
పంపిణీకి సిద్ధంగా ఉన్న ఓటు గుర్తింపు కార్డులు
సాక్షి, పటమట(విజయవాడ తూర్పు): నగరపాలక సంస్థ పరిధిలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఎన్నికల కమిషన్ నూతన ఓటు కార్డులను వీఎంసీకి అందించింది. ఆయా నియోజవర్గాలకు సంబంధించి సుమారు లక్షమంది నూతన ఓటర్లు ఉండటంతో నియోజవకర్గాల వారిగా వాటిని అధికారులు విభజించిన పోలింగ్ బూత్‌ల వారిగా వేరు చేస్తున్నారు. ఓటర్లకు ఆయా కార్డులను బీఎల్‌ఓ(బూత్ లెవల్ అధికారి) ద్వారా పంపిణీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 30 వేల మంది నూతన ఓటర్లు నమోదయ్యారని అధికారులు తెలిపారు.