ACB Andhra Pradesh
-
పేరులో చిన్న.. అవినీతి మిన్న
ఆయనెక్కడ పనిచేసినా అవినీతిలో మునిగితేలుతారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తారు. స్టేషన్‌కొచ్చే బాధితుల బాధలు విని సాంత్వన చేకూర్చడం మాని, ఆ సమస్య పరిష్కరిస్తే తనకెంత ముట్టజెబుతారో అడుగుతారు. విసుగెత్తిన ఓ బాధితుడు గతంలో ఏసీబీ అధికారులకు సమాచారమిస్తే.. చివరి నిమిషంలో వారికి చిక్కకుండా ఉడాయించారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చి సస్పెన్షన్‌కు గురయ్యారు. అవినీతికి కేరాఫ్‌గా చెప్పుకునే అలాంటి వ్యక్తి నేడు కూటమి ప్రభుత్వంలో ఓ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకుని పోస్టింగ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఖాకీ వనంలో కలుపు మొక్కగా పేరుగాంచిన పోలీసు అధికారి చిన్నగౌస్కు మళ్లీ పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అత్యంత అవినీతిపరుడిగా ముద్రవేసుకున్న చిన్న గౌస్.. అధికారులను మేనేజ్ చేయడంలోనూ, ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా లోపాయికారీగా వ్యవహరించడంలోనూ అత్యంత నేర్పరి అని పేరుంది. ఎమ్మెల్యే, మంత్రుల అండతో పోలీసు డిపార్ట్మెంట్లోని పెద్దలను కూడా లెక్కచేయరనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏ స్టేషన్లో పనిచేసినా వివాదాస్పద పోలీసుగా, అవినీతిపరుడిగా ముద్రపడటం గమనార్హం. గతంలో సస్పెండ్ అయిన ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చి తమకు అనుకూలంగా పనిచేయించుకోవాలని నేడు అమాత్యులు, టీడీపీ నాయకులు భావిస్తున్నారు.రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే సమయంలో.. గతంలో రామగిరి పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసిన చిన్నగౌస్.. ఓ కేసులో అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారనే సమయంలో జంప్ అయ్యారు. వరకట్న వేధింపుల కేసులో వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో రామగిరి ఎస్ఐ, సీఐ చిన్నగౌస్ ప్రధాన నిందితులు. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎస్ఐ పట్టుబడ్డారు గానీ చిన్నగౌస్ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత ఆయన్ను అప్పటి ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇప్పటివరకూ సస్పెన్షన్ ఎత్తేయలేదు. నేడు ప్రభుత్వం మారడంతో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఉరవకొండ సీఐగా వచ్చేందుకు టీడీపీ నేతలను ఆశ్రయించినట్టు సమాచారం. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా వచ్చి.. వాస్తవానికి చిన్నగౌస్ సివిల్ పోలీస్ విభాగానికి చెందిన వారు కాదు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత మినిస్టీరియల్ కోటాలో భాగంగా సివిల్ పోలీస్ విభాగంలోకి చేరారు. కంబదూరు మొదలుకొని పలు స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. ఎక్కడ పనిచేసినా వివాదం సృష్టించడం, సెటిల్ మెంట్లు చేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య అని పోలీసు విభాగంలో చెప్పుకుంటారు. రాజకీయ నేతలకు వంతపాడి, వారితో అంటకాగుతూ వారి ప్రత్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంలో గౌస్‌కు మించిన వారు మరొకరు లేరనే పేరుంది. అలాంటి వ్యక్తికి నేడు సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని చూస్తుండటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్‌కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్‌కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ పూర్తి
-
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
పుట్టపర్తి: బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి, సీఐ శాంతిలాల్ ప్రభాకర్ తెలిపిన మేరకు.. పుట్టపర్తి టౌన్ పరిధిలోని బ్రాహ్మణ పల్లికి చెందిన సురేంద్రరెడ్డి తన సోదరులతో పాటుగా ఉన్న ఉమ్మడి ఆస్తిలో తన వంతు భాగాన్ని రిజిస్టర్ చేయించుకోవాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించాడు. స్టాంప్ డ్యూటీ తగ్గించుకుంటామని, తనకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డీల్ కుదుర్చుకున్నాడు. బుధవారం రాత్రి సురేంద్రరెడ్డి అడ్వాన్స్‌గా సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్‌కు రూ.10 వేలు, అతని భార్యకు రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. -
హలో.. మేం ఏసీబీ నుంచి..
ఏది ఏమైనప్పటికీ ఈ తరహా మోసాలపై ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫోన్ చేసి నగదు డిమాండ్ చేయరన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కోసం బెదిరింపు చర్యలకు పాల్పడితే వారు నకిలీ అధికారులని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారు. నెల్లూరు(క్రైమ్): అడ్డదారిలో డబ్బు సంపాదించాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్ సినిమా తరహాలో ఏసీబీ అధికారులుగా అవతారమెత్తారు. ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి రిజిస్ట్రేషన్స్, ఎకై ్సజ్, రెవెన్యూ, పోలీసు, ఆర్టీఓ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్, కమర్షియల్ ట్యాక్స్ తదితర విభాగాలకు చెందిన అధికారుల ఫోన్‌నంబర్లు సేకరించి మోసాలకు తెరలేపారు. తాను ఏసీబీ ఇన్స్పెక్టర్ని, హెడ్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి మాటలు కలుపుతారు. మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. సెటిల్ చేసుకుంటే ఓకే.. లేదంటే రైడ్ జరుగుతుందని భయపెడతారు. కావాలంటే తమ డీఎస్పీతో మాట్లాడాలంటూ బెదిరిస్తారు. బెదిరిపోయే ఉద్యోగుల నుంచి గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారు. ఈ తరహా నేరాలు తరచూ జరుగుతున్నా బాధిత అధికారులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం వెనుక వివిధ కారణాలున్నాయి. దీనిని అలుసుగా తీసుకున్న సదరు నకిలీలు పెద్ద సంఖ్యలో అధికారులను బెదిరించి మరీ నగదు వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. గతంలోనూ ఇదే తరహా నేరాలు గతేడాది డిసెంబర్లో పోలీసుశాఖలో ఏఎస్సైగా పనిచేస్తూ నగరంలో నివాసం ఉంటున్న ఓ అధికారికి నకిలీ ఏసీబీ అధికారి ఫోన్ చేశాడు. మీరు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు అందాయని, రైడ్ చేయకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బెదిరిపోయిన సదరు ఏఎస్సై వెంటనే సదరు నకిలీ అధికారికి అడిగినంత ముట్టజెప్పారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు అప్పట్లో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో గుర్తుతెలియని వ్యక్తి తాను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌నంటూ గత నెల 31వ తేదీన నగరంలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈఓ వెంకటశ్రీనివాసులురెడ్డికి ఫోన్ చేశాడు. మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, రూ.1.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే రైడ్ చేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ఈఓ ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు కాల్ చేసిన వ్యక్తి ఫోన్‌నంబర్ ఏసీబీలో పనిచేస్తున్న వ్యక్తిదా.. కాదా.. అని ఆరా తీశారు. ఆ నంబర్ తమది కాదని ఏసీబీ అధికారులు స్పష్టంగా వెల్లడించడంతో ఈ ఘటనపై బాధితుడు ఈ నెల 2వ తేదీ రాత్రి దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ గ్యాంగ్ పనేనా..? రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా నేరాల్లో దిట్ట అనంతపురం జిల్లాకు చెందిన మోస్ట్‌వాంటెడ్ జయకృష్ణ గ్యాంగ్. జయకృష్ణ, అతని స్నేహితులు గ్యాంగ్ సినిమాతో ప్రభావితమై అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఏసీబీ అధికారుల అవతారమెత్తారు. దొడ్డిదారిన ప్రీపెయిడ్ సిమ్‌కార్డులు సంపాదించి, వాటిని వినియోగించి మోసాలకు పాల్పడుతున్నారు. 2019 నుంచి రాష్ట్రంలోని కర్నూలు, పులివెందుల, అనంతపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వివిధ శాఖల అధికారులకు ఫోన్ చేసి ఏసీబీ అధికారులమంటూ బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడ్డారు. పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు సైతం వెళ్లారు. అయినా వారి తీరులో మార్పు రాకపోగా.. తిరిగి యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. నిందితులు నకిలీ సిమ్‌కార్డులతో అధికారులకు ఫోన్లు చేస్తూ లొకేషన్ తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తాజా ఘటన సైతం సదరు గ్యాంగ్ పనై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలో కొన్ని ఘటనలు ఏసీబీ అధికారినంటూ 2020లో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసిన ఓ ఉద్యోగికి ఫోన్‌కాల్ వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నావని ఫిర్యాదులు అందాయని, తాను అడిగినంత డబ్బు ఇస్తే రైడ్లు ఉండవని చెప్పడంతో బెంబేలెత్తిన సదరు ఉద్యోగి రూ.లక్షల్లో ముట్టజెప్పాడు. రిజిస్ట్రేషన్ శాఖలో గతంలో ఓ ఉద్యోగికి సైతం ఇదే తరహాలో ఫోన్‌కాల్ వచ్చింది. ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని, మీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదులు అందాయని, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే నగదు ఇవ్వాలని బెదిరించి రూ.లక్షలు కాజేశారు. తాజాగా నగరంలోని ఓ దేవస్థానం ఈఓకు ఫోన్‌కాల్ వచ్చింది. మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సెటిల్ చేసుకుంటే సరే.. లేదంటే రైడ్ జరుగుతుందని బెదిరించారు. రూ.1.50 లక్షలు డిమాండ్ చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్లో సంభాషణ ఇలా.. నకిలీ ఏసీబీ అధికారి : హలో ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. ఉద్యోగి : నమస్తే సార్ చెప్పండి నకిలీ ఏసీబీ అధికారి : మీపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే మా సిబ్బంది మీకు సంబంధించి చాలా సమాచారం సేకరించారు. మీరు మంచి వ్యక్తి అని పలువురు చెప్పారు. మీపై కేసు పెట్టాలా.. వద్దా.. అనే ఆలోచనలో ఉన్నాం. ఉద్యోగి : సార్ నేను చాలా మంచి వాడిని. ఎవరో గిట్టని వాళ్లు నాపై ఫిర్యాదులు చేశారు. నకిలీ ఏసీబీ అధికారి : కానీ మా ఎంకై ్వరీ రిపోర్టు అలా లేదు కదా? మనం ఒక ఒప్పందానికి వస్తే కేసులు. రైడ్లు లేకుండా చూస్తాను. ఏమంటారు? ఉద్యోగి : ఓకే సార్ మీరు అడిగినంత ఇస్తాను. ఇంతటితో ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి. ఇలా నకిలీ ఏసీబీ అధికారులు ఆర్టీఓ, రిజిస్ట్రేషన్స్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల ఉద్యోగులను బెదిరించి రూ.లక్షలు దోచేస్తున్నారు. అయితే ఈ మోసాలపై ఫిర్యాదులు చేసేందుకు బాధితుల్లో ఒకరిద్దరు మినహా ముందుకు రాకపోవడం వెనుక పరువుపోతుందన్న భయమే కారణంగా తెలుస్తోంది. ఇది మోసగాళ్లకు కలిసి వస్తోంది. దీంతో వారు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. -
చంద్రబాబును మరో 5 రోజులు మా కస్టడీకి ఇవ్వండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుని మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఇచ్చిన 2 రోజుల కస్టడీలో తమ విచారణకు చంద్రబాబు ఏ మాత్రం సహకరించలేదని సీఐడీ వివరించింది. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను చదివే పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని తెలిపింది. 2 రోజుల కస్టడీకి మాత్రమే ఇవ్వడంతో ఆ గడువును ఆయన అడ్డంపెట్టుకుని ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారంది. ఆయన నుంచి పలు అంశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, అందువల్ల ఆయనను తమ కస్టడీకి అప్పగించడం అత్యావశ్యకమని తమ పిటిషన్లో కోర్టుకు నివేదించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను ఆదేశించింది. మధ్యాహ్నం వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు ‘చంద్రబాబును 5 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ మొదట ఈ నెల 11న పిటిషన్ దాఖలు చేశాం. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు పలు షరతులతో కేవలం 2 రోజుల కస్టడీకే అప్పగిస్తూ ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు విధించిన షరతులకు లోబడి చంద్రబాబును విచారించాం. విచారణ సందర్భంగా ఆయన నుంచి పలు వివరాలు రాబట్టేందుకు ఈ కేసుకు సంబంధించిన విషయాలతో ప్రశ్నలను సిద్ధం చేశాం. మా ప్రశ్నల తీరు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశాం. మొదటి రోజు విచారణలో చంద్రబాబు మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేశారు. కోర్టు ఇచ్చిన పోలీసు కస్టడీ ఉత్తర్వులను ప్రశ్నించారు. పోలీసు కస్టడీ ఉత్తర్వుల కాపీని తనకు అందచేస్తే తప్ప, దర్యాప్తు అధికారి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పారు. తనకు ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే పోలీసు కస్టడీకి ఇచ్చారని, న్యాయవాదిని కలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. కోర్టు ఇరుపక్షాల వాదనలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే మిమ్మల్ని పోలీసు కస్టడీకి ఇవ్వడం జరిగిందని దర్యాప్తు అధికారి ఆయనకు చెప్పారు. ఒకవేళ పోలీసు కస్టడీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే, న్యాయవాది ద్వారా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కూడా చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టం చేశారు. మిమ్మల్ని విచారించేందుకు కోర్టు మాకు అనుమతినిచ్చిందని, మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయనకు దర్యాప్తు అధికారి తేల్చి చెప్పారు. కస్టడీ ఉత్తర్వులను తీసుకున్న చంద్రబాబు వాటిని మధ్యాహ్నం 1 గంట వరకు చదివారు. దర్యాప్తు అధికారి గంట పాటు భోజన విరామ సమయం ఇచ్చారు. భోజన విరామం తరువాత వచ్చి కూడా 2 గంటల వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు. 2.20 గంటల సమయంలో మాకు కోర్టు కేవలం రెండు రోజుల కస్టడీ మాత్రమే ఇచ్చిందని చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టంగా చెప్పారు. చదవడం ఆపి, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయనను దర్యాప్తు అధికారి కోరారు. అయితే దీనిని చంద్రబాబు పట్టించుకోలేదు. అలా మరికొద్దిసేపు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు.’ అని సీఐడీ తన పిటిషన్లో పేర్కొంది. 15 రోజుల తరువాత విచారణకు ఆస్కారం లేదనే.. ‘మేం ఏ సరళిలో ప్రశ్నలు అడగాలనుకున్నామో మమ్మల్ని అలా చంద్రబాబు అడగనివ్వలేదు. అంతేకాక ఆయన చెప్పే విషయాలను రాసుకోవాలని దర్యాప్తు అధికారికి చెప్పారు. తనకు తెలిసిన విషయాలకు సంబంధించి కూడా ఆయన నోరు మెదపలేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. చాలా సందర్భాల్లో దర్యాప్తు అధికారిని మాటలతో వంచించే వైఖరిని అవలంభించారు. తాను విచారణ సందర్భంగా ఇలానే వ్యవహరించాలని చంద్రబాబు ముందే ఓ నిర్ణయానికి రావడంతో, ఈ కేసులో కీలక నిందితులైన వికాస్ ఖన్వీల్కర్, షెల్ కంపెనీల డైరెక్టర్లు, ఇతర కుట్రదారులైన గంటా సుబ్బారావు (ఏ1), లక్ష్మీనారాయణ (ఏ2)ల వాంగ్మూలాలను ఆయన ముందుంచి వివరాలు రాబట్టే అవకాశం లేకుండా పోయింది. అలాగే కీలక సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా చంద్రబాబు నుంచి తగిన వివరాలు తెలుసుకోలేకపోయాం. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ, కావాల్సిన సమాచారాన్ని రాబట్టనివ్వకుండా దర్యాప్తు సంస్థను నిరోధిస్తూ వచ్చారు. విచారణ సందర్భంగా తీసిన వీడియోను పరిశీలిస్తే చంద్రబాబు వేసిన కాలయాపన ఎత్తులు సులభంగా అర్థమవుతాయి. అరెస్ట్ చేసిన నాటి నుంచి 15 రోజుల తరువాత ఎలాంటి జ్యుడీషియల్ ఇంటరాగేషన్ ఉండదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కావాలనే దర్యాప్తు అధికారి కోరిన సమాచారాన్ని ఇవ్వలేదు.’ అని సీఐడీ వివరించింది. హైకోర్టు ఉత్తర్వుల వల్ల 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోలేకపోయాం... ‘కోట్లాది రూపాయల డబ్బు 2018–20 సంవత్సరాల మధ్య తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు దర్యాప్తులో గుర్తించాం. ఆ బ్యాంకు ఖాతాలకు తానే అథరైజ్డ్ సిగ్నేటరీ అన్న విషయాన్ని చంద్రబాబు కూడా అంగీకరించారు. భారీ స్థాయిలో వచ్చిన నగదు డిపాజిట్ల వివరాలను చంద్రబాబు ముందు ఉంచి, వాటి గురించి ఆయన్ను ప్రశ్నించాల్సి ఉంది. టీడీపీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలు అందించాలని హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్‌ను కోరాం. ఆ వివరాలు రావాల్సి ఉంది. వచ్చిన తరువాత వాటిని విశ్లేషించి చంద్రబాబును విచారిస్తాం. తనపై మేం నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 13న విచారణ జరిపిన హైకోర్టు, 18వ తేదీ వరకు మా పోలీసు కస్టడీ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఒత్తిడి చేయవద్దని ఉత్తర్వులిచ్చింది. ఈ ఆరు రోజులను మొదటి 15 రోజుల గడువు నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది. హైకోర్టు ఆదేశాల వల్ల మా కస్టడీ పిటిషన్‌పై ఈ ఏసీబీ కోర్టు విచారణ జరిపే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో తగినంత గడువు లేకపోవడంతో మేం కోరుకున్న విధంగా చంద్రబాబును 5 రోజుల పోలీసు కస్టడీకి తీసుకోలేకపోయాం’ అని సీఐడీ తన పిటిషన్లో తెలిపింది. చంద్రబాబు సహాయ నిరాకరణ వల్ల అది సాధ్యం కాలేదు... ‘ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో లోతైన కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర వెనుక వాస్తవాలను వెలికితీసేందుకు చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార దుర్వినియోగం, ప్రైవేటు వ్యక్తులకు చేకూర్చిన లబ్ధి గురించి ప్రశ్నించాల్సి ఉంది. సాక్షులు చెప్పిన వివరాలను ఆయన ముందుంచి వాటి ఆధారంగా వాస్తవాలను రాబట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థగా మాపై ఉంది. చంద్రబాబు సహాయ నిరాకరణ వల్ల పలు వివరాలను రాబట్టలేకపోయాం. కీలక ఫైళ్లు గల్లంతయ్యాయి. ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రధాన లబ్ధిదారులుగా అనుమానిస్తున్నాం. గల్లంతైన ఫైళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు చంద్రబాబు కస్టోడియల్ విచారణ అత్యావశ్యకం’ అని సీఐడీ తన పిటిషన్లో పేర్కొంది. ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని దర్యాప్తులో తేలింది... ‘ఈ స్కిల్ కుంభకోణం డబ్బు మొత్తం చివరకు నగదు రూపంలో చేరింది వికాస్ ఖన్వీల్కర్, షెల్ కంపెనీలకు. ఇందుకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని దర్యాప్తులో తేలింది. షెల్ కంపెనీల ద్వారా డబ్బు మొత్తం తిరిగి ఆయనకే చేరింది. సుమన్ బోస్, వికాస్ ఖన్వీల్కర్, లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, సంజయ్ దాగాలు చెప్పిన వివరాల ఆధారంగా చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అని మా దర్యాప్తులో తేలింది. నిధుల మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఏమిటన్న విషయాలు చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. కుట్ర పన్నిన తీరు, ఇతర నిందితుల పాత్ర, ఇతర కీలక వివరాలన్నీ చంద్రబాబుకు తెలుసు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబును 5 రోజుల పాటు మా కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని సీఐడీ తన పిటిషన్లో తెలిపింది. -
5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది. చంద్రబాబు రెండు రోజుల పోలీసు కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు కస్టడీ ముగియడంతో జైలు అధికారులు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంది. విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? కఠినంగా ఏమైనా వ్యవహరించారా? అని ఆరా తీసింది. అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు కోర్టుకు నివేదించారు. విచారణ సందర్భంగా ఆహారం, మందులతోపాటు న్యాయవాదులతో మాట్లాడుకునే వెసులుబాటు తదితర అవకాశాలిస్తూ ఆదేశాలిచ్చామని, వాటిని ఏమైనా అధికారులు ఉల్లంఘించారా? అని న్యాయస్థానం ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. భౌతికంగా ఇబ్బందులకు గురి చేశారా? అని కోర్టు ప్రశ్నించగా, లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇంకేమైనా చెప్పాల్సి ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించడంతో, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, అక్రమంగా జైలులో ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు. మీ పాత్రపై 600కిపైగా డాక్యుమెంట్లు... మీపై ప్రస్తుతం ఉన్నవి ఆరోపణలేనని కోర్టు చంద్రబాబుకు తెలిపింది. సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో మీ పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచిందని పేర్కొంది. సీఐడీ సమర్పించిన ఆధారాలను పరిశీలించి వాటికి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారణకు వచ్చిన తరువాతే జుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు కోర్టు చంద్రబాబుకు తేల్చి చెప్పింది. సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాతనే మీరు దోషినా? నిర్ధోషినా? అన్నది కోర్టు తేలుస్తుందని చంద్రబాబుకు స్పష్టం చేసింది. చట్టాన్ని అనుసరించే ఈ కోర్టు ముందుకెళుతుందని తెలిపింది. సీఐడీ అధికారులు ఈ కేసులో మీ పాత్రకు సంబంధించి 600కిపైగా డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారని తెలిపింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అవన్నీ ఈ దశలో రహస్య డాక్యుమెంట్లే అవుతాయని చంద్రబాబుకు స్పష్టం చేసింది. దర్యాప్తు జరగాల్సిందే.. అది ప్రొసీజర్ దర్యాప్తు అధికారులకు విశిష్ట అధికారాలుంటాయని కోర్టు పేర్కొంది. అయితే మీ హక్కులను, దర్యాప్తు సంస్థ విశిష్టాధికారాన్ని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని, ఇప్పుడు తాము అదే చేస్తున్నామని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు తేల్చి చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, సీఐడీ ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వలేదని చంద్రబాబు పేర్కొనగా, మీకు ఇవ్వదగ్గ డాక్యుమెంట్లు కొన్ని ఉంటాయని, వాటిని మీ న్యాయవాదుల ద్వారా తీసుకోవచ్చని సూచించింది. వాటిని పరిశీలిస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారన్న సంగతి మీకు అర్థం కావచ్చని చంద్రబాబునుద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు జరగాల్సిందేనని, అది ప్రొసీజర్ అని కోర్టు గుర్తు చేసింది. మీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని, దానిపై విచారణ జరపాల్సి ఉందని కోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే బెయిల్ ఇవ్వాలా?వద్దా? అనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుందని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. అందుకోసమే జుడీషియల్ రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మీరు ప్రస్తుతం పోలీసు కస్టడీలో లేరని, కోర్టు కస్టడీలో ఉన్నారని పేర్కొంటూ చంద్రబాబును జాగ్రత్తగా చూసుకోవాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. యాంత్రికంగా ఉత్తర్వులిస్తున్నామా? అంతకు ముందు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో చిన్నపాటి హైడ్రామా నడిపారు. జుడీషియల్ రిమాండ్ పొడిగింపుపై చంద్రబాబు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలిపారు. కోర్టు తనంతట తానుగా రిమాండ్‌ను పొడిగించలేదన్నారు. రిమాండ్‌ను పొడిగించవద్దని కోరారు. పొడిగింపు కోసం సీఐడీ మెమో దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగింపు పిటిషన్ వేయలేదా? అని ఏసీబీ కోర్టు ప్రశ్నించడంతో తాము రిమాండ్ పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదించారు. ఆ కాపీని చంద్రబాబు న్యాయవాదులకు అందచేయాలని పీపీని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం పోసాని స్పందిస్తూ కోర్టు యాంత్రికంగా జుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొనడంపై న్యాయస్థానం ఒకింత తీవ్రంగా స్పందించింది. సీఐడీ తమ ముందుంచిన కేసు డైరీని, సెక్షన్ 164 స్టేట్మెంట్లన్నింటినీ చదివామని, అలాగే 2000 పేజీలపైగా డాక్యుమెంట్లను పరిశీలించామని, వాటన్నింటినీ చూసిన తరువాతనే చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారణకు రావడం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలకు అనుగుణంగానే జుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తేల్చి చెప్పింది. అంతేకానీ మీరు చెబుతున్నట్లు యాంత్రికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. కోర్టు ఆగ్రహంతో ఖంగుతిన్న చంద్రబాబు న్యాయవాది తమ ఉద్దేశం అది కాదంటూ సమర్థించుకునే యత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం న్యాయస్థానం ఆయన రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మాకు సమయం ఎక్కడిస్తున్నారు..? అటు తరువాత ఏసీబీ కోర్టు ఇరుపక్షాలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కోర్టు ఏదీ యాంత్రికంగా చేయడం లేదని పేర్కొంది. ప్రతి చిన్న విషయానికి పలు పిటిషన్లు వేస్తున్నారని, ఒకదాని వెంట మరొకటి పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారని గుర్తు చేసింది. ‘మీరు వేసిన దానికి వారు, వారు వేసిన దానికి మీరు కౌంటర్లు వేస్తారు. వాటిన్నింటినీ ఈ కోర్టు క్షుణ్ణంగా చదవాలి. అర్థం చేసుకోవాలి. చట్టం ఏం చెబుతుందో చూడాలి. కోర్టు ఇన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసేందుకు మీరు కోర్టుకు సమయం ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు పిటిషన్ వేశాం, వినాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందరూ కోర్టుకు సహకరిస్తేనే పనిచేయడం సాధ్యం అవుతుంది. చట్టానికి లోబడే వ్యవహరించాలి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’ అని న్యాయస్థానం పేర్కొంది. -
హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు
-
కరకట్టపై చంద్రబాబు నివాసం జప్తునకు కోర్టు అనుమతి
సాక్షి, విజయవాడ: కరకట్టపై చంద్రబాబు నివాసం(లింగమనేని గెస్ట్‌హౌస్) జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. లింగమనేని రమేష్‌తోపాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతివ్వాలని సీఐడీ కోరగా.. వాదనలు ముగియడంతో ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను జప్తు చేయడంతోపాటు నారాయణ ఆస్తులను పాక్షికంగా జప్తు చేయడానికి అనుమతినిచ్చింది. ఈ ఆస్తులను తాము విక్రయించబోయని సెక్షన్ 8 ప్రకారం అఫిడవిట్లు దాఖలు చేసుకునేందుకు ప్రతివాదులకు కోర్టు అవకాశం ఇచ్చింది. కాగా కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ చెబుతోంది. -
హెరిటేజ్ పై సీఐడీ ఫోకస్...!
-
సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో ఆఫీస్‌ల్లో ఏసీబీ తనిఖీలు: భారీ నగదు స్వాధీనం
సాక్షి, అమరావతి: రాష్ట్రవాప్తంగా ఏసీబీ అధికారులు 7 సబ్ రిజిస్ట్రార్, 2 ఎమ్మార్వో ఆఫీస్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. కోటి 9 లక్షల 28 వేలు నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, నర్సాపురం, విశాఖ, తుని, కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. మేడికొండూరు, జలమూర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. చదవండి: AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే -
వెంకటగిరి మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు
వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ వంటి పలు విభాగాల్లో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ జనార్ధన్‌నాయుడు నేతృత్వంలో ఐదుగురు సీఐలు, 15 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఏసీబీ బృందం మున్సిపల్ కార్యాలయంలో అడుగుపెట్టింది. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీ చేశారు. మంగళవారం కూడా తనిఖీలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 14400 కు ఫిర్యాదుతోనే తనిఖీలు.. వెంకటగిరి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) విభాగంపై 14400, వెబ్సైట్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము తనిఖీలు నిర్వహించినట్లు తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. ఆదరణ పథకం లబ్ధిదారుల వద్ద కట్టించుకున్న నగదులో రికార్డ్ అసిస్టెంట్ పెంచలయ్య వద్ద రూ.14,000 తక్కువగా ఉన్నట్లు, పన్నులు వసూళ్లకు సంబంధించి ఉండాల్సిన నగదులో రూ.25,000 తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. పలు విభాగాల్లోని అధికారుల వద్ద అనధికారికంగా మరో రూ.45,000 నగదు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ రికార్డులను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. -
అవినీతిపరుల గుండెల్లో 14400
సాక్షి, అమరావతి: గతంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడేవారు. ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేద్దామన్నా పెద్ద తతంగమే ఉండేది. కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నా సమయం పడుతుంది. దీనికి పరిష్కారంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొబైల్ యాప్‌ను రూపొందించమని ఏసీబీని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏసీబీ 14400 యాప్‌ను రూపొందించింది. లిఖితపూర్వక ఫిర్యాదు, డాక్యుమెంట్లే కాదు... తక్షణం ఆడియో, వీడియో క్లిప్లతోసహా ఫిర్యాదు చేసే అవకాశం ఇందులో కల్పించింది. ఆ ఫిర్యాదులపై తక్షణం స్పందించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, కాల్‌సెంటర్‌ను పటిష్టపరిచింది. దాంతో అవినీతిపై బాధితులు తక్షణమే ఫిర్యాదు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా వెంటనే స్పందిస్తూ వివిధ రీతుల్లో పరిష్కరిస్తున్నారు. చాలావరకు ఫిర్యాదుదారులు కేసులు పెట్టకుండా సమస్య పరిష్కారాన్ని కోరుతున్నారు. దాంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసిన తరువాత వెనక్కి తగ్గడం, తప్పుడు ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి ఏసీబీ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి అధికారులను ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం, ఆకస్మిక తనిఖీలు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులు మొదలైనవి నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభించిన ఈ మొబైల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 2,402 ఫిర్యాదులు అందాయి. వాటిలో 2,127.. అంటే 88 శాతం ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. మరో 275 ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయి. యాప్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ముగ్గురు అధికారులను అరెస్టు చేసింది. 8 సాధారణ తనిఖీలు, రెండు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. 14400 కాల్‌సెంటర్‌కు ఈ ఏడాది మార్చి 1 నుంచి ఇప్పటివరకు 4,363 ఫిర్యాదులు రాగా వాటిలో 4,132 సమస్యలను పరిష్కరించడం విశేషం. మరో 231 ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయి. అంటే ఏకంగా 94 శాతం సమస్యలను పరిష్కరించింది. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ 13 మంది అధికారులను ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఒకటి నమోదు చేసింది. 14 సాధారణ విచారణలు చేపట్టగా 20 ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అవినీతి అంతమే లక్ష్యం: డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అవినీతిపై సులభంగా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన 14400 మొబైల్ యాప్ విజయవంతమైంది. మొబైల్ యాప్, కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నాం. 100 శాతం కేసులు పరిష్కరించి బాధితులకు అండగా నిలవడమే ధ్యేయంగా ఏసీబీ పనిచేస్తోంది. ► తిరుపతిలో ఓ మందుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా డ్రగ్ కంట్రోల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డి.బాలమురళీ కల్యాణ్ చక్రవర్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నివాసాల్లో తనిఖీలు చేసి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులు కూడా నమోదు చేశారు. ► కాకినాడలో ఓ డెయిరీ ఫాం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న తూర్పు డిస్కం ఏఈ మడికి చంటి బాబు, లైన్‌మేన్ ఎం.సిద్ధార్థ కుమార్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ► కర్నూలు జిల్లాలో లంచం తీసుకుంటున్న ఏఎస్సై షేక్ ఖాదర్ వలీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ► ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్ఆర్ పురం తహశీల్దార్ కె.సతీశ్ ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యాపార సంస్థకు విద్యుత్ సర్వీస్ లైన్ వేసి మీటర్ పెట్టేందుకు అనకాపల్లి జిల్లాలో తూర్పు డిస్కం ఏఈ ఎం.వెంకటరమణ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న 14400 యాప్ ద్వారా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీబీ అధికారులు బాధితునితో మాట్లాడి రంగంలోకి దిగారు. ఆ ఏఈ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక్క రోజులోనే అవినీతి అధికారి ఆటకట్టించడంలో ఏసీబీ మొబైల్ యాప్ కీలక పాత్ర పోషించింది. 14400.. ఈ నంబర్ వింటేనే రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలవుతుంది. ఈ యాప్‌లో ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి, అవినీతి అధికారుల ఆట కట్టిస్టున్నారు. ఇందుకు పై సంఘటనే తాజా ఉదాహరణ. -
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
-
ఏసీబీ వలలో ఎలక్ట్రికల్ ఏఈ.. రూ.2లక్షలు లంచం తీసుకుంటూ
అనకాపల్లి టౌన్: లేబర్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఏఈ శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. జిల్లా ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ వీవీఎస్ఎస్ రమణమూర్తి అందించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది ఏఈగా మహేశ్వరరావు పనిచేస్తున్నారు. బిల్లులను క్లియర్ చేసేందుకు నర్సీపట్నానికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ పైలా రమణ నుంచి మహేశ్వరరావు రూ.3.20 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే.. రమణ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రం ఏఈ మహేశ్వరరావు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ దుకాణం వద్ద రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్లుల మొత్తానికి మహేశ్వరరావుకు 5 శాతం చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు డీఎస్పీ తెలిపారు. ఏఈని శనివారం విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.లక్ష్మణమూర్తి, రమేష్, సతీష్, కిశోర్‌కుమార్, పి.శ్రీనివాసరావు, వి.విజయకుమార్ పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్లో అక్రమాలు: నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: 2014 నుంచి సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాధమిక దర్యాప్తులో గుర్తించారు. తప్పుడు పేర్లు, పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులను దిగమింగినట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్లో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ చేపట్టింది. నలుగురు నిందితులని ఏసీబీ అరెస్ట్ చేసింది. సీఎంఆర్ఎఫ్లో సబార్డినేట్లగా పని చేస్తున్న చదలవాడ సుబ్రమణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేట్ పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకి చెందిన మురళీకృష్ణలను అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడి, పాస్ వర్డులని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్‌తో నిధులు దిగమింగినట్లు ఏసీబీ గుర్తించింది. 2014 నుంచి ప్రజాప్రతినిధులకి ప్రైవేట్ పీఏగా పనిచేస్తూ ధనరాజు అలియాస్ నాని అక్రమాలకి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకు 88 ఫైళ్లలో అక్రమాలని గుర్తించిన ఏసీబీ రూ. కోటి పైనే అక్రమ లావాదేవీలు బ్యాంకు అకౌంట్ల ద్వారా జరిగినట్లు గుర్తించారు. ఏడెనిమిదేళ్లుగా సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ ప్రాధమిక దర్యాప్తులో నిర్ధారించింది. -
తూర్పుగోదావరి జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం
-
ఈఎస్ఐ కుంభకోణం కేసులో నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ బాలరవికుమార్ సహా ఓమ్ని ఎంటర్ ప్రైజెస్ యజమాని కంచర్ల శ్రీహరి, ఓమ్ని హెల్త్ కేర్ యజమాని కంచర్ల సుజాత, మేనేజర్ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. వైద్య పరికరాలు, మెడికల్ కిట్లను 50 నుంచి 400 శాతం అధిక రేట్లకు విక్రయించినట్లు సీబీఐ నిర్థారించింది. ప్రభుత్వ ఖజానాకు రూ.35 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సీబీఐ అధికారులు నిర్థారించారు. అరెస్ట్ చేసిన నలుగురునీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చోడవరం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. భూమి మార్పిడి పేరిట నాలుగు లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఏసీబికి అడ్డంగా దొరికొపోయారు. వీరికి సహకరించిన డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చోడవరం సమీపంలోని నరసాపురం వద్ద ఓ వ్యవసాయ భూమిని నివాసభూమి గా మార్చేందుకు ఓ వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ పనులు చేయకుండా ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది జాప్యం చేశారు. ఈ దశలో దరఖాస్తుదారుడు ఎమ్మార్వో రవికుమార్‌తో పాటు డిప్యూటీ తాసిల్దారు రాజాను కలిసి భూముల రికార్డుల మార్పిడి చేయాలని కోరాడు. ఈ పని పూర్తి చేయాలంటే నాలుగున్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తాసిల్దారు డ్రైవర్ రమేష్ కు ఇవ్వాలని తెలిపారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సదరు వ్యక్తి వారి సూచనల మేరకు డ్రైవర్ రమేష్‌కు నాలుగున్నర లక్షల రూపాయలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వారి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్ర పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. -
‘ఆ ఇద్దరి బెయిల్ రద్దు చేయండి’
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో ఆ కంపెనీ చైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాలకృష్ణన్‌లకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది. కోవిడ్‌ను సాకుగా చూపి బెయిల్‌పై బయటకు వచ్చిన వారు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను, దర్యాప్తులో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దన్న ఆదేశాలను ఉల్లంఘించారని నివేదించింది. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు. నరేంద్రకుమార్ న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు కోరారు. న్యాయమూర్తి వారం మాత్రమే గడువు ఇస్తానన్నారు. ఈ సమయంలో ఏసీబీ న్యాయవాది ఎ.గాయత్రీరెడ్డి విచారణను ఈ నెల 23కు వాయిదా వేయాలని కోరగా అంగీకరించిన న్యాయమూర్తి ఆ మేరకు వాయిదా వేశారు. డైరెక్టర్లతో భేటీ దర్యాప్తును ప్రభావితం చేయడమే.. బెయిల్‌పై బయటకు వచ్చిన నరేంద్రకుమార్ ఇటీవల సంగం బోర్డు డైరెక్టర్లతో పాటు, ఇతర కీలక అధికారులను గుంటూరు నుంచి విజయవాడకు పిలిపించి వారితో నోవాటెల్ హోటల్లో సమావేశం నిర్వహించారని, రెండో నిందితుడైన గోపాలకృష్ణన్‌తో పాటు 25 మంది వరకు పాల్గొన్నారని ఏసీబీ పిటిషన్లో తెలిపింది. దర్యాప్తునకు ఎలా ఆటంకం కలిగించాలి, సహాయ నిరాకరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో నరేంద్రకుమార్ మిగిలిన డైరెక్టర్లకు సూచనలిచ్చారని తెలిపింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురిని గతంలో విచారించామని, ఇప్పుడు వారందరితో సమావేశం నిర్వహించడమంటే దర్యాప్తులో జోక్యం చేసుకోవడమేనంది. నోటీసులకు స్పందించడం లేదు.. సమావేశం నిర్వహించిన తరువాత ఈ కేసులో సాక్షులుగా ఉన్న పలువురు డైరెక్టర్లకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారి నోటీసులు ఇచ్చినా.. అనారోగ్య కారణాలు సాకుగా చూపి విచారణకు రాలేదని తెలిపింది. నరేంద్రకుమార్‌కు రెండుసార్లు నోటీసులు జారీచేసి విచారణకు రావాలని కోరగా.. ఆయన కూడా అనారోగ్య కారణాలు సాకుగా చూపారని తెలిపింది. వారంతా ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని పేర్కొంది. సాక్షులను దారిలోకి తెచ్చుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, నాశనం చేయడం వంటి ఉద్దేశాలతో నరేంద్ర వ్యవహరిస్తున్నారని, ఇది దర్యాప్తులో జోక్యం చేసుకోడమేనని తెలిపింది. దర్యాప్తు అధికారి సీఆర్పీసీ సెక్షన్ 91 కింద నరేంద్రకుమార్‌కు నోటీసు ఇచ్చి కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని కోరారని, ఇలా కోరే అధికారం దర్యాప్తు అధికారికి లేదంటూ ఆయన సమాధానం ఇచ్చారని తెలిపింది. సంగం అక్రమాలకు సంబంధించి నరేంద్రకుమార్ వద్ద ఉన్న డాక్యుమెంట్లు దర్యాప్తునకు ఎంతో కీలకమైనవని పేర్కొంది. సంగం డెయిరీలో జరిగిన పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తులో రాబట్టాలని, వాటి ఆధారాలను తమముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. నరేంద్రకుమార్ మాత్రం దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపింది. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్ -
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడీకి హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి : సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆయనను మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. సంగం డెయిరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరుతూ ఏసీబీ హై కోర్టును ఆశ్రయించారు. ధూళిపాళ్ల నరేంద్రను కోర్టు మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటుగా ఏ2 గోపాలకృష్ణను రెండురోజులపాటు, ఏ3 గురునాథంను ఒకరోజు పాటు హైకోర్టు కస్టడీకి అప్పగించింది. చదవండి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ -
Dhulipalla Narendra Kumar: ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. సంగం డెయిరీలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన నరేంద్ర, అతడికి సహకరించిన మరికొందరిపై ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఎ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం–1988లోని 13(1)(సీ)(డీ), ఐపీసీ సెక్షన్ 408, 409, 418, 420, 465, 471, 120బి రెడ్ విత్ 34 కింద ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణన్, జిల్లా కో ఆపరేటివ్ రిటైర్డ్ అధికారి ఎం.గురునాథం, గతంలో ఎండీగా పనిచేసిన కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు, మరికొందరు నిందితులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ ప్రాథమికంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. దస్తావేజులు, ఫోర్జరీ పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. పాల ఉత్పత్తిదారుల సొసైటీ ఏర్పాటు దగ్గర్నుంచి దాన్ని ప్రైవేటు కంపెనీగా మార్చుకునే వరకు కోట్ల విలువైన ఆస్తులను కొట్టేసేందుకు పక్కా పథకం ప్రకారమే జరిగినట్టు ఏసీబీ నిగ్గు తేల్చింది. ఈ కేసులో ధూళిపాళ్లతోపాటు పి.గోపాలకృష్ణన్, ఎం.గురునాథంలను ఈ నెల 23న ఏసీబీ అరెస్టు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో ఈ నెల 24న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందని, రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు, బెయిల్ ఇవ్వాలని ధూళిపాళ్ల కోర్టును కోరారు. ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఏసీబీ కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది. దీంతో మే 1 నుంచి 5వ తేదీ వరకు ధూళిపాళ్లతోపాటు గోపాలకృష్ణ, గురునాథంలను ఏసీబీ విచారించనుంది. శనివారం ఉదయం ఏసీబీ ప్రత్యేక బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ముగ్గురిని కస్టడీలోకి తీసుకోనున్నట్లు ఏసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. -
లంచం అడిగే.. అడ్డంగా దొరికిపాయే..
సాక్షి, శ్రీకాకుళం: మ్యుటేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన మందస వీఆర్ఓ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మందస మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ పండాకు బుడారిసింగి పంచాయతీలో 67 సెంట్ల భూమి ఉంది. ఆయన మృతి చెందడంతో కుమారుడు రాజేష్‌పండా తన తండ్రి పేరున ఉ న్న భూమికి మ్యుటేషన్ కావాలని పది రోజుల కిందట సోంపేట మండలంలోని కొర్లాంలో గల మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడానికి వీఆర్ఓ బి.రేణుకారాణి రంగంలోకి దిగారు. రూ.3వేలు లంచం ఇస్తే గానీ పని జరగదని రాజేష్ పండాకు తేల్చి చెప్పారు. దీంతో ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. బాధితుడి వాదనలు విన్న ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తన సిబ్బందితో కలిసి మందస తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్వోను పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. సీఐలు భాస్కరరావు, హరి, ఎస్ఐలు సత్యారావు, చిన్నంనాయుడులతో పాటు సుమారు 15 మంది సిబ్బంది బుధవారం మందస తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని మాటు వేశారు. రాజేష్‌పండా నగదును వీఆర్వో రేణుకారాణికి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలోనే ఈ సంఘటన జరగడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎప్పటి నుంచో తహసీల్దార్ కార్యాలయంపై ఆరోపణలు వినిపిస్తుండగా, వీఆర్వో అదే కార్యాలయంలో దొరికిపోవడంతో స్థానికంగా ఈ సంఘటన సంచలనం కలిగిచింది. మందస తహసీల్దార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన వీఆర్ఓ బి.రేణుకారాణిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఆమెను విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం. అధికారులు, ఉద్యోగు లు, సిబ్బంది అవినీతిపై బాధితులు ఏసీబీకి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం జీతం ఇస్తోంది. అవినీతికి పాల్పడితే ఎవ్వరైనా ఉపేక్షించం. 14400 అనే నంబరు కు గానీ, ఏసీబీ డీఎస్పీ 9440446124, సీఐలు 7382629272, 9440446177 అనే నంబర్లకు ఫిర్యాదు చేయాలి. లంచం తీసుకోవడం, ఇవ్వడమూ నేరమే. బాధితులకు ఏసీబీ అండగా ఉంటుంది. – బీఎస్ఎస్వీ రమణమూర్తి, డీఎస్పీ, యాంటీ కరప్షన్ బ్యూరో చదవండి: భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన భర్త -
అవినీతి ఉద్యోగి: రూ.కోటిన్నర అక్రమాస్తులు
సాక్షి, ధవళేశ్వరం: ఇరిగేషన్ హెడ్‌వర్క్స్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లంకుర్తి పద్మారావు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దాడుల్లో సుమారు రూ.1.50 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. పద్మారావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ధవళేశ్వరం మసీదు వీధిలోని పద్మారావు ఇల్లు, మండపేటలోని అతని బావమరిది ఇల్లు, గోపాలపురంలోని చెల్లెలి భర్త ఇల్లు, పద్మారావు పనిచేస్తున్న ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ కార్యాలయంలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ధవళేశ్వరంలోని ఇల్లు, రాజమహేంద్రవరంలో శీలం నూకరాజు వీధిలో ఒక ఇల్లు, మండపేటలో రూ.10లక్షలు విలువైన స్థలం, రూ.10లక్షల బంగారం, కొంత నగదు, వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు 1.50 కోట్లుగా నిర్ధారించారు. పద్మారావు పేరున పలు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని వాటిని పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు, రాజమహేంద్రవరం రేంజ్ సీఐ పీవీ సూర్యమోహనరావు, వి.పుల్లారావు, డి.వాసుకృష్ణ, పీవీజీ తిలక్, ఎస్సైలు టి.నరేష్, బి.సూర్యం పాల్గొన్నారు. ఇరిగేషన్‌లోని పలువురు ఉన్నతాధికారులు పద్మారావుకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. గతంలో పద్మారావుపై ఆరోపణలు వచ్చినా ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. (చదవండి: అవినీతిపై పంజా విసిరిన ఏసీబీ) -
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన హెచ్ఎం
సాక్షి, పశ్చిమ గోదావరి : రెవెన్యూ, ఇతర శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సంఘటనలు చాలానే చూశాం. కానీ విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని జెడ్‌ఎన్‌వీఆర్ హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. జె. శ్రీనివాస్ జెడ్‌వీఎన్‌ఆర్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెనుగొండకు చెందిన పూర్వకాలం విద్యార్థి ఎన్.సూర్యప్రకాశ్ తన పదో తరగతి సర్టిఫికెట్ పోవడంతో హెచ్ఎం శ్రీనివాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ సూర్యప్రకాశ్‌ను రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సూర్యప్రకాశ్ లంచం విషయం వారికి వివరించాడు. అధికారులతో కలిసి స్కూల్‌కు వెళ్లిన సూర్యప్రకాశ్ రూ. 10వేలు శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెచ్ ఎం జే. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. -
అమరావతి: రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
-
అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
సాక్షి, అమరావతి : అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. రాజధాని విషయం ముందే తెలుసుకుని ఎవరెవరు భూములు కొన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతుంది. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీకి చెందిన పలువురు నేతలు, ప్రముఖులు దాదాపు 4,075 ఎకరాల కొనుగోలు చేశారు. అందులో 900 ఎకరాల అసైన్డ్ భూములను దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు తేలింది. కాగా ఈ భూములు కొన్నవారిలో తెల్లరేషన్‌కార్డు దారులుతో పాటు టీడీపీ నేతలు, సన్నిహితులు, బినామీలు భూములు కొన్నట్టు గుర్తించారు. అలాగే టీడీపీ నేతలకు వాటాలు ఉన్న కంపెనీలు కూడా భూములు కొనుగోలు చేశారని తెలిసింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డ వారిలో పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్, పుట్టా మహేష్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. (చదవండి : రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి) సెప్టెంబర్ 3,2015న చంద్రబాబు రాజధాని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే జూన్ 1,2014 నుంచి డిసెంబర్ 31,2014 వరకు భూముల కొనుగోళ్లు జరిగాయని.. 1977 అసైన్డ్ భూముల చట్టం, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని నిర్ధారణ అయింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తింపు జరిగినట్లు తేలింది. లాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు తెలుస్తుంది. నారా లోకేష్ బినామీ వేమూరి రవి కుటుంబం పేరుతో 62 ఎకరాల భూమి, మరో టీడీపీ నేత లింగమనేని రమేష్ భార్యా, బంధువుల పేరిట భూముల కొనుగోలు చేశారు. మాజీ మంత్రి నారాయణ బినామీల పేర్లతో 55 ఎకరాలు కొనుగోలు చేశారని.. అందులో సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, కొత్తపు వరుణ కుమార్, పొత్తూరి ప్రమీల పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి గుమ్మడి సురేష్ పేరుతో 38 ఎకరాలు, మరో మంత్రి రావెల కిషోర్‌బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొన్నట్లు తేలింది. టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధినే మార్చిన బాబు ప్రభుత్వం టీడీపీ నేతల కోసమే గతంలో చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీయే పరిధిని మార్చేసింది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విబిసి కెమికల్స్ సంస్థకు 498 ఎకరాల కేటాయింపులు జరిగినట్లు తేలింది. కాగా భూములు కేటాయించాక సీఆర్డీయే పరిధి మారుస్తూ బాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు ఉన్నట్లు తేలిందని ఏసీబీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకో రేటు, ప్రైవేటు సంస్థలకు మరో రేటుగా నిర్ణయించారని.. 5 ప్రైవేటు సంస్థలకు 850 ఎకరాల భూమి కేటాయింపులోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. (చదవండి : దివీస్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్!) -
రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇటీవల బిల్లు చెల్లింపులు చేసిన నాడు-నేడు, గ్రామసచివాలయ పనులకు సంబంధించిన ఎం.బుక్ లు, బిల్లు చెల్లింపులను, వాస్తవ పనులతో సరిపోల్చుతున్నారు. మరో వైపు ఆమదాలవలస రోడ్లు, భవనాల శాఖ డీఈ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో జరిగిన పనులు, బిల్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పలు విభాగాలలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరులోని రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు విశాఖ పట్నం జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని జాయింట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ రామచంద్రవరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. చదవండి: ఏసీబీ వలలో ‘ఔషధ’ ఉద్యోగులు -
ఎన్నారై ఆసుపత్రికి అచ్చెన్నాయుడు
సాక్షి, గుంటూరు : ఈఎస్ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును శనివారం రాత్రి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈఎస్ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు.(చదవండి : ‘ఈఎస్ఐ స్కామ్‌లో ఎవరి వాటా ఎంతో తేలుస్తాం’) ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్ సెంటర్లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. -
ఎన్నారై ఆసుపత్రికి అచ్చెన్నాయుడు
-
నీరు చెట్టు.. టీడీపీ నాయకులపై కేసులు
బొబ్బిలి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన నీరు–చెట్టు పనుల అక్రమాలపై మళ్లీ కదలిక మొదలైంది. ఏసీబీ అధికారులు ఇప్పుడు అక్రమాలను వెలికి తీసేపనిలో పడ్డారు. అప్పట్లో టీడీపీ నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పనులు చేయకుండా బిల్లులు చేయించుకోవడం... నాసి రకం పనులతో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడంపై అప్పట్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. డీఈఈ, ఏఈలను సస్పెండ్ చేయడం కొంత మొత్తాన్ని రికవరీకి ఆదేశించడం తెల్సిందే. మరింత లోతుగా వెళ్లేందుకు ఏసీబీ అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.5.6 కోట్లకు పైగా ఉపాధి హామీ ద్వారా చేపట్టిన నీరు చెట్టు పనుల్లో అవినీతి చోటు చేసుకున్నట్టు తేలింది. ఇందులో దాదాపు సగానికి పైగా అంటే రూ.3.4 కోట్ల విలు వయిన పనులు ఒక్క రామభద్రపురం మండలంలోనే జరిగినట్టు అప్పట్లో పలు శాఖల అధికారుల విచారణలో తేలింది. ఇప్పుడు తాజాగా ఏసీబీ అధికారులు వీటి వివరాలను సేకరిస్తున్నారు. పలుశాఖలకు సంబంధించి విడుదలైన నిధులు, చేసిన బిల్లులపై ఆరా తీస్తున్నారు. రామభద్రపురం మండలాధికారులకు లేఖలు రామభద్రపురం మండలంలో అభివృద్ధి పనుల ముసుగు లో టీడీపీ నాయకులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అధికారు ల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. దీనిపై విజిలెన్స్ అధికారులు పలుమార్లు విచారణ చేపట్టారు. అక్రమాల గుట్టు తేల్చారు. అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి కోట్లలో బిల్లులు కాజేసినట్టు ఆధారాలు సంపాదించి కేసులు నమో దు చేశారు. ఈ అక్రమాలపై సివిల్ పోలీసులు కూడా కేసు లు నమోదు చేసి అప్పటి అధికార పార్టీ నాయకులను పో లీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. రామభద్రపురంలో 2015–16 ఏప్రిల్ వరకు ఉపాధిహామీ, జలవనరుల శాఖ ఆద్వర్యంలో జరిగిన ఉపాధిపనుల్లో టీడీపీ నాయ కులు పనులు చేయకుండానే ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లు లు చేసుకోవడం.. నాసిరకంగా పనులు చేయడం.. తక్కువ పనిచేసి ఎక్కువగా నమోదుచేçయడం.. తూతూ మంత్రంగా చక్కబెట్టేసి సొమ్ము చేసుకోవడంపై పెద్ద ఎత్తున దుమారం రేగినా వారు లెక్క చేయలేదు. 2017 నవంబర్‌లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డీఈఈ ఆర్.ఆర్.విద్యాసాగర్, ఏఈఈలు శామ్యూల్, రవికాంత్‌తో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. 2015–16లో రూ.5.7కోట్లతో చేపట్టిన 102 ఉపాధిపనులు సక్రమంగా లేవని, కొన్ని పనులు జరగకుండా బిల్లులు చెల్లించినట్లు గుర్తించి నివేదికలు విజిలెన్స్ ఎస్పీ హరికృష్ణకు అందజేశారు. వాటి ఆధారంగా ఆయన 2018 ఏప్రిల్‌లో మండలంలోని మామిడివలస, కోటశిర్లాం, కొండకెంగువ, ఎస్ సీతారాంపురం, ఇట్లామామిడిపల్లిలో అకస్మికంగా పర్యటించి కొన్ని పనుల నాణ్యతను పరిశీలించారు. మొత్తం 102 పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, చెక్‌డ్యాంలు, మదుములు, చప్టాలకు టెక్నికల్ మంజూరు లేకుండా పనులు జరిపినట్లు, నాసిరకంగా నిర్మించడంతో పాటు ఉపయోగంలేని పనులు చేసినట్లు గుర్తించారు. మొత్తం నిధుల్లో సుమారు రూ.4 కోట్ల వరకు అవకతవకలు జరిగి నిధులు స్వాహా అయినట్లు నిర్థారించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అప్పగించినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఉపాధిహామీ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి ఎంబుక్, చెక్ మెజర్‌మెంట్లలో మామిడివలస, నాయుడువలస, కోటశిర్లాం, తారాపురం గ్రామ సర్పంచ్‌లు తమ సంతకం ఫోర్జరీ చేశారని అప్పటి ఇరిగేషన్ ఈఈ జి.వి.రమణ ఫోలీసులకు పిర్యాదు చేసినా నామమాత్రంగా విచారణ జరిపినా చర్యలు తీసుకోలేదు. నాటి అక్రమాలపై ఏసీబీ ఆరా... రామభద్రపురంతో పాటు పలు మండలాల్లో 2015–16లో చేపట్టిన ఉపాధిహామీ పనులకు సంబంధించి ఎంబుక్‌లు, ఎఫ్‌టీవోలు, వర్క్ కమిట్మెంట్ లెటర్స్ తదితర వివరాలు పంపించాలని విజయనగరం ఏసీబీ డీఎస్పీ కార్యాలయం నుంచి ఎంపీడీఓకు లేఖ అందజేశారు. ఈ విషయాన్ని రామభద్రపురం ఎంపీడీఓ బి.ఉషారాణి ధ్రువీకరించారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఏసీబీ అధికారులు కోరిన సమా చారం సిద్ధం చేయమని చెప్పినట్టు అప్పటి ఈఈ జి.వి.రమణ తెలిపారు. తన సంతకాన్ని అప్పట్లో సర్పంచ్‌లే ఫోర్జరీ చేసినట్టు పోలీసులకు తానే ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో కమిన్స్‌మెంట్ లెటర్లు, ఎం బుక్‌లు, పే ఆర్డర్ కాపీలు, ఎఫ్టీఓలు(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు), బ్యాంక్ లావాదేవీల కాపీల వంటి పలు వివరాలు ఏసీబీ అధికారులు కోరారు. -
చక్రం తిప్పిన పితాని కుమారుడు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించిన ఈఎస్ఐ స్కాం మూలాలు జిల్లాలో బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. పితాని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఈ వ్యవహారంలోచక్రం తిప్పినట్లు ఏసీబీ ఆధారాలు సంపాదించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట్, పితాని పీఎస్ మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్ను శుక్రవారం ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 శాతం కమీషన్ చెల్లిస్తేనే పనులు? తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పనిజరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది. తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారు. పితాని వెంకట్ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మంత్రి పీఎస్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలు సంపాదించిన ఏసీబీ పితాని పీఎస్ మురళీమోహన్ను శుక్రవారం అదుపులోకి తీసుకుంది. మురళీమోహన్ సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. (ఎందుకు దాస్తున్నారు?) -
ఎవరి వాటా ఎంత?
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం క్రైం/సాక్షి, గుంటూరు: చంద్రబాబు జమానాలో చోటు చేసుకున్న కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐ) స్కామ్‌లో ఎవరి వాటా ఎంత అనే లెక్కలు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ స్కామ్‌లో 19 మంది ప్రమేయాన్ని గుర్తించిన ఏసీబీ ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేయడం, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాలకోసం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉందన్న ఏసీబీ వినతి మేరకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును మూడు రోజులపాటు, మిగిలిన నిందితుల్ని రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారుల బృందం గురువారం సాయంత్రం అక్కడే విచారించింది. మరోవైపు రాజమహేం ద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు జి.విజయకుమార్, సీకే రమేష్‌కుమార్, సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌లను ఏసీబీ అధికారులు గురువారం తమ కస్టడీలోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిందితులను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కరికి 14 నుంచి 19 ప్రధాన ప్రశ్నలు సంధించి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్లలో నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారంటూ ఈ కేసులో మాజీ డైరెక్టర్ విజయ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించిన 02–11–2017 నుంచి 07–05–2019 వరకు జరిగిన అనేక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ► మీ పదవీకాలంలో సర్జికల్, ల్యాబ్ కిట్స్, ఫర్నిచర్, వైద్య పరికరాలు, బయోమెట్రిక్ మిషన్లు, మందులు ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారు? వాటి కొను గోళ్లకు అధికారిక బడ్జెట్ ఎంత కేటాయించారు? వాటి కొనుగోళ్లలో బిల్లు చెల్లింపులు ఎలా చేశారు? ఓపెన్ టెండర్, ఇ–ప్రొక్యూర్మెంట్, స్మాల్ టెండర్ కొటేషన్స్ వంటి విధానాలు ఎందుకు అనుసరించలేదు? ► కొనుగోళ్లకు ముందు ఈఎస్ఐ యూనిట్లలో ఎంత మేరకు మందులు అవసరమనేది నిర్ధారించారా? ► కడప, విజయవాడ జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఈఎస్ ఐలలో అవసరానికి మించి నిల్వ ఉంచిన మందుల విలువ రూ.6.9 కోట్లా, రూ.8.9 కోట్లా? అవసరం లేకుండా అంత విలువైన మందులెందుకు కొన్నారు.. వాటిని నిరుపయోగంగా ఎందుకు వదిలేశారు? ► రూ.లక్షకు మించి వైద్య పరికరాలు కొనుగోలు చేయాలంటే ఈ–టెండర్ పిలవాలనే నిబంధన ఎందుకు పాటించలేదు? నామినేషన్ పద్ధతిపై కొనుగోళ్లు ఎందుకు జరపాల్సి వచ్చింది? లెజెండ్, అవన్టర్, ఒమేని సంస్థల వద్ద ల్యాబ్ కిట్ల కొనుగోలులో విధానపరమైన నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? అంటూ ప్రశ్నించారు. మూడు గంటలపాటు విచారణ.. ► ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి, ఎం.సూర్యనారాయణరెడ్డిల నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం సాయంత్రం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌ను కలిసి అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించిన పత్రాలను సమర్పించారు. అనంతరం అచ్చెన్న ఉన్న పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్‌లోని గదికి చేరుకున్న అధికారులు.. డాక్టర్ రాజ్యలక్ష్మి, న్యాయవాది హరిబాబు సమక్షంలో విచారణ ప్రక్రియను చిత్రీకరిస్తూ అచ్చెన్నను సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు విచారించారు. ► అధికారులు వరుసగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన అచ్చెన్న, మరికొన్ని ప్రశ్నలకు సమాధానం దాటేసినట్టు సమాచారం. టెలీ హెల్త్ సర్వీసెస్ ఇచ్చిన సిఫార్సు లేఖపైనే విచారణంతా కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణకు అచ్చెన్న సహకరించారని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అక్రమాలకు పాల్పడేలా మీపై ఎవరు ఒత్తిడి తెచ్చారు? ► నిబంధనలకు విరుద్ధంగా మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు ఆస్కార మిచ్చేలా మీపై ఎవరు ఒత్తిడి తెచ్చారు? మీ పాత్ర ఎంత? మీకు కలిగిన లబ్ధి ఎంత? అంటూ ఈ కేసులో ఎ–6 అయిన సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, ఎ–8 అయిన రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్లను ప్రశ్నించారు. ► నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున మందుల సరఫరా డీల్‌ను ఎలా సాధించారు? ఇందుకు రాజకీయ నేతలను ఎలా ప్రసన్నం చేసుకున్నారు? మందుల కొనుగోళ్ల ఆర్డర్ మీకే దక్కేలా ఎవరె వరికి ఎంతిచ్చారు అంటూ ఎ–15 నిందితుడైన మందుల ఏజెన్సీ నిర్వాహకుడు వెంకట సుబ్బారావును ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. -
టీడీపీ వ్యూహం.. అట్టర్ ఫ్లాప్
సాక్షి, శ్రీకాకుళం: ‘నువ్వు మగాడివైతే... రాయలసీమ రక్తం నీలో ఉంటే... ఆరోపణలను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. టెండర్లు పిలిచి అవినీతి చేసినట్టు సోదాల్లో తేలితే వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు మగతనం ఉంటే ఈ చాలెంజ్‌కు రమ్మంటున్నా’ అంటూ అసెంబ్లీ సమావేశాల్లో ఓ సందర్భంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టెండర్లు పిలిచిన పనుల సంగతి ఏమిటో.. ప్రస్తుతం పలు అభివృద్ధి పనులకు నిర్వహిస్తున్న రివర్స్ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదా అవుతున్న వేల కోట్ల రూపాయలే నిరూపిస్తున్నాయి. వాటిని పక్కన పెడితే టెండర్లు పిలవకుండానే ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోలులో నామినేషన్ పద్ధతిలో కోట్లు కొల్లగొట్టారని అటు విజిలెన్స్, ఇటు ఏసీబీ నిగ్గు తేల్చాయి. పక్కా ఆధారాలతోనే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు చేయాల్సింది తాను అవినీతి చేయలేదని న్యాయస్థానంలో నిరూపించుకోవడమే. లేదంటే శాసనసభలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని విశ్లేషకులు ఒకవైపు అంటుండగా... అవినీతికి పాల్పడి దాన్ని కులానికి ఆపాదించడం ఎంతమేరకు సమంజసమని బీసీ వర్గాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. చదవండి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ రివర్స్ అయిన బీసీ కార్డు వ్యూహం బీసీ నినాదంతో ఈఎస్ఐ స్కామ్‌ను పక్కదారి పట్టిద్దామని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వారికి కనీస మద్దతు లభించలేదు. పసలేని ప్రచారం అంటూ బీసీ వర్గాలు కొట్టి పారేశాయి. ఇలాంటి వాటికి మద్దతు ఎందుకిస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నాయి. తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దాన్ని కులానికి అంటగట్టడమేంటని, బీసీలను అణగదొక్కుతున్నట్టు టీడీపీ నేతలు కామెంట్లు చేయడమేంటని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎక్కడా బీసీల నుంచి అచ్చెన్నాయుడికి మద్దతు లభించలేదు. అంతెందుకు సొంత జిల్లాలోనే బీసీలు అండగా నిలవలేదు. అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించాలని అంతర్గతంగా సంకేతాలు వెళ్తున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. ఎంతసేపూ టీడీపీ నేతలు పచ్చ మీడియా ద్వారా పదేపదే బీసీ నేతపై కక్ష సాధింపు చర్యగా అభివర్ణించుకుంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. టీడీపీ నేతలు చేసిన అవినీతికి తామెందుకు మద్దతిస్తామని, తప్పు చేసినవారు అరెస్టయితే తామెందుకు ఖండిస్తామని బాహాటంగానే బీసీ నేతలు చెబుతున్నారు. వీటి సంగతి తేల్చితే అచ్చెన్న గుట్టంతా రట్టే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నంతకాలం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తిత్లీ పరిహారంపై సమగ్ర విచారణ జరిపితే అచ్చెన్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. నీరు చెట్టు, చంద్రన్న బీమా, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల రూపకల్పన, గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం, సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే ఈయనగారి బాగోతం మరింత బయటపడనుంది. ఇప్పటికే అచ్చెన్న అక్రమాలపై టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ పలు విచారణ సంస్థలకు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. వాటి లెక్క తేలితే అచ్చెన్నకు ఉచ్చు మరింత బిగుస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏ స్థాయిలో అవినీతి జరిగిందో జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. అందుకనే అచ్చెన్న అరెస్టును జిల్లా ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. తప్పు చేశాడు కాబట్టి అరెస్టయ్యాడని అంటున్నారు. చదవండి: కౌంట్‌డౌన్ స్టార్ట్.. అచ్చెన్న ఆటకట్టు ఈఎస్ఐ స్కామ్ నిందితుడికీ బీసీలకు ముడిపెట్టడం సరికాదు ఈఎస్ఐ స్కామ్‌లో రూ.150 కోట్లకు పైగా అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను బీసీలతో ముడిపెట్టడం హేయమైన చర్య. గతంలో బీసీ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు సమక్షంలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడే వెనుకబడిన వర్గాలకు చెందినవాడిగా చెప్పుకునే నైతిక హక్కు కోల్పోయారు. అవినీతి చేసిన వారెవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే. –బొడ్డేపల్లి దామోదరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆల్ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ నిందితులు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే అంబేడ్కర్ రాజ్యాంగంలో అవినీతి చేసే వారి కోసం ప్రత్యే క రిజర్వేషన్ ఏమీ ఇవ్వలేదు. చట్టం ముందు అందరూ సమానమే. కారి్మకుల కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ వస్తువులు, కంప్యూటర్ల కొనుగోలులో నాన్‌రేట్ కాంట్రా క్ట్కి అప్పగించడం దారుణం. ప్రజాధనం దోచుకున్నవారికి శిక్ష వేయాలి. అవినీతి చేసి బీసీలనడం బీసీ జాతికే అవమానకరం. –డబ్బీరు శ్రీనివాసరావు (వాసు), ఏఐబీసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మోపిదేవిని అరెస్ట్ చేయించినప్పుడు ఏమైంది బీసీ కార్డు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాని కి చెందిన మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది బీసీల మీద ఈ ప్రేమ? ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినప్పుడు ఏమైంది అణగారిన వర్గాలపై ప్రేమ. 2014 ఎన్నికల ముందు నాయీబ్రాహ్మణులకు, మత్స్యకారులకు హామీలిచ్చి మోసగించినప్పుడు ఏమైంది ఈ ప్రేమ? ఈఎస్ఐ స్కామ్‌లో అడ్డంగా దొరికిన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడే బీసీలు గుర్తొచ్చారా? – డి.పి.దేవ్, ఏఐబీసీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, శ్రీకాకుళం -
కౌంట్‌డౌన్ స్టార్ట్.. అచ్చెన్న ఆటకట్టు
మేతగాళ్లకు మేతగాడు.. మందుల పేరుతో కోట్లు మింగిన మాయలోడు.. ఏసీబీ అధికారులకు చిక్కాడు.. గత ప్రభుత్వంలో కారి్మక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడి పాత్రపై అవినీతి నిరోధక శాఖ సమస్త సమాచారం సేకరించింది. అధికారులు అన్ని ఆధారాలతో నిమ్మాడలోని ఆయన ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడి దందాలను, గతంలో చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కాలం ఎవర్నీ వదిలిపెట్టదు. ఎంతటి వారైనా తప్పు చేస్తే డైరీలో నమోదు చేసుకుంటుంది. టైం వచ్చినప్పుడు లెక్క తేలుస్తుంది. అక్రమార్కుల భరతం పడుతుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి విషయంలో అదే జరిగింది. తప్పులు చేసేసి... పెద్ద నోరు ఉందని గట్టిగా కేకలేసేసి... తానేదో నిజాయితీపరుడన్నట్టు డ్రామాలాడితే ప్రజలు ఎన్నాళ్లు నమ్ముతారు? చేసిన తప్పులు ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఎట్టకేలకు అచ్చెన్నాయుడి పాపం పండింది. (ఈఎస్ఐ కుంభకోణానికి ఆయనే ‘డైరెక్టర్’?) ఏసీబీ అధికారులు ఉదయం సరిగ్గా 6.50 గంటలకు ఆయన స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని ఇంటికి వెళ్లి అరెస్టు సమాచారాన్ని తెలియజేశారు. 7.20 గంటల సమయంలో అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం కార్యాలయం సీఐయూ యూనిట్ డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు సమాచారాన్ని ఆయన భార్య, సోదరుడి కుమారుడు కుమారుడు కింజరాపు సురేష్‌కుమార్, లాయర్లకు తెలియజేశారు. అరెస్ట్ ఇంటిమేషన్ అందినట్టు సురేష్‌కుమార్ సంతకం తీసుకున్నారు. అచ్చెన్నాయుడిని విజయవాడ తరలించారు. (అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్) అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు చేసిన విచారణలో అచ్చెన్నాయుడి పాత్ర వెలుగు చూడటంతో పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్వగ్రామమైన నిమ్మాడలో నివాసమున్నట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6.50 గంటలకు అచ్చెన్నాయుడి నివాసంలోని మూడో అంతస్తుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మీ ప్రమేయం ఉందని, దాని కారణంగా అరెస్టు చేస్తున్నట్టుగా తెలిపారు. ‘అప్పుడే విచారణ పూర్తయిపోయిందా?’ అని ఏసీబీ అధికారులను అచ్చెన్నాయుడు ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణ పూర్తయిందని, అక్రమాల్లో మీ పాత్ర ఉందని తేలడంతో అరెస్టు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలియజేయడంతో ఎటువంటి ప్రతిఘటనకు పాల్పడకుండా 7.20 గంటల సమయంలో అరెస్టయ్యారు. టీడీపీ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి గలాట చేస్తారేమోనని పోలీసులు భావించినప్పటికీ ఆశించినంతంగా అక్కడికి రాలేదు. అచ్చెన్నాయుడికి సన్నిహితంగా ఉన్న నాయకులు మాత్రమే చేరుకున్నారు. ఈఎస్ఐ అక్రమాలివే.. రూ.975.79 కోట్ల విలువైన మందులతోపాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారు రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫరి్నచర్ రూ.975.79 కోట్ల మేర పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. ►సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. ►టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది. లేబోరేటరీ పరికరాలను ఎలాంటి టెండర్లు లేకుండా లెజెండ్ అనే సంస్థకు ఇచ్చారు. ►శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62 కోట్ల మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70 శాతం అధికం. ►ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో ఇ.రమేష్‌బాబు, కె.ధనలక్ష్మి తదితరులు ఉన్నారు. ►రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70 కోట్ల మేర అదనంగా చెల్లించినట్టు తేలింది. ►కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలన పడేశారు. ►జెర్సన్ ఎంటర్ ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేష్‌కుమార్ రూ.9.50 కోట్లు చెల్లించారు. ►రూ.16,992 విలువైన బయోమెట్రిక్ యంత్రాలను రూ.70,760 చొప్పున కొనుగోలు చేశారు. అడుగడుగునా అవకతవకలే.. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అండతో అచ్చెన్నాయుడు చెలరేగిపోయారు. అడ్డొచ్చిన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడి కోట్లాది రూపాయల కార్మికుల సొమ్మును కాజేశారు. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులు టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై అప్పగించాలని అచ్చెన్నాయుడు సిఫారుసు లేఖ ఇచ్చినట్టు పేర్కొన్న విజిలెన్స్ విచారణ నివేదిక మేరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టగా అక్రమాలు బయటపడ్డాయి. ఇదే కాదు టీడీపీ హయాంలో నీరు చెట్టు, చంద్రన్న బీమా, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల రూపకల్పన, వివిధ అభివృద్ధి పనుల్లో నిధులు పక్కదారి పట్టించారు. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఇన్ని అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు నీతివంతుడిలా మాట్లాడుతుంటారు. బీసీ కార్డు బయటకు తీసిన తెలుగు తమ్ముళ్లు.. పట్టించుకోని బీసీలు.. నిజాయితీపరులమని,న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పాల్సిందిపోయి.. ఇది బీసీ నేత ను అణగదొక్కే ప్రయత్నమని టీడీపీ నేతలు దు్రష్పచారానికి ఒడిగట్టారు. బీసీలను రెచ్చగొట్టే ప్ర యత్నం చేస్తున్నారు. కానీ బీసీలెవరూ ఈ పరిణామాలను పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పు డు ఒకరిద్దరు వ్యక్తిగత లబ్ధి పొందారే తప్ప తమ ను పట్టించుకోలేదని, మరింత తొక్కేశారని బీసీలంతా భావిస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబునాయుడు బీసీలకు 110కి పైగా హామీలు ఇచ్చి.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. బీసీల్లో రజకులను, నాయీ బ్రాహ్మణులను, బోయీలను, మత్స్యకారులను ఇతర కులాలను ఎస్టీ, ఎస్సీల్లో చేర్చుతామని, గాండ్ల, సగర, పూసల, కురభ, బోయ, పద్మశాలీ తదితర కులాలను బీసీ డి నుంచి బీసీ ఎ కు మార్చుతామని దొంగ హామీ లు ఇచ్చి ఆ తర్వాత మోసం చేశారు. హామీలు అమలు చేయమని అడిగిన మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులతోపాటు ఇతర కుల సంఘాల నాయకులపై తోక కత్తిరిస్తానని, తాట తీస్తానని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు పరుస్తానని ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చాక హామీ ప్రకారం రూ. 40 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఏడు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు ఎటువంటి ప్రయోజనాలు కలి్పస్తున్నదీ అందరికీ తెలిసిందే. బీసీలకు పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకుని.. టీడీపీ నేతల కపట నాటకాలపై బీసీలు చర్చించుకుంటున్నారు. -
అచ్చెన్న.. ఖైదీ నెంబర్ 1573
సాక్షి, విజయవాడ : ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన కింజరాపు అచ్చెన్నాయుడుకి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 1573 కేటాయించారు. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయన్ని న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించనున్నారు. అలాగే ఇదే కేసులో అచ్చెన్నాయుతో పాటు సీబీఐ అనుమానిస్తున్న మరో నలుగురు మద్దాయిలను కూడా నేడు (శనివారం) విచారించనున్నారు. అనంతరం వీరందరినీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు జమానాలో ఈఎస్ఐలో జరిగిన రూ.151 కోట్లకు పైగా కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధాన పాత్రధారిగా ఏసీబీ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. (రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ) -
ఈఎస్ఐ స్కామ్‌కు ఆయనే ‘డైరెక్టర్’?
రాజమహేంద్రవరం క్రైం : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ గాడి విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకొని విజయకుమార్‌ను ఆయన స్వగృహంలో అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, పరికరాల భారీ కుంభకోణం ఈయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడే జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా.. ఏసీబీ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ కావడంతో విజయకుమార్‌ను అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ హాస్పిటల్లో రేడియాలజిస్ట్‌గా విధులలో చేరారు. ఇక్కడే ఎక్కువ కాలం విధులు నిర్వహించి ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విజయవాడలో ఈఎస్ఐ హాస్పిటల్స్ ఇన్చార్జ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మందులు, పరికరాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణలో పలు విషయాలు వెలుగు చూడడంతో విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.(అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్) రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించడంతో లబ్ధి విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో వివిధ హోదాలలో పనిచేశారు. రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు వద్ద అపోలో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగులను తన స్వంత స్కానింగ్ సెంటర్‌కు తరలించి లబ్ధి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్కువ సమయం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉండకుండా స్కానింగ్ సెంటర్లో ఉండడంతో అప్పట్లో సహోద్యోగులతో విభేదాలు వచ్చాయని వినికిడి. జిల్లాలో ఒక ఈఎస్ఐ ఆసుపత్రి, ఎనిమిది ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా, చికిత్స కోసం వచ్చే రోగులను 14 ప్రైవేటు క్లీనిక్‌లకు, 11 ప్రైవేటు ప్యానల్ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. రోగులకు ఇచ్చే మందులు, మెడకు వేసే నెక్ కాలర్, ఎముకలు విరిగిన సమయంలో కట్లు వేసేందుకు ఉపయోగించే పరికరాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈయన ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కుంభకోణాలు వ్యతిరేకించే వారు ఒక వర్గంగాను, సమర్ధించేవారు మరో వర్గంగా విభేదాలు వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. -
రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా సంస్థ) ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో రూ.150 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మందుల స్కాంలో 19 మంది ప్రమేయం... ♦ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్–డిమ్స్) విభాగంలో 2014–15 నుంచి 2018–19 వరకు జరిగిన కొనుగోళ్లపై విచారణ నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ♦ ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన ఈ వ్యవహారంలో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిపి 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ నిమ్మాడలో అదుపులోకి తీసుకుంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు డాక్టరు సీకే రమేష్‌కుమార్‌ను తిరుపతిలో, డాక్టర్ జి.విజయ్‌కుమార్‌ను రాజమహేంద్రవరంలో అరెస్టు చేసింది. ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న డిమ్స్ ఉద్యోగులు డాక్టర్ జనార్దన్, ఇ.రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను కూడా అరెస్టు చేసింది. మార్కెట్ ధరకన్నా అధికంగా చెల్లింపులు.. ♦ మందులు, ల్యాబ్ కిట్స్, శస్త్రచికిత్స పరికరాలు, ఫర్నిచర్, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లతో పాటు కాల్‌సెంటర్, ఈసీజీ సర్వీసుల ఒప్పందాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ♦ మార్కెట్ ధర కన్నా 50 నుంచి 129 శాతం అధికంగా చెల్లించి మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొన్ని సంస్థలతో కుమ్మక్కై ఇ–టెండర్లో కాకుండా నామినేషన్ విధానంలో కొనుగోళ్లు జరిపారు. ♦ కొందరు ‘డిమ్స్’ ఉద్యోగులే తమ కుటుంబ సభ్యుల ద్వారా బినామీ కంపెనీలను సృష్టించారు. తప్పుడు ఇన్వాయిస్లు, బిల్లులతో రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. ఈసీజీకి డబుల్కిపైగా చెల్లింపులు... ♦ టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడి ఆదేశాలతో అప్పటి డిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేష్‌కుమార్ టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ♦ టెలిమెడిసిన్‌కు సంబంధించి కాల్‌సెంటర్, టోల్ ఫ్రీ, ఈసీజీ సేవల ఒప్పందం లోపభూయిష్టంగా జరిగింది. ఇతర ఆస్పత్రుల్లో సుమారు రూ.200 మాత్రమే ఖర్చు అయ్యే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు. ♦ కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్‌కి కాకుండా సర్వీసు ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్ ఐపీకి, ఫేక్ కాల్స్ లాగ్స్‌కి ఒక్కో కాల్కి రూ.1.80 చొప్పున బిల్లులు చెల్లించారు. ♦ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ ప్లాంట్ ఏర్పాటులోనూ అవకతవకలు, అవినీతి చోటుచేసుకుంది. -
కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న అనేక అవినీతి అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణం నుంచి కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బయటపడుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ఇష్టారాజ్యంగా దోచుకున్న సొమ్ము నేడు బహిర్గతమవుతోంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ తేల్చింది. దీంతో ఈఎస్ఐ స్కాం మరోసారి తెరపైకి వచ్చింది. సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) డైరెక్టర్లుగా డాక్టర్ బీ.రవికుమార్, సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్ జీ.విజయ్‌కుమార్ వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషథాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫర్నీచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ.975.79 కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఆ కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. (నకిలీ బిల్లులతో అచ్చెన్నాయుడు స్కాం) ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్ కేంద్రాలలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాలు – ముఖ్యమైన పాయింట్స్: విజిలెన్సు విచారణలో బయటపడ్డ అంశాలు నాన్ రేటు కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి దాఖలైన కొటేషన్లన్నీ నకిలీవి అని విచారణలో గుర్తించారు. కొటేషన్లు, వాటి కవర్లపై చేతి రాతలన్నీ ఒకేలా ఉన్నాయి. అవి డెరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్) సిబ్బందివిగా తేల్చారు. వాటిని తామే రాసినట్లు డీఐఎంఎస్‌కు చెందిన ఫార్మసిస్ట్ కె.ధనలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ ఇ.రమేష్‌బాబు అంగీకరించారు. ఆ కొటేషన్ల ఆధారంగా ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు సర్జికల్ ఐటెమ్స్, ల్యాబ్ కిట్లు, ల్యాబ్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు డైరెక్టర్లు కొనుగోళ్లు ఆర్డర్లు జారీ చేశారు. తమకు అనుకూలమైన కంపెనీకే ఆర్డర్ ఇచ్చేలా ఆ విధంగా నకిలీ కొటేషన్లు సృష్టించారు. పరిమితికి మించి ఔషధాల కొనుగోలు ఆ డైరెక్టర్ల హయాంలో మందులు, ఔషధాల కొనుగోలు కోసం రూ.293.51 కోట్లు కేటాయించగా, యథేచ్ఛగా ఆ పరిమితిని మించి రేట్ కాంట్రాక్ట్, నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఏకంగా రూ.698.36 కోట్ల విలువైన మందుల, ఔషధాలు కొనుగోలు చేశారు. నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలను తుంగలో తొక్కారు. నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మందులు, ఔషధాలు కొనుగోలు చేసిన తీరులో జరిగిన అక్రమాలు చూస్తే, కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి నెలకొంది. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్) అదనంగా చెల్లింపులు ర్యాన్‌డమ్‌గా చేసిన తనిఖీలో పర్చేజ్ ఇన్వాయిస్ ప్రైజ్, సేల్ ఇన్వాయిస్ ప్రైజ్ మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మాల నుంచి రూ.15.93 కోట్ల విలువైన మందులు, ఔషధాలు కొనుగోలు చేశారు. ఆ మేరకు ఐఎంఎస్ డైరెక్టర్లు పర్చేజ్ ఆర్డర్లు జారీ చేశారు. అయితే ఆ రెండు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల ఇన్వాయిస్ ప్రైజ్ ప్రకారం ఆ మందులు, ఔషథాల అసలు ధర రూ.8.52 కోట్లు మాత్రమే. దానికి 20శాతం మార్జిన్ (లాభం) వేసుకుంటే ఆ ధర రూ.10.22 కోట్లు అవుతుంది. కానీ ఐఎంఎస్ డైరెక్టర్లు మాత్రం ఏకంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. ఆ విధంగా కేవలం ఆ రెండు సంస్థలకు మాత్రమే రూ.5.70 కోట్లు అదనంగా చెల్లించారు. ఆ విధంగా అనేక నాన్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఐఎంఎస్ డైరెక్టర్లు ఇష్టారాజ్యంగా అధిక ధరలు చెల్లించి మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు. నిబంధనలు బేఖాతరు.. అధిక ధరలకు కొనుగోలు నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మాత్రమే అత్యధికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉన్నప్పటికీ ఐఎంఎస్ డైరెక్టర్లు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. అన్నింటినీ తుంగలో తొక్కి అత్యధిక కొనుగోళ్లు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచే జరిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. ఆ విధంగా 2014–15 నుంచి 2018–19 వరకు 5 ఏళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్లు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.89.58 కోట్ల విలువైన మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు. అయితే అవే ఔషధాలు రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి కొనుగోల చేసి ఉంటే కేవలం రూ.38.56 కోట్లకు వచ్చేవి. కానీ ఆ సంస్థలకు పర్చేజ్ ఆర్డర్ ఇవ్వకుండా నాన్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మందులు, ఔషథాలు కొనుగోలు చేయడం ద్వారా రూ.51.02 కోట్లు అదనంగా చెల్లించారు. ఇది ఏకంగా 132 శాతం అధికం. ఆ విధంగా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు 2014–15లో 131.80 శాతం, 2015–16లో 159.40 శాతం, 2016–17లో 136.27 శాతం, 2017–18లో 198.66 శాతం, 2018–19లో 80.04 శాతం అధికంగా చెల్లించారు. అలా గత 5 ఏళ్లలో సగటున 132.30 శాతం అధికంగా చెల్లించారు. అనవసర కొనుగోళ్లు.. తమ వారికే ఆర్డర్లు అవసరాలకు మించి కొనుగోలు చేయడం వల్ల వాటిలో చాలా వరకు నిరుపయోగంగాను ఉండిపోయాయి. ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలలో గత ఏడాది కాలంగా రూ.232.32 కోట్ల విలువైన ఔషధాలు, సర్జికల్ ఐటెమ్స్ నిరుపయోగంగా ఉన్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలో గుర్తించారు. ఐఎంఎస్ డైరెక్టర్లు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల్లో జెర్కాన్ ఎంటర్ప్రైజెస్ రావిల రవితేజస్వికి చెందినది కాగా, ఆమె డిఐఎంఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌కు చెందిన ఫార్మసిస్టు కె.ధనలక్ష్మి కోడలు. అందుకే ఆ సంస్థకు ఐఎంఎస్ డైరెక్టర్లు ఉదారంగా పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్ జి.విజయకుమార్ ఇద్దరూ జెర్కాన్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఏకంగా రూ.9.50 కోట్ల పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు. ఆ విధంగా ఆ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కల్పించారు. ఔషధాలు డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఐఎంఎస్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలు.. విజయనగరానికి చెందిన ఎస్కేపీ ఎంటర్ప్రైజెస్, నర్సారావుపేటకు చెందిన సీతారామ్ ఫార్మాస్యూటికల్స్ నుంచి రూ.5.71 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. ల్యాబ్ కిట్స్ వాస్తవానికి ల్యాబ్ కిట్స్‌ను హెమోక్యూ, బయోరాడ్, సీమెన్స్ వంటి ప్రొప్రైటరీ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఐఎంఎస్ డైరెక్టర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ కూడా యథేచ్ఛగా నియమావళి ఉల్లంఘించి నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేశారు. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, అవాంతర్ పర్ఫార్మెన్సెస్ ఇండియా లిమిటెడ్, ఓమ్ని మెడి వంటి నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి నామినేషన్ పద్ధతిలో రూ.237 కోట్ల విలువైన ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేశారు. ఆ విధంగా ఆయా సంస్థలకు 36 శాతం అధిక ధరలు చెల్లించారు. సర్జికల్ ఐటెమ్స్.. ఫర్నీచర్ కొనుగోలు ఇక్కడ కూడా ఐఎంఎస్ డైరెక్టర్లు బహిరంగ టెండర్లు పిలవకుండా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.47.77 కోట్ల విలువైన సర్జికల్ ఉపకరణాలు కొనుగోలు చేశారు. దీంతో పాటు ఏ ఇండెంట్ లేకుండా మరో రూ.8.06 కోట్ల విలువైన సర్జికల్ ఐటెమ్స్ కూడా సేకరించారు. ఫర్నీచర్ కొనుగోలులో కూడా ఐఎంఎస్ డైరెక్టర్లు నిబంధనలు పాటించలేదు. ఎక్కడా బహిరంగ టెండర్లు పిలవకుండా రూ.6.62 కోట్ల విలువైన ఫర్నీచర్ కొనుగోలు చేశారు. వారు చెల్లించిన ధరతో, మార్కెట్లో వాస్తవ ధరలను ఇదమిద్ధంగా పోల్చి చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఫర్నీచర్ కొనుగోలులో ఐఎంఎస్ డైరెక్టర్లు 70 శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు గుర్తించారు. అచ్చెన్నాయుడు – టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెలి హెల్త్ సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు అప్పగించాలని నాడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కె.అచ్చెన్నాయుడు స్వయంగా ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. దీంతో ఏ టెండర్ పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో ఆయన, టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. టోల్‌ఫ్రీ సర్వీసులు, ఈసీజీ సర్వీసులకు సంబంధించి ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఆ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకున్నారు. ఇదీ కాంట్రాక్ట్ రేటు వివిధ అవసరాలతో పాటు, సహాయం కోరుతూ టోల్ ఫ్రీ సర్వీసుకు రోగులు చేసే ప్రతి కాల్‌కు (ఆ కాల్ అటెండ్ చేయకపోయినా సరే) నెలకు రూ.1.80, రోగులకు చేసే ప్రతి ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించేలా డాక్టర్ రమేష్‌కుమార్ ఆ సంస్థతో ఎంఓయూ చేసుకున్నారు. ఆ విధంగా ఎలాంటి విచారణ లేకుండా దాఖలు చేసిన అన్ని బిల్లులను టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెల్లించినట్లు విజిలెన్సు దర్యాప్తులో గుర్తించారు. అర్హత లేని వారితో పరీక్షలు అయితే ఇక్కడ కూడా టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించింది. ఎంఓయూ ప్రకారం వైద్య పరీక్షల కోసం డీఎం కార్డియాలజిస్టులను నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ, పీజీ డిప్లొమా క్లినికల్ కార్డియాలజిస్టులను ఏర్పాటు చేసుకుని పని కానిచ్చారు. ప్రతి వైద్య పరీక్షకు పక్కాగా బిల్లులు పొందారు. టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు బిల్లులు కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఐఎంఎస్ డైరెక్టర్లు డాక్టర్ సీ.కే.విజయకుమార్, డాక్టర్ జి.విజయకుమార్ ఇద్దరూ టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టోల్‌ఫ్రీ సర్వీస్‌కు గానూ రూ.4.15 కోట్లు, ఈసీజీ పరీక్షలకు సంబంధించి రూ.3.81 కోట్లు చెల్లించారు. ఎస్టీపీ–జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిలో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం (ఎస్పీటీ) ఏర్పాటు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే అప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్, జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ.1.94 కోట్ల మొత్తానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఇందు కోసం కనీసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. దీంతో పాటు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లోని ఎస్పీటీలు, కర్నూలు జిల్లా అదోనిలోని డయాగ్నస్టిక్ కేంద్రంలో ఉన్న ఎస్పీటీ.. అలా మొత్తం నాలుగు ఎస్‌పీటీల వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ కూడా డాక్టర్ రమేష్‌కుమార్, జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు రూ.3.49 కోట్లకు అప్పగించారు. వాస్తవానికి ఆ కేంద్రాలేవీ పని చేసే స్థితిలో లేవు. అదోనిలో తొలుత ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని 2 కిలోమీటర్ల దూరంలో మరో చోటకు తరలించారు. రెండేళ్ల క్రితం ఆ కేంద్రాన్ని తరలించినా, తొలుత డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రదేశం వద్ద ఉన్న ఎస్‌పీటీకి వార్షిక నిర్వహణ వ్యయం చెల్లిస్తూనే ఉన్నారు. ఇంఛార్జ్ సివిల్ సర్జెన్ ఇస్తున్న ఒక సర్టిఫికెట్‌ను ఆధారంగా చేసుకుని ఐఎంఎస్ డైరెక్టర్లు ఆ బిల్లు చెల్లిస్తున్నారు. బయోమెట్రిక్ ఉపకరణాలు హైదరాబాద్‌కు చెందిర ప్రొడిగీ కంప్యూటర్స్–ల్యాప్టాప్స్ సంస్థ డిఐఎంఎస్‌కు 100 బయోమెట్రిక్ ఉపకరణాలు సరఫరా చేసింది. అప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్‌గా డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఉన్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ, డాక్టర్ రమేష్‌కుమార్ ఒక్కో బయోమెట్రిక్ ఉపకరణానికి ఏకంగా రూ.70,670 చెల్లించారు. వాస్తవానికి మార్కెట్లో ఒక్కో బయోమెట్రిక్ ఉపకరణం ధర కేవలం రూ.16,992 మాత్రమే. అయినా ఓపెన్ టెండర్లకు వెళ్లకుండా నామినేషన్ పద్ధతిలో ప్రొడిగీ కంప్యూటర్స్ నుంచి 100 బయోమెట్రిక్ ఉపకరణాలు కొనుగోలు చేసిన డాక్టర్ రమేష్‌కుమార్, అందుకోసం రూ.53.67 లక్షలు అదనంగా చెల్లించారు. వాటిలో చాలా వరకు యంత్రాలు పని చేయడం లేదని విజిలెన్సు అధికారులు దర్యాప్తు సమయంలో గుర్తించారు. -
కుంభకోణంలో అచ్చెన్నాయుడి పాత్ర
సాక్షి, అమరావతి : ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఏసీబీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ దర్యాప్తులోనూ ఇది తేలిందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఏసీబీ డైరెక్టర్ రవికుమార్ స్కాం వివరాలను వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో విజిలెన్స్ నివేదిక వచ్చిందని, దాని ప్రకారమే తాము దర్యాప్తు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించిన పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏసీబీ దర్యాప్తులో అక్రమాలు నిర్దారణ అయ్యాక నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్) విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150 కోట్లపైనా అవినీతి అక్రమాలు జరిగినట్లు తేలిందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో కట్టబెట్టారని వెల్లడించారు. విజిలెన్స్ దర్యాప్తులో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పట్లు తేలిన తరువాతనే ఏసీబీ విచారణ జరిపినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, వారిలో అచ్చెన్నాయుడుతో పాటు తిరుపతికి చెందిన ఈఎస్ఐ డైరెక్టర్ సికే రమేష్ కుమార్, రాజమండ్రికి చెందిన విజయ్ కుమార్ ఉన్నారని తెలిపారు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో అవినీతి చేప
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలో ట్రాన్స్‌కో అవినీతి చేప చిక్కింది. విద్యుత్ మీటర్ కోసం లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాలు.. రాయచోటి పట్టణంలో విద్యుత్ మీటర్ కోసం ఓ వినియోగదారుడు నిత్యం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ రూ.15 వేలు ముట్టజెపితేనే పని అవుతుందని రాయచోటి వెస్ట్ జోన్ ఏఈఈ ఆర్.జయప్రకాశ్ నాయక్ పేర్కొన్నారు. లేకపోతే పని జరగదని హెచ్చరించారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు జయప్రకాశ్ బాధితుడి దగ్గర డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డీఎస్పీ జనార్దన్ నాయుడు, సీఐ శ్రీనివాసులు రెడ్డి, రెడ్డప్ప, ఎస్ఐ నౌషాద్ భాషా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో ఏసీబీ కలకలం
సాక్షి, గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కలకలం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఏసీబీ డీజీ పీఎస్సార్ సీతారామాంజనేయులు ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఏసీబీ ఏఎస్పీ సురేశ్‌బాబు నేతృత్వంలో మూడు బృందాలుగా తనిఖీలు చేపట్టారు. ముగ్గురు సీఐలు, ఒక ఎస్ఐ, 10 మంది ఏసీబీ సిబ్బంది, ఆరుగురు ఇంజినీర్లు, ఇద్దరు ఆడిటర్లు తనిఖీల్లో పాల్గొన్నారు. రూ.1.03లక్షలు స్వాధీనం టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు వార్డ్ నంబర్ 35 బిల్ కలెక్టర్ ఎస్.నాగేశ్వరరావు నుంచి రూ.69,620, టౌన్ ప్లానింగ్ అవుట్సోర్సింగ్ అటెండర్ అల్లంశెట్టి సుధాకర్ నుంచి రూ.29,093, డెప్యూటీ సిటీ ప్లానర్ బి. సత్యనారాయణ నుంచి రూ.5,100 కలిపి మొత్తం రూ.1,03,813 అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తుల నియామకం టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఆకస్మిక తనిఖీల సందర్భంగా అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బిల్ కలెక్టర్ తుపాకుల సాంబశివరావు నెలకు రూ.ఐదు వేలు జీతం ఇస్తూ బి.లోకేష్ అనే ప్రైవేట్ వ్యక్తిని, మరో బిల్‌కలెక్టర్ నాగేశ్వరరావు నెలకు రూ.ఎనిమిది వేలు జీతం ఇస్తూ టి.ప్రసాద్æ అనే ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నారు. అంతేకాకుండా నకిలీ ఐడీ కార్డులను పెట్టుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్రమ వసూళ్లు చేయడం కోసం కార్పొరేషన్‌లోని అధికారులు, సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ తనిఖీల్లో ప్రైవేట్ వ్యక్తులు పట్టుబడటం గమనార్హం. పన్ను కట్టినప్పటికీ ప్లాన్ లేని భవనాలను గురించి ఆరా తీయడం కోసం రెవెన్యూ విభాగంలోకి ఏసీబీ అధికారులు వెళ్లగా అక్కడా అక్రమాల బాగోతం బయటపడింది. రికార్డుల పరిశీలన బిల్డింగ్ ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఇతర కార్యకలాపాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా అన్న విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ప్లాన్ల మంజూరు విషయంలో క్షేత్ర స్థాయిలో జరిగిన నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం, జీటీ రోడ్డు, నల్లపాడు సహా గుంటూరు నగరంలోని భవనాలు, అపార్ట్మెంట్లను ఏసీబీ బృందాలు పరిశీలించాయి. మంగళవారం మధ్యా హ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఏసీబీ తనిఖీలు అర్ధరాత్రి వరకూ కొనసాగా యి. బుధవారం కూడా తనిఖీలు కొనసాగనున్నాయి. ఆందోళనలో అధికారులు, సిబ్బంది ఇటీవల కాలంలో కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్లు మంజూరు చేసిన ఘటనలు కార్పొరేషన్లో అనేకం ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలోని టీడీపీ నాయకులకు చెందిన ఓ పేరు మోసిన క్లబ్లో గత కొ ద్ది రోజులుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా గత ఏ డాదిలో ప్లాన్లు మంజూరు చేశారు. ఈ విష యంలో భారీగా డబ్బులు చేతులు మారాయ న్న ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో ఈ వ్య వహారం ఎక్కడ బయటపడుతుందోనని అధి కారులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. గతంలో ఏసీబీ కేసులు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ స్థాయి అవినీతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరపాలక సంస్థ పరిధిలో 2012–2016లో 14 ఫైల్స్‌కు టీడీఆర్ బాండ్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్ బాండ్స్)లో భారీ స్థాయి అవినీతి జరిగిందంటూ అప్పట్లో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన అధికారులు అవకతవకలను నిర్ధారించారు. ఈ వ్యవహారంపై 2018లో ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదులు అందడంతో పూర్తి విచారణ జరిపిన అధికారులు టీడీఆర్ బాండ్లలో సుమారు రూ.1.60 కోట్లమేరకు అవినీతి జరిగిందని తేల్చారు. దీనిపై కమిషనర్, కార్పొరేష¯Œన్ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్, డీఎంఈలు సైతం దర్యాప్తు జరిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పట్లో నివేదికలు పంపారు. టీడీఆర్ బాండ్లలో అక్రమాలకు పాల్పడిన 12 మంది అధికారులు(మినిస్టీరియల్ స్టాఫ్), తొమ్మిది మంది బిల్డర్లు సహా 32 మందిపై 13/1ఏ, 13/2, 420, 409, 467, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో బిల్‌కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఏసీబీ తనిఖీల్లో ఎక్కడ తమ అవినీతి ఆరోపణలు బయటపడతాయోనని కొందరు అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. -
ఏసీబీ వలలో రెవెన్యూ తిమింగలం
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: జిల్లా యువజన సర్వీసుల శాఖ (సెట్రాజ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి లంకే రఘుబాబు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఎనిమిదిచోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించారు. రెవెన్యూ శాఖలో రఘుబాబు 1982లో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. 1995లో గ్రూప్–2 పరీక్ష పాసై డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. పెదపూడి, మారేడుమిల్లి, రాజమహేంద్రవరం, కాజులూరుల్లో తహసీల్దార్‌గా, కాకినాడ ఆర్డీవో కార్యాలయం పరిపాలనాధికారిగా పని చేశారు. 2014లో కాకినాడ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. 38 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో వివిధ స్థాయిల్లో అధికారి పని చేశారు. కాకినాడ ఆర్డీవోగా పని చేసిన సమయంలో వ్యవసాయ భూములను నాన్ లే అవుట్లుగా మార్చేందుకు రైతుల నుంచి ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సామాజికవర్గం కావడంతో ఆయన హయాంలో సముద్రతీర ప్రాంతంలోని ప్రభుత్వ భూములను, పలు సామాజిక స్థలాలను ఆయన వర్గీయులకు డబ్బులు తీసుకొని అప్పగించేశారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ ఆర్డీవోగా ఉన్న సమయంలోనే వనమాడికి కాకినాడ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని ఇచ్చేశారని పలువురు రెవెన్యూ అధికారులు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్ఆర్ నగర్ రోడ్డు నంబర్–1లో ఉన్న రఘుబాబు ఇంటితో పాటు సెట్రాజ్ కార్యాలయం, రాజమహేంద్రవరంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుబాబు ఇంట్లో అర కిలో బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదు, రూ.20 లక్షల డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు, పలు బ్యాంకు పుస్తకాలతో పాటు, వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములు, ప్లాట్లకు సంబంధించిన దస్తావేజులను అధికారులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు పెదమల్లాపురం, గాజువాక, సూర్యారావుపేటల్లో నాలుగు ఇళ్ల స్థలాలు, కాకినాడ ఆర్ఆర్ నగర్, సూర్యారావుపేటల్లో రెండు ఇళ్లు, శ్రీరామనగర్‌లో రెండు అపార్టుమెంట్లలో ప్లాట్లు, జి.వేమవరంలో పంట పొలాలు, రొయ్యల చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ ప్రభుత్వ రేటు ప్రకారం రూ.3.5 కోట్లు ఉండవచ్చని, బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.15 కోట్లు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉందని చెప్పారు. రాత్రి 8 గంటలు దాటినా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఏసీబీ ఏఎస్పీ రవికుమార్, ఇన్స్పెక్టర్ తిలక్, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌ఎస్‌ఈపైనా దాడులు మరోపక్క ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలపై కాకినాడ నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ గంధం వెంకట పల్లంరాజుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసం ఉంటున్న సాత్వి రెసిడెన్షియల్ కన్వెన్షన్ హాలు 302 రూముపై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వర్క్స్ ఇంజినీర్‌గా పని చేసిన పల్లంరాజు కాకినాడ ఎస్ఈగా బదిలీపై వచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకే ఆయనను ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం తరలించారు. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలోని పల్లంరాజు ఇంట్లోను, మధురవాడ వుడా కాలనీలోని అతడి తమ్ముడి ఇంట్లోను సోదాలు చేశారు. తణుకులోని అతడి తండ్రి, సోదరి ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసి, సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. భారీగా బంగారం, స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
కోట్లకు పడగెత్తిన ‘గోవిందు’డు!
నర్సీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. అవినీతి జరుగుతుందని ఫిర్యాదు చేస్తేచాలు సంబంధిత అధికారుల అక్రమాస్తులను పెకిలించి, వారి నిజస్వరూపాలను బయటపెడుతోంది. నర్సీపట్నం నియోజకవర్గంలో మంగళవారం అదే జరిగింది. మాకవరపాలెం పీఏసీఎస్‌లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు రైతుల నుంచి లంచాలు తీసుకొని కోట్ల రూపాయల ఆస్తులను కూటబెట్టినట్టు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు చేశారు. ఈ సందర్భంగా గోవిందు ఆదాయానికి మించి 1.75 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఏసీబీ అడిషనల్ఎస్పీ షకీలాభాను కథనం మేరకు.. మాకవరపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు పలు అక్రమాలకు పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు అదే మండలానికి చెందిన గవిరెడ్డి చక్రవర్తి, తమరాన ఎర్రనాయుడు, బంగారు ఎర్రినాయుడుల ఆరోపణ. గోవిందు రుణ మాఫీలో రైతులను మోసం చేసి అక్రమాస్తులు కూడబెట్టారని, రైతులకు రుణాలు ఇవ్వకుండా తనే తీసుకుని మోసం చేసినట్టు ఇటీవల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలాభాను, డీఎస్పీ రంగరాజుల ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. నర్సీపట్నం, మాకవరపాలెం, బలిఘట్టం, గిడుతూరు, రామన్నపాలెంలలో గోవిందుకు సంబంధించిన ఆస్తులను సోదా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగాయి. అనంతరం ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలాభాను విలేకరులతో మాట్లాడారు. స్టాఫ్ అసిస్టెంట్ శీరంరెడ్డి గోవిందు వద్ద ఆదాయానికి మించి కోటి 75 లక్షల రూపాయల విలువైన అక్రమాస్తులున్నట్టు గుర్తించామన్నారు. వీటిలో 2019లో బలిఘట్టంలో కొనుగోలు చేసిన 323, 295 చదరపు అడుగుల ఇంటి స్థలాలు, మాకవరపాలెం మండలం రామన్నపాలెంలో వ్యవసాయ భూమి 8.44 ఎకరాలు, 87 సెంట్ల ఇంటి స్థలం, భార్య కృష్ణవేణి పేరుతో బలిఘట్టంలో 2014లో 39 సెంట్లు, 2019లో 30 సెంట్ల ఇంటిస్థలాలు ఉన్నాయన్నారు. అలాగే రూ. 55.88 లక్షల విలువైన వందకు పైగా ప్రాంసరీనోట్లు, రూ. లక్ష విలువైన మార్ట్గేజ్ డీడ్, 45,288 రూపాయల బ్యాంక్ బ్యాలన్స్, రూ. 87 వేలు విలువ గల గృహోపకరణాలు, 347 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇంట్లో రూ. 28 వేల నగ దు, హీరో హోండా మోటారు సైకిల్ ఉన్నట్టు గుర్తించామని వివరించారు. దీనికి సంబంధించి ఆస్తులను సీజ్ చేసి, గోవిందును అరెస్టు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సోదాల్లో సీఐలు గఫూర్, అప్పారావు, రమేష్, లక్ష్మణమూర్తిలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన గోవిందు నివాసం ఉంటున్న ఇల్లు మాకవరపాలెంలో కలకలం మాకవరపాలెం(నర్సీపట్నం): స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ స్టాఫ్ అసిస్టెంట్ శీరంరెడ్డి గోవింద ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టడంతో స్థానికంగా కలకలం రేగింది. పీఏసీఎస్ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. గోవిందపై రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు నర్సీపట్నంతోపాటు తన స్వగ్రామమైన గిడుతూరులోని సోదరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మండలంలో ఉదయం ఏడు గంటలకు ముందే ప్రారంభమైన ఈ సోదాల్లో భాగంగా మండల కేంద్రంలోని పీఏసీఎస్ సీఈవో శెట్టి గోవింద ఇంటిలో డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు. అనంతరం 8.30 గంటలకు పీఏసీఎస్ తాళాలు తీయించిన డీఎస్పీ.. పర్సన్ ఇన్చార్జి పాశపు నాగేశ్వరరావు సమక్షంలో స్టాఫ్ అసిస్టెంట్ గోవిందకు చెందిన వివరాలను పరిశీలించారు. గోవింద ఎప్పుడు విధుల్లో చేరాడు, ఏఏ కేటగిరీల్లో పని చేశారో ఆరా తీశారు. 1994లో నైట్ వాచ్‌మన్‌గా చేరిన గోవింద 1999 నుంచి 2009 వరకు క్లర్క్‌గా, ప్రస్తుతం స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టు ఏసీబీ సీఐ శ్రీనివాస్ వివరాలు సేకరించి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే గోవింద విధులు, రుణాల మంజూరు ఎలా చేశారనే విషయాన్ని సోదాల సమయంలో పీఏసీఎస్‌కు వచ్చిన రైతులను కూడా అడిగితెలుసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికారులు ఈ సోదాలను కొనసాగించారు. అంతకు ముందు పీఏసీఎస్‌కు పక్కనే ఉన్న గ్రామ సచివాలయంలో గోవిందపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో ఒక్కడైన కొండలఅగ్రహారం గ్రామానికి చెందిన సుర్ల కన్నబాబును సీఐ విచారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. -
ఏసీబీ దాడులతో హడల్
చిత్తూరు కలెక్టరేట్ : ఏళ్ల కొద్దీ పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు... చేయితడిపితే చకచకా పనులు...లేదంటే నెలల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి...ఈ పరిస్థితి జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఉందని ప్రజల ఆరోపణ. ఆ కార్యాలయాల చుట్టూ పలు పనుల నిమి త్తం కాళ్లరిగేలా తిరిగితిరిగి విసిగి వేసారిపోయిన ప్రజలు మరికొందరు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యమని ముఖ్య మంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇదివరకే ప్రకటించడమే కాకుండా అవినీతిపరుల సమాచారం ప్రభుత్వం దృష్టికి తేవడానికి 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిన విషయం విదితమే. అయితే తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి మూలాన ఏళ్లకాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు. అవి నీతి అధికారులపై చివరకు 14400 నంబర్‌కు ఫిర్యాదులు చేయడంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులకు పూనుకున్నట్టు తెలుస్తోంది. లంచావతారాల భరతం పట్టేందుకు.. లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాలపై దాడులు చేశారు. జిల్లాలోని రేణిగుంట, వడమాలపేట తహసీల్దార్ల కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఆ కార్యాలయాల్లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సేకరించి వారిని విచారణ చేశారు. అలాగే కార్యాలయాల వద్ద ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకుని ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ముమ్మర తనిఖీలు చేశారు. కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విచారణ పూర్తయిన తరువాత ఉన్నతాధికారులకు నివేదికలు పంపి తదుపరి విషయాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా జిల్లా ఏసీబీ అడిషినల్ ఎస్పీ శ్రీనివాసులు, ఆ శాఖ ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడ్డ రెవెన్యూ అవినీతి నిరోధక శాఖ దాడులపై రెవెన్యూ శాఖ ఉలిక్కిపడింది. ఈ దాడులపై జిల్లావ్యాప్తంగా పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పక్క మండలాల రెవెన్యూ అధికారులు జాగ్రత్తలు పడ్డారు. ఏ సమయంలో ఏ కార్యాలయంపై దాడులు చేస్తారోనని ఉద్యోగులు హడలిపోయారు. ఈ దాడులు మరికొన్ని చోట్ల జరిగే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
చేయి చాపాడు... ఏసీబీకి చిక్కాడు
తూర్పుగోదావరి, అయినవిల్లి: ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగి చేయి చాపాడు.. ఆ సొమ్ము ఇచ్చుకోలేక బాధితుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరును ఆశ్రయించాడు... దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. లంచం తీసుకుంటుండగా ఆ అవినీతి ఉద్యోగిని వల పన్ని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... అయినవిల్లిలంక వీఆర్వో పట్టేం నాగేశ్వరరావు వీరవల్లిపాలెం గ్రామ పంచాయతీకి ఇన్చార్జ్ వీఆర్వోగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన వట్టికూటి సత్యనారాయణ పేరున పది సెంట్ల కొబ్బరి తోట ఉంది. మ్యుటేషన్ చేసి తన కుమారుడు కట్టికూటి కేదారేశ్వరరావు పేరున పట్టాదారు పాస్‌పుస్తకం ఇప్పించాలని 2019 అక్టోబర్ 22న మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు పాసు పుస్తకం ఇవ్వడానికి రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని అడిగాడు. ఆ సొమ్ము ఇవ్వడానికి ఇష్టపడని వట్టికూటి సత్యనారాయణ కుమారుడు కేదారేశ్వరరావు స్పందనలో టోల్‌ఫ్రీ నంబర్ 14400కు ఈ నెల 10న ఫిర్యాదు చేశాడు. దీంతో కేదారేశ్వరరావుతో ఏసీబీ అధికారులు సంప్రదింపులు జరిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మంగళవారం ఏసీబీ రాజమహేంద్రవరం డీఎస్పీ పి.రామచంద్రరావు, సీఐలు వి.పుల్లారావు, తిలక్, మోహనరావులతో అయినవిల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్ నిర్వహించారు. అక్కడ కేదారేశ్వరరావు నుంచి వీఆర్వో నాగేశ్వరరావు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. సంబంధిత రికార్డులు సీజ్ చేశారు. నాగేశ్వరరావు తీసుకున్న రూ.5 వేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వివరాలు నమోదు చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామన్నారు. -
ఏసీబీ ఉచ్చులో ఇద్దరు సర్వే అధికారులు
అమరావతి, సత్తెనపల్లి: పట్టా భూమిని అసైన్డ్‌లో చూపి లంచం డిమాండ్ చేసిన సర్వే అధికారులపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. రూ. 27 వేలు తీసుకుంటూ సత్తెనపల్లి మండల సర్వేయర్ ఎం.రాజు, చైన్‌మెన్ చిత్తరంజన్ పట్టుబడ్డారు. వారిద్దరినీ ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎ.సురేష్‌బాబు నేతృత్వంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్‌నగర్‌కు చెందిన శ్యామల సురేష్‌రెడ్డి తన భార్య శ్యామల నాగలక్ష్మి పేరు మీద పట్టణంలోని ఎఫ్‌సీఐ సమీపంలో 2,102 గజాల (43.5 సెంట్ల) స్థలం ఉంది. ఇది పక్కా పట్టా భూమిగా ఉండటంతో 2006 డిసెంబరులో కొనుగోలు చేశారు. సురేష్‌రెడ్డి కుమారుడు శ్యామల సాయిఅచ్యుత రెడ్డి ఎంఎస్ చేయడానికి నగదు అవసరమైంది. ఈ క్రమంలో ఆ భూమిని పట్టణంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో పెట్టి విద్యా రుణం కింద నగదు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. లీగల్, ఇంజినీర్ రిపోర్టు అయిపోయాయి. స్థలాన్ని మార్ట్గేజ్కోసం సబ్ రిజిస్ట్రారు కార్యాల యానికివెళ్లగా 49/1ఏలో 3.25 ఎకరాలు కెనాల్ అసైన్డ్ భూమిగా చూపారు. దాని లోనే శ్యామల నాగలక్ష్మికి చెందిన 2,102 గజాల స్థలం కూడా ఉన్నట్లు చూపారు. దీంతో మార్ట్గేజ్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ అంగీకరించలేదు. 2019 అక్టోబరు 10న సురేష్‌రెడ్డి తహసీల్దారుకు అర్జీ పెట్టుకున్నాడు. 1960 నుంచి అడంగల్ కాపీ కోసం అర్జీ పెట్టగా 2019 నవంబరు 12న అడంగల్ ఇచ్చారు. పట్టా భూమిని కెనాల్ అసైన్డ్ భూమిగా చూపుతున్నారని, తనది పట్టా భూమి కనుక తన పని త్వరితగతిన పూర్తి చేయాలని 2019 నవంబరు 20న జిల్లా కలెక్టర్‌ను సురేష్‌రెడ్డి కలిసి విన్నవించుకున్నాడు. పట్టాభూమిని అసైన్డ్‌లో వేశారని ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ వెంటనే తహసీల్దారు కార్యాలయానికి ఫోన్ చేసి త్వరితగతిన రిపోర్టు పంపాలని ఆదేశించారు. సర్వే అధికారుల బేరసారాలు..... పని కోసం సురేష్‌రెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి సర్వేయర్ ఎం.రాజును కలువగా తనతో ఏదైనా పని ఉంటే చైన్‌మెన్ చిత్తరంజన్‌ను కలవమని సర్వేయర్ రాజు సూచించారు. రోజుల తరబడి సురేష్‌రెడ్డి తిరుగుతున్నప్పటికీ సర్వే అధికారులు పట్టించుకోలేదు. చైన్‌మెన్ చిత్తరంజన్‌ను కలిసి పని చేసి పెట్టాలని కోరడంతో విలువైన స్థలంగా భావించి ఎకరానికి ఎంత ఇస్తావంటూ చిత్తరంజన్ బేరసారాలకు దిగాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సురేష్‌రెడ్డి 1440 స్పందన కాల్‌కు ఫోన్ చేసి సర్వే అధికారుల అవినీతి గురించి వివరించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా పథకం రచించారు. ఆ ప్రకారం గురువారం సురేష్‌రెడ్డికి డబ్బు ఇచ్చి పంపగా చైన్‌మెన్ చిత్తరంజన్‌ను సురేష్‌రెడ్డి కలిశాడు. డబ్బు తీసుకుని ప్రస్తుత తహసీల్దారు కార్యాలయం వెనుక నిర్మాణంలో ఉన్న కార్యాలయం వద్దకు రమ్మని సురేష్‌రెడ్డికి చిత్తరంజన్ చెప్పాడు. సురేష్‌రెడ్డి అక్కడకు వెళ్లగా సర్వేయర్‌కు పని చేసేందుకు రూ. 15 వేలు, ఇతర ఆఫీసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 12 వేలు ఇవ్వాలని చైన్‌మెన్ చిత్తరంజన్ డిమాండ్ చేశాడు. దీంతో రూ. 27 వేలు చిత్తరంజన్‌కు అందజేయగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐలు సి.హెచ్. రవిబాబు, జి.శ్రీదర్, ఎస్సై శ్రీనివాసమూర్తి, మరో నలుగురు సిబ్బంది ఉన్నారు. -
ఏసీబీ వలలో ఇరిగేషన్ ఎస్ఈ
జిల్లా నీటిపారుదల శాఖ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో పర్యవేక్షక ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నల్లం కృష్ణారావు అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రాష్ట్రంలో ఆరు చోట్లతోపాటు తెలంగాణలోనూ తనిఖీలునిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. కాకినాడ క్రైం: ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారనే సమాచారంతో జిల్లా నీటిపారుదల శాఖ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ) నల్లం కృష్ణారావుపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో రాష్ట్రంలో ఆరు చోట్ల, తెలంగాణ రాష్ర ్టంలోని హైదరాబాద్‌లోని బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ. 15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ సమీపంలోని పాతగైగోలుపాడు సుందర్‌నగర్‌లో ఉన్న కృష్ణారావు ఇంటిలో, ఆయన బంధువులు, సహచరుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలను చేపట్టారు. ఆయన సొంత ఊరైన భీమవరంలో, ఆయన నివాసం ఉంటున్న కాకినాడలో, పని చేస్తున్న ధవళేశ్వరంలో, అనకాపల్లిలోని ఆయన అల్లుని ఇంటిపైన, రాజమహేంద్రవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలతో పాటు హైదరాబాద్‌లోను దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. ఐదు కోట్లకు పైగా ఆస్తులను, పెద్ద మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ప్రామిసరీ నోట్లు, స్థలాల దస్తావేజులతో పాటు రూ. 68 లక్షల బ్యాంక్ డిపాజిట్లను గుర్తించారు. వీటి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ. 3 కోట్ల 35 లక్షల 42వేల 961 అని, బహిరంగ మార్కెట్ రేట్ల ప్రకారం రూ. 15 కోట్లు పైబడి ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. బ్యాంకు లాకర్లను తెర వాల్సి ఉందని, దాడులు కొనసాగుతున్నాయన్నా రు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న నేరంపై ఇరిగేషన్ ఎస్ఈ నల్లం కృష్ణారావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ అడిషినల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు. ధవళేశ్వరంలో.. ధవళేశ్వరం: ఏసీబీ అధికారులు ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం ఎస్ఈ గదిలో సోదాలు జరిపారు. కంప్యూటర్లు, ఫైళ్లను పరిశీలించి రెండు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోదాలు జరిగాయి. ధవళేశ్వరంలో ఎస్ఈకి సన్నిహితంగా ఉండే మరో ఉద్యోగి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపినట్టు సమాచారం. పూర్తి వివరాలను తమ ఉన్నతాధికారులు వెల్లడిస్తారని ఇన్స్పెక్టర్ శివప్రసాద్ మీడియాకు తెలిపారు. దాడుల్లో పట్టుబడ్డ ఆస్తుల చిట్టా ♦ నల్లం కృష్ణారావు 2004లో కాకినాడ శ్రీరంగరాయణం రెసిడెన్సీలో 104 నంబరు గల ప్లాట్‌ను రూ. 9.81 లక్షలకు, రాజానగరంలో ఒక ఇంటిస్థలం రూ. 12.50 లక్షలకు కొనుగోలు చేశారు. ♦ కృష్ణారావు భార్య నల్లం కృపామణి పేరుతో హైదరాబాద్ మియాపూర్‌లో 2019లో హైరిచ్ అపార్టుమెంట్లో ప్లాట్ కొనుగోలుకు రూ. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ♦ విశాఖ జిల్లా పెందుర్తిలో 2003లో రూ. 74, 760లతో ఒక ఖాళీ స్థలాన్ని, కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట సుందర్‌నగర్‌లో రూ.5,85 లక్షలతో ఇంటి స్థలాన్ని, సామర్లకోట మండలం ఉండూరు పంచాయతీ వల్లూరులో రూ.2.46 లక్షలతో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. వ్యవసాయ భూమి ♦ 2008లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం రాయకుదురులో రూ.3.10 లక్షల తో వ్యవసాయభూమిని కొనుగోలు చేశారు. అదే ఏడాది అదే గ్రామంలో మరో రూ. లక్షతో కొంత, రూ. 25 వేలతో మరి కొంత వ్యవసాయ భూమిని కొన్నారు. ♦ తాడేపల్లిగూడెం వెంకటరామన్నగూడెంలో 2010లో రూ. 9 లక్షలతోను, రాయకుదురు చింతలకోటిచెరువులో 2012లో 1.02 లక్షలతో, రాజానగరం మండలం వెంకటాపురంలో 2018 లో రూ. 6.55 లక్షలతో ఖాళీ స్థలాలను, కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మహళ్లిలో 2011లో రూ. 42.50 లక్షలతో 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కృష్ణారావుకు ఉన్న ఇళ్లు ♦ 2017లో కాకినాడలో రూ. 98.54లక్షల విలువైన జీప్లస్ 1 ఆర్సీసీ భవనం నిర్మించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునిపూడిలో రూ. 15 లక్షల విలువైన జీప్లస్ 1 ఆర్సీసీ భవనం నిర్మించారు. ♦ కృష్ణారావు కుమారుడు నల్లం రోహిత్ పేరుతో కాకినాడ శ్రీనగర్‌లోని నందాస్ అపార్టుమెంట్లో 2013లో రూ. 22.34 లక్షలతో ప్లాట్‌నంబర్ 302ను కొనుగోలు చేశారు. ♦ ఆయన కుమార్తె స్నేహిత పేరుతో సామర్లకోట మండలం ఉండూరు గ్రామం వల్లూరులో 2008లో రూ. 1.28 లక్షలతో ఇంటి స్థలం కొన్నారు. అదే ఏడాది ఆమె పేరుతో పెనుగొండ మండలం రాయకుదురులో రూ. 3.75 లక్షలతో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇతర ఆస్తుల వివరాలు ♦ రూ.6.41 లక్షల విలువైన 332.90 గ్రాముల బంగారు ఆభరణాలు. ♦ రూ.1.89 లక్షల విలువైన 622.810 గ్రాముల వెండి ఆభరణాలు. ♦ రూ.7.78 లక్షల విలువైన గృహోపకరణ వస్తువులు. ♦ రూ. 1.94,480 నగదు. ♦ రూ. 38,89,091 విలువైన ఎఫ్‌డీఆర్‌లు. ♦ రూ. 28 లక్షల 66వేలు బ్యాంకు బ్యాలెన్స్. ♦ రూ. 6 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు. ♦ రూ. 70 వేల విలువైన యాక్టివా మోటార్ సైకిల్. కృష్ణారావు ఉద్యోగ ప్రస్థానం నల్లం కృష్ణారావు 1986 మార్చి 6న ఇరిగేషన్‌శాఖలో ఏఈగా చేరారు. విశాఖపట్నం, కాకినాడ, సామర్లకోటల్లో ఏఈగా పనిచేశారు. పదోన్నతిపై ఏలేరు ఇరిగేషన్ సబ్‌డివిజన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గాను, సామర్లకోట, ధవళేశ్వరం సబ్డివిజన్లోను పని చేశారు. కాకినాడ డివిజన్ పరిధిలోని ఇరిగేషన్ డీఈగా, ఏలేరు ఇరిగేషన్ ప్రాజెక్టు డీఈగా, వశిష్ట, గోదావరి సెంట్రల్ డెల్టా డీఈగా పని చేశారు. ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో పని చేస్తూ 2017 డిసెంబర్ 3న ధవళేశ్వరం ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజినీరు (ఎస్ఈ)గా బాధ్యతలు చేపట్టారు. -
లేనిది ఉన్నట్టు... వార్డెన్ కనికట్టు
ప్రకాశం, చీరాల: హాస్టల్ వార్డెన్ బాగోతం ఏసీబీ అధికారుల దాడులతో బట్టబయలైంది. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేసి పిల్లల పేరుతో నిధులన్నీ జేబులో వేసుకుంటున్నాడని తేటతెల్లమైంది. వాడరేవు బీసీ బాలుర వసతి గృహంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల మేరకు గురువారం ఉదయం ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్ ఆధ్వర్యంలో ఏసీబీ ఏఎస్పీ, ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు వసతి గృహంలో దాడులు చేశారు. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హాస్టల్లో బాలురు కేవలం 9 మంది ఉండగా వార్డెన్ బండారు హరిప్రసాదరావు రికార్డుల్లో 86 మంది నివాసం ఉంటున్నారని నమోదు చేశారు. ఇలా ఏడాదికి రూ.10 లక్షల వరకు నిధులను తన జేబుల్లోకి మళ్లించుకుంటున్నాడు. ఈ అక్రమ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తుండటంతో వార్డెన్ హరిప్రసాదరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారు కావడం విశేషం తనిఖీ అధికారులను మభ్య పెడుతూ.. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.1000, హైస్కూల్ విద్యార్థులకు రూ.1200 చెల్లిస్తుంది. ఈ నిధులతో లేనిది ఉన్నట్టు... వార్డెన్ కనికట్టువసతిగృహ విద్యార్థులకు అల్పాహారం, భోజనం, కాస్మోటిక్ ఛార్జీలను ప్రభత్వుం అందిస్తుంది. వార్డెన్ ఏడాదిన్నర నుంచి విద్యార్థులు హాస్టల్లో ఉండకపోయినప్పటికీ రికార్డుల్లో మాత్రం 86 మంది ఉంటున్నారని నమోదు చేస్తున్నారు. ఎప్పుడైనా తనిఖీలకు వచ్చిన జిల్లా అధికారులను ఏదో విధంగా మభ్యపెటుతున్నారు. దీంతో విద్యార్థులు లేకుండానే వారిపేర్లతో వచ్చే నిధులను సుమారు రూ.18లక్షల వరకు ఏడాదిన్నర కాలంలోనే వార్డెన్ మింగేశారని సమాచారం. ఈ కోణంలోనే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆహార పదార్థాలూ స్వాహా.. వాడరేవు బీసీ బాలుర వసతిగృహం నిర్వహణ అధ్వానంగా ఉందని, వార్డెన్ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారని ఫిర్యాదుతో గుంటూరు, ప్రకాశం జిల్లాల ఏసీబీ అధికారులతో దాడులు చేసినట్లు ఏసీబీ ఏఎస్పీ సురేష్ తెలిపారు. ఈ బాలుర వసతిగృహంలో రికార్డుల్లో మాత్రం 86 మంది విద్యార్థులు ఉంటున్నారని చూపుతుండగా వాస్తవంగా 9 మంది మాత్రమే నివశిస్తున్నారన్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారం, పాలు, కోడిగుడ్లు, ఇతర నిధులను అక్రమంగా స్వాహా చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. 9 మందికి ప్రతి రోజు ఒకటిన్నర లీటరు పాలు, ఒకటిన్నర లీటరు పెరుగు, నాసిరకం కూరగాయలతో భోజనం అందిస్తున్నారని పాలు, ఆహార పదార్థాలు అందించే వారిని విచారించగా తమకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారన్నారు. వసతిగృహంలో విద్యార్థులకు నూతన మంచాలు, దుప్పట్లు ఉన్నాయని, కూరగాయలు, అరటి పండ్లు మాత్రం కుళ్లిపోయి ఉన్నాయన్నారు. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశులు సమక్షంలో వసతి గృహాన్ని సందర్శించి వివరాలు సేకరించామన్నారు. కానీ హాస్టల్ వార్డెన్ బండారు హరిప్రసాద్‌రావు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఎంతకాలంగా రికార్డులను తారుమారు చేస్తు అక్రమాలకు పాల్పడుతున్నారో తెలుసుకునేందుకు హాస్టల్ ఆఫీసు గదికి తాళం వేశారని, ఆఫీసులో రికార్డులు చూస్తే మరిన్ని అక్రమాలు తెలుస్తాయన్నారు. తమ దాడి, విచారణలో తేలిన అంశాలను నివేదిక రూపంలో జిల్లా ఉన్నతాధికారులకు అందిస్తామని, హాస్టల్ వార్డెన్‌ను పట్టుకుంటే చాలా విషయాలు తెలుస్తాయని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ఎన్.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. ఇంటి నుంచి వార్డెన్ పరారీ.. వాడరేవు బాలుర వసతిగృహంపై ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో వసతిగృహం వార్డెన్ బండారు హరిప్రసాద్‌రావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంట్లోంచి ఉదయాన్నే పరారయ్యాడు. అధికారులు ఇంటికి వెళ్లినప్పటికీ అందుబాటులో లేడు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారికి కూడా సమాచారం అందించారు. హాస్టల్ వార్డెన్ల వెన్నులో వణుకు... మండలంలోని వాడరేవు బీసీ వసతిగృహంలో జరిగిన అక్రమాలపై మొదటిసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో చీరాల ప్రాంతంలో ఉన్న వసతిగృహాల నిర్వహకులు ఆందోళన చెందుతున్నారు. చీరాల ప్రాంతంలో ఉన్న పలు బాలురు, బాలికల వసతిగృహాల వార్డెన్లు వణుకుతున్నారు. ఇన్నాళ్లు విద్యార్థుల సొమ్మును అప్పనంగా కాజేసిన వార్డెన్లు అక్రమాలపై ఏసీబీ అధికారులు నిఘా ఉంచడం, దాడులు చేయడంతో వార్డెన్లు భయాందోళనకు గరవుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఖాకీ
ప్రకాశం, మద్దిపాడు: మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.వీర్రాజు మంగళవారం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ట్రాన్స్‌పోర్టు కంపెనీ లారీకి యాక్సిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.5 వేలు డిమాండ్ చేయడంతో విధిలేని పరిస్థితిలో ఏసీబీని సదరు కంపెనీ మేనేజర్ ఆశ్రయించాడు. అందిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దొడ్డవరప్పాడు సమీపంలో ఈనెల 15 తేదీ తెల్లవారు జామున లారీ ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలో ముందు వెళ్తున్న వాహనానికి సంబంధించిన వ్యక్తి తనకు కేసు అవసరం లేదంటూ వెళ్లిపోయాడు. లారీ డ్రైవర్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మేనేజర్ కరీమ్ ఖాన్‌కు ఫోన్ చేయగా అతను 15వ తేదీ, సాయంత్రం వచ్చి స్టేషన్లో విచారించాడు. ఈక్రమంలో లారీ ముందు భాగం దెబ్బతినడంతో ఇన్‌స్రూెన్స్ నిమిత్తం యాక్సిడెంట్ సర్టిఫికెట్ కోసం స్టేషన్ రైటర్ వీర్రాజును సంప్రదించగా అతను సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. స్టేషన్ రైటర్ మాట్లాడిన మాటలను వీడియో రికార్డింగ్ చేసి తాను అంత ఇవ్వలేనని తెలుపగా రూ.5 వేలు లేకపోతే నీపని కాదని రైటర్ కరాఖండిగా చెప్పడంతో కరీంఖాన్ నేరుగా ఒంగోలు చేరుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించి వీడియో క్లిప్పింగ్‌లు చూపాడు. వారు విషయాలను పరిశీలించి నిర్ధారణకు వచ్చిని ఏసీబీ అధికారులు కరీంఖాన్కు ఐదు వేల రూపాయల నగదు ఇచ్చి మంగళవారం ఉదయం మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌కు పంపారు. అతను నగదు రైటర్‌కు ఇచ్చిన వెంటనే ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు, ప్రకాశం జిల్లా ఇన్చార్జి ఏ సురేష్‌బాబు తన సిబ్బందితో కలిసి దాడిచేసి రైటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన నగదును రైటర్ టైబుల్ డ్రాయర్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో స్టేషన్ ఎస్ఐ ఖాదర్‌బాషా వేరే కేసు నిమిత్తం ఘటనా స్థలికి వెళ్లగా ఎస్ఐను పిలిపించి విషయం తెలిపారు. వీర్రాజును కస్టడీలోకి తీసుకుని నెల్లూరు ఏసీబీ కోర్టులో బుధవారం ప్రవేశ పెట్టనున్నట్లు ఏసీబీ ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎన్.రాఘవరావు ఎ.వెంకటేశ్వర్లు ఏసీబీ సిబ్బంది పలువురు ఉన్నారు. దాదాపుగా 8 సంవత్సరాల తరువాత మద్దిపాడు మండలంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం ఇదే ప్రథమం. గతంలో రెవెన్యూశాఖలో పని చేస్తున్న ఆర్ఐ రామానాయుడు ఇసుక ట్రాక్టర్ యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకుంటున్న సమయంలో ఒంగోలులోని లింగయ్య భవనం సమీపంలో ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. ఆ తరువాత తాజాగా మంగళవారం ఏసీబీ అధికారులు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రైటర్‌ను పట్టుకోవడం మండల ప్రజల్లో చర్చనీయాంశమైంది. రెండు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పిబెదిరించాడు రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిప్పి బెదిరించాడు. ఎస్ఐ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పినా రైటర్ డబ్బు డిమాండ్ చేసి ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తాననడంతో ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది.– కరీంఖాన్,విజయవాడ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మేనేజర్ బాధితులు ఎవరైనా ఫిర్యాదుచేయవచ్చు ఎవరైనా ఏసీబీకి ఫిర్యా దు చేయవచ్చు. తగిన ఆధారాలతో వారిని అరెస్టు చేస్తాం. ఎవరైనా అధికారులు అవినీతి పనులు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే మాకు తెలియచేయండి. ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉంటాం.– ఏ.సురేష్‌బాబు, ఏసీబీ అడిషనల్ ఎస్పీ ప్రకాశం జిల్లా ఇన్చార్జి -
ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు
సాక్షి, అమరావతి/కర్నూలు/కొత్తవలస: రాష్ట్రంలో కర్నూలు, విజయనగరం జిల్లాల్లో సోమవారం లంచం తీసుకుంటున్న నలుగురిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ మీడియాకు విడుదల చేశారు. కర్నూలులోని భూపాల్ కాంప్లెక్స్‌లో ఉన్న చంద్రకాంత్ చిట్‌ఫండ్స్ నిర్వాహకులు గోపాల్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తును సీసీఎస్ సీఐ రామయ్య నాయుడుకు అప్పగించారు. ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు, తనపై రౌడీషీటు తెరవకుండా ఉండేందుకు గతంలో రూ.లక్ష తీసుకున్న సీఐ మళ్లీ లంచం డిమాండ్ చేస్తున్నాడని గోపాల్‌రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే స్థానిక వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్లో న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి సీఐ తరఫున లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగభూషణం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయలు, కిరాణా సరుకులు అందించే ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఆదారి సురేష్‌కుమార్, ఎస్.రమణబాబు నుంచి విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం వియ్యంపేట ఐసీడీఎస్ సీడీపీవో పోతల మణెమ్మ లంచం డిమాండ్ చేసింది. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. సీడీపీవో మణెమ్మ ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ రూ.85 వేలు లంచం తీసుకుని టేబుల్ సొరుగులో పెడుతుండగా ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, మంగళవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఆయన చెప్పారు. వియ్యంపేట ఐసీడీఎస్ సీడీపీవో మణెమ్మ వేణుగోపాల్ -
బ్లూ ఫ్రాగ్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, విజయవాడ: ఇసుక మింగి పసుపు పులుముకున్న ఎల్లోఫ్రాడ్ కంపెనీగా రూపాంతరం చెందిన బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థపై అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ని హ్యాక్ చేసిన ఆరోణలపై తీగలాగగా డొంకంతా కదులుతోంది. సంస్థ నిర్వాహకులను విచారిస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసుపై దర్యాప్తును మరింత వేగంవంతం చేశారు. ఈ క్రమంలో హ్యాకింగ్‌పై సాక్ష్యాధారాలు కూడా సేకరించామని, కొన్ని రోజుల వ్యవధిలోనే అక్రమార్కుల పనిపడతామని సీఐడీ అధికారి ఏడీజీ పీవీ సునీల్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసి ఇసుక కృత్రిమ కొరతను సృష్టించినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీపై విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. అదే విధంగా విచారణలో ఆధారాలు సేకరించామని, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించి ముందుకు సాగుతామని సునీల్ కుమార్ పేర్కొన్నారు. అదే విధంగా క్లౌడ్‌లో పెట్టిన సమాచారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసే వారి ఐపీ అడ్రస్‌ను కూడా ట్రాక్ చేసి విచారిస్తున్నామని అన్నారు. కాగా అక్రమ నిల్వల కోసం ఆన్లైన్లో ఇసుకను బుక్‌చేసే వారిపై కూడా నిఘా పెడుతున్నామని ఏడీజీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. -
జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ దాడులు
-
ఏసీబీకి చిక్కిన జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ
సాక్షి, అనంతపురం: ఏసీబీ దాడుల్లో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ సురేష్‌రెడ్డి ఇంట్లో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. తనిఖీల్లో రూ.3 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వివరాలు.. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డి గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా పనిచేశాడు. జేసీ దివాకర్‌రెడ్డి పదవిలో ఉన్నా లేకపోయినా సురేష్ తన సేవలను కొనసాగించాడు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడంటూ, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సురేష్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో అధికారులు సురేష్ ఇంట్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.3 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లోని సురేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. -
‘మంత్రి వ్యాఖ్యలపై నేను మాట్లాడను’
సాక్షి, విజయవాడ : డబ్బులు తీసుకోవడం మాత్రమే అవినీతి కాదని, ఇవ్వడం కూడా అవినీతేనని ఏసీబీ డీజీ విశ్వజిత్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కానూరు సిద్దార్ధ కాలేజీలో నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వజిత్ మాట్లాడుతూ.. ‘మానసిక ఆలోచనలు, చేసే పనిలో నిబద్ధత, నీతి లేకపోవడం కూడా అవినీతే. ఈ రోజుల్లో చాలా మంది తమ పనులు తొందరగా పూర్తవ్వాలని లంచాలు ఇస్తున్నారు. మరోవైపు సమాజంలో స్వప్రయోజనాలు పెరిగిపోయాయి. దీని వల్ల వ్యవస్థలో అవినీతి పెరిగిపోయింది. క్యాన్సర్ లాంటి అవినీతిని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. దీనిపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి. ప్రజలు లంచాలు ఇవ్వడం ఎప్పడైతే మానుకుంటారో అప్పుడు అవినీతి అంతమవుతుంది. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేద’ని పేర్కొన్నారు. విశాఖ ఘటనపై మాట్లాడుతూ.. మధురవాడలో ఏసీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మోహన్‌రావు విచారణ చేస్తున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్య తీసుకుంటాం. మంత్రి చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడనంటూ ముగించారు. -
ఏసీబీ అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్
-
చేయి తడపాల్సిందేనా..?
నందిగాం మండలం పాలవలస సమీపంలో ఓ రైతుకు చెందిన 73 సెంట్లను సబ్ డివిజన్ చేసేందుకని టెక్కలి ఆర్డీవో కార్యాలయం డీఐఎస్( డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే) ఏకాశి రూ. 5లక్షలకు బేరం పెట్టుకుని రూ. 50వేలు తీసుకుంటూ ఆగస్టు 31వ తేదీన ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా కొత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ–పాసు పుస్తకం మంజూరు కోసం మెట్టుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ సాయమ్మ నుంచి రూ. 10వేలు లంచం తీసుకుండగా వీఆర్ఓ సుందరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సాక్షి, శ్రీకాకుళం: వీరు దొరికినోళ్లు.. మరి దొరకనివాళ్లు.. చాలా మంది ఉన్నారనేది ప్రజల మాట. రెవెన్యూ అంటేనే అవినీతికి చిరునామా అని జనం అంటున్నారు. ఈ శాఖలో గతంలో అవినీతి యథేచ్ఛగా సాగింది. సిబ్బం ది దగ్గరి నుంచి అప్పటి మంత్రుల వరకూ అవి నీతిలో భాగస్వాములు కావడంతో పట్టించుకున్న దాఖ లాల్లేవు. అవినీతి విశృంఖలం అయిపోయింది. ఇప్పుడా పరిస్థితి మారింది. పాలకులు అవినీతికి దూరంగా ఉంటున్నారు. నిజాయితీతో కూడిన పాలన కోసం పరితపిస్తున్నారు. అవినీతి వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ‘రెవెన్యూలో పరిస్థితి మారాలి. అవినీతికి ఆస్కారం ఉండకూడదు. మీకేమైనా సమస్యలు, ఇబ్బందులుంటే నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను. అంతే తప్ప అవినీతికి పాల్పడకూడదు. చెప్పినా కూడా చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. చర్యలు గతం కన్నా కఠినంగా ఉంటాయి. ఒక్కసారి ఉద్యోగానికి ఇబ్బంది వచ్చిందంటే కష్టం. నా హయాంలో పైరవీలకు అవకాశం ఉండదు.’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరుచూ అధికారులకు చెబుతూ వస్తున్నారు. అవినీతి రహిత పాలన అందించాలని, లంచాల్లేని పాల న కొనసాగాలని ఆయన పదేపదే హెచ్చరించడమే కాకుండా హితబోధ చేస్తున్నారు. అయినా కొందరి తలకెక్కడం లేదు. తమ పాత బాణీ కొనసాగిస్తున్నారు. అలవాటు పడిన చేతులతో లంచాలు తీసుకుంటున్నారు. చివరికి అడ్డంగా బుక్ అవుతున్నారు. స్పందన దగ్గరి నుంచి సీఎంఓ కార్యాలయం వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఏ ఒక్క ఫిర్యాదునూ విడిచిపెట్టడం లేదు. సీరియస్‌గా తీసుకుని చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్రమాలకు పాల్పడితే వారిని దేవుడే రక్షించాలి. రెవెన్యూలో మామూలేనా? రెవెన్యూలో అవినీతి సాధారణమైపోయిందని అందులో పనిచేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్న వారే నిరూపించుకుంటున్నారు. ఈ పట్టాదారు పాసు పుస్తకాల కోసం భూమి విలువ మేరకు రూ. 5వేల నుంచి రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నారన్న వాదనలు కొనసాగుతూనే ఉన్నా యి. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం సర్టిఫికెట్ (లీగల్ హెయిర్), కొరిలేషన్ సర్టిఫికేట్, మ్యూటేషన్, కరెక్షన్లకు పలుచోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ రకమైన ఫిర్యాదులు ప్రతివారం కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమానికి కూడా వస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నా ఇంకా మారలేదన్న ఆవేదనైతే ఉన్నతాధికారుల్లో కూడా ఉంది. వాస్తవానికైతే ధ్రువీకరణ పత్రాలు అవసరమైన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటారు. వీఆర్ఓ ప్రాథమిక దర్యాప్తు చేస్తారు. దీని ఆధారంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధ్రువీకరిస్తారు. వీరిద్దరి స్టేట్మెంట్ సంతృప్తికరంగా ఉంటే తహసీల్దార్ డిజిటల్ కీ ద్వారా ఆమోదం తెలుపుతారు. ఈ ప్రక్రియ కోసం కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తాం కొత్తూరులో లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్ఓ సుందరరావుపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్పం దనలో భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సమస్యల పరిష్కారంలో జాప్యమెందుకవుతోందో నిఘా పెట్టి పరిశీలన చేస్తున్నాం. స్పందనలో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా విచారణ చేస్తున్నాం. అవసరమైతే అధికారులే నేరుగా అర్జీదారుని ప్రాంతానికి వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – బలివాడ దయానిధి, జిల్లా రెవెన్యూ అధికారి, శ్రీకాకుళం ఏసీబీ వలలో అవినీతి వీఆర్ఓ ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్వో మదన్మోహన్ సుందరరావు కొత్తూరు: మరో అవినీతి చేప ఏసీబీ అధికారుల వలలో పడింది. రెవెన్యూ శాఖలోనే మరో ఉద్యోగి లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారు. కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం పరిధి నేరడిరెవెన్యూ గ్రూపునకు ఇన్చార్జి వీఆర్వోగా పనిచేస్తున్న కె.మదన్ మోహన్ సుందరరావు (ఉరఫ్ సుందరరావు) మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో పడ్డారు. అదే మండలం లోని మెట్టూరుగూడకు చెందిన సవర సాయమ్మ అనే గిరిజన మహిళ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెట్టూరుగూడకు చెందిన సాయమ్మకు 1.80 సెంట్ల భూమి ఉంది. దీనికి ఈ పాస్ పుస్తకం, మ్యుటేషన్ చేయించాలని ఆరు నెలలుగా అధికారులను ఆమె కోరుతున్నారు. మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఫలి తం కనిపించలేదు. దీనిపై వీఆర్వో సుందరరావును సంప్రదించగా రూ.20వేలు లంచం ఇస్తే పని జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్నే సాయమ్మ సరుబుజ్జిలి మండలం వెన్నిలవలసకు చెందిన తన అల్లుడు సవర మిన్నారావుకు చెప్పారు. దీంతో ఆ యన అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని సూచించి, అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇంతలో వీఆర్వో సాయమ్మను రూ.10వేలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని అడిగారు. ఇదే విషయాన్ని సాయమ్మ ఏసీబీ అధికారులకు చెప్పా రు. దీంతో ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి పక్కాగా స్కెచ్ వేశారు. రూ.10వేలను సాయమ్మకు ఇచ్చి అంతకుముందుగానే తన సిబ్బందితో కొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో మాటు వేశారు. సరిగ్గా వీఆర్వో డబ్బు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, ఆయనను విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు బాస్కరరావు, హరిలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
పటమట సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడి
సాక్షి, అమరావతి: విజయవాడలోని పటమట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేశారు. ఈ సోదాల సమయంలో కార్యాలయంలో ఉన్న 12మంది డాక్యుమెంటు రైటర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. విజయవాడలోని పటమట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మెరుపు దాడి చేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏసీబీ బృందాలు కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న 12మంది డాక్యుమెంట్ రైటర్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.3.41 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిలో అనధికారికంగా పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని ఏసీబీ గుర్తించింది. పటమట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయం నుంచే రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వస్తోంది. ఇటీవల ఈ కార్యాలయంలో స్టాంప్ డ్యూటీ కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజయవాడ రేంజి అడిషినల్ ఎస్పీ ఎస్.సాయికృష్ణ, డీఎస్పీ పి.కనకరాజు ఆధ్వర్యంలో సోదాలు జరిపి, సబ్–రిజిస్ట్రార్ శ్రీనివాస్‌ను బదిలీ చేశారు. కాగా సోమవారం నాటి దాడుల్లో సీఐలు ఎస్.వెంకటేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు, హ్యాపీ కృపానందం, కెనడి పాల్గొన్నారు. అధికంగా ఫీజులు వసూలు.. స్టాంప్ డ్యూటీకి మించి ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అనధికారికంగా ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ కేసును ఇంకా విచారించాల్సి ఉంది. –ఏసీబీ అడిషనల్ ఎస్పీ, సాయికృష్ణ -
అవినీతిపరులకు.. 'బ్యాండ్'
సాక్షి, గుంటూరు: పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అక్రమంగా మింగిన సొమ్మును వెనక్కి ఇచ్చినా శిక్ష తప్పదనే భయం మొదలయ్యింది. మరో నెల రోజుల్లో కేసు దర్యాప్తును పూర్తి చేసి ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదికను సమర్పించనున్నారు. ఈ తరుణంలో కేసు చర్చనీయాంశంగా మారింది. పట్టణ ప్రణాళికా విభాగంలో భారీ స్థాయి అవినీతి జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. అయితే ఈ అవినీతిని అరికట్టడంలో గత ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు విఫలమయ్యారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 2012–2016లో 14 ఫైల్స్‌కు టీడీఆర్ బాండ్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్ బాండ్స్)లో భారీ స్థాయి అవినీతి జరిగిందంటూ అప్పట్లో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అవకతవకల విషయాన్ని నిర్ధారించారు. ఏసీబీ దర్యాప్తు.. ఈ వ్యవహారంపై గత ఏడాది ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదులు అందడంతో పూర్తి విచారణ జరిపిన అధికారులు టీడీఆర్ బాండ్లలో సుమారు రూ.1.60 కోట్లు అవినీతి జరిగిందని తేల్చారు. దీనిపై కమిషనర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్, డీఎంఈలు సైతం దర్యాప్తు జరిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పట్లో నివేదికలు పంపారు. టీడీఆర్ బాండ్లలో అక్రమాలకు పాల్పడిన 12 మంది అధికారులు(మినిస్టీరియల్ స్టాఫ్), తొమ్మిది మంది బిల్డర్లు సహా 32 మందిపై 13/1ఏ, 13/2, 420, 409, 467, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీఆర్ బాండ్ అంటే..! ప్రజా ప్రయోజనం కోసం భూసేకరణ జరిపితే పరిహారం చెల్లిస్తారు. స్థానిక సంస్థలు తాము చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ సొంతంగా చేసుకోవాల్సి ఉంది. దీనికి పరిహారం చెల్లించే స్తోమత స్థానిక సంస్థలకు ఉండదు. దీంతో వీటికి టీడీఆర్ బాండ్లు జారీ చేస్తారు. బాండ్లను బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ స్థలం విలువ పెరిగితే బాండ్ల విలువ పెరుగుతుంది. ఇలాంటి బాండ్లను అదే సంస్థలో రుసుముల చెల్లింపులకు ఉపయోగించవచ్చు. సాధారణంగా రహదారుల విస్తరణకు భూసేకరణ జరుపుతారు. 2012–2016 మధ్య గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జరిగిన రోడ్ల విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోయిన వారికి కార్పొరేషన్ టీడీఆర్ బాండ్లు మంజూరు చేసింది. ఈ ప్రక్రియలో అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు బిల్డర్లతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించారు. మొత్తం ముట్టజెప్పారు.. ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి కేసు నమోదు చేసేలోపే కొంతరు అధికారులు, బిల్డర్లు తాము నొక్కేసిన సొమ్ములో రూ.28 లక్షలు వెనక్కి ఇచ్చేవారు. అయితే ఇదంతా గత డిసెంబర్లో కేసు నమోదుకాక ముందు జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులందరికి నోటీసులు జారీ చేసిన వెంటనే మిగిలిన 1.32కోట్లు కూడా వచ్చేశాయి. అయితే అవినీతికి పాల్పడిన సొమ్మును వెనక్కు ఇచ్చినప్పటికీ తప్పు చేసినవారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేల బినామీలు.. నగరపాలక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నాయకులబినామీలు, ముఖ్య అనుచరులైన బిల్డర్లు ఉన్నారు. అందువల్లే గత ప్రభుత్వ హయాంలో కేసు ముందుకుసాగకుండా అడ్డకున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దర్యాప్తు వేగవంతమైనట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. -
ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు
సాక్షి, అమరావతి : మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఎన్నికలు ముగియడంతో ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు జీవో నెంబర్ 882ను విడుదల చేశారు. గత నెల 26న కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయాలని ఆదేశించడంతో తొలుత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 716 జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా జీవో లు విడుదల చేయటం వివాదాస్పదమైంది .అంతటితో ఆగక ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరిండచడంతో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ తర్వాత, డీజీపి ఠాకూర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. శాంతిభద్రతలతో పాటు, అవినీతి నిరోధకశాఖ డీజీగా ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తించేవారు. అదనపు బాధ్యతల నుంచి ఠాగూర్‌ను ఈసీ తప్పించింది. ఏసీబీ బాధ్యతలను శంఖ బ్రత బాగ్చికి అప్పగించారు. ఇంటెలిజెన్స్ బాధ్యతలను కుమార్ విశ్వజిత్‌కు అప్పగించారు. గత నెల 29నుంచి విధులకు దూరంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఏసీబీ డీజీగా నియమిస్తూ ఇప్పుడు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టింగ్ అప్పగించాలని నిబంధన ఉండటంతో అవినీతి నిరోధక శాఖ బాధ్యతలు అప్పగించారు. కాగా ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘ఓటుకు కోట్లు’ వివాదంలో చంద్రబాబు అడ్డంగా బుక్కైపోవడంతో అప్పటి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనురాధను తప్పించి.. ఆ స్థానంలో ఏబీవీని కూర్చోబెట్టారు. అప్పట్నుంచీ ఏబీవీ హవా జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నిఘా విధులు వదిలి పూర్తిగా చంద్రబాబు, టీడీపీ సేవలో ఏబీవీ తలమునకలయ్యారనేది బహిరంగ రహస్యం. ఒక దశలో ఆయన వీఆర్ఎస్ తీసుకుని తన స్వస్థలమైన నూజివీడు లేదా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే బలమైన ప్రచారం జరిగిందంటే అధికారపార్టీతో ఏబీవీకున్న అనుబంధం ఏపాటితో అర్థమవుతుంది. -
ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు
-
ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు
అమరావతి: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. కొత్త ఏసీబీ డీజీగా బాగ్చికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా జీవో జారీ చేశారు. డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఆర్పీ ఠాకూర్ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలంతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు. ఇటీవల టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో డీజీపీ ఠాకూర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఆర్పీ ఠాకూర్‌ను ఢిల్లీకి పిలిపించింది. అదే సమయంలో ఏసీబీ బాధత్యల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అయ్యారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలిసింది. రేపు మరోసారి ఎన్నికల సంఘం ముందు డీజీపీ హాజరు కానున్నారు. -
పాపం పండింది
విజయవాడ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్వాతంత్య్ర సమరయెధుని స్థలం కబ్జాలో సూత్రధారి.. ఎమ్మెల్యే బొండా ఉమ కేసులో పాత్రధారి అర్బన్ తహసీల్దార్‌గా పనిచేసిన ఆర్.శివరావు ఏసీబీకి చిక్కారు. సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు బ్రిడ్జి వద్ద స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎమ్మెల్యే, అతని అనుచరులు కబ్జాకు పాల్పడగా, అప్పట్లో తహసీల్దార్‌గా అందుకు సహకరించినట్లు తేలింది. బుధవారం నగరంలోని శ్వేతా టవర్స్‌లో ఏసీబీ అధికారులు శివరావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే శివరావు నోరు మెదపలేదని తెలుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధునికి సంబంధించిన భూమి అడంగళ్లు తారుమారు ఎందుకు చేశారని డీఎస్పీ రమాదేవి తహసీల్దార్‌ను ప్రశ్నించారు. ఇదిలాఉండగా స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన 1.50 ఎకరాల భూమిని అబ్దుల్ మస్తాన్ పేరుతో 2007లో అడంగళ్లు మార్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అడంగళ్లు మార్చి పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా తహసీల్దార్ ఇచ్చినట్లు నిర్ధారణ అయింది. ఆ భూమిలో సగం 0.75 సెంట్లు తహసీల్దార్ శివరావు తన బావమరిది దార్ల విజయకుమార్ పేరుతో జీపీఏ చేయించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ రమాదేవిమీడియాకు చెప్పారు. టైపిస్టు నుంచి తహసీల్దార్ వరకు.. శివరావు రెవెన్యూ శాఖలో 1987లో టైపిస్టుగా ఉద్యోగ బాధ్యతల్లో ప్రవేశించారు. కొంత కాలం మచిలీపట్నంలో కలెక్టర్ వద్ద సీసీగా విధులు నిర్వహించారు. ఆ తరువాత 2003 నుంచి 2006 వరకు పెనమలూరు డెప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. అనంతరం పదోన్నతి పొంది 2009 నుంచి 2012 వరకు మోపిదేవి, కంకిపాడు, గన్నవరంలో తహసీల్దార్‌గా పనిచేశారు. 2012 నుంచి 2018 వరకు ఆరేళ్ల పాటు విజయవాడ అర్బన్ తహసీల్దార్‌గా ఉన్నారు. అర్బన్ తహసీల్దార్ పోస్టు దక్కడంతో శివరావు దశ తిరిగింది. నగరంలో ప్రధాన ప్రొటోకాల్ ఆఫీసర్ కావడంతో కలెక్టర్లకు అత్యంత సన్నిహితంగా ఆయన చక్రం తిప్పాడు. చాలా నిదానంగా, నమ్మకంగా ఉండే ఆయన ఆరేళ్లలో అడ్డగోలుగా పనిచేసి అక్రమాస్తులు కూడబెట్టారు. ఎమ్మెల్యే అనుచర గణంతో, రియల్టర్లతో సన్నిహితంగా మెలిగేవారని ఆరోపణలు వెల్లువెత్తాయి. శివరావు అరెస్టు.. ప్రస్తుత పర్యాటక శాఖ ఎస్టేట్ ఆఫీసర్ శివరావును ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. బొండాగిరినివెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ గత ఏడాది ‘సాక్షి’ స్వాతంత్య్ర సమరయోధుని స్థలం కబ్జాలో బొండా ఉమ పాత్ర ఉన్నట్లు వెలుగులోకి తెచ్చింది. బొండాగిరి బయటపడగానే తహసీల్దార్ శివరావు పర్యాటక శాఖకు డెప్యుటేషన్‌పై బదిలీ చేయించుకున్నారు. బంధువుల ఇళ్లల్లో సోదాలు కంకిపాడు : కంకిపాడులో బుధవారం రాత్రి పర్యాటక శాఖ ఎస్టేట్ అధికారి ఆర్.శివరావు బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. శివరావు స్వగ్రామం కంకిపాడు కావడం తో లాకుగూడెంలోని బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. కుటుంబ నేపథ్యం,ఆస్తుల వివరాలు సేకరించినట్లు సమాచారం. -
గనుల శాఖలో బయటపడిన ‘కట్టల’ పాము
లాకర్లలో రూ.కోట్ల కట్టలు.. వాటర్ క్యాన్‌లోనూ లక్షలకు లక్షలు.. కోట్ల విలువైన బంగారు నిధి.. విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీ భవంతులు.. పక్క జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు.. వెరసి రూ.50 కోట్లకుపైగా అక్రమాస్తులు..రోజూ కాలం చెల్లిన పాత బజాజ్ స్కూటర్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్లి.. అక్కడి నుంచి రైలులో తను పనిచేసే అనకాపల్లికి వెళ్లే ఓ అధికారి ఇన్ని భారీ ఆస్తులు సంపాదించారంటే ఎవరైనా సరే.. నమ్మరేమో!..కానీ గురువారం ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో బయటపడిన అవినీతి గని.. దీన్ని నమ్మక తప్పదని చెబుతోంది.. ఆ అవినీతి ‘గను’డు.. అనకాపల్లి కేంద్రంగా పని చేస్తున్న గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గుండు శివాజీ.టెక్నికల్ అసిస్టెంట్‌గా 1993లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఈయన ఈ పాతికేళ్లలో ఏడీ స్థాయికి ఎదిగిన క్రమంలోనే ఎడాపెడా అక్రమార్జనకు పాల్పడ్డారు. అవనీతి సంపాదనతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, బంగారు నగలు సమకూర్చుకొని కోట్లకు పడగెత్తారు. ఈయనగారి అక్రమాలపై అందిన ఫిర్యాదులతో ఆరునెలల నుంచే ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అదను చూసి గురువారం దాడులు చేశారు. బృందాలుగా విడిపోయి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లిలోని అతని కార్యాలయం, విశాఖ ఎంవీపీ కాలనీలోని నివాసంతోపాటు పీఎంపాలెంలోనే అతని బావమరిది అయిన ఓ కానిస్టేబుల్ ఇంటిలోనూ సోదాలు జరిపారు. విజయగనం జిల్లాలోని అతని స్వగ్రామంతోపాటు పలువురు బంధువుల నివాసాల్లో జరిపిన సోదాల్లో అక్రమా ఆస్తులకు సంబంధించి కళ్లుచెదిరే వివరాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.2.50 కోట్లు అని అంచనా వేసినప్పటికీ.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్ల పైమాటేనని అధికారులే చెబుతున్నారు. లాకర్లు, ఇళ్లలో ఉన్న నగదులో అధిక శాతం 2000, 500 నోట్ల కట్టలే ఉండటం విశేషం. సీతమ్మధార(విశాఖ ఉత్తర): అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అందినకాడికి దోచుకుని కోట్ల రూపాయలు కూడబెట్టిన అవినీతి ఘని ఏసీబీ అధికారులకు చిక్కింది. 25 సంవత్సరాల కిందట సాధారణ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి రూ.50కోట్లకుపైగా కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో జియాలజీ అండ్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గుండు శివాజీ, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. విజయనగరంం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లిలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమార్జన గుట్టు విప్పారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎంవీపీ కాలనీ సెక్టార్ – 3లోని శివాజీ ఇంటిలో సోదాలు చేపట్టారు. అదే సమయంలో అతని సోదరుడు బాలాజీ ఇల్లు, పీఎంపాలెంలోని బావమరిది ఇల్లు, స్వగ్రామం బంటుపల్లిలోని ఇల్లు, అనకాపల్లిలోని కార్యాలయంలో సోదాలు చేపట్టారు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించారు. గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.50కోట్లు ఉంటుందని, బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.50కోట్లపైనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు గణేష్, రమేష్, గఫూర్, మూర్తి, అప్పారావు, ఉమామహేశ్వరరావు సిబ్బందితో బృందాలుగా ఏర్పాడి సోదాలు నిర్వహించారు. గుర్తించిన ఆస్తులివే ♦ శివాజీ ఇంటిలో 240 గ్రాముల బంగారం, 3.3 కిలోల వెండి, రూ.9.5లక్షలు గుర్తించారు. ♦ శివాజీ భార్య శారదామణి పేరిట ఎంవీపీ సెక్టార్ –6లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలోని లాకర్లో రూ.39.50 లక్షలు నగదు (అన్నీ రూ.2 వేలు, రూ.500ల నోట్లు) గుర్తించారు. ♦ ఎంవీపీ సెక్టార్ – 10లోని ఎస్బీఐ లాకర్ 34.50 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అందులోనే 1358 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ♦ కాపులుప్పాడలో 267 గజాల స్థలం. ♦ ఎంవీపీ కాలనీలో మూడు అంతస్తుల భవనం. (దీని విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.) ♦ విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్ వన్ భవనం. ♦ భోగాపురంలోని 25 సెంట్ల వ్యవసాయ భూమి. ♦ స్వగ్రామం బంటుపల్లిలో వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ♦ ఇంకా కొన్ని లాకర్లలో నగదు, బంగారం ఉందని, ఫిక్సిడ్ డిపాజిల్లు ఉన్నాయని... అవన్నీ పరిశీలిస్తున్నామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. శివాజీని అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. స్వగ్రామంలోని ఇంటిలో... డెంకాడ(నెల్లిమర్ల): విశాఖ జిల్లా అనకాపల్లి మైన్స్ ఏడీగా పని చేస్తున్న గుండు శివాజీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై అవినీతినిరోధక శాఖ అధికారులు ఆయన ఇళ్లపై గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. దీనిలో భాగంగా శివాజీ స్వగ్రామమైన విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని బంటుపల్లి గ్రామంలోని ఆయన స్వగృహంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ గఫూర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇక్కడ సోదాల్లో వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులకు సంబంధించిన భూమి పత్రాలను గుర్తించామని, కొత్తగా ఏమీ ఇక్కడ లభ్యం కాలేదని ఏసీబీ ఇన్స్పెక్టర్ గఫూర్ ‘సాక్షి’కి తెలిపారు. వీటన్నింటినీ నమోదు చేసుకుని, రెవెన్యూ అధికారుల నుంచి కూడా వీటిపై సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ నివాసంలో... పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని ఓ అపార్టుమెంట్లో నివసిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కూరాకుల చంద్రశేఖర్ నివాసంపై ఏసీబీ సీఐ రామారావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. అవినీతి ఘని మైన్స్ ఏడీ శివాజీకి చంద్రశేఖర్ స్వయానా బావమరింది. ఇంటిలో క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే శివాజీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యం కాలేదని సీఐ రామారావు తెలిపారు. ఆరు నెలలుగా నిఘాపెట్టి మైన్స్ ఏడీ శివాజీ అక్రమార్జనపై సమాచారం అందడంతో అవినీతి నిరోధక శాక అధికారులు అతని కార్యాలయం, ఇల్లు, తదితరాలపై గడిచిన ఆరు నెలలుగా నిఘా ఉంచారు. రోజూ ఇంటి నుంచి స్కూటర్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్లి... అక్కడ పార్కు చేసి రైలులో అనకాపల్లిలోని కార్యాలయానికి వెళ్తుండేవాడని అధికారులు గుర్తించారు. వాటర్ క్యాన్‌లో నోట్ల కట్టలు కూలింగ్ వాటర్ క్యాన్‌లో లక్షలాది రూపాయల నోట్ల కట్టలు దాచిపెట్టి తన పడక గదిలో శివాజీ ఉంచుకున్నాడు. తనిఖీల్లో వాటర్ క్యాన్‌లో సుమారు రూ.10 లక్షలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. పేరు : గుండు శివాజీ ఉద్యోగంలో చేరింది : 1993లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరిక ప్రస్తుత హోదా : జియాలజీ అండ్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్గాఅనకాపల్లిలో విధుల నిర్వహణ 25 ఏళ్లలో సంపాదన : బహిరంగ మార్కెట్లో రూ.50కోట్లకుపైనే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన ప్రదేశాలు ♦ అనకాపల్లిలోని మైన్స్ ఏడీ కార్యాలయం ♦ విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం బంటుపల్లి గ్రామంలోని శివాజీ స్వగృహంలో శ్రీకాకుళంలోని బంధువుల ఇంటిలో ♦ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు పరిశీలన ♦ విశాఖ నగర పరిధి ఎంవీపీ కాలనీలోని సెక్టార్ –3లోని శివాజీ ఇల్లు ♦ ఉషోదయ కూడలిలో ఆయన సోదరుడు బాలాజీ ఇల్లు ♦ పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని బావమరిది చంద్రశేఖర్ ఇంటిలో -
హంద్రీ–నీవా డిప్యూటీ సర్వేయర్ అరెస్టు
మదనపల్లె టౌన్: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై చిత్తూరు జిల్లా మదనపల్లె హంద్రీ–నీవా సుజల స్రవంతి డిప్యూటీ ల్యాండ్ సర్వేయర్ జి.వెంకటరమణను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి విలేకరులకు తెలిపిన వివరాలు.. మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివసిస్తున్న వెంకటరమణ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ సర్వేయర్‌గానూ, హెచ్ఎన్ఎస్ఎస్ విభాగంలో డిప్యూటీ ల్యాండ్ సర్వేయర్‌గానూ పనిచేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో వెంకటరమణ ఇంటిపై ఏఎస్పీ నేతృత్వంలో సీఐలు ప్రసాద్‌రెడ్డి, విజయేశ్వర్, గిరిధర్, మంగళవారం దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని మూడు ప్రాంతాల్లోనూ, చౌడేపల్లె మండలం దుర్గసముద్రం, పుంగనూరు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, కొత్తపల్లెలో ఏకకాలంలో ఆరు బృందాలతో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి సుమారు రూ.16 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు గుర్తించారు. అలాగే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సర్వేయర్ పేరుమీద రెండు డూప్లెక్స్ ఇళ్లు, భార్య జోత్స్న పేరుతో మరో రెండు డూప్లెక్స్ ఇళ్లు, జీప్లస్ టు భవనం, ఒక బయో ప్రొడక్టŠస్ ఫ్యాక్టరీ, కారు, బైకుతో పాటు పుంగనూరు రోడ్డులోని వలసపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రెండు షెడ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు రూ. 1.40 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. 1996 మార్చిలో వెంకటరమణ సర్వేయర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి చిత్తూరు జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. వెంకటరమణను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీకోర్టుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ వివరించారు. -
సర్వేయర్ ఆస్తులు రూ.25 కోట్లు!
పెనమలూరు/దేవరాపల్లి(మాడుగుల): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో కృష్ణా జిల్లా పెనమలూరు మండల సర్వేయర్ కొల్లి హరిబాబు ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. బుధవారం ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో.. రూ.25 కోట్ల విలువ చేసే ఆస్తులతోపాటు నగదు, ఆభరణాలు లభించాయి. దీంతో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని పామర్రు మండలం కనుమూరుకు చెందిన హరిబాబు(52) 1993లో సర్వేయర్‌గా చేరారు. గన్నవరం, విజయవాడ, పెనమలూరు ప్రాంతాల్లో సర్వేయర్‌గా విధులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం తెల్లవారుజామున విజయవాడ రామచంద్రనగర్ ప్రాంతం మహాలక్ష్మీ నిలయం అపార్టుమెంట్లో ఉంటున్న హరిబాబు ఇంట్లో, ఇంకా రామచంద్రపురం, పెనమలూరుతోపాటు మరో ఐదుచోట్ల సోదాలు చేశారు. తనిఖీల్లో హరిబాబు పెద్ద ఎత్తున ఆస్తులు కూడపెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబు భార్య పద్మజ పేరున విజయవాడ రామచంద్రనగర్‌లో 1,450 చదరపు అడుగుల విస్తీర్ణంతో విలువైన అపార్టుమెంట్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే విజయవాడ కార్మెల్నగర్లో 243 చదరపు గజాలు, నాగార్జుననగర్‌లో 206 చదరపు గజాలు, గన్నవరం బహుబలేంద్రునిగూడెంలో 822.6 చదరపు అడుగుల స్థలం, నూజివీడు గొల్లపల్లెలో 375 చదరపు గజాల స్థలం, విజయవాడ క్రీస్తురాజపురంలో 135 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే కుమార్తె హారిక పేరున పోరంకిలో 252 చదరపు గజాల స్థలం, మరో కుమార్తె హర్షిత పేరున 252 చదరపు గజాల స్థలాన్ని సైతం గుర్తించారు. ఇవిగాక బ్యాంకు బ్యాలెన్స్ రూ.11 లక్షలు, ఇంట్లో 49 వేల నగదు, మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఏసీబీకి చిక్కిన మరో సర్వేయర్ ఇదిలా ఉండగా విశాఖ జిల్లా దేవరాపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ ఎల్.శామ్యూల్ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భూమి సర్వే రిపోర్టుకోసం రూ.ఆరు వేలు లంచం డిమాండ్ చేసి చివరకు రూ.3వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పెదనందిపల్లికి చెందిన రైతు నుంచి ఆ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
కానిస్టేబుల్‌గా చేరి.. రూ.కోట్లు కొల్లగొట్టాడు
విశాఖ క్రైం: కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు... అక్కడి నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయికి చేరాడు... ఈ మధ్యలో అందినకాడికి దోచుకుని కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. అలా అక్రమార్జనతో భారీగా స్థిరాస్తులు సంపాదించి ఏసీబీకి చిక్కాడు ఏఎంవీఐ కొత్తపల్లి రవికుమార్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలతో ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌తోసహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి రవికుమార్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారంతో విశాఖలోని శ్రీహరిపురం కోరమాండల్ గేటు వద్ద ఉన్న రవికుమార్ ఇంటిలో, గాజువాక, కుర్మన్నపాలెం, సీతమ్మధార టీఎస్ఎన్ కాలనీ, ఇసుకతోటలోని బంధువుల ఇళ్లుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో రవికుమార్ అన్నయ్య ఇల్లు, విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో నాలుగు జిల్లాలకు సంబంధించిన ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లుతోపాటు ఇంటిలో 120 గ్రాముల బంగారం, ఇండియన్ బ్యాంక్ లాకరులో 399 గ్రాముల బంగారు ఆభరణాలు, 180 గ్రాముల వెండి, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.55వేలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2కోట్లుపైగా ఉంటుందని... బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.30 కోట్లుపైనే ఉంటుందని వెల్లడించారు. విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో సోదాలు చేశామని తెలిపారు. సోదాల్లో సీఐలు ఎం.వి.గణేష్, రమణమూర్తి, గొలగాని అప్పారావు, ఎం.మహేశ్వరరావు, గఫూర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 28 ఏళ్లు... రూ.30 కోట్లకుపైగా అక్రమార్జన విశాఖపట్నానికి చెందిన కొత్తపల్లి రవికుమార్ 1990లో రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం విశాఖ నగరంలోని గాజువాక, మర్రిపాలెంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో 20 ఏళ్లుకుపైగా ఆయన పనిచేశారు. నాలుగేళ్ల కిందట 2014లో ఏఎంవీఐగా పదోన్నతిపై విజయనగరం బదిలీ అయ్యారు. అయితే విజయనగరం రవాణా శాఖలో కీలకంగా చక్రం తిప్పుతూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఏసీబీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం 28 ఏళ్ల సర్వీసులో రవికుమార్ రూ.30కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టాడు. గుర్తించిన ఆస్తులివీ... ♦ మల్కాపురం అజంతకాలనీలో 1040 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్. ♦ మహారాణిపేటలోని వేంకటేశ్వరనగర్‌లో 44.19 చదరపు గజాల ఇంటి స్థలం. ♦ రవికుమార్ భార్య కొత్తపల్లి ఇందిరా ప్రియదర్శిని పేరుమీద మహారాణిపేట వేంకటేశ్వరనగర్‌లో 60 చదరపు గజా ల విస్తీర్ణంలోని మూడు ఇళ్ల స్థలాలు 2017లో కొనుగోలు చేశారు. ♦ విశాఖ బీచ్‌లోని నోవాటెల్ సమీపంలో 180 చదరపు గజాల విస్తీర్ణంలో గల స్థలంలో నిర్మిస్తున్న జీ ప్లస్ 1 భవనం. ఇక్కడే మరో ఖరీదైన ఇల్లు ఉంది. ♦ ఆరిలోవ శ్రీకాంత్‌నగర్‌లో 124 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 భవనం. ♦ భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడ సమీప తిమ్మాపురంలో 144 చదరపు గజాల ఇంటి స్థలం. ♦ అదే గ్రామంలో మరో 145 చదరపు గజాల ఇంటి స్థలం. ♦ అక్కడే మరో 100 చదరపు గజాల ఇంటి స్థలం. ♦ విజయగనరం జిల్లా వేపాడ మండలం జాకీర్ గ్రామంలో 0.62 సెంట్లు స్థలం. ♦ విశాఖ జిల్లా అచ్యుతాపురంలో 0.17 సెంట్లు స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల : పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి స్వామి దేవాలయం వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో కార్యాలయంలోని సిబ్బం ది.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి రూ.1,24,230లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్, స్టాంపులు, ఈ సీల్‌లతోపాటు ఇతరత్రా పనులపై వచ్చే వ్యక్తుల నుంచి కార్యాలయసిబ్బంది లంచం కింద డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పక్రియను కేవలం చలానా రూపంలోనే చెల్లించేలా చర్యలు చేపట్టిందన్నారు. అయితే ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అదనపు సిబ్బందిగా నియమించుకుని వారి ద్వారా, డాక్యుమెంట్ల రైటర్స్ ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఈ రోజు చేసిన సోదాలల్లో కార్యాలయ సిబ్బంది, ప్రైవేట్‌వ్యక్తులు, డాక్యుమెంట్ల రైటర్స్ నుంచి రూ.1,24,230ల నగదను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదన్నారు. విచారణ అనంతరం చర్యలు చేపడుతామన్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడులలో డీఎస్పీ నాగరాజుతోపాటు ఏసీబీ ఇన్స్పెక్టర్ రామచంద్ర పాల్గొన్నారు. -
కూలీ నుంచి కోటీశ్వరుడు!
కర్నూలు: ఖరీదైన భవనాలు, భూములు, డిపాజిట్లు, బ్యాంకుల్లో నగదు, భారీ మొత్తంలో అప్పుల పత్రాలు, కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు.. ఇవీ గృహనిర్మాణ శాఖ కొత్తపల్లి మండల ఏఈగా పనిచేస్తున్న రంగస్వామి అక్రమార్జన. ఓ సాధారణ ఉద్యోగి ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ఓసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కినప్పటికీ తీరు మారని రంగస్వామి మరింత రెచ్చిపోయాడు. ఈయన బారి నుంచి కాపాడాలని సామాన్య ప్రజానీకం ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టినా పట్టించుకున్న వారు లేరు. ఓ లబ్ధిదారునికి ఇంటి బిల్లు మంజూరు చేసేందుకుఏఈ రంగస్వామి రూ.7 వేలు లంచం తీసుకుంటూ గత నెల 15న ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఇతని అక్రమాస్తులపైనా పూర్తిస్థాయి విచారణ చేశారు. మంగళవారం ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు నిర్వహించి..భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల పట్టణానికి చెందిన వీఆర్వో జె.జె.బాబు ఆస్తులపై దాడులను మరువకముందే ఏసీబీ మరోసారి పంజా విసరడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కూలీ నుంచి కోటీశ్వరుడు! కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన రంగస్వామి ఉద్యోగం రాకముందు కుటుంబ సభ్యులతో కలసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గృహ నిర్మాణ శాఖలో సాధారణ ఉద్యోగిగా చేరి అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. ఏసీబీ డీఎస్పీ విజయరామరాజు, సీఐలు ఖాదర్ బాషా, గౌతమి నేతృత్వంలో మంగళవారం కర్నూలు శివారులోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న విజయ నగర్ కాలనీలో రంగస్వామి నివాసముంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే కృష్ణానగర్‌లోని రెండో కుమార్తె సులోచన, బేతంచర్లలోని మూడో కుమార్తె గాయత్రి, హైదరాబాద్ గచ్చిబౌలిలోని కుమారుడు లక్ష్మీనారాయణ ఇళ్లలో సీఐలు నాగభూషణం, తేజేశ్వరరావు, శ్రీధర్ నాయకత్వంలో తనిఖీలు చేపట్టారు. కోడుమూరులో రెండంతస్తుల భవనం, రెండు ఇంటి స్థలాలు, కర్నూలు విజయనగర్ కాలనీలో మూడంతస్తుల భవనం, ఇంటి స్థలం, పాములపాడు మండలం జూటూరులో 75 సెంట్ల వ్యవసాయ భూమి, 200 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు, డస్టర్ కారు, రెండు మోటర్ సైకిళ్లు, రుణాల పత్రాలతో పాటు బ్యాంకు అకౌంట్లలో రూ.3 లక్షల నగదు, ఇన్సూరెన్స్ పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.కోటి ఉంటుందని, బహిరంగ మార్కెట్లో అయితే రూ.3 కోట్లకు పైమాటే అని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. రంగస్వామిని అరెస్టు చేసి.. ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ జయరామరాజు తెలిపారు. -
‘ఏడీ’ నంబర్ 1
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ –1గా విధులు నిర్వహిస్తున్న మైలి ప్రభాకరావు ఇళ్లతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎస్కే షకీలా భాను ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. రాజమహేంద్రవరం, తణుకు, కాకినాడ, బెంగళూరు, తదితర ప్రాంతాల్లో సోదాలు చేయగా భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆయనతో పాటు, భార్య పేరున సుమారు రూ.కోటి 66 లక్షలకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్టు రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అడ్డతీగల మండలం కోనలోవ గ్రామంలోని ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నారావు రెండేళ్ల బీఈడీ విద్యను అభ్యసించడానికి 2018– 20 సంవత్సరాలకు గాను వేతనంతో కూడిన సెలవుకు ఆగస్టులో దరఖాస్తు చేసుకోగా డీఈఓ అనుమతి ఇస్తూ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫైల్ పంపించారు. ఆ ఫైల్ క్లియర్ చేయకపోగా కార్యాలయం చుట్టూ తిప్పుతూ చివరకు లంచం డిమాండ్ చేయడంతో ప్రధానోపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు గతనెల 20న కాకినాడలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏడీ ప్రభాకరరావుకు సొమ్ము ఇస్తుండగా ఏబీసీ రాజమహేంద్రవరం రేంజ్ డీఎస్పీ ఎం.సుధాకరావు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం ప్రభాకరరావుకు సంబంధించిన ఇళ్లు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. టైపిస్ట్‌గా ఉద్యోగం ప్రారంభించి.. 1982 అక్టోబర్ 23న విద్యాశాఖలో ప్రభాకరావు టైపిస్ట్‌గా విధుల్లోకి చేశారు. ఈయన విజయనగరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో అసిసెంట్ డైరెక్టర్ – 1 గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభాకరావు భార్య పేరున ఉన్న ఆస్తులివీ.. ఏడీ ప్రభాకరరావు భార్య విజయకుమారి పేరున 1988లో విజయనగరంలో 200 గజాల ఖాళీ స్థలం, 2004లో 200 చదరపు గజాల ఖాళీ స్థలం, 2008లో తమిళనాడులోని కృష్ణగిరి కెంపట్టి గ్రామంలో 1200 గజాల ఖాళీస్థలం కొనుగోలు చేశారు. 2005లో విజయనగరంలో బాలాజీ టవర్స్‌లో 6.91 స్క్వేర్ యార్డ్స్ షాపును కొనుగోలు చేశారు. విలువైన బంగారు, వెండి వస్తువులు ఈ సోదాల్లో 500 గ్రాముల బంగారు నగలు(విలువ రూ 11,46,620),4.112 కిలోల వెండి వస్తువులు (విలువ రూ 1,15,355), గృహోపకరణాలు రూ. 3,13,150, క్యాష్ రూ.6,25,000, బ్యాంక్ బ్యాలన్స్ రూ.1,96,959, రూ.ఆరు లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు సోదాల్లో లభించాయని తెలిపారు. వీటితో పాటు మారుతి ఆల్టో కారు, హీరో ఫ్యాషన్ ప్లస్ మోటారు సైకిల్ అక్రమాస్తుల సోదాల్లో బయటపడ్డాయని తెలిపారు. మొత్తం రూ.కోటీ 66 లక్షల విలువైన ఆస్తులు లభించాయని తెలిపారు. ఈ సోదాల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు పి.వి. సూర్యమోహన్‌రావు, వి.పుల్లారావు, పి.వి.జి.తిలక్ పాల్గొన్నారు. అక్రమాస్తుల వివరాలిలా.. ప్రభాకరరావు 2003లో విజయనగరంలో 400 చదరపు గజాలæ ఖాళీ స్థలం, 2005లో 200 చదరపు గజాల ఖాళీ స్థలాలను కొనుగోలు చేశారు. 2012లో కర్నూలు జిల్లా చంతన హల్లి గ్రామంలో 266.66 చదరపు గజాల ఖాళీ స్థలం కొనుగోలు చేశారు. 2014 బెంగళూరు, హుబ్లీలో 1287.50 గజాల స్థలం కొనుగోలు చేశారు. 2014 రాజానగరంలో 470.88 గజాలు, 2015 బెంగళూరు, హుబ్లీలో 2400 చదరపు గజాలు, 2015లో కర్నూలు జిల్లా నానూరు గ్రామంలో 171.41 చదరపు గజాలను కొనుగోలు చేశారు. విజయనగరంలో భగవాన్ రెసిడెన్సీలో ఎఫ్–2 ఫ్లాట్ కొనుగోలు చేశారు. 2017లో రాజమహేంద్రవరం సమీపంలోని హుకుంపేటలో 1400 చదరపుగజాల నివాస భవనం కొనుగోలు చేశారు. మసక బారుతున్నవిద్యాశాఖ ప్రతిష్ట బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెలలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడిచేసి రూ.పది వేలు లంచం తీసుకుంటుండగా ఏడీ ప్రభాకరరావును పట్టుకున్నారు. తిరిగి 20 రోజుల తరువాత ఆయన నివాసంలో మంగళవారం దాడులు నిర్వహించడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. విద్యాశాఖాధికారిపై ఏసీబీ అధికారులు దాడులు అనే ప్రచారం రావడంతో జిల్లా విద్యాశాఖాధి కార్యాలయానికి వారు వస్తారని పలువరు ఆందోళన చెందారు. 2016లో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు సస్పెండైన ఉపాధ్యాయుడికి తిరిగి ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో ఏసీబీకి చిక్కారు. తాజాగా ఏడీ ప్రభాకరరావు ఏసీబీకి చిక్కడంతో విద్యాశాఖలోనూ అవినీతి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.