Gadde Ramamohan
-
గద్దె రామ్మోహన్ పై దేవినేని అవినాష్ ఫైర్
-
ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామా: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకుడు దేవినేని అవినాష్. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక పథకాలను అమలు చేయడంలేదన్నారు. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు. వైఎస్సార్సీపీ హయాంలో కార్పొరేషన్లలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరు నెలల కాలంలో చేసిందేమీ లేదు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ.. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి. లేనిపక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏపీలో కూటమి నేతలు స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెర లేపారు. గతంలో వైఎస్ జగన్‌పై కూటమి నేతలు నిందలు వేశారు. దానికి ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఆ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఎన్నికల ముందు ఉదయం అవ్వగానే పథకాల గురించి ఫోన్లు చేసి వివరించారు. పథకాలు ఎవరెవరికి అందాయి ఇప్పుడు ఫోన్లు చేసి కనుక్కోండి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి. మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోండి. లయోలా కాలేజీ వాకర్స్ కు గద్దె రామ్మోహన్ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. వాళ్లని రెచ్చగొట్టి ఇప్పుడు కేసుల్లో ఇరికించారు. లయోలా కాలేజ్ యాజమాన్యానికి వాకర్స్‌ని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. వారికి న్యాయం చేయండి. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ అని చెప్పారు. -
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు. -
గద్దె రామ్మోహన్ పై జోగి రమేష్ ఫైర్
-
‘గతంలో ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు’
సాక్షి, విజయవాడ: విహారయాత్రకు అమెరికా వెళ్లి వచ్చిన గద్దె రామ్మెహన్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ అన్నారు. నాలుగు వేల మంది పేదలకు ఇల్లు, ఇళ్లస్థలాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ ఎమ్మెల్యేలకు రూ.కోటి చొప్పున నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా స్వాగతిస్తామన్నారు. దేవినేని అవినాష్ పార్టీలోకి రావటాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చే అనేకమంది పార్టీలో చేరుతున్నారన్నారు. -
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ల ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. అలాగే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కె.కన్నప్పరాజు, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఎన్నికను రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మలసాని మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అఫిడవిట్లో తన ఆదాయం, వృత్తి వివరాలను తెలపాల్సి ఉండగా వీరు పొందుపర్చలేదన్నారు. అనగాని సత్యప్రసాద్ కూడా ఆదాయ వివరాలు పేర్కొనలేదని తెలిపారు. వాస్తవాలను దాచి వీరు అఫిడవిట్ దాఖలు చేశారని, ఎన్నికల నిబంధనలకు ఇది విరుద్ధమని మనోహర్‌రెడ్డి వివరించారు. -
త్వరలో ‘థ్యాంక్యూ అంగన్వాడీ అక్క’
సాక్షి, విజయవాడ: జిల్లాలో పౌష్టికాహార మాసోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. పౌష్టికాహారంపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పౌష్టికాహారాన్ని పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ‘థ్యాంక్యూ అంగన్వాడీ అక్క’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. జిల్లాలో బలహీనంగా ఉన్న పిల్లలు ఉండకూడదనేది తమ లక్ష్యమని తెలిపారు. దాన్ని చేరుకోడానికి అవసరమైన వనరులన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌష్టికాహార మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు...
సహకార సంఘాల్లో అవినీతి నిజమే ఏపీ సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 39 సహకార పరపతి సంఘాలలో రైతులకు, వారి కుటుంబాలకు తెలియకుండా సిబ్బంది రుణాలు తీసుకున్న మాట నిజమేనని సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంగీకరించారు. శనివారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ అంశంపై చర్చ సందర్భంలో మాట్లాడిన అప్పలనాయుడు, శ్రావణ్‌కుమార్‌లు పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి పేర్లను ప్రస్తావించారు. గంగిరెడ్డితో సంబంధాలున్నాయంటూ తమ నాయకులపై పదేపదే ఆరోపణలు చేయడం పట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఒక్క విశాఖ సిటీయే కాదు మా ఊళ్లూ దెబ్బతిన్నాయి.. హుద్‌హూద్ తుపానుపై మాట్లాడే వారందరూ ఒక్క విశాఖ సిటీనే ప్రస్తావిస్తున్నారని, అరకు, పాడేరు నియోజకవర్గాలలో కూడా మరణించిన వారున్నారని, వారినీ ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. తుపాను సాయం చాలా చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ గిరిజన ప్రాంతాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తుపాను పీడిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ఏమేం చర్యలు చేపట్టిందీ, కేంద్రానికి ఎటువంటి ప్రతిపాదనలు పంపిందీ మంత్రి చినరాజప్ప సుదీర్ఘంగా వివరించారు. మురుగునీళ్లే విజయవాడ ప్రజలతో తాగిస్తున్నాం.. విజయవాడ ప్రజలతో కలుషిత నీరే తాగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూగర్భ మురుగు కాలువల నుంచి వచ్చే నీరు కృష్ణా, ఇతర ప్రధాన కాలువలలోకి విడుదలై, వాటినే దిగువ ప్రాంతాల ప్రజలు తాగుతున్నారని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఐదు జిల్లాల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తి: అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించనున్నట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక జవాబిస్తూ.. అనంతపురం జిల్లా ఎస్పీ కుంట, కడప జిల్లా గాలివీడు, కర్నూలు జిల్లా పిన్నాపురంలో 2500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సౌరవిద్యుత్ విధానాన్ని ప్రకటించనున్నామన్నారు. చర్చలో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా మాట్లాడుతూ.. ఈ పార్కుల కోసం పంట భూముల్ని తీసుకుంటున్నారని ఆరోపించారు. -
లౌక్యం ఆడియో లో తమ్ముళ్ల రాజకీయాలు
మైక్ దొరికిందంటే చాలు సమయం, సందర్భం లేకుండా అసలు విషయాన్ని పక్కన పెట్టి... పొలిటికల్ లీడర్లు రాజకీయ ప్రసంగాలు చేసేస్తుంటారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన జనాలు ఇదేమీ గోలరా బాబు అని విసుక్కుంటున్నారు. ఓ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు... వేడుకను మరచిపోయి పార్టీ మీటింగ్‌లా ప్రసంగాలు చేసేశారు. హీరో గోపీచంద్ తాజా చిత్రం 'లౌక్యం' ఆడియో ఫంక్షన్ వేడుకను తమ్ముళ్లు ...పార్టీ వేదికగా మార్చుకున్నారు. లౌక్యం ఆడియో ఆవిష్కరణ ఆదివారం విజయవాడ లయోలా కళాశాలలో జరిగింది. ఈ వేడుకకు అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సినిమాలోని తొలిపాటను ఆవిష్కరించారు. అంతటితో ఊరుకోని ఆయన తన రాజకీయ ప్రసంగంతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే దాడిలో నడిచారు. దాంతో కార్యక్రమానికి హాజరైన వారు చిరాకు పడ్డారు. ఉల్లాసం కోసం ఆడియో వేడుకకు వస్తే ఇక్కడ కూడా రాజకీయ ప్రసంగాలు ఏంటిరా బాబు అని అభిమానులు, ప్రేక్షకులు తల పట్టుకున్నారట. మరి తెలుగు తమ్ముళ్ళా మజాకా! -
ఆరని మంటలు..!
పటమట, న్యూస్‌లైన్ : తూర్పు నియోజకవర్గ టికెట్ కేటారుుంచడంలో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే గద్దె రామ్మోహన్‌కు టికెట్ కేటారుుంచాలని డిమాండ్‌చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేసినా ముఖ్య నాయకుల నుంచి స్పందన లేకపోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.] టీడీపీ జిల్లా పరిశీలకుడు సుజనా చౌదరి, ఇతర ముఖ్య నాయకులకు ఫోన్ చేసి గద్దె రామ్మోహన్‌కు బీఫారం ఇవ్వాలని కోరారు. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని నియోజకవర్గ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు. ఈక్రమంలో ఏడో డివిజన్ కార్యదర్శి ఏసు తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. పక్కనున్న నాయకులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న వచ్చారు. ఆయన్ను చుట్టుముట్టిన కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు. గద్దెకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయూన్ని వెంకన్న పార్టీ పెద్దలకు వివరించారు. అనంతరం సాయంత్రంలోపు గద్దెకు సీటు ఖరారవుతుందని చెప్పి కార్యకర్తలను శాంతింపజేసి ఆయన వెళ్లిపోయూరు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న కార్యకర్తలు రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. -
‘గద్దె‘కు మొండిచెయ్యే
మరోసారి అవమానం తప్పదా? సీటుపై హామీ ఇవ్వని చంద్రబాబు పోటీ నుంచి తప్పుకొనేందుకు అనూరాధ సిద్ధం! యలమంచిలి రవి ఇంటి వద్ద కోలాహలం సాక్షి, విజయవాడ : మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి గద్దె రామ్మోహన్‌కు ఆ పార్టీ మరోసారి మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమౌతోంది. గతంలో గన్నవరం ఎమ్మెల్యే సీటు, ఆ తరువాత విజయవాడ ఎంపీ సీటు ఆశించి భంగపడినప్పటికీ.. ఈ అవమానాలన్నింటినీ దిగమింగుకుంటూ అదే పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈసారి ఎంపీ సీటు కావాలంటూ నాలుగైదు నెలల క్రితం బహిరంగంగానే ప్రకటనలు గుప్పించిన గద్దె రామ్మోహన్ చివరకు విజయవాడ తూర్పు సీటు ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆయన కుటుంబ స్థాయిని చంద్రబాబు జెడ్పీకే పరిమితం చేశారని పార్టీ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తనను తప్పించి.. భార్యకు సీటిచ్చి.. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్‌ను తప్పించేందుకు ఆయన భార్య అనూరాధకు జెడ్పీ చైర్మన్ సీటు ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా అనూరాధ నామినేషన్ వేసిన తరువాత తన భర్తకు ఎమ్మెల్యే సీటు గురించి తేల్చుకునేందుకు వారిద్దరూ హైదరాబాద్ వెళ్లారు. శనివారం వారు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా, ఆయన మాట్లాడేందుకు సుముఖంగా లేరని తెలిసింది. ముందు జెడ్పీ ఎన్నికలపై దృష్టి పెట్టండని మాత్రమే చెప్పారు తప్ప తూర్పుపై ఎటువంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన ఇతర వివరాలను జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరితో మాట్లాడమని సూచించినట్లు సమాచారం. తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవిని పార్టీలోకి తీసుకోవడంపై గద్దె దంపతులు సుజనాచౌదరిని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఆయన్ని బేషరతుగా మాత్రమే పార్టీలో చేర్చుకుంటున్నామని, ఎమ్మెల్యే సీటు హామీ ఏమీ ఇవ్వలేదని, అందువల్ల కంగారుపడాల్సిన పనిచేదని సుజనా చౌదరి చెప్పినట్లు సమాచారం. పోటీ నుంచి తప్పుకొంటానని అనూరాధ అల్టిమేటం? ఈ నెల 25లోగా తన భర్తకు తూర్పు నియోజకవర్గం సీటు ఇచ్చే విషయం తేల్చకపోతే ఆరోజు జెడ్పీ చైర్మన్ పోటీ నుంచి తప్పుకొంటానని అనూరాధ పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 25 వరకు ఏదోవిధంగా నాన్చివేత ధోరణి చూపి, ఆ తర్వాత తన భర్తకు మొండిచెయ్యి చూపితే.. తాను ఏమాత్రం సహించబోనని, తొలి నుంచి తన భర్త సీటుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె సుజనాచౌదరి వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు ఆలోచనలో పడినట్లు తెలిసింది. యలమంచిలి రవి ఇంటి వద్ద కోలాహలం... కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని, ఆ తరువాత తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. గద్దె రామ్మోహన్ ఆశీస్సులలో కార్పొరేటర్ సీటు పొందినవారు కూడా శనివారం సాయంత్రం నుంచి యలమంచిలి శిబిరంలో దర్శనమిస్తున్నారు. రవి ఒకడుగు ముందుకేసి టీడీపీ జాబితాలను తెప్పించుకుని కార్పొరేటర్ అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద కోలాహలం కనపడుతోంది.