సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, అమరావతి: విజయవాడలోని పటమట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేశారు. ఈ సోదాల సమయంలో కార్యాలయంలో ఉన్న 12మంది డాక్యుమెంటు రైటర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. విజయవాడలోని పటమట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మెరుపు దాడి చేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏసీబీ బృందాలు కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న 12మంది డాక్యుమెంట్ రైటర్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.3.41 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే వీరిలో అనధికారికంగా పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని ఏసీబీ గుర్తించింది. పటమట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయం నుంచే రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వస్తోంది. ఇటీవల ఈ కార్యాలయంలో స్టాంప్ డ్యూటీ కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజయవాడ రేంజి అడిషినల్ ఎస్పీ ఎస్.సాయికృష్ణ, డీఎస్పీ పి.కనకరాజు ఆధ్వర్యంలో సోదాలు జరిపి, సబ్–రిజిస్ట్రార్ శ్రీనివాస్‌ను బదిలీ చేశారు. కాగా సోమవారం నాటి దాడుల్లో సీఐలు ఎస్.వెంకటేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు, హ్యాపీ కృపానందం, కెనడి పాల్గొన్నారు.
అధికంగా ఫీజులు వసూలు..
స్టాంప్ డ్యూటీకి మించి ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అనధికారికంగా ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ కేసును ఇంకా విచారించాల్సి ఉంది.
–ఏసీబీ అడిషనల్ ఎస్పీ, సాయికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment