కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. అచ్చెన్న ఆటకట్టు  | ACB Arrests TDP Leader Atchannaidu In ESI Medicines Scam | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. అచ్చెన్న ఆటకట్టు 

Published Sat, Jun 13 2020 9:10 AM | Last Updated on Sat, Jun 13 2020 10:04 AM

ACB Arrests TDP Leader Atchannaidu In ESI Medicines Scam - Sakshi

అచ్చెన్నాయుడి సెల్‌ఫోన్‌ని స్వాదీనం చేసుకుంటున్న ఏసీబీ అధికారులు

మేతగాళ్లకు మేతగాడు.. మందుల పేరుతో కోట్లు మింగిన మాయలోడు.. ఏసీబీ అధికారులకు చిక్కాడు.. గత ప్రభుత్వంలో కారి్మక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడి పాత్రపై అవినీతి నిరోధక శాఖ సమస్త సమాచారం సేకరించింది. అధికారులు అన్ని ఆధారాలతో నిమ్మాడలోని ఆయన ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడి దందాలను, గతంలో చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనంటున్నారు.   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కాలం ఎవర్నీ వదిలిపెట్టదు. ఎంతటి వారైనా తప్పు చేస్తే డైరీలో నమోదు చేసుకుంటుంది. టైం వచ్చినప్పుడు లెక్క తేలుస్తుంది. అక్రమార్కుల భరతం పడుతుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి విషయంలో అదే జరిగింది. తప్పులు చేసేసి... పెద్ద నోరు ఉందని గట్టిగా కేకలేసేసి... తానేదో నిజాయితీపరుడన్నట్టు డ్రామాలాడితే ప్రజలు ఎన్నాళ్లు నమ్ముతారు? చేసిన తప్పులు ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఎట్టకేలకు అచ్చెన్నాయుడి పాపం పండింది. (ఈఎస్‌ఐ కుంభకోణానికి ఆయనే ‘డైరెక్టర్‌’?)

ఏసీబీ అధికారులు ఉదయం సరిగ్గా 6.50 గంటలకు ఆయన స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని ఇంటికి వెళ్లి అరెస్టు సమాచారాన్ని తెలియజేశారు. 7.20 గంటల సమయంలో అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం కార్యాలయం సీఐయూ యూనిట్‌ డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు సమాచారాన్ని ఆయన భార్య, సోదరుడి కుమారుడు కుమారుడు కింజరాపు సురేష్‌కుమార్, లాయర్లకు తెలియజేశారు. అరెస్ట్‌ ఇంటిమేషన్‌ అందినట్టు సురేష్‌కుమార్‌ సంతకం తీసుకున్నారు. అచ్చెన్నాయుడిని విజయవాడ తరలించారు. (అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్)‌

అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 
అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్‌ నెంబర్‌ 04/ఆర్‌సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్‌ 13(1), (సీ), (డీ), ఆర్‌/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్‌ 408, సెక్షన్‌ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. 

పక్కా సమాచారంతో.. 
విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు చేసిన విచారణలో అచ్చెన్నాయుడి పాత్ర వెలుగు చూడటంతో పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్వగ్రామమైన నిమ్మాడలో నివాసమున్నట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6.50 గంటలకు అచ్చెన్నాయుడి నివాసంలోని మూడో అంతస్తుకు ఏసీబీ అధికారులు వెళ్లారు.

ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో మీ ప్రమేయం ఉందని, దాని కారణంగా అరెస్టు చేస్తున్నట్టుగా తెలిపారు. ‘అప్పుడే విచారణ పూర్తయిపోయిందా?’ అని ఏసీబీ అధికారులను అచ్చెన్నాయుడు ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణ పూర్తయిందని, అక్రమాల్లో మీ పాత్ర ఉందని తేలడంతో అరెస్టు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలియజేయడంతో ఎటువంటి ప్రతిఘటనకు పాల్పడకుండా 7.20 గంటల సమయంలో అరెస్టయ్యారు. టీడీపీ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి గలాట చేస్తారేమోనని పోలీసులు భావించినప్పటికీ ఆశించినంతంగా అక్కడికి రాలేదు. అచ్చెన్నాయుడికి సన్నిహితంగా ఉన్న నాయకులు మాత్రమే చేరుకున్నారు.  

ఈఎస్‌ఐ అక్రమాలివే.. 
రూ.975.79 కోట్ల విలువైన మందులతోపాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారు రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్‌ కిట్స్, ఫరి్నచర్‌ రూ.975.79 కోట్ల మేర పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్‌ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.  

సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్‌ కాంట్రాక్ట్‌ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు.   
టెండర్లు లేకుండా నామినేషన్‌ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది. లేబోరేటరీ పరికరాలను ఎలాంటి టెండర్లు లేకుండా లెజెండ్‌ అనే సంస్థకు ఇచ్చారు.  
శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62 కోట్ల మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70 శాతం అధికం.  
ఫ్యాబ్రికేటెడ్‌ కొటేషన్స్‌ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో ఇ.రమేష్‌బాబు, కె.ధనలక్ష్మి తదితరులు ఉన్నారు.  
రాశి ఫార్మా, వీరేష్‌ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70 కోట్ల మేర అదనంగా చెల్లించినట్టు తేలింది.  
కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలన పడేశారు. 
జెర్సన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే బినామీ సంస్థకు ఈఎస్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ సీకే రమేష్‌కుమార్‌ రూ.9.50 కోట్లు చెల్లించారు.  
రూ.16,992 విలువైన బయోమెట్రిక్‌ యంత్రాలను రూ.70,760 చొప్పున కొనుగోలు చేశారు.  

అడుగడుగునా అవకతవకలే..
గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అండతో అచ్చెన్నాయుడు చెలరేగిపోయారు. అడ్డొచ్చిన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. ఈఎస్‌ఐ కుంభకోణానికి పాల్పడి కోట్లాది రూపాయల కార్మికుల సొమ్మును కాజేశారు. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులు టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై అప్పగించాలని అచ్చెన్నాయుడు సిఫారుసు లేఖ ఇచ్చినట్టు పేర్కొన్న విజిలెన్స్‌ విచారణ నివేదిక మేరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టగా అక్రమాలు బయటపడ్డాయి.

ఇదే కాదు టీడీపీ హయాంలో నీరు చెట్టు, చంద్రన్న బీమా, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల రూపకల్పన, వివిధ అభివృద్ధి పనుల్లో నిధులు పక్కదారి పట్టించారు. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్‌ రుణాల్లో అక్రమాలు, సింగిల్‌ టెండర్‌ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్‌ టెండర్‌ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్‌ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఇన్ని అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు నీతివంతుడిలా మాట్లాడుతుంటారు.

బీసీ కార్డు బయటకు తీసిన తెలుగు తమ్ముళ్లు.. పట్టించుకోని బీసీలు..
నిజాయితీపరులమని,న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పాల్సిందిపోయి.. ఇది బీసీ నేత ను అణగదొక్కే ప్రయత్నమని టీడీపీ నేతలు దు్రష్పచారానికి ఒడిగట్టారు. బీసీలను రెచ్చగొట్టే ప్ర యత్నం చేస్తున్నారు. కానీ బీసీలెవరూ ఈ పరిణామాలను పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పు డు ఒకరిద్దరు వ్యక్తిగత లబ్ధి పొందారే తప్ప తమ ను పట్టించుకోలేదని, మరింత తొక్కేశారని బీసీలంతా భావిస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబునాయుడు బీసీలకు 110కి పైగా హామీలు ఇచ్చి.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. బీసీల్లో రజకులను, నాయీ బ్రాహ్మణులను, బోయీలను, మత్స్యకారులను ఇతర కులాలను ఎస్టీ, ఎస్సీల్లో చేర్చుతామని, గాండ్ల, సగర, పూసల, కురభ, బోయ, పద్మశాలీ తదితర కులాలను బీసీ డి నుంచి బీసీ ఎ కు మార్చుతామని దొంగ హామీ లు ఇచ్చి ఆ తర్వాత మోసం చేశారు.

హామీలు అమలు చేయమని అడిగిన మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులతోపాటు ఇతర కుల సంఘాల నాయకులపై తోక కత్తిరిస్తానని, తాట తీస్తానని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు పరుస్తానని ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చాక హామీ ప్రకారం రూ. 40 వేల కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఏడు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు ఎటువంటి ప్రయోజనాలు కలి్పస్తున్నదీ అందరికీ తెలిసిందే. బీసీలకు పదవుల్లోనూ, నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకుని.. టీడీపీ నేతల కపట నాటకాలపై బీసీలు చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement