'నీరు- చెట్టు' దుర్వినియోగం కాకుండా చర్యలు' | governor narasimhan attends Neeru -chettu program in east godavari district | Sakshi
Sakshi News home page

''నీరు- చెట్టు' దుర్వినియోగం కాకుండా చర్యలు'

Published Tue, May 12 2015 10:41 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

'నీరు- చెట్టు' దుర్వినియోగం కాకుండా చర్యలు' - Sakshi

'నీరు- చెట్టు' దుర్వినియోగం కాకుండా చర్యలు'

'నీరు- చెట్టు' కార్యక్రమం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జిల్లా అధికారులకు సూచించారు.

పండూరు (తూర్పు గోదావరి): 'నీరు- చెట్టు'  కార్యక్రమం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలోని పండూరులో పథకం పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 'నీరు- చెట్టు' మంచి పథకమని, ప్రజలు దీనికి సహకరించాలన్నారు.

గవర్నర్ నరసింహన్ సోమవారం రాజమండ్రిలో పర్యటించిన విషయం తెలిసిందే. నిర్మాణంలో ఉన్న కోటిలింగాలఘాట్‌ను పరిశీలించడంతో పాటు కోరకొండ మండలం శ్రీరంగపట్నంలో ‘నీరు - చెట్టు’ కార్యక్రమంలో పాల్గొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో పర్యటించారు. ఈ సందర్భంగా జాందానీ చీరల తయారీ కేంద్రాలను పరిశీలించి, తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న చేనేత సహాకార సంఘంలో జాందానీ చీరలను కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement