Patamata
-
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బెజవాడ విద్యార్థి
పటమట (విజయవాడ తూర్పు): పటమటకు చెందిన గానుగుల కార్తికేయకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటంతో పాటు కేవలం నాలుగేళ్లలో (2014–2018) ప్రాథమిక నుంచి రాష్ట్రీయ భాషా ప్రవీణ వరకు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా గుర్తించి పురస్కారాన్ని అందిస్తున్నట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ బిష్వరూప్రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కార్తికేయ పదో తరగతి చదువుతున్నాడు. -
బెజవాడలో మరో గ్యాంగ్‌వార్!
సాక్షి, విజయవాడ: నగరంలోని పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్ తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేదారేశ్వరపేట ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్ నాగుల్‌మీరా(మున్నా), రాహుల్ అనే యువకుల వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీన రాహుల్‌తో పాటు అయోధ్యనగర్‌కు చెందిన వినయ్ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్‌మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నాగుల్‌మీరా వర్గానికి చెందిన ఈసబ్, సాయికుమార్ తదితరులు అయోధ్యనగర్ బసవతారకనగర్ రైల్వే క్యాబిన్ సమీపంలో వినయ్, రాహుల్ తదితరులపై కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. పరస్పర దాడులు తర్వాత ఇరువర్గాలు బయటకు రాలేదు. (గ్యాంగ్‌వార్.. రౌడీషీటర్‌పై హత్యాయత్నం) ఇదిలా ఉండగా అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్ (18) ఈ నెల 9వ తేదీన తనపై ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్ నాగుల్‌మీరా(25), న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన షేక్ ఈసబ్ (26), బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన లావేటి సాయికుమార్(24), సీతన్నపేటకు చెందిన నాగులాపల్లి సాయి పవన్(20), కృష్ణలంకకు చెందిన కంది సాయికుమార్ (20)లతో పాటు మరికొందరు దాడి చేసినట్లు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుట్టా వినయ్ ఫిర్యాదు చేసిన వారిలో నాగుల్‌మీరా, ఈసబ్, సాయికుమార్, సాయిపవన్, కంది సాయికుమార్‌లతో పాటు మరో ఇద్దరు బాలలను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, కత్తులు స్వాధీనం చేసుకున్నామని, దాడి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు వివరించారు. తనపై 9 మంది వ్యక్తులు కత్తులు, ఇతర మారణాయుధాలతో కేదారేశ్వరపేట ప్రాంతంలో దాడి చేశారంటూ షేక్ నాగుల్‌మీరా (మున్నా) ఆదివారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం ఖుద్దూస్‌నగర్‌కు చెందిన రాహుల్, పటమటకు చెందిన సాయికిరణ్, అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్, వికాస్ అనే యువకులను అరెస్టు చేసినట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి సైతం కత్తులు స్వాధీనం చేసుకున్నామని, మరో అయిదుగురు కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
పటమట సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడి
సాక్షి, అమరావతి: విజయవాడలోని పటమట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేశారు. ఈ సోదాల సమయంలో కార్యాలయంలో ఉన్న 12మంది డాక్యుమెంటు రైటర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. విజయవాడలోని పటమట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మెరుపు దాడి చేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏసీబీ బృందాలు కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న 12మంది డాక్యుమెంట్ రైటర్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.3.41 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిలో అనధికారికంగా పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని ఏసీబీ గుర్తించింది. పటమట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయం నుంచే రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వస్తోంది. ఇటీవల ఈ కార్యాలయంలో స్టాంప్ డ్యూటీ కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజయవాడ రేంజి అడిషినల్ ఎస్పీ ఎస్.సాయికృష్ణ, డీఎస్పీ పి.కనకరాజు ఆధ్వర్యంలో సోదాలు జరిపి, సబ్–రిజిస్ట్రార్ శ్రీనివాస్‌ను బదిలీ చేశారు. కాగా సోమవారం నాటి దాడుల్లో సీఐలు ఎస్.వెంకటేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు, హ్యాపీ కృపానందం, కెనడి పాల్గొన్నారు. అధికంగా ఫీజులు వసూలు.. స్టాంప్ డ్యూటీకి మించి ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. అనధికారికంగా ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ కేసును ఇంకా విచారించాల్సి ఉంది. –ఏసీబీ అడిషనల్ ఎస్పీ, సాయికృష్ణ -
ఓటు కార్డులోచ్చాయోచ్!
సాక్షి, పటమట(విజయవాడ తూర్పు): నగరపాలక సంస్థ పరిధిలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఎన్నికల కమిషన్ నూతన ఓటు కార్డులను వీఎంసీకి అందించింది. ఆయా నియోజవర్గాలకు సంబంధించి సుమారు లక్షమంది నూతన ఓటర్లు ఉండటంతో నియోజవకర్గాల వారిగా వాటిని అధికారులు విభజించిన పోలింగ్ బూత్‌ల వారిగా వేరు చేస్తున్నారు. ఓటర్లకు ఆయా కార్డులను బీఎల్ఓ(బూత్ లెవల్ అధికారి) ద్వారా పంపిణీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 30 వేల మంది నూతన ఓటర్లు నమోదయ్యారని అధికారులు తెలిపారు. -
చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ
విజయవాడ : చిత్తూరు జిల్లాలో వనజాక్షి ఘటన మరవక ముందే విజయవాడలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. చిట్టీ డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకుని సభ్యులకు ఎగనామం పెట్టింది. పటమటకు చెందిన రుక్మిణి అనే చిట్టీ నిర్వాహకురాలు సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి, ఆనక బిచాణా ఎత్తేసింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు ...రుక్మిణి ఇంటిపై దాడి చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరుతో వంచించాడు
హైదరాబాద్ : వారిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ప్రేమికుడు .... తన ప్రేయసి కొంతకాలంగా దూరం పెడుతున్నాడు. దాంతో అనుమానం వచ్చిన ప్రేమికురాలు కూలీ లాగింది. దాంతో అసలు విషయం బయటపడింది. ప్రేమికుడు.... మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలుసుకుంది. ఇదేంటని ప్రశ్నించి, పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు ప్రేమికుడు కట్నం కావాలని షరతు పెట్టడంతో ఆమె పోలీసు స్టేషన్ గడప తొక్కింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై బాధితురాలు సమాచారం ప్రకారం.... సత్యనారాయణపురానికి చెందిన యువతి(21) నాగార్జున యూనివర్సిటీలో పీజీ చదువుతోంది. బృందావన్ కాలనీలో నివాసి మహ్మద్ ఇలియాస్, యువతి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా కూడా సన్నిహితులయ్యారు. ఇలియాస్ ప్రేమికురాలి వద్ద ఖర్చుల కోసం భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడు. గత ఏడు నెలలుగా ఆమెతో దూరంగా ఉంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ప్రియుడి తీరుపై ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా, మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలిసింది. తాజా ప్రేమ వ్యవహారానికి ఇలియాస్ స్నేహితులు కూడా సహకరించినట్లు తెలుసుకుంది. దీనిపై ఇలియాస్‌ను నిలదీసింది. తనను వివాహం చేసుకోవాలని కోరగా, పెళ్లాడాలంటే కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాధితురాలు మంగళవారం చుట్టుగుంటలోని ఇలియాస్ రెండో ప్రేమికురాలి నివాసానికి వెళ్లింది. ఇలియాస్‌తో తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పి, అన్ని రకాలుగా మోసగించాడని వివరించింది. ఆమెను కూడా మోసం చేస్తాడని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం బాధిత యువతి పటమట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇలియాస్ తనను మోసగించాడని ఫిర్యాదు చేసింది. ఇలియాస్‌పై గతంలో సత్యనారాయణపురం స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం. తాజా ఫిర్యాదును కూడా ఆ స్టేషన్‌కే బదిలీ చేసినట్లు పటమట పోలీసులు తెలిపారు. -
ఆరని మంటలు..!
పటమట, న్యూస్‌లైన్ : తూర్పు నియోజకవర్గ టికెట్ కేటారుుంచడంలో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే గద్దె రామ్మోహన్‌కు టికెట్ కేటారుుంచాలని డిమాండ్‌చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేసినా ముఖ్య నాయకుల నుంచి స్పందన లేకపోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.] టీడీపీ జిల్లా పరిశీలకుడు సుజనా చౌదరి, ఇతర ముఖ్య నాయకులకు ఫోన్ చేసి గద్దె రామ్మోహన్‌కు బీఫారం ఇవ్వాలని కోరారు. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని నియోజకవర్గ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు. ఈక్రమంలో ఏడో డివిజన్ కార్యదర్శి ఏసు తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. పక్కనున్న నాయకులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న వచ్చారు. ఆయన్ను చుట్టుముట్టిన కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు. గద్దెకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయూన్ని వెంకన్న పార్టీ పెద్దలకు వివరించారు. అనంతరం సాయంత్రంలోపు గద్దెకు సీటు ఖరారవుతుందని చెప్పి కార్యకర్తలను శాంతింపజేసి ఆయన వెళ్లిపోయూరు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న కార్యకర్తలు రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.