ఆరని మంటలు..! | Jesus is the seventh division of the Secretary of kerosene on his body and tried to | Sakshi
Sakshi News home page

ఆరని మంటలు..!

Published Thu, Apr 17 2014 3:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

వెలంపల్లికి మద్దతు ఇవ్వబోమని నాయకుల ఆగ్రహం - Sakshi

వెలంపల్లికి మద్దతు ఇవ్వబోమని నాయకుల ఆగ్రహం

 పటమట, న్యూస్‌లైన్ : తూర్పు నియోజకవర్గ టికెట్ కేటారుుంచడంలో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే గద్దె రామ్మోహన్‌కు టికెట్ కేటారుుంచాలని డిమాండ్‌చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేసినా ముఖ్య నాయకుల నుంచి స్పందన లేకపోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.]

 

టీడీపీ జిల్లా పరిశీలకుడు సుజనా చౌదరి, ఇతర ముఖ్య నాయకులకు ఫోన్ చేసి గద్దె రామ్మోహన్‌కు బీఫారం ఇవ్వాలని కోరారు. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని నియోజకవర్గ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు.

 ఈక్రమంలో ఏడో డివిజన్ కార్యదర్శి ఏసు తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. పక్కనున్న నాయకులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న వచ్చారు. ఆయన్ను చుట్టుముట్టిన కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు. గద్దెకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ విషయూన్ని వెంకన్న పార్టీ పెద్దలకు వివరించారు. అనంతరం సాయంత్రంలోపు గద్దెకు సీటు ఖరారవుతుందని చెప్పి కార్యకర్తలను శాంతింపజేసి ఆయన వెళ్లిపోయూరు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న కార్యకర్తలు రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement