లౌక్యం ఆడియో లో తమ్ముళ్ల రాజకీయాలు | tdp leaders use Lowkyam Audio function to politics | Sakshi
Sakshi News home page

లౌక్యం ఆడియో లో తమ్ముళ్ల రాజకీయాలు

Published Mon, Sep 15 2014 10:46 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

లౌక్యం ఆడియో లో తమ్ముళ్ల రాజకీయాలు - Sakshi

లౌక్యం ఆడియో లో తమ్ముళ్ల రాజకీయాలు

మైక్ దొరికిందంటే చాలు సమయం, సందర్భం లేకుండా అసలు విషయాన్ని పక్కన పెట్టి... పొలిటికల్ లీడర్లు రాజకీయ ప్రసంగాలు చేసేస్తుంటారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన జనాలు ఇదేమీ గోలరా బాబు అని విసుక్కుంటున్నారు. ఓ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు... వేడుకను మరచిపోయి పార్టీ మీటింగ్లా ప్రసంగాలు చేసేశారు. హీరో గోపీచంద్ తాజా చిత్రం 'లౌక్యం' ఆడియో ఫంక్షన్ వేడుకను తమ్ముళ్లు ...పార్టీ వేదికగా మార్చుకున్నారు.

లౌక్యం ఆడియో ఆవిష్కరణ ఆదివారం విజయవాడ లయోలా కళాశాలలో జరిగింది. ఈ వేడుకకు అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సినిమాలోని తొలిపాటను ఆవిష్కరించారు. అంతటితో ఊరుకోని ఆయన తన రాజకీయ ప్రసంగంతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే దాడిలో నడిచారు. దాంతో కార్యక్రమానికి హాజరైన వారు చిరాకు పడ్డారు. ఉల్లాసం కోసం ఆడియో వేడుకకు వస్తే ఇక్కడ కూడా రాజకీయ ప్రసంగాలు ఏంటిరా బాబు అని అభిమానులు, ప్రేక్షకులు తల పట్టుకున్నారట. మరి తెలుగు తమ్ముళ్ళా మజాకా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement