Bonda Umamaheswara Rao
-
బొండా జంప్!
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన అనంతరం చీమ చిటుక్కుమన్నా టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు హడలిపోతున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులను చూసిన బొండా ఉమా ఒక్కసారిగా హడలిపోయి పార్టీ నేతలకు ఫోన్లు చేసి చొక్కా మార్చుకుని అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత బొండా ఉమా ఇంటి వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తుకు వెళ్లారు. వారిని ఎందుకు వచ్చారంటూ బొండా ప్రశ్నించగా మీకు సెక్యూరిటీగా వెళ్లమన్నారంటూ బదులివ్వడంతో కంగారుపడ్డ ఆయన అక్కడి నుంచి తన కార్యాలయానికి వడివడిగా వెళ్లిపోయారు. వంగవీటి రాధాకు ఫోన్...! టాస్‌్కఫోర్స్, షాడో టీమ్‌లు తనని అరెస్ట్ చేసేందుకు వచ్చాయంటూ బొండా ఉమా ఫోన్లు చేయగా టీడీపీ శ్రేణులు స్పందించకపోవడంతో వంగవీటి రాధా, ఆయన మామ చెన్నుపాటి శ్రీనుకు ఫోన్లు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రాధా తన అనుచరులకు ఫోన్లు చేసి అందుబాటులో ఉన్నవారంతా టీడీపీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. వారంతా అక్కడకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. షర్టు మార్చి... గోడ దూకి.. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని ఆందోళన చెందిన బొండా ఉమా సెంట్రల్ టీడీపీ కార్యాలయం మొదటి అంతస్తులోకి వెళ్లి చొక్కా మార్చుకున్నారు. అనంతరం దాని వెనుకే ఉన్న మరో భవనంలోకి దూకి పరారైనట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడు, ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ ‘మామ’ బొండా ఉమాను తన కారులో ఎక్కించుకొని మొగల్రాజపురంలోని రాధా ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని ముఖ్య ప్రదేశాలు, పార్టీ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే బొండా ఉమా వద్దకు వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
బెజవాడ సెంట్రల్లో కాల్కేయుడు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడలో బొండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూకబ్జాలు, దౌర్జన్యాలు, కాల్‌మనీ, సెక్స్ రాకెట్.. ఆయన చేయని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ► 2014–19 మధ్య బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని కనుసైగతో శాసించారు. భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని బొండా కబ్జా చేశారు. సెటిల్మెంట్లతోపాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ► కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బొండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్‌మనీ కింగ్‌గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బొండా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ► సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కల్యాణ మండప కబ్జాకు బొండా వర్గీయులు యతి్నంచారు. ► న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బొండా భంగపడ్డారు. ► రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలకు ఇళ్లు నిర్మించి విక్రయించారు. ► ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు ధారాదత్తం చేశారు. ► అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలనూ విక్రయించారు. ► విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రూ.30 కోట్లు భూదందాలో కూడా మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ► కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1,720 గజాల స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేసేందుకు ప్రయతి్నంచారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. ► పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతంలో మూడు ఎకరాల వరకూ ఉన్న కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటి కి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగబడ్డారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. గీతాంజలి కేసులో బొండా అనుచరుడి అరెస్ట్ ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బొండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకులదీ అదే తీరు బొండా కుమారులు ఇద్దరూ దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బొండా కుమారుడు నిర్వహించిన కారు రేస్‌లో మనోరమ హోటల్లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డురావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు. తెనాలికి చెందిన రౌడీషిటర్ సుబ్బుతో బొండాకు సత్సంబంధాలున్నాయి. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బొండా, మరికొందరి టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు. దుర్గాపురంలోని ఓ అపార్ట్మెంటులో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్‌ను బొండా అనుచరులు కబ్జాకు యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ విక్రయానికి యత్నించగా జాలి లేకుండా బొండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు. బొండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజి ్రస్టేషన్ చేసుకున్న వారిలో బొండా ఉమా భార్య సుజాతతోపాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బొండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. అకృత్యాలెన్నున్నా కేసులు మూడే.. బొండా ఉమా మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2011 మార్చి1న సెక్షన్ 9, 9ఏఏ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బొండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నంబర్ 462/2006పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బొండా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
‘బోండా ఉమ ఒక చిల్లర వ్యక్తి.. బజారు మనిషి’
విజయవాడ: చంద్రబాబు నాయుడు, బోండా ఉమాపై విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. బోండా ఉమ లాంటి ఒక లోఫర్‌ను చంద్రబాబు తప్ప ఎవరూ ప్రోత్సహించరని అవినాష్ మండిపడ్డారు.బెజవాడకు గంజాయి అలవాటు చేసిన వ్యక్తి బోండా ఉమ అని, బైక్ కార్ రేసులతో పాటు రేవ్ పార్టీ కల్చర్‌ను నగరానికి తెచ్చింది కూడా బోండా ఉమనేనని అన్నారు అవినాష్. ‘బోండా ఉమ ఒక చిల్లర వ్యక్తి, బజారు మనిషి. బోండా ఉమ కుటుంబం గురించి చెప్పాలంటే చాలా ఉంది. తిరుపతిలో సారా వ్యాపారం చేసిన వ్యక్తి బోండా ఉమ. కోగంటి సత్యం, ఐలాపురం వెంకయ్య దగ్గర డ్రైవర్‌గా పని చేసి వారినే మోసం చేసిన వ్యక్తి బోండా ఉమ. గతంలో టీడీపీ ప్రభుత్వమే బోండా ఉమ అక్రమాలపై విచారణ చేసింది.చంద్రబాబు కాళ్లు పట్టుకొని బోండా ఉమ బయటపడ్డాడు. బైక్, కార్ రేసులు, రేవ్ పార్టీ కల్చర్ నగరానికి తెచ్చిందే బోండా ఉమ. మంత్రి పదవి కోసం చంద్రబాబును బోండా బ్లాక్ మెయిల్ చేస్తే, భూ కబ్జాలపై బోండా ఉమకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. బోండా ఉమ లాంటి లోఫర్ చంద్రబాబు తప్ప ఎవరూ ప్రోత్సహించరు’ అని అవినాష్ విమర్శలు గుప్పించారు. -
విజయవాడ సెంట్రల్, పెనమలూరు టీడీపీలో అసమ్మతి జ్వాలలు
సాక్షి, విజయవాడ: వరుస పరాజయాలను మూటకట్టుకున్న టీడీపీ పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోజు రోజుకూ మరింతగా దిగజారుతోంది. పెనమలూరు నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి బుసలు కొడుతోంది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బోడె ప్రసాద్‌పై ఆ పార్టీ నాయకులు ఏకంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సైతం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాలుగు వర్గాలుగా చీలిపోయారు. ఒకరి మీద మరొకరు కారాలూ మిరియాలు నూరుకొంటున్నారు. బోడెపై తీవ్ర వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘అసమర్థుడు, చిత్తశుద్ధి లేదు, అవినీతిపరుడు, అధికార దుర్వినియోగం’ చేశాడు అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీలోని ఓ వర్గం బోడెపై తీవ్ర స్థాయిలో తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్ (వైవీబీ), పండు వర్గాలు, బోడె ప్రసాద్‌పై బహిరంగంగానే విమర్శల దాడి చేస్తున్నాయి. ‘మీకు బదులు వేరే వాళ్లతో పరీక్షలు రాయిస్తూ పట్టుబడిన మాట వాస్తవం కాదా’ అంటూ బోడెను ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన కంకిపాడు, పెనమలూరు మండలాలకు చెందిన పలువురు నాయకులు బోడె ప్రవర్తనతో విసిగి పార్టీ మారారంటూ నిందిస్తున్నాయి. చదవండి: (అనకాపల్లి.. ఇదేం లొల్లి..?) కోడిపందేలు, పేకాటతో అపఖ్యాతి బోడె ప్రసాద్ ఈడుపుగల్లులో కోడిపందేలు, పేకాట, క్యాసినో సంస్కృతిని తెచ్చి, ఆయా జూదాల నిర్వాహకుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన వైనాన్ని వ్యతిరేక వర్గం నాయకులు ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. ఇప్పటికీ కాల్‌మనీ, సెక్స్ రాకెట్, క్యాసినో నిందితులతో అంతర్గత వ్యాపారం ఉన్న మాట వాస్తవం కాదా అని నిలదీస్తున్నారు. వారితో కలిసి పట్టాయి, బ్యాంకాక్, దుబాయ్, మహాబలిపురం తదితర ప్రాంతాలకు ఇటీవలే వెళ్లి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గతంలోనే ఈడుపుగల్లులో సంక్రాంతి సంబరాలకు క్యాసినో పెట్టాలని గోవా నుంచి యువతులను, సామగ్రిని తెచ్చి హోటల్లో ఉంచిన విషయాన్ని మరిచారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలకు ఆయన అభిమానులు ఆహ్వానిస్తే, అహంకారంతో వ్యవహరించిన బోడె తీరును ఇంకా మర్చిపోలేదంటూ గుర్తుచేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే నిజమైన కార్యకర్తల పరిస్థితి ఏమిటని సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలే బోడె ప్రసాద్‌ను నిలదీయడం పార్టీ దుస్థితికి అద్దంపడుతోంది. ఓడిపోయినా తీరుమారని బోడే అంటూ పోస్టులు పెడుతున్నారు. మరో వైపు సర్పంచ్ల సంఘం దొంగ డ్రామాలు అంటూ వైవీబీ వర్గంపై బోడె వర్గం ఎదురుదాడి చేస్తోంది. సెంట్రల్లో నాలుగు ముక్కలాట విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీలో నాలుగు ముక్కలాట సాగుతోంది. నియోజకవర్గంలో బొండా ఉమా సొంతంగా ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన వద్దకు కొత్తగా వచ్చిన నాయ కుడు ఒకరు నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవ హరిస్తున్నాడు. దీంతో ఆది నుంచి టీడీపీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు బొండా ఉమాకు దూరమయ్యారు. ఈ నియోజకవర్గంలో బొండా ఉమాది ఓ వర్గం. కేశినేని చిన్నిది మరో వర్గం. వంగవీటి రాధాది ఇంకో వర్గం. పార్టీని మొదటి నుంచి వెన్నంటి ఉన్నవారు నాలుగో వర్గంగా విడిపోయారు. ఈ నాలుగు గ్రూపులు ఎవరికి వారుగా వ్యవహరిస్తూ, పార్టీలో అసమ్మతిని రాజేస్తున్నారు. ఇటీవల 63 డివిజన్ పరిధిలో అన్నా క్యాంటీన్ వద్ద ఇరువర్గాలు ఎదురుపడి పరస్పరం తిట్ల పురాణంతో రెచ్చిపోయాయి. చొక్కాలు పట్టుకొని కొట్టుకొనేంత స్థాయికి వెళ్లడంతో అక్కడే ఉన్న పోలీసులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. పార్టీ నాయకులే గ్రూపులుగా విడిపోవడంతో కార్యకర్తలు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య అసమ్మతి పార్టీ పుట్టి ముంచడం ఖాయమనే భావన సొంత పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తమవుతోంది. -
నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, విజయవాడ తూర్పు: ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో రాజకీయ విలువలకు విరుద్దంగా టీడీపీ నాయకులు నడిరోడ్డుపై రచ్చ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్‌కు టీడీపీ తరుపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండపనేని వాణి, అదే పార్టీకి చెందిన బొండా ఉమా అనుచరుడైన కోనేరు వాసుకు కొన్నేళ్లుగా ఆస్తి, సరిహద్దు వివాదం కొనసాగుతుంది. గుణదలలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఆస్తికి ఎప్పటి నుంచో సరిహద్దు తగాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం రాత్రి మరో మారు ఇరు వర్గాల మధ్య తగాదా మొదలైంది. వివాదం పెరిగి పెద్దది కావడంతో కొండపనేని వాణి కుమారుడు శ్రీకాంత్, కోనేరు వాసులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై మరోకరు నడిరోడ్డుపై దాడులకు పాల్పడ్డారు. కాగా స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు అదే సమయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి భీమిశెట్టి ప్రవల్లిక పర్యటన కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను కలుస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రచారంలో ఉన్నారు. టీడీపీ నాయకుల మధ్య రేగిన గొడవను రాజకీయం చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులపై రుద్దే ప్రయత్నం చేశారు. దీనికి వత్తాసు పలుకుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు తమ కార్యకర్తలు చేసిన రచ్చను సమర్ధించారు. ఏ ప్రమేయం లేకపోయినా వైఎస్సార్ సీపీ నాయకులు గొడవకు కారణమంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ మేరకు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా టీడీపీ అభ్యర్థి వాణిని ప్రోత్సహించారు. వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల నేప«థ్యంలో టీడీపీ నాయకులు తమపై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో ఏలా అయినా గెలుపొందాలనే దురుద్దేశంతో టీడీపీ నాయులు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతుండటం చర్చనీయాంశంగా మారింది.. విజయవాడ టీడీపీలో చీలిక ‘మీరంతా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అటో.. ఇటో.. ఎటో.. నిర్ణయించుకోండి. ఉంటే మాతో ఉండండి. లేదా ఎంపీతోనైనా వెళ్లిపోండి. ఏదో ఒక వైపు మాత్రమే నిలవాలి. అటూ ఇటూ రెండువైపులా ఉంటామంటే ఇక ఏమాత్రం కుదరదు. ఇందులో మొహమాటం ఏమీలేదు’ అని విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులకు హకుం జారీచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ పేరిట వారివురు కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి 18 మంది కార్పొరేట్ అభ్యర్థులు, 19 మంది పార్టీ డివిజన్ అధ్యక్షులు హాజరయ్యారు. టార్గెట్ కేశినేని.. ప్రధానంగా ఎంపీని లక్ష్యంగా చేసుకుని సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమావేశానికి గైర్హాజరు కావడంతో పాటు కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కూడా ఎంపీని ప్రత్యేకంగా కలవడం నగర టీడీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ జోక్యంతోనే.. విజయవాడ టీడీపీ నాయకులు గ్రూపు తగాదాలతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల నగారా మరింత అగ్గి రాజేసింది. అధిష్టానం ఆశీస్సులతో, ముఖ్యంగా లోకేష్ జోక్యంతోనే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ పరిస్థితులను ఎంపీ కేశినేని నాని వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. పెత్తనాన్ని జీర్ణించుకోలేక.. పశ్చిమంలో టీడీపీ నాయకత్వం అక్కడి సీనియర్ నాయకులైన బుద్దా, జలీల్, మీరాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అప్పగించకపోగా నియోజకవర్గాన్ని సమన్వయ పరచుకోవాలని ఎంపీ కేశినేనికి గతంలో సూచించారు. దీంతో డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఎంపీ కనుసన్నల్లోనే జరిగింది. తమ నియోజకవర్గంలో కేశినేని పెత్తనాన్ని జీర్ణించుకోలేని బుద్దా, మీరాలు సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి బొండా ఉమా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లతో చేతులు కలిపారు. సీనియర్ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, ఇటీవలి కాలంలో లోకేష్‌తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరాంలు కూడా పై గ్రూపుతో జతకట్టారు. కేశినేనికి ఇవన్నీ జీర్ణించుకోలేని పరిణామాలుగా మారాయి. మాకే అధిష్టానం మద్దతు ‘మన నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్జీలు అధిక శాతంలో ఉన్నారు. వారొచ్చి మనపై పెత్తనం చేస్తామంటే మనం ఎందుకు అంగీకరించాలి’ అని బుద్ధా, మీరాలు ప్రశ్నించినట్లు తెలిసింది. శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించలేదని చెబుతూ.. అధిష్టానం ఆశీస్సులు లేకపోతే మేం ఈ సమావేశాన్ని నిర్వహించగలమా అని నాయకులు ఇరువురూ ప్రస్తావించినట్లు సమాచారం. గూండారపు హరిబాబు కూతురు పూజిత గెలవలేదని, ఆమె స్థానంలో శివశర్మను పోటీలో నిలపాలని ఎంపీ కేశినేని ప్రతిపాదిస్తున్నారని చర్చకు లేవనెత్తగా ఆయన కార్పొరేట్ అభ్యర్థులు అందర్నీ గెలిపించగలరా అని నాయకులు ఎద్దేవా చేశారని తెలిసింది. పశ్చిమ నేతల భేటీలో.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నాయకులతో భేటీ అయిన బుద్దా, మీరాలు తమ అజెండాను స్పష్టంగా వెల్లడించారు. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా పార్టీ అధినేత ప్రకటించలేదని, ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తమందరి సమక్షంలో వెల్లడించారని స్పష్టం చేశారు. శ్వేత పేరు ఎంపీ స్వయం ప్రకటితమని, ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. మేయర్ అభ్యర్థి ఫలానా వారని తేలిన పక్షంలో తమ ఎన్నికల ఖర్చుకు ఇస్తారని ఒకరిద్దరు ప్రస్తావించగా ఎంపీ కేశినేని ఇచ్చే మొత్తం కన్నా తాము రెండింతలు ఎక్కువగానే సమకూర్చుతామని బుద్దా, మీరాలు పోటీదారులకు భరోసా ఇచ్చారని ‘సాక్షి’కి అభ్యర్థులు తెలిపారు. -
‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు’
సాక్షి, గుంటూరు : మాచర్ల దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు జిల్లాలో పర్యటించే ముందు నేతలు పోలీసులకు సమాచారం ఇస్తే రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అన్నారు. మంగళవారం జిల్లాలో పోలీసు అధికారుల సంఘ సభ్యులు బాలమురళికృష్ణ, మాణిక్యాలరావు, బేబీ రాణి మాట్లాడుతూ.. పోలీసులకు ముందుగానే సమాచారం అందించామని బోండా ఉమా, బుద్దా వెంకన్న మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం సమంజసం కాదని తెలిపారు. మాచర్లలో దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకుని, దాడి నుంచి నేతలను కాపాడారని తెలిపారు. పోలీసులు వాహనంలో రాజకీయ నాయకులను ఎక్కించుకోకూడదని తెలిసినా వారి ప్రాణాలు కాపాడేందుకు పోలీస్ వాహనంలో నాయకులను తరలించామన్నారు. తమ ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడామని పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడిన పోలీసులపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యే పోలీసులకు పోస్టింగ్‌లు వేశారని మాట్లాడుతున్నారన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే పోస్టింగ్‌లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. రిపోర్టు ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదని, సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘పోలీసులపై బురద చల్లవద్దు. రాజకీయ పార్టీలకు అంటగడుతూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దు. పోలీసులు నాయకుల ప్రాణాలను కాపాడినా.. నింధించడం బాధ కలిగించింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం వలనే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళగలిగారు. పోలీసులు లేకుంటే నేడు మీరు బ్రతికి ఉండే వాళ్ళు కాదు. రాజకీయ నాయకులు పోలీసులపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. మీ పై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడము’ అని పోలీసు అధికారుల సంఘ సభ్యులు హెచ్చరించారు. -
వదంతులు ప్రచారం చేస్తే కేసులు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగిపోయినట్టు కొందరు ప్రచారం చేస్తుండటం సరికాదని, పని కట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల ఏడీజీ అయ్యన్నార్, విజయవాడ పోలీస్ కమిషనర్ తిరుమలరావుతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నపాటి ఘటనలను పెద్దవిగా చూపుతూ, పుకార్లతో అలజడి రేపే ప్రయత్నాలు సరికాదన్నారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుద్దా వెంకన్న, బొండా ఉమా కాల్ డేటా పరిశీలిస్తాం.. - మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ నుంచి మాచర్ల ఎందుకు వెళ్లారో.. అక్కడ దాడి జరిగితే ఎవరికీ ఫిర్యాదు చేయకుండా విజయవాడ ఎలా వచ్చారో.. ఇతరత్రా అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. - వారిని మాచర్ల నుంచి పోలీసు వాహనంలోనే బయటకు తీసుకొచ్చాం. - ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 307 కింద సుమోటోగా కేసు నమోదు చేసి, ముగ్గురిని తక్షణం అరెస్టు చేశాం. అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తే ఎలా? - బొండా ఉమ, బుద్దాల నుంచి స్టేట్మెంట్ తీసుకుంటాం. వారి కాల్ డేటా పరిశీలిస్తాం. - పుంగనూరు ఘటనపై టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు. మహిళా అభ్యర్థి చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే. (వీడియో క్లిప్పింగ్ చూపారు) - ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్పీల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు. చిన్న ఘటన జరిగినా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తాం. నిష్పక్షపాతంగా కేసుల నమోదు - వారం రోజుల్లో 57 కేసులు (ఇందులో హత్యాయత్నం ఘటనలు 8) నమోదు చేశాం. - 11,386 బైండోవర్ కేసులు నమోదు చేసి 1,09,801 మందిని బైండోవర్ చేశాం. - 10,514 ఆయుధాల్లో (లైసెన్స్డ్ వెపన్స్) 8,015 ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నాం. - నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న 3,184 మందిని, నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న 1,117 మందిని బైండోవర్ చేశాం. - ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను రప్పిస్తు న్నాం. - సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం, తప్పుడు విషయాలను వైరల్ చేయడం వంటి వాటిపై సుమోటోగా కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం. - ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేశాం. నిఘా యాప్ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశాం. -
అరాచకమే.. టీడీపీ నైజం
సాక్షి, గుంటూరు: ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఏదో జరిగిపోతోందని ‘చలో ఆత్మకూరు’ పేరుతో గత ఏడాది సెప్టెంబర్‌లో నానాయాగీ చేసిన టీడీపీ.. తాజాగా మరో అలజడి సృష్టించి శాంతిభద్రతల సమస్యలకు పన్నాగం పన్నడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీ వారితో స్థానిక జిల్లా నేతలు నామినేషన్లు వేయించాల్సింది పోయి విజయవాడకు చెందిన టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నను చంద్రబాబు పల్నాడుకు పంపడంపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. 2014–19 వరకు టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలను స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. - 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబుపై మాజీ స్పీకర్ కోడెల తనయుడు శివరామ్ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులు చేయించారు. ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడమే కాక ముస్తఫా, అంబటిలను తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వాహనం 5 ఏళ్ల పాలనలో టీడీపీ దుర్మార్గాలు - 2014 సెప్టెంబర్ 11న మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం చినగార్లపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి (45)పారిపోతున్నా వదలకుండా టీడీపీ మూకలు వెంటాడి కత్తులతో నరికి చంపాయి. అడ్డు వచ్చిన అతని భార్య కోటేశ్వరమ్మను సైతం హతమార్చేందుకు ప్రయత్నించారు. - 2014 సెప్టెంబర్ 22న వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డిలను హతమార్చారు. - 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరచడంతో అతను మృతిచెందాడు. - 2014 డిసెంబర్ 19న మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్యను కూడా టీడీపీ వర్గీయులు హతమార్చారు. కోర్టు వాయిదాకు వెళ్లొస్తున్న ఆయనపై టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడిచేసి అతి కిరాతకంగా చంపారు. - 2015లో కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత పెద వెంకటేశ్వర్లు (బ్రహ్మం)నూ టీడీపీ వర్గీయులు నరికి చంపారు. - 2017 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎస్సార్సీపీ నేత సాంబయ్యను టీడీపీ వర్గీయులు వేటకొడవళ్లతో నరికి చంపారు. - 2019 ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున గురజాల పట్టణంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింలపై దాడులకు తెగబడ్డారు. ఆస్తులు ధ్వంసం చేశారు. అదే విధంగా గురజాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయినా అదే తీరు - గత ఏడాది డిసెంబర్ 27న రాజధాని ప్రాంతంలోని మందడంలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై టీడీపీ మూకలు దాడిచేశాయి. - జనవరి 7న గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆయన తృటిలో తప్పించుకున్నారు. - ఫిబ్రవరి 2న కృష్ణాజిల్లా నందిగామలో బాపట్ల ఎంపీ సురేష్‌పై దాడికి తెగబడ్డారు. ఇదే నెల 23న అమరావతి మండలం లేమల్లె గ్రామంలో సురేష్‌పై మరోసారి టీడీపీ శ్రేణులు కారం చల్లి దాడికి పాల్పడ్డారు. - ఫిబ్రవరి 17న కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు, మహిళలు దాడికి పాల్పడ్డారు. - ఫిబ్రవరి 20న మంగళగిరి రూరల్ మండలంలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా కారును టీడీపీ గూండాలు అడ్డుకుని ఆమెపై దాడికి విఫలయత్నం చేశారు. ఇదే రోజు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, డ్రోన్ కెమెరా ఆపరేట్ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పైనా ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నాయకులు మందడంలో దాడికి తెగబడ్డారు. -
‘మా వాళ్లను చంపేస్తారా..? చంపేస్తే చంపేయండి..’
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఓ చిన్న ఘటనను సాకుగా చూపి ప్రతిపక్ష నేత చంద్రబాబు బుధవారం నడిపిన హైడ్రామా చూసి సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాచర్లలో జరిగిన ఘర్షణను పెద్ద యుద్ధంగా చిత్రీకరిస్తూ ఆయన చేసిన హడావుడికి అంతా విస్తుపోయారు. గంటల వ్యవధిలో మూడుసార్లు ప్రెస్మీట్లు నిర్వహించి పట్టలేని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీర్ఘంగా మాట్లాడటం, డీజీపీ కార్యాలయానికి అరగంటపాటు పాదయాత్ర చేసి బైఠాయించడం, పోలీసు అధికారులు లోపలకు రావాలని కోరినా తిరస్కరించి రోడ్డుపైనే కూర్చుని చేసిన హంగామాకు అందరూ నివ్వెరపోయారు. - మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి పెద్దగా అరుస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రం అల్లకల్లోలమైందనే భ్రమ కలిగించే రీతిలో వ్యక్తం చేసిన హావభావాలు చూసి సామాన్య ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ‘మా నాయకులను చంపేస్తారా..? చంపేస్తే చంపేయండి..’ అంటూ కొద్దిసేపు, ‘ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగాయా? ఇవన్నీ చూసి ప్రజలు ఆలోచించాలి’ అంటూ దండం పెట్టారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి హడావుడి చేశారు. - మాచర్ల నుంచి బొండా, బుద్ధా రాగానే మళ్లీ మీడియా సమావేశం నిర్వహించి వారితో గంటన్నర మాట్లాడించి తాను మరో 45 నిమిషాలు ప్రసంగించారు. - పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు డీజీ రవిశంకర్‌కు కొద్దిసేపు విలువల గురించి ఉద్బోధించారు. - అనంతరం చంద్రబాబు రోడ్డుపైనే కూర్చుని మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరగంటసేపు మాట్లాడారు. అక్కడినుంచి విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లేందుకు ఉద్యుక్తులవుతుండగా మీడియా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు అయిష్టంగానే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. -
శాంతిభద్రతల విఘాతానికి బాబు ప్లాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ చూస్తోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ అలజడులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 కార్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న మాచర్లకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. టీడీపీ నేతల కార్లు ఓవర్ స్పీడ్‌తో దివ్యాంగుడిపైకి దూసుకెళ్లాయని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని చెప్పారు. - ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు ఉండకూడదని, వ్యవస్థలో మార్పు రావాలని సీఎం చెప్పారు. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాక్షసానందం పొందాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. - గత ఐదేళ్లలో ఏ విధంగా బాబు ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. అయినప్పటికీ వాటిని సహించాం. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మాకు లేదు. ప్రజల ఆలోచన మేరకు సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలతో ముందుకెళ్తున్నాం. - పులివెందుల టీడీపీ ఇన్చార్జి సతీష్‌రెడ్డి, విశాఖలో పంచకర్ల రమేష్ చంద్రబాబు చేసిన మోసాన్ని, అన్యాయాన్ని వివరించారు. -
మీ గూండాగిరీ.. ఇక్కడ చెల్లదు
మాచర్ల: ‘నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా దగ్గరికి వచ్చి గూండాయిజం చేస్తామంటే కుదరదు. పల్నాడు ప్రాంతంలో హుందాతనంతో కూడిన రాజకీయాలు చేయడం అలవాటు. ఏదో షో చేసి మీడియా ముందు మాట్లాడటం కాదు. మీకు చేతనైతే మాచర్లకు రండి... లేదా నేనే విజయవాడ వస్తా’’ అంటూ ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన బుధవారం మాచర్లలో విలేకరులతో మట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వారి అనుచరులు పది కార్లలో మాచర్లకు తరలివచ్చారని, దివ్యాంగుడిపై కారు వేగంగా వెళ్లటంతో అక్కడ స్థానికులు వారిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిని అడ్డం పెట్టుకొని తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. - విజయవాడలో గల్లీ రాజకీయాలు చేసే బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు పది కార్లు వేసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి? - ప్రతిదీ రాజకీయం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి అలజడి సృష్టించాల్సిన అవసరం ఏమిటో చెప్పాలి. ఈ ప్రాంతానికి సంబంధం లేని వారు ఇక్కడ గొడవలు చేయాల్సిన పని ఏమిటి? మీ గూండాగిరీ పల్నాడులో చెల్లదు. - ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నన్ను టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రాజధాని అమరావతి వద్ద నాపై దాడి చేయించారు. - టీడీపీ తరఫున నామినేషన్లు వేసేవారు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డం పెట్టుకొని గల్లీ గూండాలు నాటకాలకు తెరతీశారు. - మా పార్టీ శ్రేణులపై దాడులు చేయడానికి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు వచ్చి కారు నడిపి ఒక దివ్యాంగుడిని గాయపరచడం వల్లే ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు నానా హంగామా చేసి ప్రజలను రెచ్చగొట్టారు. -
అల్లర్లకు పన్నాగం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వాటినే ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపించి మరింత రాద్ధాంతం సృష్టిస్తుండడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు.. ప్రజలను ఏమార్చేందుకు, ఓటమికి సాకులు చెప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయనన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన సంఘటన కూడా ఇందులో భాగమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన పిన్నెల్లి కారు అనవసర రాద్ధాంతానికే బొండా, బుద్ధా మాచర్లకు.. గుంటూరు జిల్లా పల్నాడులోని వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బోదిలవీడులో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలపై సోమవారం రాత్రి దాడిచేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్దేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చంద్రబాబు చూశారు. కానీ, మార్గమధ్యంలో మాచర్ల వద్ద టీడీపీ నేతల వాహనం వికలాంగుడ్ని ఢీకొట్టింది. ఈ ఘటనతోనే అక్కడ ఘర్షణ తలెత్తిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక గ్రామంలో జరిగిన చిన్న గొడవపై విజయవాడ నుంచి భారీఎత్తున నాయకులను పంపాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకు టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని పిన్నెల్లి డిమాండ్ చేశారు. రాద్ధాంతం సృష్టించే వ్యూహంతోనే వారు బయలుదేరినట్లు ఆయన స్పష్టంచేశారు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల గ్రామంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులను టీడీపీ నేతలు వీడియో తీస్తూ ధూషించడంతో ఘర్షణ జరగ్గా దానిపైనా హంగామా సృష్టించారు. మొత్తంగా ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండురోజుల్లో ఐదారుకు మించలేదు. 13 జిల్లాల్లో మిగిలిన చోట్ల ఎక్కడా ఘర్షణ వాతావరణం లేకపోయినా తాను సృష్టించిన ఈ చిన్న ఘటనల్ని ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపిస్తూ చంద్రబాబు శాంతిభద్రతల సమస్యగా ప్రచారం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలపైనే దాడులు : గోపిరెడ్డి టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో తమపై ఇంతకంటే పెద్దఎత్తున దాడులు జరిగాయని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలపైనే దాడులు చేసిన ఉదంతాలున్నాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లిన సందర్భాలున్నాయని వివరించారు. కానీ, ఇప్పుడా వాతావరణం రాష్ట్రంలో ఎక్కడాలేదని.. కేవలం టీడీపీ వాళ్లు అక్కడక్కడ సృష్టించిన చిల్లర గొడవలు తప్ప స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ చెబుతోంది. కీలక నేతల గుడ్బైతోనే ఇలా : బొత్స ఇక అన్ని వర్గాల ఆదరణను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి గ్రామాల్లో హీనంగా మారిపోవడంతో ప్రజలను ఏమార్చేందుకు ఇవన్నీ చేస్తున్నట్లు మంత్రి బొత్స స్పష్టంచేశారు. ఎన్నికల వేళ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కీలక నాయకులు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం టీడీపీకి ఏమాత్రం మింగుడుపడడంలేదు. ఉదా.. – డొక్కా మాణిక్యవరప్రసాద్, కదిరి బాబూరావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, సతీష్‌రెడ్డి వంటి ముఖ్య నాయకులు పార్టీకి వరుసగా రాజీనామా చేయడం.. మరికొందరు అదేబాటలో ఉన్నట్లు తెలియడంతో చంద్రబాబుకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. – అనేకచోట్ల పోటీచేసేందుకు అభ్యర్థులు దొరకడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎంపీటీసీలు,సర్పంచ్ స్థానాల్లో అభ్యర్థుల కోసం వారు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. – సగానికిపైగా జిల్లాల్లో జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దంపడుతోంది. – అనేకచోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ముఖ్య నాయకులు అస్త్ర సన్యాసం చేయడంతో పార్టీని నడిపించే నాథుడే కనిపించడంలేదని చెబుతున్నారు. – క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే బలం కోల్పోయి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్లు సైతం పోటీచేయలేమని చేతులెత్తేస్తున్నట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. – ఇక పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్కపోతే.. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పోటీచేయడానికి ముందుకొచ్చిన వారికి మద్దతిస్తామని స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రకటించడం.. టీడీపీ పతనావస్థకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎస్ అధికారిపై దాడిచేసిన వారితో స్క్రీన్‌ప్లే విజయవాడలో నడిరోడ్డు మీద ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం (అప్పటి రవాణా కమిషనర్) మీద దాడిచేసిన బొండా ఉమ (అప్పటి ఎమ్మెల్యే), ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను మాచర్లకు పంపించడానికి చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉన్న వారిద్దరూ అనవసరంగా మాచర్లకు బయల్దేరి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. అది చూసి ఆవేశంతో ప్రశ్నించడానికి వచ్చిన స్థానికులతో దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగక.. ఆ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమి లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. బొండా, బుద్ధా గత చరిత్ర కూడా వివాదాస్పదం కావడం తెలిసిందే. రాష్ట్రమంతా అదే కుట్ర ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి టీడీపీ ప్రయత్నించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పెదపూడి, చిత్తూరు జిల్లా పుంగనూరు, చంద్రగిరి, గుంటూరు జిల్లా దాచేపల్లి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తదితర చోట్ల కూడా ఇదే తరహాలో కుట్రను అమలుచేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. పూర్తిస్థాయి నివేదికకు డీజీపీ ఆదేశం గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వెంటనే స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావును ఆదేశించారు. దీంతో ఐజీ మాచర్లకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఐజీ వెంట గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు కూడా ఉన్నారు. జరిగిందిదీ.. ► సోమవారమే టీడీపీ దాడి.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడులో సోమవారం రాత్రి టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేశారు. ► బెజవాడ నుంచి టీడీపీ నేతలు బోదిలవీడులో జరుగుతున్న గొడవలను పెద్దవి చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఒక పథకం ప్రకారం బుధవారం విజయవాడ నుంచి నాయకులు భారీ సంఖ్యలో వాహనాలలో అక్కడకు బయల్దేరారు. ► మాచర్లలో యాక్సిడెంట్.. విజయవాడ నుంచి వస్తున్న టీడీపీ నాయకుల వాహనాలలో ఒకటి మాచర్లలో ఒక దివ్యాంగుడిని ఢీకొట్టడంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ► దుర్భాషలాడడంతో ఘర్షణ.. దివ్యాంగుడు గాయపడినా ఏ మాత్రం బాధ లేకపోగా.. దుర్భాషలాడడంతో స్థానికులు దాడిచేశారు. కార్లలోని వారు ఏపార్టీ వారనేది కూడా స్థానికులకు తెలియదు. ► బాబు హైడ్రామా.. ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి టీడీపీ విమర్శలు మొదలుపెట్టింది. ఫిర్యాదు చేసే పేరుతో డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ బయటే బాబు బైఠాయించారు. -
కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు
-
పోలీసులపై బొండా ఉమా దౌర్జన్యం
సాక్షి, విజయవాడ : టీడీపీ నేత బొండా ఉమా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. పోలీసులను అరే, ఒరే అంటూ తీవ్ర పదజాలంతో దూపించారు. నువ్వు ఎవడ్రా చెప్పడానికి అంటూ నోరు పారేసుకున్నారు. అంతటితో ఆగకుండా.. నోరు మూసుకో అంటూ వేలు చూపించారు. చొక్కాలు విప్పదీయడం కూడా తనకు తెలుసునని హెచ్చరించారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పోలీసులతో ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
రాజధానికి చంద్రబాబే పెద్దశాపం
-
నిరూపిస్తే క్షమాపణ.. రాజీనామా : ఆర్కే
సాక్షి, తాడేపల్లి : అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌ను ఆధారాలతో చూపించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అమరాతిలో తన పేరిట భూములు ఉన్నాయనే తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. నీరుకొండలో తనకు ఐదు ఎకరాల భూమి ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని ఆర్కే సవాలు విసిరారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో తనపేరు మీద గానీ, తన భార్య పేరు మీద గానీ భూములు లేవని స్పష్టం చేశారు. తన భార్య పేరు మీద ఐదెకరాల భూమి ఉందని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపిస్తున్నారని తెలిపారు. తమకు భూమి ఉందని చూపిస్తే ఆ ఐదెకరాలు వారికే రాసిస్తానని.. అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్తానని అన్నారు. రామోజీ, రాధాకృష్ణ తెగ తాపత్రాయపడుతున్నారు.. తనను వివరణ అడగకుండానే పేపర్లలో తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. అవాస్తవాలు రాయవద్దని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కోరారు. చంద్రబాబును కాపాడుకోవడానికి రామోజీరావు, రాధాకృష్ణ తెగ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుందనే కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో అవినీతి జరగలేదని చంద్రబాబు గుండెల మీద చేయ్యి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. రాజధానికి చంద్రబాబు శాపం అని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరం అని అన్నారు. చంద్రబాబు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క శాశ్వత బిల్డింగ్ కూడా కట్టలేకపోయారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలోని నేతలు రాజధాని ప్రాంతంలో కి.మీ రోడ్డు కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ బెదిరించారని తెలిపారు. అక్రమంగా రైతులపై కేసులు పెట్టించారని విమర్శించారు. దళితుల భూములను కాజేసిన చంద్రబాబు వాటిని తన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు కొత్త బినామీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి ప్యాకేజీ తెచ్చుకోలేదా అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. మంగళగిరిలో జనసేన కూటమి అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం ఎందుకు చేయలేదని నిలదీశారు. భువనేశ్వరి అప్పుడేందుకు రోడ్లపైకి రాలేదు.. చంద్రబాబు అవినీతికి పాల్పడినందుకే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ప్రజలు ఓడించారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు మంగళగిరి హద్దులు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకున్నప్పుడు, వారిని పోలీసు స్టేషన్లలో పెట్టి కొట్టినప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎందుకు రోడ్లపైకి రాలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటకు రాలేదో చెప్పాలన్నారు. రైతుల నుంచి భూములు తీసుకుని ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదో భువనేశ్వరి చంద్రబాబును అడగాలని సూచించారు. రాజధాని కట్టాలంటే రూ. లక్ష 25వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాలన్ని మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టారని విమర్శించారు. -
చంద్రబాబును కలిసిన బోండా ఉమ
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు సోమవారం కలిశారు. గత కొద్దిరోజులుగా బోండా ఉమ పార్టీ మారాతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే చంద్రబాబుతో భేటీ వివరాలపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు. అయితే ఇప్పటికే చంద్రబాబు సన్నిహితుడు బుద్ధా వెంకన్న కూడా బోండా ఉమాతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా తాను పార్టీ మారడం లేదని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. లెస్ లగేజ్‌మోర్ కంఫర్ట్.. మరోవైపు విజయవాడ టీడీపీ అర్బన్ కార్యాలయం తరలింపుపై ఎంపీ కేశినేని నాని ‘లెస్ లగేజ్‌మోర్ కంఫర్ట్’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కాగా ఇప్పటివరకూ పార్టీ అర్బన్ కార్యాలయం కేశినేని భవనంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అర్బన్ కార్యాలయాన్ని అక్కడ నుంచి తీసివేసి... ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోనే పని చేస్తుందని టీడీపీ ప్రకటన చేసింది. కాగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని నాని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయం తరలింపు వెనుక బుద్దా వెంకన్న హస్తం ఉన్నట్లు కేశినేని నాని అనుమానిస్తున్నారు. ఇకపై విజయవాడ టీడీపీ అర్బన్ కార్యక్రమాలు అన్ని జిల్లా టీడీపీ కార్యాలయం నుంచే జరుగుతాయంటూ సోమవారం మీడియాకు లేఖ విడుదల చేయడంపై బుద్ధా వెంకన్నను ఉద్దేశించి నాని లగేజ్ తగ్గితే మరింత సౌకర్యంగా ఉంటుందంటూ ట్విటర్లో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ట్విటర్ వేదికగా వార్ జరుగుతున్న విషయం విదితమే. Less luggage more comfort😄😃😀 pic.twitter.com/CZ3u7KbOQ1 — Kesineni Nani (@kesineni_nani) August 12, 2019 -
హైకోర్టులో బోండా ఉమకు చుక్కెదురు
-
బొండా ఉమకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను సరిగా లెక్కించలేదంటూ ఉమ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ గత మంగళవారం తన వాదనలు వినిపించింది. టీడీపీ అభ్యర్థి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించింది. కాగా, పదిహేను రోజులక్రితం దాఖలైన బొండా ఉమ రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. -
బొండా, బోడే, కొల్లు తొలిసారితో సరి..
సాక్షి, విజయవాడ : శాసన సభ్యులుగా ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని జనానికి చేరువు కాకుండా రూ.కోట్ల సంపాదనపై దృష్టి పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరించారు. మంత్రులతో పాటు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రజలు ఏ మాత్రం దయ చూపలేదు. అందర్ని ఓడించి ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని చూపించారు. పదవి అలంకారం కాదు.. బాధ్యతల సమాహారం అని భావించాల్సిన వారు అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. దౌర్జన్యం.. దోపిడీకి కొమ్ము కాయడంతో ప్రజలు ఎన్నికల సమరంలో ఓటు అనే ఆయుధంతో కుళ్లబొడిచారు. ‘మీ ప్రజా సేవ చాలులే’ అని ఓటుతో చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఘోర పరాజయానికి స్వయంకృతమే తొలి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన అవకాశాన్ని.. ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమవ్వడం వల్లే ఫలితాలు టీడీపీ అభ్యర్థులకు చేదు నిజాన్ని తెలియజెప్పాయి. స్వయంకృతాపరాధం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కొల్లు రవీంద్రకు తొలిసారి ఎన్నిక కాగానే మంత్రి పదవి వరించింది. అయినా ఆయన రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. బొండా ఉమామహేశ్వరరావు ఐదేళ్లలో నియోజకవర్గాన్ని తన సొంత జాగీరుగా భావించి పెత్తనం సాగించారు. స్వాతంత్య్ర సమరయోధుల భూములు కబ్జా, ఒక మహిళకు చెందిన ఇంటిని కబ్జా చేశారు. ఓ కుటుంబానికి చెందిన చిన్నారి మరణానికి కారణమయ్యారు. తన నోటి దురుసుకు కార్పొరేటర్లు కూడా ఆయన్ను చీదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి ప్రచారం చేసినా ఆయన విజయం సాధించలేకపోయారు. చివరకు 25 ఓట్లు తేడాతో ఓడిపోయారు. బోడే ప్రసాద్ కూడా తన పదవీ కాలంలో ఇసుక దందాలు చేయడం, బిల్డర్ల వద్ద ముక్కుపిండి దందాలు చేశారు. దీంతో ఈసారి ప్రజలు ఆయన్ను పదవికి దూరం చేసి కె.పార్థసారథికి పట్టం కట్టారు. అవినీతే కొంప ముంచింది.. దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, జలీల్‌ఖాన్, వల్లభనేని వంశీమోహన్, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. నీరు–చెట్టు పథకం కింద రూ.కోట్లు కొల్లగొట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై కంటే ఆ పనుల్లో వచ్చే వాటాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఐదేళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే కనీసం రూ.100 కోట్లకుపైగా సంపాదించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మంత్రి ఉమా అయితే జలవనరుల ప్రాజెక్టుల నుంచి నీరు–చెట్టు పథకం వరకు ఎక్కడ అవకాశం వచ్చినా అడ్డంగా దోచేశారు. నియోజకవర్గానికి ఆయన చెప్పుకోదగిన పనులు ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఆయనకు షాక్ ఇచ్చారు. కొల్లు రవీంద్ర మంత్రిగా చెప్పుకోదగిన ప్రతిభ కనబరచలేదు. కేవలం మంత్రిగానే కొనసాగారు తప్ప నియోజకవర్గానికి కానీ, జిల్లాకు గానీ ఆయన సాధించింది ఏమీ లేదు. దీంతో ఆయన్ను మచిలీపట్నం ప్రజలు తిరస్కరించారు. అవనిగడ్డ నుంచి డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం, రైతులకు సాగునీరు ఇప్పించలేకపోవడంతో ఆయనకు ఓటర్లు బాయ్.. బాయ్ చెప్పారు. మహిళా అభ్యర్థులకు నో చాన్స్ ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తంగిరాల సౌమ్య (నందిగామ), ఉప్పులేటి కల్పన (పామర్రు), షాబానా ఖాతూన్ (విజయవాడ పశ్చిమ) ఎన్నికల బరిలో దిగారు. ఇందులో తంగిరాల సౌమ్య, ఉప్పులేటి కల్పన ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వీరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఖాతూన్ తండ్రి జలీల్‌ఖాన్ పార్టీ ఫిరాయించడం, వక్ఫ్ ఆస్తులపై కన్నేయడంతో ఆమెను ప్రజలు పదవికి దూరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ మహిళా అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో చుక్కెదురైంది. -
‘బోండా ఉమాపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అరచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ‘విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజ్యమేలుతున్న అరాచకం’ అన్న అంశంపై దళిత సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల జేఏసీ నాయకుడు పాలకీర్తి రవి మాట్లాడుతూ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అరాచకాలకు హద్దులేకుండా పోతున్నాయన్నారు. బోండా ఉమాపై ఎఫ్ఐఆర్ నమోదైన ఏడు కేసులు ఉన్నాయని, అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాధం మాట్లాడుతూ.. ఏడు కేసులున్న బోండా ఉమా.. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని ఆరోపించారు. బోండా ఉమాపై చర్యలు తీసుకునేంతవరకు దళిత సంఘాలతో కలిసి న్యాయ పోరాటం చేస్తామన్నారు. -
టీడీపీ నేతల గుండాగిరిపై నోటీసులు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరాకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారా వీరికి నోటీసులు అందచేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై ‘సాక్షి’ పత్రికలో ‘ఐపీఎస్‌పై గూండాగిరి’ శీర్షికన 2017లో కథనం ప్రచురితమైంది. ఇది చదివిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు దీనిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సాక్షి కథనాన్ని సుమోటోగాగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులందరికీ ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కేశినేని నానికి నోటీసులు అందలేదని ఓ న్యాయవాది వివరించారు. దీంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. -
బొండా ఉమా, ఆయన కుమారులపై కేసు నమోదు
-
బొండా ఉమాపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమాపై కేసు నమోదయింది. ఎన్నికల ప్రచారంలో దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో బొండా ఉమాతోపాటు ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజలపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిద్ధార్థ, రవితేజలు రౌడీయిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మైకులో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై దౌర్జన్యానికి దిగారు. ఇంతలో అక్కడికి వచ్చిన బొండ ఉమా ‘నీ అంతు చూస్తా’ అంటూ సత్యంపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో.. అజిత్‌సింగ్ నగర్ పోలీసులు బొండా ఉమతోపాటు ఆయన కుమారులపై కేసు నమోదు చేశారు. -
బొండా ఉమపై కేసు ఎందుకు పెట్టరు?
సాక్షి, విజయవాడ: తన కూతురు మరణానికి కారుకులైన తన మాజీ భర్త మాదంశెట్టి శివకుమార్, ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని సుమశ్రీ అనే మహిళ కోరారు. ఈ మేరకు శనివారం సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలిచ్చిన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈనెల 15 వరకు గడువు ఉందని, ఈలోపే కేసు నమోదు చేస్తామని ఆమెకు పోలీసులు హామీయిచ్చారు. మాదంశెట్టి శివ, బొండా ఉమపై రెండేళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె హైకోర్టు తలుపు తట్టారు. ఈనెల 15లోపు మాదంశెట్టి శివ, బొండా ఉమాపై కేసు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా, సుమశ్రీ కుమార్తె సాయిశ్రీ 2017లో క్యాన్సర్‌తో చనిపోయింది. పాప చనిపోతే ఆస్తి అంతా తండ్రికి వస్తుందన్న క్రూరమైన ఆలోచనతో శివకుమార్.. సాయిశ్రీకి వైద్యం చేయిందని సుమశ్రీ ఆరోపించారు. (‘నాన్నా! నన్ను బతికించవూ ప్లీజ్!’) -
బోండా ఉమ, ఆయన కుమారుడిపై కేసు నమోదు
-
బోండా ఉమ, ఆయన కుమారుడిపై కేసు నమోదు
విజయవాడ: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావుతో పాటు ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు సంవత్సరాల క్రితం మరణించిన సాయిశ్రీ చావుకు బోండా ఉమాహేశ్వర రావు, ఆయన కుమారుడు శివ కారణమని సాయిశ్రీ తల్లి సుమన శ్రీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని విజయవాడ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో బోండా ఉమ, ఆయన కుమారుడు శివపై కేసు నమోదు చేశారు. ఇటీవలే బాధితురాలు సుమనశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కూడా కలిశారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
బొండా కుమారుల వెకిలి చేష్టలు
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా కుమారులు పట్టపగలే.. నడిరోడ్డుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కాన్వాయ్‌ను అడ్డుకుని వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ప్రత్యర్థులను నోటికొచ్చినట్లు దూషిస్తూ.. ట్రాఫిక్‌కు ఇబ్బందులు సృష్టిస్తూ అల్లర్లు సృష్టించారు. సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణుకు మద్దతుగా విజయవాడలోని పారిశ్రామికవేత్త కోగంటి సత్యం సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బుడమేరు నుంచి దేవినగర్‌లోకి వెళ్లేందుకు మలుపు తిరుగుతుండగా ఇంతలో అటుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా సతీమణి బొండా సుజాత, వారి తనయులు బొండా సిద్ధు, రవితేజ ఎన్నికల ప్రచారం చేస్తూ వేర్వేరు వాహనాల్లో వచ్చారు. కోగంటి సత్యం కాన్వాయ్‌పై నుంచి ప్రచారం చేస్తుండగా టీడీపీ కాన్వాయ్‌పై ఉన్న బొండా అనుచరులు, అభిమానులు ఆయన్ను చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా ప్రవర్తించిన బొండా కుమారులు బొండా కుమారులు వాహనాలను రోడ్డు మధ్యలో ఆపివేసి రెచ్చగొట్టేలా మైకులో వ్యాఖ్యలు చేశారు. అక్కడికి వచ్చిన బొండా ఉమా ‘నీ అంతు చూస్తా’ అంటూ కోగంటి సత్యంపై బెదిరింపులకు దిగారు. విషయం వైఎస్సార్సీపీ నేతలకు తెలిసి భారీగా కార్యకర్తలు అక్కడకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయి జారుతుందని గ్రహించిన పోలీసులు రంగంలోకి దిగి బొండా తనయుల వాహనాలను ముందుకు వెళ్లాలంటూ గట్టిగా చెప్పడంతో నినాదాలు చేస్తూ వెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు ఆగ్రహానికి గురవుతుండగా సత్యం కలుగజేసుకొని వచ్చేయండంటూ పార్టీ శ్రేణులను వెనక్కి తీసుకువెళ్లిపోయారు. బొండా కుమారుల ఆగడాలు చూసి విస్తుపోయామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బెజవాడలో ‘బొండా’.. అవినీతి కొండ
సాక్షి, విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. నియోజకవర్గం మొత్తం కనుసైగతో శాసించేవారు. అధికారంలోకి వచ్చింది మొదలు భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో విచ్చలవిడిగా అక్రమాలు చేపట్టారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతికి పచ్చ జెండా ఊపింది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని దర్జాగా కబ్జా చేశారు. ఏదైనా పని జరగాలన్నా.. కాంట్రాక్టు దక్కాలన్నా ఆయన అనుమతి కావాల్సిందే. వీరికి కప్పం కట్టందే ఏ వ్యవహారం నడవదు. కాంట్రాక్టు పనైనా, ఉద్యోగమైనా ఏదైనా నగదు ముట్టజెప్పితే ఎలాంటి వ్యవహారమైన క్షణాల్లో సెటిల్ చేసేస్తారు. అధికారం అండతో ఐదేళ్లుగా బొండా ఉమామహేశ్వరరావు అక్రమ దందా కొనసాగించి రూ.కోట్లు కొల్లగొట్టారు. అక్రమాలు, అరాచకాలు కండ్రిక కాలనీలో జర్నలిస్టులకు ఇళ్ల పేరుతో ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1720 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నిం చారు. స్థానికుల ఆందోళనతో వెనక్కుతగ్గారు. 43వ డివిజన్లోని దుర్గాగ్రహారంలో క్యాన్సర్ బా«ధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను ఎమ్మెల్యే అనుచరులు కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉమా వెనుక ఉండి తన అనుచరులతో దౌర్జన్యం చేయించినట్లు సమాచారం. బొండా ఉమా ప్రధాన అనుచరుడు, కార్పొరేటర్ నందెపు జగదీష్ పాయకాపురంలో కళ్లం విజయలక్ష్మి, లంకిరెడ్డి సాంబిరెడ్డికి చెందిన సర్వే నెం.62/1, 62/2లో 0.49 సెంట్ల భూమికి సంబంధించి తప్పుడు వీలునామా సృష్టించి, తన పేర, తన కుటుంబ సభ్యుల పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాధితులు కోర్టులో కేసు వేయడంతో దిగువ కోర్టులో కార్పొరేటర్ కేసు ఉపసంహరించుకున్నాడు. ఈ కబ్జా వ్యవహారం వెనుక ఉమా హస్తం ఉంది. స్థలం ప్రస్తుతం యజమాని చేతిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్స్ రద్దు కాలేదు. ఈ స్థలం విలువ రూ.10 కోట్లు ఉంటుంది. నందెపు జగదీష్ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. తెనాలికి చెందిన సుబ్బు అనే రౌడీ షీటర్‌తో బొండా ఉమామహేశ్వరరావు సంబంధాలు కొనసాగించారు. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ బొండా, మరికొందరు టీడీపీ నాయకుల పేర్లు చెప్పారు. తెలంగాణ పోలీసులు సుబ్బుపై అక్రమ ఆయుధాల కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో రౌడీ షీటర్ సుబ్బు పట్టపగలు దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు సృష్టించారు. ట్రాన్స్‌పోర్టు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని దాడికి యత్నించారు. అడ్డుగా వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గన్‌మెన్‌పై దాడి చేశారు. సత్యనారాయణపురంలోని కల్యాణ మండపాన్ని అధికార పార్టీ నాయకులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిం చి విఫలమయ్యారు. బ్రాహ్మణ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో వెనక్కుతగ్గారు. న్యూరాజరాజేశ్వరీపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా ఆక్రమించేందుకు ప్రయత్నించారు. పాయకాపురంలో రవీంద్ర థియేటర్ పక్కన ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన రూ.కోట్ల విలువైన భూములను తన ప్రధాన అనుచరుడు.. కార్పొరేటర్ జగదీ‹ష్‌తో కలిసి కాజేసేందుకు చూశారు. పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతానికి చెందిన దాదాపు మూడు ఎకరాల వరకూ ఉన్న ఆ కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటికి ఇంటి పట్టాలను సైతం పుట్టిం చేందుకు యత్నించారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. అనుయాయుల తీరు అంతే.. ఇందిరానాయక్ నగర్లో బుడమేరుకు అనుకుని ఉన్న ఓ వ్యక్తి స్థలంలో నిర్మించిన ప్రహరీని దౌర్జన్యంగా కూలగొట్టి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందులోనూ ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకరు గతంలో ఓ ఉపాధ్యాయురాలిని బెదిరించారు. అతను సివిల్ సప్లయ్ కార్యాలయంలోనూ చక్రం తిప్పి అక్రమాలకు పాల్పడ్డాడు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. ఇతను ఓ వివాహితను లోబరచుకున్నాడు. ఆ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే పనిచేస్తుంటాయి. రికార్డులు తారుమారు చేసి, సదరు భూములను అనుచరుల పేర రిజిస్ట్రేషన్ చేయించిన దాఖలాలు ఉన్నాయి. సింగ్‌నగర్ ప్రాంతంలో వందల కొద్ది అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టాలన్నా కార్పొరేటర్లు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లైతే రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వీటిలో ఎమ్మెల్యేకు వాటా వెళుతోంది. జాగా కనిపిస్తే పాగా ఎమ్మెల్యే బొండా, తన అనుయాయులైన కార్పొరేటర్లు అందిన కాడికి దోచుకోవటమే పరమావధిగా పనిచేస్తున్నారు. రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరులోపలకి ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నారు. ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడు వ్యాయామశాల పెట్టుకోవడానికి ధారాదత్తం చేశారు. 44వ డివిజన్లో కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలను సైతం విక్రయించారు. సదరు కార్పొరేటర్ హౌస్‌ఫర్ ఆల్ ఇళ్లను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. తాజాగా 46వ డివిజన్ అంబేడ్కర్ కాలనీలో కాల్వగట్టు స్థలాన్ని వ్యాయామశాల కోసం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సింగ్‌నగర్‌లో కోట్ల విలువైన భూమి.. మాగంటి బాబు.. ఎమ్మెల్యే బొండా ఉమాకు అత్యంత సన్నిహితుడు. స్వాతంత్య్ర సమరయోధుని భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతో పాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమాకు అన్ని దందాల్లోనూ మాగంటి బాబే కీలకంగా వ్యవహరిస్తుంటారన్నది బహిరంగ రహస్యమే. తాజాగా విజయవాడ సింగనగర్లోని రూ.30 కోట్లు భూదందాలో కూడా ఆయనే కీలక పాత్రధారి కావడం గమనార్హం. వాస్తవానికి ఆ భూమిని 2005లోనే 21 మంది సామాన్యులు ప్లాట్లు రూపంలో కొనుగోలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం భూముల ధరలు అమాంతంగా పెరగడంతో ఆ భూమి మార్కెట్ విలువ రూ.30 కోట్లకు చేరుకుంది. దీంతో టీడీపీ నేతల కన్ను ఆ భూమిపై పడింది. ఎమ్మెల్యే బొండా ఉమాకు అత్యంత సన్నిహితుడైన మాగంటి బాబుతోపాటు మరికొందరు ఆ భూమి తమదంటూ కొత్త వాదనను లేవదీశారు. మాగంటి బాబు, మరికొందరు 2015లో ఆ భూమిలోకి ప్రవేశించి ప్లాట్లుగా వేసి ఉన్న హద్దు రాళ్లను తొలగించేశారు. తమ భూమిలో ఇతరులు ప్రవేశించడంపై ఆ 21 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా తాము ఆ భూమిని 2007లోనే కొనుగోలు చేశామని కొన్ని పత్రాలు చూపించ డంతో వారు హతాశులయ్యారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సింగ్‌నగర్ పోలీసులు ఆ భూమి ఆక్రమణదారులపై కేసు నమోదు చేయాల్సివచ్చింది. కానీ వారంతా బొండాకు సన్నిహితులు కావడంతో పోలీసులు వారికే కొమ్ముకాస్తుండటం గమనార్హం. అసలు యజమానులు ఎన్నిసార్లు ఆ భూమిలో హద్దురాళ్లు పాతుతున్నా వెంటనే తొలగిస్తున్నారు. ఆ భూమిని చదును చేయాలని భావిస్తుంటే అడ్డుకుంటున్నారు. భూమిలోకి అడుగుపెడితే సహించేది లేదని బెదిరిస్తున్నారు. -
‘బొండా ఉమ దాష్టీకాన్ని ప్రజలంతా చూశారు’
సాక్షి, విజయవాడ: విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రౌడీయిజం పెరిగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు ఆరోపించారు. ఒక్కసారి గెలిచిన కూడా బొండా ఎన్ని కబ్జాలు, దౌర్జన్యాలు చేశారో అందరికీ తెలుసనని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే విజయవాడలో టీడీపీ నాయకులు అలజడి సృష్టించారని విమర్శించారు. సెటిల్మెంట్లకు, బెదిరింపులకు విజయవాడను కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. నాలుగు రోజుల కిందట బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వైద్యుడిపై బొండా దాష్టీకాన్ని రాష్ట్ర ప్రజలు అందరు చూశారని గుర్తుచేశారు. బొండా వల్లే విజయవాడలో రౌడీయిజం పెరిగిపోయిందని విమర్శించారు. టీడీపీ నేతలు ఐదేళ్లలో తాము ఏం చేశారో చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఎఫ్ఐఆర్ తన పేరు లేదని విష్ణు స్పష్టం చేశారు. టీడీపీ కుట్రలో భాగంగానే పోలీసులు ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో మద్యంలో కల్తీ జరగలేదని తేల్చారని తెలిపారు. వాటర్ కులర్‌లో సైనేడ్ కలిపినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు బొండా ఉమా సిద్దమా అని సవాలు విసిరారు. (చదవండి: వైద్యుడిపై బొండా ఉమా వీరంగం!) -
వైద్యుడిపై బొండా ఉమా వీరంగం!
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్) : నేనేంటో... నా సామర్థ్యమేంటో తెలియక మాట్లాడుతున్నావ్.. మీ సామాజిక వర్గానికి ఓట్లు వేసి ఏం సాధిస్తారు.. నీకు సిగ్గు, సంస్కారం లేదా? అంటూ ఒక వైద్యుడిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు వీరంగం వేశారు. మార్నింగ్ వాక్కు వచ్చిన ఆ వైద్యుడు నిష్కారణంగా బొండా వేసిన వీరంగంతో కన్నీటి పర్యంతమయ్యాడు. విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో మాచవరం వాకర్స్ క్లబ్ ఉంది. ఇక్కడ సీతారాంపురం నుంచి రింగ్‌రోడ్డు వరకు ప్రతి నిత్యం వందల మంది వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. మంగళవారం ఉదయం బొండా ఉమామహేశ్వరరావు అక్కడ ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఉన్న అతని అనుచరులు ఒకొక్కర్ని పరిచయం చేస్తున్నారు. ఈ లోగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఆ వైద్యుడి వంతు వచ్చింది. అంతే.. బొండా ఉమాలోని కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఆ వైద్యుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మల్లాది విష్ణుకు మద్దతుగా పనిచేస్తున్నారని అప్పటికే బొండా ఉమాకు సమాచారం ఉంది. దీంతో ఆయన ఊగిపోతూ మీ సామాజికవర్గమంతా కలిసి విష్ణుకు ఓటేస్తే.. వాడు గెలుస్తాడా...అంటూ ఊగిపోయాడు. మీరెంత? మీ బలమెంత? మీ సామాజికవర్గాన్నంతా మీ వెంటే తిప్పుకోవడానికి ప్రయత్నిస్తే అంగీకరించనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ విష్ణు తనకు బంధువని .. తమ వర్గాన్ని పలుమార్లు ఆదుకున్నారని చెప్పబోగా మరింత రెచ్చిపోతూ పెద్దపెద్దగా అరవసాగాడు. దీంతో ఆ వైద్యుడు కన్నీటి పర్యంతం కాగా మిగతావారు బొండాను సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. -
బొండా ఉమా, పార్థసారధి రాజీనామా
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారధి మంగళవారం టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. టీటీడీ బోర్డులో కొనసాగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్న భావనతో వారు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. కాగా, తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి రాజీనామా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టిక్కెట్ ఆశించి భంగపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా నరసాపురం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తాను ఏవిధంగా పోటీకి దిగుతాననే దానిపై రెండు మూడు రోజుల్లో తెలియజేస్తానన్నారు. -
కళాకారులంటే అంత చులకనా?
సాక్షి,విజయవాడ : ఏపీ సృజనాత్మక సమితి, రాష్ట్రంలోని పేద కళాకారుల సంక్షేమం కోసం, భాషా సాంస్కృతిక, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. అయితే తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని రూపురేఖలే మారిపోయాయి. కళాకారుల పక్షాన నిలబడాల్సిన శాఖ ప్రభుత్వం ప్రచార సంస్థగా మారటం అత్యంత విచారకరం. తమకు రావాల్సిన బకాయిల కోసం కళాకారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదని కళాకారులు ఆవేదన చెందుతున్నారు. 3 కోట్లకు పైగా బకాయిలు రాష్ట్రంలో కళాకారులు ఏ సాంస్కృతిక కార్యక్రమం జరుపుకున్నా దాని ప్రాధాన్యతను బట్టి శాఖ వారికి కొంతమెత్తం చెల్లిస్తుంది. గత సంవత్సం ఆగస్టు నెల నుంచి నేటి దాకా కళాకారులకు 3 కోట్లకు పైగా చెల్లింపులు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. చెల్లింపులు నిలిపివేత! రాష్ట్రంలో 13 జిల్లాల్లో నాలుగు వేల మందికి పైగా కళాకారులన్నారు. ప్రతీ సందర్భంలో వారు తమ ప్రదర్శనల ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారం అంటూ కళాకారులను వాడుకున్న ప్రభుత్వం కళాకారులకు చెల్లించాల్సిన చెల్లింపులను నిలిపివేసింది. తెలుగు తమ్ముళ్లకు దొడ్డిదారి చెల్లింపులు ఇతర కళాకారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లకు.. వారి ప్రదర్శనలకు వెం టనే చెల్లింపులు చేస్తోంది. మూడు సంవత్సరాలలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా అనుచరురాలుగా చెప్పుకుంటున్న సంస్థకు 30 పైగా కార్యక్రమాలకు భారీగా సహాయాన్ని అందించింది. ( నిబంధనల ప్రకారం ఒక సంత్సరంలో 6 నెలలకు ఒక కార్యక్రమం ఇవ్వవచ్చు) ఆ సంస్థకు అన్ని కార్యక్రమాలు ఎందుకు ఇచ్చారో ఎవరికీ అర్ధం కావడం లేదు. సిబ్బందికి సైతం... భాషా సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం నాలుగు నెలలుగా జీతాలు చెల్లిం చడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలు ఎలా గడుపుకోవాలో వారికి అర్ధం కావడం లేదని వారంతా సాక్షికి మెరపెట్టుకున్నారు. ఏదిఏమైనా ఎనిమిది నెలలుగా కళాకారులకు బకాయిపడ్డ 3 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కళాకారులంతా ముక్తంకంఠంతో కోరుతున్నారు. -
బొండా.. ప్రజలు ఛీ కొడుతున్నారు
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆగడాలు, భూ కబ్జాలు, దోపిడీలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చిన స్థలాన్ని నిస్సిగ్గుగా ఆక్రమించిన ఉమాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. బాబూరావు డిమాండ్ చేశారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి స్థలాన్ని కబ్జా చేసిన ఘటనలో ఎమ్మెల్యే బొండా, అతని భార్య సుజాతతో సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి బొండా రాజీనామా చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉమా ఆగడాలపై ఆయన బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కబ్జాకోరులకు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. భూ ఆక్రమణలు, అరాచకాలతో విజయవాడను తన గుప్పెట్లోకి తీసుకున్న బొండాను జనం ఛీ కొడుతున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సిగ్గు చేటన్నారు. బెజవాడను భ్రష్టు పట్టిస్తున్న బొండా.. బొండా ఉమా భూ ఆక్రమణల వల్ల విజయవాడ బ్రాండ్ ఇమేజ్ పాతాళంలోకి పడిపోయిందని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి సాయిశ్రీ మరణానికి కారణమైన బొండాను ఊరికే వదిలేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంద్రకీలాద్రిని తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు టీడీపీ నాయకులు ఆరాటపడుతున్నారని... దసరా ఉత్సవాల్లో వెలుగు చూస్తున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేవస్థానాలను స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న చరిత్ర టీడీపీ నాయకులదేనని తెలిపారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనతో ఏం ఒరగబెట్టారో చెప్పకుండా ... నిస్సిగ్గుగా మళ్లీ నువ్వే రావాలి సీఎం అంటూ చంద్రబాబు ఫ్లెక్సీలను, హోర్డింగులను ప్రదర్శించడం నీతిమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. భూ ఆక్రమణల నేపథ్యంలో బొండాపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అతన్ని అన్ని పదవుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా సంఘాలతో చర్చించి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు డీవీ కృష్ణ, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బోండా కబ్జాల పర్వంపై బాబు స్పందించాలి’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కబ్జాల పర్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని సీపీఎం నేత సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బోండా ఉమా, ఆయన భార్యతో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కోర్టులు చివాట్లు పెడితేగాని పోలీసులు కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తక్షణమే బోండా ఉమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ప్రభుత్వమే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న సాయిశ్రీ! బోండా ఉమామహేశ్వరరావు అనుచరుల వల్లే చనిపోయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు బోండాపై చర్యలు తీసుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. కబ్జాల నాయకుడు బోండా ఉమాపై పోలీసులు వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు రోజులలో బోండా ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోకపోతే, అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే టీటీడీ బోర్డు మెంబర్ పదవినుంచి బోండాను తొలగించాలన్నారు. -
ఎమ్మెల్యే బోండాపై కేసు నమోదు చేయండి
-
ఎమ్మెల్యే బోండాపై కేసు నమోదు చేయండి: హైకోర్టు
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. బోండా దంపతులతో సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని హై కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో ఓ స్వతంత్ర్య సమరయోధుడి భూమిని ఎమ్మెల్యే బోండా అధికారం అడ్డుపెట్టుకుని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఎమ్మెల్యే బొండా కబ్జా చేశారని బాధితుడు రామిరెడ్డి కోటేశ్వరావు నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ భూవిషయంలో ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడతున్నట్లు కూడా తెలిపారు. అయినా పోలీసులు ఎమ్మెల్యేపై కేసునమోదు చేయకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఎమ్మెల్యే బోండా దంపతులతో సహా 9 మందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు విజయవాడ పోలీసులను ఆదేశించింది. -
ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే బోండాగిరి
-
ఇంద్రకీలాద్రిపై ‘బొండా’ హల్చల్
సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు బెజవాడ ఇంద్రకీలాద్రిపై రెచ్చిపోయారు. అధికారులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించి.. వీరంగం వేశారు. బొండా అనుచరులు ఒకానొక దశలో దుర్గగుడి సూపరింటెండెంట్ చొక్కా పట్టుకొని ‘బయటకు రా.. నీ అంతుచూస్తాం’ అంటూ బెదిరించారు. వివరాలు.. మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరఫున కనదుర్గమ్మకు టీటీడీ ఏఈవో సాయిలు పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ ఆయనకు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే టీటీడీ బోర్డు సభ్యుడినైన తనతో కాకుండా ఏఈవోతో అమ్మవారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పింపజేస్తారంటూ దుర్గ గుడి ఈవోపై బొండా ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఉండగా అధికారులకు ఎలా ప్రాధాన్యమిస్తారని ఆమెపై చిందులు తొక్కారు. సంగతి చూస్తానని హెచ్చరించారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకున్నామని చెప్పినా వినకుండా.. రుసరుసలాడుతూ బొండా వెళ్లిపోయారు. నీ అంతు చూస్తాం.. ఇదేసమయంలో బొండా ఉమా అనుచరులు సైతం అధికారులపై విరుచుకుపడ్డారు. పట్టువస్త్రాలు సమర్పించేందుకు నిబంధనల ప్రకారం టీటీడీ ఏఈవో, బొండా ఉమా కుటుంబసభ్యులనే అనుమతిస్తామని.. అనుచరులు క్యూ లైన్లలో రావాలంటూ ఆలయ సూపరింటెండెంట్ చందూ శ్రీనివాస్ వారిని అడ్డుకున్నారు. దీంతో బొండా అనుచరులు ఆవేశంతో ఊగిపోయారు. సూపరింటెండెంట్ చొక్కా పట్టుకుని ‘బయటకు రా.. నీ అంతూ చూస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. మా ప్రతాపం చూపిస్తామంటూ రెచ్చిపోయారు. దీంతో వారి తీరు చూసి భక్తులు నోరెళ్లబెట్టారు. ఆలయాల్లో కూడా రౌడీయిజం చేస్తారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఏఈవో సాయిలు పట్టువస్త్రాలు సమర్పిస్తారని మాత్రమే తమకు టీటీడీ ఈవో నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. టీటీడీ ఏఈవో సాయిలు మాట్లాడుతూ.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని ఉన్నతాధికారులే తనకు ఆదేశాలిచ్చారని తెలిపారు. చైర్మన్‌ను అడ్డుకున్న దుర్గగుడి ఈవో.. అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబును ఈవో కోటేశ్వరమ్మ అడ్డుకుని.. క్యూలైన్లలో రావాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన చైర్మన్ గుడిలోనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఈవో కలుగజేసుకుని నేరుగా ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. మహాలక్ష్మీ నమోస్తుతే! మంగళవారం బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్షీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మిలుగా వరాలు ప్రసాదించే అష్టలకు‡్ష్మల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారని విశ్వాసం. లక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సాయంత్రం ఏడు వరకు 90 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె.సంధ్యారాణి, బిగ్‌బాస్ విజేత కౌశల్, వైఎస్సార్సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ తదితరులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. -
భూవివాదంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా
-
మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు మరువకముందే.. తాజాగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక సబ్బరాయనగర్ వెంచర్లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితులు చెబుతున్నారు. కానీ ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు. -
భగ్గుమంటున్న హిందూ సంఘాలు
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుమల/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులను, రౌడీయిజం చేసే వారిని, ఆధ్యాత్మిక–సేవా భావం లేనివారిని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించారని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏడాది పాటు అధికారుల పాలనలో సాగిన టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై అన్యమత ప్రచార కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియామకంపై హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం లెక్కచేయలేదు. అలాగే బోర్డులో సభ్యురాలుగా నియమితులైన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విషయంలోనూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కొత్త బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు అసంతృప్తి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. అలాగే తనను టీటీడీ సభ్యుడిగా నియమించడంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కినుక వహించారు. తాను టీటీడీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వకుండా, సభ్యుడిగా నియమించి అవమానించారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నా మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివర్ సతీమణి సప్నను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసమే ఆమెకు టీటీడీ బోర్డులో చోటు కల్పించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బోర్డులో తమకు అవకాశం కల్పిస్తారని టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆశించారు. అవకాశం రాని వారు పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టీటీడీ బోర్డులో తమిళనాడుకు ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమని ఆ రాష్ట్రానికి చెందిన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. -
టీటీడీ వ్యవహారం.. తలపట్టుకున్న చంద్రబాబు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు మెంబర్లపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన ఆడియో, వీడియో క్లిప్‌లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారు. అనిత వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు సందిగ్దంలో పడ్డారు. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర మతాలకు చెందిన వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎలా నియమిస్తారంటూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన వీడియోను ఏపీ ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. అనిత వ్యవహారంపై అధికారులను చంద్రబాబు నివేదిక కోరారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హిందూ మత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండానిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో టీటీడీ బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. నిజానికి టీటీడీ పాలక మండలిని నియమించడానికి ముందుగానే ప్రభుత్వం సభ్యులకు సంబంధించి అన్ని వివరాలను సేకరిస్తుంది. బొండా ఉమా హిట్లర్.. అతడు అనర్హుడు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అనర్హుడని బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు విజయవాడ బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. బ్రాహ్మణులను తొక్కి ఉమాకు పదవి ఇవ్వడం సరికాదన్నారు. బొండా ఉమా ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం బ్రాహ్మణ సంఘాలే. కానీ గెలిచినప్పటి నుంచి బ్రాహ్మణ సంఘాలకు ఆయన చేసిన మేలు శూన్యమని ఎద్దేవా చేశారు. బొండా ఉమాకు ఆలయ వైదిక ధర్మాలు తెలుసా అని ప్రశ్నించారు. ఆలయాల్లో నియమాలు తెలియని వ్యక్తికి టీటీడీ పదవులు కట్టబెట్టడం బ్రాహ్మణులను కించపరచడమే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బొండా ఉమా ఒక హిట్లర్ అని.. ఆయనకు అన్ని పదవులు కట్టబెట్టడం దుర్మార్గమని బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. కాగా, టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను... బోర్డు సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమా సహా మరికొందరిని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం.. -
తితిదే బోర్డు మెంబర్ల నియామకం..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం చేపట్టింది. టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సభ్యులుగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీఎస్ఎస్ శివాజీ, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్యే అనిత, ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్యే చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మేడా రామచంద్రా రెడ్డి, డొక్కా జగన్నాధం, సండ్ర వెంకట వీరయ్య(తెలంగాణ), ఇనుగాల పెద్దిరెడ్డి(తెలంగాణ), సుధా నారాయణ మూర్తి(కర్ణాటక), సప్న (మహారాష్ట్ర) నియమితులయ్యారు. -
మరో భూవివాదంలో బోండా ఉమ
-
మరో భూవివాదంలో బోండా ఉమ
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్యెల్యే అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని కబ్జా చేసిన వివాదం మరవక ముందే బోండా ఉమ, ఆయన అనుచరులు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పెనమలూరు డెవెలప్మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని ఇద్దరు మహిళలు జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు. భూమిని అప్పగించకపోతే చంపేస్తామంటూ బోండా ఉమ అనుచరులు పోలవరపు కిషన్, వెంకట నరసయ్య బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో వారి భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, పోనీ తమ భూములను అప్పగించమని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు తెలియకుండానే తమ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చామంటున్నారని, వాటికి వడ్డీ కట్టాలంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి తమ బాధలను చెప్పుకొని న్యాయం చేమని కోరితే ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని కంటతడిపెట్టుకున్నారు. -
బోండా భూకబ్జా.. కలెక్టర్ విచారణ... కానీ!
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ భూకబ్జా వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సుమోటోగా విచారణ చేపడుతున్నారు. బోండా ఉమ భూ కబ్జాలపై మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా ఈ విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో తమ భూములు కబ్జాకు గురైన బాధితులు ఆధారాలతో విచారణకు రావాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి బాధితులను ఆర్డీవో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని స్వాహా చేసేందుకు ఎమ్మెల్యే బోండా, ఆయన సతీమణి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రూ. 50 కోట్ల విలువచేసే 5.16 ఎకరాల భూమిని భార్య పేరిట బోండా ఉమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన మాట వినకుంటే అంతు చూస్తామని స్వాతంత్ర్య సమరయోధుడి వారసుడైన సురేశ్‌ను ఆయన బెదిరించారు. బోండా ఉమ భూకబ్జాపై బాధితుడు సురేశ్ సీఐడీని ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ బోండా ఉమ తనను వేధిస్తున్నారని, తన స్థలంలో ఇంకా ప్రహరీగోడను తొలగించలేదని బాధితుడు సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చేపట్టిన ఈ సుమోటో విచారణ వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, బోండా ఉమ భూకబ్జాపై సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తానని సురేశ్ తెలిపారు. టీడీపీ హయాంలో కాపుల భూములు కబ్జాకు గురవుతున్నాయని, తనకు జరిగిన అన్యాయంపై కాపు సంఘాల నేతలను కలుస్తానని చెప్పారు. -
‘బొండా’గిరీ.. ఏదీ దారి?
సాక్షి, అమరావతిబ్యూరో: టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుటుంబ భూబాగోతంపై ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. రూ.50కోట్ల విలువైన భూదందా కేసును నీరుగార్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే న్యాయ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు హఠాత్తుగా తెరపైకి వచ్చి విచారణ పేరుతో కేసును నీరుగార్చేందుకు రంగంలోకి దిగారు. ఇదే తరుణంలో ఈ కేసులో కీలకంగా మారిన స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబసభ్యులను తమకు అనుకూలంగా మార్చాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు కోటేశ్వరరావు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ ఉద్దేశపూర్వక జాప్యం స్వాంతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి చెందిన 5.16 ఎకరాలను తప్పుడు పత్రాలతో బొండా ఉమా కుటుంబం తమ పరం చేసుకుంది. ఇందులో ఉమాకు అనుకూలంగా ఈ కేసును నీరుగార్చడానికి ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. కేసు నమోదు వరకు ఉత్సాహంగా వ్యవహరించిన సీఐడీ అధికారులు హఠాత్తుగా నెమ్మదించారు. ఈ కేసులో ఏ–8గా ఉన్న బొండా ఉమా భార్య సుజాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు నుంచి తనను తప్పించాలని పిటిషన్ వేశారు. దీనిని సీఐడీ అధికారులు వ్యతిరేకించకపోవడం గమనార్హం. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ కేసులో దర్యాప్తును 8 వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ అధికారులు ఈ కేసులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబానికి ఏకపక్షంగా సహకరించేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నినట్లు స్పష్టమైంది. రంగంలోకి రెవెన్యూ అధికారులు మరోవైపు రెవెన్యూ అధికారుల ద్వారా ఎమ్మెల్యే బొండా ఉమాకు అనుకూలంగా ప్రభుత్వం కథ నడుపుతోంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులే సుమోటాగా ఈ కేసు విచారణను చేపట్టడం గమనార్హం. అదే సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబసభ్యులను ప్రభావితం చేసేందుకు టీడీపీ పెద్దలు ఒత్తిడి పెంచారు. సూర్యనారాయణ పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఆ భూమిని విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వెంకటేశ్వరరావు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చి అది వెంకటేశ్వరరావు సంతకమే అని చెప్పించాలన్నది ఎమ్మెల్యే బొండా వర్గీయుల పన్నాగం. ఇందుకు కొన్ని రోజులుగా ఆ కుటుంబసభ్యులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమచారం. ఆ కుటుంబసభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలను తమకు అనుకూలంగా మలచుకుని వ్యవహారాన్ని పూర్తిచేయాలన్నది వారి వ్యూహం. రెవెన్యూ అధికారులు ఓసారి ధ్రువీకరిస్తే చాలు తరువాత అధికారికంగా సీఐడీ కేసును పూర్తిగా నీరుగార్చవచ్చని భావిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోండిపోలీసులను కోరిన కోటేశ్వరరావు రూ.50కోట్ల భూదందా కోసం విజయవాడకు చెందిన అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావును ఎమ్మెల్యే బొండా కుటుంబం బురిడీ కొట్టించింది. స్వాతంత్య్ర సమరయోధుడు కసిరెడ్డి సూర్యనారాయణ కుటుంబం నుంచి ఆ భూమిని వారిద్దరూ కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బొండా భార్య సుజాతతోపాటు మరికొందరికి జీపీఏ రిజిస్ట్రేషన్ చేసినట్లు కథ నడిపించారు. కాగా, తనను ఈ భూబాగోతంలో ఇరికించిన బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని రామిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఉమా, ఆయన సన్నిహితుడు మాగంటి బాబు, కార్పొరేటర్ గండూరి మహేష్ తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా.. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు కోటేశ్వరరావును బెదిరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన న్యాయవాది ద్వారా మరోసారి పోలీసులను ఆశ్రయించారు. -
‘బొండా’గిరికి ప్రభుత్వ దన్ను
సాక్షి, అమరావతిబ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూబాగోతానికి ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. ఆయన భూ బండారం బట్టబయలైనా చర్యల విషయంలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి కేసును నీరుగార్చాలని చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొండా ఉమా రూ.50 కోట్ల భూబాగోతం కేసులో ఏ–1గా ఉన్న అబ్దుల్ మస్తాన్, ఏ–2గా ఉన్న రామిరెడ్డి కోటేశ్వరరావు అందులో తమ ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారు. ఆ 5.16 ఎకరాలను తాము కొనలేదని, అలాంటప్పుడు దాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతోపాటు ఇతరులకు విక్రయించే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. సీఐడీ, రెవెన్యూ, రిజిస్ట్రార్ అధికారుల విచారణలో ఈ విషయాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు. సీఐడీ అధికారులు రెండురోజుల క్రితం అబ్దుల్ మస్తాన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఆయన మాట్లాడలేని స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రోజు కూలీ చేసుకునే తమకు కోట్ల విలువైన భూమి కొనే స్తోమత ఎక్కడిదని వారు సీఐడీ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అయినా ప్రభుత్వం దన్ను... ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూదందాకు పాల్పడినట్లు స్పష్టం అవుతున్నా ప్రభుత్వం మాత్రం మౌనం వీడడంలేదు. ఎమ్మెల్యే బొండా ఉమా ప్రభుత్వ ముఖ్యనేతతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనకు దన్నుగా నిలుస్తోంది. అందుకే ఆ భూమిని ఎమ్మెల్యే బొండా కుటుంబం నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకోవడమే లేదు. నిబంధనల ప్రకారం అయితే ప్రభుత్వం రెవెన్యూ అధికారులను ఆదేశించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. అక్కడ నిర్మించిన షెడ్డూ, ప్రహరీని కూల్చివేయాలి. ఆ దిశగా చర్యలు తీసుకునే ఉద్దేశమే లేనట్లు వ్యవహరిస్తుండటం సందేహాలకు కలిగిస్తోంది. జీపీఏ చేసుకోవడానికి రద్దుకు మధ్యలో ఆ భూమిపై ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం పలు క్రయవిక్రయాలు నిర్వహించింది. అవన్నీ కూడా అధికారికంగా కొనసాగుతునే ఉన్నాయి. దాంతో ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా సీఐడీ, రెవెన్యూ అధికారులు నెమ్మదించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు మౌనం తరువాత కేసును నీరుగార్చాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగంగా ఉంది. ముఖ్యనేతతో సంప్రదింపుల తరువాత బొండా వర్గం ఎదురుదాడికి దిగడం గమనార్హం. సూర్యనారాయణ కుటుంసభ్యులపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. వారు చూపించిన పత్రాలు నకిలీవని చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను సామ, దాన, భేద, దండోపాయాలతో తమదారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ అండతోనే భూ కబ్జాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లాది విష్ణు విజయవాడ సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ అండతోనే... రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖలను బొండా ఉమామహేశ్వరరావు తన కనుసన్నల్లో పెట్టుకొని కబ్జాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆరోపించారు. బీసెంట్ రోడ్డులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బొండా నడవడిక విజయవాడ చరిత్రకు మాయనిమచ్చగా నిలిచిందన్నారు. బొండా ఉమాపై మూడు నెలల కిందట సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. బొండా ఉమా దందాలలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. ఎమ్మెల్యే బొండా ఉమా బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శార్వాణి మూర్తి, వెన్నం రత్నారావు, బీసీ సెల్ నేత బంకా భాస్కర్, లీగల్ సెల్ నగర అధ్యక్షుడు టి.సుబ్బారావు, నగర అధికార ప్రతినిధులు కొండలరావు, మారుతి మహావిష్ణు పాల్గొన్నారు. -
‘బొండాగిరి’పై ఇంటెలిజెన్స్ ఆరా..!
సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి బొప్పికట్టించిన ‘బొండాగిరి’ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇప్పటి వరకు బొండా వ్యవహారాల చిట్టాను సేకరించినట్టు సమాచారం. నగరంలో సాధారణ వ్యక్తిగా మొదలైన ప్రస్థానం, చిత్తూరు జిల్లాలో అజ్ఞాతవాసం, ఆపై రాజకీయంగా సాగిస్తున్న దందాల వరకు అన్ని వివరాలనూ సేకరించారు. ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలో ఆయన తనయుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్ రేస్, యువకుడి మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరుల ప్రమేయమున్న పలు వ్యవహరాలపై కూడా ఆరా తీశారు. బ్రాహ్మణ సమాఖ్య నిర్వహణలో ఉన్న సత్యనారాయణపురం సీతారామ కళ్యాణమండపానికి తాళం వేయడం నుంచి మాదంశెట్టి సుమశ్రీకి చెందిన ప్లాట్‌ను ఆక్రమించుకోవడం (వైద్యం అందక ఆమె 13 ఏళ్ల కుమార్తె సాయిశ్రీ మృత్యువాత పడడం), విజయవాడ శివారు కండ్రికలో కార్పొరేషన్ భూమిని బొండా సోదరుడు పెన్సింగ్ వేసి ఆక్రమించడం, సింగ్‌నగర్, పాయకాపురం బర్మాకాలనీల్లో ఎమ్మెల్యే అనుచరులు ఇల్లు, ప్లాట్లు ఆక్రమించడం ఇలా అన్ని విషయాలపై ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి పెట్టారని సమాచారం. తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ.50 కోట్ల విలువైన భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే సతీమణి సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి రాంబాబు మరో ఆరుగురు ఉండటం సంచలనం రేపింది. ఈ అన్ని సంఘటనల వివరాలతో ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. బొండా ఉమాపై అనర్హత వేటువేయండి విజయవాడ సిటీ: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూకబ్జాలు, దందాలపై చంద్రబాబు వెంటనే స్పందించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బొండా అనుచరులు గతంలో సుమశ్రీ అపార్ట్‌మెంట్‌ను ఆక్రమించుకోవడం, సెటిల్మెంట్లతో నిస్సహాయులను బెదిరించడం ఇలా ఎన్నో దారుణాలు వెలుగుచూసినా చంద్రబాబు పట్టించుకోవడంలేదన్నారు. -
అధికారమే అండగా ‘బొండా’గిరి
సాక్షి, అమరావతిబ్యూరో: బొండా ఉమామహేశ్వరరావు భూ దాహానికి అధికార యంత్రాంగం అడుగడుగునా అండగా నిలిచింది. రెవెన్యూ, పోలీసు శాఖలు శక్తివంచన లేకుండా సహకారం అందించినట్లు అనేక రుజువులు లభిస్తున్నాయి. వారి అండతోనే రికార్డులు తారుమారు చేసి స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన రూ.50 కోట్లకు పైగా విలువైన 5.16 ఎకరాల భూమి గుప్పిట్లోకి తెచ్చుకున్నట్లు స్పష్టం అవుతోంది. ‘బొండాగిరి’కి సంబంధించి పలు కొత్త కోణాలు ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూశాయి. రికార్డులు లేని కాలాన్ని ఆసరాగా చేసుకుని.. 1971–88 మధ్య కాలంలో భూములు, ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విజయవాడ గాంధీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు ధ్వంసమయ్యాయి. దాన్నే ఎమ్మెల్యే బొండా ఉమా తమ భూదందాలకు అవకాశంగా మలచుకున్నారు. స్వాతంత్య్రసమరయోధుడు సూర్యనారాయణ పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు ఆ భూమిని విజయవాడకు చెందిన అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావుకు 1988లో విక్రయించినట్లు 2016లో పత్రాలు సృష్టించారు. వాస్తవానికి వారిద్దరికీ కూడా ఆ విషయం తెలీదు. అబ్దుల్ మస్తాన్ చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటారు. ఇక కోటేశ్వరరావు దిగువ మధ్యతరగతికి చెందిన లారీ డ్రైవర్. అంతటి విలువైన భూములను కొనుగోలు చేసే ఆర్థికస్తోమత వారిద్దరికీ లేదు. ఆ పత్రాలను చూపిస్తూ ఆ 5.16 ఎకరాలను అబ్దుల్ మస్తాన్, కోటేశ్వరరావు పేరిట మ్యుటేషన్ చేయాల్సిందిగా తహశీల్దార్‌కు 2016, జులై 31న దరఖాస్తు చేశారు. ఇక్కడే రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఎమ్మెల్యే బొండా కుటుంబానికి సహకరించింది. తహసిల్దార్ ఆ దరఖాస్తును ఓకే చేస్తూ కలెక్టర్‌కు పంపగా ఆయన ఐజీ(రిజిస్ట్రార్స్)కు నివేదించారు. ఇలా అన్ని స్థాయిల్లో సహకరించి ఆ భూములను 22ఎ నిబంధన కింద మ్యుటేషన్ చేసేయడం గమనార్హం. దరఖాస్తుదారులైన అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లకున్నా బొండా కనుసైగతోనే అధికారులు మ్యుటేషన్ తతంగం పూర్తి చేసేశారు. అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావు 2017 మార్చి 15న ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతోపాటు మరో అయిదుగిరికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) కింద రాసిచ్చినట్లు కథ నడిపించారు. అడంగళ్లోనూ పేర్లు మార్చేసి రూ.50కోట్ల విలువైన భూమి పూర్తిగా ఎమ్మెల్యే బొండా ఉమా సొంతం చేసుకున్నారు. బొండా భూబాగోతానికి పోలీసు అండ తమ కుటుంబానికి చెందిన 5.16 ఎకరాలకు ప్రహరీ నిర్మించి ఆక్రమించుకున్న ఎమ్మెల్యే బొండా కుటుంబాన్నిఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగారంటూ సూర్యనారాయణ మనవడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీపీ స్థాయి అధికారి ఒకరు సురేష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (ఎమ్మెల్యే బొండా సిఫార్సుతోనే ఆ అధికారికి పోస్టింగు దక్కిందన్న విమర్శలు ఉన్నాయి.) భూ విషయమై ఎన్నిసార్లు పోలీసులను సంప్రదించినా ఆ అధికారి బెదిరించారు. ఫిర్యాదులో అంశాలన్నీ తప్పని, మరోసారి ఈ భూమి గురించి మాట్లాడితే తప్పుడు పత్రాలు సృష్టించినట్లు కేసు పెడతానని కూడా సురేష్‌బాబును బెదిరించారు. దాంతో తనకు పోలీసులు సహకరించరని అర్థం చేసుకున్న సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. దాంతో మొత్తం ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 23న బొండా ఉమా భార్య సుజాత, ఆయన అనుచరుల మీద సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, డిసెంబర్ 4న ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం ఆ భూమి మీద పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసుకున్న పత్రాలు మా తప్పిదమేమీ లేదు: రిజిస్ట్రార్ అధికారులు ఎమ్మెల్యే బొండా కుటుంబం భూబాగోతంపై సీఐడీ కేసు నమోదు కావడంతో రిజిస్ట్రేషన్ శాఖ విచారణ చేపట్టింది. ఐజీ (రిజిస్ట్రేషన్లు) వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఆ భూమిపై తహశీల్దార్ చేసిన మ్యుటేషన్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేశామని, అందులో రిజిస్ట్రార్ కార్యాలయ అధికారుల తప్పేమి లేదని నివేదించినట్లు తెలుస్తోంది. కేసు నమోదుతో జీపీఏ రద్దు నాటకం కేసు నమోదు కావడం, కోటేశ్వరరావు అప్రూవల్‌గా మారడంతో సీఐడీ అధికారుల కళ్లుగప్పి ఆ కేసు నుంచి బయటపడేందుకు బొండా ఉమా కుటుంబం మరో ఎత్తుగడ వేసింది. గత అక్టోబర్‌లో కేసు నమోదు కాగా డిసెంబర్ 4న జీపీఏ రద్దు చేసుకుంటున్నట్లు పత్రాలు సృష్టించారు. అంటే సీఐడీ కేసు నమోదు చేసిన తరువాతే ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారన్నది స్పష్టమవుతోంది. సీఐడీ విచారణ నుంచి తప్పించుకునేందుకే ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం ఈ ఎత్తుగడను ఎంచుకున్నారు. మరోవైపు అప్రూవర్‌గా మారిన కోటేశ్వరరావును బెదిరించి తమకు అనుకూలంగా మలచుకోవాలన్నది వ్యూహం. తద్వారా సీఐడీ కేసును నీరుగార్చాలని పథకం వేశారు. అయితే ఈ చర్యతో ఆ భూమిని పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా పొందడం అక్రమమని వారే సమ్మతించినట్లవుతోంది. జీపీఏ నెల క్రితమే రద్దు చేసుకున్నట్లు చెబుతున్నా అధికారదర్పంతో భూమిని మాత్రం ఇప్పటికీ తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి తమ మనుషులను కాపలా పెట్టారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులను అక్కడకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. సూర్యనారాయణ కోడలు జోగరత్నమ్మ, పెద్ద మనవడు శ్రీనివాస్ సోమవారం కూడా ఆ భూమి వద్దకు వెళితే కాపలాదారులు అడ్డుకున్నారు. సీఐడీ కేసు నీరుగార్చేవరకు నిరీక్షించి తర్వాత భూమిపై పట్టు సాధించాలన్నది ఎమ్మెల్యే కుటుంబ లక్ష్యంగా ఉంది. సోమవారం తమ భూమిలోకి ప్రవేశించలేక బయటే ఉండిపోయిన సూర్యనారాయణ కోడలు రాజరత్నమ్మ, పెద్ద మనవడు శ్రీనివాస్ -
ఎమ్మెల్యే బోండా తక్షణమే రాజీనామా చేయాలి
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భూకబ్జాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే బోండా తక్షణం పదవికి రాజీనామా చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. విజయవాడలో భూదందాలకు ఎమ్మెల్యే బోండా కేరాఫ్‌గా మారారని ధ్వజమెత్తింది. సీఎం చంద్రబాబునాయుడు ఎందుకు బోండాపై చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ సోమవారం ఒక బహిరంగ లేఖ రాశారు. విజయవాడలో ఈ భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ స్వాతంత్ర్య సమరయోధుడికు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే బోండా కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సృష్టించారు. సదరు కోటేశ్వర్‌రావును రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిమరీ సంతకాలు చేయించారు. కబ్జా విషయం తెలిసిన వెంటనే సమరయోధుడి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. సీఐడీ దర్యాప్తులోనూ ఎమ్మెల్యే భూదందా బట్టబయలైంది. దీంతో కొనుగోలుదారైన బోండా సుజాతపై కేసు నమోదయింది. స్వాతంత్య్రసమరయోధుడి కుటుంబం నేపథ్యం ఇదీ.. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన కసిరెడ్డి సూర్యనారాయణ స్వాతంత్య్రసమరయోధుడు. అప్పట్లో కర్నూలు జైల్లో మూడేళ్లు శిక్ష అనుభవించారు కూడా. ఆయనకు ప్రభుత్వం 1952లో విజయవాడలోని సింగ్‌నగర్‌లో 10.16 ఎకరాల భూమి కేటాయించింది. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో వెంకటేశ్వరరావుకు వివాహం కాలేదు. రామకృష్ణకు వివాహమై పిల్లలు ఉన్నారు. సూర్యనారాయణ కుటుంబం ఆ 10.16 ఎకరాల్లో తమ ఆర్థిక అవసరాల కోసం 5 ఎకరాలను దఫదఫాలుగా విక్రయించగా 5.16 ఎకరాలు మిగిలింది. సూర్యనారాయణ చిన్న కుమారుడు 1981లో, పెద్ద కుమారుడు వెంటకేశ్వరరావు 2013లో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆ భూమిపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కన్నుపడింది. ప్రస్తుతం అక్కడ ఎకరా మార్కెట్ విలువ రూ.10కోట్లు పైనే ఉంది. ఆ లెక్కన దాని విలువ రూ.50కోట్లుపైమాటే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బోండా రంగంలోకి దిగి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించారు. సూర్యనారాయణ ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, రామకృష్ణ తండ్రి ఆస్తిని 1983లో పంపకాలు చేసుకున్నట్లు ఒప్పంద పత్రాలు సృష్టించారు. (వాస్తవానికి రామకృష్ణ 1981లోనే చనిపోయారు.) అనంతరం వెంకటేశ్వరరావు తన వాటా భూమిని 2013లో విజయవాడకు చెందిన అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులకు విక్రయించినట్లు మార్చారు. తర్వాత వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి డెవలప్మెంట్ కోసం రాసిచ్చినట్లు పత్రాలు సృష్టించారు. ఆ మేరకు విజయవాడ గాంధీనగర్, నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే ఆ భూమి చుట్టూ ప్రహారీ నిర్మించి ఒక షెడ్డు వేసి తన మనుషులను కాపాలాగా ఉంచారు. కోటేశ్వరరావును బురిడీ కొట్టించింది ఇలా.. ఈ భూమాయ కోసం అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను కూడా ఎమ్మెల్యే బోండా పకడ్బందీగా బురిడీ కొట్టించారు. కోటేశ్వరరావు తన ఇంటిని తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడైన కార్పొరేటర్ మహేష్‌ను సంప్రదించారు. అందులో భాగంగా విజయవాడ గాంధీ నగర్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లిన కోటేశ్వరరావుతో పలు పత్రాలపై సంతకాలు చేయించారు. ఆ తరువాత సాంకేతిక కారణాలతో అప్పు ఇవ్వలేమని చెప్పి పంపించేశారు. ఆ రోజు కోటేశ్వరరావు చేసిన సంతకాలతోనే కథ నడిచింది. వెంకటేశ్వరరావు నుంచి భూమిని కోటేశ్వరరావు కొనుగోలు చేసినట్లు... దాన్నే ఎమ్మెల్యే భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి పవర్ ఆఫ్ అటార్నీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు మార్చారు. కాగా అతనితో పాటు భూమి రాయించినట్లు ఉన్న మరో వ్యక్తి అబ్దుల్ మస్తాన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. వెలుగులోకి వచ్చిందిలా.. తమ భూమికి కంచె వేసిన విషయం తెలుసుకున్న స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ మనవడు సురేష్‌బాబు (రామకృష్ణ కుమారుడు) అక్కడకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మార్చిలో అక్కడికి వెళ్లిన సురేష్‌పై ఎమ్మెల్యే మనుషులు ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగారు. సురేష్ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆరు నెలల క్రితం సీఐడీ విభాగాన్ని ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించించారు. భూమి రాసిచ్చిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు తనకు ఆ భూమి విషయమే తెలీదని... రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రశ్నించారు. సంతకాలు చూపించగా గతంలో అప్పు కోసం తాను చేసిన సంతకాలను ఇలా వాడుకున్నారని కోటేశ్వరరావుకు అర్థమై అదే విషయాన్ని వారికి చెప్పారు. దీంతో సీఐడీ వారు బోండా ఉమా భార్య సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి బాబు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. -
బెజవాడలో బొండాగిరి!
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగరంలో 5.16 ఎకరాల భూమి.. విలువ రూ.50 కోట్లు పైమాటే... యజమానులు సాదాసీదా వ్యక్తులు. ఇంకేముంది టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రహరీ కట్టేశారు... తప్పుడు పత్రాలు సృష్టించి దానికి తన భార్యను యజమానిని చేసేశారు. ఆ భూమికి వారసుడినని వచ్చిన వ్యక్తిపై తన మనుషులతో దౌర్జన్యం చేసి వెల్లగొట్టారు. విషయం వెలుగులోకి వచ్చి సీఐడీ కేసు నమోదు కావడంతో అధికారదర్పం ప్రదర్శిస్తున్నారు. తమ మాట వినకుంటే అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రసమరయోధుడి కుటుంబం నేపథ్యం ఇదీ... విజయవాడ మొగల్రాజపురానికి చెందిన కసిరెడ్డి సూర్యనారాయణ స్వాతంత్య్రసమరయోధుడు. అప్పట్లో కర్నూలు జైల్లో మూడేళ్లు శిక్ష అనుభవించారు కూడా. ఆయనకు ప్రభుత్వం 1952లో విజయవాడలోని సింగ్‌నగర్‌లో 10.16 ఎకరాల భూమి కేటాయించింది. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో వెంటకేశ్వరరావుకు వివాహం కాలేదు. రామకృష్ణకు వివాహమై పిల్లలు ఉన్నారు. సూర్యనారాయణ కుటుంబం ఆ 10.16 ఎకరాల్లో తమ ఆర్థిక అవసరాల కోసం 5 ఎకరాలను దఫదఫాలుగా విక్రయించగా 5.16 ఎకరాలు మిగిలింది. సూర్యనారాయణ చిన్న కుమారుడు 1981లో, పెద్ద కుమారుడు వెంటకేశ్వరరావు 2013లో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆ భూమిపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కన్నుపడింది. ప్రస్తుతం అక్కడ ఎకరా మార్కెట్ విలువ రూ.10కోట్లు పైనే ఉంది. ఆ లెక్కన దాని విలువ రూ.50కోట్లుపైమాటే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బోండా రంగంలోకి దిగి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించారు. సూర్యనారాయణ ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, రామకృష్ణ తండ్రి ఆస్తిని 1983లో పంపకాలు చేసుకున్నట్లు ఒప్పంద పత్రాలు సృష్టించారు. (వాస్తవానికి రామకృష్ణ 1981లోనే చనిపోయారు.) అనంతరం వెంకటేశ్వరరావు తన వాటా భూమిని 2013లో విజయవాడకు చెందిన అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులకు విక్రయించినట్లు మార్చారు. తర్వాత వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి డెవలప్మెంట్ కోసం రాసిచ్చినట్లు పత్రాలు సృష్టించారు. ఆ మేరకు విజయవాడ గాంధీనగర్, నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే ఆ భూమి చుట్టూ ప్రహారీ నిర్మించి ఒక షెడ్డు వేసి తన మనుషులను కాపాలాగా ఉంచారు. కోటేశ్వరరావును బురిడీ కొట్టించింది ఇలా... ఈ భూమాయ కోసం అబ్దుల్‌మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను కూడా ఎమ్మెల్యే బోండా పకడ్బందీగా బురిడీ కొట్టించారు. కోటేశ్వరరావు తన ఇంటిని తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడైన కార్పొరేటర్ మహేష్‌ను సంప్రదించారు. అందులో భాగంగా విజయవాడ గాంధీ నగర్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లిన కోటేశ్వరరావుతో పలు పత్రాలపై సంతకాలు చేయించారు. ఆ తరువాత సాంకేతిక కారణాలతో అప్పు ఇవ్వలేమని చెప్పి పంపించేశారు. ఆ రోజు కోటేశ్వరరావు చేసిన సంతకాలతోనే కథ నడిచింది. వెంకటేశ్వరరావు నుంచి భూమిని కోటేశ్వరరావు కొనుగోలు చేసినట్లు... దాన్నే ఎమ్మెల్యే భార్య సుజాతతోపాటు మరో అయిదుగురికి పవర్ ఆఫ్ అటార్నీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు మార్చారు. కాగా అతనితో పాటు భూమి రాయించినట్లు ఉన్న మరో వ్యక్తి అబ్దుల్ మస్తాన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. వెలుగులోకి వచ్చిందిలా... తమ భూమికి కంచె వేసిన విషయం తెలుసుకున్న స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ మనవడు సురేష్‌బాబు (రామకృష్ణ కుమారుడు) అక్కడకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మార్చిలో అక్కడికి వెళ్లిన సురేష్‌పై ఎమ్మెల్యే మనుషులు ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగారు. సురేష్ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆరు నెలల క్రితం సీఐడీ విభాగాన్ని ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించించారు. భూమి రాసిచ్చిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు తనకు ఆ భూమి విషయమే తెలీదని... రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రశ్నించారు. సంతకాలు చూపించగా గతంలో అప్పు కోసం తాను చేసిన సంతకాలను ఇలా వాడుకున్నారని కోటేశ్వరరావుకు అర్థమై అదే విషయాన్ని వారికి చెప్పారు. దీంతో సీఐడీ వారు బోండా ఉమా భార్య సుజాత, ఆయన ప్రధాన అనుచరుడు మాగంటి బాబు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒప్పుకోకుంటే చంపేస్తాం అంటూ కోటేశ్వరరావుకు బోండా వర్గీయుల బెదిరింపులు తమ భూబాగోతం బట్టబయలు కావడం, అందులో కోటేశ్వరరావు వాంగ్మూలం కీలకం కావడంతో ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. తాము చెప్పినట్లు చేస్తే భారీ మొత్తం ఇవ్వడంతోపాటు కేసు నుంచి బయటపడేస్తామని ఆశ చూపుతున్నారు. లేకుంటే అంతు చూస్తామని బోండాకు అత్యంత సన్నిహితుడైన కార్పొరేటర్ గండూరి మహేష్ బెదిరిస్తున్నారు. దాంతో భీతిల్లిన కోటేశ్వరరావు బోండా ఉమా వర్గీయుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌ను ఆదివారం కోరారు. మా భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం కబ్జా చేసింది: కేసిరెడ్డి సురేష్‌బాబు ‘స్వాతంత్య్ర సమరయోథుడైన మా తాతగారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం కబ్జా చేసింది. సామాన్యులను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే బోండా ఉమానే తన భార్య సుజాత పేరిట భూమి కబ్జా చేస్తే ఇక మాకు దిక్కెవరు? దీనిపై మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి’ -
బెజవాడలో భూకుంభకోణం ; బోండా సుజాతపై కేసు
సాక్షి, విజయవాడ : అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల మరో అక్రమపర్వం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సృష్టించారు. సదరు కోటేశ్వర్‌రావును రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిమరీ సంతకాలు చేయించారు. కబ్జా విషయం తెలిసిన వెంటనే సమరయోధుల కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. సీఐడీ దర్యాప్తులోనూ ఎమ్మెల్యే భూదంతా బట్టబయలైంది. దీంతో కొనుగోలుదారైన బోండా సుజాతపై కేసు నమోదయింది. అప్పుకోసం వెళితే ఇరికించారు : సీఐడీ దర్యాప్తులో గుట్టురట్టుకావడంతో భూవిక్రేతగా వ్యవహరించిన కోటేశ్వరరావు ఇరకాటంలో పడ్డాడు. సీఐడీ సోదాలతో బెదిరిపోయిన ఆయన.. టీడీపీ నాయకుల నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించాడు. ‘‘ఐదు లక్షల అప్పు కోసం కార్పొరేటర్ గండూరి మహేశ్(బోండా అనుచరుడు) దగ్గరికి వెళ్లాను. అందుకోసం కొన్ని కాగితాలపై సంతకాలు చేయించారు. తీరా సీఐడీ పోలీసులు మా ఇంట్లో సోదాలు చేసేదాకా తెలియదు.. నేను సంతకాలు పెట్టింది భూమికి సంబంధించిన పత్రాలని! వెంటనే మహేశ్‌కు ఫోన్ చేసి అడిగితే.. ‘భూమి నీదేనని పోలీసులకు చెప్పు. అలా కాకుంటే ఇబ్బందులు తప్పవ’ని అన్నాడు. ఈ క్రమంలోనే బెదిరింపులు కూడా వచ్చాయి. అంత విలువైన భూమి నాకే ఉంటే ఐదు లక్షల అప్పు ఎందుకు చేస్తాను? టీడీపీ నాయకుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. పోలీసులే కాపాడాలి’’ అని రామిరెడ్డి కోటేశ్వర్రావు తెలిపారు. -
టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు కట్
వృద్ధులను బెదిరించిన ఎమ్మెల్యే బోండా ఉమా నంద్యాల: ‘టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు రావు... మీరే తెలుసుకోండి’.. ఇబ్బంది పడొద్దంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వృద్ధులను బెదిరించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటి ఫలాలను అనుభవించే వాళ్లు ఓట్లు ఎందుకు వేయరని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని 24వ వార్డు కౌన్సిలర్ దిలీప్ ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ వసతిగృహంలో వృద్ధుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఉపఎన్నిక ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్యఅతిథిగా హాజరై భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని, లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం వసతిగృహంలో పనిచేసే ఉద్యోగులను ఓట్లు అడిగి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. -
వారిద్దరినీ విడిచిపెట్టొద్దు
- శివకుమార్, ఎమ్మెల్యే బొండాను శిక్షించాలని విపక్షాల డిమాండ్ - చిన్నారి సాయిశ్రీ మృతిపై వెల్లువెత్తిన సానుభూతి సాక్షి, అమరావతి బ్యూరో: చికిత్సకు నోచుకోక దయనీయ స్థితిలో విజయవాడలో ప్రాణాలు విడిచిన బాలిక సాయిశ్రీ ఉదంతం సభ్యసమాజాన్ని కలచివేసింది. అందుకు కారకులైన ఆమె తండ్రి మాదంశెట్టి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వెల్లువెత్తింది. సాయిశ్రీపై తండ్రి శివకుమార్ లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని తల్లి సుమశ్రీ కన్నీటి పర్యంతమవుతూ చెప్పడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. వైఎస్సార్ సీపీతోపాటు ఇతర ప్రతిపక్షా లు, ప్రజాసంఘాలు సుమశ్రీకి సంఘీభావం గా కదలివచ్చాయి. శివకుమార్, బొండా ఉమాపై చర్య తీసుకోవాలని డిమాండు చేస్తూ విజయవాడలో ర్యాలీ నిర్వహించాయి. అంతిమ యాత్రలో ఉద్రిక్తత: సాయిశ్రీ మృతదేహం అంతిమయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. దుర్గానగర్‌లోని నివాసం నుంచి ప్రజా సంఘాలు వెంట రాగా అంతిమయాత్ర బయలు దేరింది. మొగల్రాజపురంలోని ఎమ్మెల్యే బొండా ఉమా నివాసం సమీపంలో సాయిశ్రీ మృతదేహాన్ని ఉంచి డప్పులు మోగిస్తూ బాధితులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే నివాసం ఎదుట కూడా నిరసన తెలపాలని భావించగా పోలీసులు అడ్డుకున్నారు. స్వర్గపురి శ్మశానవాటిక వద్ద సాయిశ్రీకి దహన సంస్కారాలు నిర్వహించారు. సాయిశ్రీ మృతికి కారకులైన ఆమె తండ్రి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమాపై కఠిన చర్యలు తీసుకోవాలని సుమశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నారి మృతిపై హెచ్చార్సీ సీరియస్ నాంపల్లి : కన్నుమూసిన చిన్నారి సాయిశ్రీ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. -
గూండాగిరీ బాధ్యులపై చర్యలేంటి?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన ఘటనలో బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ సాధారణ పరి పాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్య దర్శి, కమిషనర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు టీడీపీ నేతలైన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, మేయర్ కోనేరు శ్రీధర్‌లకు సైతం నోటీసు లిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూన్ 13కు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల బరితెగింపుపై ‘సాక్షి’లో గత నెల 27న ‘ఐపీఎస్‌పై గూండాగిరీ’ పేరుతో ప్రచురితమైన వార్తా కథనాన్ని చూసి స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకరరావు దీనిని ఏసీజే దష్టికి తీసు కెళ్లారు. దీనిని ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కమిటీకి నివేదించగా, మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు ఏసీజే ‘సాక్షి’ కథనాన్ని పిల్‌గా పరిగణించారు. -
'టీడీపీ' దౌర్జన్యంపై స్పందించిన హైకోర్టు
-
'టీడీపీ' దౌర్జన్యంపై స్పందించిన హైకోర్టు
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై హైకోర్టు స్పందించింది. విజయవాడ ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆయన గన్‌మెన్ దశరథపై టీడీపీ ఎంపీ, కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు దాడి కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. 'ఐపీఎస్‌పై గుండాగిరి' అని ప్రచురితమైన సాక్షి కథనాన్ని పిల్‌గా కోర్టు స్వీకరించింది. వచ్చే మంగళవారం ఈ కేసును ధర్మాసనం విచారణ జరపనుంది. 'నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా' అని విజయవాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని శ్రీనివాస్(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అదే సమయంలో 'ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా..? ఏం బతుకు నీది?' అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను తూలనాడుతూ చిందులు తొక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేశినేని నాని, బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్‌బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ దాదాపు 200 మంది కార్యకర్తలతో కలసి కమిషనర్‌ను విజయవాడ నడిరోడ్డుపై దిగ్బంధించారు. సీనియర్ ఐపీఎస్ అధికారిని దాదాపు రెండు గంటలపాటు నిలబెట్టిమరీ దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు. ఐపీఎస్ అధికారిపై గత నెలలో జరిగిన ఈ దాడి ఘటనను హైకోర్టు సీరియస్‌గా పరిగణించింది. సాక్షి కథనాన్ని పిల్‌గా స్వీకరించిన హైకోర్టు వచ్చే మంగళవారం ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. -
బోండాకు ఇప్పుడు కాపులు గుర్తొచ్చారా..?
గుంటూరు: మంత్రి పదవి ఇవ్వక పోయే సరికి ఇప్పుడు నీకు కాపులు గుర్తొచ్చారా అని బొండా ఉమామహేశ్వరరావును కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. పీసీసీ కార్యదర్శి గోవిందు శంకర శ్రీనివాసన్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే బోండా లాంటి వారి చేత తమను నిత్యం తిట్టించటమే చంద్రబాబు లక్ష్యంగా ఎంచుకున్నారన్నారని ముద్రగడ ధ్వజమెత్తారు. అధికార పార్టీలోని కాపు ప్రజాప్రతినిధులంతా చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. హక్కుల కోసం పోరాడుతుంటే, మద్దతు ఇచ్చిన వారితో తాము కలిసి పోయామని, ప్యాకేజీలకు అమ్ముడుపోయామని అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహనరెడ్డితో రాజకీయ అక్రమ సంబంధం అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నిరూపించాలని సీఎం చంద్రబాబుకు ముద్రగడ సవాలు విసిరారు. లేకపోతే సీఎం పదవికి రాజీనామ చేయాలని డిమాండ్‌చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కూడా కాపు ఉద్యమానికి ఏనాడూ సహకరించలేదని తెలిపారు. కాపు ఉద్యమానికి దూరంగా ఉన్న పవన్‌కళ్యాణ్ లాంటి వారిని బతిమిలాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. బొట్టు పెట్టి పిలవటానికి ఇది ఎవరి ఇంట్లోనో జరుగుతున్న పెళ్లి కాదన్నారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలపాలని పవన్‌కళ్యాణ్‌కి గతంలో ఆహ్వానం పంపినా స్పందించలేదని పేర్కొన్నారు. కొంతమంది రానంత మాత్రన తమ ఉద్యమం ఆగిపోదని స్పష్టం చేశారు. సీఎం చంద్రనాయుడు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతూ విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఆరునెలల్లో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అందిస్తామని , ఏటా రూ.వెయ్యికోట్ల నిధులు మంజూరు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించిన చంద్రబాబు హామిలను తుంగలో తొక్కి కాపులను దారుణంగా మోసగించారని విమర్శించారు. -
ఎమ్మెల్యే బొండాకు చంద్రబాబు షాక్?
విజయవాడ: తాజా కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొండా ఉమామాహేశ్వరరావుపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు కల్పించకుండా కాపుల గొంతు కొస్తున్నారన్న బొండా వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని సమాచారం. మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగిన బొండా ఆదివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండాపై చంద్రబాబు మండిపడినట్టు సమాచారం. మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తారా? అంటూ బొండాను నిలదీసినట్టు తెలిసింది. ఈ సమయంలో బొండాకు చెందిన పలు కబ్జా వివాదాలను సైతం ప్రస్తావించి సీఎం షాక్ ఇచ్చినట్టు సమాచారం. ఆర్టీఏ కమిషనర్ గన్‌మెన్‌పై దాడి చేసినా.. కేసు పెట్టని విషయాన్ని సీఎం గుర్తుచేశారని, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారని సమాచారం. మంత్రివర్గం విషయంలో కాపుల అంశాన్ని వివాదం చేస్తారా? అంటూ చంద్రబాబు బొండాపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
ఎమ్మెల్యే బొండా సంచలన వ్యాఖ్యలు
అమరావతి: తనకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారంటూ విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టు జరగవని వ్యాఖ్యానించారు. కాపులకు అన్యాయం జరగడం తొలిసారి కాదని, మాకు కామనైపోయిందంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. సీఎం ఎటువంటి హామీఇవ్వలేదని, అయినప్పటికీ ఆయన చెప్పినట్టే నడుచుకుంటానని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు 13 జిల్లాల టీడీపీ కార్యకర్తలు బాధ పడ్డారని పేర్కొన్నారు. కొత్త, పాత కలయికలో మంత్రివర్గం ఉందన్నారు. కొత్తవారికి చోటు కోసం నాలాంటి కొందరు త్యాగం చేయాల్సివచ్చిందని వాపోయారు. అయితే ఎమ్మెల్యే బొండాకు కేబినెట్ పదవి రాకుండా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బొండా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని పేర్కొంటున్నారు. -
బేతాళ కథ చంద్రన్యాయం
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! విక్రమార్క! ఈ ప్రశ్నకు తెలిసీ సమాధానం చెప్పకపోతే ‘‘సూరిబాబు సోదరులు’’ ట్రావెల్స్‌లో ప్రయాణం చేసి దుర్మరణం పాలవుదువు గాక! పట్టువదలని విక్రమార్కుడు బజాజ్ బైక్ మీద దూసుకుంటూ వస్తున్నాడు. విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడు నవ్వాడు. ‘ఏంటి విక్రమార్కా ఎప్పుడూ లేంది కొత్తగా బైక్ మీద వస్తున్నావేంటి?’ అని అడిగాడు బేతాళుడు. ‘అవును బేతాళా..! నాకా వయసు మీదకొస్తోంది. ఇదివరకటిలా నిన్ను భుజాలపై మోయాలంటే నా వల్ల కావడం లేదు. ఆయాసం వచ్చేస్తోంది. అందుకే బైక్ అయితే నువ్వు వెనకాల కూర్చుంటావ్ హాయిగా పోవచ్చు’ అన్నాడు విక్రమార్కుడు. చెట్టు కొమ్మపై వేలాడుతోన్న బేతాళుడిని దింపి బైక్ పై వెనక కూర్చోబెట్టుకుని బండి స్టార్ట్ చేశాడు విక్రమార్కుడు. బేతాళుడు మెచ్చుకోలుగా చూసి... ‘అది సరే కానీ... ఇపుడు నీకో కథ చెబుతాను. అలసట తెలీకుండా సావధానంగా విను’ అని చెప్పడం మొదలు పెట్టాడు.‘విక్రమార్కా ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యనే నందిగామలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అపుడు ఆ బస్సు డ్రైవర్‌కి పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే అధికారులు తరలించే ప్రయత్నం చేశారు. ఇలా తప్పు చేస్తే ఎలాగ అని ప్రతిపక్షానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. దాంతో అధికారులనే నిలదీస్తారా అని జగన్ పై కేసులు పెట్టారు. నిన్న కాక మొన్న టిడిపి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో ఆర్టీయే కమిషనర్ కార్యాలయంపైనే దాడికి దిగారు. ఏకంగా గన్‌మెన్‌ని తోసి పారేశారు. ఇంత చేసినా వారిపై ఎలాంటి కేసులూ లేవు. జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టే ముందు మంత్రివర్గమే ప్రత్యేకంగా భేటీ అయి ఆయనపై కేసులు పెట్టాలని తీర్మానించింది. మరి ఆర్టీయే కమిషనర్‌పై దాడి విషయంలో మంత్రివర్గం సమావేశం కూడా కాలేదు. ఒకే ప్రభుత్వం అపుడు అలా. ఇపుడు ఇలా వ్యవహరించడానికి కారణం ఏంటంటావ్? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసీ కూడా చెప్పకపోయావో... నీ బైక్‌తో పాటు నువ్వు కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సు కింద పడిపోతావు’ అని బేతాళుడు హెచ్చరించాడు. విక్రమార్కుడు ఒక్క క్షణం బండి గేర్ మార్చి... ‘బేతాళా.. జగన్మోహన్ రెడ్డి అధికారులను ప్రశ్నించిన ఘటనతో ప్రభుత్వం చేసిన తప్పు బయటపడిపోయింది. దివాకర్ ట్రావెల్స్ టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డిదే కాబట్టి ప్రభుత్వ పరువు పార్టీ ప్రతిష్ఠ కూడా నాశనమవుతాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ భయంతోనే అందరి దృష్టినీ మరల్చడానికి అసలు కేసు పక్కన పెట్టి జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక కేశినేని నాని, బోండా ఉమ విషయానికి వస్తే... వాళ్లిద్దరూ చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం చేశారు. అలాగని వారిని అరెస్ట్ చేశారనుకో అప్పుడూ పార్టీ పరువు పోతుంది. పైగా వాళ్లు సొంత పార్టీ వాళ్లు కాబట్టి కాపాడుకోక తప్పదు. అందుకే వాళ్ల చేత ఉత్తుత్తి సారీలు చెప్పించి చేతులు దులిపేసుకున్నారు’ అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుని సమాధానంతో సంతృప్తి చెందిన బేతాళుడు బైక్‌తో సహా మాయమై చెట్టుకు వేలాడాడు. – నానాయాజీ -
ఎమ్మెల్యేను ప్రశ్నించాడని వేధింపులు!
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పనితీరుపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజవర్గానికి చెందిన ఓ యువకుడి తాజా ఫేస్బుక్ పోస్టు ఇందుకు నిదర్శణంగా కనిపిస్తోంది. ఓ యువకుడు నియోజకవర్గ సమస్యలపై ఫేస్బుక్ పోస్ట్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యేను నిలదీశాడు. ఆ సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. యువకుడికి మద్దతుగా మెసేజ్‌లు రావడాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వర్గం జీర్ణించుకోలేకపోయింది. బోండా ఉమా అభిమానులమన్న పేరుతో యువకుడికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతు చూస్తామంటూ కొందరు, అసభ్య పదజాలంతో మరికొందరు ఆ యువకుడిని వేధింపులకు గురిచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి దీక్ష
♦ ఎంపీ కేశినేని బృందాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ ♦ భగ్నం చేసిన మార్షల్స్, పోలీసులు.. ♦ మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆరు గంటల నిర్బంధం సాక్షి, అమరావతి: వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీ ఆవరణలో చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ఉదయం చేపట్టిన దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ నగరంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యాన్ని నిర్బంధించి, దూషిస్తూ దాడికి యత్నించిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఉదయం 8.50 గంటలకు నాలుగో నంబరు గేటు లోపల అసెంబ్లీ ఎదురుగా దీక్ష చేపట్టారు. ఆయనకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. హైడ్రామా నడుమ దీక్ష భగ్నం నల్ల దుస్తులు ధరించి దీక్ష చేపట్టిన చెవిరెడ్డి వద్దకు ఉదయం 10.05 గంటలకు చీఫ్ మార్షల్ గణేష్ నేతృత్వంలోని బృందం వచ్చిం ది. ఇక్కడ దీక్ష చేసేందుకు వీలు లేదని విరమించాలని కోరారు. అదే సమయంలో గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణనాయక్, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్‌లు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. రోప్ పార్టీ సహాయంతో మార్షల్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఎత్తుకొని గేటు బయట ఉంచిన వాహనంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా, ఆయన గట్టిగా ప్రతిఘటించి గేటు ముందు భైఠాయించారు. అయినా పోలీసులు, మార్షల్స్ అందరినీ పక్కకు నెట్టి 10.25 గంటలకు చెవిరెడ్డిని పోలీస్ వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిని పోలీసులు మంగళగిరి పోలీస్టేషన్లో ఆరు గంటలపాటు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, తదితరులు పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. వారిని స్టేషన్ ప్రాంగణంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం 4.15 గంటలకు చెవిరెడ్డిని విడిచిపెట్టారు. మీకో చట్టం... నాకో చట్టమా? టీడీపీ నేతలకు ఒక చట్టం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేనైన తనకు ఓ చట్టం అమలు చేస్తారా అంటూ సీఎం చంద్రబాబును చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు.ఈ మేరకు ఆయన సీఎంకు ఓ బహిరంగ లేఖరాశారు. -
సారీతో సరి
‘దేశం’ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గూండాగిరీ.. ⇒ సర్కారు తీరుపై అంతా విస్మయం ⇒ ఇదేం ప్రజాస్వామ్యం అంటూ అధికార వర్గాల మండిపాటు ⇒ దోషులను కాపాడటానికి స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ⇒ ‘సారీ’తో వివాదం ముగిసిందని కమిషనర్‌తో చెప్పించిన వైనం సాక్షి, అమరావతి: నడి రోడ్డులో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నిర్బంధించి.. ఆయనపై గూండాగిరీకి ప్రయత్నించి, అడ్డొచ్చిన ఆయన గన్‌మెన్‌పై దాడికి దిగిన టీడీపీ ఎంపీ కేశినేని బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. అధికారం అండ చూసుకుని నడిబజారులో పేట్రేగిన కేశినేని ట్రావెల్స్ అధినేత, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి సింపుల్‌గా ‘సారీ’తో సరి పెట్టించింది. విజయవాడ వీధుల్లో ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకుని నోటికొచ్చినట్లు దుర్భాషలాడితే కేసు కూడా పెట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇదేం ప్రజాస్వామ్యమని, ఇలాగైతే రాష్ట్రంలో ఉద్యోగాలు చేయలేమంటూ అధికార వర్గాలు మండిపడుతున్నాయి. దౌర్జన్యం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించడం భవిష్యత్‌లో ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఇప్పటికీ న్యాయం చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చంద్రబాబు వనజాక్షినే తప్పు పట్టారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ తీరు పట్ల ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పౌర సమాజం ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. ఆదివారం ఆద్యంతం హై డ్రామా టీడీపీ నేతలు దాడికి పాల్పడి అత్యంత హేయంగా కమిషనర్‌ను దూషించిన సంఘటనపై ఆదివారం ఆద్యంతం పెద్ద హై డ్రామానే నడిచింది. దాడికి పాల్పడిన వారు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత.. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి వివాదాన్ని పూర్తిగా పక్కదారి పట్టించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు పెట్టించిన చంద్రబాబు.. తమ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏకంగా ఐపీఎస్ అధికారిపై తిట్ల దండకం ప్రారంభించి గన్‌మెన్‌పై ఏకంగా దాడి చేసినా ‘సారీ’తో దారి మళ్లించారు. ఈ ఘటనపై ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ భవన్లో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ సమావేశమైంది. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గన్‌మెన్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యే బొండా ఉమ, ఎంపీ కేశినేని నానిలపై కేసులు నమోదు చేయాలని, లేకుంటే పెన్‌డౌన్‌కు సిద్ధమన్నారు. ప్రభుత్వమంటే ఇదేనా? ప్రభుత్వం అంటే గూండాల్లా వ్యవహరించడమా? అని ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? ఉద్యోగులు ప్రశాంతంగా విధులకు హాజరు కావాలా? వద్దా? అని నిలదీసింది. ఓ సీనియర్ ఐపీఎస్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పోలీస్ అధికారులు, వారి సంఘం ఏం చేస్తున్నారని మండిపడింది. సాయంత్రంలోగా కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఆ తర్వాత రవాణా ఉద్యోగులు, అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాంను కలిసేందుకు బయలుదేరారు. సీఎస్‌ను కలిసేందుకు వెళుతుండగా, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు నేరుగా సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. తన పట్ల ఎమ్మెల్యే బొండా ఉమ, కేశినేని వ్యవహరించిన తీరును కమిషనర్.. చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వివాదాలు మంచిది కాదని ముఖ్యమంత్రి.. కమిషనర్‌కు సూచించినట్లు తెలిసింది. కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తన కార్యాలయంలో కూర్చొంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముగ్గురు వచ్చి క్షమాపణలు చెబుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో రవాణా ఉద్యోగులు, కమిషనర్ వెనుదిరిగి రవాణా కార్యాలయానికి చేరుకున్నారు. కొద్ది సేపటికే కేశినేని నాని, బొండా ఉమ, బుద్దా వెంకన్నలు ఆర్టీసీ హౌస్‌కు చేరుకుని కమిషనర్ బాలసుబ్రమణ్యంకు క్షమాపణలు చెప్పారు. వివాదం ముగిసినట్లే: బాలసుబ్రహ్మణ్యం కేశినేని నాని, బొండా ఉమ, బుద్దా వెంకన్నలు వచ్చి క్షమాపణలు చెప్పారని, అవగాహనా రాహిత్యంతోనే వారు అలా వ్యవహరించారని రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరైనా అలానే వ్యవహరిస్తారని, తన సెక్యూరిటీ సిబ్బంది, రవాణా శాఖ అధికారుల నిబద్దతకు గర్వపడుతున్నాన న్నారు. ఒక ట్రావెల్స్ బస్సు ప్రమాదం విషయంలో వివాదం రేగిందని, బస్సులో సాంకేతిక లోపం ఉందని నివేదిక ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని అనుచరుడు పట్టాభి అనే వ్యక్తి ఒత్తిడి చేశారన్నారు. తాము రూల్స్ ప్రకారం నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పిన తర్వాత వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం సరికాదని, ఇంతటితో వివాదం ముగిసినట్లేనన్నారు. మీ గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బొండా ఉమా చేయి చేసుకున్నందున చట్టపరమైన చర్యలు ఏమీ ఉండవా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు రక్షణగా నిలిచిన గన్‌మెన్‌కు న్యాయం చేస్తానని, చర్యలు ఎలా ఉంటాయో మీరే చూస్తారంటూ ముక్తాయించారు. తనపై ఇంతలా, ఇలా దాడి జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర చర్చ సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రమణ్యం ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పని చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా, ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా చక్కదిద్దగల దిట్టగా ఆయనకు పేరుంది. మావోయిస్టులు, సెటిల్మెంట్ గ్యాంగ్, అరాచక శక్తులకు టెర్రర్ పుట్టించే ట్రాక్ రికార్డు ఉన్న పోలీస్ అధికారి బాలసుబ్రమణ్యంనే కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు టార్గెట్ చేయడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
చంద్రబాబూ.. ఇదేం వైఖరి..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మహిళలనీ చూడకుండా దుర్భాషలాడుతున్నారు. చేయి చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు మహిళలు, అధికారులు కంటతడి పెట్టిన సందర్భాలున్నాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా.. అధికార పార్టీ నాయకులను వెనకేసుకు వచ్చింది. అదే ప్రతిపక్ష నాయకుల విషయానికి వస్తే వారు ప్రశ్నిస్తేనే లేనిపోని కేసులు పెట్టి వేధిస్తోంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాద దుర్ఘటనలో 12 మంది మరణించినపుడు.. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లిన సందర్భంగా పోస్టుమార్టమ్ నివేదిక కోరిన విషయంలో కలెక్టర్‌తో ఇష్టానుసారం ప్రవర్తించారంటూ ప్రభుత్వం నానా రభస సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం ఏర్పాటు చేయించారు. వైఎస్ జగన్‌ను తప్పుపడుతూ, జరిగిన ఘటనను ఖండించాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అదే అధికార పార్టీ నాయకులు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. తాజాగా రవాణ శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుల దాడి ఘటనే ఇందుకు ఉదాహరణ. టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు ఇద్దరు ఏకంగా ఒక ఐపీఎస్ అధికారితో ఇష్టానుసారంగా మాట్లాడినా ప్రభుత్వం స్పందించలేదు. ఐఏఎస్ అధికారుల తరహాలోనే ఈ విషయంలో ఐపీఎస్ అధికారుల సమావేశం జరగలేదు. ఈ ఘటనను ముఖ్యమంత్రి గానీ, రవాణా శాఖ మంత్రిగానీ ఎక్కడా ఖండించలేదు. ఇదే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అధికారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్ వనజాక్షి విషయంలో ఇష్టానుసారం వ్యవహరించినప్పటికీ చర్యలు లేకపోగా చంద్రబాబు అసెంబ్లీలో ఆ ఘటనను సమర్థించుకున్నారు. కాల్ మనీ కేసు, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు, అనంతపురం జిల్లాలో మహిళపై దాడి.. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా చంద్రబాబు నిందితులపై తగిన చర్యలు తీసుకోలేదని, కొందరిని కాపాడే ప్రయత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న ఉద్దేశంతోనే బాలసుబ్రహ్మణ్యం పై దాడికి సంబంధించి ఆదివారం హడావిడి చేసినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను పిలిపించి చంద్రబాబు మందలించినట్టు, దానిపై వారు జరిగిన దానికి చింతిస్తున్నామంటూ ప్రకటన చేయడం అంతా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న భయంతోనే చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం అనంతరం వారు బాలసుబ్రహ్మణ్యం కార్యాలయానికి వెళ్లి కలుసుకోవడం, ఈ ఘటనను తేలిక చేసే ఉద్దేశంతోనే చేసినట్టుగా ఉందని వారంటున్నారు. -
బోండా, నానిలపై కేసు నమోదు చేయాలి
శ్రీకాకుళం: అధికారులను దూషించడం, దాడి చేయడం వంటి నేరంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరావులపై పోలీసులు కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నాయకుడు ధర్మాన ప్రసాద రావు డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. క్షమాపణ, శిక్ష అన్నది న్యాయస్థానం చూసుకుంటుందని అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన మరునాడే టీడీపీ కార్యకర్తలు, నాయకులకు చట్టాలు, నిబంధనలు వర్తించవని చంద్రబాబు అధికారులకు చెప్పడం వలనే రాష్ట్రంలో ఇటువంటి అనర్ధాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు నిజాయితీగా తమ పనులు తాము చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. -
క్షమాపణలు చెప్పిన కేశినేని, బోండా ఉమా
విజయవాడ: టీడీపీ నాయకులు కేశినేని నాని, బోండా ఉమమహేశ్వరావు దౌర్జన్యం చేసిన ఘటనపై రవాణ శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొడవ చేసినవారు క్షమాపణలు చెప్పారని, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడారని చెప్పారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కింద పడి ఓ మనిషి చనిపోయారని, దీనిపై పోలీసులు మమ్మల్ని వివరాలు కోరారని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రవాణ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారని, వాహనంలో మెకానికల్ డిఫెక్ట్ లేదని రాసిచ్చారని చెప్పారు. పోలీసులు మళ్లీ జన్యునటీ సర్టిఫికెట్ కావాలని కోరగా, అది కూడా ఇచ్చామని తెలిపారు. ఈ విషయం వాళ్లకు అర్థం కావడం లేదని టీడీపీ నాయకులను ఉద్దేశిస్తూ అన్నారు. తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఎంపీ కేశినేని నాని పేరుతో ఆయన అనుచరుడు పట్టాభి తమపై పదేపదే ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. నిబంధనల ప్రకారమే నివేదిక ఉంటుందని స్పష్టం చేశామని, దీంతో ఎంపీని పిలిచి వివాదం సృష్టించారని చెప్పారు. తన గన్‌మెన్‌పై దాడికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయో మీరో చూస్తారని అన్నారు. తనకు రక్షణ కల్పించిన గన్‌మెన్‌కు న్యాయం జరిగేలా చూస్తానని, తనపై ఇలాంటి దౌర్జన్యం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. అంతకుముందు టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమా రవాణ శాఖ కమీషనర్ కార్యాలయానికి వెళ్లి కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. రవాణ శాఖ కమీషనర్‌కు క్షమాపణలు చెప్పామని కేశినేని, బోండా ఉమా చెప్పారు. -
నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం
-
బస్సులు ఆపేస్తా.. పార్టీ ముఖ్యం: కేశినేని నాని
విజయవాడ: రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి ఘటన దురదృష్టకరమని టీడీపీ నాయకులు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వరావు అన్నారు. నిన్న జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబును కలిసి వారు వివరణ ఇచ్చారు. సీఎంతో భేటీ తర్వాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. సీఎం తమను మందలించారని చెప్పారు. రవాణా శాఖ కమీషనర్ ను కలిసి విచారం వ్యక్తం చేస్తామని, తమకు ఎలాంటి బేషజాలు లేవని అన్నారు. తాము ఎవరినీ దూషించలేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తన బస్సులను ఆపేయడానికి సిద్ధమని, తనకు పార్టీ ముఖ్యమని ప్రకటించారు. పొరపాట్లు జరిగివుంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
ఐపీఎస్‌పై టీడీపీ దాష్టీకం
‘దేశం’ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వైర విహారం రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఎంపీ కేశినేని బృందం దుర్భాషలు ⇒ గడ్డి తింటున్నావు... ఎంపీ అంటే లెక్కలేదా? అంటూ తిట్లదండకం ⇒ కొమ్ములొచ్చాయా.. ఏం బతుకు నీదంటూ ఎమ్మెల్యే బొండా చిందులు ⇒ ట్రావెల్స్ కేసులో తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ఎంపీ హుకుం ⇒ కమిషనర్ గన్‌మ్యాన్‌పై దాడి చేసిన బొండా సాక్షి, అమరావతి బ్యూరో / విజయవాడ : ‘నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా’ అని విజయ వాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని శ్రీనివాస్(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు. ‘ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా ...? ఏం బతుకు నీది?’ అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను తూలనాడుతూ చిందులు తొక్కారు. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్‌బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ దాదాపు 200 మంది కార్యకర్తలతో కలసి శనివారంనాడు కమిషనర్‌ను విజయ వాడ నడిరోడ్డుపై దిగ్బంధించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం ను దాదాపు రెండుగంటలపాటు నిలబెట్టిమరీ దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు. పైగా కమిషనరే క్షమాపణ చెప్పాలంటూ ఆయన్ని ఘెరావ్ చేశారు. పోలీస్ డీసీపీ పాల్‌రాజ్, రవాణా శాఖ డీటీసీ మీరా ప్రసాద్‌లతోపాటు పలువురు అధికారులు ఎంతగా ప్రాధేయపడినా వెనక్కితగ్గలేదు. అధికార టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ ఘటనతో ప్రభుత్వ యంత్రాంగం నిర్ఘాంతపోయింది. కమిషనర్‌పై ఎంపీ ఒత్తిడి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు విజయవాడ ఆటోనగర్ వద్ద ఈ నెల 22న ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. దీంతో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును పోలీసులు సీజ్ చేసి విచారణ కోసం విజయవాడ రవాణాశాఖ ఉప కమిషనర్(డీటీసీ) కార్యాల యానికి పంపారు. రవాణా శాఖ అధికారులు ఆ బస్సు కండిషన్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ ఫైలును పరిశీలించేందుకు రవాణా శాఖ కమిషనర్ శనివారం విజయ వాడ బందరురోడ్డులోని డీటీసీ కార్యాలయా నికి వచ్చారు. ఇంతలో ఎంపీ కేశినేని నాని ప్రధాన అనుచరుడు పట్టాభి అక్కడకు చేరుకు న్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుపై నివేదికను తాము చెప్పినట్లు రూపొందించాలని పట్టాభి అక్కడి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్పటికే దాదాపు తయారైన నివేదికను మార్చి వేసి తాము సూచించినట్లు తయారు చేయాలని కేశినేని ఆదేశించారని కూడా పట్టాభి చెప్పినట్లు సమాచారం. ‘మాకు నిబంధనలు తెలుసు. నివేదిక ఎలా తయారు చేయాలో అలా చేస్తాం. ఇందులో మీరు ఒత్తిడి తేవడం సరికాదు’అని కమిషనర్ తన అభిప్రాయాన్ని అతనికి స్పష్టం చేశారు. నడిరోడ్డుపై కేశినేని వీరంగం... ఈ సమాచారం తెలుసుకున్న కేశినేని నాని తానే నేరుగా రంగంలోకి దిగారు. దాదాపు 200మంది టీడీపీ కార్యకర్తలతోసహా డీటీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే కమిష నర్ తన పని ముగించుకుని వాహనంలో బయలుదేరారు. కేశినేని తన వాహనాన్ని నేరుగా కమిషనర్ వాహనానికి ఎదురుగా నిలిపారు. వెంటనే కిందకు దిగి కమిషనర్ వాహనాన్ని తన అనుచరులతో చుట్టుముట్టి గట్టిగా కేకలు వేయసాగారు. వాహనం దిగిన కమిషనర్‌ను టీడీపీ కార్యకర్తలు అంతా చుట్టు ముట్టి కదలనీయకుండా చేశారు. ‘నేను వస్తు న్నానని తెలిసి వెళ్లి పోతున్నావా...? ఏం టీడీపీ ఎంపీ అంటే ఆ మాత్రం గౌరవం, భయం లేవా...? అంతా నీ ఇష్టమేనా?’ అని కేశినేని తీవ్రస్థాయిలో కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో కమిషనర్ నిశ్చేష్టులయ్యారు. ఆయనకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కేశినేని తీవ్రస్థా యిలో దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ‘నువ్వు గడ్డి తింటున్నావు. నీ సంగతి తేలుస్తా’ అని పెద్ద పెట్టున కేకలు పెట్టారు. అంతలోనే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్పొరేటర్లు, ఇతర కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారు కూడా కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలతో విరుచుకుపడ్డారు. కేశినేని నాని అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి బంధువు అనిల్‌రెడ్డికి చెందిందంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయ త్నం చేయడం విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతు న్నప్పుడు మాత్రం జగన్ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. గన్‌మ్యాన్‌పై ఎమ్మెల్యే బోండా దాడి తన మాట విననందుకు కమిషనర్ తనకు క్షమాపణ చెప్పాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. లేకపోతే అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. బొండా ఉమ కూడా తీవ్రస్థాయిలో కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీకు ఏమైనా కొమ్ములున్నాయా...? నువ్వు ఏమైనా దిగి వచ్చావా? ఏం బతుకు నీది?’ అని విరుచుకుపడ్డారు. అదే ఊపులో బొండా ఉమ.. కమిషనర్ మీదకు రాబోయా రు. దీన్ని గమనించిన కమిషనర్ గన్‌మ్యాన్ ఆయనకు అడ్డంగా వచ్చారు. దీంతో బొండా ఆగ్రహంతో ఆ గన్‌మ్యాన్‌పై దాడి చేశారు. పరిస్థితి దాదాపు అదుపుతప్పి కమిషనర్, ఇతర సిబ్బందిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి సిద్ధపడేంతవరకు వచ్చింది. విజయవాడ రవాణా శాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్ దాదాపు ఐదారు సార్లు చేతులు ఎత్తి నమస్కరిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలకు క్షమాపణలు చెబుతూ కమిషనర్‌ను వదిలేయాలని ప్రాధేయపడ్డారు. అధికారుల దుస్థితి చూసి అంతా అవాక్కయ్యారు. విజయవాడ పోలీస్ డీసీపీ పాల్‌రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేశినేని, టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను శాంతించమని ప్రాధేయపడ్డారు. సోమవారం విధుల బహిష్కరణ తమ కమిషనర్‌పైనే టీడీపీ నేతల చౌకబారు విమర్శలు చేయడం, గన్‌మ్యాన్‌పై చేయి చేసుకోవడంపై రవాణా అధికారులు ఆందోళ నకు దిగనున్నారు. ఐజీ స్థాయి అధికారిపైనే ఈ మాదిరిగా వ్యవహరించిన టీడీపీ నేతలు కేశినేని, బొండా ఉమాలపై పోరు బాట పడతామని, ఆదివారం కార్యాచరణ ప్రకటిస్తామని రవాణా అధికారుల సంఘం నేత ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ప్రాథమికంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో విధులు బహిష్కరిస్తామని పేర్కొన్నారు. సొంత వ్యాపారం కోసమే గూండా గిరీ.. ట్రావెల్స్ రంగంలో ఉన్న ఎంపీ కేశినేని సొంత వ్యాపారం కోసమే రవాణాశాఖ కమిషనర్‌తో వివాదం పెట్టుకున్నారని రవాణా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన పోటీ ట్రావెల్స్ ఆరెంజ్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయాలని కేశినేని నాని, అతని అనుచరులు రవాణా శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేశారు. దీంతో ఆరెంజ్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకే కేశినేని దాడులు చేయిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించి ఆలిండియా పర్మిట్లు పొందిన తమ బస్సులపై దాడులు చేయడం సరికాదని ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం ఏపీ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి తెచ్చింది. తెలంగాణాకు చెందిన తమను ఇలా వేధించడం సరికాదని వారు అభ్యర్థించారని సమాచారం. దాంతో ఏకపక్షంగా కేసులు నమోదు చేయవద్దని అధికారులకు కమిషనర్ సూచించినట్లు సమాచారం. ఈ లోగా విజయవాడలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. ఈ కేసులో తాను చెప్పినట్లు నివేదిక రూపొందించాలని ఎంపీ కేశినేని కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చారనేది విశ్వసనీయ సమాచారం. తాను కలిసేందుకు వస్తానని ఎంపీ ఫోన్లో కోరగా బాలసుబ్రహ్మణ్యం స్పందించలేదని ఆయన వర్గీయులు చెపుతున్నారు. దీంతో కేశినేని మందీమార్బలంతో కలిసి కమిషనర్‌ను కలిసేందుకు ఆర్టీసీ భవన్‌కు వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో కృష్ణా డీటీసీ కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉన్న బాలసుబ్రహ్మణ్యంపై నోరు పారేసుకున్నారు. గతంలోనూ ఆరెంజ్ ట్రావెల్స్ వ్యవహారంలో జేసీ ప్రభాకర్, తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ మధ్య పెద్ద దుమారమే నడిచింది. నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయి: కమిషనర్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. కమిషనర్ దగ్గరకు వచ్చి ఎంపీకి క్షమాపణ చెబితే విడిచిపెడతామని చెప్పారు. లేకపోతే పరిస్థితి చెయ్యిదాటిపోతుందని హెచ్చరించారు. దీనిపై కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా డ్యూటీ నేను చేశా. నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తా యి. మీడియా ముందు మాట్లాడటం ఇష్టం లేదు’ అని అన్నారు. అనంతరం డీసీపీ పాల్‌రాజ్ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఒప్పించి.. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ కార్యాల యానికి తీసుకు వెళ్లారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చర్చిం చారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారమైందని తెలిపారు. -
భారతీయులు అప్రమత్తంగా ఉండాలి
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా మధురానగర్ ( విజయవాడ సెంట్రల్ ): విదేశాలలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచించారు. స్థానిక మధురానగర్ బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరికి నిరసనగా మానవహారం కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. కూచిభోట్ల శ్రీనివాస్ హత్య భావితరాలకు హెచ్చరికగా గుర్తించాలని అన్నారు. అమెరికాలో పరిస్థితులు మారిన నేపథ్యంలో అక్కడ నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని, అమెరికా వెళ్లదలుచుకున్నవారు కొంతకాలం ఆగి చూడాలన్నారు. విజయకృష్ణ సూపర్‌బజార్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏఎంసీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్, 45వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ సినిమాలో చంద్రబాబును హీరోగా చూపిస్తే..
హైదరాబాద్: నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో చంద్రబాబును హీరోగా చూపిస్తే న్యాయపోరాటం చేస్తానని లక్ష్మీపార్వతి ప్రకటించారు. తన భర్త జీవిత చరిత్ర ఆధారంగా తీసే సినిమాలో వాస్తవాలు వక్రీకరిస్తే మౌనంగా ఉండబోనని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. తన తండ్రిపై సినిమా తీస్తానని ఎన్టీఆర్ కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని వెల్లడించారు. అయితే 1995లో టీడీపీలో జరిగిన పరిణామాలను ఎలా చూపిస్తారనే దానిపై లక్ష్మీపార్వతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మీపార్వతిని విలన్ గా చూపిస్తారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ‘నిజ జీవితంలో విలన్ గా వ్యవహరించిన లక్ష్మీపార్వతిని సినిమాలోనూ ప్రతినాయకిగా చూపిస్తారు. ఎన్టీఆర్ ను ప్రజలకు ఆమె దూరం చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు’ అని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి తనకు కూడా కొన్ని విషయాలు తెలియవని, ఆయనపై సినిమా తీయాలంటే మామూలు విషయం కాదని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని సినిమాగా మలుస్తామని చెప్పారు. 1995, ఆగస్టులో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. సొంత అల్లుడు తనను వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తూ ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. 72 వయసులో 1996, జనవరిలో ఎన్టీఆర్ కన్నుమూశారు. -
తుగ్లక్ పాలనకు తెరతీస్తే ఊరుకోం: ఎమ్మెల్యే బోండా
విజయవాడ: బంగారంపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడంపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్రం అత్యుత్సాహానికి పోయి మహిళల బంగారం జోలికి వస్తే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తాత, ముత్తాతల కాలం నుంచి లెక్కలు అడిగి తుగ్లక్ పాలనకు తెరతీస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. బంగారం, నగల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులపై మహిళాలోకం మండిపడుతోంది. వివాహితకు 500 గ్రాములు, పెళ్లికాని యువతికి 250 గ్రాములు.. పురుషుడికి 100 గ్రాముల బంగారం వరకే అనుమతిస్తామని కేంద్రం గురువారం ప్రకటించింది. పరిమితికి మించి బంగారం ఉంటే లెక్కలు చూపాల్సిందేనని ఆదేశించింది. వారసత్వ బంగారం, వ్యవసాయ ఆదాయంతో కొన్న బంగారం ఎంతైనా ఉండొచ్చని పేర్కొంది. లెక్కచెప్పిన బంగారానికి పరిమితి లేదని స్పష్టం చేసింది. -
తుగ్లక్ పాలనకు తెరతీస్తే ఊరుకోం
-
'పవన్ చెప్పిన విషయాలను పరిశీలిస్తున్నాం'
విజయవాడ: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ముద్రగడ పాదయాత్రపై శనివారం విజయవాడలో హోంమంత్రి, ఎమ్మెల్యే బోండా మీడియాతో మాట్లాడారు. ముద్రగడ ఉద్యమంలో పాల్గొంటే కేసుల్లో ఇరుక్కుని జైలుకు కెళ్తారని అన్నారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 144 సెక్షన్‌పై విచారించి నిర్ణయం తీసుకుంటామని చినరాజప్ప, బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కన్ను పడితే చాలు కబ్జా యత్నం
-
'బోండా' చర్యలపై బ్రాహ్మణుల ఆందోళన
విజయవాడ: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీరును నిరసిస్తూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్థానిక మాచవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన సంఘాలు జగన్మోహనరాజును బోండా ఉమ అరెస్టు చేయించారని ఈ సందర్భంగా ఆందోళన కారులు ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు చేయాలని నిలదీసినందుకే తమ నేతను అరెస్టు చేయించారని తెలిపారు. బోండా ఉమ ప్రోద్బలంతోనే కార్పొరేషన్ సీఈవో అభిజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వారన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను జగన్మోహన రాజు జరిపిస్తున్నాడనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారన్నారు. జగన్మోహన రాజును వెంటనే విడుదల చేయకుంటే ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కృష్ఱారావు ఈ విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే బోండా ఉమాపై కోగంటి సత్యం ఫైర్
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన విజయవాడలో డుండి గణేష్‌ను దర్శించుకున్నారు. డుండి గణేషుడికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోండా ఉమాపై కోగంటి సత్యం నిప్పులు చెరిగారు. డుండి గణేష్ ఉత్సవాలను దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే బోండా ఉమా గుండాలా వ్యవహరించారంటూ మండిపడ్డారు. అధికార పార్టీ బలాన్ని ఉపయోగించి తనను తప్పుడు కేసుల్లో ఇరికించినట్టు విమర్శించారు. ఎమ్మెల్యే బోండా రౌడీయిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని కోగంటి సత్యం తెలిపారు. -
కోగంటి సత్యం మనుషులు నన్ను చంపుతారేమో!
గణేశ్ సేవాసమితి సాక్షిగా విజయవాడలో రాజకీయాలు మొదలయ్యాయి. సేవాసమితి మీద ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం వర్గాల మధ్య మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. డూండీ గణేశ్ సేవాసమితి గౌరవ అధ్యక్ష పదవి నుంచి కోగంటి సత్యాన్ని తొలగించి... ఆ పదవిని బోండా ఉమాకు కట్టబెడుతూ కమిటీ రిజిస్ట్రేషన్ చేసింది. దాంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కమిటీ కార్యకలాపాలకు అడ్డొస్తే ఎవరినైనా జైలుకు పంపుతానంటూ బోండా ఉమా హెచ్చరించారు. అయితే, గత ఏడాది సేకరించిన విరాళాల్లో రూ. 30 లక్షలు స్వాహా చేశారని కోగంటి సత్యం ఆరోపించారు. ఇంతలో.. కోగంటి సత్యం వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఉమా వర్గానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఒక్కసారిగా విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. రాకేష్ ఫిర్యాదు మేరకు కోగంటి సత్యాన్ని విచారణకు పిలిపించిన సూర్యారావుపేట పోలీసులు.. ఆయనను అరెస్టు చేశారు. వెంటనే సత్యం వర్గీయులు కూడా పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అటు బోండా ఉమా వర్గీయులు కూడా పోలీసు స్టేషన్ వద్ద మోహరించారు. ఉమా, సత్యం వర్గీయుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడం, వ్యవహారం అరెస్టుల వరకు వెళ్లడంతో అసలు ఈసారి డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు సక్రమంగా సాగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ గణేశ్ కమిటీ కోసం 8,500 కిలోల లడ్డుతో పాటు, వినాయకుడి చేతిలో ఉంచేందుకు మరో వెయ్యి కిలోల లడ్డూను తాము కానుకగా అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్ యజమాని మల్లిబాబు ఇప్పటికే చెప్పారు. ఈలోపు ఈ వివాదాలు ఏ మలుపు తిరుగుతాయోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బొండా.. రాజకీయ గూండా
వ్యాపారవేత్త కోగంటి సత్యం విజయవాడ కల్చరల్ : ‘బొండా ఉమా ఓ రాజకీయ గూండా. తన ఆధిపత్యం కోసం ఎంతటి పనైనా చేస్తాడు.’ అని వ్యాపారవేత్త కోగంటి సత్యం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డూండీ గణేశ్ సేవా సమితి చీలిక నేపథ్యంలో శుక్రవారం సంగీత కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినాయక ఉత్సవాల్లో రాజకీయాలు చోటుచేసుకోవడం శుభం కాదన్నారు. మొదటి నుంచి బొండా ప్రవర్తన వివాదాస్పదంగానే ఉందని, ఘంటసాల సంగీత కళాశాలలో తన ఆధిపత్యం సాగించడానికి సమితిలోని పాత సభ్యులను బలవంతంగా బయటకు పంపడానికి కుట్రలు పన్నాడని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో రూ.30లక్షలు దారి మళ్లించిన వ్యక్తిని చేరదీయడం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయన్నారు. గత ఏడాది ఉత్సవ కమిటీ సభ్యుడిగా ఉన్న పోతిన రాము మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా సేవా సమితి మారిందని, ప్రజలతో మమేకం కావాల్సిన వ్యక్తి ఒక సామాజికవర్గానికి కొమ్ముకాయడం మంచిది కాదని హితవు పలికారు. సమావేశంలో సంస్థ సభ్యులు ఫణిరాజ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో ఎమ్మెల్యే బొండా కలకలం
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్లెక్సీలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఆయన పెట్టించిన ప్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ గుర్తు, సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోలు లేకుండా ప్లెక్సీలు తయారు చేయించారు. పవన్ కళ్యాణ్, తన ఫొటోలు మాత్రమే ప్లెక్సీల్లో ఉండడంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అధినేత, పార్టీ గుర్తు లేకుండా పవన్ తో తననొక్కడి ఫొటోలు మాత్రమే వేయించుకోవడంతో ఎమ్మెల్యే బొండా వ్యవహారంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ ఎంపీలు ఏమాత్రం చిత్తశుధ్ధి ప్రదర్శించడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించిన నేపథ్యంలో ఎమ్మెల్యే బొండా ప్లెక్సీలు పెట్టించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. -
'విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు పెంచాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ చేసిన విభజన హామీ చట్టాలను బీజేపీ అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ధ్వజమెత్తారు. పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో బోండా ఉమ విలేకరులతో మాట్లాడారు. నాడు పార్లమెంట్లో ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇస్తామని బీజేపీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముష్టి వేసినట్టు రాష్ట్రానికి రూ.2,500 కోట్లు ఇచ్చారని విమర్శించారు. తమ సహనానికి ఓ హద్దు ఉందనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటామని బోండా ఉమ తెలిపారు. -
బొండా.. క్షమాపణ చెప్పు
మహిళలపైనా ఎమ్మెల్యేగా నీ ప్రతాపం చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యం వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విజయవాడ (గాంధీనగర్) : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు సిగ్గు, శరం ఉంటే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కండ్రికలోని 59వ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా కార్పొరేటర్‌పై ప్రతాపం చూపడం సరికాదన్నారు. ఇళ్ల జాబితా అడిగితే ఇవ్వకపోగా, వేలు చూపి ఏకవచనంతో సంబోధిస్తూ దుర్భాషలాడడం ఎమ్మెల్యే స్థాయికి తగదని హితవు పలికారు. ఇళ్ల కేటాయింపుల్లో అవినీతిని ప్రశ్నిస్తే దూషించడం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా డివిజన్ ప్రజలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తొలుత డివిజన్లోని మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ‘తమకు రేషన్ ఐదు రోజులే ఇస్తున్నారని, నీళ్లు రావడం లేదని, పింఛను సరిగా అందడం లేదని, ఇళ్లు ఇస్తామన్నారు. ఏ ఒక్కరికీ మంజూరు కాలేదు, ఆ పార్టీ కార్యకర్తలకు రెండేసి ఇళ్లు మంజూరు చేస్తున్నారని’ మహిళలు రాధాకృష్ణకు ఫిర్యా దు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ రెండేళ్ల పాలనలో అధికార పార్టీ నాయకుల ఆస్తులు పెరిగాయి కానీ, పేదలకు గూడు దొరకలేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాసమస్యలపై కార్యచరణ చేపడతామని, ప్రభుత్వం ఎందుకు దిగి రాదో.. తేల్చుకుందామని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యం... రెండేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని రాధాకృష్ణ విమర్శించారు. అధికారమే పరమావధిగా ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను వంచించారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులకు ముఖం చూపలేకపోతున్నారన్నారు. హామీలు అమలు చేయలేని చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యమని చెప్పారు. 59 డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ ‘ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి, నా దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేయిండని ఎమ్మెల్యే ఉమాను కోరగా ఆయన ‘నీవు ఎంక్వైరీ చేస్తావా? ఏంటి సొల్లు మాట్లాడుతున్నావ్’ అంటూ ఏకవచనంతో సంబోధించారని తెలిపారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి స్పందించాల్సిన తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో ఉన్న ఇళ్ల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, డివిజన్ నాయకులు టెక్యం కృష్ణ, పెద్దిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు. -
రోజాపై ఎందుకంత కక్ష?
♦ వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు ♦ సీఎం, మంత్రుల ‘అన్‌పార్లమెంటరీ’ కనిపించదా? అని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంత కక్ష ఎందుకని, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎందుకు వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు వంతెల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. రోజా సస్పెన్షన్ అంశం హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా తామంతా న్యాయ వ్యవస్థకు మద్దతుగా సభకు హాజరు కాలేదని, అయితే ప్రజా సమస్యలను పక్కనపెట్టి రోజా అంశానికి సంబంధించిన ప్రివిలేజెస్ కమిటీ నివేదికపై గంటల తరబడి చర్చించడం ఏమిటని ప్రశ్నించారు. ‘ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసిస్తే దానిపై చర్చకు కేటాయించిన సమయం 4 గంటలు, అదే స్పీకర్‌పై అవిశ్వాసం నోటీసిస్తే చర్చకు ఇచ్చిన సమయం 2 గంటలు. అలాంటిది ఈరోజు రోజా అంశంపై మాత్రం అపరిమితంగా గంటల తరబడి ఇష్టానుసారం మాట్లాడారు’ అని చెప్పారు. ‘మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై చర్చ జరగాలని రోజా వాయిదా తీర్మానం నోటీసిస్తే అంగీకరించలేదు. ఈ ఉదంతంతో సబంధమున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కాపాడుకోవడానికి చర్చకు అనుమతినివ్వలేదు. రోజాను మాట్లాడ్డానికి కూడా అనుమతించనపుడు మేమందరం పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేసి నిరసన తెలిపాం. కానీ రోజా ఒక్కరినే లక్ష్యంగా చేసుకున్నారంటే చంద్రబాబుకు ఆమె అంటే ఎంత భయమో అర్థమవుతోందన్నారు. రోజా విపరీత మనస్తత్వం గల వ్యక్తి అని టీడీపీ సభ్యుడు శివాజీ సోమవారం చర్చలో పాల్గొంటూ అన్నారని.. రోజా టీడీపీలో ఉన్నపుడు ఆ మనస్తత్వం అనిపించలేదా? అని ఈశ్వరి ప్రశ్నించారు. ఇంత రాద్ధాంతమా?:టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలపై పుష్పశ్రీవాణి స్పందిస్తూ.. ఆమె తమ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కనుక అన్యాయం జరుగుతున్నపుడు తప్పకుండా కాపాడుకుంటామన్నారు. హైకోర్టు తీర్పు 17న వస్తే దాన్ని అమలు చేయకుండా ఒక్క రోజా కోసమే మూడ్రోజులుగా టీడీపీ వాళ్లు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని పుష్ప డిమాండ్ చేశారు. -
ముద్రగడకు టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ లేఖ
విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పంతో బీసీ కమిషన్ వేయడం తప్పా అని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. కాపు సంక్షేమానికి సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ 20 రోజుల్లోపే మీరు దీక్షకు కూర్చుంటున్నామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేటిటని కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఓ లేఖ రాశారు.ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో 30 మందికి పైగా కాపు నాయకులు మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. పదేళ్లపాటు కాపుజాతి ప్రయోజనాలను పట్టించుకోని మీరు ఏ ప్రయోజననాలు ఆశించి ఇప్పుడు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని ఏపీ మంత్రి , కాపునేత ముద్రగడ పద్మనాభానికి బహిరంగలో పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ పై సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మీ సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా స్వాగతిస్తామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి బొండా ఉమా మహేశ్వరరావు తన లేఖలో వివరించారు. -
ముద్రగడ దీక్షను పట్టించుకోం: బోండా
విజయవాడ : కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ దీక్షను పట్టించుకోమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో బోండా ఉమా విలేకర్లతో మాట్లాడుతూ... కాపు సామాజిక వర్గం పేరుతో ముద్రగడ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కాపు జాతిని కించపరిచేలా ముద్రగడ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. ముద్రగడ ఫోన్లను ట్యాప్ చేసే అవసరం తమ ప్రభుత్వానికి లేదని బోండా ఉమా వెల్లడించారు. తమ ప్రభుత్వం కాపులకు న్యాయం చేస్తుందని... అంతే కానీ ముద్రగడకు కాదని బోండా పేర్కొన్నారు. -
నీళ్లు నమిలిన బోండా ఉమా
విజయవాడ: అభివృద్ధి కోరుకుని వచ్చే వారికి ఎన్నికలతో సంబంధం ఏంటని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే టి. జయరాములు తమ పార్టీలో చేరిన విషయాన్ని బుధవారం ఆయన విలేకరులకు వెల్లడించారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే బోండా నీళ్లు నమిలారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని ఎదురు ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తాయా, లేదా అనే విషయాన్ని పార్టీలో చేరే ఎమ్మెల్యే చెప్తారని పేర్కొన్నారు. -
తెలంగాణలో తప్పు... ఆంధ్రాలో ఒప్పు!
ఏపీలో అభివృద్ధి చూసి టీడీపీలోకి వస్తున్నారు బోండా ఉమామహేశ్వరరావు వాఖ్యలు తాడేపల్లి రూరల్: తెలంగాణలో టీటీడీపీ నాయకులు అధికార కాంక్షతో టీఆర్ఎస్లోకి వెళ్లారని, ఆంధ్రాలో మాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాష్ట్రాభివృద్ధి కోరుతూ ప్రతిపక్ష నేతలు టీడీపీలోకి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు! ఉండవల్లి అమరావతి కరకట్ట వద్ద ఉన్న సీఎం నివాసంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి వచ్చిన సందర్భంగా సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌లకు పదవులు ఇస్తామని ఆశ చూపించి టీడీపీ కండువా కప్పారా? అని విలేకరులు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదన్నారు. ఇప్పటికే టీడీపీలో ఎమ్మెల్యేల చేరికపై వ్యతిరేకత ప్రారంభమైందని విలేకరులు అనడంతో.. ఆయా జిల్లాల ఇన్చార్జిలతో చర్చించిన అనంతరమే ప్రతిపక్ష నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు బోండా చెప్పారు. -
పోటాపోటీ టీడీపీ అర్బన్ అధ్యక్ష పీఠం ఎవరికో?
కాట్రగడ్డ బాబుకు గద్దె సిఫార్సు కోగంటి వైపు మంత్రి ఉమా, ఎమ్మెల్సీ బుద్దా మొగ్గు గన్నే ప్రసాద్‌కు అనుకూలంగా ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా ఎస్సీ, బీసీలకు మొండి చేయే! విజయవాడ : టీడీపీలో సీటు ఫైటు జోరుగా సాగుతోంది. విజయవాడ అర్బన్ అధ్యక్ష పీఠాన్ని తమకు అనుకూలమైనవారికి ఇప్పించేందుకు ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి రావడంతో అర్బన్ అధ్యక్ష పదవి చాన్స్ మరొకరికి ఇస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజధాని ప్రాంతం కావడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉండటంతో అర్బన్ అధ్యక్ష పీఠానికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పలువురు ఈ పదవిపై కన్నేశారు. అర్బన్ అధ్యక్షుడిగా తమకు అనుకూలమైన వారిని నియమించుకోవాలని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అధ్యక్ష పీఠం కోసం పలువురి పోటీ... పార్టీలో సీనియర్ నేత, అర్బన్ మాజీ ఉపాధ్యక్షుడు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు (బాబు) పీఠం రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారు. గతంలో పశ్చిమ నియోజకవర్గానికి అవకాశం ఇచ్చినందున ఈసారి తూర్పు నియోజకవర్గంలో తనకు అనుకూలంగా ఉండే కాట్రగడ్డ బాబుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. బాబును అధ్యక్షుడిగా నియమించేందుకు గద్దె ఒక కేంద్ర మంత్రి ద్వారా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లాతో పాటు అర్బన్‌పైనా తన పట్టు కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. ఆయన టీడీపీలో సీనియర్ నేత, అర్బన్ ప్రచార కార్యదర్శి కోగంటి రామారావు పేరు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఒకవేళ తప్పనిసరై తనను మార్చే నిర్ణయం తీసుకుంటే ఆయనకే మద్దతిచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరోపక్క ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తనకు సన్నిహితంగా ఉండే కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అర్బన్ ప్రధాన కార్యదర్శి గన్నే నారాయణ వరప్రసాద్ (అన్నా)లకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బొండా కూడా ఉమా గన్నే ప్రసాద్‌కు మద్దతిస్తున్నట్లు తెలిసింది. ఎస్సీ, బీసీల మాటేమిటి! ప్రస్తుతం అర్బన్ అధ్యక్ష రేసులో ఉన్న నేతలంతా చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గానికి చెందినవారే. వారి మధ్యే సం‘కుల’ సమరం జరుగుతోంది. మరోవైపు అధికారంలో లేనప్పుడు పార్టీ జెండాను మోసిన ఎస్సీ, బీసీ నేతలు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు తమను వాడుకుని ఇప్పుడు కరివేపాకులా తీసిపారేస్తున్నారని, కేవలం ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీలు వంటి పనికిరాని పదవులకే పరిమితం చేస్తున్నారని ఆయా వర్గాల నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బీసీ వర్గంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి నాగుల్‌మీరా, మాజీ ఉపాధ్యక్షుడు లుక్కా సాయిరాం గౌడ్, ఎస్సీల్లో సీనియర్ నేతలు సొంగా రవీంద్రవర్మ, అర్బన్ ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. జిల్లా అధ్యక్ష పదవి పైనా... ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అదే జరిగితే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.వీరబాబును అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టి పార్టీపై తన పట్టు మరింత బిగించేందుకు మంత్రి ఉమా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. -
టీడీపీలో రగులుతున్న తీర్మానం చిచ్చు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో టీడీపీ సభ్యుల వ్యవహారశైలిపై అధిష్టానం గుర్రుగా ఉంది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పరువును బజారుకీడుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 29వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశం టీడీపీలో వర్గపోరును బహిర్గతం చేసింది. 53వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాలుకు గొట్టెముక్కల వెంకట రామరాజు పేరు పెట్టాలంటూ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ సభ్యులు బలపర్చారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో టీడీపీ పరువు పోయింది. చర్చ సందర్భంగా డెప్యూటీ మేయర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రత్యర్థులు ఫోన్లోరికార్డు చేసి ఎమ్మెల్యే బొండాకు వినిపించినట్లు సమాచారం. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయినట్లు తెలుస్తోంది. తాను చేసిన ప్రతిపాదనను సభకు సరైన పద్ధతిలో తీసుకురాకపోవడం, వాయిదా వేయడంపై కూడా ఎమ్మెల్యే సీరియస్‌గా ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో 44వ డివిజన్ కార్పొరేటర్ కాకుమల్లికార్జున యాదవ్ రాజీనామాకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బొండాఉమా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాకు రాజీనామా విషయాన్ని నగరపార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుద్దా వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. తొందరపడొద్దని ఎమ్మెల్సీ సర్దిచెప్పినట్లు భోగట్టా. కనకదుర్గ లే అవుట్ల వ్యవహారం నుంచి కమ్యూనిటీ హాలు తీర్మానాన్ని వ్యతిరేకించడం వరకు సభ్యులు క్రమశిక్షణ తప్పుతున్నారన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 3,4 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ భేటీ అవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో గాడి తప్పిన పార్టీని చక్కదిద్దాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పనిలోపనిగా పదవుల మార్పుపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద టీడీపీలో తీర్మానం చిచ్చు రగులుకుంది. -
టీడీపీలో తీర్మానం లడాయి
ఎందుకు ఆమోదించలేదని ఫోన్లో బొండా విసుర్లు హాట్‌టాపిక్‌గా పాలక గ్రూపుల గోల విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో తీర్మానం చిచ్చు రగులుకుంది. తన ప్రతిపాదనను ఆమోదించకపోవడంపై సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మె ల్యే బొండా ఉమామహేశ్వరరావు గుర్రుగా ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబుతో బొండా కొంచెం కటువుగా మాట్లాడినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ వైఖరి వల్లే తాము తీర్మానాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పినప్పటికీ ఎమ్మెల్యే శాంతించలేదని తెలుస్తోంది. 53వ డివిజన్లో నిర్మాణం చేస్తున్న కమ్యూనిటీ హాలుకు గొట్టెముక్కల వెంకట రామారావు పేరు పెట్టాలన్న ఎమ్మెల్యే ప్రతిపాదనపై డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు అడ్డుపడిన విషయం తెలిసిందే. తన వార్డులో నిర్మాణానికి ఫలానా పేరుపెట్టాలనే ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేయడంపై డిప్యూటీ మేయర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాజా పరిణామాల నేపథ్యం లో ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ల మధ్య దూరం పెరిగినట్లైందని ఆ పార్టీ కార్పొరేటర్లే వ్యాఖ్యానిస్తున్నారు. డివిజన్ రాజకీయాలే కారణమా? ఎమ్మెల్యే బొండా ఆశీస్సులతోనే గోగుల డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇదే విషయాన్ని ఆయన కౌన్సిల్లోనూ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనను నిర్ధ్వందంగా తిరస్కరించడంతో కథ అడ్డం తిరిగింది. మేయర్‌తో సహా పలువురు సభ్యులు ప్రతిపాదనను ఆమోదిద్దామని చెప్పినప్పటికీ గోగుల వెనక్కు తగ్గలేదు. ఇందుకు డివిజన్ రాజకీయాలే కారణమంటున్నారు. 54వ డివిజన్‌కు చెందిన గోగుల రమణ బీసీ రిజర్వేషన్ ప్రకారం 53వ డివిజన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కొంతకాలంగా విజయకృష్ణా సూపర్‌బజార్ చైర్మన్ గొట్టెముక్కల రఘురామరాజుతో గోగులకు పొసగడం లేదని భోగట్టా. ఈక్రమంలోనే రఘురామరాజు కమ్యూనిటీ హాలుకు పేరుపెట్టే ప్రతిపాదనను ఎమ్మెల్యేతో చేయించినట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాకు మల్లికార్జునయాదవ్‌కు ప్రతిపాదనను ఈనెల 28న రఘురామరాజు పంపారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ వచ్చే కౌన్సిల్లో తానే ప్రతిపాదన పెడతానని చెప్పారు. అయినప్పటికీ 88కె ప్రకారం మొండిగా కౌన్సిల్ ముందుకు ప్రతిపాదన తేవడంతో డిప్యూటీ మేయర్ అడ్డం తిరిగారు. డిప్యూటీ మేయర్ చైర్‌కు ఎసరు తాజా పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ మేయర్ చైర్ కదలడం ఖాయమని ఆ పార్టీ కార్పొరేటర్లే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. మార్చి నెలలోకార్పొరేషన్ పదవుల్లో మార్పులు, చేర్పులుంటాయనే ప్రచారం టీడీపీలో సాగుతోంది. డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం సెంట్రల్ నియోజక వర్గం నుంచి 44వ డివిజన్ కార్పొరేటర్ కాకు మల్లిఖార్జున, 45వ డివిజన్ కార్పొరేటర్ ఆతుకూరి రవికుమార్‌లు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాకు యాదవ్‌కు ఇటీవలే స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించారు కాబట్టి, బీసీ వర్గానికి చెందిన రవికుమార్‌కు డిప్యూటీ మేయర్ పోస్టు వరిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బొండా జన్మదిన వేడుకల్లో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్న సందర్భంలోనూ ఈ విషయమై వాడివేడి చర్చ నడిచినట్లు సమాచారం. -
కాల్‌మనీ కేసులో కళ్లు చెదిరే నిజాలు
-
ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యం
కంకిపాడు ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా కంకిపాడు బస్టాండు సెంటరులో బహిరంగ సభ నిర్వహించారు. బొండా ఉమా మాట్లాడుతూ లోటు బడ్జెట్‌తో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సాహసోపేతమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొచ్చిన సమర్థుడు చంద్రబాబు అన్నారు. ఇబ్బందులను అధికమిస్తూ ప్రభుత్వం పాలన సాగిస్తుందని వివరించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. తొలుత ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలు తామెదుర్కొంటున్న ఇళ్లస్థలాలు, అంతర్గత రహదారుల సమస్యను ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్, జెడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్, సర్పంచి తత్తరమూడి వజ్రకుమారి, ఉప సర్పంచి పులి కామేశ్వరరావు, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నెక్కలపూడి సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ కొణతం సుబ్రహ్మణ్యం, డెరైక్టర్లు మారం రామారావు, సుదిమళ్ల రవీంద్ర, యనమదల వెంకటేశ్వరరావు, కంకిపాడు, పెనమలూరు మండల అధ్యక్షులు బత్తుల కామేశ్వరరావు, అనుమోలు ప్రభాకర్, చలవాది రాజా, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోరంకిలో జనచైతన్య యాత్ర పోరంకి(పెనమలూరు) : పోరంకి గ్రామంలో టీడీపీ జనచైతన్య యాత్ర నిర్వహించింది. గ్రామంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, ఎంపీపీ బొర్రా కనకదుర్గ, వైస్ ఎంపీపీ కోయా ఆనంద్ , జెడ్పీటీసీ శ్రీనివాసారావు, టీడీపీ శంకరబాబు పార్టీ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ వీధుల్లో డప్పులు కొట్టుతూ తిరిగారు. ప్రభుత్వ పథకాలపై విసృ్తతంగా ప్రచారం చేశారు. -
‘మహా’గణపతిం.. మనసాస్మరామి..
విజయవాడ కల్చరల్ : రాజధాని నగరం విజయవాడలో తొలిసారిగా ఏర్పాటుచేసిన 63 అడుగుల భారీ గణనాథుడు భక్తులను కనువిందు చేశాడు. మహా గణపతిని దర్శించేందుకు గురువారం లక్షలాదిగా తరలిరావడంతో దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. డూండీ గణేశ సేవాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో గురువారం ఉదయం కలశస్థాపన, మూర్తి ప్రాణప్రతిష్ఠ, ఏకవిశంతి పత్రిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రామారావు బృందం ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ సుమారు లక్షమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన 6,300 కేజీల లడ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి స్వామిని దర్శించి పూజలు చేశారు. సాయంత్రం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన నృత్యప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. లాస్య కూచిపూడి అకాడమి, అభినయ ఆర్ట్స్ అకాడమి చిన్నారులు ప్రదర్శించిన నృత్యాంశాలు అలరించాయి. కళాకారులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. రేడియో జాకీ వేణుశ్రావణ్ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 11 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వేదిక కన్వీనర్ శ్రీనాథుని గంగాధర రామారావు ‘సాక్షి’కి తెలిపారు. ట్రాఫిక్ సమస్య భారీ గణనాథుడ్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించింది. బీఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. నిర్వాహకుల బంధుజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సామాన్యులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలుమార్లు భక్తులు నిర్వాహకులతో ఘర్షణ పడ్డారు. వివాదాస్పద మైన చానల్ నిర్వాకం డూండీ గణేశ సేవా సమితి నిర్వాహకులు 63 అడుగుల భారీ గణనాథుడిని ఏర్పాటుచేయగా, అదంతా తామే చేశామని, విగ్రహాన్ని కమిటీతో కలిపి తామే ఏర్పాటుచేశామని ఓ వార్త చానల్ ప్రసారం చేయడంపై కమిటీ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండుగ రోజు ఆ చానల్లో పలుమార్లు ఇదే విషయం ప్రసారం చేయడం, చానల్‌కు సంబంధించిన బ్యానర్లు విగ్రహం వద్ద ఉండటం చర్చనీయాంశమైంది. దీనిపై ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కోగంటి సత్యం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉత్సవాలను డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నామని, చానల్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. -
బొండా కుమారుడిపై చర్యలు తప్పవు
విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టీకరణ విజయవాడ: పుట్టినరోజు వేడుకల పేరిట నిబంధనలు అతిక్రమించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారని వివరించారు. మరిన్ని ఆధారాల సేకరణకు ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. -
కొడుకు వీరంగాన్ని వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే!
విజయవాడ: బెజవాడ రోడ్లపై తన రెండవ కొడుకు రవితేజ, అతని అనుచరుల వీరంగాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెనకేసుకొచ్చారు. తన కొడుకు ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పారు. కేవలం 15 బైకులు, రెండు కార్లతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. గోరంత ర్యాలీని కొన్ని మీడియాలు కొండంత చేసి చూపాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు ఈ-చలాన్ కడితే సరిపోతుందని చెప్పారు. గతంలో మిగతా పార్టీలు కూడా అనుమతిలేకుండా ర్యాలీలు నిర్వహించినట్లు చెబుతూ తన కొడుకు చర్యలను బొండా ఉమ సమర్ధించారు. -
రవితేజ ర్యాలీకి అనుమతి తీసుకోలేదు: పోలీస్ కమిషనర్
విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెండో కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించేందుకు తమ అనుమతి తీసుకోలేదని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వర రావు చెప్పారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వాహనాలను సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆ వాహనదారులకు ఈ-చలానాలు పంపుతామని కమిషనర్ చెప్పారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విజయవాడ నగరంలో భీతావహ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రవితేజ అనుచరులు ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లు వదిలి రోడ్డు మీద రేసుల తరహాలో 30 బైకులు నడిపారు. బైకుల సెలైన్సర్లు తొలగించిన రణగొణ ధ్వనులు సృష్టించారు. ఆపకుండా హారన్లు మోగిస్తూ రాంగ్ రూట్లో కార్లు నడిపారు. దీంతో వాహనదారులకు, రోడ్డుపై వెళ్లే అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విషయాన్ని వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఈ రోజు పోలీస్ కమిషనర్ స్పందించారు. -
బొండా కుమారుడి రాంగ్ రైడ్
- ఎమ్మెల్యే కుమారుడి బర్త్‌డేకు రోడ్డుపై రేసుల్లా ర్యాలీలు - విజయవాడలో బొండా కుమారుల అనుచరుల హల్చల్ - ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లు - గతంలో కేసు నమోదైనా తీరు మారని వైనం విజయవాడ: ఓ ఎమ్మెల్యే కుమారుడి బర్త్‌డే దెబ్బకు విజయవాడ ప్రజలంతా హడలిపోయారు. రోడ్డు మీద రేసుల తరహాలో దూసుకొస్తున్న బైకులు, సెలైన్సర్లు తొలగించిన బైకుల రణగొణ ధ్వనులు, ఆగకుండా మోగుతూనే ఉన్న హారన్లు, రాంగ్ రూట్లో కార్ల హల్చల్...... దీంతో రోడ్డుపై అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెండో కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విజయవాడ నగరంలో ఈ భీతావహ పరిస్థితి నెలకొంది. రవితేజ, అతని స్నేహితులు సాయంత్రం నాలుగు గంటల నుంచి 30 బైకులు, రెండు సుమోలతో హల్చల్ చేశారు. మొగల్రాజపురం నుంచి బయలుదేరి బందరురోడ్డు, ఏలూరురోడ్డు, గాయత్రినగర్‌లలో నినాదాలు చేసుకుంటూ తిరిగారు. ఒక్కో బైక్‌పై ముగ్గురేసి యువకులు ఎక్కి వన్‌వేలను, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖాతరుచేయకుండా దూసుకుపోయారు. బైక్‌లకు సెలైన్సర్లు తీసివేయడంతో వాహనాల సౌండ్‌కు, యువకులు చేసే నినాదాలకు ఇతర వాహనచోదకులు బెంబేలెత్తిపోయారు. వ్యాన్లకు ఇరువైపులా యువకులు వేలాడుతూ నిలబడినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. బందరురోడ్డులో వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ వారిని వారించబోగా రవితేజ అనుచరులు వాగ్వాదానికి దిగి వన్‌వేలో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కానిస్టేబుల్ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుంచి స్పందన రాలేదు. గతంలో బొండా ఉమపెద్ద కుమారుడు సిద్ధార్థ గుంటూరు జిల్లాలో నిర్వహించిన కారు రేసు సందర్భంగా ఓ యువకుడు మృతి చెందిన విషయం విదితమే. -
బోండా, గోరంట్లపై సభాహక్కుల నోటీస్
అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత దూషణలతో ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, పాముల పుష్ప శ్రీవాణి, వి.కళావతి, కోటంరెడ్డిశ్రీధర్‌రెడ్డిలతో కలసి ఆమె శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ నోటీసును అందించారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఈ నెల 18న పట్టిసీమపై చర్చ జరిగినప్పుడు మంత్రులతోసహా టీడీపీ సభ్యులు ఏవిధంగా అసభ్యకర పదజాలంతో మాట్లాడారో ప్రజలు చూశారని రోజా అన్నారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, మంత్రులు రావెల కిశోర్‌బాబు, దేవినేని ఉమా, కె.అచ్చెన్నాయుడు, పీతల సుజాత తదితరులు మాట్లాడిన మాటల క్లిప్పింగ్స్ చూస్తే ఏ ఒక్కరోజన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది, లేనిదీ బహిర్గతమవుతుందన్నారు. తమను రెచ్చగొట్టేలా వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడారని, వాళ్లు పదిసార్లు మాట్లాడితే.. ఒకసారి మాట్లాడిన తమను టీవీల్లో చూపించడం దుర్మార్గమన్నారు. తనపై టీడీపీ ఎమ్మెల్యే అనిత ద్వారా గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభాహక్కుల నోటీస్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. హావభావాలను ప్రదర్శించడం బూతు అయితే.. సభలో స్పీకర్ సాక్షిగా ‘ఏంట్రా... అరేయ్ పాతేస్తా... నా కొ...’ అనడం తప్పుగా అనిపించకపోవడం బాధాకరమన్నారు. టీడీఎల్పీ కార్యాలయంలో మీడియా ముందు ఎడిట్ చేసి ప్రదర్శించిన వీడియో ఫుటేజీ వ్యవహారానికి సంబంధించి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. స్పీకర్ కు సంబంధం లేకుండా ఎంపిక చేసిన క్లిప్పింగ్స్ మాత్రమే ఎలా బయటికొచ్చాయని ప్రశ్నించారు. -
'బెజవాడ పరువు తీసిన బొండా'
విజయవాడ : అసెంబ్లీలో బజారు రౌడీలా ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహరించి విజయవాడ నగర ప్రజలు తలదించుకొనేలా చేశారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రరత్నభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ... రాజకీయ, సాంస్కృతిక, కళల రాజధానిగా రాష్ట్రంలోనే విజయవాడ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని... అలాంటి నగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బోండా ఉమా చిల్లర వేషాలతో బెజవాడ పరువును మంటగలిపారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రతిపక్ష సభ్యుల్ని అంతుతేలుస్తా, సంగతేంటో చూస్తా అని బెదిరించడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిపక్ష నేత వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. మహిళా ఎమ్మెల్యేలను గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని బొండాను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ప్రజాసమస్యల్ని పరిష్కరించడానికి వేదిక కావాల్సిన అసెంబ్లీ బూతుపురాణానికి నిలయం కావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించడం కోసం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పార్లమెంట్లో తనవంతు ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్‌ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ధనయజ్ఞం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమను తెరపైకి తెచ్చారని విమర్శించారు. -
ఆయనకేమన్నా... 16 ఏళ్లా...
-
ఆయనకేమన్నా... 16 ఏళ్లా...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బుధవారం తనపై చేసిన అనుచిత వ్యాఖ్యాలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ... తనను రోజా అంటీ అంటూ సంబోధించిన బొండా ఉమామహేశ్వరరావు వయస్సు 16 ఏళ్లా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చా కార్యక్రమంలో అధికార పార్టీ సభ్యుల తీరును రోజా ఈ సందర్బంగా ఎండగట్టారు. ప్రాజెక్టులపై ఆధారాలు చూపిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని ఆమె ఆరోపించారు. తోటి మహిళల సమస్యలపై ప్రస్తావిస్తే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని ప్రభుత్వ తీరును విమర్శించారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ఎంత దారుణంగా మాట్లాడారో... ఈ రోజు టీడీపీ సభ్యులు ఎంత అహంకారంతో మాట్లాడారో అంతా చూశారని అన్నారు. అచ్చెన్నాయుడు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు యాక్సిడెంట్ చేస్తే కేసు లేకుండా చేశారని ఈ సందర్బంగా రోజా గుర్తు చేశారు. శాఖలతో సంబంధం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే వీడియో ఫుటేజ్ బయటపెట్టాలని ప్రభుత్వానికి రోజా ఈ సందర్భంగా సవాల్ విసిరారు. -
ఏంట్రా అరేయ్... అసెంబ్లీలో పాతేస్తా...
-
ఏంట్రా అరేయ్... అసెంబ్లీలో పాతేస్తా...
హైదరాబాద్: ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచితంగా ప్రవర్తించారు. చట్టసభలో విపక్ష సభ్యులను తీవ్ర పదజాలంతో తూలనాడారు. బజారు రౌడీ కంటే హీనంగా ప్రవర్తించారు. ఏంట్రా అరేయ్ అంటూ వైఎస్సార్ సీపీ సభ్యుల వైపు వేలు చూపించి నోరుపారేసుకున్నారు. అసెంబ్లీలో పాతేస్తానంటూ ఒంటికాలిపై లేచారు. వైఎస్సార్ సీపీ సభ్యులను 420 అంటూ రెచ్చిపోయారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజాను 'ఆంటీ' అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి పీతల సుజాత కూడా రోజాపై విమర్శలు చేశారు. -
విపక్షానిది మొండివైఖరి: బొండా
-
విపక్షానిది మొండివైఖరి: బొండా
హైదరాబాద్: ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు విమర్శించారు. విపక్షం సభా సమయాన్ని వృధా చేస్తోందని ఆయన ఆరోపించారు. సభా సమయాన్ని ఉపయోగించుకోవడంలో ప్రతిపక్షం విఫలమైందన్నారు. తామే మాట్లాలన్న మొండి వైఖరితో వైఎస్సార్ సీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. చిన్నపిల్లాడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు చందంగా విపక్షల సభ్యుల తీరు ఉందని వ్యాఖ్యానించారు. -
అత్తారింటికి వెళ్లొచ్చినట్లు..
సాక్షి, గుంటూరు/విజయవాడ : అంతా అనుకున్నట్లే జరిగింది. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని అరెస్టు చేసి, హడావుడి సృష్టించి, మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు... కారు రేసులు నిర్వహిస్తూ ఓ విద్యార్థి మృతికి కారకుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం విషయంలో మాత్రం వల్లమాలిన ప్రేమను కురిపించారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు పడరాని పాట్లు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే తనయుడు సిద్ధార్థను ఎవరికి కనిపించకుండా స్టేషన్ పై గదిలో దాచి ఉంచిన విషయం తెలిసిందే. అనంతరం సకల మర్యాదలతో అతడిని విజయవాడ పంపించేశారు. పైకి మాత్రం సిద్ధార్థ పరారీలో ఉన్నట్లు బొంకారు. నిషిద్ధ కారు రేసులు నిర్వహిస్తూ ఓ యువకుడి మృతికి కారకుడైన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 304 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు కావడంతో బొండా సిద్ధార్థపై మాత్రం 304ఏ, 337 సెక్షన్ల కింద నామమాత్రపు బెయిలబుల్ కేసులు నమోదుచేశారు. 140 కిలో మీటర్ల వేగంతో రేసులు ఆడుతుండగా.. రెండు కార్లు ప్రమాదానికి గురయ్యూయని స్థానికులు చెబుతున్నా.. పోలీసులు మాత్రం కుక్క అడ్డురావడంతో ప్రమాదవశాత్తూ కార్లు ఢీకొన్నాయని కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టించారు. రహస్యంగా కోర్టుకు రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పిన పోలీసులు గురువారం ఉదయం 7 గంటల సమయంలో విజయవాడలో రైతు బజారు వద్ద నిందితులను అరెస్టు చేశామని చెబుతూ, వారిని రహస్యంగా కోర్టుకు హాజరుపరిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరైంది. ఉదయం 7 గంటలకు అరెస్టు అయిన ఎమ్మెల్యే తనయుడు అతడి స్నేహితులు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్కడ ఉన్నారనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలీసుల అత్యుత్సాహం కోర్టులో హాజరుపరిచే వరకు నిందితులను పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం మాత్రం అత్తారింటికి వచ్చినట్లుగా.. మందీమార్బలంతో వారి కార్లలో దర్జాగా కోర్టు ప్రాంగణంలో దిగారు. అక్కడే ఉన్న విలేకరులు ఫొటోలు తీసేందుకు యత్నించగా.. ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకుని సిద్ధార్థ చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. ఈ సమయంలో పోలీసులెవరూ అక్కడ లేకపోవడం గమనార్హం. కోర్టులో బెయిల్ పొందిన సిద్ధార్థ, శివరాం తమ అనుచరుల చక్రబంధంలో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బయటకువచ్చి వారి కార్లలో వెళ్లిపోయూరు. గమనించిన స్థానికులు వీరు నేరం చేసి వచ్చారా.. పండగకు అత్తారింటికి చుట్టపుచూపుగా వచ్చారా.. అంటూ సందేహం వెలిబుచ్చారు. ఎమ్మెల్యే తనయుడి విషయంలో పోలీసులు చూపిన ప్రేమ చట్టం అధికారపార్టీ చుట్టం అన్నట్లుగా మారిందనే విమర్శలు గుప్పుమంటున్నారుు. -
తీన్మార్
వివాదాల్లో తెలుగుదేశం నేతలు ఎంపీ కేశినేనిపై భూకబ్జా ఆరోపణలు కార్, బైక్ రేసుల్లో ఎమ్మెల్యే బొండా ఉమా కుమారులు తన పేరుతో మరొకరితో పరీక్ష రాయించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అధికార పార్టీ నేతలు రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. తమపై వరుసగా వస్తున్న ఆరోపణలతో ఇరుకున పడుతున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుల వివాదాస్పద రేసులు.. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చీటింగ్ వ్యవహారం.. ఎంపీ కేశినేని నానిపై భూకబ్జా కేసులు.. ప్రస్తుతం రాజధాని నగరంలో హాట్‌టాపిక్‌గా మారాయి. సాక్షి ప్రతినిధి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారులిద్దరూ రేసుల్లో ఆరితేరినవారు. ఇటీవల జరిగిన కారు రేసు ప్రమాదంలో బొండా ఉమ పెద్ద కుమారుడు సిద్ధార్థతో కలిసి పాల్గొన్న కృష్ణలంక యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసు నుంచి సిద్ధార్థను తప్పించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారంతా ఎమ్మెల్యే కుమారుడి ద్వారానే ఇదంతా జరిగిందని చెప్పడంతో.. కుక్క కారుకు అడ్డం రావడం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కేసు నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే కథ అల్లారు. దీనికి పోలీసులు వంతపాడారు. ఎమ్మెల్యే చిన్న కుమారుడు రవితేజ ఇటీవల గుంటూరు జిల్లాలోని యడ్లపాడుకు సమీపంలో బైక్ రేస్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాడు. విషయం తెసుకున్న స్థానికుల్లో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు రేస్ నిర్వహిస్తున్నవారిని అదుపులోకి తీసుకోవాల్సిందిపోయి ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని బైక్‌లతో సహా వారిని అక్కడి నుంచి పంపించేశారు. స్థల వివాదాల్లో ఎంపీ కేశినేని! స్థల వివాదాల నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)పై ఆరోపణలు వస్తున్నాయి. తన కార్యాలయం వెనుక వైపు ఉన్న స్థలం ఖాళీగా ఉండటంతో కార్లు పార్కింగ్ చేసుకునేందుకు ఇవ్వాలని స్థల యజమాని బొమ్మదేవర సుబ్బారావును మధ్యవర్తి ద్వారా కోరారు. తాను బిల్డింగ్ నిర్మాణం చేపట్టేవరకు కార్లు పెట్టుకుంటే తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. ఆ మేరకు ఎంపీ అనుచరులు స్థలాన్ని వాడుకుంటున్నారు. తాను కాంప్లెక్స్ కట్టుకుంటున్నానని, తన స్థలంలో ఉన్న కార్లు, జనరేటర్ తీసివేయాలని ఈ నెల 20న బొమ్మదేవర సుబ్బారావు ఎంపీ అనుచరులకు చెప్పగా, వారు పట్టించుకోలేదు. తన స్థలంలో భూమి పూజ చేసేందుకు సుబ్బారావు ప్రయత్నించగా బలవంతంగా నెట్టివేశారు. ఈ స్థలం ఎంపీ నానిదని, ఇందులోకి వచ్చే హక్కు సుబ్బారావుకు లేదంటూ నానా హంగామా సృష్టించారు. చేసేది లేక ఆయన ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లారు. వారి హామీ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ నెల 28న అక్కడున్న కొన్ని వస్తువులను తొలగించి కాంప్లెక్స్ కట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ నెల 29 రాత్రి తిరిగి ఎంపీ వర్గీయులు ఆ స్థలంలో కార్లు పెట్టారు. అడవినెక్కలంలో భూ ఆక్రమణ కేసు... జిల్లాలోని అడవినెక్కలం గ్రామంలో గేరామేరియో ఆంథోని, సుధాకర్, వారి తల్లి ఏసమ్మలకు చెందిన 24.35 ఎకరాల భూమిని ఎంపీ నాని తన అనుచరులతో ఆక్రమించాడని వారు ఇటీవల ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కలిశారు. తమ్మిన రాములు అనే వ్యక్తి వద్ద నుంచి తాము కొనుగోలు చేసినట్లు ఎంపీ వర్గీయులు చెబుతున్నారు. వాస్తవానికి రాములుకు ఆ భూమిపై ఎటువంటి హక్కూ లేదు. తాను సాగులో ఉన్నట్లు రెవెన్యూ వారిని లోబరుచుకుని అడంగల్‌లో పేరు రాయించుకున్నాడు. దీంతో భూమి సొంతదారులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏసమ్మకే అన్ని హక్కులూ ఉన్నాయని, జేసీ కోర్టులో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోర్టు సూచించింది. దీంతో కంగుతిన్న ఎంపీ వర్గీయులు ఎలాగైనా ఈ భూమిని లాక్కునేందుకు రెవెన్యూ వారిపై ఒత్తిడి పెంచుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంలో ఉన్నట్లు రాయించుకున్న వారందరికీ భూములు ఇవ్వడం మొదలు పెడితే ప్రభుత్వానికి కూడా సెంటు భూమి మిగిలే అవకాశం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రికార్డులను తారుమారు చేసేందుకు ఎంపీ వర్గీయులు చేస్తున్న ప్రయత్నాలపై మండిపడుతున్నారు. -
రెచ్చిపోతున్న 'పచ్చ' చొక్కాలు!
అధికారమదంతో 'పచ్చ'చొక్కాలు రెచ్చిపోతున్నాయి. 'పవర్' ఉందన్న పొగరుతో ప్రతిఒక్కడిపై దాడులకు తెగబడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పటివరకు రాజకీయ దాడుల పర్వం కొనసాగించిన టీడీపీ గూండాలు ఇప్పుడు మీడియాపై రౌడీయిజం చేస్తున్నారు. అధికారం అండ చూసుకుని అడ్డుఅదుపు లేకుండా అరాచకాలు సాగిస్తున్నారు. అనంతపురం, విజయవాడలో టీడీపీ నేతలు సృష్టించిన దౌర్జన్యకాండే ఇందుకు నిదర్శనం. అనంతపురంలో 'సాక్షి' మీడియా ప్రతినిధులపై శనివారం సైకిల్ పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. పింఛన్ లబ్ధిదారుల జాబితాను ఇష్టానుసారం మార్చేసిన పచ్చ నేతల బాగోతాలను బయటపెట్టేందుకు వెళ్లినందుకు ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, విలేకరిపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్, ఇతర నేతలు ఈ దౌర్జన్యకాండకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పుత్రరత్నం కూడా గుంటూరు జిల్లాలో దాదాగిరికి దిగాడు. బైకు రేసులతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న బోండా కుమారుడిని ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. తన తండ్రి ఎమ్మెల్యే అన్న అహంకారంతో స్థానికులపై అతడు దౌర్జన్యానికి దిగాడు. ఇదంతా చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాదాగిరి చేశాడు. ఇంతజరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. తప్పు చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టనని నిత్యం వల్లించే సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్ల ఆగడాలపై ఎలా స్పందిస్తారో? -
లౌక్యం ఆడియో లో తమ్ముళ్ల రాజకీయాలు
మైక్ దొరికిందంటే చాలు సమయం, సందర్భం లేకుండా అసలు విషయాన్ని పక్కన పెట్టి... పొలిటికల్ లీడర్లు రాజకీయ ప్రసంగాలు చేసేస్తుంటారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన జనాలు ఇదేమీ గోలరా బాబు అని విసుక్కుంటున్నారు. ఓ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు... వేడుకను మరచిపోయి పార్టీ మీటింగ్‌లా ప్రసంగాలు చేసేశారు. హీరో గోపీచంద్ తాజా చిత్రం 'లౌక్యం' ఆడియో ఫంక్షన్ వేడుకను తమ్ముళ్లు ...పార్టీ వేదికగా మార్చుకున్నారు. లౌక్యం ఆడియో ఆవిష్కరణ ఆదివారం విజయవాడ లయోలా కళాశాలలో జరిగింది. ఈ వేడుకకు అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సినిమాలోని తొలిపాటను ఆవిష్కరించారు. అంతటితో ఊరుకోని ఆయన తన రాజకీయ ప్రసంగంతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే దాడిలో నడిచారు. దాంతో కార్యక్రమానికి హాజరైన వారు చిరాకు పడ్డారు. ఉల్లాసం కోసం ఆడియో వేడుకకు వస్తే ఇక్కడ కూడా రాజకీయ ప్రసంగాలు ఏంటిరా బాబు అని అభిమానులు, ప్రేక్షకులు తల పట్టుకున్నారట. మరి తెలుగు తమ్ముళ్ళా మజాకా!