టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు కట్‌ | MLA Bonda Uma warning to the older people about pensions | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు కట్‌

Published Wed, Aug 2 2017 1:35 AM | Last Updated on Tue, Oct 30 2018 4:47 PM

టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు కట్‌ - Sakshi

టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు కట్‌

వృద్ధులను బెదిరించిన ఎమ్మెల్యే బోండా ఉమా 
 
నంద్యాల: ‘టీడీపీకి ఓట్లు వేయకుంటే పింఛన్లు రావు... మీరే తెలుసుకోండి’.. ఇబ్బంది పడొద్దంటూ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వృద్ధులను బెదిరించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటి ఫలాలను అనుభవించే వాళ్లు ఓట్లు ఎందుకు వేయరని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని 24వ వార్డు కౌన్సిలర్‌ దిలీప్‌ ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ వసతిగృహంలో వృద్ధుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు.

ఉపఎన్నిక ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్యఅతిథిగా హాజరై భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని, లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం వసతిగృహంలో పనిచేసే ఉద్యోగులను ఓట్లు అడిగి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement