలేరు, గోకులం, జిల్లెళ్లపాడులతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో తెలుగు తమ్ముళ్లు అందినకాడికి దండుకున్నారు. అ కొండపి పరిధిలోని టంగుటూరు మండలం కొణిజేడు, కొండపి చెరువుతోపాటు నియోజకవర్గంలో పలు చెరువులు, వాగుల్లో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అ మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం చెరువుతో పాటు కొనకనమిట్ల అంబచెరువు, పొదిలి ప్రాంతంలోని అన్నవరం, మల్లవరం, యేలూరు, కొచ్చెర్లకోటతోపాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. అ పర్చూరు పరిధిలోని దేవరపల్లి సూరాయకుంట, నూతలపాడులోని బూరాయికుంట, దగ్గుబాడు, నాయుడువారిపాలెం గ్రామాలతోపాటు పలు చెరువుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అ సంతనూతలపాడు పరిధిలోని మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి ఎండోమెంట్ చెరువులో భారీగా మట్టిని తరలించి అక్రమాలకు పాల్పడ్డారు. దొడ్డవరప్పాడు, ముదిగొండ వాగు, జతివారికుంట, పాపాయి చెరువులతోపాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
భూమాతకు తూట్లు.. పచ్చనేతలకు కోట్లు
సాక్షి, అమరావతి : ‘తివిరి ఇసుకన తైలంబు తీయవచ్చు..’ననిఓ కవి నాడు ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ నేడది నిజం అని నిరూపిస్తున్నారు పచ్చ పాలకులు.. ఇసుక, నీరు, మట్టి, చెట్లు..ఏదైతేనేం దోచుకోవడానికని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు.. నింగి సాక్షిగా భూమాతకు తూట్లు పొడుస్తూ జేబులు నింపుకుంటున్నారు.. జనమేమనుకుంటారన్న కనీస స్పృహ లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.. ‘నీరు – చెట్టు’ అంటూ ఆ రెండూ లేకుండా చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు.. పోలవరం ప్రాజెక్టులో 11.69 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాలి. గత ఐదేళ్లలో కనీసం మట్టి పనులు కూడా సర్కార్ పూర్తి చేయలేకపోయింది. కానీ నీరు–చెట్టు పథకం కింద 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీత పనులు పూర్తి చేసింది. అంటే.. పోలవరం ప్రాజెక్టులో మట్టి పనుల పరిమాణం కంటే 687 శాతం అధికంగామట్టి పనులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇంతకూ ఆ మట్టి ఏమైందనేగా మీ అనుమానం..? ప్రజాధనంతో పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్‌కు సగటున కనిష్టంగా రూ.500 చొప్పునటీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు అమ్మేసి దోచుకున్నారు. ఒక్క పూడిక తీసిన మట్టిని అమ్ముకోవడం ద్వారానే రూ.45,955 కోట్లకుపైగా కొల్లగొట్టారు. దోపిడీ అక్కడితో ఆగిపోలేదు.. చెరువుల కట్టలు, తూములకు మరమ్మతులు చేయకుండా చేసినట్లు.. గతంలో చేసిన పనులను తాజాగా చేసినట్లు.. పాత చెక్ డ్యామ్‌లకు పైపైన సిమెంటు పూత పూసి.. కొత్తగా నిర్మించినట్లుచూపి రూ.16,291.35 కోట్లు దోచుకున్నారు. పూడిక తీసిన మట్టి ద్వారా రూ.45,955కోట్లు, పనుల్లో రూ.16,291.35కోట్లు వెరసి రూ.62,246.35కోట్ల మేర దోపిడీ చేశారు.ఈ ఘరానా దోపిడీకి నీరు–చెట్టు పథకం కేంద్రమైంది. తిమిరి ఇసుమున తైలంబు పిండవచ్చునో లేదో గానీ పూడిక తీసిన మట్టి ద్వారా రూ.62,246.35 కోట్లు దోచుకున్న తీరు ఇదీ.. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నీరు–చెట్టు పథకం కింద వేలాది కోట్ల ప్రజాధనాన్ని తన పార్టీ నాయకులకు దోచిపెట్టింది. రాష్ట్రంలో చిన్న నీటి వనరుల పరిరక్షణ, భూగర్భజలాల సంరక్షణకు 2015–16లో నీరు–చెట్టు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. జలవనరుల, అటవీశాఖల నిధులకు ఉపాధి హామీ పథకం నిధులను జత చేసి.. చెరువుల్లో పూడిక తీత, చెరువు కట్టల మరమ్మతు, తూముల మార్పిడి, చెరువులకు నీటిని సరఫరా చేసే సప్లయ్ ఛానల్స్(వాగులు, వంకలు)లో పూడిక తీత, చెక్ డ్యామ్‌ల పునరుద్ధరణ, కొత్త చెక్ డ్యామ్‌ల నిర్మాణం, కాంటూరు కందకాల తవ్వకం, పంట కుంటల తవ్వకం పనులను నీరు–చెట్టు కింద చేపట్టారు. ఈ పథకం కింద చేపట్టే పనుల్లో రూ.పది లక్షల అంచనా వ్యయంలోపు ఉండే పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులు బాటు కల్పిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. ఈ పథకం కింద పనులు మంజూరు చేసే అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకే అప్పగించింది. రాష్ట్రంలో 41,478 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువుల్లో పూడికతీసే పనులను ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు సూచించిన ఆ పార్టీ నేతలకే నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. నిబంధనల మేరకు పూడికతీసిన మట్టిని రైతుల పొలాలకు తరలించాలి. కానీ ఆ మట్టిని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. నేటికీ కుందు నదీలో మట్టిదిబ్బలు ఎత్తివేయకపోవడంతోమంచినీరు పారే కాలువ మురికినీటిమయం అయిన దృశ్యం. మట్టిద్వారా భారీ ఎత్తున దోచుకునే క్రమంలో చెరువులను అడ్డగోలుగా తవ్వేశారు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే తూముల కంటే 10 నుంచి 12 మీటర్ల దిగువ మట్టానికి పూడిక తవ్వేశారు. దీనివల్ల వర్షాలకు అరకొరగా చెరువుల్లోకి చేరిన నీరు కూడా తూములకు అందకపోవడంతో ఆయకట్టుకు విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో బ్రహ్మలింగయ్య చెరువే అందుకు నిదర్శనం. 2015–16 నుంచి ఇప్పటివరరకూ చెరువుల్లో 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తీశారు. దీన్ని క్యూబిక్ మీటర్ సగటున కనిష్టంగా రూ.500కు విక్రయించడం ద్వారా రూ.45,955 కోట్లు దోచుకున్నారు. కుడి, ఎడమల దోపిడీ చెరువుల కట్టలు, తూముల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు తీసుకున్నారు. 2013–14కు ముందు చేసిన పనులనే 2015–16, 2016–17, 2017–18, 2018–19లో చేసినట్లు చూపి సొమ్ము చేసుకున్నారు. 96,439 చెక్ డ్యామ్‌లను నిర్మించినట్లుగా, 8,46,673 పంట కుంటలు తవ్వినట్లుగా, 8,23,775 జలసంరక్షణ పనులు చేపట్టినట్లుగా.. ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ, క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ మేరకు పనులు జరగలేదు. నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా తమ దర్యాప్తులో వెల్లడైందని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలను ప్రభుత్వ పెద్దలు తుంగలోకి తొక్కడమే అందుకు తార్కాణం. పనులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లుల రూపంలో రూ.16,291.35 కోట్ల మేర టీడీపీ నేతలు మింగేశారు. వ్రతం చెడ్డా దక్కని ఫలితం నీరు–చెట్టు పథకంలో చేపట్టిన పనుల వల్ల 86.41 టీఎంసీలు అదనంగా అందుబాటులోకి వచ్చాయని, 7.24 లక్షల ఎకరాలను స్థిరీకరించినట్లుగా సర్కార్ ప్రకటించింది. కానీ చిన్న నీటిపారుదల విభాగంలో ఆయకట్టు విస్తీర్ణం 13.24 లక్షల ఎకరాలకు తగ్గడం గమనార్హం. అంటే.. చెరువుల కింద ఉన్న ఆయకట్టులో 12.36 లక్షల ఎకరాల ఆయకట్టు మాయమైనట్లు స్పష్టమవుతోంది. 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినా.. రూ.16,291.35కోట్లతో చెరువులను అభివృద్ధి చేసినా.. ఆయకట్టు పెరగకపోగా ఉన్న ఆయకట్టులోనే 50 శాతం తగ్గడం గమనార్హం. పోనీ భూగర్భజలాలు ఏమైనా పెరిగాయా అంటే అదీ లేదు. 2014, మార్చి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 9.21 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం అది 12.19 మీటర్లకు తగ్గింది. అంటే.. భూగర్భజలాలు పెరగకపోగా భారీగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. నీరు–చెట్టు పథకం కింద సర్కార్ ఖర్చు చేసిన రూ.16,291.35 కోట్లు.. పూడిక తీసిన మట్టిని అమ్ముకోవడం ద్వారా టీడీపీ నేతలు కాజేసిన రూ.45,955 కోట్లను వెచ్చించి ఉంటే.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని జలవనరుల శాఖ అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో కరవు సహాయక చర్యల్లో భాగంగా..1999 నుంచి 2004 వరకూ కేంద్ర ప్రభుత్వం ‘పనికి ఆహారం’ పథకం కింద పంపిన కోట్లాది టన్నుల బియ్యాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పేదలకు దక్కకుండా చేసి, దారి మళ్లించి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి తెలిసిందే!! - ఆలమూరు రామ్‌గోపాల్ రెడ్డి, సాక్షి, అమరావతి -
ఇంతింతై.. అవినీతి కొండంతై
సాక్షి, కడప: నీరు–చెట్టు పనులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపించాయి. గత ఏడాది మే నెలవరకు జిల్లావ్యాప్తంగా ఈ పథకం కింద 9,405 పనులు చేపట్టగా.. ఇందుకోసం రూ.626.56 కోట్లు వ్యయం చేశారు. ఇందులో చాలాచోట్ల గతంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులనే మళ్లీ చేపట్టినట్లు రికార్డుల్లో చూపి రూ.లక్షలు తమ జేబుల్లో నింపుకొన్నారు. కొందరు టీడీపీ నేతలు తూతూమంత్రంగా పనులు కానిచ్చేశారు. మరికొందరు నాసిరకంగా పనులు చేసి బిల్లులు దండుకున్నారు. కొన్నిచోట్ల నాసిరకంగా చేసిన చెక్‌డ్యాంలకు పగుళ్లు రావడంతో వాటికి పైపైన సిమెంటు పూతలు పూసి మమా అనిపించారు. ఇక పూడికతీత పనుల్లో చెరువులు, కుంటలు, కాలువల్లో తీసిన మట్టిని టీడీపీ నేతలు వదల్లేదు. ఆ మట్టిని రైతులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్ రూ. 800 నుంచి రూ.2వేల వరకు అమ్ముకున్నారు. మొత్తం రూ. 447.80 కోట్ల విలువైన పనులు చేపట్టగా.. మట్టిని విక్రయించి టీడీపీ నేతలు లక్షలు గడించడం గమనార్హం. ఇక చెక్‌డ్యాం పనుల్లోనూ కోట్లాది రూపాయలు ఇలాగే వెనకేసుకున్నారు. నాసిరకంగా పనులు చేయడమే కాకుండా.. కొన్ని చోట్ల అవసరం లేకున్నా చెక్‌డ్యాంలు నిర్మించి సొమ్ము చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 178.76 కోట్లు చెక్‌డ్యామ్‌లకు ఖర్చు పెట్టారు. చాలా చోట్ల చెక్‌డ్యాంలను పడగొట్టి మళ్లీ కట్టి సొమ్ము చేసుకున్నారు. మరికొన్ని చోట్ల ఉపాధి పనుల్లో భాగంగా చేసిన పూడికతీత పనులనే మళ్లీ చేసినట్లు చూపి బిల్లులు పక్కదారి మళ్లించారు. ఇలా టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా రూ. 250 కోట్లపైనే నిధులను దారి మళ్లించినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీరు–చెట్టు పనుల కోసం పోటాపోటీ.. నీరు–చెట్టు పనుల కోసం టీడీపీ నేతలు బహిరంగంగా రచ్చకు దిగడం జిల్లాలో కనిపించింది. బద్వేలు నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులు నాయకుల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. స్వయంగా ఎమ్మెల్యే జయరాములు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి రూ. 90 కోట్లు నీరు–చెట్టు పథకం కింద నిధులు మంజూరు కాగా.. అందులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు రూ.85 కోట్లు, తనకు రూ. 3 కోట్లు, మరో టీడీపీ నేత విజయజ్యోతికి రూ. 2 కోట్ల పనులు ఇచ్చారని మండిపడ్డారు. విజయమ్మ వర్గం పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని ఆయన బహిర్గతం చేసుకున్నారు. ఈ పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే జయరాములు విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. ఈ పనులన్నీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి చెందిన వ్యక్తులే చేయడం గమనార్హం. దాదాపు రూ.2 కోట్ల విలువైన 22 చెక్‌డ్యామ్‌లను ఈ నియోజకవర్గంలో నిర్మించారు. అవన్నీ నాసిరకంగా చేశారన్న విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి కాంక్రీట్ నమూనాలను విజయవాడ ల్యాబ్‌కు పంపించారు. పనులన్నీ టీడీపీ నేతలకే.. జిల్లాలో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో 99 శాతం పనులు టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఆ పనులను బినామీలతో చేయించారు. ఎక్కడా నిబంధనలు పాటించకుండా పనులను మమ అనిపించి కోట్లు దండుకున్నారు. జమ్మలమడుగులో అధికారపార్టీ నేతతోపాటు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డిలు నీకు సగం.. నాకు సగం అంటూ పనులు పంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో రూ. 96 కోట్ల విలువైన పనులు జరిగాయి. నియోజకవర్గంలోని కొండాపురంలో ఏకంగా పనుల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. పంచాయతీ పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కడప బుగ్గవంకలో... కడప బుగ్గవంక పరిధిలో పూడికతీత పనులకు సంబంధించి తొలుత రూ. 66 లక్షలకు అధికారులు నివేదికలు తయారు చేశారు. అయితే ఈ పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బినామీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారనే ఫిర్యాదులపై అధికారులు స్పందించక తప్పలేదు. దీంతో పనులను నిలిపివేశారు. కేవలం రూ. 12 లక్షలు బిల్లులు చెల్లించారు. విజిలెన్స్ విభాగం పరిశీలన జరపడంతో అంతటితో ఈ పనులు ఆగిపోయాయి. వారిపై ఎలాంటి చర్యలు లేవు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి అంతా తానై రూ. 49.15 కోట్ల నీరు–చెట్టు పనులు చేయడం గమనార్హం. పులివెందుల నియోజకవర్గంలో రూ. 71.90 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులు చేపట్టగా.. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎక్కువ శాతం పనులు దక్కించుకున్నారు. ఈ పనులన్నీ తన అనుయాయులకు పంచిపెట్టారు. మట్టి కొట్టుకుపోయింది వల్లూరు మండలంలో పైడికాలువ, పెద్దపుత్త గ్రామాల మధ్యన గల వంకపై పైడికాలువ గ్రామ పంచాయతీ పరిధిలోని జంగంపల్లె వద్ద జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద నిర్మించిన మోడల్ చెక్‌డ్యాం. 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చెక్ డ్యాం జిల్లాలో అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన చెక్‌డ్యాంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇంత ఎక్కువ మొత్తాన్ని ఒకే పని కింద చూపితే టెండర్లు పిలవాల్సివస్తుందనే కారణంగా మూడు పనులుగా విభజించారు. వంకకు ఇరువైపులా నిర్మించిన రెండు మట్టి కట్టలను రెండు పనులుగా , కాంక్రీట్ నిర్మాణాన్ని మరో పనిగా విభజించారు. దీంతో ఒక్కో పనికి రూ. 10 లక్షల చొప్పున మూడు పనులకు కలిపి రూ. 30 లక్షలను కేటాయించారు. స్థానిక ఎంపీటీసీ తనయుడు గ్రామానికి చెందిన టీడీపీ నేత వాసు పర్యవేక్షణలో నిర్మాణాన్ని చేపట్టారు. చెక్‌డ్యాంకు ఇరువైపులా ఉన్న మట్టి కట్టలను వంకలో ఉన్న మట్టితోనే నాసిరకంగా ని ర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 40 రోజుల్లో కురిసిన వర్షాలకు చెక్‌డ్యాంకు నీరు చేరింది. కాంక్రీటు నిర్మాణానికి ఆనుకుని ఇరువైపులా ఏర్పాటు చేసిన మట్టి కట్టలో ఒకవైపున గల మట్టి కట్ట నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయింది. దీంతో చుక్క నీరు కూడా నిలువకుండా దిగువకు తరలి పోయింది. సీఎం తనయుడు సందర్శించిన మోడల్ చెక్‌డ్యాం ఇదే.. జిల్లాలోనే మోడల్ చెక్‌డ్యాంగా రూపొందించిన ఈ చెక్‌డ్యాంను 2017 వ సంవత్సరం జులై నెల 12 వ తేదీన జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం తనయుడు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆయన సందర్శించిన 40 రోజుల్లోనే నాసిరకంగా నిర్మించిన ఈ చెక్‌డ్యాం వర్షపు నీటికి తెగిపోవడం నీరు చెట్టు పథకంలో జరిగిన అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దొరికినంత దోచుకోవడమే.. గాలివీడు : పనులన్నీ రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి్జ ఆర్.రమేష్‌రెడ్డి , వారి అనుచరులు చేపట్టారు. నూలివీడు గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు పార్వతమ్మ కుటుంబీకులు చేసిన పనులకు మెరుగులు దిద్ది దాదాపు రూ. 80లక్షలు పైగా బిల్లులు చేసుకొని నిధులను దిగమింగారు. దాదాపు రూ.1.50కోటి పైగా ఆర్.రమేష్‌రెడ్డి బినామీ టీడీపీ నాయకుడు, గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యుడు రామమోహన్‌నాయుడు తూముకుంటలో వివిధ రకాల పనులు చేపట్టారు. కొర్లకుంట గ్రామంలో ఎంపీటీసీ ఈశ్వరమ్మ కుమారుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి రైతులకు ఎలాంటి ఉపయోగం లేని చోట పనులు చేసి రూ.70లక్షలు బిల్లులు చేసుకున్నారు. గోరాన్చెరువులో రమేష్‌రెడ్డి సమీప బంధువు మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రెడ్డిప్రసాద్‌రెడ్డి దాదాపు రూ. 50లక్షలు పైగా విలువైన పనులు చేపట్టారు. ఎగువ గొట్టివీడుకు చెందిన మండల టీడీపీ ఉపాధ్యక్షుడు శివప్పనాయుడు ఉపాధి పనులు చేసిన పనులకే నీరు –చెట్టు పనులు చేసి దాదాపు రూ.30లక్షలుపైగా స్వాహా చేశాడు. చెరువు మట్టి.. విక్రయాలు చేపట్టి.. కడప అర్బన్ పరిధిలో 2016–17 లో పూడికతీత పనులకు సంబంధించి రూ.2 కోట్లు, 113 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.95 లక్షలు, 2017–18 లో పూడికతీత రెండు పనులకు గాను రూ.19 లక్షలు, 10 చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.90 లక్షలు, మొత్తం రూ.4.04 కోట్లు నీరు చెట్టు కింద ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2015–16 లో కడప అర్బన్ పరిధిలో నీరు చెట్టు కింద ఎలాంటి పనులు చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. పుట్లంపల్లె చెరువులో నీరు–చెట్టు కింద పూడిక తీసి మట్టిని అమ్మేందుకు ట్రాక్టర్లలో వేస్తున్న దృశ్యం పుట్లంపల్లె చెరువును చెరబట్టారు... కడప అర్బన్ పరిధిలో పుట్లంపల్లె చెరువులో పూడికతీత పనులకు, జంగిల్ క్లియరెన్స్‌కు రూ.9.30 లక్షలు ఖర్చు చేశారు. ఈ చెరువులో మట్టిని టీడీపీ నాయకుడు రెడ్డెయ్య అమ్ముకుని ఆదాయవనరుగా మార్చుకున్నాడు. ఓ ట్రిప్పు ట్రాక్టర్ మట్టిని రూ.300 నుంచి రూ. 400 వరకు విక్రయిస్తూ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగించాడు. ఈ నాయకునికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి అండదండలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువులో తీసిన పూడిక మట్టిని కట్టకు గాని రైతులకు ఉచితంగా గాని, ప్రభుత్వ పనులకు ఉచితంగా తరలించాల్సి ఉంటుంది. అదీ కూడా నిబంధనలకు లోబడి పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా పూడికతీసిన మట్టిని పొక్లెయిన్‌తో ట్రాక్టర్లకు నింపి వ్యాపారం చేసుకున్నారు. దీనిపై ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా.. కడప బుగ్గవంకలో పూడికతీత పనుల కోసం రూ.66 లక్షలతో అధికారులు నివేదికలు తయారు చేశారు. కాని టీడీపీ నేతలు పనులు నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో కేవలం రూ.12 లక్షలు మాత్రమే అధికారులు బిల్లులు చేశారు. తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. చర్యలు మాత్రం లేవు. ఆ తర్వాత పనులను ఆపేశారు. అధికారులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తెచ్చారు. ఈ పనులు కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అనుచరులు, బినామీలే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బుడ్డాయపల్లె చెరువులోనూ.. బుడ్డాయపల్లె చెరువులో కూడా అధికార పార్టీ నాయకులు మట్టిని అమ్ముకున్నారు. యథేచ్ఛగా మట్టిని అమ్ముకుని వ్యాపారం చేస్తున్నా అధికారుల తనిఖీలు మాత్రం శూన్యం. అలాగే దేవుని కడప చెరువులో కూడా మట్టిని అమ్ముకుంటూ అక్రమార్జనకు టీడీపీ నాయకులు తెరలేపారు. ఈ వింత చూడండి.. తొండూరు–గంగాదేవిపల్లె మధ్యలో గుట్టకు వాగులు సృష్టించి అధికారపార్టీ నాయకులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలంలో వాగులు, వంకలు, చెరువులు లేకపోయినా వాటిని పొక్లెయిన్ల సహాయంతో సృష్టించారు. మండలంలో నీరు–చెట్టు కింద 21 పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సబ్సిడీతో ట్రాక్టర్లు ఇచ్చి మట్టి, ఇసుక దోచేశారు టీడీపీ నాయకులకు ప్రభుత్వం సబ్సిడీ కింద రైతు రథం ట్రాక్టర్లు ఇచ్చింది. ఆ ట్రాక్టర్లతో వారు మట్టి, ఇసుకను ఇష్టం వచ్చినట్లు తోలి కోట్లాది రూపాయలు సంపాదించారు. ఆ ప్రాంతంలో రెండు ట్రాక్టర్లు ఉన్న ఓ టీడీపీ కార్యకర్త మూడు నెలల్లోనే ఇసుక అక్రమ రవాణా ద్వారా కోటి రూపాయలు సంపాదించాడంటే, ఐదేళ్లపాటు ఒక్కొక్కరు ఎంత సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. నీరు చెట్టు పేరు చెప్పి బిల్లులు చేసుకున్నారు. ఆ మట్టిని పొలాలకు తోలకుండా అమ్ముకుని రెండు వి«ధాలుగా సంపాదించారు. – మెడతాటి రవి, మోడమీద పల్లె, కడప తాగునీటికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి నెలకొంది అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరు రెండేసి ట్రాక్టర్లు కొని ఇసుకను, మట్టిని అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. కడప, ఆలంఖాన్‌పల్లెకు చెందిన నాయకుల పేర్లు చెప్పి సహజ వనరులను కొల్లగొట్టారు. టీడీపీ నాయకుల అరాచకాల వల్ల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కడపలో తాగునీటి సమస్య తలెత్తడానికి వీరే ప్రధాన కారకులు. ప్రభుత్వం వీరికి దోచిపెట్టేందుకే ఉన్నట్లు పనిచేసింది. వీటికి అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. – భాస్కర్‌రెడ్డి, మోడమీదపల్లె, కడప ఇసుకతో చెక్‌డ్యాంలను నిర్మించారు నీరు–చెట్టు పథకం కింద చేపట్టిన చెక్ డ్యాంలను ఇసుక, కంకర, సిమెంటుతో కాకుండా ఇసుకతోనే అధికార పార్టీ నాయకులు నిర్మించారు. లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల పరిధిలో చేపట్టిన చెక్‌డ్యాంలను ఒక్కసారి పరిశీలిస్తే వాటి నాణ్యత తెలిసిపోతుంది. ఒక నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు దుమ్ము లేచిపోతున్నా అధికారులు మాత్రం ఒక్కో చెక్‌డ్యాంకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు బిల్లులు చేసి ఇచ్చేశారు. పనులు నామినేషన్ మీదనే కేటాయించడంతో పాటు అధికార పార్టీ నాయకులే చేశారు. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా నిర్మించిన చెక్‌డ్యాంల వలన చుక్క నీరు నిలిచే పరిస్థితులు లేవు. ఈ రెండు మండలాల పరిధిలోనే చెక్‌డ్యాంల పేరుతో 10 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. కేటాయించిన నిధుల నుంచి 20 శాతం కూడా ఖర్చు చేయకపోవడం దారుణం. పిచ్చిమొక్కలను తొలగించుకుంటూ జేసీబీలతో గీతలు పెట్టి డబ్బులు దోచుకున్నారు. – సూరం వెంకటసుబ్బారెడ్డి, నల్లగుట్టపల్లె, రామాపురం మండలం -
మట్టితో ‘బాబు’లు కాసుల పండుగ
సాక్షి, విజయవాడ : కాలం మారింది.. కాలం మారింది అనంటారు. కానీ సూర్యచంద్రుల గతి మారలేదు.. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం వాటి నిబద్ధత మారలేదు. ఋతువుల క్రమమూ మారలేదు. ఫల, పుష్పాలు, పక్షిజాతులు వాటి ప్రక్రియల్లోనే ముందుకు సాగుతున్నాయి. మరి మారిందేమిటీ? మనిషి ఆలోచనా విధానం. తను మారి అన్నింటినీ మార్చాలనుకుంటున్నాడు. అలా మార్చేవారిలో ప్రధములు రాజకీయ నాయకులే. అందునా అధికారం చేతిలో ఉన్నవారైతే చెప్పేదేముంటుంది. పంచభూతాలను తమ వశం చేసుకుని దాన్ని ఎలా నగదుగా మార్చుకోవాలో వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు కూడా. అప్పట్లో ఖాళీ స్థలాలు కనపడితే పాగా వేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అక్కడి మట్టి నుంచి కాసులు రాల్చేదెలాగో తెలుసుకున్నారు. దాన్నే అనుసరించారు.. భూమాతకు తూట్లు పొడిచారు. ఇందుకోసం ఓ పథకాన్ని రూపకల్పన చేసి.. దాని అసలు లక్ష్యాన్ని మార్చేసి.. వేల కోట్ల రూపాయలు బొక్కేశారు. ఆ పథకం పేరే ‘నీరు–చెట్టు’. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బ్రహ్మలింగయ్య చెరువులో నీరు– చెట్టు క్రింద చేపట్టిన పనులు స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా పెద్దబాబు, చిన్నబాబులకు కాసుల వర్షం కురిపించింది. ఆఖరకు ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా తొలగించి మట్టిని కొల్లగొట్టి విక్రయాలు చేసుకున్నారంటే మట్టి టీడీపీ నేతలకు ఎంత ఆదాయాన్ని సంపాదించి పెట్టిందో అర్ధమౌతుంది. మూడేళ్లుగా రిజర్వాయర్ పేరుతో ఈచెరువు పూడి తీస్తున్నారు. ఈ మట్టివిక్రయాలు ద్వారా టీడీపీ నేతలకు సుమారు రూ.50 కోట్లు ముట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, సినీనటుడు బాలకృష్ణకు బంధువు అయిన కృష్ణాబాబు మట్టిని కొల్లగొట్టారు. గుడివాడ రూరల్ మండలం చిరిచింతల గ్రామ చెరువును గత ఏడాది వేసవిలో నీరు–చెట్లు పధకం క్రింద తీసుకుని మట్టిని ‘కృష్ణా’ ర్పణం చేశారు. ఈ ‘బాబు’ అడ్డగోలుగా మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విక్రయించి లక్షలు గడించినా.. అధికారులు కానీ, గ్రామం సర్పెంచ్, ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోయారు. మట్టి విక్రయం ద్వారా అ విషయంలో మేము నిస్సహాయులం అంటూ నాటి గుడివాడ ఎండీఓ జ్యోతి స్వయంగా వాపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన ఎమ్మెల్యేలకు కోట్లు కాసులు కమ్మురించే నీరు–చెట్టు ప«థకానికి శ్రీకారం చుట్టారు. కాల్వలో మట్టిని పూడిక తీసి కాల్వలు, గ్రామాలను అభి వృద్ధి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన నీరు–చెట్టు పథకం లక్ష్యాన్ని మార్చేశారు. అసలు లక్ష్యాన్ని పక్కనబెట్టి అంతర్గతంగా తమ పనులు పూర్తి చేసుకున్నారు. మట్టిని విక్రయించుకుని కోట్లు కొల్లగట్టటమేనని తరువాత అర్ధమైంది. మట్టి నుంచి నోట్లు పిండారు! టీడీపీ నేతలు మట్టి నుంచి నోట్ల కట్టలను పిండారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఆవురావురు మంటుండగా... నీరు–చెట్లు వరంగా మారింది.దీనికితోడు జలవనరులశాఖ మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో అడిగే అధికారే కరువయ్యారు. నీటి సంఘాలు, పంచాయతీలు తమ చేతుల్లో ఉండటం. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి గ్రామస్థాయి నాయకులు వరకు అందిన కాడికి దండుకున్నారు. ముఖ్యమంత్రి బంధువే మట్టిని రియల్ ఎస్టేట్‌కు అమ్ముకోగా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బినామీలే పనులు చేస్తూ మట్టిని యథేచ్ఛగా అమ్ముకున్నారు. ఇక బ్రహ్మలింగయ్య చెరువులోని మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి, ఎయిర్ పోర్టు కు ఉపయోగిస్తూనే మట్టిని విక్రయించి కోట్లు గడించారు. చేయాల్సింది ఇదీ... ఈ పన్నుల్ని నీటిసంఘాల ద్వారా, పంచాయతీల ఆమోదంతో చేయాలని నిర్ణయించారు. చెరువుల్లో మట్టి, తీయడం, చెరువుల గట్లు బలపేతం చేయడం, చెత్తా, మొక్కలతో పూడిపోయిన చెరువుల్ని జంగిల్ క్లియరెన్స్ చేయించడం, నీటిని నిల్వ చేసుకునేందుకు చెక్ డ్యామ్స్‌ను నిర్మించడం ట్యాంకు ఫీడర్లు ఏర్పాటు చేయడం వంటి పనుల్ని ఈ నీరు –చెట్టు క్రింద చేపట్టాలని నిర్ణయించారు. చెరువులు ఎండిపోయిన తరువాత వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ఈ పనులు చేయాలని నిర్ణయించారు. ఎలక్షన్లలో కోట్లు వెదజల్లుతున్నారు నీరు–చెట్టు ద్వారా అధికారపార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లు వరకు వెనకేసుకున్నట్లు సమాచారం. ఓ మంత్రి ఆదాయమైతే దీనికి రెట్టింపు ఉంటుదని అంచనా. అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. అప్పట్లో ప్రతి లారీని లెక్క గట్టి డబ్బులు వసూలు చేసి రిజర్వు చేశారని ఇప్పుడు అవేడబ్బులు పంపిణీ చేసి ఓట్లు కొనేందుకు ఎగబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకసారి నీరు–చెట్లు ద్వారా కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు తిరిగి అదే అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడక ఎన్నికల్లో కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారు. నిమ్మకూరులో మట్టినే అమ్మేశారు చెరువులో మాయమైన మట్టి నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు అవినీతి పనులు టీడీపీ నేతలకు జేబులు నింపాయి. ఎంతో సదుద్దేశ్యంతో రూపొందించిన ఈ పథకాన్ని ఏ రకంగా ఉపయోగించుకుని డబ్బులు సం పాదించుకోవచ్చో అదే తరహాలో పనులు చేసి డబ్బులుగడించారు నేతలు.పథకానికి సంబంధించిన నిబంధనలు ఎక్కడా అమలు చేసిన దాఖలాలు కనపడవు. తమ పార్టీ వ్యవస్థాపన అధ్యక్షుడి స్వగ్రామం నిమ్మకూరులోని పనుల్లోనే నేతలు కాసుల వర్షం కురిపించుకున్నారు. గుడివాడలో అందినకాడికి... గుడివాడ నియోజకవర్గంలోని నీరు చెట్టు పథకమంతా అవినీతి మయమే. ఒక్కచోట కూడా టీడీపీ నేతలు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. అధికార పార్టీల నేతలే ఒకరికొకరు విమర్శించే స్థాయిలో పనులు సాగడం విశేషం. నందివాడ మండలంలో మేజర్ డ్రెయిన్‌గా ఉన్న చంద్రయ్యను ఎవరికి తోచినట్లు వారు పంచేసుకుని మెక్కేశారు. దీని పూడిక తీయటం కోసం రూ. 78 లక్షలు కేటాయిస్తే ఏడుగురు టీడీపీ నేతలు వాటిని పంచేసుకున్నారు. ఇక మరో మేజర్ డ్రెయిన్ నెహ్రాల్లీ. దీనిని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తీసుకున్నారు ప్రభుత్వం రూ.1.15 కోట్లు కేటాయిస్తే తూతూ మంత్రంగా పనులు చేశారు. కనీసం రూ.50 లక్షలు టీడీపీ నేతలకు మిగిలినట్లు భోగట్టా. -
నీరు–చెట్టు వెలవెల తమ్ముళ్ల జేబులు గలగల
సాక్షి, గుంతకల్లు: వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం కింద విడుదలైన నిధులతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకున్నారు. పనులు నాసిరకంగా చేయడం, చేసిన పనులనే మళ్లీ చేసినట్లు చూపి కోట్లాది రూపాయాలు కాజేశారు. పథకం ముఖ్య ఉద్దేశం చెరువుల్లో పూడిక తీసి భూగర్భ జలాలను వృద్ధి చేయడం. మొక్కలు పెంపకం, కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత, ముళ్లకంపలు తొలగింపు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చెక్‌డ్యాంలు, నీటి సంరక్షణ పనులను చేపట్టారు. అప్పుట్లో పనులు చేపట్టాడానికి టెండర్లు ప్రకటిస్తే..ఇతరులు పోటీకి వస్తారని చంద్రబాబునాయుడు ప్రభుత్వం భావించింది. నామినేషన్ పద్ధతిపై టీడీపీ నేతలు, కార్యకర్తలకు అప్పగించింది. రూ.10లక్షల లోపు పనిని నామినేషన్ పద్ధతిపై ఇవ్వవచ్చు. దీంతో రూ.కోట్ల పనిని కూడా భాగాలుగా విభజించి..చేశారు. ఈ పనులన్నింటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు కట్టబెట్టారు. నీరు–చెట్టు నిధుల రూపేణ టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల ప్రజాధనం భోంచేసారని ప్రజలు ఆరోపిస్తున్నా రు. గుంతకల్లు నియోజకవర్గంలో 2015 నుంచి గత ఏడాది వరకు 254 పనులకుగాను దాదాపు 14 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పనుల్లో కనిపించని నాణ్యత.. నాలుగేళ్ల వ్యవధిలో దాదాపు రూ.14 కోట్ల పైచిలుకు వ్యయంతో గుంతకల్లు మండలంలో నీరు–చెట్టు పథకం కింద పనులు చేపట్టారు. పనుల నిర్వహణలో ఎక్కడ నాణ్యత లేకపోగా జేసీబీల సహా యంతో తూతూ మంత్రంగా పూడిక తీత పనులు చేపట్టి నిధులు కొట్టగొట్టారు. పనుల నాణ్యత లేని కారణంగా బిల్లులు చేయడానికి నిరాకరించిన సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు పలు మార్లు మైనర్ ఇరిగేషన్ జేఈని బెది రించడం, స్వయాన గుంతకల్లు జడ్పీటీసీ మాతృనాయక్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆశాఖ అధి కారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జెడ్పీటీసీని స్వయంగా ఇంటికి పిలిచి . ఎ మ్మెల్యే జితేంద్రగౌడ్ మందలించిన ఆయనలో మార్పు రాకపోగా అదేపనిగా మైనర్ ఇరిగేషన్జేఈని వేధింపులకు గురిచేశాడు. నీరు–చెట్టు పనులు పూర్తిగా ఆయాగ్రామాల జన్మభూమి కమిటీ సభ్యులే చేసుకోవాలని అధిష్టానం ఆజ్ఞాపించినా కేవలం కొంతమంది నాయకులు నీరు–చెట్టు పనులతో నిధులను కొల్లగొట్టారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులదే హవా ఎంపీపీ రాయల రామయ్య , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బండారు ఆనంద్, జడ్పీటీసీ మా తృనాయక్లది ప్రధాన భూమిక కాగా, చెరువుల్లో జరిగిన పనులను మాత్రం తప్పనిసరి పరిస్థితిల్లో ఆయకట్టు ప్రెసిడెంట్లకు అప్పజెప్పారు. దీంతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నాయకులు, కార్యకర్తల మధ్య బేధాభిప్రాయాలు పెరిగిపోయాయి. ఇవేవి పట్టించుకోని ఎంపీపీ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, జెడ్పీటీసీలు తమదైన శైలిలో పనులను చేజిక్కించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల తీరుపైనా విమర్శలే నీరు–చెట్టు పథకం నిధులు స్వాహాపై అధికారుల్లో స్పందన లేకపోవడం విమర్శలకు తా విç Ü్తుంది. ముఖ్యంగా ఆ శాఖలోని అధికారలకు బదిలీల భయం పట్టుకొని ఏ చిన్నతరం చెప్పినా ఇక్కడి నుంచిళ్లిపొండి అని నేతల నుంచి ఒత్తిడి రావడంతో మిన్నకుండిపోయేవారు. మరికొందుకు అధికారలు మాత్రం నాదేం పోయింది..నీ ఇష్టం వచ్చినట్లు పని చేసుకో..మా ఇవాల్సింది మాత్రం ఇచ్చేయే..అని కాంట్రాక్టర్లు ఇచ్చే ముడపులు తీసుకొని ఈ పథకానికి తూట్లు పోడిచారు. 2015 నుంచి ఇప్పటివరకు నీరు–చెట్టు పథకం కింద మంజూరైన పనులు, విడుదలైన నిధులు మండలం చేసిన పనులు ఖర్చు చేసిన నిధులు గుంతకల్లు 4 5.17 కోట్లు గుత్తి 5 4.52 కోట్లు పామిడి 5 5.02 కోట్లు మొత్తం 54 14.71 కోట్లు ఈ చిత్రంలో కనిపిస్తున్నది గుత్తి చెరువు. ఈ చెరువులో 2015–16లో నీరు–చెట్టు కింద కంపచెట్లు పనులు చేపట్టారు. టీడీపీకి చెందిన నారాయణరెడ్డి నాలుగు దఫాలుగా రూ.20 లక్షలు వ్యయం చేసి ఈ పని పూర్తి చేశారు. పనులు నాసిరకంగా చేయడంతో ముళ్లపొదలు పెరిగి చేపలు పట్టడం ఇబ్బందికరంగా మారింది. లక్షలు ఖర్చుచేశారు కానీ పనులు సరిగా చేయలేదని ప్రజలు వాపోతున్నారు. గుత్తి చెరువుకు ఒరిగిందేమీ లేదు లక్షలాది రూపాయలు వెచ్చించి గుత్తి చెరువు కట్టపై పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు చేశారు. అయితే 1087 ఎకరాలు ఉన్న గుత్తి చెరువులో కొంత మేర జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులు చేస్తే ఎవరికి ప్రయోజనం. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తల కు నీరు–చెట్టు పథకం ఆదాయ మార్గంగా మారింది. ఈ పనుల నుంచి ఏ ఒక్క రైతుకు, చెరువు బాగుపడలేదు. – నాగిరెడ్డి, ఆయకట్టు రైతు, గుత్తి నిధుల దుర్వినియోగం టీడీపీ నాయకులు నీరు చెట్టు పనులను దక్కించుకొని నిధులు దుర్వినియోగం చేశా రు. పులగుట్టపల్లి ప్రాంతంలోని వంకలో తూతూ మంత్రంగా పూడికతీత పనులు చేశా రు.ఆ పనుల్లో నాణ్యత లేకపోవడంతో యదా స్థితికి చేరుకున్నాయి. లక్షలాది రూపాయలు దండుకొని పథకానికి తూట్లు పొడిచారు. – పి.జయరామిరెడ్డి, నెలగొండ నిధులు మింగేశారు పామిడి మండలంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నీరు–చెట్టు పథకం కింద కోట్ల రూపాయలను అధికారపార్టీ ప్రజాప్రతినిధులు మింగేశారు. మండలంలో గొలుసు కట్టు, పులుసులు కాలువల పూడికతీత, వాటికి గట్లు ఏర్పాటు, కొండల్లోనూ, రోడ్డు కిరువైపులా చెట్ల పెంపకం పనులకు మండలానికి రూ.5 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో కేవలం పామిడి జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనుంపల్లి నుంచి కట్టకింద పల్లి వరకూ మొక్కలు నాటారు. వంకరాజుకాల్వ కొండపై ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ మొక్కలను నాటించారు. నాటిన మొక్కలు కనిపించలేదుగాని రూ. కోట్లు వారి జేబుల్లో చేరాయి. –తంబళ్ళపల్లి వెంకట్రామిరెడ్డి, పామిడి -
దోపిడీ మంత్రం
సాక్షి, తోటపల్లిగూడూరు (నెల్లూరు): అభివృద్ధి మాటున గత ఐదేళ్లుగా కోట్లాది రూపాయాలను అక్రమంగా దోచుకొని తమ ధనదాహాన్ని తీర్చుకున్నారు మండల తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి చేపట్టిన పనులన్నీ నాసిరకంగా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు, పర్శంటేజీలకు తలొగ్గి మిన్నకుండిపోయారనే విమర్శలున్నాయి. సీసీరోడ్ల నిర్మాణాలు, ఉపాధి పనుల్లో భారీ దోపిడీ మండలంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలు, ఉపాధి పనుల్లోనూ తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించి కోట్లాది రూపాయలు జేబుల్లోకి నింపుకున్నారు. పంచాయతీరాజ్ కింద గడిచిన ఐదేళ్లలో రూ.18.04 కోట్లను హెచ్చించి సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్స్, శ్మశానవాటికలు తదితర 320 పనులను చేపట్టారు. పంచాయతీ నిధులకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలు నాసిరకంగా జరిగాయి. నాణ్యతకు తిలోదకాలిస్తూ చేపట్టిన నిర్మాణాల్లో తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు గడించారు. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన చెత్త సంపద క్షేత్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాల్లోనూ అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారనే విమర్శలున్నాయి. జన్మభూమి కమిటీల అనుగృహం ఉంటేనే.. గడిచిన ఐదేళ్లలో గృహ నిర్మాణ పథకం కింద మండలంలో 1,160 పక్కా గృహాలు, 3,436 రేషన్ కార్డులు, 1,071 పింఛన్లు, 734 మందికి ప్రభుత్వ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే 54 మందికి చంద్రన్న పెళ్లి కానుక, 233 మందికి చంద్రన్న బీమా చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల సిఫార్సు ఉండాల్సిందే. స్థానికంగా మంత్రి సోమిరెడ్డి అండతో జన్మభూమి కమిటీ సభ్యులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయింది. ఆత్మగౌరవం తాకట్టు అరుంధతీయకాలనీలో నాసిరకంగా నిర్మించిన మరుగుదొడ్డి మండలంలోని 22 పంచాయతీల్లో గత ఐదేళ్లలో 5,905 మరుగుదొడ్లను నిర్మించగా అందులో 4,850 మరుగుదొడ్లకే అభికారులు బిల్లులు చేశారు. అయితే నాచరల్ లీడర్ల పేరుతో తెలుగు తమ్ముళ్లే గ్రామాల్లో ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో నిర్మాణాలను నాసిరంగా చేపట్టి రూ.లక్షలు అక్రమంగా దోచుకున్నారు. ముఖ్యంగా తోటపల్లిగూడూరు, తోటపల్లి, ఈదూరు, కోడూరు, కొత్తపాళెం, వెంకన్నపాళెం గ్రామాల్లో దోపిడీ పర్వం అధికంగా సాగినట్లు విమర్శలున్నాయి. ఇలా నాసిరంగా నిర్మించిన నెల రోజులకే మరుగుదొడ్ల ట్యాంకులు కూలిపోవడం, తలుపులు, కిటీకీలు పగిలిపోవడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు గ్రామాల్లో ప్రధాన సమస్యలైన తాగునీరు, వీధిదీపాలు, డ్రెయినేజీ వంటి వాటిని టీడీపీ నాయకులు పూర్తిగా విస్మరించారు. దీంతో స్థానికులు ఐదేళ్లుగా అనేక ఇబ్బందుల నడుమ జీవనం సాగించాల్సి వచ్చింది. మండలంలోని పలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో స్థలాల కొరతపై ఐదేళ్లలో దాదాపు 1,200 మంది అధికార పార్టీ నాయకులకు వినతిపత్రాలను అందించినా ఎక్కడా అంకణం స్థలం చూపించిన దాఖలాలు లేవు. శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనానికి ఐదేళ్లలో మోక్షం కలగలేదు. పొట్లపూడి–కొత్తపాళెం ప్రధాన రహదారి గుంతలమయమై గత పదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు–చెట్టు పనుల్లో చేతివాటం కోడూరు బీచ్ సమీపంలో బకింగ్‌హాం కెనాల్‌పై నిర్మించిన బ్రిడ్జి రెండు నెలలకే గోతులు ఏర్పడిన దృశ్యం (ఫైల్) ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లోనూ తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మండలంలో ఐదేళ్లలో నీరు–చెట్టు కింద రూ.11.47 కోట్లతో మొత్తం 178 పనులు జరిగాయి. వాస్తవంగా రైతులకు ఉపయోగపడే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి. అయితే జరిగిన పనుల్లో అధిక శాతం అవసరం లేని అధికార పార్టీ నేతలు సూచించిన పనులే జరిగాయి. కొన్ని చోట్ల అధికారులను అడ్డం పెట్టుకుని చేయని పనులకు కూడా తమ్ముళ్లు బిల్లులు చేసుకొని లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులను దోచుకున్నారనే విమర్శలున్నాయి. అంతే కాకుండా కోడూరు, మాచర్లవారిపాళెం, వరిగొండ కెనాల్స్, వాటి కింద నడిచే చిన్న పారుదల కాలువల్లో జరిగిన పూడికతీత పనుల్లో తెలుగు తమ్ముళ్లు కోట్లాది రూపాయాల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బకింగ్ హాల్ కెనాల్‌పై వంతెన నిర్మాణం నాసిరకంగా ఉండడంతో రెండు నెలలకే గోతులు ఏర్పడ్డాయి. రైతుల ఇష్టాఇష్టాలతో పని లేకుండా లోపభూయిష్టంగా చేపట్టిన నీరు–చెట్టు పనుల వల్ల అధికార పార్టీ నాయకుల బాగుపడ్డారే తప్ప తమకేమి ఒరిగింది లేదని రైతులు అధికార పార్టీ నాయకుల తీరుపై బహిరంగంగానే మండిపడుతున్నారు. జన్మభూమి కమిటీల పెత్తనమేంటి ? ప్రభుత్వ పథకాల పంపిణీలో జన్మభూమి కమిటీ సభ్యులు పెత్తనం ఎక్కువై పేదలకు అన్యాయం జరిగింది. వీరి వల్ల ప్రజల చేత ఎన్నికైన తమలాంటి ప్రజా ప్రతినిధులకు విలువలేకుండా పోయింది. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. – ఆకుల మధు, మాజీ సర్పంచ్, నరుకూరు అవినీతే తప్ప అభివృద్ధి లేదు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతే తప్ప అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ అభివృద్ధి జరగలేదు. నీరు–చెట్టు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు అందిన కాడికి దొచుకున్నారు. – మన్నెం చిరంజీవుల గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు -
పచ్చదళం.. లూటీపర్వం
సాక్షి, మనుబోలు : కాదేదీ అవినీతికనర్హం అన్నట్లుగా మండలంలో గత ఐదేళ్ల కాలంలో ప్రతి పనిలోనూ తెలుగు తమ్ముళ్లు వేటినీ వదలకుండా అందిన కాడికి వెనకేసుకున్నారు. మండలంలో సుమారు రూ.20 కోట్లకు పైగా నీరు చెట్టు పనులు చేశారు. అయితే వీటిలో రైతులకు ఉపయోగపడే పనులు చేయకుండా ఏవైతే రైతులకు అవసరం లేదో వాటినైతే ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో అలాంటి పనులనే ఎక్కువగా చేశారు. చేతికందినంత దోచుకున్నారు. పాలకుల కక్కుర్తితో విఫలం గతేడాది బండేపల్లి బ్రాంచ్ కాలువ ద్వారా వచ్చే సాగునీరు సరిపడక పంటలు ఎండిపోతుండడంతో రాజోలుపాడు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి దాన్ని బ్రాంచ్ కాలువలో కలిపి పంటలు కాపాడాలని భావించారు. ఇందు కోసం సుమారు రూ.50 లక్షల నిధులు కేటాయించారు. అయితే రాజోలుపాడు వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వకపోగా కాంట్రాక్టర్ బాగా వెనకేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. రూ.50 లక్షలతో గతేడాది ఫిబ్రవరిలో రోజులుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా రోజులుపాడు సమీపంలోని కండలేరు నుంచి మోటార్లతో నీటిని పంపింగ్ చేసి బండేపల్లి బ్రాంచ్ కెనాల్లో కలిపారు. దిగువనున్న కండలేరు నుంచి ఎగువనున్న బ్రాంచ్ కెనాల్‌కు నీరు వెళ్లాల్సి రావడంతో ఇది విఫలమైంది. రివర్స్ గ్రేడియంట్(దిగువ నుంచి ఎగువకు) నీటిని పారించే క్రమంలో ఎంత వాలిందో కొలతలు తీసుకుని దానిని అధికమించేందుకు ఎంత నీటిని లిఫ్ట్ చేస్తే ఎగువ ప్రాంతానికి ఎంత నీళ్లు పారుతాయో లెక్కకట్టి చేయాల్సి ఉంది. అయితే అధికారులే చెపుతున్న లెక్కల ప్రకారం కనీసం 200 పైగా హార్స్పవర్ మోటార్లు పెడితే తప్పా ఎగువకు నీళ్లు వెళ్లే అవకాశం లేని చోట కేవలం 60 హార్స్పవర్ మోటార్లు, నాలుగు పైపులు ఏర్పాటు చేయడంతో ఈ పథకం పూర్తిగా ఫెయిలయింది. మోటార్ల నుంచి నీళ్ల వచ్చే చోట నాలుగడుగుల లోతు నీరుండగా చివరికొచ్చేసరికి బ్రాంచ్ కాలువలో కలిసే చోట కనీసం అడుగు లోతు నీరు కూడా రాకపోవడంతో ఈ పథకం వృధా ప్రయాసగా మారింది. దీంలో రూ.50 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయింది. లిఫ్ట్‌తో రైతులకేమి ప్రయోజనం కనుపూరు కాలువకు చివరి ఆయకట్టు అయిన మనుబోలు మెట్ట గ్రామాలకు బండేపల్లి బ్రాంచ్ కాలువ నీళ్లు సరిపోకపోవడంతో గతేడాది రూ.50 లక్షలతో రాజోలుపాడు లిఫ్ట్ చేశారు. అయితే తక్కువ కెపాసిటీ ఉన్న నాసిరకం మోటార్లు ఏర్పాటు చేయడం, దిగువ నుంచి ఎగువకు నీటిని మళ్లించడం వల్ల రాజోలుపాడు లిఫ్ట్ విఫల ప్రయత్నంగా మారింది. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్పా రైతులకు ఒరిగిందేమీ లేదు. – ఎం.వెంకటేశ్వర్లు, రైతు, రాజోలుపాడు తూతూ మంత్రంగా పూడికతీత కండలేరు ఉప కాలువ, చెరువుల పూడికతీత పనులు, తూములు, కల్వర్టులు, రెండు చెక్‌డ్యాంలు కూడా అవినీతికి అడ్డాగా మారాయి. కండలేరు ఉపకాలువకు ఇరుపైపులా ఉన్న చిన్నచిన్న కంప చెట్లను తొలగించి జేసీబీతో పల్చగా మట్టిని తీసి తూతూ మంత్రంగా పని కానిచ్చేశారు. వాగు అడుగున బోర్లు ఉన్నాయన్న సాకుతో రైతులు తవ్వేందుకు ఒప్పుకోవడం లేదని చెప్పి చాలా చోట్ల అరడుగుల మందంతో గీకి వదిలేశారు. ఆత్మగౌరవం లోనూ.. మరుగుదొడ్లలో కూడా వీరంపల్లి, మడమనూరు, మనుబోలు తదితర చోట్ల భారీగా అవినీతి చోటుచేసుకుంది. వందల సంఖ్యలో మరుగదొడ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించారు. పాత మరుగుదొడ్లనే సున్నం, రంగులు వేసి మళ్లీ నిర్మించినట్లు చూపడం, ఒకే ఇంటికి రెండు, మూడు మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా భారీగా వెనకేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అప్పటి వీరంపల్లి పంచాయతీ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేశారు. ఒకే ఇంట్లో రెండు మరుగుదొడ్లు అక్రమ తవ్వకాలు వడ్లపూడి, అక్కంపేట, వీరంపల్లి, మడమనూరు, బండేపల్లి, మనుబోలు తదితర గ్రామాల సమీపంలో గ్రావెల్, ఇసుక అక్రమంగా తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారు. అదేమని అడిగితే తమకు రెవెన్యూ అధికారుల అనుమతి ఉందని చెప్పి తమ పనులు చెక్కబెట్టుకునేవారు. కొందరు అధికార పార్టీ నాయకులు ఏకంగా ఇసుకను భారీగా డంపింగ్ చేసుకుని తరువాత విక్రయించి సొమ్ము చేసుకున్నారు. -
గుండె చెరువాయే..
సాక్షి, యడ్లపాడు: మండలంలోని బోయపాలెంలో 16 సుగాలీ కుటుంబాలతోపాటు వాల్మీకి బోయ, కాటిపాపలు, ముస్లింలకు చెందిన మరో 14 కుటుంబాలకు 1969లో గ్రామ సమీపంలోని వంకాయలపాడులో ఉన్న 28/ఎ ఇరిగేషన్ చెరువులో 30 ఎకరాలను సాగు నిమిత్తం ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పట్లో ఒక్కొక్కరికీ ఒక ఎకరం చొప్పున ఇవ్వడంతో వరి, పత్తి, వివిధ రకాల కూరగాయలు, చిరుధాన్యాలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. జన్మభూమి గద్దలు వాలాయి 2015 మే 16న రాత్రికి రాత్రే పచ్చని పొలాల్లో అక్రమంగా జన్మభూమి కమిటీ సభ్యులు మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇదేమని ప్రశ్నించేందుకు వచ్చిన వారిని మండలస్థాయి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. నీరు –చెట్టు పథకం కింద తవ్వకాలు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. నేల తల్లితో తెగిపోతున్న బంధాన్ని తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్న వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. తమ జీవనాధారం పోయిందని, న్యాయం చేయాలని నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఉన్నతాధికారులను సైతం పలుమార్లు కలిసి వేడుకున్నారు. వారెవ్వరూ కనికరం చూపలేదు. నోటికాడ కూడు తీసేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏ నేరం చేశామని తమకు ఇంతటి శిక్ష విధించారో సమాధానం చెప్పాలంటూ ఎన్నికల వేళ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి కూడా అన్యాయం చేశారు పొలాన్ని తవ్వి మట్టి తీస్తుంటే ఆదుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబాన్ని వేడుకున్నాం. తప్పక న్యాయం చేస్తామన్నారు. ఇష్టానుసారంగా మట్టి తవ్వుకున్న వారికి మద్దతు ఇచ్చారుకానీ, వీధినపడ్డ మమ్మల్ని నేటికీ పట్టించుకోలేదు. ఉన్నపొలం పోయి ఇప్పుడు ఉన్నవ, బోయపాలెం రైతుల వద్ద 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. గులాబి పురుగుల దెబ్బతో పెట్టిన పెట్టుబడి రాకుండా పోయింది. పాలకులు, ప్రకృతి పేదలపై పగబడితే జీవించగలమా..!– దగ్గు కృష్ణమూర్తి, బాధితుడు వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులనే.. వైఎస్సార్ సీపీకి సానుభూతిదారులు కావడంతో కాలనీలోని 60 సుగాలీ కుటుంబాల్లో ఒక్కరికి కూడా సబ్సీడీ రుణాలు మంజూరు చేయలేదు. ఒక్కో ఇంట్లో నాలుగైదు కుటుంబాలున్నా సెంటు నివేశన స్థలం ఇవ్వలేదు. దశాబ్దాల కిందట ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్లు కూలిపోతే కనీసం హౌసింగ్ లోన్ మంజూరు చేయలేదు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే బిల్లులు రానివ్వరు. ప్రశ్నించే వారు లేరని ఎస్టీలపై ఇంతటి వివక్ష చూపుతారు? – వీ శ్రీనివాసనాయక్, వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం మండల కన్వీనర్ నోటికాడ కూడు లాక్కున్నారు ఎస్టీలకు సాగు చేసుకుని జీవించమంటూ ప్రభుత్వం 50 ఏళ్ల కిందట ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేసింది. అప్పటి నుంచి దానిపైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నాం. అప్పట్లో ఒక్క కుటుంబానికే ఇచ్చినా.. ఒక్కొక్క ఇంటిలో మూడేసి కుటుంబాలు ఉండేవి. వీరందరికీ ఆ ఎకరం భూమే ఆధారమైంది. ఆ భూముల్లో మట్టిదందా చేసి మా నోటికాడ కూడు తీసేశారు. ఇప్పుడు మేమెట్టా బతకాలో చెప్పండి. – వంకాడవత్ సాలమ్మబాయి, వృద్ధురాలు బతిమిలాడినా వదల్లేదయ్యా మా నాన్న బింజు నాగయ్య నుంచి పొలం హక్కు పొందాను. పొలం లేకపోతే దాదాపు అన్ని కుటుంబాలు రోడ్డున పడతాయంటూ అధికారులకు ఎంతగానో వేడుకున్నా వినలేదు. తవ్వకాలు ఆపాలని చూస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. రాత్రికిరాత్రే తవ్వి పెద్ద పెద్ద గుంతలు చేశారు. మాపొలంలో పండించిన కూరగాయలు ఊళ్లో అమ్ముకునే వాళ్లం. ఇప్పుడు గుంటూరు నుంచి తెచ్చి అమ్మితే లాభాలేమీ రావడం లేదు. – గింజు బుల్లయ్య, బోయపాలెం పొలం లేక కూలీకి వెళ్లి గోతాలు కుడుతున్న సుగాలీ కాలనీ వాసి -
అనుచర వర్గం... అవినీతి మార్గం
సాక్షి, అద్దంకి(ప్రకాశం): వాళ్ల అవినీతి ఆకాశమంత, వాళ్ల కబ్జాలు కడలంత, వాళ్ల దోపిడి ధరిత్రంత, వాళ్ల రాక్షసత్వం రావణుడే అసూయపడేంత. కొండలు కరిగించారు, ఇసుక తరలించారు గిరిజనుల భూముల్ని బదలాయించుకున్నారు. లోకమంతా పచ్చగా ఉండాలి అనేది ఆరోక్తి, పచ్చనేతలే పచ్చగా ఉండేలి అనేది అధికార పార్టీ రీతి ‘‘నారా’’జ్యం అంటున్న తెలుగు తమ్ములు అభివృద్ధి పేరుతో దోచుకున్న సొమ్ము కోట్లలోనే ఉంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లాకు చెందిన మంత్రి అండదండలు ఉండటంతో వారి అనుచర వర్గం చేసిన అవినీతి పతాకస్థాయికి చేరుకుంది. అధికార పార్టీ అండదండలతో అకమ్ర సంపాదనే ధ్యేయంగా తెలుగుతమ్ముళ్లు ఈ ఐదేళ్లలో దోచుకున్న సొమ్ముతో పాటు ప్రశ్నించిన వారిని బెదిరించిన ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. మండలంలో చక్రాయపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నదిలో ఇసుక క్వారీలో తవ్వాల్సిన దాని కన్నా ఎక్కువగా తవ్వి కోట్లాది రూపాయలు సంపాదించాడని ఎమ్మెల్యేతో పాటు ఆయన ఆనుచర వర్గంపై ఆరోపణలున్నాయి. ఈ అవినీతిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వర్గం నాయకులు, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమంగా ఇసుక తరలించే క్వారీలను గుర్తించారు. కానీ అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో తరువాత అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక మండల పరిధిలోని మోదేపల్లి, పేరాయిపాలెం గ్రామ సమీపంలోని ద్వార్నపు వాగు, చిలకలేరుల్లో సైతం ఇదే తరహా ఇసుక దోపిడీ చోటు చేసుకుంది. ధేనువకొండ సమీపంలోని కొండను సైతం అధికార పార్టీకి వారు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని స్థానికులు అధికారులు ఫిర్యాదు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. బల్లికురవ మండలంలో.. బల్లికురవ: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువలేదు అన్న చందంగా అధికార అహంతో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఆర్అండ్బీ రహదారులను సైతం ఆధీనంలోకి తీసుకుని క్వారీయింగ్ చేస్తున్నారు. క్వారీల కోసం తిరిగే లారీలతో తారు రోడ్డు సైతం మట్టిరోడ్డుగా తయారైంది. గ్రానైట్ వృథా రాళ్లను రోడ్డు మార్జిన్లో పడేయటంలో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలున్నాయి. బ్లాస్టింగ్ మోతలతో సమీప గృహాలు పగుళ్లిచ్చి ధ్వంసం అవుతున్నాయని స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తమ క్వారీలకు మీ గృహాలే అడ్డంగా ఉన్నాయని వాటిని ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. 60 కుటుంబాలను ఊరికి దూరంగా నాసిరకం గృహాలు నిర్మించి ఇచ్చారు. ఆ ఇళ్లలలో తాముండబోమని చెప్పడంతో, ఎమ్మెల్యేకు చెందిన మనుషులు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని మళ్లీ బెదింరిపుకు దిగారు. అదేవిధంగా ఈర్లకొండ చూట్టూ ఎమ్మెల్యే అనుచరులు నలుగురు బినామీల పేరులో క్వారీలున్నాయి. మంత్రి శిద్దా రాఘవరావుకు ఒక క్వారీ ఉంది. ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వారిద్దరూ క్వారీలు నిర్వహిస్తున్నారు. నలభై ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న మాపై జిల్లా మంత్రి అనుచరులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు. నీరు చెట్టు అంతా అవినీతిమయం.. జె.పంగులూరు: తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత మండలంలో వందల కోట్లు అవినీతి చోటు చేసుకుంది. నీరు చెట్టుకింద చేసిన పనే చేస్తూ బిల్లు చేసుకుంటున్నారు. మండలంలో చిన్నమల్లవరం గ్రామానికి ఆనుకోని ఉన్న వాగుపై ఒక్క సంవత్సరం మూడుసార్లు మరమ్మతులు చేశారు.ఈ పనుల్లో గ్రామానికి చెందిన శ్మశానం కూడా 60 శాతం వాగులో కలుపుకున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులు ఇష్టానుసారంగ ప్రభుత్వ సొమ్మును దండుకున్నారు. ఇచ్చిందే తగుదు అన్నట్లు నీరు చెట్టు పనుల చేయకుండా కూడా బిల్లుల పొందిన దాఖాలాలు అనేకం. ఈ అవినీతి మండలంలోని ప్రతి గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిదులు కుమ్మకై ప్రభుత్వ సోమ్మును దర్జాగా దోచుకున్నారు. టీడీపీ పాలనలో పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, టీడీపీ కార్యకర్త మాత్రం పెద్దవాడయ్యాడు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది ఒక్క వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మేదరమెట్ల: గడచిన ఐదేళ్ల కాలంలో మండలంలోని పలు గ్రామాల్లో నీరు చెట్టు పేరుతో కోట్లాది రూపాయలను టీడీపీకి చెందిన వారు అక్రమంగా దండుకోవడంతో పాటు పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్రయోజనం పొందుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక శాసనసభ్యుడి అండదండలుండటంతోనే అక్రమాకు పాల్పడేవారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. నీరు చెట్టు పేరుతో మండలంలో చెరువుల్లో అధికార పార్టీకి చెందిన వారు, మట్టిని అమ్ముకుని కోట్లు కొల్లగొట్టారు. చెక్‌డ్యాంలు, సీసీ రహదారుల నిర్మాణాల్లో కమీషన్లు దండుకున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన చెక్డ్యాలకు సంబంధించి చేసిన పనుల్లో రూ.30 లక్షల వరకు అక్రమాలు జరిగాయంటూ గ్రామానికి చెందిన వారు, జిల్లా కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా, ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారపార్టీ అండదండలున్నాయనే విమర్శలకు బలాన్నిస్తోంది. అధికార పార్టీకి చెందిన వారు ఆక్రమించుకొని ఊర చెరువులో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటూ గ్రామానికి చెందిన కొందరు యువకులు కోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. పీ. గుడిపాడు గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని సాగు చేస్తుండగా వారి భూములను వదిలిపెట్టి, సామాన్యులు సాగు చేసుకుంటున్న దొండ పందిర్లను ముందస్తు సమాచారం లేకుండా అధికారులు తొలగించారు. దీంతో ఆ రైతు భార్య మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైంది. ఇంలాంటి అక్రమాలకు ఆక్రమణలకు పాల్పడుతున్న తముళ్లకు కొమ్ముకాస్తుంది ఎమ్మెల్యేనే అనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా రైతుల పొలంలో బోర్లు వేసేందుకు ప్రభుత్వం జలసిరి పథకాన్ని రూపొందించిన ఘటన తెలిసిందే. ఐతే జలసిరి బోర్లు వేసేందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు రైతుల నుంచి కొంత సొమ్మును తీసుకున్నారని, అలాగే బ్యాంకుల ద్వారా అందజేసే రుణాలకు సంబందించి సిఫార్సులు చేయాలంటే కూడా అధికార పార్టీ నేతలకు తమ వాటా తముకు అందిచాలని సొంతపార్టీకి చెందిన వారే ఆరోపించిన ఘటనలు చాలనే ఉన్నాయి. ఈ ఐదేళ్లలో టీడీపీ నాయకులు అవినీతికి అంతే లేకుండా పోయింది. గిరిజన భూములు కొనుగోలు.. బల్లికురవకు చెందిన గిరిజనులకు ప్రభుత్వం సర్వే నంబరు 295, 296, 297లో 11 ఎకరాలను 11 మందికి భూమి కొనుగోలు పథకం ద్వారా అందజేసింది. ఆ భూములను అమ్మె హక్కు గిరిజనులకు లేదు. 2017 డిసెంబరులో అప్పటి తహశీల్దారు ఎస్వీ సుధాకర్ సహకారంతో ఈ భూములను బినామీ పేర్లతో ఎమ్మెల్యే కొనుగోలు చేశాడనే ఆరోపణ.లున్నాయి. ఈ భూమిలో ప్రస్తుతం గ్రానైట్ వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరు గారింది. గిరిజనులకు ఉపాధి కొరవడింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో.. యానాది సంఘం కాలనీలో 40 సంవత్సరాలుగా నివశిస్తున్నాం. క్వారీల పుణ్యమా అంటూ దుమ్ము దూళి బ్లాస్టింగ్ మోతలతో ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయండిని చాలా మంది అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరించారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టిచుకోలేదు. – ఆలకుంట అంకమ్మ రాజు, బల్లికురవ అకమ్రాలకు హద్దే లేదు పమిడిపాడు గ్రామంలో వాటర్‌షెడ్ పథకం, నీరు చెట్టు పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించారే కానీ అక్రమాలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మండలంలో అధికార పార్టీ నేతలకే జలసిరి బోర్లు, రుణాలు మంజూరు చేశారు. అర్హులైన వారికి పలు ప్రభుత్వ పథకాలను మంజూరు చేయడంలో మొండిచేయి చూపించారు. – రావినూతల సుబ్బయ్య, పమిడిపాడు -
కూనకు అసమ్మతి సెగ!
ఇసుక ర్యాంపుల నుంచి కాంట్రాక్టు పనుల వరకూ, సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపిక నుంచి నీరు–చెట్టు పనుల వరకూ ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీ తమ్ముళ్ల మధ్య వాదులాటలు మొదలయ్యాయి. ఇదెక్కడో కాదు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆమదాలవలస నియోజకవర్గంలోనే! సొంత ఇలాకాలో తనకు తిరుగులేదన్న ధీమాలో ఉన్న ఆయనకు ఇప్పుడు గ్రూపు తగాదాలు తలబొప్పి కట్టిస్తున్నాయి. సొంత మండలమైన పొందూరులో అవి తారస్థాయికి చేరాయనడానికి గత వారం రోజుల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. తమ మాట నెగ్గకపోతే పబ్లిక్లోనైనా విప్‌ను నిలదీయడానికి టీడీపీ నాయకులు వెనకాడట్లేదంటే పరిస్థితి ఊహించవచ్చు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: పొందూరు మండలంలో రవికుమార్‌పై సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర అసమ్మతి సెగలు వ్యక్తమవుతున్నాయి. తమకు కాంట్రాక్టు పనులు ఇవ్వకుండా రవికుమార్ తన కుటుం» సభ్యులకే కట్టబెడుతున్నారని పలువురి టీడీపీ నాయకుల వాదన. రవికుమార్ సోదరుడు కూన వెంకట సత్యారావుకే పొందూరు మండలంలో ఎక్కువ కాంట్రాక్ట్ పనులు ఇవ్వడం అందుకు బలం చేకూర్చుతోంది. పీఏసీఎస్ అధ్యక్షుడిగా కూడా తన అన్నకే పట్టం గట్టడంతో రాజకీయంగానూ తమను ఎదగనీయట్లేదని సెకండ్ క్యాడర్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే రవికుమార్ సోదరుడి వర్గానికి వ్యతిరేకంగా లోలుగు జెడ్పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాములనాయుడు, అన్నెపు రాము, చిగిలిపల్లి రామ్మోహనరావు జతకట్టారు. కొన్ని సంవత్సరాల పాటు పార్టీలో వెంటతిరిగిన తమను పక్కనబెట్టారని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీరాములనాయుడును కాదని లోలుగు గ్రామంలోనే కామరాజు, చోళ్ల శ్రీనివాసరావులకు ప్రాధాన్యతనివ్వడం తాజా రచ్చకు ఒక ప్రధాన కారణం. గోకర్నపల్లిలో పదుల సంవత్సరాలుగా చింతాడ ప్రసాద్ వర్గం రవికుమార్ వెంట తిరిగారు. వారిని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన సీపాన శ్రీరంగనాయకులకు ప్రాముఖ్యతనిచ్చి, కాంట్రాక్ట్ పనులు అప్పగించడం చిచ్చు రేపింది. ఆమదాలవలసలోనూ వర్గాలు.... ఆమదాలవలస పట్టణంలోని 18వ వార్డులో టీడీపీ కార్యకర్తలు మూడు వర్గాలుగా మారిపోయారు. ప్రస్తుత కౌన్సిలర్ బొడ్డేపల్లి లక్ష్మణరావును పక్కనపెట్టి మున్సిపల్ చైర్పర్సన్ ప్రతినిధి తమ్మినేని విద్యాసాగర్ ఆ వార్డులోగల బొడ్డేపల్లి విజయ్‌కుమార్‌తో పాటు మరో వ్యక్తికి అధిక ప్రాధాన్యమిస్తూ వారికి కొన్ని పనులు కూడా కట్టబెట్టారని టీడీపీ కౌన్సిలర్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప«థ్యంలోనే తన కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కమీషన్ స్వీకరించలేదంటూ ఆయన మళ్లీ పదవిలోకి వచ్చారు. ప్రస్తుతం వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆమదాలవలస మండలంలోని కలివరం పంచాయతీకి చెందిన సర్పంచ్ కోట వెంకటరామారావు, జెడ్పీటీసీ బరిలో ఓడిపోయిన ఆయన సోదరుడు కోట గోవిందరావు గత ఏడాది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆ గ్రామంలో గిరి అనే వ్యక్తితోపాటు ఆయన వర్గీయులు టీడీపీలోకి చేరడం, వారికి ప్రభుత్వ విప్ అధిక ప్రాధాన్యతను ఇవ్వడం కోట బ్రదర్స్ కోపానికి కారణమైంది. వీరిని బుజ్జగించేందుకు కూన పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సరుబుజ్జిలిలో ఇంటిపోరు... సరుబుజ్జిలి మండలంలోనూ కూనకు ఇంటిపోరు తప్పట్లేదు. పురుషోత్తపురం గ్రామానికి చెందిన కిల్లి రామ్మోహనరావు, ఎమ్పీటీసీ ప్రతినిధి కిల్లి సిద్ధార్థ మధ్య పొసగట్లేదు. పింఛన్లు, రేషన్‌కార్డులు, సబ్సిడీ రుణాలు తదితర సంక్షేమ పథకాలను తమవారికి కట్టబెట్టేందుకు ఎవ్వరికి వారు ఆధిపత్య ధోరణి చూపిస్తున్నారు. ఇటీవల పురుషోత్తపురం ఇసుక ర్యాంపులో కమీషన్ విషయంలోనూ మనస్పర్థలు వచ్చాయనే గుసగుసలు పార్టీలో వినిపించాయి. డకరవలస పంచాయతీలో కరణం గోవిందరావు, సర్పంచ్ అదపాక అప్పలనాయుడు మధ్య మనస్పర్థలు ఉన్నాయి. సరుబుజ్జిలి మండల జన్మభూమి కమిటీ సభ్యుడు శివ్వాల సూర్యనారాయణ, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి నందివాడ గోవిందరావు మధ్య కూడా గత మూడేళ్లుగా ఆధిపత్యపోరు నడుస్తోంది. రహదారులు, నీరు–చెట్టు పనులు దక్కించుకునే విషయంలో తరచూ వాదులాటలు జరుగుతున్నాయి. బూర్జ మండలంలో.... బూర్జ మండలంలో ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, జెడ్పీటీసీ సభ్యుడు అన్నెపు రామక్రిష్ణ ఒక గ్రూపులో ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వీరికి వ్యతిరేకంగా మండల కన్వీనర్ లంక జగన్నాథనాయుడు, మండల జన్మభూమి కమిటీ కన్వీనర్ మజ్జి శ్రీరాములనాయుడు మరో గ్రూపు నడుపుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటికప్పుడే తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి. విప్ కూన రవికుమార్ జెడ్పీటీసీ వర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, నీరు–చెట్టు పనులు వారికే అధికంగా ఇస్తున్నారని వీరి వాదన. మామిడివలసలో ఉట్టి లక్ష్మణరావు, జగుపిల్లి మధుసూదనరావు మధ్య, కంట్లాం తాజా మాజీ సర్పంచ్ గిరడ చిన్నారావు, మాజీ సర్పంచ్ గిరడ హరిబాబుల మధ్య కాంట్రాక్టు పనుల విషయంలో వివాదాలు రేగాయి. ఇతర గ్రామాల్లోనూ టీడీపీ నాయకుల మధ్య కుమ్ములాటలకు విప్ పక్షపాత ధోరణే కారణమని పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘ఐదేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారు’
సాక్షి, హైదరాబాద్: కమిషన్ల కోసమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణ బాధ్యతలు చేపట్టారని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నవి ధర్మ పోరాట దీక్షలు కాదని.. అధర్మ పోరాట దీక్షలని ఆక్షేపించారు. చంద్రబాబు ఏ దేశానికి వేళ్తే.. ఏపీ రాజధానిని ఆ దేశంలా చేస్తానంటూ గొప్పలు చెబుతారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను కట్టింది చంద్రబాబేనట.. అటువంటి వ్యక్తి ఐదేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటివరకు అమరావతిలో ఒక్క శాతం పనులు కూడా జరగలేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలున్నాయా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతూ నిధులను పక్కదారి పట్టించారని మిమర్శించారు. నీరుచెట్టు పేరుతో నిధులు దోపిడి చేశారని తెలిపారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని అన్నారు. అనుకూల పత్రికల్లో అమరావతికి సంబంధించిన ప్రచారం చేయించుకుంటున్నారని మండిపడ్డారు. పొంతన లేని యాడ్స్‌తో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మరో రూ.8 వేల కోట్లు గుటుక్కు!
నీరు–చెట్టు కింద గతంలో చేసిన పనులనే తాజాగా చేసినట్లు చూపడం, చేయని పనులను చేసినట్టు చూపడం.. అవసరం లేకున్నా పూడికతీత పనులు చేపట్టడం,అరకొరగా చేసిన పనులను నాసిరకంగా ముగించడం ద్వారా నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లను అధికార పార్టీ నేతలు దోచుకున్నారు. పూడికతీసిన మట్టిని అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నీరు–చెట్టు పథకం కింద మరో రూ.8 వేల కోట్ల విలువైన పనులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నాలుగు నెలల్లోగా ఈ పనులను మంజూరు చేయడంతోపాటు పూర్తి చేయించి టీడీపీ శ్రేణులకు పంచి పెట్టాలనేది ప్రభుత్వ పెద్దల ప్రణాళిక అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: ‘నీరు–చెట్టు’ మాటున అధికార పార్టీ నేతలకు, కార్యకర్తలకు నిధుల పందేరం కొనసాగుతోంది. ఇప్పటికే రూ.15,368.47 కోట్లను దోచిపెట్టిన సర్కారు ఎన్నికలు సమీపిస్తుండటంతో మరో రూ.8,000 కోట్లను పంచి పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్ల నుంచి ఒత్తిడి తెచ్చి ఈమేరకు ప్రతిపాదనలు తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు వీటిని ఆమోదించాలంటూ ఆర్థిక, జలవనరుల శాఖల అధికారులపైన కూడా తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. నీరు–చెట్టుకు 2018–19 బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లు ఇప్పటికే ఖర్చు అయ్యాయని, ఎఫ్ఆర్బీఎం(ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) ప్రకారం ఇక అదనంగా కేటాయించలేమంటూ ఆర్థికశాఖ వర్గాలు అభ్యంతరం చెప్పడంతో కేంద్రం ఇచ్చే ఉపాధిహామీ నిధులను మళ్లించడంతోపాటు రాష్ట్ర బడ్జెట్ నుంచి అదనంగా విడుదల చేయాల్సిందేనంటూ ఒత్తిడి పెంచుతున్నారు. కలెక్టర్లకు రూ.20 లక్షల లోపు పనుల అధికారం రాష్ట్రంలో చెరువులు, కాలువల్లో పూడికతీత, షట్టర్ల మరమ్మతులు, పంటకుంటల తవ్వకం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం లాంటి జలసంరక్షణ పనుల కోసం ‘నీరు–చెట్టు’ పథకానికి 2018–19 బడ్జెట్లో రూ.500 కోట్లను కేటాయించారు. గతేడాది టీడీపీ నేతలు కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఇష్టారాజ్యంగా పనులు మంజూరు చేయించుకుని నిధులు మింగేశారు. దాంతో ఈసారి జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లను 13 జిల్లాలకు పంపిణీ చేశారు. అంచనా వ్యయం రూ.20 లక్షలలోపు ఉండే పనుల మంజూరు అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. అంతకంటే అధికంగా ఖర్చయ్యే పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ అనుమతి తప్పనిసరని పేర్కొంటూ అందుకోసం ఆ రూ. 500 కోట్లలో రూ.100 కోట్లను కేటాయించింది. రూ.వేల కోట్ల పనుల ఆమోదం కోసం ప్రతిపాదనలు.. అయితే ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో నీరు–చెట్టు కింద పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలువురు కలెక్టర్లు జలవనరులశాఖకు వందల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు పంపారు. ఉదాహరణకు విజయనగరం జిల్లా నే తీసుకుంటే చీపురుపల్లి మండలం పరిధిలోని కందివలస గెడ్డలో పూడికతీత పనులకు రూ.1.94 కోట్లు, కాకర్లవానిగెడ్డలో పూడికతీకు రూ.1.96 కోట్లు, గరివిడి మండలం వీపీ రేగ బామల్వాని గెడ్డలో పూడికతీత పనులకు రూ.1.96 కోట్లు, కందివలసగడ్డలో పూడికతీతకు రూ. 1.95 కోట్లు, కెళ్ల గెడ్డలో పూడికతీతకు రూ. 1.97 కోట్లు, మెరకముడిదం మండలం కొండగెడ్డలో పూడికతీతకు రూ.1.98 కోట్లు, కొండగడ్డలో లింక్ చానళ్ల పూడికతీతకు రూ.1.95 కోట్లు.. ఇలా వెరసి ఏడు పనులకే రూ.13.71 కోట్లు మంజూరు చేయాలంటూ కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు అందాయి. అవిచూసి జలవనరుల శాఖ అధికారవర్గాలు విస్తుపోతున్నాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా వేల కోట్ల రూపాయల విలువైన పనులను నీరు–చెట్టు కింద మంజూరు చేయాలంటూ ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలన్నీ కలిపి చూపుతూ మరో రూ. 8000 కోట్ల పంపిణీకి సర్కారు పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు. -
నీరు చెట్టు, హౌసింగ్ ఫర్ అల్ పథకాల్లో 30 కోట్ల అవినీతి
-
అవినీతికి పాల్పడుతూ.. ధర్మ పోరాటమా?
సాక్షి, ప్రొద్దుటూరు : రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతూ.. ధర్మపోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీరు చెట్టు, హౌసింగ్ ఫర్ అల్ పథకాల్లో చంద్రబాబు 30 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై నిపుణులతో విచారణ చేపట్టి ఆయనపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు, పట్టణాలకు కేంద్రం నిధులు అందజేస్తున్నా.. చంద్రబాబు కేంద్రం గురించి మాట్లాడటం లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆమరణ దీక్ష చేపట్టడం సిగ్గుచేటని సోము వీర్రాజు విమర్శించారు. జిల్లాలో చక్కెర ప్యాక్టరీ, రమేశ్ ఇంటి సమీపంలోని పాలకేంద్రం గురించి ఏ రోజైనా ప్రస్తావించాడా అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ నికర జలాల గురించి పోరాడితే బాగుంటుందని సూచించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బీజేపీ బాధ్యతని పేర్కొన్నారు. -
చెక్‌డ్యాముల్లోనూ చెలరేగిపోయారు!
చెట్లకు డబ్బులు కాస్తాయి.. నీరుకు నిధులు పారుతాయి అన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు బాగా గ్రహించారు. అందుకే.. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం ప్రజల కన్నా నాయకులకే ఎక్కువ మేలు చేసింది. ఈ పథకం కింద మంజూరైన కోటాను కోట్ల రూపాయలను తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున నొక్కేశారు. చెరువుల పూడికతీత పనుల్లో దొరికిన చోట దొరికినట్లు ఎలా మింగేశారో చెక్ డ్యామ్‌ల నిర్మాణం, కాలువల ఆధునికీకరణ పనుల్లో కూడా అదే స్థాయిలో.. అదే రీతిలో చెలరేగిపోయారు. ఈ పనుల్లో తెలుగు తమ్ముళ్ల మాయలు, లీలలు ఎన్నో.. ఎన్నెన్నో.. సాగునీటి సంఘాల ద్వారా చేపట్టాల్సిన నీరు–చెట్టు పనులను టీడీపీ నేతలు హైజాక్ చేసేశారు. కుదిరిన చోట కాంట్రాక్టర్లుగాను. వీలుకాని చోట కాంట్రాక్టర్లకు బినామీలుగా అవతారం ఎత్తేశారు. అవసరం ఉన్నా లేకున్నా పనులు సృష్టించి వాటికి మంజూరైన నిధుల్లో ఖర్చు పెట్టిన దానికన్నా జేబులో వేసుకున్నదే ఎక్కువ. ఒక్క అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోనే 2014 నుంచి ఇప్పటివరకు 254 పనులకు గాను మొత్తం రూ.14కోట్ల వరకు ప్రజాధనం స్వాహా అయిందంటే తెలుగు తమ్ముళ్ల స్వాహాకార్యం ఏ రేంజ్లో సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. కాలువలు, చెక్‌డ్యామ్ నిర్మాణాలకు పైపై పూతలతో సరిపెట్టేస్తున్నారు. కొన్నిచోట్ల అవసరం లేకపోయినా కాసులకు కక్కుర్తిపడి పనులు కానిచ్చేశారు. ఉపాధి పనులు చేసిన చోట ఆడిట్ పూర్తికాకపోతే నీరు–చెట్టు పనులు చేయకూడదన్న నిబంధనను గాలికొదిలేశారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పచ్చచొక్కాలు చెప్పిందే వేదంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పనుల తీరూతెన్నూ ఒక్కోచోట ఒక్కోలా ఉన్నాయి. ఉదాహరణకు.. ⇒ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వేదాద్రిలోని మేకల వాగుపై రెండు కొండల మధ్య రెండేళ్ల కిందట రూ.15లక్షలతో చెక్ డ్యాం నిర్మించారు. దీని కింద ఉన్న ప్లాట్‌ఫాం మొత్తం కుంగిపోయి కొట్టుకుపోయింది. ఈ పనికి 2–3 లక్షలకు మించి ఖర్చుకాదని సమాచారం. జన్మభూమి కమిటీ సభ్యులు ఈ పని చేపట్టారు. ⇒ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని దాసళ్లపల్లి గ్రామంలోని దోమలేరులో రూ.20లక్షల పైబడి పనులు చేశారు. పనులు చేయకముందు గుంటలో నీరుండేవని.. ఇప్పుడు పశువులు తాగేందుకు కూడా చుక్క నీరు నిలబడడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షం నీరంతా వృధాగా పోతోంది. యాభై శాతం పనులు కూడా జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ⇒ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని కూర్మాయి కౌండిన్య నదిలో నీరు–చెట్టు ద్వారా రూ.33.4లక్షల అంచనాతో రెండేళ్ల క్రితం చెక్‌డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టారు. ఈ కాంట్రాక్టును టీడీపీకి చెందిన శ్రీనివాసులనాయుడు దక్కించుకున్నారు. పనులు నాసిరకంగా చేయడంతో పగుళ్లు వచ్చాయి. వర్షాలకు చెక్‌డ్యాం ముందు భా గం కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం బీటలు వారింది. ⇒ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం.. జమ్మలమడుగు మండలం.. బొమ్మేపల్లి పంచాయితీలోని బీ ఆర్ కొట్టాల సమీపంలోనున్న తిరువెగలప్పలో బలంగా ఉన్న చెక్‌డ్యామ్‌ను పగులగొట్టి సమీపంలోనే మరోటి రూ. 10లక్షలతో చేపట్టారు. మరమ్మతులతో సరిపోయే దానికి తమ్ముళ్లు కాసుల కోసం ఇలా స్కెచ్ వేశారు. ⇒ కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామం వద్దనున్న ఉప్పాగువంకలో రూ.10లక్షలతో నిర్మించిన చెక్‌డ్యాం పూర్తిగా కొట్టుకుపోయింది. భూమి ఓ వైపు ఎత్తు, మరోవైపు పల్లంగా ఉన్న ప్రాంతంలో దీనిని నిర్మించారు. దీంతో దిగువ వైపునున్న మట్టికత్వ వరద నీటికి పూర్తిగా కొట్టుకుపోయింది. ⇒ ఇదే జిల్లా ఆదోనిలో రూ.5.40కోట్లతో చేపట్టిన పనులకు లెక్కలు తేలడంలేదు. 44 పనులలో ఎన్ని పూర్తయ్యాయి, ఏ దశలో నిలిచాయో రికార్డుల్లో పొందుపర్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ⇒ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జి. అయ్యవారిపల్లె సమీపంలో ఉన్న వంకపై చెక్‌డ్యాం నిర్మించారు. మళ్లీ గత ఏడాది రూ.40లక్షల అంచనా వ్యయంతో ఆ ప్రాంతంలో మళ్లీ అవసరం లేకపోయినా మరో ఫైబర్గేట్ చెక్‌డ్యాం కట్టేశారు. ప్రజాధనం వృధా అయిందే తప్ప రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోయింది. ⇒ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 181 చెక్‌డ్యాంలు మంజూరు కాగా, ఇందుకు రూ.16.57కోట్లు కేటాయించారు. ఇందులో సగానికి పైగా నిర్మాణాలు అవసరంలేని ప్రాంతాల్లో చేపట్టారు. కొన్ని చెక్‌డ్యాంలు ఇప్పటికే పగుళ్లు వచ్చి వర్షపు నీరు బయటకు వెళ్లిపోతోంది. మరికొన్ని నిర్మాణ సమయంలోనే కొట్టుకుపోయాయి.టీడీపీ నేతలు 10–15 శాతం కమీషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. దీంతో కాంట్రాక్టర్లు నాణత్యకు మంగళం పాడారు. పనులు చేయకుండానే బిల్లులు అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో అరుకుమాకులపల్లి చెరువుకు నీరు చేరే కాలువను పునరుద్ధరించడానికి 2016–17లో దాదాపు రూ.16లక్షలు కేటాయించారు. చెరువుకు మూడు వైపులా ఉన్న కాల్వల్లో అడ్డం కులు, కంప చెట్లను తొలగించాలి. అయితే, ఈ పనులు గత ఏడాది కూడా చేశారు. అధికార పార్టీ ఎంపీటీసీ భర్త తిరిగి వీటిని రికార్డు చేయించి బిల్లులు తీసుకున్నారు. అలాగే, నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో పేరంగుంట తూముకు పనులు చేయకుండానే రూ.9లక్షల 96వేలకు బిల్లులు సమర్పించారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన ఈ వ్యక్తి కుటుంబ సభ్యులు మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కావడం గమనార్హం. ఇలా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారు. దుర్వినియోగానికి పరాకాష్ట విజిలెన్స్ దాడులు, ఆడిట్ నివేదికలు, పోలీసు కేసులు కావేవీ పైరవీలకు అనర్హం అన్నట్లు సాగాయి విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలోని నీరు–చెట్టు అక్రమాలు. పై ఫొటో.. మండలంలోని కోట్లశిర్లాం గ్రామంలో ఏడొంపుల గెడ్డపై నిర్మించిన చెక్‌డ్యాం. మరికొద్ది దూరంలో మరో చెక్ డ్యాంను రూ.15లక్షలు వెచ్చించి నిర్మించినట్లు ఎంబుక్‌లలో నమోదు చేయించి నిధులు డ్రా చేశారు. ఈ రెండు పనులకు గ్రామానికి చెందిన డమ్మీ సర్పంచ్ మీసాల రామారావు, మాజీ సర్పంచ్ తాడ్డి శ్రీనివాసరావులు కాంట్రాక్టు పొందారు. మొత్తం రూ.30లక్షల పనుల్లో రూ.25లక్షల మేర అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్ బృందం తేల్చింది. ఈ చెక్ డ్యాంలు నిర్మించిన వారం రోజులకే కురిసిన వర్షంతో కొట్టుకుపోయాయి. ఇలా మండలంలో రూ.6కోట్ల మేర పనులు చేస్తే మూడున్నర కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మండలంలోని అక్రమాలపై కేసులు సైతం నమోదయ్యాయి. వీటికి సంబంధించి రికవరీ పెట్టినా పైసా కూడా వసూలు కాలేదు. పోలీసు కేసులను సైతం నీరుగార్చేలా టీడీపీ నేతలు పైరవీలు సాగిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే.. అనంతపురం జిల్లా తాడిపర్తి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలంలోని సి.రామరాజుపల్లి వద్దనున్న ఈ వంకలో రూ.లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ చెక్‌డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. చిట్టూరు గ్రామానికి చెందిన సర్పంచ్ రూ.8లక్షల వ్యయంతో 2016లో దీనిని నిర్మించారు. అయితే, ఇక్కడి నేల.. డ్యాం నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడంతో నిర్మించిన ఆర్నెల్లకే చిన్నపాటి వర్షానికి ఎందుకూ పనికిరాకుండా పోయింది. కాగితాల్లో పంపు షెడ్డు కట్టేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని ఆక్విడెక్టు ఇది. 2016–17 సంవత్సరానికి గాను ఇక్కడ పంపుషెడ్డు నిర్మాణం చేసి నీటిని తోడేందుకు నీరు–చెట్టు నిధుల నుండి రూ.5.53 లక్షల ఖర్చుచేశారు. దీనిపై ఆరా తీస్తే అక్విడెక్టు వద్ద పంపుహౌస్గాని, మోటార్లుగాని లేవు. కనీసం విద్యుత్ కనెక్షన్లు కూడా లేవు. ఈ పనులు డీసీ చైర్మన్ తోట ఫణిబాబు చేసినట్లుగా రికార్డుల్లో ఉంది. అలాగే, కాలువల్లో సిల్టు తీసింది కూడా ఈయనే. నీటిని తోడేందుకు పాత మోటార్లను తెచ్చి పని జరిగిన తరువాత పట్టుకుపోయారు. పంపుషెడ్డు నిర్మాణం చేయలేదు. అధికారులు అందించిన వివరాల్లో మాత్రం పంపుషెడ్డు నిర్మాణం పూర్తయినట్లు పేర్కొన్నారు. డీసీ చైర్మన్ టీడీపీ నాయకుడు కావడం, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల్లో ఒకరు కావడంతో అధికారులు అతనిని ప్రశ్నించే సాహసం చేయడంలేదు. నా పొలంలో చెక్ డ్యాం నిర్మించలేదు నా పొలంగా చెక్ డ్యాం నిర్మిస్తారని అధికారులు చెప్పారు. అయితే, ఇప్పటివరకూ నిర్మించలేదు. ఐదు నెలల తర్వాత.. మీ పొలంలో చెక్ డ్యాం నిర్మించలేదా అంటూ అధికారులు అడిగారు. అయితే, గ్రామంలో చాలామంది మీ పొలంలో చెక్ డ్యాం పేరుతో డబ్బు స్వాహా చేశారని చెబుతున్నారు. – సుంకమ్మ, లత్తవరం, ఉరవకొండ నియోజకవర్గం, అనంతపురం జిల్లా సగానికి సగం లాభం నీరు–చెట్టు పనుల్లో రూ.10లక్షల విలువగల పనిని చేస్తే రూ.3లక్షలకు దాకా కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు అవుతోంది. కౌండిన్యలో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.10లక్షలకు పైనే టెండర్లు పిలిచారు. 27శాతం లెస్‌కే టెండర్లు పడ్డాయి. పని అంచనాలో 30శాతం తగ్గితే అగ్రిమెంట్లు, కమీషన్లు మరో 20శాతం పోతే 50శాతం అంచనాతో ఈ పనులు జరిగినట్లు లెక్క. అంటే ఈ పనుల్లో సగానికి సగం మిగులుతున్నట్లే కదా! – చెంగారెడ్డి, కూర్మాయి, పలమనేరు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా పూడిక తీయకుండానే రూ.10లక్షలు హాంఫట్ ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత పంచాయతీ అయిన విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలోని పెదలబుడు సమీపంలోని చాకిరేవు గెడ్డ వద్ద గతంలో చెక్‌డ్యాం నిర్మించారు. అయితే, ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఈ చెక్‌డ్యాంను 2015–16లో రూ.10లక్షలతో అభివృద్ధి చేశామని ప్రచార బోర్డును ఏర్పాటుచేశారు. కానీ, తాజాగా ఇదే చెక్‌డ్యామ్‌కు రూ.10లక్షలతో సిమెంట్ గట్టు, ఇతర మరమ్మతులు చేపట్టారు. ఇవి చాలా నాసిరకంగా, అరకొరగా.. మొక్కుబడిగా జరిగాయి. పూడికతీత పనులు చేపట్టకపోవడంవల్ల చెక్‌డ్యామ్‌లో మట్టి పేరుకుపోయి నీరు నిలవని పరిస్థితి నెలకొంది. పూడికతీత పనులను చేపట్టకుండానే మరమ్మతుల పేరిట రూ.10లక్షలు ఖర్చు పెట్టిన వైనం తీవ్ర విమర్శల పాలవుతోంది. -
సాక్షి ఎక్స్‌క్లూజివ్ : పచ్చనేత – మట్టిమేత
ఆ పథకం.. అధికార పార్టీ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు కల్పతరువు. ఆ పథకం.. ఒక పిల్ల కాలువలో కూడా ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో తెలిపింది. ఆ పథకం.. పనులేవీ చేయకుండానే ప్రజాధనాన్ని ఎలా పంచుకుతినొచ్చో చూపింది. భూగర్భ జలాల పరిరక్షణ కోసమమంటూ సీఎం చంద్రబాబు ప్రారంభించిన ‘నీరు–చెట్టు’ పథకమది. ఈ పథకం మాటున మరో ‘పథకం’ ఉందని తొలి ఏడాదిలోనే తెలిసిపోయింది. నాలుగేళ్లలో రూ. 34,399 కోట్లు పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఈ పథకం కింద చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు బిల్లులు చేసుకుంటున్నారు.. పైపైన పనులు చేసి పూర్తి బిల్లులు కొట్టేస్తున్నారు.. అవసరం లేని చోట కూడా అరకొరగా పనులు చేసి డబ్బు నొక్కేస్తున్నారు. చెరువుల పూడికతీసి ఇసుక, మట్టి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.. 25 శాతం పనులు చేసి 75 శాతం నిధులను స్వాహా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో.. అన్ని నియోజకవర్గాల్లో.. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అక్రమాలన్నీ బ యటపడ్డాయి. చంద్రబాబు నాలుగేళ్లపాలన ఏ తీరున సాగిందో తెలుసుకునేందుకు నీరు – చెట్టులో సాగిన దోపిడీయే ఒక నిదర్శనం. నాలుగేళ్లలో కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు - రూ.12,866 కోట్లు పనులు జరిగిన విలువ - రూ.3,216.5 కోట్లు (25 శాతం) కాంట్రాక్టర్లు దోచుకున్న మొత్తం - రూ.9,649.5 కోట్లు (75 శాతం) చేసిన పనుల్లో కాంట్రాక్టర్లు అమ్ముకున్న మట్టి, ఇసుక విలువ - రూ.24,750 కోట్లు రాష్ట్ర ఖజానాకు జరిగిన మొత్తం నష్టం - రూ.34,399 కోట్లు ప్రస్తుతం జరుగుతున్న పనుల విలువ - రూ.1,500 కోట్లు చినబాబు ఇలాకాలో తమ్ముళ్ల ధమాకా కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరు గ్రామంలోని చెరువు ఇది. ఇది ఎన్టీఆర్ స్వగ్రామం. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ దత్తత తీసుకున్నారు కూడా. అభివృద్ధి పేరుతో ఇక్కడి చెరువుని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు అడ్డగోలుగా తవ్వేసి సొమ్ము చేసుకున్నాడు. పూడిక తీయడానికి ప్రభుత్వం రూ.8.5లక్షలు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం చెరువులో 3–4 మీటర్ల వరకు మాత్రమే పనులు చేపట్టాల్సి ఉండగా 10–15 మీటర్ల లోతు వరకు తవ్వేసుకొని మట్టిని విచ్చలవిడిగా అమ్మేసుకున్నాడు. ఇలా సదరు నాయకుడు దాదాపు రూ.70 లక్షలకు పైగా వెనకేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇటీవలి ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నీరు చెట్టు పథకం కింద నాలుగేళ్లలో రూ.12,866 కోట్లు ఖర్చుచేశారు. కాంట్రాక్టర్లకు అందించిన ఈ నిధుల్లో 75శాతం మేర మింగేస్తున్నారని, 25శాతం మేర మాత్రమే పనులు చేస్తున్నారని ఈ శాఖకు సంబంధించిన అధికారులే వ్యాఖ్యానిసున్నారు. అంటే.. రూ.9,649 వేల కోట్లకు పైగా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయన్న మాట. ఇక మట్టిని, ఇసుకను అమ్ముకుని రూ. 24,750 కోట్లను పచ్చనేతలు, కాంట్రాక్టర్లు కైంకర్యం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ మరోవైపు నీరు–చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు ఎక్కడా పెండింగ్‌లో ఉండడంలేదు. ఈ పథకం కింద పనులకు టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిపై పనులు కేటాయిస్తున్నారు. ఈ విధానాన్ని గతంలో హైకోర్టు తప్పబట్టినప్పటికీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు సరికదా.. నిబంధనలు మార్చి కొనసాగిస్తోంది. తూతూమంత్రంగా పనులు.. ఈ పథకం కింద పనులు దక్కించుకున్న నేతలు, కాంట్రాక్టర్లు పనులు మొక్కుబడి చేశారనే విమర్శలు కోకొల్లలు. రైతులకు ఉపయోగపడే పనులు పైపైనే కానిచ్చేసి మమ అనిపించారు. కొన్నిచోట్ల నాయకుల కోసం పనులు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. ఉదాహరణకు.. ♦ కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వాడపాలెంలో కొందరు రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఇక్కడ అవసరం లేకపోయినా స్థానిక టీడీపీ నేత రూ.10లక్షలు మంజూరు చేయించుకుని పైపైన అడుగు లోతులో డ్రెయిన్‌ను తవ్వారు. ♦ అనంతపురం జిల్లా కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో పర్క్యులేషన్ ట్యాంకులో మూడు విడతలుగా పూడికతీత పనులు చేపట్టారు. ఇందుకు రూ.80లక్షలు మంజూరు చేశారు. రాయదుర్గం మార్కెట్‌యార్డు వైఎస్ చైర్మన్ వన్నారెడ్డి స్వయంగా ఈ పనులు చేశారు. నామమాత్రంగా పనులు చేశారనే ఆరోపణలు స్థానికంగా గుప్పుమన్నాయి. ♦ విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో ఈ పథకం కింద చేసిన పనులు రైతులకు నష్టం చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. చెరువు గట్లు ఇంతకు ముందే బాగుండేవని.. పనుల తర్వాత పాడయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పనులను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి బంధువులకు అప్పగించినట్లు రైతులు చెబుతున్నారు. ♦ అలాగే, చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లి వద్ద ముష్టిమాకుల చెరువు పనులను అధికార పార్టీ నేత చేపట్టారు. నాసిరకం పనుల వల్ల గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు చెరువు కట్ట నుంచి నీళ్లు లీకయ్యాయి. ఫలితంగా చెరువులోని నీరు వృధాగా పోయింది. చివరికి చెరువు కట్ట అధ్వానంగా మారింది. ఇలా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. పనులు చేయకుండానే.. చేపట్టిన పనులు మొక్కుబడిగా చేసి బిల్లులు పొందిన తెలుగుదేశం నేతలు కొందరైతే అసలు పనులు చేయకుండానే పనులు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెలుస్తున్న ఘనాపాటీలు మరికొందరు. ♦ శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం దేవరవలస పంచాయతీలో 2017లో నాలుగు చెరువులకు రూ.40లక్షలు మంజూరు చేశారు. కానీ, పనులు మాత్రం కాలేదు. ఇవి జరిగినట్లు రికార్డు చేయాలని స్థానిక టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు భోగట్టా. ♦ కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని కాల్వ పూడుకుపోయిందని నీరు–చెట్లు కింద రూ.8.5లక్షలతో పనులు చేపట్టారు. అయితే ఒక్కసారి కూడా వర్షం రాకుండానే మళ్లీ యథాస్థితిలోనే కనిపిస్తోంది. ♦ తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని గోర్స, కొత్తపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట, కొమరగిరి తదితర 15 గ్రామాల్లో పనులు చేసినట్లు చూపించి రూ.కోట్లు కొల్లగొట్టేశారు. ♦ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని తలమంచిలో కాలువ పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. దీనిపై స్థానిక నాయకుడు పిట్టి సూర్యనారాయణ కలెక్టర్, లోకాయుక్త, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు పనులను పరిశీలించినా చర్యలు లేవు. కలెక్టర్ మాత్రం ఇరిగేషన్ ఏఈ రవికుమార్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ♦ వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం తొండూరులో అధికార పార్టీ నాయకులు వాగులు, వంకలు, చెరువులు లేకపోయినా పొక్లెయిన్ల సహాయంతో అక్కడ సృష్టించారు. ఇలా రూ.కోట్లలో పనులు చేసినట్లు చెబుతున్నారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండల పరిధి గూడెం చెరువు గ్రామంలోని గూడాదేవి చెరువులో గత ఏడాది టీడీపీ నాయకులు నీరు–చెట్టు పనుల్లో భాగంగా పూడికతీత చేపట్టారు. అయితే ఇరిగేషన్ శాఖాధికారుల అనుమతి లేకుండా పొక్లెయిన్లతో మట్టిని తరలించారు. గతంలో కూడా ఇక్కడ పూడికతీత పనులు చేపట్టి డబ్బులు దండుకున్నారు. దీనివల్ల రూ.5లక్షలు దుర్వినియోగమయ్యాయి. ♦ కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో హెబ్బటం, వందవాగిలి, చిన్నహ్యాట, పెద్దహ్యాట, ఎల్లార్తి, గజ్జెహళ్లి, లింగంపల్లి, సులువాయి, విరుపాపురం గ్రామాల పరిధిలో నీరు–చెట్టు కింద మొత్తం 65పనులను గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6కోట్లు కేటాయించింది. శేషగిరి, బసప్ప, ఈరన్న, వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, ఈశ్వర్‌గౌడ్ పేర్లతో పనులు పూర్తయ్యాయి. కొందరు అధికారులతో కలిసి టీడీపీ నేతలు లెక్కల్లో పనులు పూర్తిచేసినట్లు చూపించి నాణ్యతకు తిలోదకాలిచ్చారు. 65పనుల్లో 45కూడా పూర్తికాకుండానే రూ.5కోట్లు లాగేశారు. ♦ కృష్ణాజిల్లా తిరువూరు మండలంలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 53 పనులు మంజూరు కాగా, రూ.4.58కోట్లు కేటాయించారు. వీటిలో 30 పనులు మాత్రమే పూర్తయినా అన్నింటికీ బిల్లులు మాత్రం సిద్ధం చేసేశారు. ♦ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంబూపట్నం బలరామయ్య చెరువు సప్లయ్ చానెల్ అభివృద్ధికి రూ.9లక్షలతో ప్రతిపాదించారు. రెండున్నర కిలోమీటర్ల కాలువలో తూతూమంత్రంగా పనులు చేసి మట్టిని అమ్ముకున్నారు. చేసిన పనుల కంటే పొందిన బిల్లులు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏడాది తిరక్కుండానే ఈ చానెల్ పూడికలతో నిండిపోయింది. ♦ విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని చోడపల్లి చెరువుకు సంబంధించి 2016–17లో రూ.22లక్షల మేర పనులు చేశారు. సగం మట్టిని గట్టు చోడమాంబిక ఆలయ స్థలం కప్పుదలకు కేటాయించారు. మిగిలిన మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అనుచరుడు వేగి మహేష్ ఈ పనులు చేపట్టారు. ఈ చెరువు కింద ఎలాంటి ఆయకట్టు లేదు. కేవలం మట్టి తవ్వకాలకే పూడిక తీత అన్నట్లుగా పనులు సాగాయి. మట్టి అమ్మకాల ద్వారా రూ.30లక్షల మేర సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ♦ విజయనగరం పెద చెరువు పనులన్నీ ఎమ్మెల్యే మీసాల గీత అక్క పెనుమజ్జి విజయలక్ష్మికే అప్పగించేశారు. టెండర్ లేకుండా ఎమ్మెల్యే సిఫారసుతో పనులు దక్కించుకున్నారు. 2016–17లో నీరు–చెట్లు పనులకు రూ.1.6కోట్లు మంజూరయ్యాయి. 16 పనులను ఎమ్మెల్యే సోదరే చేపట్టారు. ఇక్కడి పనుల్లో అరకోటికి పైగా దుర్వినియోగం అయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ♦ చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం కరసనపల్లి పంచాయతీలోని హనుమాన్ చెరువు మరమ్మతులకు 2015–16లో నీరు–చెట్టు కింద రూ.9లక్షలతో పనులు చేశారు. కాంక్రీట్ పనులు చేపట్టకుండా కట్టపై మట్టి పనులు చేసి వదిలేశారు. దీంతో కట్ట అంచులు కోతకు గురయ్యాయి. ఈ పనులను జన్మభూమి కమిటీ పేరుతో పెద్ద పంజాణి మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీరాములు చేపట్టారు. అధికార పార్టీ నేతల మధ్య కలహాలు.. నీరు చెట్టు పథకం అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. మట్టి తవ్వకాల్లో అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. చివరికి బదిలీలు, విధుల నుంచి తొలగించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉదా.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలోని 5 ఎకరాల ఊర చెరువులో గతేడాది మట్టి తవ్వారు. 5,600 ట్రక్కుల మట్టిని తవ్వి ట్రక్కు రూ.600 చొప్పున విక్రయించారు. అధికార పార్టీకే చెందిన సర్పంచ్ కఠెవరపు నిర్మలాకుమారి ప్రమేయం లేకుండా ఎంపీటీసీ కొత్త లక్ష్మీతులసి భర్తకు రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. రూ.6 లక్షలతో చెరువు చుట్టూ కంచె వేయించారు. దీనిపై సర్పంచ్ వర్గం ఆగ్రహం చెందింది. పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయించి.. ఫీల్డు అసిస్టెంటును విధుల నుంచి తొలగించారు. రియల్ ఎస్టేట్‌కు సంతర్పణ విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో 600ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ సాగునీటి చెరువులో రూ.40 లక్షలు నీరు–చెట్టు నిధులు, రూ.10లక్షలు పాల సంఘాల నిధులు, రూ.15లక్షలు విశాఖ డెయిరీ నిధుల సహకారంతో పూడికలు తీశారు. టీడీపీకి చెందిన మండల వైస్ ఎంపీపీ భూతనాధుని నానికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ పనిలో భారీ అవినీతి చోటుచేసుకుందని పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ మట్టిని రియల్ ఎస్టేట్ భూముల ఎత్తు పెంచేందుకు అమ్మేశారు. అలాగే, పీఎస్‌పేట రోడ్డులో మరో టీడీపీ నాయకుడు సుమారు 6 ఎకరాల పంట భూమిలో ప్లాట్లు వేశాడు. ఈ భూమిని ఎత్తు చేసేందుకు లక్ష్మీపురం చెరువు, చోడవరం పాత చెరువు మట్టిని యథేచ్ఛగా తరలించారు. ఎమ్మెల్యే అనుచరుడుగా ఉన్న పంచాయతీరాజ్ కాంట్రాక్టర్‌కే చోడవరం పాత చెరువు నీరు–చెట్టు పనులు అప్పగించడంతో తవ్విన మట్టిని నేరుగా రియల్ ఎస్టేట్ ప్లాట్లకు అమ్మేశాడు. రూ.3కోట్ల మట్టి మింగేశారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలెంలోని పాపిడిదొడ్డి చెరువు 70ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. గత మూడేళ్లుగా నీరు–చెట్టు పథకంలో సుమారు రూ.3కోట్లు ఖర్చుచేసి ఈ చెరువును నియోజకవర్గ ప్రజాప్రతినిధి సోదరుని ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఇందులో మట్టిని పొక్లెయిన్లతో తవ్వి భారీ లారీలతో ఇటుక బట్టీలకు సుమారు రూ.3కోట్ల విలువైన మట్టిని అమ్ముకున్నారు. దీంతో చెరువు గోతులమయంగా మారి సాగునీటి కాలువల్లోకి ప్రవహించడంలేదని రైతులు వాపోతున్నారు. ఇదే చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూడా ఏటా రూ.15లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు, వందల మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ రెండు విధాలా లాభం పొందుతున్నారు. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వుతూ వేలల్లో మాత్రమే తవ్వుతున్నట్లు సర్కార్‌కు చూపుతూ ఖజానాకు భారీ నష్టం చేకూరుస్తున్నారు. అలాగే, ఎక్కడా రైతులకు ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా ఇవ్వలేదు. చెరువు గట్లు పటిష్టం చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఎక్కడి జమ్ము అక్కడే.. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ చిత్రంలో కనిపిస్తున్న మలిదేవి డ్రెయిన్ కనిగిరి రిజర్వాయర్ నుంచి నెల్లూరు జిల్లా కొడవలూరు మీదుగా విడవలూరు మండలం వరకూ వెళ్తోంది. డ్రెయిన్‌లోని గుర్రపుడెక్క, జమ్మును తొలగించేందుకు నీరు–చెట్టు పథకం కింద 2015లో రూ.50లక్షలను కేటాయించారు. ఈ పనులను కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరుడు చెముకుల చైతన్యకు కేటాయించారు. వర్షాకాలం ముందు చేయాల్సిన పనులను జోరుగా వర్షాలు కురిసే సమయంలో ప్రారంభించారు. నామమాత్రంగా పనులు చేసి నిధులను కైంకర్యం చేశారు. ఫలితంగా గుర్రపుడెక్క, జమ్ము అలాగే ఉన్నాయి. కంపచెట్ల మాటున కొల్లగొట్టారు ఫొటోలో కనిపిస్తున్నది అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామ చెరువు. నీరు–చెట్టు కింద ఈ చెరువులో కంపచెట్లు తొలగించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు మాయచేశారు. కంప చెట్లు తొలగించకుండానే నిధులు పిండేశారు. పనులు చేసినట్లు చూపి ఏకంగా రూ.6.41లక్షలు బిల్లులు చేసుకున్నారు. కంపచెట్లు మాత్రం చెరువు నిండా అలానే ఉన్నాయి. ఏఈ.. పనులు ఏవీ? ఇక్కడ కనిపిస్తున్నది కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పాంపల్లి నుంచి ఇంజేడు వరకు వర్షపు నీరు పోయే కుందనవాగు. ఇప్పటివరకు ఇది ఎప్పుడూ ఉప్పొంగలేదు. ఈ వాగును అభివృద్ధి చేసేందుకు మంత్రి అండదండలతో శివరామిరెడ్డి అనే ఏఈ కాంట్రాక్టు పొందారు. ఈయన విధులకు హాజరు కాకుండా దీర్ఘకాలిక సెలవులో కొనసాగుతూ కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. కుందనవాగు అభివృద్ధి పేరుతో రూ.40లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. కానీ, పనులు ఎక్కడ చేశారో తెలీడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. కేవలం టీడీపీ నాయకులకు నిధులు మళ్లించేందుకే ఇక్కడ పనులు చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిట్టు బిట్టుగా దోపిడీ ఫొటోలో కనిపిస్తున్న నిర్మాణం వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం పైడికాలువ, పెద్దపుత్త గ్రామాల మధ్యనున్న వంకపై పైడికాలువ పంచాయతీ పరిధిలోని జంగంపల్లె వద్ద నీరు–చెట్టు కింద నిర్మించిన మోడల్ చెక్ డ్యామ్ ఇది. మట్టి పనులను రెండుగా, కాంక్రీట్ నిర్మాణాన్ని మరో పనిగా విభజించారు. ఒక్కో పనికి రూ.10లక్షల చొప్పున రూ.30లక్షలు కేటాయించారు. స్థానిక ఎంపీటీసీ తనయుడు, గ్రామానికి చెందిన టీడీపీ నేత వాసు పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టారు. మట్టి కట్టలను నాసిరకంగా నిర్మించారు. అనంతరం కురిసిన వర్షాలకు ఓ వైపున మట్టి కట్ట కొట్టుకుపోయింది. దీంతో చుక్క నీరు కూడా నిలవచేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఇక్కడ ఏటా ఇదే తంతు ! శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వీఎన్ పురం సమీపంలో కల్వర్టు వద్దనున్న ఈ బలిజవాని గెడ్డలో రూ.9లక్షలతో నీరు–చెట్టు పనులు చేపట్టారు. యంత్రాలతో గెడ్డను చదును చేశారు కానీ పూడికతీత తీయలేదు. గెడ్డ గర్భంలో గడ్డిని తొలగించకుండా తూతూమంత్రంగా పనులు చేపట్టి నిధులు వెనకేసుకున్నారు. దీంతో ఖరీఫ్‌లో శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్ధకంగా మారింది. బలద పద్మనాభ సాగరంలో పూడికలు తొలగించేందుకు నీరు–చెట్టు పథకం కింద 2017–18లో రూ.54లక్షలు కేటాయించారు. చెరువు గర్భం నుంచి మట్టిని తొలగించి తరలించాలి. కానీ, మట్టిని గట్టుపైనే వేస్తున్నారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మళ్లీ చెరువులోకే చేరుతోంది. ఏటా ఇలా చేస్తూనే టీడీపీ తమ్ముళ్లు లక్షలాది ప్రజాధనం స్వాహా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కూలీలు చేసిన పని చూపి లక్షలు నొక్కేశారు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని వీరేపల్లి చెరువులో 2015–16 ఆర్థిక సంవత్సరంలో మట్టి తవ్వకం పనులు చేపట్టారు. నీరు–చెట్టు పథకం కింద రూ.4.50లక్షలు ఖర్చు చేశారు. అయితే, అప్పటికే ఈ చెరువులో ఉపాధి హామీ కూలీలు మట్టి తవ్వేశారు. కూలీలు తవ్విన కుంటల చుట్టూ జేసీబీతో గాడి తవ్వి నీరు–చెట్టు కింద పనులు చేసినట్లు చూపించారు. దీనికి అధికారులు సహకారం అందించి గ్రామ టీడీపీ నాయకుడు నరేష్‌కు రూ.4.50లక్షల లబ్ది చేకూరేలా చేశారు. మట్టి అమ్ముకోవడమే అభివృద్ధా!? గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామ పరిధిలోని సీతమ్మ చెరువులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన వారు వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నారు. 2015–16లో నీరు–చెట్టు పథకం పేరుతో ఈ భూము ల్లో తవ్వకాలు చేపట్టారు. పేదలను తరిమేశారు. అరెకరం పొలం ఉన్న వారు కూడా భూములు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇదేనా అభివృద్ధి అంటే..!? – సయ్యద్ సుభాని, యడ్లపాడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట అడ్డగోలుగా దోచుకుంటున్నారు నీరు–చెట్టు పనుల్లో అడ్డగోలుగా మట్టి అమ్ముకుంటున్నారు. ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్ముకున్నారు. పనులపై కనీస పర్యవేక్షణ లేదు. ఇష్టారాజ్యంగా పనులు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. గతంలో పనులు చేసిన చెరువుల్లోనే మళ్లీ పనులు ప్రతిపాదించి బిల్లులు పొందుతున్నారు. – కూనిరెడ్డి వెంకట్రావు, పోతనాపల్లి, శృంగవరపుకోట మండలం, విజయనగరం జిల్లా గ్రామస్తుల అవసరాలు తీర్చకుండా అమ్మేసుకున్నారు నీరు–చెట్టు పథకంలో భాగంగా గ్రామస్తుల అవసరాల మేరకు మట్టిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడి టీడీపీ నాయకులు చెరువుల మట్టిని తెగనమ్ముకున్నారు. ఆయకట్టు రైతులకు గంపెడు మట్టిని కూడా ఇవ్వకుండా మొత్తం బయటకు తరలిస్తున్నారు. ప్రశ్నిస్తున్నానని పనుల ప్రారంభానికి కూడా నన్ను పిలవడంలేదు. – సాగిరాజు ఉదయకుమారి, సర్పంచ్, చెందుర్తి, గొల్లప్రోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా పచ్చ చొక్కాలకు దోచి పెట్టేందుకే... అధికార పార్టీకి చెందిన సర్పంచ్ పిటికాయగుళ్ల వాగు లో డీసిల్టింగ్ పనులు చేశారు. నీరు–చెట్టు కింద లక్షలు ఖర్చుపెట్టినట్లు వాగుకు ఇరువైపులా గట్ల వెంబడి యంత్రా లతో తూతూమంత్రంగా పనులు చేశారు. నీరు నిల్వ ఉండే గుంతలను కూడా చదును చేయడంతో కనీసం పశువులు నీరు తాగేందుకు చుక్క నీరు ఉండని పరిస్థితి ఏర్పడింది. వాగులో చేసిన పనులు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. – మల్లెల శేఖర్‌రెడ్డి, పిటికాయగుళ్ల, గిద్దలూరు, ప్రకాశం జిల్లా వారి జేబులు నింపడానికే.. నీరు–చెట్టు పనులు పూర్తిగా అవినీతిమయమయ్యాయి. అధికారులు పట్టించుకోవడంలేదు. టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మంజూరైన నిధులతో మొక్కుబడిగా పనులు చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. దీనిపై విచారణ చేపట్టాలి. – చెన్నకేశవులు, సీపీఐ నేత, పలమనేరు, చిత్తూరు జిల్లా -
కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిని..
ముంబై: వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్ మాజీ పోటీదారు అర్మాన్ కోహ్లిపై కేసు నమోదైంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, పారిపోయిన అతని కోసం ముంబై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శాంతాక్రజ్ పోలీసుల కథనం ప్రకారం... ప్రాధేయపడ్డా వినిపించుకోకుండా ఉన్మాదిలా..: స్టైలిస్ట్ నీరూ, నటుడు అర్మాన్ కోహ్లిలు గడిచిన మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇద్దరూ తరచూ కీచులాడుకునేవారు. ఇటీవల గోవాలోని ఓ విల్లా విక్రయానికి సంబంధించి గొడవ తారాస్థాయికి చేరింది. ఇదే విషయమై ఆదివారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. ఒకదశలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా అతను వినలేదు. కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. కాగా, కోహ్లి అప్పటికే అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బడా దర్శకుడి సుపుత్రుడు: బాలీవుడ్లో 70,80వ దశకాల్లో ‘నాగిన్’, ‘జానీ దుష్మన్’, ‘రాజ్ తిలక్’, లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన దర్శకుడు రాజ్‌కుమార్ కోహ్లి తనయుడే అర్మాన్ కోహ్లి. కొడుకును హీరోగా నిలబెట్టేందుకు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలం కావడంతో రాజ్‌కుమార్ మిన్నకుండిపోయారు. మొదట్లో హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగిన అర్మాన్.. బిగ్‌బాస్ షోతో ఒక్కసారే బడా సెలబ్రిటీ అయిపోయాడు. బిగ్‌బాస్-7 షో జరుగుతుండగానే కో-పార్టిసిపెంట్ తనీషా ముఖర్జీతో అర్మాన్ రొమాన్స్ చేయడం, మరో నటి సోఫియాతో గొడవపడటం, పోలీసులు ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిమరీ అర్మాన్‌ను అరెస్టు చేయడం అప్పట్లో పెనుదుమారం రేపింది. -
మైనర్ తిరకాసు
నంద్యాల: ఎన్నికలు వచ్చే సమయానికి ఆర్థికంగా బలోపేతం కావాలన్న టీడీపీ నేతల ఆలోచన..భారీ అక్రమాలకు తెరతీస్తోంది. ఇందుకు నంద్యాల డివిజన్లో జరుగుతున్న నీరు– చెట్టు పనులనే ఉదాహరణగా చెప్పవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా మేజర్ ఇరిగేషన్ శాఖ పరిధిలోని పనులను మైనర్ ఇరిగేషన్ ఈఈకి అప్పగించారు. తెలుగుగంగ, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఉండడంతో వారికి పనులు దక్కనీయకుండా టీడీపీ నేతలు పక్కా వ్యూహం రచించారు. జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి..ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో మూడేళ్లుగా నీరు–చెట్టు పనులు జరుగుతున్నాయి. వీటిని అధికార పార్టీకి చెందిన వారే చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్లో నంద్యాల డివిజన్లో సుమారు 5 వేలకు పైగా పనులు మంజూరు చేయించుకున్నారు. ఆ శాఖ ఆధ్వర్యంలో కుంటలు, చెరువుల పూడికతీత వంటి పనులు చేయాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా కేసీ కెనాల్, తెలుగుగంగకు చెందిన పనులు ఆ శాఖకు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులకు 12మంది ఈఈలు ఉన్నారు. ఈ అధికారులకు ఒక్కొక్కరికి 200 పనులు కూడా లేవు. అయితే మైనర్ ఇరిగేషన్లో ఒక్క ఈఈకే రూ.500 కోట్ల పనులు అప్పగించారు. ఇప్పటికే కుందూ పనులు చేస్తున్న మైనర్ ఇరిగేషన్ అధికారులు ఇవి చాలవన్నట్లు కేసీ కెనాల్ ఆయకట్టు పనులు కూడా దక్కించుకున్నారు. కేసీ కెనాల్, తెలుగుగంగలో పని చేస్తున్న ఈఈలు, డీఈలు, ఏఈలు పనులు లేక గోళ్లు గిల్లుకుంటుంటే మైనర్ ఇరిగేషన్ అధికారులేమో ఐదువేల పనులతో తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. పని తక్కువ.. ఆదాయం ఎక్కువ.. పని తక్కువ ఉండటం, ఆదాయం ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నాయకుల కన్ను కుందూ వెడల్పు పనులపై పడింది. ఈ పనులు కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీకి అప్పగించాలి. అలా చేస్తే నీటి సంఘాల అధ్యక్షులకు ఈ పనులు ఇవ్వాల్సి వస్తుంది. నంద్యాల డివిజన్లో అధికంగా నీటి సంఘాల అధ్యక్షులు వైఎస్సార్సీపీకి చెందినవారే ఉన్నారు. వీరికి ఈ పనులను మైనర్ ఇరిగేషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీ సభ్యులు చేస్తున్నారు. సుమారు రూ.50కోట్ల పనులు జరుగుతుండగా..ఒక్కో పనికి 75 మీటర్ల చొప్పున రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు కేటాయిస్తున్నారు. ప్రొక్లెయిన్‌తో ఈ పనిని ఒక్కరోజులో చేసేస్తున్నారు. ఎక్కువ చేసినా ఇసుక వస్తుందనే ధైర్యంతో పనులు సాగిస్తున్నారు. తప్పుదోవ.. టీడీపీ నేతల సూచన మేరకు..నంద్యాలలోని మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ కీలక అధికారి జిల్లా ఉన్నతస్థాయి అధికారులను తప్పుదోవ పట్టించారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మైనర్ శాఖలో కూపారు. ఇప్పటికే ఈ అధికారి నీరు–చెట్టు పనుల్లో కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పని చేసిన ఈ శాఖకు చెందిన అధికారి ఈ సీటు కోసం రూ.5కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం. అంతేకాకుండా తాను బదిలీ అయిన స్థానంలో ఇంకా జాయినింగ్ రిపోర్టు తీసుకోలేదంటే ఈ శాఖలో ఎంత అవినీతి జరుగుతుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. -
తవ్వుకో.. అమ్ముకో..
సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తోన్న ఇసుక, మట్టి దోపిడీని ప్రభుత్వం అధికారికం చేసింది. జలాశయాలు, చెరువుల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తవ్విన ఇసుక, మట్టికి సీనరేజీ ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాష్ట్రంలో నీరు–చెట్టు పథకం కింద చెరువులు, జలాశయాల్లో పూడిక తీసే పనులకు నాలుగేళ్ల క్రితమే సర్కార్ శ్రీకారం చుట్టింది. నిబంధనల ప్రకారం పూడిక తీసిన మట్టి, ఇసుకను రైతులు సొంత ఖర్చుతో తమ పొలాలకు తీసుకెళ్లవచ్చు కానీ అమ్ముకోకూడదు. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు నిబంధనలను వక్రీకరించి వ్యాపారం చేస్తున్నారు. 2015–16లో 18.20, 2016–17లో 29.07, 2017–18లో 24.04, 2018–19లో ఇప్పటివరకూ 3.85 వెరసి.. 75.16 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తీసినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 45 కోట్ల క్యూబిక్ మీటర్లకుపైగా మట్టి, ఇసుకను క్యూబిక్ మీటర్ రూ.550 చొప్పున విక్రయించి రూ.24,750 కోట్లకుపైగా సొమ్ము చేసుకున్నారు. చెరువులు, జలాశయాల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ఏడాది మాత్రమే గడువుండటంతో.. టీడీపీ సర్కార్‌కి ఏడాది మాత్రమే గడువుండటంతో మట్టి, ఇసుక ద్వారా రూ.వేల కోట్లు కొల్లగొట్టడానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నేతృత్వంలోని మాఫియా స్కెచ్ వేసింది. సొంత ఖర్చులతో పూడికను తీసి మట్టి, ఇసుకను వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటామని చిన్న నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిపై ఆమోదముద్ర వేయాలంటూ కీలక మంత్రి జలవనరుల శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. అధికారులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. నీరు–చెట్టు పథకంపై గత సోమవారం నిర్వహించిన సమీక్షలో సొంత ఖర్చుతోపూడిక తీస్తామని ముందుకొచ్చిన వారికి ఎందుకు అడ్డుతగులుతున్నారంటూ సీఎం చంద్రబాబు మండినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో చేసేది లేక జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు లేదా జలాశయంలో పూడిక తీసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. చెరువులు, జలాశయాలకు నష్టం వాటిల్లకుండా క్యూబిక్ మీటర్‌కు రూ.1 చొప్పున పూచీకత్తుగా వసూలు చేయాలని, పూడికతీత పూర్తయిన తర్వాత ఎలాంటి నష్టం వాటిల్లకపోతే ఆ మొత్తాన్ని కూడా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. పనులు చేయకపోయినా.. నీరు–చెట్టు కింద రాష్ట్రంలో పనులన్నీ నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు అప్పగించారు. పనులు చేసినా చేయకున్నా చేసినట్లుగానే రికార్డులు రాసి రూ.12,819.82 కోట్లను ఇప్పటివరకూ బిల్లుల రూపంలో చెల్లించారు. ఈ పథకం కింద ఇప్పటివరకూ 75.16 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించడం ద్వారా 65.192 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగిందని సర్కార్ లెక్కలు చెబుతోంది. కానీ.. ఈ లెక్కలను అధికారవర్గాలే కొట్టిపారేస్తుండటం గమనార్హం. –ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నది.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం సమీపంలోని బ్రహ్మలింగం చెరువు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి నీరు–చెట్టు పథకం కింద ఈ చెరువును అడ్డగోలుగా తవ్వేశారు. పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్ రూ.550 చొప్పున విక్రయిస్తూ.. రోజూ కనీసం రూ.ఐదు లక్షల వరకూ వెనకేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధి దోపిడీ దెబ్బకు చెరువు గొయ్యిగా మారి తూములకు నీళ్లు అందడం లేదు. –ఇక్కడ కనిపిస్తున్నది.. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని కోదండరాముని చెరువు. ఇష్టారాజ్యంగా పూడిక తీసిన మట్టిని టీడీపీ కీలక ప్రజాప్రతినిధి క్యూబిక్ మీటర్ రూ.550 నుంచి రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. తూముల మట్టం కంటే మూడు నాలుగు మీటర్ల లోతుకు మట్టిని తవ్వేశారు. దీంతో తూములకు సక్రమంగా నీళ్లందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఈ రెండు చెరువుల్లోనే కాదు.. వేలాది చెరువుల్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ ఆగడాలకు దన్నుగా నిలిచేలా సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. -
డిసెంబర్‌కు నీళ్లంట..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వచ్చే డిసెంబర్ నాటికే టన్నెల్–1 పనులు పూర్తిచేసి వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాకు నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గురువారం నీరు–ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కందుకూరులో జరిగిన సభలో ఈ ప్రకటన చేశారు. గత నాలుగేళ్లలో వెలిగొండ నీటిని ఏడాదికొకమారు చొప్పున విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం తాజాగా వచ్చే డిసెంబర్‌కే వెలిగొండ నీరంటూ సరికొత్త ప్రకటన చేయడంపై జిల్లా వాసులే కాక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు సైతం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్లుగా వెలిగొండ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల కాలంలో దాదాపుగా పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం రూ.204 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో పాత కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ప్రభుత్వానికి పాత కాంట్రాక్టర్లకు మధ్య విబేధాలు తలెత్తాయి. పాత వారికి బిల్లులిచ్చి పనులను వేగవంతం చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా పాత కాంట్రాక్టర్లను తప్పించి కొత్తవారికి పనులు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. పనుల అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకొని రూ.234 కోట్ల టన్నెల్–1 పనులతో పాటు రూ.570 కోట్ల టన్నెల్–2 పనులకు ఇటీవలే టెండర్లు పిలిచింది.పాత కాంట్రాక్టర్లయిన షబీర్, షూ, ప్రసాద్, కోస్టల్, హెచ్‌సీసీకంపెనీలు కోర్టుకు వెళ్ళడంతో టెండర్ల వ్యవహారంపెండింగ్‌లో పడింది. ఇప్పటి వరకు జరిగిన టన్నెల్ పనులు.. ఇప్పటి వరకు 18 కి.మీ. టన్నెల్–1 పనుల్లో 15.167 కిలోమీటర్లు, 18 కిలోమీటర్ల టన్నెల్–2 పనుల్లో 10.708 కిలోమీటర్లు పని మాత్రమే పూర్తయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి టన్నెల్–1లో 13 కి.మీ. మేర పని పూర్తయింది. ఇంకా 5 కి.మీకుపైనే పని పెండింగ్‌లో ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలో కేవలం రెండున్నర కి.మీ. మాత్రమే పని జరిగింది. చంద్రబాబు చెప్పినట్లు టన్నెల్–1 పనులను పూర్తిచేసి ఫేజ్–1లో వెలిగొండ ద్వారా నీరివ్వాలంటే ఇంకా 3 కి.మీ.కుపైనే టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. దీంతో పాటు రూ.100 కోట్ల నిధులతో చేపట్టిన కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. రాబోయే డిసెంబర్ అంటే ఏడున్నర నెలల కాలమే. ఏడున్నర నెలలో 3 కి.మీ. మేర టన్నెల్ తవ్వాల్సి ఉంది. ఇది ఎంత మేర సాధ్యమన్నది ప్రశ్నార్థకం. బాబు కొత్త హామీపై జిల్లా ప్రజలతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు అధికారంలోకి వస్తూ్తనే 2016 నాటికి వెలిగొండ ద్వారా జిల్లాకు నీటిని విడుదల చేస్తామన్నారు. అప్పటి నుంచి జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వెలిగొండ నీటి విడుదలకు కొత్త తేదీలను ప్రకటిస్తూనే ఉన్నారు. పనులు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. బాబు హామీలు నీటి మూటే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నీరు–చెట్టు.. నిధులు కొల్లగొట్టు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇన్నాళ్లూ నాణ్యత లేని పనులకు కూడా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చిన నేతలు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. పనులు చేయకపోయినప్పటికీ బిల్లులు ఇవ్వాల్సిందేనని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రధానంగా కర్నూలు–కడప (కేసీ) కెనాల్ పరిధిలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రూ.10 కోట్ల పనులకు బిల్లులు ఇవ్వాలంటూ సాగునీటి శాఖ ఇంజినీర్లను బెదిరిస్తున్నారు. కేసీ కెనాల్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ నీరు–చెట్టు పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి.. బిల్లులు ఇవ్వాలని హుకుం జారీ చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి ఇక్కడ సుమారు రూ.3 కోట్ల మేర పనులు చేసిన నేతలు.. ఏకంగా రూ.10 కోట్లకు బిల్లులు ఇవ్వాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ విధంగా చేయడం కుదరదని ఇంజినీర్లు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంతో కొంత పనిచేస్తే బిల్లులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, పూర్తిగా పనిచేయకుండానే ఇస్తే తాము ఇరుక్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. అయితే, తాము చెప్పినట్లు చేయకపోతే బదిలీ చేయిస్తామని కూడా అధికార పార్టీ ముఖ్యనేత హెచ్చరించినట్టు తెలుస్తోంది. సామూహిక సెలవులో... ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలంలో ఇప్పటికే రూ.3 కోట్ల నీరు–చెట్టు పనులను అధికార పార్టీ నేతలు చేపడుతున్నారు. ఇవి ఏమాత్రమూ నాణ్యత లేకుండా చేస్తున్నారు. లెక్కలన్నీ తప్పులతడకే. రూ.3 కోట్ల పనులు చేస్తున్నా..వారికి ఆశ తీరలేదు. పైగా పనులేవీ నిర్ణీత పద్ధతిలో చేయడం లేదు. అయినప్పటికీ లెక్కలు సరిగానే ఉన్నాయంటూ ఇంజినీర్లపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా మరో రూ.7 కోట్లు కలిపి మొత్తం రూ.10 కోట్ల పనులు చేసినట్టు లెక్కలు రాయమంటున్నారు. ఈ విధంగా చేయకపోతే బదిలీ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన ఒత్తిళ్లు ఏకంగా చీఫ్ ఇంజినీర్ వరకూ వస్తున్నట్టు సమాచారం. ఏకంగా అధికార పార్టీ ముఖ్యనేత నుంచి కూడా ఒత్తిళ్లు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాము సామూహిక సెలవులో వెళ్లడం మినహా మరో గత్యంతరం లేదని సాగునీటిశాఖ ఇంజినీర్లు వాపోతున్నట్లు సమాచారం. వారంటేనే మక్కువ! గత ఏడాది చేపట్టిన నీరు–చెట్టు పనులు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతలకు దక్కలేదు. పక్కనున్న బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్లకు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ప్రస్తుతం సాగుతున్న రూ.3 కోట్ల పనులు కూడా ఈ కాంట్రాక్టర్‌కే ఇచ్చారు. ప్రస్తుతం మరో రూ.7 కోట్ల పనుల లెక్కలు కూడా ఈ కాంట్రాక్టర్ ఖాతాలోనే వేయాలనేది అధికార పార్టీ ముఖ్యనేత చేస్తున్న ఒత్తిడి. తమకు ఇవ్వకుండా ఇతరులకు అప్పగించడం ఏమిటని స్థానిక అధికార పార్టీ నేతలు రుసరుసలాడుతున్నారు. మరోవైపు సదరు కాంట్రాక్టర్ కాస్తా ఏకంగా 50 శాతం నుంచి 60 శాతం వరకూ అధికార పార్టీ ముఖ్యనేతకు ఇవ్వాల్సి వస్తోందని, అందువల్ల మొత్తం రూ.10 కోట్లకు బిల్లులు వేయాలని ఇంజినీర్ల వద్ద పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో సాగునీటి శాఖ ఇంజినీర్లు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. -
నిధులు కొల్లగొట్టు!
ధర్మవరం : ‘నీరు– చెట్టు’’ టీడీపీ నాయకుల జేబులు నింపే పథకంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కింద మొక్కలు పెంచడం, చెరువుల్లో పూడిక తీత పనులు చేసి సారవంతమైన మట్టిని రైతుల పొలాల్లోకి తోలాల్సి ఉంది. అయితే అధికారంలో ఉన్నవారే పనులు దక్కించుకోవడం.. బదిలీల భయంతో అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో నిధులన్నీ పక్కదారి పట్టాయి. రికార్డుల్లో చూపినట్లుగా పూడికతీతతో చెరువులు అభివృద్ధి చెందలేదు... తీసిన మట్టితో వేసిన రోడ్లు బాగుపడిందీ లేదు. ఇక బండరాళ్లతో చెక్‌డ్యాంలు నిర్మించిన కాంట్రాక్టర్లు..పైన సిమెంట్ పూసి మమ అనిపిస్తున్నారు. దీంతో వందల కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయి. జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, అనంతపురం ఇరిగేషన్ డివిజన్లకు కలిపి మొత్తం 7,848 పనులు చేపట్టేందుకు రూ.83,092.42 లక్షల నిధులు కేటాయించారు. ఆయా నిధులతో జంగిల్ క్లియరెన్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, చెరువు కట్టలు, కుంట కట్టలను గట్టిపరచడం, అవసరమైన చోట కాంక్రీట్ రివిట్మెంట్ చేయడం, చెరువులు, కుంటల తూములు మరమ్మతులు చేయడం తదితర పనులు చేసేందుకు గాను మూడు డివిజన్ల పరిధిలో 3,640 పనులకు పరిపాలనా అనుమతి పొందారు. అయితే ఆయా పనులు ఎక్కడా నిబంధనల మేరకు జరగడంలేదు. ఈ మొత్తం నీరు–చెట్టు పనులన్నింటనీ అధికార పార్టీ నాయకులే చేపడుతుండటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కనీసం మార్కింగ్ కూడా ఇవ్వకముందే టీడీపీ నాయకులు ఆ పనులు చేసేశారు. ముఖ్యంగా పూడిక తీత పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలలో పూడిక తీస్తే నీరు పుష్కలంగా చేరుతుందని, తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని రైతులు భావించారు. చెరువులోని సారవంతమైన మట్టిని పొలాలకు తోలుకోవచ్చునని భావించారు. అయితే చెరువులలో నామమాత్రంగా పనులు చేసి పూర్తిగా బిల్లులు చేయించుకున్నారని రైతులు పేర్కొంటున్నారు. జన్మభూమి కమిటీలదే హవా.! నీరు–చెట్టు పనులు మొత్తం జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులే దక్కించుకున్నారు. మొత్తం వారు చెప్పినట్లే అన్ని నియోజకవర్గాల్లోనూ పనులు జరిగాయి. కొన్ని గ్రామాల్లో ‘నీరు–చెట్టు’ పథకం కింద చేపట్టే పనులు తమకు దక్కలేదన్న కారణంతో అధికార పార్టీకే చెందిన నేతలు వర్గాలు చీలిపోయిన సందర్భాలున్నాయి. అధికార పార్టీ సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్న ప్రాంతాలకు మాత్రమే నిధులు మంజూరు చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. అధికారుల తీరుపై విమర్శల వెల్లువ నీరు – చెట్టు పథకం నిధులు స్వాహా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులకు బదిలీల భయం పట్టుకుంది. ఏ చిన్న అభ్యంతరం చెప్పినా ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అని నేతల నుంచి ఫోన్లు వస్తుండటంతో వారు చేసేదిలేక మిన్నకుండిపోతున్నారు. మరికొందరు అధికారులు మాత్రం ‘‘నాదేం పోయింది.. నీ ఇష్టం వచ్చినట్లు పనిచేసుకో.. మాకు ఇవ్వాల్సింది మాత్రం మాకు ఇచ్చేయ్’’.. అని కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులతో జేబులు నింపుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న చెక్‌డ్యాం యల్లనూరు మండలం కూచివారిపల్లి వద్ద ఓ టీడీపీ నేత నిర్మించినది. ఇక్కడ చెక్‌డ్యాం నిర్మాణా నికి రూ.9.6 లక్షలు మంజూరైంది. అడిగేవారు లేరన్న ఉద్దేశంతో సదరు నాయకుడు ఏకంగా బండరాళ్లతో చెక్‌డ్యాం నిర్మించాడు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో అధికారులు జేసీబీలతో చెక్‌డ్యాంను తొలగించగా బండరాళ్లు కనిపించాయి. దీంతో సదరు టీడీపీ నాయకునికి బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. ధర్మవరం మండలం సీసీ కొత్తకోట చెరువులో టెక్నికల్ అనుమతి లేకుండా, అధికారులు మార్కింగ్ ఇవ్వకుండానే చేస్తున్న పనులివి. చింతల చెరువులో మట్టిని తొలగించి, ఆ మట్టిని పాడుబడిన బావులు/ పాడైన రోడ్లలో వేయాల్సి ఉంది. అయితే ఇవేవీ లేకుండానే ఓ టీడీపీ నేత ఏకంగా గతంలో పూడికతీత పనులు చేపట్టిన ప్రాంతంలోనే తిరిగి జేసీబీలతో పనులు చేస్తున్నాడు. ఈ పనులకుగాను రూ. 4.42 లక్షలు మంజూరైంది. -
..అయితే ఓకే!
కర్నూలు సిటీ: ఎక్కడైనా పాత పనులు పూర్తయిన తరువాత కొత్తవి మంజూరు చేయడం మనం చూస్తుంటాం. అలా కాకుండా కొత్త పనులు మంజూరు చేసుకుంటూ పోతే పాతవి పూర్తికాకపోగా..వాటిపై పర్యవేక్షణ కొరవడుతుంది. ఫలితంగా పనులు నాసిరకంగా కొనసాగే అవకాశం ఉంది. నీరు– చెట్టు పనుల్లో ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల ఆదాయం పెంపు కోసమే అన్నట్లు ఈ పనులకు అనుమతులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా... చెరువులు, కుంటలు, చెక్డ్యాంలలోని పూడికతీత, జంగిల్ క్లియరెన్స్‌కు తొలుత ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి ఒకే చెరువు కానీ, కుంట కానీ, వాగు పరిధిలోని పనులకు మొత్తంగా అంచనాలు వేసి టెండర్ల ద్వారా చేస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఇంజినీర్లు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికార పార్టీ నేతలు ఈ విషయంపై సీఎం దగ్గర పంచాయితీ చేశారు. రూ.10 లక్షలలోపు నామినేషన్ కింద పనులను టీడీపీ అనుచరులకు కేటాయించేలా చేశారు. విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా.. ఒకే పనిని విభజించి పంచి పెట్టారు. ఆ తరువాత.. సాగునీటి కాలువల్లోని పూడికతీత, మరమ్మతులు సైతం నీరు–చెట్టు కింద చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో కేసీ కాలువ, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, తుంగభద్ర దిగువ కాల్వల పరిధిలోని మరమ్మతులు, పూడికతీతకు అంచనాలు వేసి, అనుమతులు తీసుకున్నారు. అయితే ఈ పనులే నేటికీ పూర్తి కాలేదు. తాజాగా కేసీ పరిధిలో మరో 174 పనులకు అనుమతులు తీసుకున్నారు. అయితే పనులు ఎక్కడ చేయాలో కూడా ఇంజినీర్లకు అర్థంకాని పరిస్థితులు ఉన్నాయి. ఒత్తిడి తెచ్చి.. కర్నూలు–కడప కాలువ.. 305.60 కి.మీ దూరం ప్రయాణిస్తూ.. 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తోంది. కాలువ పూర్తి స్థాయి సామర్థ్యం 4500 క్యూసెక్కులు. పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 2500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఆయకట్టు అభివృద్ధి కోసమని నీరు–చెట్టు కింద 2016–17లో 240 పనులను రూ.19 కోట్లతో చేపట్టారు. వాటిలో 198 పూర్తి కాగా, 26 పురోగతిలో ఉన్నాయి. 2017–18 సంవత్సరంలో 734 పనులను రూ. 91.13 కోట్లతో చేపట్టగా.. 270 పూర్తి కాగా, 197 పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. పనులు అధిక శాతం ఆళ్లగడ్డ, నంద్యాల, మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోనే చేపట్టారు. మంజూరైన పనులే పూర్తి చేసేందుకు ఇంజినీర్లు ఆపసోపాలు పడుతున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి చేసి రూ.17 కోట్లతో 174 పనులకు అనుమతులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అనుమతులు ఇచ్చిన పనులు ఎక్కడెక్కడ చేయాలో తెలియక ఇంజినీర్లు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు మాత్రం అధికార పార్టీ నేతలు కోరిన పనులు చేసి పెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నట్లు జల వనరుల శాఖలో చర్చ జరుగుతుంది. నా దృష్టికి రాలేదు కడప–కర్నూలు కాలువ పరిధిలో నీరు–చెట్టు కింద తాజాగా చేసిన ప్రతిపాదనలు నా దృష్టికి రాలేదు. అయితే కేసీ, కుందూ నదికి సంబంధించిన వాటిలో పూడికతీత పనుల ప్రతిపాదనల గురించి చూడాలని కేసీ ఇంజనీర్లకు సూచించాను. ప్రతిపాదించే పనులు అవసరమో లేదో విచారించేందుకు ఆర్డీఓలకు అప్పగించారు. అక్కడి నుంచి వచ్చాక చూస్తాం. – శ్రీరామ చంద్రమూర్తి, జలవనరుల శాఖ ఎస్ఈ -
తమ్ముళ్ల మధ్య ముసలం
ఎల్.ఎన్.పేట: వచ్చే ఏడాది మే తర్వాత సాధారణ, స్థానిక సంస్థల్లో ఏవైనా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం అధికారులు కూడా ప్రకటించిన తరుణంలో.. అధికార పార్టీలో ముసలం ప్రారంభమవుతోంది. మండల స్థాయి నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా ఇప్పటివరకూ అణిగిమణిగి ఉన్న కొందరు నాయకులు.. కొన్ని రోజులుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గ్రామ, పంచాయతీ స్థాయిలో తామంతా కలసి పనిచేస్తే కొందరు మండల స్థాయిలో గద్దెనెక్కుతున్నారని వీరు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మండల నాయకుల తీరును కట్టడి చేయాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా వారినే వెనకేసుకొస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి తీరుతో విసిగివేశారిపోయిన కొందరు తమ్ముళ్లు పార్టీని వదిలేందుకు కూడా సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. చేతులెత్తేసిన ఎమ్మెల్యే ఈ విషయం తెలుసుకున్న మండల నాయకులు మరో మంత్రి కళా వెంకట్రావు వద్దకు వెళ్లి పనులు రద్దు కాకుండా చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘మా పైనే వ్యతిరేకంగా జిల్లా నాయకులకు చెబుతారా’ అని కక్షకట్టిన ఓ నాయకుడు పీఆర్ ఇంజినీరింగ్ అధికారులను పిలిపించుకుని మండలంలోని దబ్బపాడు, పెద్దకొల్లివలస, ముంగెన్నపాడు, ధనుకువాడ, టి.కృష్ణాపురం, కొమ్మువలస సర్పంచ్‌లు తనకు తెలియకుండా ఏ పనులు ప్రారంభించకూడదని, బిల్లులు చెల్లించకూడదని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మండల నాయకుల తీరుపై భగ్గుమంటున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే కలమట దృష్టికి తీసుకువెళ్లినా తానేమీ చేయలేనని చేతులెత్తేయడంతో.. ‘అవసరమైతే పార్టీ మారుదాం.. లేదంటే పార్టీలో కొనసాగుతూనే వీరికి వ్యతిరేకంగా పనిచేద్దామ’ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నీరు–చెట్టు పనుల పర్సంటేజీల స్వాహా 2016–17 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన నీరు–చెట్టు పనులకు సంబంధించి మండలంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటిసీలు, జన్మభూమి కమిటీ సభ్యులు, ముఖ్య నాయకుల వద్ద ఇరిగేషన్ అధికారులకు, ప్రెస్‌కు ఇవ్వాలని వసూలు చేసిన సుమారు రూ.16 లక్షల పర్సంటేజీలు నాయకులే స్వాహా చేశారని ఏడాదిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయాన్ని ఎంపీ రామ్మోహన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవి, ఎమ్మెల్యే కలమటకు తెలియజేసినా వారినే వెనకేసుకువస్తున్నారని దిగువస్థాయి నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. ‘పార్టీకి, జిల్లా నాయకులకు వారే కావాలి గాని గ్రామస్థాయిలో కష్టపడే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అవసరం లేదా?’ అని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఇలా మొదలైంది.. మండల నాయకులు రెండు పంచాయతీల్లో రూ.2 కోట్లు విలువ చేసే నీరు–చెట్టు పనులు ఎంపీ రామ్మోహన్నాయుడి సిఫార్స్ లేఖతో మంజూరు చేయించుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న మండల స్థాయిలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కలమట వద్దకు వెళ్లి నియోజకవర్గంలో 140, ఎల్.ఎన్.పేట మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయని.. కానీ ఆ రెండు పంచాయతీలకే రూ.2కోట్ల పనులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. పనులు రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పి, ఇరిగేషన్ ఈఈతో మాట్లాడారు. దీంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శాంతించారు. -
ఇట్లయితే పనులు చేయలేం బాబోయ్..!
- పూడికతీత పనుల్లో అధికార పార్టీ నేతల బెదిరింపులు - రక్షణ కల్పించాలని ఎస్ఈకి ఇంజినీర్ల విజ్ఞప్తి - నేడు సీఈతోపాటు జిల్లా ఎస్పీ దృష్టికి కర్నూలు సిటీ: నీరు - చెట్టు కింద చేపట్టిన పూడికతీత పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటూ అధికార పార్టీ నాయకులు ఇంజినీర్లపై ఒత్తిడి తెస్తున్నారని రాయలసీమ నీటిపారుదలశాఖ ఏఈఈల అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి అన్నారు. మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పని చేయలేమంటూ రక్షణ కల్పించాలని కోరారు. గురువారం స్థానిక జలమండలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పూడిక తీత పనులకు సంబంధించి వారికి అనుకూలంగా పని చేయలేకపోతుండడంతో టీడీపీ నేతలు ఇంజనీర్లను బెదిరిస్తున్నారన్నారు. ఆస్పరి మండలం హలిగేర, తంగరడోణలో చేపట్టిన పనుల్లో తమకు అనుకూలంగా కొలతలు వేసి బిల్లులు చెల్లించాలని వారం రోజులుగా ఎంపీపీ కృష్ణ, హలిగేర సర్పంచు యువరాజ్ తదితరులు జేఈఈ రఘుచరణ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి వెంకటచలంను బెదిరిస్తున్నారన్నారు. తమ కోసమే సీఎం చంద్రబాబు ఈ పనులు పెట్టాడని, తమకు కాకపోతే ఇంకెవరికి పనులు చేసి పెడతారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ఇంజినీర్లకు రక్షణ కల్పించకపోతే విధులు నిర్వహించలేమని వెంకటేశ్వరెడ్డి తెలిపారు. విషయంపై సాయంత్రం జలవనరుల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావుకు చిన్ననీటి పారుదల శాఖ కర్నూలు డివిజన్ ఈఈ చెంగయ్యకుమార్ ద్వారా వినతిపత్రం ఇచ్చారు. వీరిలో సంఘం నాయకులు రాఘవేంద్ర రావు, కె.వెంకటాచలం తదితరులున్నారు. -
ఐరాసలో జడ్జిగా భారత మహిళ
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితిలో మరో భారతీయురాలికి ఉన్నత పదవి దక్కింది. సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ(ఐటీఎల్‌ఓఎస్)కు భారత్‌కు చెందిన న్యాయ నిపుణురాలు నీరు చాధా ఎన్నికయ్యారు. ఈ ట్రిబ్యునల్‌కు జడ్జిగా నియమితులైన తొలి భారత మహిళ ఆమెనే కావడం విశేషం. చాధా ఈ పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ప్రముఖ లాయర్ అయిన చాధా విదేశాంగ శాఖలో ముఖ్య న్యాయ సలహాదారుగా పనిచేసిన తొలి మహిళగా పేరుగాంచారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో చాధాకు ఆసియా పసిఫిక్ గ్రూప్‌లో అత్యధికంగా 120 ఓట్లు రావడంతో అమె తొలి రౌండ్లోనే గెలుపొందారు. ఈ పదవికి పోటీపడిన ఇండోనేషియా అభ్యర్థికి 58 ఓట్లు, లెబనాన్ వ్యక్తికి 60, థాయిలాండ్ అభ్యర్థికి 86 ఓట్లు దక్కాయి. ఈ ట్రిబ్యునల్‌లో మొత్తం 21 మంది సభ్యులుంటారు.చాధాకు మద్దతిచ్చిన దేశాలకు యూన్‌లో శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. -
నెలాఖరులో సీఎం పర్యటన
– నీరు–చెట్టు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కర్నూలు (అగ్రికల్చర్) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలిసింది. జిల్లాలో సీఎం నీరు–చెట్టు కార్యక్రమాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కొత్త కలెక్టర్ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో ముఖ్యమంత్రి పర్యటనకు అవకాశం ఏర్పడింది. -
సూచనలు పాటించకుంటే చర్యలు
– నీరు- చెట్లు సమీక్షలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా పెద్దాపురం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు–చెట్టు పథకంలో అధికారులు ప్రభుత్వ సూచనలు పాటించకున్నా, వారిపై ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సబ్‌కలెక్టర్, ఆర్డీవోలు, ఇరిగేషన్, ఎన్ఆర్ఇజీఎస్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీరు–చెట్టు పథకాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మంజూరైన ప్రతి చెరువు పనులు పంచాయతీ తీర్మానం తరువాతనే మొదలుపెట్టాలని, 25వ తేదీలోగా తీర్మాన పత్రాలను అందజేయాలన్నారు. చెరువుల వద్ద అంచనాలతో కూడిన బ్యానర్లు, పని వివరాల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అధికారులు సమష్టి కృషి చేయాలన్నారు. డ్వామా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నీరు–చెట్టు పథకంపై పర్యవేక్షణ జరపాలని చెప్పారు. వచ్చే వారంలో అన్ని ప్రాంతాలకు వచ్చి పనులను పరిశీలిస్తానని అన్నారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయా శాఖల వారీగా గంటన్నర పాటు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, కాకినాడ ఆర్డీవోలు వి.విశ్వేశ్వరరావు, బాబూరావు, గణేష్‌కుమార్, రఘుబాబు, ఇరిగేషన్ ఎస్ఈ రాంబాబు, జెడ్పీ సీఈఓ పద్మ, డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అప్పారావు, ఆయా శాఖల డీఈఈలు, ఏఈలు, ఏపీడీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘చెత్త నుంచి సంపద’ తయారీ కేంద్రం పరిశీలన కుందాలపల్లి (పి.గన్నవరం) : స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘చెత్త నుంచి సంపద’ తయారీ కేంద్రం జిల్లాకు ఆదర్శంగా నిలవడంతో, దీనిని కలెక్టర్ కార్తీకేయ మిశ్రా శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో సేకరించిన చెత్త ద్వారా ఎరువు తయారు చేసే విధానం, దీని మార్కెటింగ్ తదితర అంశాలను ఆయన ఎంపీడీఓ ఎం.ప్రభాకరరావును అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రం నిర్వాహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దీని ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించారు. కుందాలపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉండటంతో కలెక్టర్ మిశ్రా ఆరా తీశారు. ఈ రోడ్డును జిల్లా పరిషత్ నుంచి ఆర్అండ్బీ శాఖకు బదలాయించామని, రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నాయకుడు పప్పుల గణేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు నరేంద్రపురంలో రూ.32 లక్షలతో చేపట్టిన తాగునీటి చెరువు పూడిక తీత పనులను కలెక్టర్ పరిశీలించారు. అమలాపురం ఆర్డీఓ కె.గణేష్ కుమార్, తహసీల్దార్ డి.సునీల్‌బాబు, ఉపాధి హామీ పథకం ఏపీఓ ఎం.రెడ్డిబాబు, పీఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు. -
200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి..
-
200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి..
మరోసారి తడబడిన మంత్రి లోకేశ్ అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు మాట తడబడడం ఆనవాయితీగా మారింది. గురువారం అనంతపురంలో జరిగిన ‘నీరు– ప్రగతి ఉద్యమం’ సమావేశంలో ఆయన మరోసారి ఇలానే వ్యవహరించారు. రాష్ట్రంలో ఉన్నది 175 అసెంబ్లీ స్థానాలయితే.. 2019 ఎన్నికల్లో 200 స్థానాల్లో పార్టీని గెలిపించాలనడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. సమావేశంలో విద్యార్థులు, నీటి వినియోగ సంఘాల అధ్యక్షులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ...‘చివరగా మీకు ఒక మాట చెబుతున్నా. మనం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలి. 2019 ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. భారీ మెజార్టీ అంటే మామూలుగా కాదు. 200 స్థానాలు గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్న విషయం కూడా లోకేశ్‌కు తెలియదా అంటూ అక్కడున్న వారు చర్చించుకోవడం కనిపించింది. -
మూడు నెలల్లో హంద్రీ–నీవా విస్తరణ: సీఎం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘హంద్రీ–నీవా కాలువ ద్వారా ప్రస్తుతం 2,080 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాలువను వెడల్పు చేయాలని నిర్ణయిం చాం. మూడు నెలల్లోగా పూర్తి చేసి 3,800 క్యూసెక్కులు తీసుకొస్తాం. తర్వాత లైనింగ్ పూర్తి చేసి 5,000 క్యూసెక్కులు తెస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘నీరు–ప్రగతి’ రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గురువారం అనంతపురం జిల్లాలో పామిడి పట్టణంలో ప్రారంభించారు. తర్వాత అనంతపురంలో విద్యార్థులు, నీటిసంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రెండు సభల్లో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబుకు ప్రధాని శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు 68వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
2018 నాటికి పోలవరం నుంచి నీరు
విజయవాడ: 2018 నాటికి గ్రావిటీ సాయంతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఉదయం నిర్వహించిన నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి ఎట్టిపరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టును నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నారన్నారు. -
చెరువు పూడికతీత అక్రమాలతో కోట్లకి కోట్లే..
-
మట్టి హాంఫట్!
► నీరు–చెట్టు పనుల పేరుతో దోపిడీ ► ప్రతిరోజూ 400 ట్రిప్పులు అమ్మకం ► నాలుగు మాసాలుగా ఇదే తంతు ► చెరువునే చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు నీరు–చెట్టు పనులు అధికార పార్టీ నాయకులకు కల్పతరువుగా మారాయి. వర్క్ అలాట్మెంట్ కాకపోయినా ఈ పనుల పేరు చెప్పి చెరువులు, వంకలు, వాగుల్లోని మట్టిని కొల్ల గొడుతున్నారు. ట్రిప్పునకు రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముకుంటూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కడప చుట్టుపక్కల 4 మాసాలుగా ఈ దందా సాగుతున్నా ఇరిగేషన్ అధికారులుగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు తొంగి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప కార్పొరేషన్: నీరు–చెట్టు పనులు కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పనులు చేపట్టే విషయంలో తెలుగు తమ్ముళ్లు ధనార్జనే ధ్యేయంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. నిబంధలనల ప్రకారం నీరు–చెట్టు కింద పూడిపోయిన వంకలు, వాగులు, చెరువుల్లో పూడిక తీత, చెరువు నుంచి పొలాల్లోకి వున్న కాలువలను బాగుచేయడం వంటి పనులు చేయాలి. కానీ అవేవీ జిల్లాలో అమలు కావడం లేదు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని పుట్లపల్లి చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉంది. పంటలు కోసిన తర్వాత ఈ మట్టిని పొలాల్లోకి తోలి భూసారాన్ని పెంచితే రైతులకు ఉపయోగముంటుంది. అలాకాని పక్షంలో చెరువు కట్టను బలోపేతం చేసేందుకు ఈ మట్టిని వినియోగించాలి. అంతిమంగా ఈ పనుల వల్ల రైతులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ పథకం అమలు మాత్రం తమ్ముళ్లకు ఆర్జించిపెట్టడమే పరమావధిగా ముందుకు సాగుతోంది. పుట్లపల్లి చెరువులో సాగుతున్న నీరు–చెట్టు పనులే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో నాలుగు మాసాలుగా ఈ మట్టి దందా సాగుతోంది. కేవలం రూ.10 లక్షల వర్క్‌ను ఇలా నెలల తరబడి చేస్తూ మట్టిని కొల్లగొడుతున్నట్లు సమచారం. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుకు దాదాపు 400 ట్రిప్పుల వరకూ తోలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన 4నెలలకు రూ.2కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తోంది. వర్క్ అలాట్మెంట్ అయిన చోట కాకుండా చెరువు మధ్యలోని మట్టిని జేసీబీతో తోడుతూ ప్రయివేటు సంస్థలకు, ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు కంటే కొసరే ఎక్కువ: అసలు కంటే కొసరే ఎక్కువన్నట్లు ఇక్కడ పని మంజూరైంది రూ.10లక్షలైతే, మట్టిని అమ్ముకోవడం ద్వారా ఇరవై రెట్లు అధికంగా ఆర్జించినట్లు సమాచారం. చెరువులో, కాలువల్లో ఉన్న నల్లమట్టిని తీయాల్సి ఉండగా, సారవంతమైన ఎర్రమట్టిని తీస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలతో చేపట్టిన ఈ పనులు నాలుగునెలల పాటు సుదీర్ఘ కాలం సాగుతుండటంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు సుమారు రూ.1.60లక్షల వరకూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. దీని వెనుక అధికారపార్టీ ముఖ్యనేత ఉండటం వల్లే యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖలోని ఈఈ స్థాయి అధికారి దీనికి పూర్తి అండదండలు అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త కలెక్టరేట్‌కు ఈ చెరువు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఈ దందాను అడ్డుకోలేని స్థితిలో ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పేరు చెప్పి చెరువులో ఇష్టానుసారం గోతు లు తవ్వుతున్నారు. భవిష్యత్‌లో ఈ గోతు లు పెను అనర్థాలకు దారితీసే అస్కారం ఉందని పుట్లంపల్లె గ్రామస్తులు సైతం వాపోతున్నారు. గతంలో కూడా గుంతలున్నాయనే విషయం తెలియక ఈత సరదాతో పసిప్రాణాలు గాల్లో కలిసిన దాఖలాలున్నాయి. సమాజానికి ఎటుచూసినా అనర్థదాయకంగా మారనున్న ఈ వ్యవహారాన్ని తక్షణమే కట్టడి చేయాల్సి ఉంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం: నీరు–చెట్టు పనులకు వర్క్ మంజూరైంది. మొత్తం రూ.5లక్షలు విలువైన చేయాల్సి ఉంది. అయితే చెరువులోని మట్టిని అమ్ముకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలిస్తాం. మట్టి అమ్ముకున్నట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటాం. మురళీకృష్ణ, డీఈ, మైనర్ ఇరిగేషన్‌శాఖ కడప. -
పనులన్నీ కనికట్టు.. నిధులు కొల్లగొట్టు
- ‘నీరు-చెట్టు’ పనుల్లో అంతులేని అక్రమాలు - పనులు చేయకున్నా రికార్డుల్లో నమోదు - నిధులను పంచుకుతిన్న ‘తమ్ముళ్లు’ - సహకరించిన జలవనరుల శాఖ అధికారులు - రాయదుర్గం నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి ‘నీరు-చెట్టు’ కార్యక్రమం కింద పనులు చేయకున్నా.. చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి నిధులు కొల్లగొట్టారు. మరికొన్ని పనులను నాసిరకంగా చేపట్టి..భారీగా సొమ్ము చేసుకున్నారు. స్వయాన ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇలా జరగడంపై విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ, నీటి సంఘాల సభ్యులు కలిసి సాగించిన ఈ అవినీతి బాగోతానికి జల వనరుల శాఖ అధికారులు కూడా సహకరించారు. రాయదుర్గం : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘నీరు- చెట్టు’ కార్యక్రమం కొందరికి కల్పతరువుగా మారింది. ఈ కార్యక్రమం కింద చెరువుల్లో పూడికతీత, చెరువు మట్టిని చిన్న, సన్న కారు రైతుల పొలాలకు తరలించడం, వర్షపు నీరు వృథా కాకుండా చెరువులు, కుంటలకు మళ్లించేందుకు వాగులు, వంకల తవ్వకాలు, జంగిల్ క్లియరెన్స్ తదితర పనులకు అనుమతిచ్చారు. అయితే..రాయదుర్గం నియోజకవర్గంలో చేయని పనులను కూడా చేసినట్లు రికార్డులు సృష్టించారు. వంతపాడిన అధికారులకు కమీషన్లు ముట్టజెప్పి.. అధికారపార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ, నీటిసంఘాల సభ్యులు వాటాలు వేసుకుని స్వాహా చేశారు. నియోజకవర్గంలో జలవనరుల శాఖ ద్వారా నీరు- చెట్టు పథకానికి 2015 నుంచి 2016 డిసెంబర్ వరకు 323 పనులకు గాను రూ.19 కోట్ల 39 లక్షల 93 వేలు మంజూరు చేశారు. ఇందులో రాయదుర్గం మండలంతో పాటు పట్టణ పరిసరాల్లోని చెరువుల్లో పూడికతీత, మట్టి తరలింపు, వాగులు, వంకల మరమ్మతులకు 68 పనులకు గాను రూ.4,61,74,000, గుమ్మఘట్ట మండలంలో 57 పనులకు రూ.3,00,85,000, డి.హీరేహాళ్ మండలంలో 120 పనులకు రూ.7,41,08,000, బొమ్మనహాళ్ మండలంలో 22 పనులకు 1,33,14,000, కణేకల్లు మండలంలో 56 పనులకు గాను రూ.3,03,12,000 కేటాయించారు. నిబంధనలకు తిలోదకాలు మంజూరైన పనుల్లో ఏ ఒక్కటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయలేదన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. కనీసం 40 శాతం పనులు జరిగినా రైతులకు మేలు జరిగేది. తూతూ మంత్రంగా పనులు చేసి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకున్నారు. అధికారుల కమీషన్లు పోను మిగిలిన సొమ్మును స్థాయిని బట్టి వాటా వేసుకున్నారు. ఈ విధంగా దాదాపు రూ.12 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు అంచనా. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన పూర్తిస్థాయిలో చేయలేదు. జరిగిన పనుల గురించి వివరాలు చెప్పడానికి కూడా అధికారులు నసేమిరా అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కనీసం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల వివరాలు వెల్లడించడానికి కూడా అధికారులు సుముఖంగా లేరు. పక్కదారి పట్టించారిలా.. ఒకే పనికి రెండు బిల్లులు పెట్టడం, చేయని పనులనూ చేసినట్లు రికార్డుల్లో చూపడం తదితర మార్గాల ద్వారా నిధులు కాజేశారు. గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామం వద్దనున్న మారయ్య గారి వంక, తాటివంక, వడ్డుకుంట సర్వు(వాగు) నుంచి బీటీపీలోకి వెళుతున్న వంకలను మరమ్మతులు చేయడానికి రూ.9.80 లక్షలు కేటాయించారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. బిల్లులు కూడా కొంతవరకు చెల్లించారు. మిగిలిన మొత్తం నాలుగైదురోజుల్లో విడుదల కానున్నట్లు అధికారులే చెబుతున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పనులు పూర్తి కాలేదు. మారయ్య గారి వంక పనులు తూతూఽమంత్రంగా చేసి బీటీపీ చెరువుకు కలిపారు. మిగిలిన రెండు పనులు అర్ధాంతరంగా ఆపేశారు. కేపీ కుంట నుంచి బీటీపీకి వెళ్లే దారిలో కల్వర్టు వద్ద వడ్డుకుంటసర్వు పనులు ఎడమ వైపున పూర్తిగా జరగలేదు. కుడివైపున మాత్రం జరిగాయి. అలాగే తాటివంక ప్రారంభంలోను, చివర వడ్డుకుంట సర్వు వంకకు కల్వర్టు వద్ద కలిపే పనులు చేయలేదు. - డి.హీరేహాళ్ మండలం గొడిశలపల్లి మైనర్ ఇరిగేషన్ చెరువులో పూడికతీత, మట్టిని రైతుల పొలాలకు, ఇంటర్నల్ రోడ్ల గుంతలు పూడ్చడానికి, వృథాగా ఉన్న గుంతలను పూడ్చడానికి తరలించడం కోసం మొత్తం రూ.38.36 లక్షలు ఽకేటాయించారు. ఇందులో పూడికతీత మట్టిని రైతుల పొలాలకు తరలించడం కోసం రూ.8.60 లక్షలు, అదే మట్టితో ఇంటర్నల్ రోడ్ల గుంతలను పూడ్చడానికి రూ.9.80 లక్షలు ఖర్చు అయినట్లు చూపారు. వాస్తవమేమిటంటే కొంతమేర పనులు చేస్తుండగానే గత సంవత్సరం జూలైలో కురిసిన వర్షానికి చెరువు నిండింది. ఇదే కాంట్రాక్టర్‌కు కలిసొచ్చింది. పనులు పూర్తి చేసినట్లు చెప్పి రూ.18.40 లక్షలు బిల్లు చేసుకున్నారు. ఈ ఉదాహరణలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేయిస్తే మరెన్నో అవినీతి బాగోతాలు బహిర్గతమయ్యే అవకాశముందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. వివరాలు చెప్పేది లేదు చేసిన పనుల వివరాలు కావాలంటే చెబుతాం. కాంట్రాక్టర్ల వివరాలు మాత్రం మా దగ్గర లేవు. ఆ సమాచారం ధర్మవరం ఈఈని అడగాలి. చేసిన పనులపై వివరణ చెప్పేదిలేదు. చెప్పకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మీకు సమాచారం కావాలంటే ఎస్ఈని గానీ,ఈఈగానీ సంప్రదించండి. - కరీముల్లా, డీఈఈ, జలవనరుల శాఖ, రాయదుర్గం -
‘నీరు–చెట్టు’ పనుల తనిఖీ
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఈ దివాకర్ పొదలకూరు : మండలంలో నీరు–చెట్టు పథకం కింద ఒకటి, రెండు దశల్లో చేపట్టిన చెరువు పనులను ఇంజనీరింగ్ అధికారులు రికార్డు చేసిన ఎం–బుక్కుల ప్రకారం తనిఖీలు నిర్వహిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఈ దివాకర్ పేర్కొన్నారు. మండలంలోని విరువూరు, ఇనుకుర్తి, మర్రిపల్లి తదితర పది చెరువుల పనులను మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ ఇనుకుర్తి చెరువుకట్ట వద్ద విలేకర్లతో మాట్లాడుతూ మండలంలో 62 చెరువుల పనులకు సంబంధించి కట్టల పటిష్టత, తూముల నిర్మాణం, కాలువల్లో పూడిక తొలగింపు పనులు జరిగాయన్నారు. వీటిలో 55 పనులను ముందుగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. అయితే ఎం–బుక్కులు రికార్డు చేసిన తర్వాత జరిగిన పనులన్నింటిలో పది పనులను తిరిగి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. పొదలకూరు మండలంలో జరిగిన నీరు–చెట్టు పనులపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విజిలెన్స్‌శాఖ ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు తనిఖీలకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇనుకుర్తి చెరువు కట్ట గండిని పూడ్చేందుకు తొలిదశలో సాంకేతిక మంజూరు కింద రూ.29 లక్షలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో కాంట్రాక్టర్ 36 శాతం లెస్‌కు పనులను దక్కించుకున్నట్లు తెలిపారు. అధికారులు రూ.20 లక్షలకే బిల్లులు చేయాల్సి ఉంటుందని, కాంట్రాక్టర్ రూ.29 లక్షల మేరకు పనులను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. రెండో దశలో మిగిలిన కట్ట పటిష్టతకు వేరుగా నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు కట్టపై పై లేయర్ నిబంధనల ప్రకారం గ్రావెల్ తోలినది లేనిది పరిశీలించారు. విజిలెన్స్ అధికారుల వెంట ఏఈ బాలకోటయ్య, ఇరిగేషన్ డీఈ హర్సంగ్, ఏఈ కరిముల్లా ఉన్నారు. -
‘నీరు–చెట్టు’ నేతలకు దోచిపెట్టు
అధికారపార్టీ నేతలకు కాసులు కురిపిస్తున్న పథకం వంకల్లో, వాగుల్లో ఇష్టారాజ్యంగా పనులు పాత పనులకు కొత్త సోకులు పథకం: నీరు–చెట్టు జిల్లా: అనంతపురం మంజూరైన పనులు:1,882 తీయాల్సిన పూడికతీత:–3,90,379 క్యూబిక్ మీటర్లు పరిపాలన అనుమతి : రూ.12,806 లక్షలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నీరు–చెట్టు’ లక్ష్యం ఒకటైతే పాలకులు లక్ష్యాన్ని అలక్ష్యం చేస్తూ నిధులు దోచుకునేందుకు వినియోగించుకుంటున్నారు. చెరువులు, వంకలను అభివద్ధి చేసి, భూగర్భజలాలను పెంపొందింపజేసేందుకు ప్రభుత్వం ‘నీరు–చెట్టు’ ప్రవేశపెట్టింది. కానీ ఆచరణలో టీడీపీ నాయకులకు కాసుల పంటగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పథకం కాస్త మరో పనికి ఆహార పథకంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. నీరు– చెట్టు కార్యక్రమం కింద ఇటీవల చెరువులు, కుంటల్లో పూడిక తీత పనులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,882 పనులకు గాను ప్రభుత్వం రూ. 12,806 లక్షలు మంజూరు చేసింది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాత గుంతలను చదును చేసి, కొత్త గుంతలుగా మెరుగులు దిద్దుతున్నారు. నీరు– చెట్టు కింద జరుగుతున్న పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వల్ల భూగర్భ జలాలు వద్ధి చెంది, బోరుబావుల్లో నీరు ఉబికి వస్తుందని రైతులు భావించారు. అయితే రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం టీడీపీ కార్యకర్తల లబ్ధికోసమే ఈ పనులు అన్నట్లుగా ‘పథకం’ అమలవుతోంది. పాత గుంతలను చదును చేసి, కొత్తగా తవ్వినట్లు రికార్డులు సష్టించి బిల్లులు స్వాహా చేస్తున్నారు. ధర్మవరం మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ధర్మవరం మండల పరిధిలోని సుబ్బరావుపేట పంచాయతీకి–2, నేలకోట–7, చిగిచెర్ల–29, కుణుతూరు–19, ఏలుకుంట్ల–8, గొట్లూరు–22, రావులచెరువు–14, మల్లాకాల్వ–9, రేగాటిపల్లి–2, దర్శినమల–15, పోతులనాగేపల్లి–16, తుమ్మలలో–4 పనులు చేపడుతున్నారు. మొత్తం మండల వ్యాప్తంగా ఉన్న 147 పనులకు గాను రూ. 887.39 లక్షలకు పరిపాలనా అనుమతులు లభించాయి. వీటిలో అధిక శాతం పనులను టీడీపీ మండల నేత ఒకరు గుడ్‌విల్ ఇచ్చి కొనుగోలు చేశారు. ఫైనాన్స్ పర్సన్‌గా గుర్తింపు పొందిన ఆయన పని ప్రారంభించే ముందు గుడ్ విల్ ఇస్తుండడం, గత ప్రభుత్వ హయాంలో సదరు నేతను పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారన్న సానుభూతితో పనులన్నీ ఆయనొక్కడే ఇష్టారాజ్యంగా చేస్తున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలు టీడీపీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. ‘గుడ్‌విల్ ఇంత.. అధికారులకు కొంత’ అన్న రీతిలో ధర్మవరంలో 40 శాతానికి పైగా పనులు ఆయనే చేస్తున్నాడు. ఇదిగో సాక్ష్యం ఫొటో: 23డిఎంఎం 01 – ఈ ఫొటోలో కనిపిస్తున్నది ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లి చెరువులో పూడిక తీసిన ప్రాంతం. సమీపంలోనేlఉన్న నేషనల్ హైవే వేసేటప్పుడు ఇక్కడి నుంచి మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి తరలించారు. అప్పుడు పడిన గుంతలను తమకు అనుకూలంగా మార్చుకొని, నీరు–చెట్టు పథకం కింద నిధులు కాజేసేందుకు చేసిన సోకులివి. ఈ పని చేసేందుకు ప్రభుత్వం రూ.7.45 లక్షలు, ఇదే చెరువులో మరో ప్రాంతంలో పూడిక తీసేందుకు రూ. 4.85 లక్షలు మొత్తం రూ.12.20 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ చెరువు పూడిక తీత పనులు కామిరెడ్డిపల్లికి చెందిన అధికార పార్టీ నేతలకు అప్పగించారు. అయితే ఆ పనులను ధర్మవరం మండల కీలక నేత,S సర్పంచ్‌గా టీడీపీ పోటీ చేసి ఓడిపోయిన ఆయన గుడ్‌విల్ కింద తీసుకుని పనులు చేశాడు. సదరు నేత ఆ పనులకు కేటాయించిన నిధుల్లో 30 శాతం కూడా ఖర్చు చేయలేదు. క్యూబిక్ మీటర్‌కు ఎంత ఇస్తారంటే... చెరువులు, కుంటల్లో తీసిన మట్టికి క్యూబిక్ మీటర్‌కు రూ.24 నుంచి రూ.29లు చెల్లిస్తారు. అదే జంగిల్ క్లియరెన్స్‌తో(ముళ్ల పొదలను తొలగించి మట్టిని తీస్తే) అయితే రూ. 41 చెల్లిస్తారు. తీసిన మట్టిని కిలో మీటర్ లోపు ట్రాక్టర్‌తో తోలితే రూ.85, రెండు కిలో మీటర్ల దూరం అయితే 93, అలాగే మూడు కిలో మీటర్లు ఆపై ఎంత దూరం వున్నా రూ.105 ప్రభుత్వం చెల్లిస్తుంది. మట్టిని ఎక్కడికి తీసుకురావాలంటే అధికారులు సూచించిన మేరకు (ఎస్టిమేట్ ఆధారంగా) మట్టిని వేయాలి. గ్రామాల్లోని గుంతలు పడిన రహదారికి లేదా గ్రామాల్లో ఉన్న ప్రమాదభరితంగా ఉన్న పాడుబడిన బావులు, రైతుల పొలాలకు మట్టిని తోలాల్సి ఉంది. అదే విధంగా చెక్ డ్యాంలలో అయితే గట్టుపైకి మట్టిని వేయాలి. కేవలం డ్యాంలో మధ్య భాగాన వున్న మట్టిని మాత్రమే వాహనాల ద్వారా తోలాల్సి ఉంటుంది. బాగున్న రహదారులకు చౌడుమట్టి తరలింపు : గ్రామాల్లో ఇది వరకు బాగా ఉన్న మట్టిరోడ్లకు చౌడుమట్టి, బంకమట్టి, రాళ్లతో కూడిన మట్టిని తోలుతున్నారు. దీంతో రహదారులు పాడవుతున్నాయి. ఇలాంటి మట్టిని వద్దన్నా గ్రామాల్లోని కాలనీలో తోలుతుండడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక వాహన దారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అధికారులు మట్టిని తోలమని ఆదేశించకున్నా బిల్లుల కోసం మట్టిని తోలుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ :– ఈ పథకం అమలను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఒక్కో అధికారి పరిధి కిందకు అధిక సంఖ్యలో పనులు రావడం, ఇరిగేషన్ శాఖలో ఉన్న అధిక ఖాళీలు టీడీపీ నాయకుల దోపిడీకి మార్గం సుగమమవుతోంది. -
కలెక్టర్‌పై టీడీపీ నేతల కన్నెర్ర
తమ సిఫారసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం నీరు- చెట్టు అవినీతిపై విచారణకు ఆదేశించడం జీర్ణించుకోలేకపోతున్న నేతలు ఇలాగైతే జిల్లాలో పార్టీని నడపలేమని సీఎంకు విన్నపాలు సమస్య పరిష్కరించాలని మంత్రికి సీఎం ఆదేశం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుపై టీడీపీ నేతలు కన్నెర్ర చేశారు. కలెక్టర్ తమ సిఫారసులు పట్టించుకోవడం లేదనీ, నీరు-చెట్టు పనుల మీద విచారణ చేస్తున్నారని వారు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ముత్యాలరాజుకు ప్రభుత్వం జూలైలో పదోన్నతి కల్పించి కలెక్టర్‌గా నియమించింది. జూలై 25వ తేదీ ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ శాఖాధిపతులను (హెచ్ఓడీ) పరుగులు తీస్తున్నారు. హెచ్ఓడీలు సరిగ్గా పనిచేస్తే కింది స్థాయి ఉద్యోగులు బాగా పనిచేస్తారనే సూత్రంతో ముందుకు పోతున్నారు. నెలరోజుల్లోపే జిల్లా పరిస్థితులు అవగాహన చేసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జిల్లాలో మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన పెండింగ్ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. దగదర్తి విమానాశ్రయం భూసేకరణ వ్యవహారంలో కొందరు దళారులు, అధికార పార్టీ నేతలు భూ యజమానుల వివరాలు గల్లంతు చేసి తమకు కావాల్సిన వారి పేర్లు చేర్చే ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ కఠినంగా వ్యవహరించడంతో కింది స్థాయి అధికారులు కలెక్టర్ ఊరుకోరు అని చెప్పి అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల నుంచి తప్పించుకోగలుతుతున్నారు. వెబ్ ల్యాండ్ వ్యవహారంలో జిల్లాలోని విడవలూరు,కోట,ఉదయగిరి, కొడవలూరు, కోవూరు, రాపూరు మండలాల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతిపై కలెక్టర్ గట్టిగా స్పందించారు. అటవీ, ప్రభుత్వ, డీకేటీ, ప్రైవేట్ భూములను సైతం ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీద వన్‌బీలో ఎక్కించిన అవినీతి కట్టడికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మండల తహశసీల్దార్ కార్యా లయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లందరినీ ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్‌కు బదిలీ చేశారు. ఈ నిర్ణయం అమలు జరిగిన వెంటనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక నాయకుడు కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీలు ఉపసంహరించుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. నిర్ణయం అమలు జరిగిపోనందువల్ల దాన్ని వెనక్కు తీసుకోవడానికి కలెక్టర్ ఇష్టపడలేదు. దీంతో సదరు నాయకుడు ఆయన మీద ఆగ్రహించారని తెలిసింది. నీరు-చెట్టు అవినీతిపై విచారణ రెండున్నరేళ్లలో జిల్లాలో సుమారు రూ.350 కోట్ల విలువైన నీరు- చెట్టు పనులు జరిగాయి. ఇందులో గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో నిధుల కుంభకోణం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే, టీడీపీ నేతలు, నీటిపారుల శాఖ అధికారులు కలిసి పనులు చేయకుండానే ఎంబుక్కులు రాసి నిధులు దిగమింగారని అధికార పార్టీ నాయకులే కోర్టు కెక్కారు. ఈ కుంభకోణంలో అధికారులు 30 శాతం, అధి కార పార్టీ నాయకులు 70 శాతం తినేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఇందులో కొన్ని విషయాలు బయటపడ్డాయి. దీంతో పాటు సర్వేపల్లి, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్,గూడూరు నియోజకవర్గాల్లో సైతం నీరు- చెట్టు పనుల్లో భారీ అవినీతి జరిగిం దని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ఆయన ఈ పనులన్నింటి మీద విచారణ జరిపించడానికి అధికారులను నియ మించారు. ఇదే సందర్భంలో రూ.70 కోట్లకు సంబంధించి పంపిన కొత్త పనుల ప్రతిపాదనలను కలెక్టర్ తిప్పి కొట్టారు. ఈ నిర్ణయాల మీద జిల్లా టీడీపీ నేతలకు చెప్పరాని కోపం వచ్చింది. పనులు చేసింది తమ పార్టీ వారే అయినప్పుడు వాటి మీద విచారణ ఎలా జరిపిస్తారనీ, కొత్త పనులకు ఆమోదం ఇవ్వకుండా వెనక్కు ఎలా పంపుతారని ఆ నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ విషయం నేరుగా కలెక్టర్‌తో మాట్లాడకుండా మంత్రి నారాయణ, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఇలాగే ఉంటే జిల్లాలో తాము పనిచేయలేమనీ,పార్టీని కూడా నడపలేమని కొందరు నాయకులు ఇటీవల సీఎంకు గట్టిగా చెప్పారని సమాచారం.అరుుతే ఈపీడీసీఎల్‌లో ముత్యాలరాజు అమలు చేసిన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వడం, మూడు నెలలు తిరక్కుండానే కలెక్టర్ మీద ఒత్తిడి పెంచడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోననే భయంతో సీఎం ఈ ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి వారి మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రి నారాయణకు సూచించారని తెలిసింది. -
నగరపాలక సంస్థ సమావేశంలో రసాభాస
చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరపాలక సంస్థ సమావేశం శనివారం నగరపాలక సంస్థ సమావేశంలో రసాభాసగా మారింది. నీరు-చెట్టు నిధులను పక్కదారి పట్టించారంటూ టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ కార్పొరేటర్లకు సర్ధి చెప్పేందుకు నగర మేయర్ యత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లు సీకే వర్గంతో కలిసి వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. -
వారి ధనదాహం.. వీరికి శాపం
* తెలుగు తమ్ముళ్ల అత్యాశే చిన్నారుల మృతికి కారణం చిలకలూరిపేట టౌన్: తెలుగు తమ్ముళ్ల మితిమీరిన ధనదాహం ఇద్దరు చిన్నారుల మృతికి కారణ మైంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిందే తడవుగా చెరువుల అభివృద్ధి పేరు మాటున అధికార పార్టీ నాయకులు జేబులు నింపే నీరు–చెట్టు పథకానికి తెరతీశారు. నిబంధనలకు నీళ్లు వదులుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఈ వ్యవహారం చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ యథేచ్ఛగా కొనసాగింది. ఏ చెరువును ఎంతమేరకు తవ్వాలనే నియమాలేవీ పాటించకుండా ఎంత మట్టి తవ్వాం, జేబులు ఎంత నిండాయనే రీతిగా ఈ తతంగం కొనసాగింది. ఒకసారి తవ్విన చెరువునే రెండోసారి తవ్వడం, మట్టివిక్రయాలు చేయడం మండలంలోని మైదవోలు గ్రామ సమీపంలో 56 ఎకరాలలో విస్తరించి ఉన్న సీతమ్మ చెరువులో జరిగింది. ఈ అడ్డగోలు తతంగం చివరకు ఇద్దరు చిన్నారుల మృతికి కారణమై రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం బడినుంచి వచ్చిన చిన్నారులు ధర్నాసి ప్రహర్షిత (6), జొన్నలగడ్డ సరస్వతి (7) చెరువు కట్టపై ఆడుకుంటూ జారిపడి నీటిలో మునిగి మృతి చెందారు. కలకలం రేపిన విషాదం.. సీతమ్మ చెరువును గత ఏడాది వేసవిలో నీరు–చెట్టు పథకం ద్వారా తవ్వకాలు జరిపారు. వర్షాలు లేకపోవడం, చెరువులో నీరు చేరక పోవడంతో తిరిగి ఈ ఏడాది వేసవిలో చెరువులో మరోమారు తవ్వకాలు నిర్వహించారు. ఒకసారి తవ్విన చెరువును రెండోసారి తవ్వకాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేది జగమెరిగిన సత్యం. కేవలం ధనదాహంతో మట్టివిక్రయాలు చే సేందుకే తవ్వకాలు జరిగాయనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడం ఇటీవల కురిసిన వర్షాలతో కొంతమేరకు మాత్రమే చెరువులో నీళ్లు చేరాయి. స్వయానా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో సుమారు 50 చెరువులలో మట్టితవ్వకాలు జరిగాయి. వీటిలో చాలా చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతు తవ్వకాలు జరిగినట్టు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టినపుడు ముందు చెరువుగట్ల అభివృద్ధికి, గ్రామంలోని రైతుల పంటపొలాల మెరకకు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వంటి అవసరాలకు ఉపయోగించాల్సి ఉంది. వీటన్నింటిని పక్కన పెట్టి మట్టివిక్రయాలకే ప్రాధాన్యం ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. యడ్లపాడు మండలంతో పాటు నియోజకవర్గంలోని నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల్లోని పలు చెరువులను ప్రమాదకర స్థాయిలో లోతుగా తవ్వకాలు చేశారు. భారీ వర్షాలు కురిసి పూర్తిస్థాయిలో నీరుచేరితే ఈసారి ఇంకెన్ని కుటుంబాలకు ఇలా శాపంగా మారుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై యడ్లపాడు ఎంపీడీవో సీహెచ్ సువార్తను వివరణ కోరగా సీతమ్మ చెరువులో గత రెండేళ్లుగా నీరు–చెట్టు పథకం ద్వారా రెండుసార్లు తవ్వకాలు చే సినట్లు తెలిపారు. -
నీరు–చెట్టు గుట్టురట్టు
తమ్ముళ్ల మధ్య అసమ్మతి సెగ బిక్కుబిక్కుమంటున్న అధికారులు తొక్కిపెట్టేందుకు నాయకుల ప్రయత్నాలు ఇరిగేషన్‌శాఖలో నీరు – చెట్టు, ఓఅండ్ఎం, ఎఫ్డీఆర్, సీఈ మంజూరు చేసిన పనుల్లో జిల్లావ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవూరు నియోజకవర్గంలో పనులు చేయకుండా, అసలు అర్హతలు లేకుండానే చక్రం తిప్పిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలపై సాక్ష్యాలతో సహా ప్రజల్లోకి వెళ్లడంతో అటు అధికారుల్లో, ఇటు నాయకుల్లో గుబులు తారాస్థాయికి చేరుకుంది. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కోవూరు నియోజకవర్గంలో మలిదేవి డ్రెయిన్, విడవలూరు, కొడవలూరు పనులకు సంబంధించిన అవినీతిపై ఆ నియోజకవర్గ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. అర్హతలు లేకున్నా ఆయకట్టు కమిటీ చైర్మన్‌గా నియమించి వివిధ పనులకు అగ్రిమెంట్లు చేయించడం వెనుక రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్‌శాఖ అధికారుల పాత్ర ఉందని తేటతెల్లమైంది. అందుకు ఆ ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో ఇంతవరకు మిన్నకుండిపోయిన రైతులు ఆయన అనుచరుల అవినీతి తీగను లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పనులు చేయకుండానే బిల్లులు మొదటి విడత నీరు–చెట్టు నుంచే బినామీ పేర్లతోనూ, సొంతగా పనులు చేసి కోట్ల రూపాయలు స్వాహా చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకున్నారు. పనుల నాణ్యత పక్కనబెట్టి అసలు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్న చిట్టాను వెలుపల పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో అధికారులు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఎన్నడూ లేని«§విýlంగా పనుల పరిశీలనకు వెళ్లామని కార్యాలయంలో చెప్పి మరీ పనులకు గైర్హాజరవడం రైతులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు ఇరిగేషన్ కార్యాలయాల్లో సిబ్బంది నోరు మెదపడానికి ఇష్టపడడం లేదు. కోవూరు నియోజకవర్గంలో మొదటి విడత నీరు – చెట్టులో రూ.300 కోట్లతో 110 పనులు, రెండో విడతలో రూ.420 కోట్లతో 97 పనులు జరిగినట్లు అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయి. ఇరిగేషన్‌శాఖకు 30 శాతం, క్వాలిటీ కంట్రోల్‌కు 10 శాతం కమిషన్ల పర్సంటేజ్‌లు పోగా మిగిలిన 60 శాతంలో సగానికిపైగా స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అనుచరులు సీహెచ్ కృష్ణచైతన్య, కె.అమరేంద్రనాథ్‌రెడ్డి, హరికృష్ణ, కె.హరనాథ్‌లు ప్రతి పనిలో భారీగా చేతివాటాలు చూపారని రైతులు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. ఇటీవల పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈకి సైతం భారీ స్థాయిలో ముడుపులు చెల్లించారని రైతులు చెబుతున్నారు. అందువల్లే ఆ నివేదిక ఇంతవరకు అధికారులకు అందలేదంటున్నారు. మూడవ విడతలోనూ.. ఒక్క అల్లూరులోనే వందకు పైగా పనులకు రూ.7 కోట్లతో ప్రతిపాదనలు రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లూరు చెరువు మరమ్మత్తులకు రూ.కోటి, పంట కాలువలకు రూ.50 లక్షలు చొప్పున నాలుగు పనులు, బట్ర కాగొల్లు చెరువుకు రూ.40లక్షలు, నార్త్‌ఆములూరు చెరువుకు రూ.40 లక్షలు, రామన్నపాళెం చెరువు రూ.1.50 కోట్లు, జువ్వలదిన్నె చెరువు రూ.1.50 కోట్లు ప్రతిపాదనలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్బలంతో పంపినట్లు తెలుస్తోంది. కోవూరు–30 పనులు, విడవలూరు–60 పనులు ఇలా జిల్లా మొత్తం మీద ఇచ్చిన నియోజకవర్గాలే మళ్లీమళ్లీ నీరు – చెట్టు పనులను కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం జిల్లావ్యాప్తంగా మరో 1500 పనులకు రూ.300 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ అవినీతికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టకపోవడం, అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం ఇందుకు ఊతమిస్తోంది. మొత్తం మీద రాజకీయ వ్యవస్థ, అధికారుల పనితీరు మారితే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
నిబంధనల మేరకు పనులు చేపట్టాలి
ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నీరు–చెట్లు పనులు నిబంధనలకు అనుగుణంగానే చేపట్టాలని ఇరిగేషన్ శాఖ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ వీ కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక హరనాథపురం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోని ఎస్ఈ చాంబర్లో ఈఈలు, డీఈలు, ఏఈలతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నీరు–చెట్టు పనులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు చెక్‌పెట్టి డిపార్ట్మెంట్ పరువును కాపాడాలని పలు సూచనలు చేశారు. మూడో విడత నీరు– చెట్టు పనులను ప్రారంభించకముందే రెండో విడత పనులను పూర్తి చేయాలన్నారు. మూడో విడత నీరు –చెట్టు పనులను పర్యవేక్షించేందుకు డ్వామా పీడీ హరితను కలెక్టర్ నియమిం చినట్లు తెలిపారు. ప్రత్యక్షంగా పనులు అవసరమున్న ప్రాంతాలను పరిశీలించి ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రణాళికల్లో తేడాలు వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. -
వారు చెబితే..ఓకే
ప్రభుత్వ పనుల్లో ముఖ్యనేత అనుచరుల హవా ముడుపులు ఇస్తేనే ముందుకు నీరు–చెట్టు పనుల్లో కన్వీనర్ ఆయకట్టు కనికట్టు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : విడవలూరు, కొడవలూరు మండలాల్లో ఏ పని కావాలన్నా వారి అనుగ్రహం ముందుగా పొందాలి. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వీరికి ముడుపులిస్తేనే ముందుకు సాగుతారు. వీరెవరో కాదు.. కోవూరు నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు! ప్రభుత్వపరంగా ఆదాయం వచ్చే పనులు ఏమున్నా ముందుగా వీరిని సంప్రదించాలి. నీరు–చెట్టు, ఎఫ్డీఆర్, సీఈ మంజూర్లు, సీఎం రిలీఫ్ ఫండ్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లు.. ఇలా పథకం ఏదైనా వీటిని పొందాలంటే ముందుగా ఆయా వ్యక్తులు వీరికి డబ్బు చెల్లించాల్సిందే. ప్రధానంగా ఓ తెలుగు తమ్ముడి భార్య అకౌంట్లో ఐదు నుంచి పది వేలు పడాల్సిందే. మరీ ముఖ్యంగా నీరు–చెట్టు పనులకు ముడుపుల పోటు ఎక్కువైంది. ఈ పనులు మంజూరు అయిన అనంతరం 3 శాతం డబ్బులు చెల్లించి వాటిని చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే. ఈ విషయమై రైతులు ఎన్ని సార్లు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల దోపిడీ నీరు – చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదటి విడత నీరు – చెట్టుపై అప్పటి కలెక్టర్ జానకి విజిలెన్స్ ఎంక్వయిరీ చేశారు. రెండో విడత పనులపై రైతులు లోకాయుక్తను ఆశ్రయించారు. 60–40 శాతం వాటాలపై పెద్ద దుమారమే రేగింది. నీరు–చెట్టు పనుల్లో అవినీతిని అరికట్టడం వల్లకాక అధికారపార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. విడవలూరు మండలంలో సెంటు భూమి కూడా లేని సీహెచ్ కృష్ణచైతన్య అనే వ్యక్తిని పార్లపల్లి ఆయకట్టుదారు కమిటీ కన్వీనర్‌గా చేసి నీరు – చెట్టు పనులను మంజూరు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా విడవలూరు, కొడవలూరు జేఈ, బుచ్చిరెడ్డిపాళెం డీఈలు ఈయన పేరు మీద లక్షలాది రూపాయల పనులను మంజూరు చేశారని చెబుతున్నారు. మలిదేవి డ్రైన్లో పనులు మంజూరు చేసిన కాపీని చూపిస్తున్నారు. ఇంజనీర్లకు వత్తాసు.. నీరు–చెట్టు పనుల్లో తాము చెప్పినట్లు పనిచేసిన ఇంజనీర్లకు టీడీపీ ముఖ్య నేత వత్తాసు పలుకుతున్నారు. దీంతో జేఈ నుంచి డీఈ వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా పనుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఇంజనీర్లను బదిలీ చేస్తారని చెప్పిన అధికారపార్టీ నాయకులు తర్వాత మిన్నకుండి పోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఈ అవినీతిని అడ్డుకోవా లంటున్నారు. -
నీరు–చెట్టు.. పనులన్నీ తీసికట్టు
– హిందూపురం నియోజకవర్గంలో పనులన్నీ నాసిరకం – పైపూతలతో సరిపెట్టి రూ.లక్షలు కాజేసిన కాంట్రాక్టర్లు – అప్పుడే దెబ్బతిన్న కాలువలు, మరువలు హిందూపురం నియోజకవర్గంలో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లో నాణ్యత లోపించింది. పచ్చచొక్కాల నాయకులు కాంట్రాక్టర్ల అవతారమెత్తి లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు. ఆయకట్టుదారుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ పనులను కమీషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీంతో వారు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. అధికారులు కళ్లు మూసుకుని బిల్లులు చేసేస్తున్నారు. నాణ్యమైన మట్టి వేసి చెరువు కట్టలు పటిష్టం చేయాల్సి ఉండగా.. ఎరువు చల్లినట్లుగా మట్టి పోస్తున్నారు. కాలువలు, మరువలు, తూముల పనులను కూడా పైపూతలతో సరిపెడుతున్నారు. పదికాలాల పాటు రైతులకు ఉపయోగపడాల్సిన ఈ పనులను నాసిరకంగా చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గానికి నీరు–చెట్టు పథకం కింద రూ.6.88 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిని మూడు మండలాల పరిధిలోని 92 చిన్న, పెద్ద చెరువులతో పాటు కుంటల పునరుద్ధరణ, సప్లయ్ చానళ్లు, మట్టికట్టల అభివద్ధికి కేటాయించారు. ఈ పనులను ఆయా ఆయకట్టుదారుల సంఘాల ఆధ్వర్యంలో చేయాల్సి ఉంది. అయితే.. స్థానికంగా టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి కమీషన్ల కోసం పనులను మండలాల వారీగా పంపకాలు చేయించారు. పనులు పొందిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యతకు పూర్తిగా తిలోదకాలిచ్చారు. చేసిన పదిరోజులకే సిమెంట్ నిర్మాణాలు నెర్రెలు చీలాయి. – హిందూపురం మండలంలోని 34 చెరువులు, కాలువల అభివద్ధికి రూ.2.58 కోట్లు కేటాయించారు. మణేసముద్రం చెరువు వద్ద రూ.9.96 లక్షలతో పనులు చేశారు. పైపైన మట్టి తోలి వదిలేయడంతో చెరువుకట్టకు అప్పుడే పగుళ్లు ఏర్పడ్డాయి. మంచి వర్షం వస్తే కట్టపై చల్లిన మట్టి పూర్తిగా చెరువు కిందకు చేరిపోయే పరిస్థితి ఉంది. చెరువు మరువకు చేసిన సిమెంట్ పనులు కూడా నాసిరకంగా ఉన్నాయి. పెద్దగుడ్డంపల్లి వద్ద సప్లయ్ చానల్ ఉన్న కట్టడాన్ని తొలగించి కొత్తది కడుతున్నారు. ఈ పనుల్లో నాణ్యమైన కంకర, ఇసుక వాడటంలేదు. కాలువకు ఉన్న పాతరాళ్లను కాంట్రాక్టర్ తరలించుకుపోయినట్లు తెలిసింది. రూ.7.65 లక్షలతో చేపట్టిన కొట్నూరు చెరువు అభివద్ధి పనుల్లోనూ నాణ్యత డొల్లేనని తేలుతోంది. ఈ చెరువు కట్టపై వనమ్మ ఆలయం ఉంది. ఆలయం వెనుక విస్తరణ కోసం నిర్వాహకులు వేసిన మట్టిని కూడా చెరువు పనులకు వాడినట్లు ఆరోపణలున్నాయి. – లేపాక్షి మండలానికి రూ.2.25 కోట్లు కేటాయించారు. కల్లూరు చెరువు నుంచి సప్లయ్ చానళ్ల పనులన్నీ పూర్తి నాసిరకంగా తయారయ్యాయి. కాంక్రీట్ ఊడిపోయి రాళ్లు, మట్టి బయటకు తేలిపోయాయి. లేపాక్షి చిన్నచెరువుకు అనుబంధంగా నిర్మించిన సప్లయ్ చానల్ పనులు నెర్రెలు చీలాయి. నీరు ప్రవహిస్తే పగుళ్లనుంచి లీకయ్యే అవకాశముంది. – చిలమత్తూరు మండలానికి రూ.2.04 కోట్లు కేటాయించారు. కోడూరు చెరువుకట్ట పనిని యంత్రాలతో కాంట్రాక్టర్ పూర్తిచేశారు. చిలమత్తూరు చెరువు నుంచి ఉన్న సప్లయ్ చానల్‌తోపాటు కట్టకాలువ పనులను జేసీబీతో తూతూ మంత్రంగా చేపట్టారు. దీనికితోడు చెరువులో మట్టి పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. పనులు పరిశీలిస్తున్నాం – శైలేంద్ర, డీఈ, ఇరిగేషన్ పనులను పరిశీలిస్తున్నాం. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా తనిఖీ చేస్తున్నారు. ఆయకట్టుదారుల సంఘాల సభ్యులు కొందరు కొత్తవారు కావడంతో వారి బంధువుల సహకారం తీసుకుని పనులు చేసి ఉంటారు. నాణ్యత లేకపోతే బిల్లులో రికవరీ చేస్తాం. -
నీరూ–చెట్టు.. అదే కనికట్టు!
– నీరు–చెట్టులో అవినీతికి పాకులాట – పనులు చేపట్టిన చోటే తిరిగి పనులు – రూ.కోట్లలో నిధుల స్వాహా – శ్రుతిమించిన అధికార పార్టీ ఆగడాలు నీరూ–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము దిగమింగేందుకు అధికార పార్టీ నాయకులు మరోమారు రంగంలోకి దిగారు. చెరువుల్లో కొంత మేరకు నీరు తగ్గడంతో మళ్లీ నీరు–చెట్టు పనులు చేపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరం లేనిచోటా పనులు చేయించి అవినీతికి తెరలేపుతున్నారు. ఇదివరకు పనులు చేపట్టిన చోటే మళ్లీ చేసినట్లు చూపెట్టి రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. నిరాకరిస్తే »ñ దిరించడం, ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు తెచ్చి పనులను సృష్టించుకోవడం అటవాటుగా చేసుకుంటున్నారు. చిత్తూరు (అగ్రికల్చర్): భూగర్భ జలాల వృద్ధికి చేపడుతున్న నీరు–చెట్టు పనుల్లో అధికార పార్టీ నేతల అవినీతికి అంతులేకుండా పోతోంది. జిల్లాలో గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు దాదాపుగా చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో నీరు–చెట్టు కింద చేపట్టే చెరువుల్లో పూడికతీత, తూముల మరమ్మతులు, కరకట్టల పటిష్టత, చెరువుల సరిహద్దుల స్ట్రెంచింగ్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పనులు దాదాపుగా జిల్లావ్యాప్తంగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం వర్షాకాలం అయినప్పటికీ ఆశించిన మేరకు వర్షాలు కురవడంలేదు. జిల్లాలోని పలు చెరువుల్లో నీటి మట్టం చాలావరకు తగ్గిపోయింది. దీన్ని గమనించిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు మళ్లీ ఆశలు చిగురించాయి. నీటిమట్టం చాలావరకు తగ్గిపోయిన చెరువులు, ఎండిపోయిన సప్లై చానళ్లను గుర్తించారు. నీరు–చెట్టు పనులు చేపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదివరలోనే చేపట్టిన సప్లై చానళ్లు వర్షాలకు పూడిపోయాయని, వాటి స్థానంలో మరోమారు పనులు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను వేధించి పనులు చేయించుకుంటున్నారు. ఇందుకు ససేమిరా అన్నవారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు క్షేత్రస్థాయి అ«ధికారులు వాపోతున్నారు. హద్దులు పెట్టుకుని పంచుకుంటున్నారు నీరు–చెట్టు పనులను తెలుగుదేశం పార్టీ నాయకులు మండలాల పరిధిలో గ్రామాల వారీగా హద్దులు పెట్టుకుని పంచుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మొత్తం 1,700 పనులను చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతులిచ్చారు. అందులో ఇప్పటికి రూ.207 కోట్ల నిధులు వెచ్చించి 800 పనులను పూర్తిచేశారు. మరో 700 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన 200 పనులు ప్రార ంభానికి సిద్ధంగా ఉన్నాయి. అవినీతి జరుగుతున్నదిలా.. వర్షాభావంతో చిన్నపాటి చెరువులు, సప్లైచానళ్లు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు అలాంటి చెరువులు, సప్లైచానళ్లను ఎంచుకుంటున్నారు. చెరువుల కరకట్టలు బాగున్నా, దెబ్బతిన్నట్లు చూపి మరమ్మతు పనులను కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నామమాత్రంగా పనులుచేసి, వాటిని ఫోటోలు తీయించి అధిక మొత్తాల్లో బిల్లులు మంజూరు చేసుకుంటున్నారు. సప్లై చానళ్ల మరమ్మతు పనులు గతంలో చేపట్టినా lతిరిగి ఇటీవల వచ్చిన అధిక వర్షానికి దెబ్బతిందని చూపెట్టి, వాటినే మళ్లీ పునరుద్ధరించినట్లు బిల్లులు చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. చెక్‌డ్యామ్‌లు, తూముల మరమ్మతులు అంటూ బిల్లులు మంజూరు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నీరు–చెట్టు పనుల్లో రూ.10 లక్షలకు లోపు పనులను ఆయా గ్రామాల పరిధిలోని జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో చేపట్టే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న నాయకులు, కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతూ వచ్చిన మొత్తాలను పంచుకుంటున్నారని తెలిసింది. జిల్లాస్థాయి అధికారులు నీరు–చెట్టు పనులను పర్యవేక్షించి అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. -
నీరు– చెట్టు పేరుతో దోపిడీ
అర్బన్ ఎస్పీకి వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు గుంటూరు (పట్నంబజారు) : నీరు –చెట్టు పేరుతో అధికార పార్టీ నేతలు మట్టిని దోచుకుతింటూ వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ ధ్వజమెత్తారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ పంచాయతీలోని ఒక చెరువును అధికార పార్టీ నేతలు అక్రమంగా తవ్వుతున్నారని, దీనికి పెదకాకాని సీఐ ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి విన్నవించారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో పెదకాకాని సీఐ వచ్చి చెరువుపై ఉన్న మోటార్లను సర్వనాశనం చేశారని తెలిపారు. చెరువులో ఉన్న నీరు తాగేందుకు పనికిరాదనే నెపంతో సంబంధిత ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల నుంచి అనుమతులు తెచ్చుకుని అక్రమంగా తవ్వుతున్నారని రావి వెంకటరమణ ఆరోపించారు. పోలీసులు పాలకపార్టీ నేతలకు కొమ్ము కాస్తూ ఇదేమని ప్రశ్నించిన గ్రామస్తులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అక్రమ తవ్వకాలను ఆపాలని, లేని పక్షంలో ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఎస్పీనికలిసిన వారిలో వైనిగండ్ల గ్రామ సర్పంచ్ తులసిబాయి, వెఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనమా బాల వజ్రబాబు (డైమండ్), పెదకాకాని మండల పార్టీ నేతలు, గ్రామ ప్రజలు ఉన్నారు. -
నీరు–చెట్టు అవినీతిమయం
మూడో విడత నిధులు స్వాహాకు రంగం సిద్ధం పనులకు కలెక్టర్ వద్ద ప్రతిపాదనలు ‘నీరు– చెట్టు’.. పసుపు చొక్కాల జేబులు నింపే పథకంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల పనుల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఒకే పనిని నీరు–చెట్టు, ఉపాధి హామీ, ఎఫ్డీఆర్ పథకాలు కింద ఇలా.. అనేక మార్లు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడో విడత స్వాహాకు తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : జిల్లాలో మొదటి విడతలో రూ.76.04 కోట్లతో 2,402 పనులు జరిగినట్లు అధికారులు లెక్కల్లో చూపారు. రెండో విడతలోనూ రూ.249.33 కోట్లతో 2,487 పనులు చేసినట్లు రికార్డులు సృష్టించారు. అయితే ఈ పనుల్లో ఇరిగేషన్‌శాఖకు 30 శాతం పర్సంటేజ్‌లు, క్వాలిటీ కంట్రోల్‌కు, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కు కలిపి మరో 10 శాతం చెల్లించి అసలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయలను స్వాహా చేశారని రైతు సంఘాల నాయకులు లోకాయుక్తను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అదే పనులు.. మూడో విడత మొదటి రెండు విడతల్లో విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి, నాయుడుపేట డివిజన్ల్లోనే మళ్లీ పనులను అధిక సంఖ్యలో ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. నీరు –చెట్టు కింద చేసిన పనులను ఉపాధి హామీలో, ఎఫ్‌డీఆర్‌లో చూపి అంతటితో ఆగకుండా సీఈ మంజూరుతో పనులు చేసిన ఘనత తెలుగు తమ్ముళ్లకే దక్కుతుంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా మరో 1500 పనులకు రూ.300 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. వీటిపై ఎస్ఈ కోటేశ్వరరావును ఫోన్లో సంప్రదించగా ప్రస్తుతం మూడో విడత ప్రతిపాదనల అంశం, అధికారులపై క్రమశిక్షణ చర్యల విషయాలు కలెక్టర్ పరిశీలనలో ఉన్నాయని ముక్తాయించారు. కలెక్టర్ వద్ద ప్రతిపాదనల ఫైల్ ఇరిగేషన్ అధికారుల ప్రమేయం లేకుండానే అధికార పార్టీ నాయకుల వాటాల పంపిణీకి అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ముందుంచారు. అయితే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ముత్యాలరాజు విడతలు విడతలుగా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపినట్లు తెలుస్తోంది. సంబంధిత ప్రతిపాదనలను డ్వామా పీడీ హరిత స్వయంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తమ్ముళ్ల ఆధిప్యత్యంలో అధికారులు బలి? నీరు–చెట్టు పనుల కేటాయింపుల్లో తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో అధికారులు బలికానున్నారని తెలుస్తోంది. ఒక వర్గానికి మద్దతుగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు వేసేందకు మరో వర్గం ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే తమపై వేటు పడకముందే సెలవుపై వెళ్లాలని సంబంధిత అధికారులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
మెక్కింది కక్కిస్తా
- ‘నీరు–చెట్టు’ అంతా అవినీతి మయం - 30 శాతం ముడుపులు తీసుకొని పనులు మంజూరు - పనిచేయకుండానే బిల్లులు - జేసీబీలతో గుంతలు తీసి.. నేతలు కోట్లు కొల్లగొడుతున్నారు - నేను రంగంలోకి దిగుతా.. మీ అంతు తేలుస్తా.. - జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇరిగేషన్ అధికారులపై ఈదర ఫైర్ - అవినీతి నిరూపిస్తా..అధికారులను సస్పెండ్ చేస్తారా..అంటూ నిలదీత - అధికారుల తీరుపై విరుచుకుపడిన జెడ్పీ చైర్మన్ ఒంగోలు: ‘మీరు విచక్షణారహితంగా అవినీతి చేశారు.. నేను నిరూపిస్తా! మీ అధికారులను సస్పెండ్ చేస్తారా? 30 శాతం డబ్బులు రుచిమరిగి మీ కళ్లు నెత్తికెక్కాయి’ అంటూ ఇరిగేషన్ ఎస్ఈ శారదపై జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మండిపడ్డారు. నీరు–చెట్టు పనుల్లో జరుగుతున్న అవినీతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఒంగోలులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఇరిగేషన్ పనులను సమీక్షించారు. ప్రభుత్వం మంచి జరగాలని నిధులిస్తే.. అధికారులు, నాయకులు కలిసి అవినీతికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వామాలోనూ అవినీతికి అంతే లేకుండాపోయిందని ధ్వజమెత్తారు. అవినీతిని అరికట్టేందుకు మీ దగ్గర ఎలాంటి పద్ధతి లేదా.. అంటూ డ్వామా పీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగులు క్లీన్ చేసి నీటిని సముద్రం పాలు చేస్తున్నారు తప్ప చెక్‌డ్యామ్‌లను నిర్మించి నీటిని నిల్వ చేసే ప్రయత్నం చేయటం లేదన్నారు. సర్పంచ్ హక్కులు ఉంటాయి.. పంచాయతీ సర్పంచులతో పాటు ప్రజాప్రతినిధులకు సమస్యలపై వినతిపత్రాలు తీసుకొనే అధికారం లేదని డీఎల్పీవో ఇచ్చిన ఉత్తర్వులను.. జిల్లా పంచాయతీ అధికారి బలపరచడాన్ని నాగులుప్పలపాడు ఎంపీపీ వీరయ్యచౌదరి సభ దృష్టికి తెచ్చారు. అలా ఆదేశాలివ్వడం సరికాదని తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని చైర్మన్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. 30 శాతం మ్యాచింగ్ గ్రాంటుతో ఉపాధి హామీ పథకం సిమెంట్ రోడ్లే వేయాలని అధికారులు ఆదేశించడాన్ని తప్పుబట్టారు. సర్పంచ్ హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. మత్స్యకారులు దరఖాస్తు చేసుకోండి మత్స్యశాఖ పరిధిలో రూ. 5 కోట్ల నిధులున్నాయని, వేటకు సంబంధించిన సబ్సిడీ పరికరాల కోసం మత్స్యకారులు దరఖాస్తులు చేసుకోవాలని చైర్మన్ సూచించారు. సమావేశాలకు అధికారులు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ లైన్ల ఏర్పాటు సమయంలో రైతులు కోల్పోతున్న భూమికి పరిహారం చెల్లించడం లేదని మార్కాపురం ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తెచ్చారు. ఆర్‌డబ్లూ్యఎస్ పరిధిలో అక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని అసలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయల బిల్లులు స్వాహా చేశారని జెడ్పీ చైర్మన్.. ఆర్‌డబ్లూ్యఎస్ అధికారులపై విరుచుకుపడ్డారు.కొమరోలు ప్రాంతంలో గతంలో రూ. 70 లక్షలతో వేసిన పైప్‌లైన్ నీరు వదలకుండానే కనిపించకుండాపోయిందని దీనిపై విజిలెన్స్ విచారణ చేయించాలని ఆదేశించారు. సాగర్ జలాలతో నోటిఫైడ్ ట్యాంకులతో పాటు అన్ని ట్యాంకులను ముందు నీటిని నింపాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని జెడ్పీ తీర్మానం ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని సభ తీర్మానించింది. మాచవరం, మోపాడు చెరువు కాలువ పనులు నాలుగు సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తెచ్చారు. త్వరితగతిన పూర్తి చేయిస్తామని ఎస్ఈ శారద హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేయండి – మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పొదిలిలో ఎన్ఎస్పీ వాటర్ రావటం లేదని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. ఎన్ఎస్పీ కాలువలకు గండ్లు కొట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను అధికారులు చిత్తశుద్ధితో పూర్తి చేయటం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెలిగొండకు నీళ్లిస్తామంటూ మాటలతో సరిపెడుతున్నారని విమర్శించారు. భూసేకరణ, పునరావాసం పూర్తి కాకుండానే పనులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. జిల్లా ప్రజల దాహార్తి తీర్చండి – సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ జిల్లాలో సర్పంచుల హక్కులకు భంగం వాటిల్లుతోందని, తక్షణం సర్పంచులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పం చాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులకు పూర్తి అధికారాలున్నాయని.. అయితే అధికార పార్టీ ఒత్తిడులతో అధికారులు సర్పంచుల హక్కులకు భంగం కలిగిస్తున్నారన్నారు. జిల్లాలో వైద్యారోగ్యశాఖ ప్రజారోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. పూర్తయిన ఆస్పత్రి భవనాలను ఎవరికోసమో ప్రారంభించకపోవడం దారుణమని చెప్పారు. ఎన్ఎస్పీ పరిధిలో నోటిఫైడ్, నాన్‌నోటిఫైడ్ ట్యాంకులను తక్షణం నీటితో నింపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
దోచుకోవడానికే పనులు!
అవసరం లేని కాలువకు పనులు అస్తవ్యస్తంగా తవ్వకాలు లెవెల్స్ లేవంటున్న స్థానికులు రూ.3.20 లక్షలతో నీరు–చెట్టు కింద నిధులు మంజూరు నీరు–చెట్టు.. తెలుగు తమ్ముళ్లు, అధికారులు దోచుకోనే పథకంగా మారింది. అవసరం లేకపోయిన నిధులు మంజూరు చేసి పనులు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అయినా చేసే పనుల్లో ఎక్కడా నాణ్యత.. సవ్యత ఉండటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పొదలకూరు చెరువు వరవ కాలువ పనులను ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో కాలువ అస్తవ్యస్తంగా తయారవుతుంది. తత్ఫలితంగా భవిష్యత్‌లో నీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదంతో పాటు కాలువ పరివాహక ప్రాంతం మునకకు గురయ్యే అవకాశం ఉంది. పొదలకూరు : ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం, తెలుగు తమ్ముళ్ల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నీరు–చెట్టు పథకం కింద పొదలకూరు చెరువు వరవ కాలువ తవ్వకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వాస్తవంగా అవసరం లేని కాలువ తవ్వకం పనులను చేపట్టి అధికార పార్టీ నాయకులకు అప్పనంగా దోచుకుంటున్నారు. రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో డొంకదారి వద్దనున్న పొదలకూరు చెరువు వరవ కాలువ తవ్వకం పనులు, పట్టణం నడిబొడ్డున వెళుతున్న మరో వరవ కాలువ పూడిక తొలగింపు పనులకు ఇరిగేషన్ అధికారులు నీరు–చెట్టు పథకం కింద రూ.3.20 లక్షలను మంజూరు చేశారు. ఈ పనులను నామినేషన్ కింద కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ముందుగా డొంక వద్ద నున్న వరవ కాలువ పూడిక పనులను చేపడుతున్నారు. ఈ కాలువ వెడల్పు, లోతు అస్తవ్యస్తంగా ఉంది. కాలువపై ఆక్రమణలు చోటు చేసుకోవడం వల్ల లెవెల్స్ తీయకుండానే పనులు చేపడుతున్నందున నీరు చెరువులోకి సక్రమంగా చేరే అవకాశం లేదంటున్నారు. ఇందువల్ల వర్షాకాలంలో ఆ ప్రాంత నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ప్రారంభంలో 3.30 మీటర్ల వెడల్పు, 100 మీటర్ల పొడవు తీశారు. అక్కడి నుంచి మరో 50 మీటర్ల పొడవున 1.50 మీటర్ల వెడల్పున కాలువను తీశారు. ఆక్రమణలు చోటు చేసుకున్న ప్రాంతంలో కూలీలను ఏర్పాటు చేసి నామ మాత్రంగా కాలువ పూడిక పనులను చేపడుతున్నారు. ఫలితంగా వర్షపు నీరు లెవల్స్ లేని కాలువ ద్వారా సక్రమంగా చెరువులోకి వెళ్లకుండా కాలువలోనే నిల్వ చేరే అవకాశం ఉంది. వర్షాకాలంలో కాలువ పరివాహక ప్రాంతంలోకి వరద నీరు ఉప్పొంగే అవకాశం ఉంది. ఫ్లడ్ క్యాచ్మెంట్ కింద కాలువ లోతు అడుగు లేదా 1.5 అడుగు లోతు సరిపోతుందని ఆ ప్రాంత నివాసితులు చెబుతున్నారు. ఎవరికీ ఉపయోగం లేని కాలువ పనులను ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ తమకు ఆక్రమణలతో సంబంధం లేదని ఇరిగేషన్ అధికారులు రూపొందించిన అంచనాల ప్రకారం పనులను పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నాడు. పట్టణంలోని మరో వరవ కాలువ పూడిక పనులు సైతం ఇదే తరహాలో పూడిక పనులు చేపడుతున్నారు. కాలువ పనుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఇరిగేషన్ ఏఈ కరిముల్లా అందుబాటులోకి రాలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : రాధాకృష్ణారెడ్డి, విశ్రాంత అటవీశాఖ అధికారి, పొదలకూరు తమ ఇళ్ల ముందు ఉపయోగం లేని కాలువ పనులు చేపట్టారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. కాలువకు లెవెల్స్ తీయకుండా పనులు చేపట్టడం వల్ల వర్షాకాలంలో ఈ ప్రాంత నివాసితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 100 మీటర్ల కాలువ వెడల్పుగా, మరో 50 మీటర్లు కాలువ సన్నగా పూడిక పనులు చేపట్టడం వల్ల వర్షపు నీరు సక్రమంగా చెరువుకు చేరే అవకావం ఉండదు. ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించనే లేదు. -
‘నీరు’ చెట్టే మింగేసింది!
గన్నవరం: నీరు–చెట్టు అంటూ అధికార పార్టీ నాయకులు చెరువుల్లో ఇష్టరాజ్యంగా తవ్విన మట్టి తవ్వకాలకు మరో ఇద్దరు బలైపోయారు. గన్నవరం శివారు మర్లచెరువులో ఆదివారం బైక్ కడిగేందుకు వెళ్ళిన ఇరువురు విద్యార్థులు చెరువులో లోతుగా తవ్విన గోతిలో ప్రమాదవశాత్తు పడి దుర్మరణం చెందారు. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక ఎస్సీకాలనీకి చెందిన తిరివీధి నాగేశ్వరరావు కుమారుడు దిలీప్(20) వికెఆర్ కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్ కడిగేందుకని సమీప బంధువెన నాలుగో తరగతి విద్యార్థి నిడమర్తి మణిబాబు(9)ను తీసుకుని మర్లపాడులోని చెరువు వద్దకు వెళ్ళారు. బండిని గట్టుపై ఉంచి బకెట్ సహాయంతో చెరువులోని నీటిని తీసుకువచ్చి శుభ్రం చేస్తుండడం గమనించిన స్థానికులు చెరువు లోతుగా ఉంది వెళ్లొద్దనిహెచ్చరించారు. అయినా ఇద్దరూ బండి పనిలో నిమగ్నమయ్యారు. చెరువుకు వెళ్లిన ఇద్దరూ ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. చెరువు గట్టున బండి, చొక్కాలు, సెల్‌ఫోన్, చెప్పులు ఉన్నప్పటికి దీలిప్, మణిబాబు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. చెరువులో గాలించగా కొద్ది సేపటికి చెరువు గట్టు పక్కన లోతుగా ఉన్న గొయ్యిలో వీరి మృతదేహాలు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎస్సీ కాలనీవాసుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం నాయకులు మట్టి కోసం చెరువును ఇష్టారాజ్యంగా తవ్విన గోతుల్లో పడి తమవారు చనిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల గౌడపేటకు చెందిన విద్యార్థి ఇదే చెరువులో పడి మరణించినా, ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రమాదాల నివారకు చెరువు గట్టు చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
నీరు–చెట్టు.. అవినీతి పుట్ట
కడప రూరల్ : ప్రతి పనిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి..అర్హులకు ఏమాత్రం సంక్షేమ పథకాలు అందడం లేదు..పాలకులు ఇష్టానుసారంగా ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అబివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల్లో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అక్రమాలపై వాడి వేడిగా చర్చ సాగింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులు హార్టికల్చర్ కిందికి వస్తారా? లేదా అగ్రికల్చర్ కిందికి వస్తారా? అనేది నేటికీ తెలియకపోవడం దారుణమన్నారు. దీంతో వారు నష్టపరిహారం పొందలేక ఇబ్బందులకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ వివరాలను తెలియపరచాలని ఇరిగేషన్ ఎస్ఈని ప్రశ్నించారు. దీనికి ఎస్ఈ సమాధానం చెప్పలేకపోయారు. అవినీతిని నిరూపించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తప్పనిసరిగా టెండర్ల ద్వారానే పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా విద్యుత్‌కు సంబంధించి 50 యూనిట్లకు బదులుగా 100 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఇవ్వాలన్నారు. అలాగే వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. అలాగే సబ్స్టేషన్లలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి పాలకుల సూచనల మేరకే ఉద్యోగాలు దక్కుతున్నాయని ఆరోపించారు. అలాకాకుండా మెరిట్ లిస్టు ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో చెన్నూరు మినహా దాదాపు అన్ని ప్రాంతాలలో నీటి కొరత ఉందని, ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు గృహాలు దెబ్బతినగా, మరికొన్ని కూలిపోయాయని పేర్కొన్నారు. వాటి మరమ్మతులకు, గృహాల పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు స్పందించి అర్హులకు తక్షణమే పింఛన్లు దక్కేలా చర్యలు చేపట్టాలన్నారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ నీరు–చెట్టు పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రధానంగా చెక్‌డ్యాముల వ్యవహారంలో అవినీతి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులపై కూడా జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఏ పథకమైనా అటు తిరిగి, ఇటు తిరిగి జన్మభూమి కమిటీల వద్దకు రావడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కడప శాసనసభ్యులు ఎస్బీ అంజద్‌బాషా మాట్లాడుతూ నీరు–చెట్టు పేరుతో బుగ్గవంకలో చేపట్టిన పనుల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపించారు. టెండర్ల ద్వారా కాకుండా ఇష్టమొచ్చిన వారికి పనులు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే కడప నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. గ్రామసభల ద్వారా పనులు చేపట్టాలి – ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అడ్డగోలుగా కాకుండా గ్రామసభల ద్వారా పనులు చేపట్టాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు.లాగే అర్హులకు సంక్షేమ ఫలం దక్కేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ప్రొటోకాల్ ప్రకారం తప్పనిసరిగా నడుచుకోవాలన్నారు. అందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఎక్కడైనా అవినీతి జరిగిందని తెలిస్తే అందరి ఆమోదం మేరకు విచారణ చేపట్టడానికి తీర్మానం చేపడతామన్నారు. సెంట్రల్ విజిలెన్స్‌తో పరిశీలన – కలెక్టర్ పలు ప్రాంతాల్లో జరిగిన అవినీతి పనులపై చర్చకు వచ్చింది. వీటిపై వాదోపవాదాలు సాగాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరిగిన అన్ని పనులపై సెంట్రల్ విజిలెన్స్ చేత పరిశీలన చేయిస్తామన్నారు. ఎక్కడైతే అవినీతి జరిగిందని బహిర్గతమవుతుందో అక్కడ కఠిన చర్యలు చేపడుతామన్నారు. అలాగే అవినీతిపై వచ్చిన కథనాలపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులుగా పోరుమామిళ్లలో ఇటీవల డంపింగ్‌యార్డు ప్రారంభోత్సవ సభలో ప్రొటోకాల్‌ను పాటించలేదనే దానిపై కూడా స్పందించారు. తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలన్నారు. పోరుమామిళ్లలో జరిగిన సంఘటనకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ అంటే మండలంలోని అధికారులకు లెక్కే లేకుండా పోయిందని గాలివీడు ఎంపీపీ రెడ్డెన్న ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పెత్తనం ఏంటి..? ప్రభుత్వ పథకాలపై జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు నిలదీశారు. అందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వాటి వివరాలను తెలుపాలని పీడీని కోరగా, ఆన్లైన్లో అర్హులైన వారు ఇంకా 13 వేలకు పైగా ఉన్నారని, వారందరికీ పింఛన్లు అందాల్సి ఉందన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు స్పందిస్తూ వారందరికీ తక్షణమే పింఛన్లు ఎందుకు మంజూరు కావడం లేదని నిలదీశారు. జిల్లా యంత్రాంగం స్పందించి అర్హుౖలñ న వారికి వెంటనే పింఛన్ అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వానికి ఒక నివేదిక పంపుతామని తెలిపారు. పక్కాగృహాల మంజూరులో కూడా వివక్ష కొనసాగుతోందని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క అర్హునికి అందేలా చూడాలని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ రమేష్, విద్యుత్‌శాఖ ఎస్ఈ సుబ్బరాజు, పోరుమామిళ్ల ఎంపీపీ చింతా విజయ్‌ప్రతాప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నీరు–చెట్టులో భారీ అవినీతి
వంగర: గ్రామాల్లో నీరు–చెట్టు పథకం పనుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌లు ధ్వజమెత్తారు. వంగరలో పార్టీ కార్యకర్త కాంబోతుల నర్సమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను శనివారం వారు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు సూచించిన నీటి వనరులను ఎంపిక చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. ఈ పనుల్లో నాణ్యత పాటించలేదని, అధికారులు కూడా నాయకులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. వంగర మండలంలో వైఎస్ఆర్ సీపీ అభిమానులు, క్యాడర్‌ను వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి కుడి కాలువ ద్వారా సాగునీటి సరఫరా జరగలేదని, రైతు రుణాలు కొత్తగా మంజూరుకు నోచుకోక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, వంగర,రేగిడి,రాజాం మండల అధ్యక్షులు కరణం సుదర్శనరావు, వావిలపల్లి జగన్మోహనరావు, లావేటి రాజగోపాల్, టంకాల అచ్చెంనాయుడు, బండి నర్శింహులు, వంజరాపు విజయ్‌కుమార్, నల్ల కృష్ణ, గేదెల రామకృష్ణ, భగవతి, బెవర అప్పలనాయుడు, దుర్గప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నీరు-చెట్టులో రూ.150 కోట్ల అవినీతి
అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు డ్రా అధికార పార్టీ నేతల దాష్టీకానికి నిదర్శనమిది.. అక్రమాలు వెలుగులోకి వచ్చినా కలెక్టర్ చర్యలు తీసుకోలేదు.. విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్లాం వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం క్రైం : తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన నీరు, చెట్టు కార్యక్రమంలో రూ.150 కోట్ల మేర అవినీతి, అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. తక్షణమే వాటిపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సత్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం పూర్తిగా అవినీతిమయమైందన్నారు. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో రూ.150కోట్ల మేర దేశం పార్టీ నేతలు దర్జాగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఒక తెలుగుదేశం నాయకుడు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు స్వాహా చేశాడన్నారు. అధికార పార్టీ నేతల దాష్టీకానికి ఇది నిదర్శనమన్నారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చినా కలెక్టరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశం నేతల అక్రమ దోపిడీని ఇప్పటికే విజిలెన్సు అధికారుల దృష్టికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లిందని చెప్పారు. పార్టీ నేత యడ్ల రమణమూర్తి మాట్లాడుతూ.. విజయనగరం నియోజకవర్గంలో అభివృద్ధి వెతికినా కనిపించడం లేదని విమర్శించారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యే మీసాలగీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణలు పట్టణంలో అభివృద్ధి వెలిగిపోతోందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పట్టణంలోని గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రోడ్డు ఇప్పటికీ విస్తరణ జరగలేదని గుర్తు చేశారు. పట్టణంలో సమస్యలపై కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సమీక్షిస్తే మంచిదని సూచించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, యువజ విభాగం రాష్ట్ర కార్యదర్శి అవనాపు విజయ్, నాయకులు ఉప్పు ప్రకాష్, గాడు అప్పారావు, పిన్నింటి చంద్రమౌళి, పిలకా శ్రీనివాస్, కరుమజ్జి సాయికుమార్ పాల్గొన్నారు.