పోలీసులను చూసి హడలి పోయిన టీడీపీ నేత బొండా ఉమా
తనను అరెస్ట్ చేసేస్తున్నారంటూ నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు
చొక్కా మార్చుకొని.. పార్టీ ఆఫీసు పక్క భవనంలోకి దూకి పరార్
ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లిన పోలీసు సిబ్బంది
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన అనంతరం చీమ చిటుక్కుమన్నా టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు హడలిపోతున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.
బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులను చూసిన బొండా ఉమా ఒక్కసారిగా హడలిపోయి పార్టీ నేతలకు ఫోన్లు చేసి చొక్కా మార్చుకుని అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత బొండా ఉమా ఇంటి వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తుకు వెళ్లారు. వారిని ఎందుకు వచ్చారంటూ బొండా ప్రశ్నించగా మీకు సెక్యూరిటీగా వెళ్లమన్నారంటూ బదులివ్వడంతో కంగారుపడ్డ ఆయన అక్కడి నుంచి తన కార్యాలయానికి వడివడిగా వెళ్లిపోయారు.
వంగవీటి రాధాకు ఫోన్...!
టాస్‌్కఫోర్స్, షాడో టీమ్‌లు తనని అరెస్ట్ చేసేందుకు వచ్చాయంటూ బొండా ఉమా ఫోన్లు చేయగా టీడీపీ శ్రేణులు స్పందించకపోవడంతో వంగవీటి రాధా, ఆయన మామ చెన్నుపాటి శ్రీనుకు ఫోన్లు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రాధా తన అనుచరులకు ఫోన్లు చేసి అందుబాటులో ఉన్నవారంతా టీడీపీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. వారంతా అక్కడకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది.
షర్టు మార్చి... గోడ దూకి..
పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని ఆందోళన చెందిన బొండా ఉమా సెంట్రల్ టీడీపీ కార్యాలయం మొదటి అంతస్తులోకి వెళ్లి చొక్కా మార్చుకున్నారు. అనంతరం దాని వెనుకే ఉన్న మరో భవనంలోకి దూకి పరారైనట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడు, ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ ‘మామ’ బొండా ఉమాను తన కారులో ఎక్కించుకొని మొగల్రాజపురంలోని రాధా ఇంటికి చేరుకున్నట్లు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని ముఖ్య ప్రదేశాలు, పార్టీ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే బొండా ఉమా వద్దకు వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment