నీరు చెట్టు.. టీడీపీ నాయకులపై కేసులు | ACB Take Action on Neeru Chettu Corruption Vizianagaram | Sakshi
Sakshi News home page

ఏసీబీకి నీరు చెట్టు అక్రమాలు

Published Tue, Jul 14 2020 10:39 AM | Last Updated on Tue, Jul 14 2020 10:39 AM

ACB Take Action on Neeru Chettu Corruption Vizianagaram - Sakshi

కొట్టుకుపోయిన చెక్‌డ్యాంను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు(ఫైల్‌)

బొబ్బిలి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన నీరు–చెట్టు పనుల అక్రమాలపై మళ్లీ కదలిక మొదలైంది. ఏసీబీ అధికారులు ఇప్పుడు అక్రమాలను వెలికి తీసేపనిలో పడ్డారు. అప్పట్లో టీడీపీ నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పనులు చేయకుండా బిల్లులు చేయించుకోవడం... నాసి రకం పనులతో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడంపై అప్పట్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. డీఈఈ, ఏఈలను సస్పెండ్‌ చేయడం కొంత మొత్తాన్ని రికవరీకి ఆదేశించడం తెల్సిందే. మరింత లోతుగా వెళ్లేందుకు ఏసీబీ అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.5.6 కోట్లకు పైగా ఉపాధి హామీ ద్వారా చేపట్టిన నీరు చెట్టు పనుల్లో అవినీతి చోటు చేసుకున్నట్టు తేలింది. ఇందులో దాదాపు సగానికి పైగా అంటే రూ.3.4 కోట్ల విలు వయిన పనులు ఒక్క రామభద్రపురం మండలంలోనే జరిగినట్టు అప్పట్లో పలు శాఖల అధికారుల విచారణలో తేలింది. ఇప్పుడు తాజాగా ఏసీబీ అధికారులు వీటి వివరాలను సేకరిస్తున్నారు. పలుశాఖలకు సంబంధించి విడుదలైన నిధులు, చేసిన బిల్లులపై ఆరా తీస్తున్నారు.  

రామభద్రపురం మండలాధికారులకు లేఖలు  
రామభద్రపురం మండలంలో అభివృద్ధి పనుల ముసుగు లో టీడీపీ నాయకులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అధికారు ల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు పలుమార్లు విచారణ చేపట్టారు. అక్రమాల గుట్టు తేల్చారు. అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి కోట్లలో బిల్లులు కాజేసినట్టు ఆధారాలు సంపాదించి కేసులు నమో దు చేశారు. ఈ అక్రమాలపై సివిల్‌ పోలీసులు కూడా కేసు లు నమోదు చేసి అప్పటి అధికార పార్టీ నాయకులను పో లీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. రామభద్రపురంలో 2015–16 ఏప్రిల్‌ వరకు ఉపాధిహామీ, జలవనరుల శాఖ ఆద్వర్యంలో జరిగిన ఉపాధిపనుల్లో టీడీపీ నాయ కులు పనులు చేయకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లు లు చేసుకోవడం.. నాసిరకంగా పనులు చేయడం.. తక్కువ పనిచేసి ఎక్కువగా నమోదుచేçయడం.. తూతూ మంత్రంగా చక్కబెట్టేసి సొమ్ము చేసుకోవడంపై పెద్ద ఎత్తున దుమారం రేగినా వారు లెక్క చేయలేదు. 2017 నవంబర్‌లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు డీఈఈ ఆర్‌.ఆర్‌.విద్యాసాగర్, ఏఈఈలు శామ్యూల్, రవికాంత్‌తో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది.

2015–16లో రూ.5.7కోట్లతో చేపట్టిన 102 ఉపాధిపనులు సక్రమంగా లేవని, కొన్ని పనులు జరగకుండా బిల్లులు చెల్లించినట్లు గుర్తించి నివేదికలు విజిలెన్స్‌ ఎస్పీ హరికృష్ణకు అందజేశారు. వాటి ఆధారంగా ఆయన 2018 ఏప్రిల్‌లో మండలంలోని మామిడివలస, కోటశిర్లాం, కొండకెంగువ, ఎస్‌ సీతారాంపురం, ఇట్లామామిడిపల్లిలో అకస్మికంగా పర్యటించి కొన్ని పనుల నాణ్యతను పరిశీలించారు. మొత్తం 102 పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, చెక్‌డ్యాంలు, మదుములు, చప్టాలకు టెక్నికల్‌ మంజూరు లేకుండా పనులు జరిపినట్లు, నాసిరకంగా నిర్మించడంతో పాటు ఉపయోగంలేని పనులు చేసినట్లు గుర్తించారు. మొత్తం నిధుల్లో సుమారు రూ.4 కోట్ల వరకు అవకతవకలు జరిగి నిధులు స్వాహా అయినట్లు నిర్థారించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అప్పగించినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఉపాధిహామీ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి ఎంబుక్, చెక్‌ మెజర్‌మెంట్లలో మామిడివలస, నాయుడువలస, కోటశిర్లాం, తారాపురం గ్రామ సర్పంచ్‌లు తమ సంతకం ఫోర్జరీ చేశారని అప్పటి ఇరిగేషన్‌ ఈఈ జి.వి.రమణ ఫోలీసులకు పిర్యాదు చేసినా నామమాత్రంగా విచారణ జరిపినా చర్యలు తీసుకోలేదు.

నాటి అక్రమాలపై ఏసీబీ ఆరా...
రామభద్రపురంతో పాటు పలు మండలాల్లో 2015–16లో చేపట్టిన ఉపాధిహామీ పనులకు సంబంధించి ఎంబుక్‌లు, ఎఫ్‌టీవోలు, వర్క్‌ కమిట్‌మెంట్‌ లెటర్స్‌ తదితర వివరాలు పంపించాలని విజయనగరం ఏసీబీ డీఎస్పీ కార్యాలయం నుంచి ఎంపీడీఓకు లేఖ అందజేశారు. ఈ విషయాన్ని రామభద్రపురం ఎంపీడీఓ బి.ఉషారాణి ధ్రువీకరించారు. ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ఏసీబీ అధికారులు కోరిన సమా చారం సిద్ధం చేయమని చెప్పినట్టు అప్పటి ఈఈ జి.వి.రమణ తెలిపారు. తన సంతకాన్ని అప్పట్లో సర్పంచ్‌లే ఫోర్జరీ చేసినట్టు పోలీసులకు తానే ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో కమిన్స్‌మెంట్‌ లెటర్లు, ఎం బుక్‌లు, పే ఆర్డర్‌ కాపీలు, ఎఫ్‌టీఓలు(ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌లు), బ్యాంక్‌ లావాదేవీల కాపీల వంటి పలు వివరాలు ఏసీబీ అధికారులు కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement