
సాక్షి, విజయవాడ : ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన కింజరాపు అచ్చెన్నాయుడుకి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 1573 కేటాయించారు. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయన్ని న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించనున్నారు. అలాగే ఇదే కేసులో అచ్చెన్నాయుతో పాటు సీబీఐ అనుమానిస్తున్న మరో నలుగురు మద్దాయిలను కూడా నేడు (శనివారం) విచారించనున్నారు. అనంతరం వీరందరినీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు జమానాలో ఈఎస్‌ఐలో జరిగిన రూ.151 కోట్లకు పైగా కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధాన పాత్రధారిగా ఏసీబీ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. (రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ)